Powered By Blogger

Friday, 18 July 2014

రుధిర సౌధం 199 .


శంకరం నీళ్ళు నమిలాడు ..

చెప్పండి ఫర్వాలేదు .. మీరేం చెప్పదలచుకున్నారు ? అన్నాడు యశ్వంత్ కాస్త కూల్ గా ..

అయ్యా .. మనిషి నీరుగారిపోయాడు .. బిడ్డ ఇంతవరకు అగుపడలేదు .. కాస్త సమయం ఇవ్వండయ్య .. బంగ్లా

ఖాళీ చేసేందుకు .. అన్నాడు శంకరం .

ఏంటీ .. ఇంతవరకు రత్నం రాజు ఇల్లు చేరలేదా ? అసలేక్కడికి వెళ్ళాడు ? అన్నాడు కంగారుగా యశ్వంత్ .

ఏమో తెలవదయ్య .. మాట మాత్రం కూడా చెప్పలేదు .. పక్కూరికి కూడా వెళ్ళాలంటే తండ్రికి చెబుతాడు ..

ఇప్పుడేమయ్యాడో .. ఏడున్నాడో తెలవదయ్య .. అన్నాడు శంకరం ..

అవునా ? అని వెంటనే .. బాలయ్యా .. బాలయ్యా .. అని  అరిచాడు యశ్వంత్ .

ఎక్కడున్నాడో గానీ పరుగున   వచ్చిన బాలయ్య .. శంకరం వైపు ఏంటా అన్నట్లు చూసి .. యశ్వంత్ వైపు తిరిగి

చెప్పండయ్య .. అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు ..

నువ్వే మా కొంప ముంచావు గదరా .. అన్నట్లు మింగేసేలా చూశాడు శంకరం బాలయ్య వైపు .

బాలయ్యా .. రత్నం రాజు ఉదయం నుండి కనబడలేదంట . నువ్వు గ్రామస్తులన్దర్నీ ఓ సారి అడుగు .. ఎవరైనా

తనని చుసారేమో .. లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడైన చూసారేమో .. వెంటనే వెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .

అలాగే నయ్యా .. అని అక్కడ్నించి కదిలాడు బాలయ్య .

శంకరం యశ్వంత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ..

ఏంటలా చూస్తున్నారు ? భూపతి కొడుకు కోసం మేమెందుకు తాపత్రయ పడుతున్నామనా ? తప్పు అతడు చేయ

లేదు కదా.. భూపతే కదా తప్పు చేసింది ... అన్నాడు శివ .

శంకరం గారూ .. రత్నం జాడ తెలిసే వరకూ భూపతి ఆ బంగ్లా లోనే ఉండొచ్చు .. మీరిక వెళ్ళండి అన్నాడు

యశ్వంత్ .

నిజంగా మీరు మంచి మనుషులయ్య .. శత్రువు మీద కూడా దయజుాపించారు .. మీ ఋణం తీర్చుకోలేమయ్య ..

అన్నడు శంకరం .

ఉం .. అని తలూపి .. పద శివా మనం ఇక వెళ్దాం .. అని శివ భుజం మీద చేయి వేసి ముందుకి సాగిపోయాడు యశ్

వీళ్ళు కూడా రత్నం బాబు కోసం ఇంత ఆందోళన పడ్డారంటే నేను అనుమానించినట్టు రత్నం బాబు వీళ్ళ దగ్గర

లేడు.. రత్నం బాబు ని వీళ్ళే దాచేసి భూపతి ని ఇంకా ఏడిపిస్తున్నా రనుకున్నా .. కానీ కాదు .. మరి ఏమయి

ఉంటాడు రత్నం బాబు ? తెల్లారిందగ్గర్నుండి అయిపు లేడే .. ఇదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ..

అనుకుంటూ  .. మహల్ వైపు చూశాడు ..

జనం ఇంకా పనిలో నిమగ్నమై ఉన్నారు ..

వోర్నీ .. అప్పుడే ఈ దెయ్యాల కోటని ఇలా ఎలా మార్చేసినారు ? ఈళ్ళు భూపతినే కాదు దెయ్యాలని కూడా కోట

ఖాళీ చేయిన్చినట్టున్నారు .. అనుకుంటూనే బంగ్లా వైపు నడక సాగించాడు శంకరం .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 17 July 2014

రుధిర సౌధం 198



మెల్లిగా సంజె చీకట్లు కమ్ము కుంటున్నాయి ..

మహల్ దగ్గర పని  సజావుగా సాగుతుంది .. జనం లో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంది .. మహల్ బాగు పడుతోంది

ఊరు బాగు పడుతుంది . తమకి మంచి రోజులు వచ్చాయన్న భావన అందర్లో కనబడుతోంది ..

మహల్ ఆవరణ లో  కూర్చుని , మధ్యాహ్నం భోజనాలు ముగించి నప్పటి నుంచి గ్రంథం చదవడం మొదలు పెట్టిన

యశ్వంత్   సాలోచన గా గ్రంథం మూసి పక్కన పెట్టాడు .

గుడ్ ఈవెనింగ్ యశ్ .. గ్రంథం చదవడం పూర్తీ అయిందా ? అప్పుడే బయట నుండి వస్తున్న శివ యశ్వంత్ దగ్గర

కి వస్తూనే అడిగాడు .

హా అయింది శివ .. చాలా ఆసక్తిగా ఉంది .. నిజం చెప్పాలంటే బుర్రకి పదును పెట్టింది .. అన్నాడు యశ్వంత్ .

మన పూర్వీకులు అంత తెలివైన వారు మరి .. అన్నాడు శివ .

అది సరే .. నువ్వు  సత్య , మురారి లను తీసుకోస్తానన్నావ .. మరి ఒక్కడివే వచ్చావెం ? అని అడిగాడు యశ్ .

ఓహ్ అదా .. సత్య కదలలేని స్థితి లోనే ఉందింకా .. మురారి ఈరోజు రాత్రి సత్యని సరస్వతి ఇంట్లోనే

ఉంచుదామన్నాడు   ... నాకూ తన స్థితి  చూసే సరికి అదే మంచిదనిపించింది . ఇక్కడ మనం అంతా బిజీ గా

ఉంటాం .. అక్కడ సత్య ని సరస్వతి కంటికి రెప్పలా చూసుకుంటుంది .. రాత్రికి మాత్రం మురారి ఇక్కడికే వస్తా

నన్నాడు .. సరస్వతి వాళ్ళింట్లో తను ఉండటం అంత బావుండదు కదా .. అన్నాడు శివ .

అవునా ? నేనోసారి సత్య ని చూసి రావాలి .. నువ్వెలాగు తీసుకోస్తున్నావు కదాని ...   అన్నాడు యశ్ .

ఇత్స్ ఓకే యశ్ .. అది సరే .. ఇంతకీ గుడి తెరవడo గురిoఛి ఏం  థింక్ చేసారు యశ్వంత్ .. రేపే కదా పౌర్ణమి

అయినా  మనం ఆ విషయం లో అస్సలు సిద్ధంగా లేం .. ఏమంటావు ? అన్నడు శివ .

లేదు శివా .. అన్నీ వాటంతట అవే సిద్ధమవుతాయని విధాత్రి చెప్పింది మర్చిపోయావ ? ఆమె అలా చెప్పడం .

నెక్స్ట్ రచన ని చూసావా ? రేపు చాలా మంది రాబోతున్నరన్నట్లు గా అన్ని సిద్ధం చేస్తుంది .. ఇంత పని

చేయడం   ఏమైనా మామూలు విషయమా ? ఊరంతా ఒక్కటిగా చేస్తున్నారు .. చాలా సంతోషం గా ఉంది శివ .

ఇదంతా చూస్తుంటే .. అన్నాడు యశ్వంత్ ..

అవును .. అయ్యో మర్చే పోయాను యశ్ .. కూరగాయలు అమ్మే స్థలానికి వెళ్లి కొన్ని కూరగాయలు అవీ

తెమ్మని చెప్పింది రచన .. నేనైతే ఆ విషయం మర్చిపోయి వచ్చేసా .. ఇంకా ఊరుకోదు .. నేవేల్తాను అని

లేచాడు శివ .

శివా నేను వస్తాను .. మధ్యాహ్నం నుంచి అలానే కూర్చున్నాను గా .. అలాగే సత్యని చూసొద్దాం అని లేచిన

యశ్ ఎదురుగ శంకరాన్ని చూసి .. మీరు ? అన్నాడు .

అయ్యా .. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను .. అన్నాడు  శంకరం , శివని ,యష్ ని చూస్తూ ..

చెప్పండి అన్నాడు సీరియస్ గా యశ్వంత్ ..

అయ్యా .. భూపతి పాపత్ముడే .. కాదనను .. కానీ కొన్నేళ్ళ నుండి నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతే తట్టు

కోలేరు  కదా .. అన్నాడు శంకరం .

శంకరం గారు .. అతడు సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు .. ఆక్రమించుకున్నాడు .. అన్నాడు శివ .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 16 July 2014

రుధిర సౌధం 197

 అయ్యా ... లేవండయ్యా .. ఉదయం నుంచీ అలానే కూర్చుని ఉండిపోయారు .. అబ్బాయి గారి సంగతి తెలియడం

లేదయ్యా .. ఎక్కడికి వెళ్ళారో ఏమో .. అన్నాడు బాధగా గుమస్తా శంకరం .

శంకరం వైపు నిర్లిప్తం గా చూశాడు భూపతి .. ఆ కళ్ళ లో అంతులేని శూన్యం ..

