Powered By Blogger

Tuesday, 5 August 2014

రుధిర సౌధం 214





ఆడది కోరుకున్నవాడిని చేసుకోవడం లోనే తృప్తి ని పొందుతుందని అందువల్లనే ఆమె కోరిక ని తీర్చేందుకే సిద్ధం

అయ్యానని మహారాజు చెప్పిన పిమ్మట వసుంధర వైజయంతి ప్రేమించిన వరుని వివరాలు చెప్పమని కోరింది .

అతడొక విప్లవ వీరుడని.. సామాన్యుడై నప్పటికీ బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా పోరాడుతున్నాడని చెప్పాడు

మహారాజు . వసుంధర సంతసించి అక్క హేమావతి దగ్గరకి వెళ్లి వైజయంతి ప్రేమ విషయం ఆమె తల్లి కి

తెలియజేసింది , అంతట ఒక సామాన్యుడికి తన కుమార్తె నిచ్చి , విధాత్రి కి మాత్రం ఒక యువరాజు నిచ్చి పెళ్లి

చేయాలనుకోవడం హేమావతికి రుచించలేదు .. కుమార్తె కి పరిపరి విధాల చెప్పి చూసింది .. కానీ వైజయంతి

వినలేదు . ఇక లాభం లేదనుకుని హేమావతి తాంత్రిక విద్యలు తెలిసిన తన అన్న బసవరాజు ని రహస్యం గా

పిలిపించి వైజయంతి ప్రేమించిన వాడిని చంపించింది .. బాధతో ఉన్న కుమార్తె కి అది తన తండ్రి చేసిన పనే నని

నమ్మించింది .. ఆమె మనసులో తల్లి , మేనమామ కలిపి విషాన్ని నింపారు .. అనురాగ మూర్తులు గా ఉన్న

అక్క చెల్లెళ్ళను విడదీసారు .. మహారాజు వసుంధర , వసుంధర సంతానాన్ని మాత్రమె ప్రేమిస్తారని అందుకే

వైజయంతి సంతోషాన్ని ఆవిరి చేశారని నమ్మ బలికారు . వైజయంతి అది నమ్మింది ..

మెల్లిగా ఆమె ని చెడు ఆలోచనల బారిన పడవేశారు . రాజ్యం పోయినా .. మహల్ తనకి చెందవలసింది కానీ

వసుంధర కి చెందిందని .. చివరికి తమకి నిలువ నీడ లేకుండా చేయటమే మహారాజు , వసుంధర ల ఉద్దేశ్యమని

ఆమె చెవుల్లో నూరిపోశారు .. దాని ఫలితం గా వైజయంతి మహారాజు ని కలిసి అనిరుద్ధుని తో వివాహం తనకే

జరిపించమని అడిగింది .. కానీ అప్పటికే విధాత్రి ని వలచి ఉన్నాడు అనిరుద్ధుడు గాన అతడు నిన్ను పెళ్లి

చేసుకొనడు .. జరిగింది ఏమైతేనేమి నీకు మంచి సంభంధం చూసి పెండ్లి జరిపిస్తానని చెప్పాడు మహారాజు .

కానీ అందుకు ఒప్పుకొనలేదు వైజయంతి .. అనిరుద్ధుడే తనకి భర్త కావాలని పట్టు పట్టుకు కూర్చుంది ...

మహారాజు చేసేది లేక వధువు ని మార్చే విషయమై అనిరుద్దునితో సంప్రదిస్తే .. విధాత్రే మానసికం గా నా భార్య

అని అందులో మార్పు జరిగేది లేదని అనిరుద్ధుడు తేల్చి చెప్పాడు ..

దానితో వైజయంతి పంతానికి హద్దు లేకుండా పోయింది .. న్యాయం గా ఓడించలేక ఇక లాభం లేదని అన్యాయం

గా యావదాస్తి ని హస్తగతం చేసుకొని అనిరుద్ధుడిని దక్కించుకోవాలనే తలంపు కి వచ్చింది .. ఆ క్షణం లో ..

ఆమె కి తన మేన మామ బసవరాజు సరైన మార్గమని తోచింది .

క్షుద్ర పూజలను ప్రోత్సహించింది .. మహల్ లో ఉన్న వైష్ణవీ మాత పూజ ని విడిచి తాంత్రిక శక్తులను

ఆహ్వానించింది.

రహస్యంగా జరుగుతున్న ఈ పూజలకి బలి కావలసి వస్తే వసుంధర ని బలిచ్చింది ... మహల్

వసుంధర మరణం తో బావురు మంది .. విధాత్రి మాత్రం వైష్ణవీ దేవి ని ఎంతగానో ఆరాదించేది .. తాంత్రిక సక్తులకి

ఆటంకం గా దేవీ పూజలు మారటం తో .. గుడి ని మూయించి వేయాలని పన్నాగం పన్నారు ..

యువరాజు విక్రముడి భార్య ని తదుపరి తమ మాయా శక్తులతో లొంగ దీసుకున్నారు .. ఆమె యువరాజు

చూస్తుండ గానే బిడ్డతో సహా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది .. మహల్ లో జరుగుతున్న అనూహ్య

సంఘటన లకి మహారాజు , యువరాజు , విధాత్రి బిత్తరపోతే వైజయంతి , హేమావతిలు సంతోషం లో

ఓలలాడారు .


ఇంకా ఉంది



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 213



మురారీ .. సత్య ని లోపలికి తీసుకువెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .

రచన , మురారి సత్య ని లోపలికి తీసుకువెళ్ళారు . ఆ తరువాత యశ్వంత్ స్వామీజీ దగ్గరికి వచ్చి స్వామీ ..

సత్య ఆరోగ్యం ఇక నిలకడ మీద ఉన్నట్టేగా .. అన్నాడు యశ్వంత్ .. శివ కూడా యశ్వంత్ పక్క కొచ్చి నిలబడ్డాడు .

ఇక ఆమె ని ఏ క్షుద్ర శక్తీ ఏమీ చేయలేదు .. మీరు ఇక ఆమె కోసం చింతించనవసరం లేదు నాయనా ? అని

అన్నారు.. స్వామీజీ .

చిరునవ్వు తో .. మా మురారి మొహం లో మళ్ళి చిరునవ్వు వచ్చిందంటే అది మీవలనే స్వామీ .. మీకెలా

కృతజ్నతలు  చెప్పాలి .. ? ఓ మాట తోనే తీరిపోయే ఋణం కాదు ఇది స్వామీజీ అన్నాడు శివ .

నిజమే నాయనా .. మన మధ్య ఋణానుబంధాలు .. ఒక మాటతో తీరిపోయేవి కావు .. నువ్వన్నది నిజమే ..

అన్నారు స్వామీజీ ..

మన మధ్యా .. ఆశ్చర్యం గా ఉంది స్వామీజీ .. ఏమంటున్నారు ? అన్నాడు శివ .

చూడు శివా ... మీ నాన్న గారు రక్షణ శాఖ లో పనిచేసేవారు .. అవునా ? అన్నారు స్వామీజీ ..

అవును .. ఆ విషయo మీకెలా తెలుసు ? ఆశ్చర్యం గా అడిగాడు శివ .

స్వామీజీ చిరునవ్వుతో .. మీ తాత గారు కూడా రక్షణ శాఖ లోనే ఉండేవారు .. అంతేనా నీకు తెలిసింది ...

అన్నారు స్వామీజీ ..

ఆశ్చర్యం .. వ్యక్తీకరించారు యశ్వంత్ ,శివ .

కానీ మీకు తెలియంది ఒకటుంది .. మీ తాత గారి తాత  గారు ఈ   ఒకప్పుడు ఈ కోట కి సంరక్షకుడుగా ఉండేవారు .

అది నీకు  తెలియదు .. కర్తవ్యమ్ పాటిస్తూనే ఆయన మరణించారు .. ఆంగ్లేయుల దాడి లో ఊరవతల ఉన్న కోట

నాశనమై పోయింది .. ఆంగ్లేయులు మీ తాత గార్ని పొట్టన పెట్టుకున్నారు .. చనిపోయేటప్పుడు రాచ కోటకి రక్షణ

కల్పించ లేక పోయానన్న అసంతృప్తి .. అతడిలో మిగిలిపోయింది .. దాని ఫలితమే  ఈనాడు ఈ కోట ని సంరక్షణ

కల్పించ డానికి నువ్వు వెతుక్కుంటూ వచ్చావు .. ఆయన ఆసంతృప్తి ... ఇప్పటి నీ జన్మ..  బాధ్యత .. అన్నారు

స్వామీజీ ..

మాట రాక మౌనం గా ఉండిపోయాడు శివ .

స్వామీజీ మరి నేను .. నేనెలా ఇక్కడికి రాబడ్డాను . మాకు విధాత్రి కూడా చెప్పింది .. మేమీ కార్యానికి ఎంచుకో

బడ్డామని .. మీ మాటల బట్టి .. శివ ఎందుకు ఎంచుకోబడ్డాడో అర్థమైంది ... అన్నాడు యశ్వంత్ ఆత్రుత గా .

అతడు చిరునవ్వు తో .. నీ జన్మ రహస్యం తెలుసుకోవాలని యోచిస్తున్నావా ? సరే విను .. విధాత్రి మొదట నీకే

ఎందుకు కన బడిందో తెలుసా ? నీవు పునర్జన్మ ఎత్తిన వాడవు కనుక .. అన్నారు స్వామీజీ .

స్వామీ .. అంటే .. అన్నాడు యశ్వంత్ అయోమయం గా ..

అతడు చిన్నగా నవ్వి .. విధాత్రి కి పొరుగు రాజ్యమైన విజయ నగరం యువరాజు తో సంభంధం నిశ్చయించారు . ఆ

యువరాజు అనిరుద్ధుడు .. మైత్రీ సంభందాలతో పాటు సంభంధం కూడా ఏర్పరచుకుంటే రాజ్యం మళ్ళి పఠిస్టం

అవుతుందని  మహారాజు భావించారు .

అనిరుద్ధుడు కూడా విధాత్రి అందానికి ముగ్ధుడై ఆమె నే వరించాలని  నిర్ణయించుకున్నాడు కూడా . కానీ పెద్ద

కుమార్తె వైజయంతి ని అలక్ష్యం చేయడం హేమావతి భరించలేక పోయింది .

చిన్నరాణి వసుంధర ని నానా మాటలంది . దానితో వసుంధర ముందు వైజయంతి కె మనువు చేయమని మహా

రాజుకి విన్నవించుకొన్నది . వసుంధర మాటల వెనుక ఆంతర్యం గ్రహించిన మహారాజు వసుంధర తో అప్పటికే

వైజయంతి వలపు బాట లో పయనిస్తున్నదని ఆ మాట తనతో విన్నవించిందని చెప్పారు మహారాజు .

ఇంకా ఉంది










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 4 August 2014

రుధిర సౌధం212



ఆమె అరవడం మానేసి నీరసం గా ముగ్గు మధ్యలో పడిపోయింది .. స్వామీజీ ఆమె చెంతకి వెళ్లి ఆమె చేయి ని

అందుకొని రక్షాదారాన్ని కట్టారు .. తరువాత .. మురారి వైపు చూసి .. రా నాయనా .. వచ్చి ఆమె మొహం మీద

కొంచెం ఈ నీటిని చల్లు .. రా .. అని పిలిచారు .

అయోమయంగా సత్య ని , స్వామీజీ ని చూస్తూ అతను అందించిన నీటిని తీసుకుని సత్య దగ్గరకి వెళ్లి ఆమె ని తన

ఒడిలోకి తీసుకొని ఆమె మొహం పై నీటిని చిలకరించాడు .. నీళ్ళు పడగానే తుళ్ళి పడి .. మెల్లిగా కళ్ళు తెరచి

చూసింది సత్య .. కళ్ళు తెరవగానే తనవైపే ఆశగా చూస్తున్న మురారీ ని చూసి .. నీరసం గా .. మురారీ .. అంది

సత్య .. ఆమె అలా అనగానే .. సత్యా .. లవ్ యు .. అంటూ ఆమె ని తన గుండెలకి హత్తు కున్నాడు మురారి .

యశ్ .. అంటూ ఆనందం గా శివ యశ్ ని హత్తుకున్నాడు .. చెమర్చిన కళ్ళతో యశ్ కుడా శివ ని హాగ్

చేసుకున్నాడు ..

రచన కళ్ళు ఆనంద భాస్పాలను వర్షిస్తున్నాయి ..

ధాత్రమ్మా .. సత్యమ్మకి బాగై పోయింది .. బాగైపొయిన్దమ్మా అంది సంతోషం గా సరస్వతి .

రచన మెల్లగా తల ఊపి స్వామీజీ వైపు నడచి అతని పాదాలకి నమస్కరించింది .. స్వామీజీ .. మీరు .. మీరు

సత్య కి పునర్జన్మ ప్రసాదించారు .. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో .. అని మాట బరువెక్కి ఆగిపోయింది రచన .

అతడు చిరునవ్వు నవ్వి .. సత్య , మురారిల వైపు చూసారు .. సత్య ని గట్టిగా గుండెలకి హత్తుకునే కన్నీళ్ళతో

నమస్కరించాడు మురారి .. అతని కళ్ళలో భావం స్వామీజికి ప్రస్ఫుటం గా అర్థమైంది .. నవ్వుతు తల ఊపారు

రమణానంద మహర్షి ..

తరువాత రచన వైపు తిరిగి .. కన్నీళ్లు తుడుచుకుంటున్న ఆమె ని చూసి .. చిన్నారీ .. ఇంకెందుకు బాధ .. నీ

స్నేహితురాలికి నయమై పోయింది .. కొంచెం నీరసం గా ఉంటుంది అంతే .. రెండు రోజుల్లో కోలుకుంటుంది ..

డాక్టర్ కి చూపిస్తే సరి .. అన్నారు నవ్వుతూ స్వామీజీ .