ఏం శంకరం ? నువ్వు మాత్రం నాతొ ఉన్నావెం ? నన్ను విడిచి అందరూ పోయారే .. ఒక్కసారిగా ఈ భూపతి

సామ్రాజ్యం సర్వనాశన మై పోయింది . ఆ పట్నం కుర్రాళ్ళు నా నోటిలో మట్టి గడ్డలనుకున్నాను.. కానీ .. కానీ .. ఆ

పిల్ల ...  ఆ  పిల్ల ఇంత పని చేస్తుందనుకోలేదు ... ఆ పిల్ల రాచ కుటుంబం మనిషి అని తెలుసుంటే పరిస్థితి ఇలా

ఉండి  ఉండేదే కాదు .. అన్నాడు నీరసంగా భూపతి .

 అవును .. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మీకు వ్యతిరేకం గా ఉన్నాయి కదయ్యా .. మనం ఈ ఇల్లు ఖాళీ

చేయాల్సిన పరిస్థితి .. అన్నాడు శంకరం మెల్లిగా .

లేదు .. శంకరం .. ఈ బంగ్లా రాచ కుటుంబానిదే అయ్యుండొచ్చు .. కానీ నా జీవితమంతా ఇందులోనే గడచింది .

ఇప్పుడు నా ప్రాణం కూడా .. ఇందులోనే .. అయినా రత్నానికి ఏమివ్వనయ్యా ? అన్నాడు దాదాపుగా ఏడుస్తూ

భూపతి .

ఆ స్థితి లో భూపతిని చూసి జాలేసింది    శంకర0 కి .

అయ్యా .. నేనోసారి ఆ మహల్ వరకు వెళ్లి మనకి కొంత సమయం కావాలని అడిగి వస్తానయ్యా .. మీరున్న స్థితి

లో  ఉన్నట్టుండి ఎక్కడ కి పోతారయ్య ? అన్నాడు శంకరం .

దూరంగా నిలబడి వీరి సంభాషణ అంతా మౌనం గా వింటున్న వెంగమ్మ భూపతి ఏం చెబుతాడా అన్నట్లు

చూసింది.

భూపతి కూర్చున్న చోటి నుండి లేచి ... అసలు ఆ పిల్ల వారసురాలని నమ్మక మేంటి ? మనం ఎందుకు ఖాళీ

చేయాలే   ? అన్నాడు తెచ్చి పెట్టుకున్న ధైర్యం తో .

అయ్యా .. ఈ స్థితి లో కూడా .. ఏంటయ్యా ? ఇప్పుడు ఊరు ఊరు అంత వారి వైపే ఉందయ్యా .. మనకి బలం లేదు

కదయ్యా .. ఇప్పుడిలాంటి మాటలు అంటే మనకే ముప్పు .. చిన్ననాటి నుండి మీ ఉప్పు తిన్న మూలాన

మిమ్మల్ని వదల్లేక నేను , ఆ వెంగమ్మ ఇంకా మీతోనే ఉండి పోయాం గానీ .. లేదంటే ఊరి వాళ్ళు అంతా

మిమ్మల్ని  వెలివేశారు గనుక మా దారి మేము జూసుకోమా ? అన్నాడు శంకరం .

భూపతి మళ్ళి  నిస్తేజ0 గా కుర్చీ లో కూల బడ్డాడు ...

దయజేసి నా మాట మన్నించండి తమరు ... నేను వెళ్లి వాళ్ళని అర్థిస్తాను .. కొంత సమయం గావాలని ..

అన్నాడు  శంకరం .

భూపతి మౌనం గా ఉండిపోయాడు ..

అతడేం సమాధానం చెప్పక పోయే సరికి అయోమయం గా వెంగమ్మ వైపు చూశాడు శంకరం .

వెంగమ్మ భూపతి వంక అసహనం గా చూసి ... శంకరాన్ని వేల్లమన్నట్టు సైగ చేసింది ..

అలాగే నంటూ తల ఊపి అక్కడ్నించి కదిలాడు శంకరం .

                                          **********************************

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 15 July 2014

రుధిర సౌధం 196



అదీ యశ్వంత్ జరిగింది .. పరిస్థితి ని బట్టి నేను వీరస్వామి కి మాటివ్వాల్సి వచ్చింది .. నేను రాచకన్య నని అతడు

గ్రహించాడు .. అంది రచన .

ఐ యాం సారీ రా .. నువ్వేం చేసినా దానికి తప్పనిసరిగా ఓ కారణం ఉంటుందని తెలుసు .. కానీ నేను నిన్ను అర్థం

చేసుకునే ప్రయత్నం చేయలేదు . ఐ యాం సారీ రచనా .. అన్నాడు నిజాయితీ గా యశ్వంత్ .

సారీ అవసరం లేదు యశ్వంత్ .. నా మీద నీకు ఎప్పుడో హక్కు ఇచ్చేశాను . మానసికం గా మనం భార్యా భర్త లం .

అటువంటప్పుడు ఇలాంటి వాటికి తావు ఉండ కూడదు .. అంది రచన అతడి కళ్ళ లోకి చూస్తూ ..

నిజంగా ఐ యాం ప్రౌడ్ ఆఫ్ యు రచనా .. నీ వయసు లో ఇంత మేక్చుర్డ్ గా ఎవ్వరూ ఉండరు .. లవ్ యు ..

అన్నాడు యశ్వంత్ .

అయితే కోపం పోయినట్టేగా ... ఇకనైనా ఆ గ్రంథం చదువుతావా ? అంది రచన .

సరే .. అని  ఆకలి గా ఉంది పెళ్ళాం గారూ .. ఏవైనా భోజనం సిద్ధం చేసారా మీరు ? అన్నాడు యశ్వంత్ .

ఆమె గలగలా నవ్వింది .. బావుంది నువ్వలా అంటే .. అని శివ దగ్గరుండి వంట చేయిస్తున్నాడు .. రెడీ ఆయె

ఉంటుంది .. ఉండు .. నేను కనుక్కుని వస్తాను అని లేచింది రచన .

ఇంతలో బాలయ్య .. వచ్చి....  అమ్మాయి గారూ .. మీరిక్కడ ఉన్నారా ? మీకోసమే వెదుకుతున్నాను ... అన్నాడు .

ఓహ్ .. ఎందుకు ? అంది రచన కాస్త పొగరుగా .

మీ సామానంత తెచ్చాను అమ్మాయి గారు .. ఎక్కడ పెట్టించ మంటారు ? అన్నాడు బాలయ్య .

ఓహ్ నా సూట్ కేసు, బాగ్  .. నిజమే .. చాల మంచి పని చేసావు బాలయ్య .. అవును ఇంత హటాత్తుగా నువ్వు

మంచి వాడివి ఎలా అయిపోయావు ? అంది అతడి చేతిలోని సూట్ కేసు ,బాగ్ తీసుకుంటూ .. రచన

యశ్ .. నవ్వి .. మంచి వాడయితే అయ్యాడు కదా రచనా .. అని బాలయ్యా .. నువ్విక మహల్లో నే పని చేయోచ్చు ..

భూపతి నీకిచ్చే జీతం కన్నా ఎక్కువే ఇస్తాం అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ వైపు ఆర్తిగా చూసి మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదయ్యా .. కానీ మంచోళ్ళ తో సావాసం అంతే నయ్య .

ఆ డబ్బు కన్నా ఇదే ఆనందం గుందయ్యా .. మా ఇంటిది కూడా సంతోషo  గా ఉందయ్యా .. అన్నాడు బాలయ్య .

గుడ్ .. అంది రచన చిరునవ్వుతో ..

రచనా .. బాలయ్య కి కూడా ఏదో పని చెప్పు .. చేస్తాడు అన్నాడు యశ్వంత్ .

ఉ .. అని బాలయ్య .. నువ్వు శివ దగ్గరికి వెళ్ళు .. తనకి సహాయం చెయ్యు .. అంది రచన .

అలాగే నమ్మా .. అని వెల్ల బోతున్న బాలయ్య ని చూసి .. మళ్ళి ఏదో గుర్తుకు వచ్చిన దానిలా .. ఆ .. బాలయ్య ..

అని పిలిచింది రచన .

చెప్పండమ్మా ? అన్నాడు బాలయ్య .

ఎలా ఉంది భూపతి పరిస్థితి ? ఏమంటున్నాడు ? అంది రచన .

కుదేలై పోయాడు .. మాటా మంతీ లేదు .. కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు .. అన్నాడు బాలయ్య .

అవును .. రత్నం కనబడ లేదు .. ఎక్కడికి వెళ్ళాడు .. ఇంత జరిగినా తనకేం తెలీదా ? అంది రచన .

ఉదయం నుంచి లేడట అమ్మా .. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు .. జరిగింది ఏదీ తనకి తెలీదు .. భూపతి కూడా కొడుకు

కోసం అందుకే చూస్తున్నాడు .. అన్నాడు బాలయ్య .

ఓకే .. నువ్వెళ్ళు అంది రచన .

బాలయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు .

రత్నం ఎక్కడికి వెళ్ళాడో యశ్ .. వచ్చాక జరిగినదంతా తెలిస్తే .. పాపం తను మంచివాడే .. కాకపోతే కొంచెం తేడా ..

అంది రచన .

లీవ్ ఇట్ రచనా .. ముందు శివ దగ్గర కి వెళ్దాం పద .. ఆకలేస్తుంది మేడం అన్నాడు యశ్వంత్ .