కానీ స్వామీజీ .. ఈ ఊరిలో డాక్టర్ లు ఎవ్వరూ లేరు .. అంది రచన .

రేపు ఉదయానికి వస్తాడులే డాక్టర్ .. చూస్తాడు .. మందులు ఇస్తాడు .. సరేనా ? అన్నారు స్వామీజీ ..

ఆశ్చర్యంగా చూస్తున్న రచన ని చూసి .. రేపు గోపాలం ఇక్కడికి చేరుకుంటాడు ,.. తనకి బస ఏర్పాటు చేయు

తల్లీ .. అన్నారు స్వామీజీ .

గోపాల స్వామీ కూడా వస్తున్నారా ? చాలా సంతోషం స్వామీ .. అంది రచన .

వెళ్ళు .. వెళ్లి నిద్రపో .. తల్లీ ఉదయాన్నే లేవాల్సి ఉంటుంది .. నీవు ఉదయాన్నే 5 గం కి గుడి ద్వారం తెరవవలసి

ఉంది .. రేపు చంద్ర కాంతులు వికసిస్తున్న వేళలో గుడిలో దీపాలు పెట్టవలసి ఉంటుంది .. అన్నారు స్వామీజీ .


ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 2 August 2014

రుధిర సౌధం 211




హోమగుండం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్చరిస్తున్నారు రమణానంద మహర్షి .

ఎదురుగా హోమగుండం కి ఇంకో వైపు న పెద్ద ముగ్గు వేసి ఉంది .. ఆ ముగ్గు చుట్టూ మట్టి కుండలు పెట్టి వాటిలో

దీపాలు పెట్టి ఉన్నాయి ...

యశ్వంత్ , శివ వెళ్లి ఓ పక్క గా నిల్చున్నారు .. శివ ఆ ఏర్పాట్లన్నీ విచిత్రం గా చూస్తున్నాడు ..

యశ్ .. ఇదంతా నమ్మటానికే ఆశ్చర్యంగా లేదూ .. ఇవన్నీ మూఢ నమ్మకాలని కొట్టి పడేసేవాళ్ళం .. బట్ నౌ

వుయ్ ఆర్ ఏక్సేప్టింగ్ ఆల్ థిస్ .. అన్నాడు శివ .. ఆశ్చర్యం గా చూస్తూ ..

మనిషి ఎంత తెలివైన వాడైనా ఆ మనిషి ని సృష్టించిన వాడు ఇంకా తెలివైన వాడని మర్చి పోకూడదు కదా శివా ..

అన్నాడు యశ్వంత్ .

మెల్లిగా మహర్షి కళ్ళు తెరచి .. యశ్వంత్ వైపు చూశారు .. వెళ్లి అమ్మాయి ని తీసుకురండి .. అన్నారు ..

అలాగే స్వామీ .. అని ముందుకి కదల బోతూ .. ఆలోపే అక్కడికి సత్య ని తీసుకు వస్తున్న రచన , మురారిలను

చూసి ఆగిపోయాడు యశ్వంత్ .

స్వామీజీ కూడా వారిని చూసి .. అమ్మాయి ని ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెట్టండి అన్నారు ..

మురారి ,రచన ఇద్దరూ సత్య ని ముగ్గు మధ్యలో కూర్చో బెట్టి ఓ పక్కగా నిల్చున్నారు .. సరస్వతి కూడా అంత

వరకూ ఏదో పనిలో రచన కి సాయపడిందేమో .. వచ్చి రచన పక్కగా నిలుచుంది .

రచనా .. ఇలా వచ్చి అమ్మాయి మీద ఈ కమండలం లోని ద్రవాన్ని చల్లు తల్లీ .. అన్నారు మహర్షి .

రచన ఆయన చేతిలోని కమండలం తీసుకొని అందు  లోని ద్రవం సత్య మీద చల్లింది ..

అచేతనావస్థ లో ఉన్న ఆమె లో ఒక్కసారిగా చలనం కలిగింది .. తన తల పట్టుకొని అమ్మా అని పిచ్చిదానిలా

అరచింది ..

ఆమె అలా బాధ గా అరవగానే .. సత్యా .. అంటూ ఆమె వైపు రాబోయిన మురారి ని చేతితోనే వారించారు మహర్షి

నిస్సహాయంగా ఆమె వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు మురారి .. యశ్వంత్ , శివ మురారి దగ్గర కొచ్చి

ధైర్యంగా ఉండు మురారీ .. అన్నారు ..

మహర్షి మళ్లి కళ్ళు మూసుకొని మంత్రాలు జపించసాగారు .

సత్య బాధగా అరుస్తుంది .. రచన , సరస్వతి , యశ్ , శివ , మురారి ఆమె వైపు ఆవేదన గా చూస్తూ ఉన్నారు .

దాదాపు 30 నిమిషాల తరువాత స్వామీజీ కనులు తెరచి ఓ రక్షాదారాన్ని మంత్రించి తానున్న స్థానం నుంచి

లేచి సత్య ఉన్న ముగ్గు చుట్టూరా ఆ దారాన్ని ఓ గీత లా గుండ్రం గా వేస్తూ వచ్చారు .. ఆ దారం గుండ్రం గా

ముగ్గు చుట్టూ వేసాక కమండలం లోని నీటిని దానిపై చల్లగానే ఆ దారం చుట్టూ మంటలు రేగాయి ..

సత్యా .. అంటూ ఆందోళన గా అరిచాడు మురారి .

మహర్షి మురారి వైపు చూసి .. చింతించకు  నాయనా .. ఆమె చుట్టూ ఉన్న భూతావరణం ఈ మంటల్లో మాడి

మసై పోతుంది .. అన్నారు .

చిత్రం గా కాసేపట్లో మంటలు ఆరిపోయి సత్య వదనం లో ప్రశాంతత అగుపించింది

ఇంకా ఉంది









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 1 August 2014

రుధిర సౌధం 210


ఇప్పుడు చెప్పు .. ఏం జరిగింది ? నీ మనసులో ఏదో ఆందోళన ఉంది .. అది గ్రహించలేనంత పిచ్చి వాళ్ళం కాము

మేము .. అది నీకూ తెలుసు .. అన్నాడు శివ ..

శివా .. అసలు .. అని యశ్ ఏదో చెప్పబోతుండగా అక్కడికి రచన వచ్చింది ..

మీ ఇద్దరూ ఇక్కడ ఉన్నారా ? స్వామీజీ పూజ కి అన్ని సిద్ధం చేశారు .. సత్య ని స్నానం చేపించి బట్టలు మార్చి

తెమ్మన్నారు.. మురారి సత్య దగ్గర ఉన్నాడా ? అని అడిగింది ఆమె .

హ . నువ్వెళ్ళు .. మేము స్వామీజీ దగ్గరకి వెళ్తాం .. అన్నాడు యశ్వంత్ .