పద పద .. అంది రచన నవ్వుతు ..

ఇద్దరూ వంట మండపం వైపు కదిలారు .






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 14 July 2014

జాబిలి తో చెప్పనా !!



ఓ జాబిలీ .. కబురంపే నా నెచ్చెలి .. 

ఈ నా మది ని  కానుకగా కోరేనా చెలి .. 

తన తలపు లో ఈ రేయి ని తీయంగా  గడపాలని .. 

తన పిలుపు లో ఒక హాయిని సాయంగా అడగాలని .. 

వలపు వల వేసి నను లాగిన నా చెలికి జోహారులే .. 

నీవేమొ ఆ నింగిలో వెలుగు విరజిమ్మేవు .. 

నా చెలియ ఈ మనసు లో చీకట్లు తరిమేను .. 

నీవేమో ఆ తారల నడుమ రారాజైతే .. 

నా కలల రాజ్యానికి తాను మహారాణి .. 

చల్లని వెన్నెల రేయి నీ పుణ్యమేనోయి .. 

చక్కని వన్నెల కలువ నా సొంత మోయి ... 

మబ్బులే కమ్మిన గాని పున్నమి రేడు .. 

సందేహపు తెరలు తొలగించినావోయి .. 

ఈ యామిని , నా సౌదామినీ కలసి 

నా ప్రేమని ఆస్వాదించనీ ... 








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 195


నిజమే తల్లీ .. ఇది సంతోష సమయమే . గ్రహణం వీడుతున్న సమయమే ... కానీ .. అని ఆలోచన లో ఉండి

పోయాడు రమణానంద .

సందేహించకు నాయనా . ఇది కలికాలం .. చెడు చెలరేగుతున్న కాలం . మంచి కి పరీక్షా కాలం . కానీ కాలమేదైనా

చెడు మీద మంచి కె విజయం నాయనా .. అన్న దామె చిరు దరహాసం తో  .

సందేహం లేదు తల్లీ .. నిన్ను సందేహించే సాహసం చేయగల వాడిని కాను . నాచే ముహూర్తం నిర్ణయింప

బడాలన్నది నీ తల్లి మనసు లో పెల్లుబుకుతున్న ప్రేమ తల్లీ .. అన్నాడు రమణానంద .

ఆమె చిరునవ్వు తో ... వెళ్ళు నాయనా .. ప్రతి స్త్ర్రీ లోనూ నా అంశే ఉంటుంది .. స్త్రీ కూడా సద్భుద్ది ,దుర్భుద్ధి ల

అధీనం లో ఉండక తప్పదు కదా .. ఇది నాలో నాకే ,నాతోనే జరుగుతున్న యుద్ధం .. కావున ఫలితా న్వేషణ

కోసం  యోచించక మీరందరూ .. మీ మీ కర్తవ్యాలను సక్రమం గా నిర్వర్తించండి . ఆ తదుపరి ఫలితాన్ని నాకు

వదిలిపెట్టండి .. నీకు విజయం సిద్ధించు గాక ... అంది ఆమె దరహాస వదనం తో ..

కృతజ్ఞుడను తల్లీ .. అని ఆర్తి గా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు రామనానంద .

మెల్లిగా కళ్ళు తెరచి చూసేసరికి .. ఆమె లేదు .. అంత వరకు నాసికా పుటలను అలరించిన సుగంధము జాడ లేదు .

అతడు  నెమ్మదిగా లేచి జై వైష్ణవీ మాతా .. అని ముందుకి సాగాడు .

                                          ************************************

యశ్వంత్ మనసంతా ఆందోళన గా ఉంది . అమ్మవారి మెడలో హారం ఎలా ఇస్తానని మాటిచ్చింది రచన . ఇంత

వరకు పూజలేదు . ఆలయం తెరువ గానే ఏళ్ళ తరబడి ఆమె మెడలో ఉన్న హారం ఆమె నుండి దూరం చేయడం

ఎంత వరకు సమంజసం ? అని విసుగ్గా అనుకున్నాడు యశ్వంత్ .

యశ్ .. అన్న రచన పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూశాడు యశ్వంత్ .

నువ్వేంటి ? అలా ఆలోచిస్తూ ఉన్నావు ? గ్రంథం చదవలేదా ? ఏమైంది నీకు ? అంది రచన అతని దగ్గర వచ్చి అతడి

నుదుటి మీద చేయి వేసి .. ఒంట్లో బాగానే ఉందిగా .. అంది రచన .

హా .. రచనా .. పనయ్యిందా ? అన్నాడు యశ్వంత్ .

మహల్ అంటా శుభ్రం చేయడం అంటే మాటలా ? ముందుగా దేవుడి గది నేనే శుభ్రం చేసి వచ్చా .. మిగతా ఓ

మూడు పడక గదులుగా ఉపయోగించు కోవోచ్చు . బోలెడంత దుమ్ము ఉంది .. కానీ తప్పదు ... ఆ ఆడవాళ్ళంతా

ఈరోజంతా ఉండి శుభ్రం చేస్తామంటున్నారు . అంది రచన .

రచనా .. హారం తీసుకుని నువ్వు వీరస్వామి ని ఎక్కడ కలవబోతున్నావు ? అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. అర్థమయింది . నువ్వైతే ఇంకా అదే ఆలోచిస్తున్నావు ? బహుసా నా మీద కోపం వస్తుంది కూడా కదా ..

అని అతని కళ్ళల్లోకి చూసింది రచన .

అతనికి హారం ఇవ్వడం తప్ప వేరే దారేం లేదా ? అన్నాడు యశ్వంత్ ఆమె వైపు దీనంగా చూస్తూ .

యశ్ .. అసలు ఏ పరిస్థితుల్లో నేనా మాట ఇచ్చానో తెలుసా .. అసలు నీకు మొత్తం చెప్పాలి .. నువ్వు ముందు

ఇలా  కూర్చో .. అని అతడిని పట్టుకొని మెట్ల పై కూర్చో బెట్టి తానూ అతడి పక్క కూర్చుంది రచన .

నేను ఇంతకు ముందు నిన్ను అడిగాను . నాకోసం నీకు అక్కడికి రావాలని పించలేదా అని ? అంది రచన .

అవును .. కానీ .. అని అతడు ఏదో చెప్పబోతుంటే .. వారించి

మనిషి తన చావు కళ్ళముందు కనిపిస్తున్నప్పుడు .. అప్పుడు అర్థమవుతుంది .. తామేవర్ని ఎంతగా

ప్రేమిస్తుంది ? నాకూ అదే అనుభవమైంది .. మరణించడానికి సిద్ధ పడిపోయాను .. సత్య కోసం .. ఆ క్షణం నువ్వు

నా పక్కన ఉండుంటే బావుండు నని పించింది .. అంది రచన .. ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర తళుక్కు మంది .

రచనా .. అన్నాడు బాధగా   యశ్వంత్ .

యశ్ .. నన్ను చెప్పనీ .. నీకు చెప్పాలి .. నేను .. మురారిని రావొద్దని వారించి వెళ్లాను .. అంతా అటవీ మార్గం ..

అంటూ జరిగినదంతా చెప్పసాగింది రచన .

ఆమె చెబుతుంటే యశ్వంత్ వెంట్రుకలు నిక్కబొడుచు కున్నాయి ..

జరిగినదంతా చెప్పడానికి ఆమె కి గంట సమయం పట్టింది .


ఇంకా ఉంది










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 12 July 2014

రుధిర సౌధం 194

నిజమే యశ్ .. ఆ హారం తో వాడెం చేసుకుంటాడో .. ఈ మహల్లో వైజయంతి అన్న క్యారెక్టర్ లేదన్న మాట ఎంత

ప్రశాంతత నిస్తుంది . యు డిడ్ ఏ రైట్ జాబ్ రచన .. అన్నాడు శివ .

అది నీ ఫ్రెండ్ కి చెప్పు ... చూడు ఇంకా పేస్ ఎలా పెట్టాడో .. నాకు పనుంది నే వెళ్తున్నా .. అని అక్కడ్నించి వెళ్లి

పోయింది రచన .

ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు ? అన్నాడు శివ .

శివా .. వీరస్వామి కి ఆ హారం ఎంత ప్లస్ అవ్వకపోతే భూపతిని కూడా కాదనుకుంటాడు . ముందు ఆ హారం గొప్ప

తనం ఏంటో తెల్సుకోవాలి .. వాడేందుకు ఆ హారం కావాలనుకుంటున్నాడో మనం తెల్సుకోవాలి అన్నాడు

యశ్వంత్ .

ఎంత గొప్ప హారమైనా సరే ఇప్పుడు అదే వైజయంతి సమస్య కి పరిష్కారం .. మనం దానిని  ఇవ్వకుంటే

సమస్య    మళ్ళి  వెనక్కి వస్తే .. అమ్మో ఊహించడానికే భయంగా ఉంది .. లేట్ ఇట్  బి .. వదిలేద్దాం ...

నువ్వింకా దాని గురించి ఆలోచించకు అన్నాడు శివ .

సాలోచన గానే తల ఊపాడు యశ్వంత్ .

                                                    *********************


కాలి నడకన పయనం సాగిస్తున్న రమణానంద మహర్షి నాసికా పుటలకి అద్భుత మైన సువాసన తాకింది ...

అతడి పెదవుల పై చిరునవ్వు విరిసింది ..

అడుగులు మరింత వేగం గా ముందుకి పడసాగాయి ..

వనమంతా అత్యంత సౌందర్య భరితం గా ఉంది .. దగ్గరలోనే ఉన్న సెలయేటి గలగల మంద్రంగా వినబడుతుంది .

చిరుగాలి ఆప్యాయంగా స్పర్శిస్తుంది ...

అతడు ముందుకి నడుస్తున్న వాడల్లా ఒక్క క్షణం హటాత్తుగా ఆగిపోయాడు .

అతడి కనులకి కనబడుతున్న దృశ్యం అతడిని మంత్ర ముగ్దుడిని చేసింది .

సెలయేటి ఒడ్డున ఆసనం లా ఉన్న ఓ రాతి మీద ఓ స్త్రీ వయ్యారం గా కూర్చుని ఉంది .. ఆమె పెదవులు సన్నని

కూనిరాగం తీస్తున్నాయి ... ఆ రాగానికి తాళం వేస్తున్నట్టు ఉంది సెలయేటి సడి .

ఆమె విరబూసిన కురులు చిరుగాలికి నాట్యం చేస్తున్నాయి ...

అతడు టక్కున తేరుకుని ఆమె వైపు నడచి ఆమె ముందు మోకరిల్లాడు ...


ఆమె చిరునవ్వుతో అతడిని చూసింది ...

అమ్మా .. మళ్ళి  ఇన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం .. ఈ దీనుడిని ఇలా కనికరించావా తల్లీ .. అన్నాడు చిప్పిల్లిన

కన్నీటి చూపులతో రమణానందుడు .

నేను నీ కొరకే వేచి ఉన్నాను రమణానంద ... మనసు సంతోషం లో తేలియాడుతుంది .. నా ఇంటికి నేను

చేరుకోబోతున్న సంతోషం సుమా ఇది ... ముహూర్తం నీ ద్వారా నిర్ణయింప బడుతుంది .. మరి నేను నీ కొరకు

వేచి ఉండక తప్పదు కదా .. అంది ఆమె సుమధుర స్వరం తో ..  

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 11 July 2014

రుధిర సౌధం 193




అవును యశ్వంత్ . ఇప్పుడు మనల్ని నమ్మి ఇంత జనం ఇక్కడికి వచ్చారు . వీళ్ళకి ఎటువంటి అపాయం

ఎదురవకూడదు కదా ... అదుగో రచన వాళ్ళందర్నీ మహాల్లోకి తీసుకు వెళ్తోంది .. మనం వెళ్దాం యశ్ .. రచన

కిప్పుడే ఈ విషయం కోసం అడుగుదాం .. అన్నాడు శివ .

ఇద్దరూ .. కంగారుగా మహల్ ద్వారం వైపు పరుగుతీసారు .

రచన .. అందరికీ తలో పనీ ఒప్పజేబుతుంది ..

వీళ్ళిద్దర్నీ చూసి .. అప్పుడే చదవడం పూర్తయిందా ? అలా జరిగే వీల్లేదే .. అంది రచన .

అసలు మొదలు పెట్టలేదు .. ఒక్కసారి నువ్విలా రా .. నీతో మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. ఇక్కడ పని పూర్తి కావాలి .. సరే .. అని వీరి వద్దకి  వచ్చి చెప్పు .. ఏం చెప్పాలి మీకు ? అంది రచన .

వైజయంతి కోసం చెప్పు ? అన్నాడు యశ్వంత్ సీరియస్ గా .

ఆ మాట వినగానే ఆమె మొహం లో రంగులు మారాయి ...

చెప్పు రచనా ? కోటలో ఏం జరిగింది ? వైజయంతి పీడ పూర్తిగా పోయిందా ? నువ్వా మాట చెబితే మేము

ప్రశాంతంగా ఉంటాం కదా .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. వైజయంతి ని , బసవరాజు ని ఇద్దర్నీ వీరస్వామి బంధించి ఉంచాడు .. అంది రచన .

 వీరాస్వామా ? ఇద్దరూ  ఒకేసారి ఆశ్చర్యం గా అన్నారు ... యశ్వంత్ ,శివ

చిన్నగా తల ఊపి అవును ... తనే .. మనకి సహాయం చేసాడు . ఒక చిన్న డీల్ .. తనతో అంతే .. అంది రచన .

రచనా .. మనం భూపతిని దోషిగా  నిలబెట్టాం .. వీరస్వామి భూపతి మనిషి .. తన పాపాలలో  అధిక శాతం

వీరస్వామి కి వాటా  ఉంది .. అన్నాడు శివ .

అవును నిజమే .. కానీ  వీరా స్వామి స్వార్థ పరుడు . ఇప్పుడు భూపతి వెంట ఉండటం కంటే మనల్ని

నమ్మటమే  మంచిదని అతడు భావించాడు . ఎవ్వరూ మునిగి పోతున్న పడవ ఎక్కాలనుకోరు కదా ... అంది

రచన .

డీల్ ఏంటి రచనా ? వాడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ? అన్నాడు సీరియస్ గా యశ్వంత్ .

వాడు చేసిన తప్పులకి శిక్ష పడకుండా చేయమని అడిగి ఉంటాడు .. అన్నాడు శివ .

లేదు శివా ... వాడు అమ్మవారి మెడలో ఉన్న హారం అడిగాడు . గుడి నాచే తప్పక తెరవబడుతుందని అతడు

నమ్మాడు . అమ్మవారి మెడలో పురాతన హారం ఏదో ఉందట . అదిస్తే .. వైజయంతి పీడ పూర్తిగా తొలగిస్తానని

చెప్పాడు . ఈ ఊరి క్షేమం కంటే , ఈ మహల్ పునరుద్ధరణ కంటే ఆ హారం ఏ మాత్రం గొప్ప . అందుకే మాటిచ్చాను

గుడి తెరవగానే ఆ హారాన్ని అతడికి ఇస్తానని . వైజయంతి నాశనం పూర్తిగా జరిగిపోవాలి .. అంది సాలోచన

గా   రచన .

అతడు ఆ హారం అడిగాడంటే .. ఈ భూపతి కూడా ఆ హారం కోసం ప్రయత్నించాడు అంటే .. ఆ హారం వెనుక

ఏదో ఉంది .. అన్నాడు యశ్వంత్ .

అదేమైనా యశ్ .. నాకు వైజయంతి నాశనమే ముఖ్యం అంది రచన .

ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 10 July 2014

రుధిర సౌధం 192



యశ్ .. నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావో అర్థమవుతుంది . కానీ మనకి సమయం తక్కువ ఉంది . రేపే

పౌర్ణమి.. రేపీ పాటి కల్లా మహల్ కళకళ లాడాలి . ఈ సంతోష సమయం లో అమ్మ , అన్నయ్య కూడా నాతొ ఉంటె

బావుండేది . సత్య సంతోషం గా తిరగగలిగి ఉంటె ఇంకా బావుండేది .. అంది రచన .

రచనా .. ఈ సంతోశాలన్నింటికి మూలం మనం గుడి తెరవటం .. నువ్వు దానికోసం మాట్లాడటం లేదేంటి ?

అన్నాడు యశ్వంత్ .


ఓహ్ .. సారీ యశ్ .. దానికి పరిష్కారం నాకు నిన్న రాత్రే దొరికింది .. కానీ మీకు చెప్పే అవకాశం రాలేదు .. అని

పక్కనే ఉన్న తన హ్యాండ్ బాగ్ లోని ఒక తాళ పత్ర గ్రంథం బయటికి తీసి .. మీ ఇద్దరూ చిన్నప్పుడు సంస్కృతం

చదువుకునే ఉండుంటారు గా . ఇది చదవండి .. అన్నీ మీకే అర్థమవుతాయి .. అని వారికి అందించింది రచన .

ఏంటిది రచనా ? అని దానివైపు విచిత్రం గా చూస్తూ అడిగాడు యశ్వంత్ .

వైష్ణవీ మాత ఆలయం .. సరస్వతి వాళ్ళ పూర్వీకులే కట్టారు . నాకు తాత ఆ విషయం రాత్రి చెప్పాడు . ఈ గ్రంథం

వాళ్ళ వంశీకుల వారసత్వ ఆస్తి . ఇందులో మన గుడి గురించి కూడా రాసి ఉంది .. అన్ని వివరంగా .. అంది రచన

చిరునవ్వుతో ..

అయితే .. మనకి సొల్యూషన్ దొరికేసి నట్లే .. అన్నాడు శివ .

అవును శివా .. ఈ గ్రంథం కూడా చాలా తెలివిగా రాసారు . నాకు అర్థం చేసుకోడానికి చాల సమయం పట్టింది ..

మీరు ట్రై చేయండి అంది రచన .

సరే ముందు నువ్వు వెళ్ళు రచనా .. వాళ్ళైతే నీకోసం ఎదురు చూస్తున్నారు గా ... అన్నాడు శివ .

వెళ్తాను .. మహల్ శుభ్రం చేశాక వెహికల్ తీసుకు వెళ్లి సత్య , మురారి లను తీసుకురా .. అంది రచన .

అలాగే .. నువ్వు వెళ్ళు .. అన్నడు శివ .

రచన ఆ ఆడవాళ్ళు కూర్చున్న మంటపం వైపు నడిచింది .

యశ్ .. ఆ కోటలో ఏం జరిగింది రచన   చెప్పిందా ఏమైనా ? అని అడిగాడు శివ .