సరే .. అయితే .. నేను సత్య ని సిద్ధం చేసి తీసుకొస్తాను .. అన్నట్టు పూజ దగ్గర సరస్వతి ఉంది .. తనని ఓసారి

ఇక్కడకి రమ్మని చెప్పండి .. సత్య ని సిద్ధం చేయడం లో నాకు సహాయం చేస్తుంది కదా .. అంది రచన .

సరే రచనా .. అని ముందుకి కదిలారు ఇద్దరూ .. రచన సత్య గది వైపు నడిచింది ..

చెప్పు యశ్ .. నువ్వు చెప్పేదాకా ఇక్కడ్నుంచి మేము కదిలేది లేదు .. కష్టమో , నష్టమో కలసి అనుభవించడమే

అన్నాడు శివ నడుస్తూనే ..

నువ్వు మొండివాడివి శివా .. నేను సత్యాలా మరెవరికి ఏ ప్రాబ్లం రాకూడదు ..అందువల్లే శివా .. అన్నాడు

యశ్.

ఏదో ఒకటి లేకుండా ఉండదని తెల్సు .. బట్ నువ్వు మాతో చెప్పాలను కోవటం లేదు యశ్ అన్నాడు శివ

బాధగా  .

సరేరా .. చెప్తున్నా .. నీ మనసులో ఉంచుకో .. రచన కి అస్సలు తెలియ కూడదు .. మీరు సత్య కోసం వెళ్లి

నప్పుడు స్వామీజీ నాతొ మాట్లాడారు .. ఆయన మాటల్ని బట్టి  మనం ఇంకేదో విపత్కర పరిస్థితి ని

ఎదురుకోవాల్సి ఉంటుందని .. అర్థమైంది .. అది చాల భయానకం గా ఉండొచ్చు .. ఎందుకంటే వైజయంతి

బంధింపబడింది తప్ప .. అంతం చేయబడలేదు .. కాబట్టి సమస్య తీవ్రం గా ఉంటుందేమో శివా .. అన్నాడు యశ్ .

ఓహ్  ఓహ్ ..   యష్ .. మనం  ఇంకా పోరాటం చెయ్యాల్సి ఉంటుంది అంతే కదా .. నువ్వుదీనికే   ఇలా

అయిపోతే ఎలా యశ్వంత్ ? ఇంత ఆనందం లోనూ ఓ ప్రాబ్లం రానుందని మనకి విధాత్రి ముందే చెప్పింది .. కానీ

అంతిమ విజయం మనదే అని కూడా చెప్పింది కదా .. మనం మంచి పని చేస్తున్నాం యశ్వంత్ .. ఆటంకాలు

ఎదురైనా ఆ అమ్మవారి అనుగ్రహం మనకి ఉంది .. నువ్వు ఆ విషయం ఎలా మర్చిపోయావు ? అన్నాడు శివ

స్థిరంగా ..

యష్ పెదవులపై చిరునవ్వు విరిసింది .. ప్రతీ ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ ఉండాలి శివా అన్నాడు మనస్ఫూర్తిగా .

అవునా ? అలా అయితే నవ్వెయ్ మరి అన్నాడు శివ .

               ఇంకా ఉంది

     



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 31 July 2014

రుధిర సౌధం 209


యశ్వంత్ మనసు కకావికలం గా ఉంది .. అతడలా లాన్ లోనే నిరాసక్తం గా ఉండి పోయాడు .. ఏం జరగబోతుంది ?

అన్న మానసిక ఆందోళన అతని మొహం లో కదలాడుతుంది .. ఇంతలో వెహికల్ హార్న్ వినిపించి గేటు వైపు

చూశాడు ..

శివ, మురారిలు సత్య ని తీసుకువచ్చినట్లు ఉన్నారే   ... అని అటు  నడిచాడు.. యశ్ .

రచన కి వెహికల్ సౌండ్ వినిపించిందేమో ... తానూ పరుగు పరుగున వెహికల్ దగ్గరికి వచ్చింది ....

అందరూ కలసి సత్య ని వెహికల్ నుండి దించి మహల్లో ముందుగానే సిద్ధం చేసి ఉంచిన గది లోనికి తీసుకు

వచ్చారు. మెత్తని పరుపు మీద ఆమె ని పరుండ బెట్టారు .

మీరంతా ఇక్కడే ఉండండి .. నేను వెళ్లి స్వామీజీ కి చెప్పి వస్తాను అని ఆ గది లోంచి బయట కి నడిచింది ... రచన .

యశ్ .. నా సత్య మళ్ళి మామూలు అయిపోతుంది కదా .. ఆశ గా అడిగాడు మురారి ...

అవును మురారీ .. బట్ సత్య కి బాగవగానే .. నువ్వు వెంటనే ఇక్కడ నుండి సత్య ని పట్టుకొని వెళ్ళిపో ... అన్నాడు

యశ్వంత్ .

యశ్ .. ఏమిటలా అంటున్నావు ? ఏమయ్యింది ? ఆందోళన గా అడిగారు మురారి , శివ .

శివా .. వీలుంటే నువ్వు కూడా .. అన్నాడు యశ్వంత్ .

మురారి , శివా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..

కానీ ..  ఏం జరిగింది ? ఇప్పుడు అంతా ప్రశాంతం గా ఉన్న సమయం లో మనం ఒకరిఒకరు ఆనందం లో కూడా

తోడు ఉండాలి కదా .. అన్నాడు శివ కాసింత చిరాగ్గా .

యశ్ ... నేను రేపు ముంబై తిరిగి వెళ్ళిపోతానని అన్నానని నీకు కోపం వచ్చిందా ? ఏదో .. అప్పుడు సత్య గురించి

ఉన్న కంగారులో నేనా నిర్ణయం తీసుకున్నాను .. బట్ ఇప్పుడు సత్య కి బాగైపోతుంది .. ఇంకా నేను ఆందోళన

పడను.. యశ్ .. ప్లీజ్ .. అన్నాడు మురారి .

లేదు మురారీ .. నేను అలా ఆలోచించలేదు .. పరిస్తితులంతా సర్దుకున్నాక మళ్ళి వద్దురు గానీ .. అన్నాడు యశ్ .

ఏమన్నావ్ యశ్ ? పరిస్తితులంతా సర్దుకున్నాక .. అంటే ఇంకా సర్డుకోలేదని నీ ఉద్దేశ్యమా ? ఎందుకో ఆందోళన

గా ఉన్నావు యశ్ .. చెప్పు ఏం జరిగింది ? అన్నాడు శివ  అనునయం గా ..

అరె .. నేను చెబుతుంటే మీకు అర్థం కావటం లేదా ? కోపం గా గట్టిగా అరిచాడు యశ్వంత్ .

అతని అరుపు కి నిద్రలో ఉన్న సత్య   ఉలిక్కి పడింది ..

మురారి యశ్వంత్ వైపు సంభ్రమం గా చూసాడు ..

యశ్ ముందు బయటికి పద .. అని యశ్వంత్ భుజం మీద చేయి వేసి .. మురారి వైపు చూసి .. సత్య ని నువ్వు

చూసుకో మురారీ .. అని గది బయట కి నడిచాడు శివ , యష్ తో పాటూ ..


    ఇంకా ఉంది

  

   




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 30 July 2014

రుధిర సౌధం 208

మురారిని లేపి .. వెళ్ళు నాయనా .. వెళ్లి తీసుకురా ..  బిడ్డ ఆడుతూ పాడుతూ తిరుగుతుంది .. అన్నారు స్వామీజీ .
లెట్స్ గో మురారీ త్వరగా వెళ్లి సత్య ని తీసుకొద్దాం .. ఆయన నయం చేస్తారు తనని .. అన్నాడు శివ ఆత్రుతగా .

కళ్ళు తుడుచుకుని .. ఆశీర్వదించండి స్వామీ .. నేను నా సత్య ని తీసుకొస్తాను .. అన్నాడు మురారి ..

మనోవాంచా ఫల సిద్ధి రస్తు .. అని దీవించారు స్వామీజీ ..

వేల్లోస్తాను స్వామీ .. అని వెహికల్ వైపు పరుగు తీశారు శివ , మురారి .

చిరునవ్వుతో అంతా చూస్తున్న రచన .. థాంక్ యు .. థాంక్ యు స్వామీజీ .. అంది చెమర్చిన కళ్ళతో ..

రచనా .. నేనిచ్చిన తాయెత్తు ని పోగొట్టుకున్నావు కదూ .. అన్నారు స్వామీజీ ఆమె వైపు సూటిగా చూస్తూ ..

అవును స్వామీజీ .. మీకంతా తెల్సు .. నేను వివరించి చెప్పేదేముంది ? అంది రచన నిరాశగా ..


ఆ తల్లి ఆశీర్వాదం నీకు ఉంది .. ఆందోళన తగదు .. నిండు మనసు తో ఈ కార్యాన్ని నువ్వు  చేయవలసి

ఉంటుంది .. మనోనిబ్బరం తో ఇంతవరకూ వచ్చిన నువ్వు నీ మనసులో ఆందోళన కి ఎందుకు తావిస్తున్నావు ?

అన్నారు స్వామీజీ .

ఓహ్ గాడ్ .. ఇన్ని విషయాలు ఈయన కెలా తెలిసాయి .. వీటినే దివ్య శక్తులంటారేమో.. అనుకున్నాడు యశ్వంత్

మనసులో ..

స్వామీజీ .. మీరెందుకిలా చెబుతున్నారో నాకు అర్థం అయింది .. మరోసారి ఇలా జరగదు స్వామీజీ .. అంది రచన .

సరే ,,,వెళ్ళు .. నాకోసం తగిన ఏర్పాట్లు చెయ్ .. స్నానం చేసి పూజ కానివ్వాలి .. అన్నారు స్వామీజీ .

అలాగే స్వామీజీ .. అని యశ్వంత్ వైపు చూసి .. నువ్వు స్వామీజీ తో ఉండు యశ్వంత్ .. అంది రచన .

రచన అలా వెళ్ళాక .. ఒక్కసారిగా యశ్వంత్ చేతిని తన చేతిలోకి తీసుకొని మంత్రం జపిస్తూ అతడి చేతికి ఒక

రక్షా దారాన్ని కట్టారు స్వామీజీ ..

అవాక్కై .. ఏంటిది స్వామీజీ .. అన్నాడు యశ్వంత్ ..

చూడు నాయనా .. చుట్టూ ఉన్న పరిస్తితులు అనుకూలంగా కనబడుతున్నాయి .. కేవలం కనబడుతున్నాయి ..

అంతే .. దానర్థం అనుకూలం గా ఉన్నాయని కాదు .. అసలు పోరాటం మిగిలేఉంది .. సమస్య ని పూర్తిగా

పరిష్కరించాలి .. దానర్థం .. అంతం .. ఏదైనా సమస్య ని అంతం చేయాలి తప్ప .. దాన్ని కప్పిపెట్టి సమస్య

పరిష్కారమయిందని భావిస్తే అది మూర్ఖత్వమవుతుంది .. పోరాటం నువ్వు చేయాలి .. అందుకు నీకు బాసట గా

అమ్మవారి రక్షణ .. ఇది అమ్మవారి రక్షణ .. అన్నారు స్వామీజీ ..

అంటే ... అన్నాడు యశ్వంత్   ఆశ్చర్యంగా ..

సమస్య పరిష్కారం కాలేదు నాయనా .. ఈ ప్రశాంతత భగ్నం కాకుండా సమస్యని పరిష్కరించు .. అందుకు నీకు

తోడుగా నేను ఉంటాను .. పరిశుద్ధుడను అయిన పిదప పూజలో కూర్చుంటాను .. నువ్వు అప్రమత్తం గా ఉండు ..

ఇది తుఫాను ముందు ప్రశాంతత .. అన్నారు స్వామీజీ .

యశ్వంత్ కి కాళ్ళ కింద భూమి కదులు తున్నట్లు అనిపించింది ..

కలవరపడకు అన్ని  సవ్యం గా జరుగుతాయి .. పౌర్ణమి చంద్రుని మబ్బులు ఎంతసేపు కప్పి ఉంచగలవు ? మనసు

లో ధైర్యం మనకి ముందుకి నడిపిస్తుంది .. నువ్వు ముందుకి నడవక తప్పదు నాయనా .. అన్నారు

స్వా మీజీ రమణానంద .

అర్థమైంది స్వామీ .. నేను అప్రమత్తంగానే ఉంటాను .. మీరు దగ్గరుండి ఈ కార్యం నిర్వర్తించండి .. అన్నాడు

యశ్వంత్ స్థిరంగా ..           
                                       ******************************
ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 29 July 2014

రుధిర సౌధం 207

లే తల్లీ .. అని ఆప్యాయంగా ఆమె ని లేవదీసారు స్వామీజీ .

నాకిప్పుడు అర్థం అవుతుంది .. భగవంతుడి లీల ఎలా ఉంటుందో .. నా మనసు లో అనుకుంటూనే ఉన్నా ..

మీరు ఇక్కడ ఉంటె బావుండునని .. నా మనసు లోని మాటలు మీకు వినబడ్డాయా ? చిప్పిల్లిన కళ్ళతో అంది

రచన .

అతడు చిన్నగా నవ్వి .. అంతా ముందే నిర్ణయింప బడి ఉంటుందని నీకెప్పుడు చెబుతూ ఉంటా కదా తల్లీ .. మరి

సందేహమెందుకు ?నువ్వు విజయం సాధించగలవని నేను ముందే చెప్పానుగా .. అయినా నీవలనే నాకూ కొన్ని

బాధ్యతలు ఉన్నాయి .. అవే ఈనాడు నేనిక్కడ ఉండటానికి కారణం .. అన్నారు స్వామీజీ ..

దూరం నుండి వీరిని చూస్తున్న శివ .. యశ్ .. ఎవరాయన ? అని అడిగాడు ..

యశ్వంత్ చిరునవ్వుతో అన్నాడు .. మురారీ .. నీ సమస్య కి సమాధానం దొరికి పోయింది .. అని....