లేదు శివా .. కానీ ఇప్పుడు అంతా  ప్రశాంతం గా ఉంది .. మన మనసులు కూడా .. అంతా  విధాత్రి చెప్పినట్టే

జరుగుతోంది .. చిక్కుముల్లన్నీ  వా టoతట అవే వీడిపోతున్నట్టు లేవూ .. ఇప్పుడు గుడి ద్వారం ఎలా తెరవాలో

అన్న సమస్య కి పరిష్కారం కూడా మన చేతిలో ఉంది .. భవిష్యత్తు ఈ ఊరి ని కూడా ఆహ్వానిస్తుంది .. అన్నాడు

యశ్వంత్ .

నిజమే యశ్ .. ఇది సంతోషాలను పంచుకోవాల్సిన సమయం .. చేదు జ్ఞాపకాలని కాదు . ఏం జరిగినా

ఇప్పుడంతా  మంచే జరుగుతోంది .. ఒక్క సత్య విషయం తప్ప . తను మనతో ఇప్పుడు ఉండుంటే బావుండేది

అన్నాడు శివ .

శివా .. రచన .. సత్య విషయం లో కూల్ గా ఉంది అంటే మనం ఆందోళన పడనవసరం లేదని .. నాకు

అనిపిస్తోంది . కానీ అంతు పట్టనిదల్లా వైజయంతి విషయం లో రచన ఎలా కూల్ గా  ఉంది ? మనం ఈ  విషయం

అయితే మాత్రం తెలుసుకోకుండా ఆలస్యం చెయ్యలేం .. అన్నాడు యశ్వంత్ కంగారుగా .



 ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 9 July 2014

రుధిర సౌధం 191





ఇప్పుడు చెప్పు .. అసలేం జరిగింది ఆ పాడుబడ్డ కోటలో ... అన్నాడు మెట్ల మీద తీరిగ్గా , ప్రశాంతం గా కూర్చున్న

ప్రేయసి పక్కన కూర్చుంటూ ..

నేనక్కడికి వెళ్లానని తెలియగానే నువ్వు నా కోసం వచ్చావ్ కదూ .. అంది రచన అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ .

ఆమె అలా అడగగానే కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి .. లేదు .. నీకొసమైతె రాలేదు .. అన్నాడు యశ్వంత్ .

దిగ్గున లేచి .. నాకోసం రాలేదా ? అంది చిన్నబోతున్న మొహం తో ..

అమాయకం గా మొహం పెట్టి తానూ లేచి నిలుచుని .. నాకు నమ్మకం నీ మీద .. నువ్వు సాధించుకు రా గలవని .

అందుకే నేను రాలేదు .. బట్ సరస్వతి ని బాలయ్య వాళ్ళు అటువైపే తీసుకురావడం చూసి ఫాల్లో అయ్యాం అంతే .

అన్నాడు యశ్వంత్ .

అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ? అంది బుంగమూతి పెట్టి రచన ...

ఇప్పుడెందుకు వచ్చిందా అనుమానం ? అన్నాడు కొంటె గా నవ్వుతు యశ్వంత్ .

మరి .. ప్రేమించిన అమ్మాయి అలాంటి చోటికి వెళ్తే ఏమయ్యుంటుందో అన్న టెన్షన్ కూడా లేదా నీకు ? అంది

నిలదీస్తున్నట్లుగా రచన .

హ్ .. అని నిట్టూర్చి .. పాపం .. మా రచన అక్కడికి వెళ్తోంది .. అక్కడ ప్రశాంతం గా ఉన్న దెయ్యాలకి దిక్కూ , గతి

లేకుండా పోతోందే అని భయ పడ్డాను సుమీ .. అన్నాడు యశ్వంత్ తమాషాగా .

నిన్నూ ... అని అతడి ముక్కు మీద ఒక్క పిడి గుద్దు గుద్దింది రచన .

అతడు .. కమాన్ .. వుయ్ విల్ ఫైట్ .. అని చేతులు బిగించి ముందుకి  వచ్చాడు ..

హే .. హే .. ఏం చేస్తున్నార్రా బాబూ .. అంటూ వచ్చాడు శివ .

ఫైటింగ్ అన్నారు .. ఇద్దరూ ఒకేసారి .

ఓహ్ .. అయితే .. తర్వాత .. అని రచన వైపు తిరిగి .. రచనా .. కొంతమంది ఆడవాళ్ళు మహల్ శుభ్రం చేసేందుకు

వచ్చారు .. మగవాళ్ళంతా బయట అంతటా శుభ్రం చేస్తున్నారు .. అన్నాడు శివ .

ఆడవాళ్ళా ? స్ట్రేంజ్ .. నిన్నటి వరకూ ఇటు వైపు రావటానికే భయపడ్డారు .. ఇప్పుడు ఇంత మంది ధైర్యం గా

వస్తున్నారు . ఒక్కసారి గా కాలం ఎంత మాయ చేసిందో .. అంది రచన అబ్బురం గా .

అవును .. ఇలా మహల్ చుట్టూ అందరూ  ధైర్యంగా తిరగాలనేగా నువ్వు తపన పడ్డావు . నువ్వు అనుకున్నది

ఈరోజు జరుగుతుంది రచనా .. అన్నాడు యశ్వంత్ .

అవును యశ్ .. అని శివ వైపు తిరిగి ఇంతకీ వాల్లెక్కడున్నారు ? అంది  రచన .

అటువైపు మండపం మెట్ల మీద .. చాలా  కులాసా గా కూర్చున్నారు . వాళ్ళ మొహాల్లో నిశ్చింత  , ధైర్యం కాన

వస్తుంది . అటువైపు చూడు .. అన్నాడు శివ .

శివ చూపించిన వైపు చూసారు ఇద్దరూ ..

వాళ్లకి పని అప్పచెప్పి వస్తాను అయితే అని రచన కదల బోతుంటే ... రచనా .. ఆగు .. ముందు అన్ని విషయాలు

మనం మాట్లాడుకోవాలి కదా .. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మా మనస్సులో .. అన్నాడు యశ్ .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 8 July 2014

రుధిర సౌధం 190

స్వామీ ... నది ఒడ్డు కి చేరుతోంది పడవ .. అన్నాడు పడవవాడు .

కళ్ళు మూసుకొని ధ్యానం లో ఉన్న రమనానంద మహర్షి కళ్ళు తెరచి .. ఆ .. అని తన వంకే ఆసక్తిగా చూస్తున్న

గోపాల స్వామి వైపు చూసి .. నీవు ఒడ్డు రాగానే దక్షిణ దిశ గా పయనమై ఆ అడవి లో నేను చెప్పిన వస్తువులని

సేకరించు ... సేకరించిన పిమ్మట తూర్పు దిశగా పయనం సాగించు .. ఒక కుగ్రామం కనబడుతుంది .. ఆ కుగ్రామం

లో నేను నిన్ను కలవగలను . స్నానం ఆచరించి వస్తువులని సేకరించు గోపాలా .. అన్నాడు రమనానంద మహర్షి .

ఏదో మహత్కార్యం లో పాలు పంచుకో బోతున్నానని ఉత్సాహం తో ఉన్న గోపాల స్వామి  సంతోషo  గా తల

ఊపాడు .

పడవ ఒడ్డు కి చేరింది ...


స్వామీ ... మరల మీ దర్శనం ఎప్పుడు స్వామీ అన్నాడు పడవవాడు వినయంగా ...

ముర్రయ్యా ... నా దర్శనం కొరకు కాదు .. ఆ జగదాంబ దర్శనం కొరకు రేపు పౌర్ణమి నాడు రావణ పురం చేరుకో ...

ఇన్నేళ్ళ నీ నిరీక్షణ ఫలిస్తుంది .. అన్నాడు రమనానంద .

మహద్భాగ్యం స్వామీ .. అని మళ్ళి పడవని వెనక్కి మళ్ళించాడు పడవవాడు ..

స్వామీజీ .. ఈ పడవ వాడు మీకు ముందరే తెలుసునా ? మీరు పిలిచి నట్టే మీకొరకు ఆవలి ఒడ్డున ఆహార

పదార్థాల సహితం గా ఎదురు చూస్తూ ఉన్నాడు .. అన్నాడు గోపాల స్వామి .

గోపాలా .. మనసులు  సాన్నిహిత్యం గా ఉన్నప్పుడు దూరం మాత్రం ఏం చేయగలదు . చిరుగాలితో సందేశం

పంపినా  చాలునని నీవు ఎరుగవా ? దీనికే ఆశ్చర్యపడి సమయాన్ని వృధా  చేయకు .. తక్షణమే దక్షిణ దిశ గా

బయలుదేరి రేపు ఉదయాని కల్లా ఆ గ్రామాన్ని చేరుకో నువ్వు .. అన్నాడు రమణానంద .

అలాగే స్వామీ ... అని గురువు పాదాలకి నమస్కరించి దక్షిణానికి పయన మయ్యాడు గోపాల స్వామి .

గోపాలస్వామి అటు అలా వెళ్ళగానే .. నది చుట్టూరా ఉన్న అటవీ మార్గం గుండా నడక సాగించాడు రమణానంద .

                                                     *************************

విక్కీ ఇక్కడ నుండి మనం రోడ్ మార్గం లోనే వెళ్ళాలి అంది గిరిజ .

అవునా అమ్మా ? నేను కాబ్ బుక్ చేసి వస్తాను ... నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అమ్మా ... అన్నాడు విక్కీ .

అలాగే .. మనం ముప్పావు వంతు ప్రయాణం సులువుగా చేసేసాం నాన్నా .. కానీ ఇక్కడి నుండి వెళ్ళటానికే

ఆలస్య మవుతుంది .. అంది గిరిజ .