ఏమంటున్నావు యశ్వంత్ ? అన్నాడు మురారి .

కొన్ని నిమిషాల క్రితం మన మధ్యన నలిగిన సమస్య .. సత్య .. తన ఆరోగ్యం .. ఒక దివ్య పురుషుడు  కావాలి

తనని నయం చేయటానికి .. అతడే యితడు .. ఇది ఆ వైష్ణవీ మాత కృప కాక మరేంటి ? అన్నాడు యశ్వంత్ .

ఇతడా ? నాకు నమ్మకం లేదు .. యశ్ .. అన్నాడు మురారి .

లేదు మురారీ .. ముందు అతడిని పలకరిద్దాం పదండి .. అని ముందుకు కదిలాడు యశ్వంత్ ..

పద మురారీ .. వాదనలకి ఇది సమయం కాదు .. పద .. అన్నాడు శివ . ఆ ఇరువురూ యశ్ ని అనుసరించారు .

అమ్మ .. అమ్మ ఎలా ఉంది స్వామీజీ ? నాది అత్యాశ అయిపోతుందేమో .. తను కూడా ఇక్కడ ఉంటె బావున్నని

పించింది .. అంటుంది రచన వీరు ముగ్గురూ వారిని చేరుకునే సరికి ..

స్వామీజీ చిరునవ్వు తో .. నాయన లారా ఎలా ఉన్నారు ? మీ ధైర్యం ,రక్షణ ఈనాడు ఈ విజయానికి బాసట గా

నిలిచాయి .. అన్నరు  చిరునవ్వుతో స్వామీజీ ..

ఆ ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .. తదుపరి .. యశ్వంత్ ముందుకి వచ్చి ఆశీర్వదించండి

స్వామీజీ .. అని వంగి అతడి పాదాలకి నమస్కరించాడు ..

శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు .. అన్నారు స్వామీజీ ..

అతడి వైపు చిరునవ్వుతో చూసి నేను మీకోసం చాల విన్నాను .. కానీ ఇదే మొదటి సారి చూడటం .. సంతోషం గా

ఉంది మిమ్మల్ని కలవటం .. అన్నాడు యశ్వంత్ .

ఈనాడు మనం ఇక్కడ కలవటం అనేది విధి లిఖితం నాయనా .. అన్నారు స్వామీజీ .. తర్వాత తన వైపే విచిత్రంగా

చూస్తున్న మురారి ని చూసి .. నాయనా .. మనసు వికలమై ఉన్నావు .. నువ్వు ఎదురు చూస్తున్న పరిష్కారం

నేనే .. వెళ్లి ఆమె ని తీసుకురా .. రేపు ఉదయానికి ఆమె మీతో పాటూ నవ్వుతూ తిరగాలిగా .. అన్నారు స్వామీజీ .

మురారి ఆశ్చర్యంగా చూసాడు .. అతడే కాదు .. రచన తో పాటు యశ్వంత్ , శివ కూడా విస్తుపోయారు ..

అలా చూస్తావేం నాయనా .. వెళ్ళు .. భూతరేఖ ని చేదించి ఆమె కి విముక్తి ప్రసాదిస్తాను .. అన్నారు స్వామీజీ .

స్వామీజీ .. అంటూ అతడి కాళ్ళ పై పడి కన్నీళ్ళతో అతడి కాళ్ళని అభిషేకించాడు మురారి ..

స్వామీజీ .. సత్య ని మీరే నయం చేయగలరు .. ఇదంతా అమ్మవారి లీల .. అర్థం అవుతుంది స్వామీ .. అన్నాడు

యశ్వంత్ చెమర్చిన కళ్ళతో ..

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 28 July 2014

రుధిర సౌధం 206

సత్య ని ముంబై లో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తే బావుంటుంది శివా ? సాలోచన గా అడిగాడు మురారి .

డాక్టర్ లు నయం చేయగలరంటావా మురారీ ? ఇలాంటి సమస్యలు మన సైన్స్ లో కొత్త పేర్లు పెట్టుకోడానికే..

ఆయుర్వేద చికిత్స అయితే బెటర్ అని పిస్తుంది .. అన్నాడు శివ .

తను ఇక్కడ కి రాకుండా ముంబై లోనే ఉండుంటే బావుండేది శివా .. నన్నొదిలి ఉండలేక వచ్చేసింది .. అని

ఇంకేదో మురారీ చెప్పబోతుండగా ..

మురారీ .. యశ్ , రచన వస్తున్నారు .. అన్నాడు శివ మహల్ ద్వారం వైపు చూస్తూ ..

వెనక్కి తిరిగి .. వాళ్ళని చూసి .. చిరునవ్వు తో హౌ ఆర్ యు రచనా .. అన్నాడు మురారి .



మురారి వైపు చిరునవ్వుతో చూసి .. అదేంటి అలా అడుగుతున్నావు ? ఉదయమే కదా మనం కలిసింది .. అంది

రచన అక్కడ ఉన్న చైర్ లో తానూ కూర్చుంటూ .. యశ్వంత్ కూడా ఆమె పక్కన కూర్చున్నాడు ..

నువ్వు డల్ గా ఉన్నావని తెలిసింది లే .. అందుకే .. బట్ నువ్విప్పుడు నాకు డల్ గా కనిపించటం లేదు ..

అన్నాడు మురారి .

సత్య ఎలా ఉంది ? ఏమైనా తిన్నదా లేదా ? అయినా తననిక్కడ కి తీసుకోచ్చేయాల్సింది మురారీ .. నేను మనం

ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను ఇక్కడ .. అంది రచన .

రచనా .. తనని అక్కడనుంచి కదప బుద్ధి కాలేదు .. సరస్వతి తనని ఎంతో బాగా చూసుకుంటుంది .. అందుకే

నేను అక్కడే ఉంచేసి వచ్చా .. మనం ఏదో పనిలో ఉండాల్సి వస్తుంది ఇక్కడ .. తనని చూసుకోవటం కుదరక

పోవొచ్చు కదా .. అన్నాడు మురారి .

నువ్వన్నది నిజమే .. తానిప్పుడు అక్కడ ఉండటమే బెటర్ లే .. అంది రచన బాధగా .

నువ్వు చెప్పు రచనా .. అసలు .. అసలు సత్య పరిస్థితి ఏంటి ? నాకేం అర్థం కావటం లేదు .. అన్నాడు మురారి .

శివ , యశ్వంత్ లు.. ఇద్దరూ కూడా ఆమె వైపు ఆసక్తిగా చూశారు .

ఆమె మెల్లిగా లేచి చిన్నగా నిట్టూర్చి .. నేను కోట చేరుకునే సరికి సత్య వైజయంతి గీసిన భూత రేఖ లో

బంధింపబడి ఉంది .. నేను ఆమె ని సమీపించ లేక పోయాను .. మురారీ .. కానీ దైవం మన వైపు ఉండటమో

ఏమో సమయానికి అనుకోకుండా అక్కడికి వీరాస్వామి రావటం అతను మనకి సహాయం చేయటం జరిగింది ..

అతను సత్య ని ఆ వలయం నుండి కాపాడాడు .. కానీ తనని పూర్తిగా నయం చేయలేనని చెప్పాడు .. సత్య

కి నయం కావాలంటే దివ్య శక్తులు ఉండాలన్నాడు .. ఓ పుణ్య పురుషుడై ఉండాలన్నాడు .. కానీ అటువంటి

వారు ఎవరు .. ఏమిటి అన్నదే మనం ఆలోచించాలి .. ఆ దివ్య పురుషుడు ఎవరై ఉంటారో .. అంటూ గేటు వైపు

చూసిన ఆమె ఆశ్చర్యం తో కళ్ళు పెద్దవి చేసి చూసింది ..

రచన అలా సడన్ గా మాట్లాడుతూ ఆగిపోవటం చూసి ఆమె వైపు చూసిన ఆ ముగ్గురు స్నేహితులు ఆమె

కళ్ళలో   ఆశ్చర్యాన్ని గమనించి ఆమె చూస్తున్న వైపు చూశారు ..

స్వా మీ.. జీ ...    అసంకల్పితం గా రచన పెదవులు ఉచ్చారించాయి ..

ఈయన .. రమనానంద మహర్షి .. ఇక్కడ .. ఆశ్చర్యం గా ఉందే .. అన్నాడు యశ్వంత్ ..

ఆయన ఎవరో మీకు తెలుసా ? అడిగాడు మురారి ఆయన ముఖ వర్చస్సు కి ఆశ్చర్య పడుతూ ..

ఇంతలో అమాంతంగా పరుగుతీసి అతడిని చేరుకొని అతడి పాదాలపై పడి నమస్కరిoచింది రచన .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 25 July 2014

రుధిర సౌధం 205


నేనే కాదు మీరూ చెప్పాలి .. రత్నం రాజు గురించే .. తన జాడ .. తెలిసిందని పక్కూరు వెళ్ళాడని చెప్పాలి .. కొంచెం

మేనేజ్ చేసుకుంటే రేపు కార్యక్రమం సజావుగా అయిపోతుంది ఏమంటారు ? అన్నాడు యశ్ .

ఓకే యశ్ .. అలానే చేద్దాం .. ముందు నువ్వు లోపలికి వెళ్లి రచన ని కొంచెం నార్మల్ చెయ్ వెళ్ళు .. అన్నాడు

మురారి .

సరే అని లోపలికి నడిచాడు యశ్వంత్ .

యశ్వంత్ వెళ్తుంటే .. చిన్నగా నిట్టూర్చి .. ఆఖరికి రత్నం రాజు కూడా మనల్ని టెన్షన్ పెడుతున్నాడు మురారీ .

అన్నాడు శివ .

అదిసర్లే .. రేపు మనం చెప్పింది అబద్ధం అని తెలిస్తే రచన మనందరితోను గొడవ పడుతుంది .. అన్నాడు మురారి .

అది నిజమే సుమీ ,,,మనం రెడీ గా ఉండక తప్పదు .. తప్పించుకోవాలంటే యశ్వంత్ మీద నెట్టేద్దం .. అన్నాడు

నవ్వుతూ శివ .

అతడి నవ్వులో శృతి కలిపాడు మురారి .

                                                          *********************

యశ్వంత్ రచన గదిలోకి వెళ్లేసరికి మంచం మీద ముంగాళ్ళ చేతులు వేసుకొని డల్ గా ఏదో ఆలోచిస్తూ కని

పించింది రచన .

ఓహో .. మిస్టర్ రత్నం ఎంత పని చేశావయ్యా ? నా ప్రియురాలి మొహం లో నవ్వు మాయం చేసేసావు అన్నాడు

ఆమె ముందుకి వెళ్లి .

 ఆమె  చిరుకోపంగా అతడి వైపు చూసింది ..

రచనా .. ఇంకా ఆ మొహం పక్కన పెట్టి కొత్త మొహం పెట్టుకో .. చూడు ఎలా ఉన్నవో ? అన్నాడు యశ్వంత్ .

యశ్ .. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు .. పైగా ఇలా ఆట పట్టిస్తున్నావు .. మూతి పక్కకి తిప్పుతూ అంది

రచన .



అతడు ఆమె నలా చూసి గట్టిగా నవ్వేశాడు ..

అతడి నవ్వు చూసి ఆమె మరింత కోపంగా చూసింది అతడి వైపు ...

ఓకే .. ఓకే .. ఇంకా ఆటపట్టించను  .. ఐయాం సారీ .. బట్ నువ్వు రత్నం కోసం కంగారు పడుతున్నట్టు ఏం లేదు

రచనా .. అతడు పక్క ఊరు వెళ్ళాడట .. ఎవరో చిరకాల స్నేహితుడిని కలవటానికి .. ఇంతకు ముందే బాలయ్య

వచ్చి చెప్పాడు .. అన్నాడు యశ్వంత్ .

ఏంటి ? నిజంగానా ? మరైతే  ఆ శంకరం అలా చెప్పాడేం ? అనుమానం గా అంది రచన .

మనందరి లానే అతడు అలా అనుకున్నాడు .. అన్ని అనుమానాలే కదా ..  అని ఆమె ముందు కూర్చుని ..

నువ్విలా డల్ గా ఉంటె ఎలా చెప్పు ? ఇప్పుడే కదా మనం సంతోషం గా ఉండాలి .. నువ్వు మూడ్ ఆఫ్ చేస్కుని

ఉంటె ఇంకా మేమేం చేయం .. హ .. నువ్వే చెప్పు అన్నాడు యశ్వంత్  అనునయంగా .

నిజమే .. సారీ .. అంది రచన .

గుడ్ .. ముందు లేచి బయటకి రా .. మురారి వచ్చాడు .. మన సత్య అలా పడుంది .. అయినా వాడు హ్యాపీ గా

ఉండటానికి ప్రయత్నించటం లేదా ? నువ్వే మంటే  ఆ రత్నం కోసం మూడ్ ఆఫ్ చేస్కున్నావు .. అన్నాడు

యశ్వంత్  .

లేదు యశ్ .. నౌ ఐ అమ్ ఓకే .. పద .. నేను మురారిని కలుస్తాను .. అని మంచం మీంచి లేచింది రచన ..

గుడ్ .. పద .. అని ముందుకి నడిచాడు యశ్వంత్ .

ఇంకా ఉంది









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 24 July 2014

రుధిర సౌధం 204



లేదు మురారి .. బట్ ఆలయం తెరచుకోగానే అన్నీ మామూలై పోతాయని నేను అనుకుంటున్నాను .. అన్నాడు

యశ్వంత్.

చిన్నగా తల ఊపి .. ఒకవేళ ఆలయం తెరచుకున్నాక మనం వచ్చిన పని అయిపోయిందనుకుంటే నేను ఎల్లుండే

సత్యని తీసుకొని ముంబై బయల్దేరుతాను యశ్వంత్ .. అన్నాడు నిర్లిప్తం గా మురారి .