ఎంత సమయం పట్టొచ్చు అమ్మా ? అని అడిగాడు విక్కీ .

మనం ఇప్పుడు బయల్దేరితే .. రేపు ఉదయం కల్లా రావణ పురం లో ఉంటాము .. వెంటనే కాబ్ తీసుకొని రా

నాన్న  ... అని పక్కనే ఉన్న బెంచ్ లో కూలబడింది .. గిరిజాదేవి .

కాబ్ కోసం వెళ్తున్న విక్కీ ని చూస్తూ అనుకొంది .. సుమారు 20 ఏళ్ళ తరువాత మళ్ళి రావణ పురం వెళ్తున్నాం ..

ఈ ప్రయాణం మన జీవితాలని ఏ మలుపు తిప్పబోతుందో .. అనుకొంది  మనసులో గిరిజ .



ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 7 July 2014

రుధిర సౌధం 189


అలాగే శివా .. కానీ ఊరివాళ్ళు ఏమంటారో .. అన్నాడు యశ్వంత్ .

బాబూ .. మేము ఈరోజు నుండి భూపతిని ఊరి నుండి వేలివేస్తున్నాం .. ఎవ్వరూ మాట్లాడేది లేదు .. సహాయం

చేసేది లేదు .. ఇది మాకు మేము చేసుకున్న తీర్మానం .. అన్నారు ప్రజలంతా ..

ఈ శిక్ష సరిపోతుందో లేదో అతడే నిర్ణయించుకోవాలి యశ్వంత్ .. అని ప్రజల ముందు కి నడిచి .. ఇక నుంచి రాణి

మహల్ వైపు రావటానికి భయపడకండి .. మహల్లో మేము ఉండబోతున్నాం .. రేపు మహల్లో జరగబోయే

వేడుకకి మీరంతా కూడా హాజరవ్వండి .. మహల్ ని శుభ్రం చేసుకుందాం .. మహల్లో ఉన్న అమ్మవారిని

అందరం ఆరాదిద్దాం . ఈ ఊరికి మంచి జరుగుతుంది .. అంది రచన .

ప్రజలంతా ఆనందంగా తలలూపారు ...   

ఇక నుంచి ఈ ఊరికి నాయకులు అంటూ ఎవ్వరు లేరు .. అంతా మనమే .. మనమే మన ఊరికి మంచి చేయాలి ..

బాగుచేసుకుందాం ... తప్పక బాగుచేసుకుందాం .. అంది రచన .

యశ్వంత్ , శివ ఆమె వైపు ఆనందాశ్చర్యాలతో చూస్తున్నారు ..

భూపతి కృంగిపోయాడు ...

భూపతి గారు .. మీరున్న బంగాళా కూడా మహల్ చెందినదే .. త్వరగా ఖాళీ చేయండి .. అంది రచన ..

అతడు నీరసంగా చూసాడు రచన వైపు ..

అమ్మా .. నేను ఇల్లంతా ఖాళీ చేయిస్తాను .. మీరు మహల్ కి వెళ్ళండమ్మా .. అని యశ్వంత్ దగ్గరిగా వచ్చి అయ్యా

నా సంగతి మరవ కండయ్యా .. అన్నాడు బాలయ్య .

బాలయ్య .. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు .. ఈరోజు జనం ముందు నువ్వు నిజాల్ని వెల్లడిన్చావు .. అదే నీకు

శ్రీరామ రక్ష.. నిన్ను ప్రజలు ఏమి అనరు భయపడకు .. తాయెత్తు నేనిస్తాను అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. వచ్చిన పని అయిపొయింది .. ఇక మహల్ కి వెళ్దాం .. బోలెడన్ని పనులున్నాయి .. అంది రచన .

అవును .. అని భూపతి వైపు తిరిగి .. ఇకనైనా మనిషి లా బ్రతుకు .. అని ముందుకి కదిలాడు యశ్వంత్ ..

యశ్వంత్ ,శివ , రచన ల వెంట జనం కూడా మహల్ వైపు కదిలారు ..

ఇప్పుడు ప్రజల్లో మహల్ పట్ల భయం తొలగిపోయుంటుంది .. కానీ అక్కడ వైజయంతి ఉండటం నిజం కదా ...

అన్నాడు శివ .. రచన కి మాత్రమె వినబదేటట్టుగా ..

శివా .. వీరస్వామి .. వైజయంతి ని బంధించాడు .. ఇప్పుడు భయం ఏమీ లేదు .. అన్ని విషయాలు మనం తర్వాత

మాట్లాడుకుందాం .. అంది రచన .

అవును శివా .. ఇప్పుడు మాట్లాడొద్దు . ఇప్పుడు వారి మనస్సులో ఎటువంటి అనుమానానికి తావు ఇవ్వొద్దు ..

అన్నాడు యశ్వంత్ ..

అలాగే .. మరి సత్య .. అన్నాడు శివ .

మురారి తనదగ్గరున్నాడు .. సరస్వతి వాళ్ళని చూసుకుంటుంది .. ముందు మనం మహల్ శుభ్రం చేసుకోవాలి

అంది రచన ముందుకి నడుస్తూనే ..

ఇంకా ఉంది 





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 5 July 2014

రుధిర సౌధం 188


జనం లో కలకలం మొదలయ్యింది ..

ఓరి దుర్మార్గుల్లారా ... ఊరోలన్దర్నీ పొట్టన పెట్టేసుకున్నారు కదరా .. మీరు చెప్పిన దానికల్లా తల ఆడించాము

కదరా .. ఇంత అన్నాయం చేస్తారా మాకు ? అంటూ చేతి కందిన రాయి తీసుకొని భూపతి మీదకి , బాలయ్య ,

శంకరం మీదకి విసిరారు .

భూపతి శరీరం రక్తసిక్త మయ్యింది ..

ఆగండి .. ఆగండి .. ఏం చేస్తున్నారు మీరు ?అంటూ భూపతి కి అడ్డం గా వెళ్ళింది రచన .

ప్రజలు రాళ్ళు రువ్వటం మెల్లిగా ఆపారు ...

ఎందుకీ ఆవేశం ? మోసం చేసేవాడి కన్నా , మోసం చేయించుకున్న వాడిదే తప్పు .. మీరు యితడు చెప్పిందల్లా

గుడ్డిగా చేశారు .. ఇతడి బలాన్ని మీరే పెంచారు .. మీ పిల్లల్ని చదివించవద్దు అంటే చదివించటం మానేశారు ..

మన ఊరికి రోడ్స్ వద్దంటే మీరు వద్దనుకున్నారు .. మీ ఊరి ప్రగతిని మీరే అడ్డుకున్నారు .. మీ జీవితాలని మీరే

తాకట్టు పెట్టేసారు .. మరి తప్పు అతనిది ఎలా అవుతుంది ..? మీ సమాధుల పైన అతడు తన సింహాసనాన్ని \\

ఏర్పాటు చేసుకుంటుంటే నిశ్శబ్దం గా చూసారు .. అంతే గానీ ఆలోచించలేదు .. ఆలోచించాలని , ఎదురించాలని

మీకు తలంపు కూడా రాలేదు .. ఇప్పుడు శిక్షించేందుకు అధికారం మాత్రం వచ్చిందా ? అన్నాడు యశ్వంత్ .

అయ్యా .. ఏం చేయమంటారు ? మమ్మల్ని పట్టించుకొనే నాథుడే లేదాయే .. జరిగుతున్నది అన్నయమో ధర్మమో

తెలుసుకోలేని వాళ్ళం బాబూ .. మంచికి చెడ్డకి .. ఇదుగో ఈ పెద్దోల్ల ముందు తలోంచటం .. కష్టానికి పతిఫలం

వచ్చిన .. రాకున్న పొట్టలో ముంగాలు బెట్టి తొంగోటం తప్ప మరోటి తెలవదయ్యా .. అన్నాడు ఓ  ముసలి వాడు .

తాతా ... బాధ పడకండి .. ఇప్పుడు మీకు మేమున్నాం .. ఈ ఊరికి రోడ్లు వస్తాయి .. అన్ని సదుపాయాలు వస్తాయి
అన్నింటి మీద మీకు హక్కుంది .. మీ భూములు భూపతి అక్రమం గా  ఆక్రమించు కున్నాడు .. మీ భూములు

మీకు దక్కేలా మేము చేస్తాం .. అంది రచన ప్రజల నుద్దేశించి .

ఆ పైవోడు గొప్పోడు .. తల్లే .. తాను రాలేక మిమ్మల్ని పంపాడేమో.. ఏ బంధం లేక పోయినా ఈ ఊరికి మంచి

చేస్తున్నారు .. అన్నాడు ఆ ముసలాయన .

బంధం ఉంది తాతా .. నేను ఈ ఊరి బిడ్డనే .. ఆ మహల్ మా కుటుంబానిదే .. ఏ మహల్ మీ మనస్సులో భయాలని

కలగజేస్తుందో .. ఆ భయాన్ని మీనుండి దూరం చేద్దామని వచ్చాను .. ఇక ఈ ఊరి  బాగోగులు చూసే బాధ్యత

మాదే .. అంది రచన స్థిర చిత్తం తో ..

భూపతి రచన వైపు విస్తుపోయి చూస్తుంటే .. జనం హర్ష ధ్వానాలు చేస్తుంటే .. యశ్వంత్ , శివ , సరస్వతి ,తాత

రచన వైపు చిరునవ్వుతో చూశారు ..

అమ్మా .. మా ఊరు నిన్ను చూసి గర్వం తో తలెత్తుకుంటుంది .. ఈ సంతోషం తో పండగ చేసుకోవాలమ్మా ..

అన్నారు జనం .

 అవును పండగే చేసుకోవాలి .. ఈరోజు చతుర్దశి .. ఈ  రాక్షసుడు మన ముందు పతనమయిన రోజు .. రేపు

పౌర్ణమి .. పండగ  చేసుకుందాం .. ఆ చంద్రుడి వెలుగు సంతోషం తో వెలగబోయే మన మొహాల ముందు

చిన్నబోవాలి .. అంది సరస్వతి .

కానీ భూపతిని ఇలాగే వదిలేస్తామా ? ఇన్ని పాపాలు చేసినా ... పోలిసుల కి అప్పజెపుదాం యశ్వంత్ అన్నాడు ..

శివ .

ఇంకా ఉంది 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 4 July 2014

రుధిర సౌధం 187




నిజమే .. మీరు నమ్మలేరు .. ఎందుకంటే భూపతి మేక వన్నె పులి ... మీరంతా అమాయకులు  అందుకే

ఇన్నాళ్ళు అతడి ఆటలు సాగాయి ... రాముడ్ని హత్య చేయించాడు .. అందుకు బలమైన సాక్ష్యం ఉంది మా దగ్గర .

అన్నాడు యశ్వంత్ .

ఏమిటది ? ఆవేదన నిండిన స్వరం తో అన్నారు రావణ పురం ప్రజలు ...

ఆ సాక్ష్యం ఏదో చెప్పే ముందు .. మరిన్ని విషయాలు చెప్పాలి .. పరిశోధన కోసం వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని కూడా

భూపతే మట్టు బెట్టాడు .. అలాగే ఈ ఊరిలో తనకి అడ్డం అనుకున్నవాళ్ళు అందర్నీ చంపించాడు .. కానీ నేరం

మాత్రం రాణి మహాల్లోని పిశాచం మీదకి నెట్టాడు . బహుసా ఈ విషయం ఆ పిశాచానికి తెలిసుండి ఉంటే ముందర

భూపతి నే అంత మొన్దిన్చేదేమో ... అన్నాడు శివ .

చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు .. మితి మీరకoడి.. అన్నాడు ఆవేశం తో వణికి పోతూ భూపతి ..

అంత  ఆవేశ పడకండి .. భూపతి గారూ .. చెడ్డవాడు ఎన్ని విజయాలైనా పొంది ఉండొచ్చు .. కానీ ఆఖరికి మాత్రం

అతడు పొందే ఓటమి ఎలా ఉంటుందంటే .. అది అతడి విజయాలన్నీ తుడిచి పెట్టేయటమే కాదు .. అతడ్ని

సమూలం గా నాశనం చేస్తుంది .. అంది రచన భూపతి వైపు తీక్షణం గా చూస్తూ ..

నిజమే .. అదే ఇప్పుడు జరగబోతుంది .. రావణ పురం ప్రజలారా ? మామాటలు నిజమని ఓ గొంతు పలక

డానికి సిద్ధం గా ఉంది . ఏ కళ్ళు అయితే భూపతి ప్రతీ పాపానికి ప్రత్యక్ష సాక్షో .. ఏ పాదాలు భూపతి వెంట పాపపు

పంకిలం వైపు సాగాయో .. ఆ పాదాలు ఇప్పుడు రావణ పురం లో ఉన్న రావణా సురుని భాగోతాన్ని

వివరించడానికి మన ముందుకి రాబోతున్నాయి ... అని భూపతి వైపు చూసాడు యశ్వంత్ .

అతడిలో సన్నగా వణుకు మొదలైంది ..

యశ్వంత్ భూపతి వెనుక ఉన్న బాలయ్య వైపు చూసి కనుసైగ చేశాడు ...

అతడు మెల్లిగా ముందుకి వచ్చి భూపతి వైపు చూసి జనం ముందుకి నడిచాడు ...

బాలయ్యా ... సాక్ష్యం చెప్పేది ... మనసులోనే బాధగా మూలిగాడు భూపతి .

మీ అందరికి ముందర క్షమాపణ చెప్పాలె ... నిజం చెబితే మనస్సాంతి ఉంటాది .. నా పెళ్ళాం , బిడ్డలకి మంచి

బతుకు ఉంటాది ... మీ అందరికి తెలుసు .. నేను భూపతి కాడా ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నానో .. ఈ ఊరిలో

నన్ను సూసి భయపడే వోళ్ళే ఎక్కువ .. నాకది తెల్సు .. మనం అందరం భయపడాల్సింది ఆ పైవోడికే ... అని

గట్టిగా ఊపిరి పీల్చుకొని ... ఆ బాబు చెప్పింది నిజం .. ఈ సరస్వతి ని బంధించమని భూపతే సెప్పిండు .. నేను

మరికొందరం బంధించినాం .. వాళ్ళు మీలోనే ఉన్నారు .. బయటకి రండిరా .. అన్నాడు బాలయ్య .

జనం లోంచి ఆ ఇద్దరు ముందుకొచ్చి తల ఒంచుకొని నిలబడ్డారు ..

భూపతి  నిల్చున్న చోటే కూలబడ్డాడు ...

మేమే సరస్వతిని బంధించింది .. ఆ నేరం ఈళ్ల మీద నేట్టేసాం .. రాముడిని చేతబడి చేయించి చంపినం .. వాడు

భూపతి దారికి అడ్డం పడినాడని .. పోలిసోడ్ని .. మన ఊరి ఈరిగాడ్ని .. బలరామయ్య ని ఇలానే మరికొంత మంది

అందర్నీ భూపతి అడ్డు తొలగించుకున్నాడు .. ఈ ఊరికి రాజు తానె కావాలని .. ఊరోళ్ళకి బయట పపంచకం తేలీ

కూడదని .. ఊరి బాగు కోసం ఆలోచించి నొలు అందర్నీ అడ్డు తొలగించేసుకున్నాం .. ఈటన్నిటికీ నేనే సాక్ష్యం ..

ఆ పాపాలలో సగం మూట కట్టుకొన్నది నేనే .. అన్నాడు కన్నీళ్ళ పర్యంత మవుతూ బాలయ్య .

ఇంకా ఉంది 









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

అనుకోని అతిథి



నే తలవని తలపువో .. మది పిలవని పిలుపుపో ..

ఎద గూటికి అతిథి వో .. అనుకోని అతిథి వో ..

ఎదురే చూడని కనులకు ఎదురుగా వచ్చావు ..

ఎదరున్నది ఎడారి కాదాని వాసంతం చూపావు ..

కమ్మని భాష్యం చెప్పావు చెలిమి చలువలోనా

రమ్మని గమ్యం పిలిచేలా నా దారిని మల్లించావు ..

నువ్వు ఎవ్వరో .. తెలియదు .. ఊరు పేరు తెలియదు ..

మనసు ముత్యమని తెలుసు .. నీ నవ్వు వెన్నెలని తెలుసు ..

మరపురాని జ్ఞాపకాలకి ఆలవాలమని తెలుసు ..

కరిగిపోయినా కాలం .. తిరిగిరానిదే .. కానీ ..

ఉండిపోయానే నీకై ఆ చోటనే .. నేనిను కలసిన చోటనే ..

మరిగిపోవు నా మనసుని .. ఆపలేనుగాని ..

శిలను కానులే చెలి..  ఉలి తాకిన శిల్పాన్నే ...

నీ తీయని ఊహల లోకం లో జాగృతమైనది నా కల ..

నా తీరని మోహపు మైకంలో మమేకం అయినది చెలి అలా ..

ఎన్నాళ్ళు గడచినా నను వీడిపోదే .. ఎన్నేళ్ళు వేచినా చెలి జాడ లేదే ..

మది కడలి నే మధియించిన ఎడబాటు విషమేలే .. నీ ప్రేమ అమృత మవులె ...

రాకోయి అనుకోని అతిథీ .. మరల మరల నన్ను మధించ నీ తరమా ...
  



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 3 July 2014

రుధిర సౌధం 186



అవును ... మీ అందరికి నమ్మశక్యం గా లేదా ? కానీ భూపతి గారికి మాత్రం చాలా షాకింగ్ గా ఉంది ... అవునా ?

భూపతి గారూ ... ? అంది రచన .. అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ..

భూపతి కి ఓ క్షణం ఏమి జరుగుతుందో అర్థం కాలేదు .. కానీ మెల్లిగా తేరుకొని .. అమ్మాయ్ సరస్వతీ ..

ఏమయిపోయావ్ ? ఎలా ఉన్నావు ? నీకేం జరగలేదు కదా .. అన్నాడు భూపతి సరస్వతి వైపు చూస్తూ ..

చాలు .. భూపతి గారూ .. ఇంకా మీకు అర్థం కాలేదా ? మీ పతనం దగ్గర పడిందని .. మీరే కదా నన్ను బంధించింది .

నన్ను మీరే బంధించి .. ఆ నేరాన్ని ఈ పట్నం వాళ్ళ మీద వేసేసి .. అటు నా అడ్డు .. ఇటు వీళ్ళ అడ్డు తొలగించు

కోవాలనుకున్నారు .. అంది సరస్వతి .

ఏం మాట్లాడుతున్నావు నువ్వు ? నీ బుర్ర సరిగ్గా పని చేస్తుందా ? గద్దించి ఉరిమి చూశాడు .. భూపతి .