అలాగే చేద్దువ్ గానీ మురారీ .. నేను అర్థం చేసుకోగలను .. సత్య ని మంచి డాక్టర్ కి చూపించాల్సి ఉంటుంది ..

అంతా మంచే జరుగుతుంది నువ్వు వర్రీ అవ్వకు .. అన్నాడు యశ్వంత్ .

సరేలే .. ఇంతకీ రచన ఎక్కడ ? తనకి కంగ్రాట్స్ చెప్పాలి ముందర .. అన్నాడు మురారి .

తను .. తను కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది మురారి .. తను రత్నం కోసం ఆలోచిస్తుంది .. తన వల్లే రత్నం ఇంతవరకు

కనబడకుండా ఉండిపోయాడే మో అని ఫీల్ అవుతోంది .. అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. దారిలో చెప్పాడు శివ ఈ విషయం కోసం .. బట్ యశ్ .. రచన ఈ సమయం లో ఇలా ఉండ కూడదు ..

మనం తన మూడ్ మార్చాలి .. అన్నాడు మురారి .

ఆ సమయం లో పరుగున అక్కడికి వచ్చాడు బాలయ్య ..

బాలయ్యా .. ఏంటి విషయం ? అని అడిగాడు యశ్వంత్ అతని మొహం లో కంగారు చూసి ...

బాబుగారూ .. అమ్మగారు నన్ను రత్నం బాబు బండి ఎక్కడుందో చూసి రమ్మన్నారయ్యా ... ఆ బండి ఆ పాడుబడ్డ

కోట కి వెళ్ళే దారిలో .. సన్నటి మట్టి బాట మొదలవుద్ది గదండీ .. అక్కడే అడ్డంగా ఉందండీ .. ఆ బాబు ఆటే

వెళ్లినట్టు ఉన్నారండీ అన్నాడు బాలయ్య .

ఓహ్ మై గాడ్ .. అయితే ఖచ్చితం గా భయపడి పోయి అక్కడే ఎక్కడో కళ్ళుతిరిగి పడుంటాడు .. ఇప్పుడెలా ?

అన్నాడు శివ .

బాలయ్యా .. ముందీ విషయం వెళ్లి భూపతి వాళ్లకి చెప్పు .. శంకరం మనుషుల్ని పట్టుకొని వెళ్తాడు .. ఆ .. ఈ

మాట అమ్మాయి గారితో చెప్పకు .. ఇప్పటికే తన మూడ్ ఆఫ్ చేసుకుంది .. అన్నాడు యశ్వంత్ .

అలాగే బాబూ .. అని అక్కడి నుండి పరుగులాంటి నడక తో ముందుకి సాగిపోయాడు బాలయ్య .

యశ్ .. అతడు సేఫ్ గానే ఉండి ఉంటాడా ? అనుమానం గా అడిగాడు మురారి .

సేఫ్ గానే ఉంటాడు మురారీ .. వైజయంతి గాని , బసవరాజు గానీ లేరు .. వాళ్ళని వీరస్వామి బంధించాడు .. ఇక

అక్కడ ప్రమాదం ఏముంటుంది ? బహుశా స్వతహాగా అతడు భయస్తుడు కాబట్టి దేనికో భయపడి ఎక్కడో పడి

పోయి ఉంటాడు .. శంకరం వాళ్ళు ఎలాగు వెళ్తారు కాబట్టి .. వాళ్ళే అతడ్ని జాగ్రత్తగా తెచ్చు కుంటారు .. అన్నాడు

యశ్వంత్ సాలోచనగా .

నువ్వు చెప్పేది నిజమే యశ్ .. మరింకేంటి ఆలోచన ? రచన మూడ్ మార్చు .. ముందు మనలో అందరం హ్యాపీ

గా ఉండాలి .. సత్య లేదు సరికదా .. రచన కూడా డల్ గా ఉంటె ఎలా ? అన్నాడు శివ .

శివా .. మురారీ .. నాకు రచన కోసం చిన్నప్పటి నుండీ తెల్సు .. తను అంత త్వరగా నార్మల్ అవదు .. అందుకే

తను మళ్ళి నార్మల్ అవ్వాలంటే నేను తనతో ఓ అబద్ధం చెప్పాలి .. అన్నాడు యశ్వంత్ ..

అబద్ధమా ? ఏంటి ? ఎందుకు ? అన్నాడు శివ .

ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 23 July 2014

రుధిర సౌధం 203

మురారీ .. మురారీ .. సరస్వతి ఇంటి ముందు నిలుచుని గట్టిగా అరిచాడు శివ .

తలుపు తెరిచి .. శివ బాబూ లోపల్కి రండి .. అంది సరస్వతి .

లేదు సరస్వతీ .. యశ్వంత్ అర్జెంటు గా రమ్మన్నాడు .. ముందు మురారి ని పిలువు .. అన్నాడు శివ ..

అలాగే బాబూ .. అని లోపలకి వెళ్ళింది సరస్వతి .. సరస్వతి లోపలకి వెళ్ళిన రెండు నిమిషాలకి బయటకి వచ్చాడు

మురారి .

శివా .. ఇప్పుడే వచ్చావా ? నీ పనులన్నీ అయిపోయాయా ? అన్నాడు మురారి చెప్పుల్లోకి కాళ్ళు దూరుస్తూ .

అయిపోయాయి రా .. అది సరే .. సత్య భోజనం అయిందా ? అన్నాడు శివ .

హా .. తనని సరస్వతి  ఎంతో బాగా చూసుకుంటుంది .. నేను తనకి చెప్పోచ్చానులే .. అన్నాడు మురారి .

సరే పద .. ముందు మహల్ కి వెళ్ళాలి . రచన . యశ్ ఎందుకో కంగారుగా కనిపించారు ఇంతకు ముందు ..

అన్నాడు శివ .

ఏం ఏమయింది ? అంటూ నడుస్తూనే అడిగాడు మురారి ..

మురారి తో కబుర్లు చెబుతూనే ఇద్దరూ మహల్ కి చేరుకున్నారు .

మహల్ ని చూడగానే .. అబ్బురంగా .. అరె .. ఇది రాణి మహాలేనా ? కొన్ని గంటల్లో ఇంత మార్పా?అన్ బిలీవబుల్

అన్నాడు మురారి .

చిరునవ్వు నవ్వుతు .. ఇంకేం .. నమ్మకు .. ఇంకో విషయం తెలిస్తే ఇంకా షాక్ అవుతావు .. ఈ మహల్లో ఇప్పుడు

వైజయంతి లేదు .. అన్నాడు శివ .

అర్థం అవుతుందిరా .. ఈ మహల్ చుట్టూ ఈ హడావిడి , ఇంత జనం .. ఈ కోలాహలం .. ఇవ్వన్ని చెబుతున్నాయి

ఇప్పుడిక్కడ వైజయంతి లేనే లేదని .. అన్నాడు మురారి .

హః హ్హ హా ... గట్టిగా నవ్వాడు శివ .

శివా .. ఇంతకీ మనోళ్ళు ఎక్కడున్