అవును ..ఈ ఊరిజనం ముందు నేను అంతా నిజమే చెబుతున్నాను .. నీ పాపం పండిపోయింది భూపతీ .. అని

జనం వైపు చూసి ... ఇంకా ఎన్నాళ్ళు భరిస్తారు ఈ బానిసత్వం ? మీ అందరికి తెలుసు మనకి అన్నాయం జరుగు

తోందని ... కానీ .. భయం .. భయం .. మిమ్మల్ని మాటాడ నివ్వదు .. మీ ఊరి ఆడ కూతురికి అన్నాయం జరిగింది

అని తెలియగానే మీరంతా ఈ పట్నం వోళ్ళని వేలివేసేసారే .. కానీ అన్నాయం చేసింది ఈ భూపతి .. ఇప్పుడు

ఎవ్వరూ మాటాడరేం? ఆవేశం గా ప్రశ్నించింది సరస్వతి ..

నిజంగా నిన్ను భూపతి గారే బంధించారా ? అన్నాడు జనం లోంచి ఒకడు ..

లేదు .. నేను కాదు .. నాకిప్పుడు అర్థం అయింది .. ఇదంతా నన్ను మీ అందరి ముందు చెడు చేయటానికి ఈ

పట్నం వొళ్ళు ఆడిన నాటకం ఇదంతా .. ఈ సరస్వతి కూడా వాళ్ళతో కుమ్మక్కై ఈ నాటకం ఆడుతోంది .. అన్నాడు

భూపతి ఆందోళన గా ..

వహ్ .. చాలా .. చాలా బావుంది భూపతి .. నువ్వైతే ఇలానే స్పందిస్తావనుకొన్నా .. మార్పెం లేదు .. అని జనం

వైపు తిరిగి .. బహుశా మీలో కూడా ఇలాంటి అనుమానాలే ఉండి ఉండొచ్చు .. వినండి .. మీరు నమ్మలేని మరిన్ని

నిజాలు ఉన్నాయి .. విషయం ఏమిటంటే అవన్నీ కూడా భూపతి పాపపు చిట్టాలే .. అన్నాడు యశ్వంత్ .

జనం అంతా ఆసక్తిగా చూశారు యశ్వంత్ వైపు ..

కొన్ని రోజుల ముందు చని పోయిన రాముడి చావు మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది .. కానీ అది మహల్లో ని

దెయ్యం పని అనుకున్నారు .. అంతేనా ? అని అరిచాడు యశ్వంత్ గట్టిగా ..

అవును .. అయితే ఏం ? అన్నాడు జనం లో ఒకడు ..

కాదు .. రాముడ్ని చంపింది .. మహాల్లోని దెయ్యం కాదు .. మీ ఊరికి దేవుడనుకుంటున్న ఈ రాక్షసుడు భూపతి .

అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. మనం ఈ ఊరి వాళ్ళం కాదు .. మనం చెబితే ఏం నమ్ముతారు ? వీళ్ళ ఊరివాడు చెబితేనే నమ్ముతారు

అన్నాడు శివ .

మేము నమ్మలేం ... ఎలా ఇలా అనగలుగుతున్నారు మీరు ? విస్తు పోయి అన్నాడు ఓ ముదుసలి జనం లోంచి  ..

ఇంకా ఉంది



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 2 July 2014

రుధిర సౌధం 185


ఏంటి ? మళ్ళి మమ్మల్ని అందర్నీ భూపతి ఇంటి ముందుకి రమ్మన్నావు ? ఏంటి విషయం ? అడిగాడు భూపతి

ఇంటి ముందర నిలబడ్డ  జనం లోంచి ఒకడు .

కొద్దిసేపు ఓపిక పట్టన్డయ్యా .. కళ్ళ ముందు కమ్మిన మబ్బులు  విడిపోతాయి .. అన్నాడు తాత .

ఏమిటయ్యా  ...  అందరూ ఇలా కట్ట కట్టుకొని మరీ వచ్చారు ? భూపతి గారితో ఏం మాట్లాడాలని ? అన్నాడు

అప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చిన గుమస్తా శంకరం ...

నేనే రమ్మన్నాను శంకరం గారూ .. అన్నాడు యశ్వంత్ అక్కడికి చేరుకుంటూనే ...

శంకరం తో పాటూ  జనం కూడా ఆశ్చర్యంగా చూసారు యశ్వంత్ వైపు .. శివ వైపు ..

నువ్వా ? ఎంత ధైర్యం మిమ్మల్ని ఊరినుంచి వేలివేసాం ... మర్చిపోయారా ? అన్నాడు శంకరం కళ్ళద్దాలను సరి

చేసుకుంటూ ..

మర్చిపోలేదు శంకరం గారూ .. అందుకే వచ్చాం .. ముందు ఈ ఊరి దేవుడిని .. అదే మీ భూపతి గార్ని ఓసారి

పిలవండి ... అన్నాడు శివ వెటకారంగా ..

పిలుస్తాం .. ఎందుకు పిలవం ? అని లోపలికి వెళ్ళాడు శంకరం ..

ఏంటయ్యా ? మళ్ళి ఈ పంచాయితీ   ... మిమ్మల్ని ఊరినుండి పంపేసాం .. మళ్ళి మళ్ళి ఇలా మీరు ఊరిలోకి

వస్తే ఎలా ? అన్నాడు ఓ పెద్దమనిషి జనం లోంచి .

నిజమే .. కానీ మేము నేరం చేశామని ఒప్పుకోలేదు కదా ... మామీద ఓ నింద ని మోపారు .. అది నిజమా కాదా

అన్నది మీకు తెలియాలి కదా .. భూపతి ని రానివ్వండి .. అన్ని మీకే తెలుస్తాయి .. అన్నాడు యశ్వంత్ .

అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..

ఇంతలో లోపలికి వెళ్ళిన శంకరం ... అయ్యా .. మీరోసారి బయటకి రావాలయ్యా .. అన్నాడు భూపతిని .

ఏం శంకరం ? బయట ఏదో కోలాహలం గా ఉంది ఏం జరిగింది ? అన్నాడు భూపతి .

ఆ పట్నం వాళ్ళు వచ్చారయ్య .. మిమ్మల్ని పిలుస్తున్నారు ... అన్నాడు శంకరం నసిగినట్టుగా ..

వాళ్ళా ? ఎందుకు వచ్చారు ? పద .. వెధవల్ని కడిగిపాడేస్తాను ... అని బయటకి నడిచిన భూపతి ఇంటి ముందు

గుమిగూడిన జనాన్ని చూసి హతాసుడైనాడు ...

వెల్కమ్ భూపతి గారూ .. మీకోసమే వేచి చూస్తున్నాం .. అన్నాడు యశ్వంత్ చిరునవ్వుతో ...

ఏమిటిది ? అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి ? గద్దించి నట్టు అన్నాడు భూపతి ..

నిన్న మీరు మాకు సర్ ప్రైస్ చేశారు .. ఈరోజు మేము మీకు చేస్తున్నాం .. అంతకి మించి ఏం లేదు భూపతీ ..

అన్నాడు శివ .

ఓయ్ .. మర్యాద .. మర్యాదగా మాట్లాడు .. నువ్వు మా ఊరిలో నిలబడి  మాట్లాడు  తున్నావు అది మర్చి పోకు ..

అన్నాడు  భూపతి కోపంగా .

నిజమే .. మర్యాద ఇచ్చిపుచ్చు కోవాలి ... కానీ ఈ సూత్రం నీలాంటి మేక వన్నె పులుల దగ్గర వర్తించదు  భూపతీ ..

అయినా ఆలస్యం చేయకూడదు .. నీ భండారం బయట పెట్టడానికి ... ఎందుకంటే ఇక్కడి వచ్చిన ప్రజలు వాళ్ళ

పనులు మానుకొని వచ్చారు గా ... అన్నాడు యశ్వంత్ .

ఏం మాట్లాడుతున్నారు ? మీరు బయట పెట్టడానికి ఏముందని ? అన్నాడు భూపతి ... కోపంగా

ఉంది భూపతీ .. సరస్వతి .. సరస్వతి కనిపించడం లేదనేగా .. మామీద నింద మోపావు .. ఆ సరస్వతి ని నువ్వే

కిడ్నాప్ చేసావు .. అది నిజం .. ఒప్పుకోక తప్పదు .. అన్నాడు శివ .

పిచ్చి పట్టిందా మీకు ? నేనెందుకు సరస్వతి ని ఇబ్బంది పెడతాను ? మీ పిచ్చి వాగుడిని మా జనం నమ్మరు ..

అన్నాడు భూపతి ..

ఎందుకు నమ్మరు ? నువ్వు చూపించిన సాక్ష్యాలను నమ్మిన ఈ ప్రజలు .. నిజాలని నమ్మరా ? నమ్ముతారు ..

అన్నాడు యశ్వంత్ .

భూపతి గార్ని అంటారేంటి ? ఆయన్ని అలా అనడానికి మీ దగ్గరేం సాక్ష్యం ఉంది ? అన్నాడు జనం లోంచి ఒకడు .

సరస్వతి ... సరస్వతే .. ఉంది .. సాక్ష్యం గా ... అన్న మాటలు విని అందరూ తల పక్కకి తిప్పి చూశారు ..

అక్కడ రచన , సరస్వతి ఇద్దరూ నిలబడి ఉన్నారు ..

అరె .. మన సరస్వతే .. అని జనం అనుకుంటే .. సరస్వతి ని చూసి ...   హతాశుడయ్యాడు భూపతి .

ఇంకా ఉంది   





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది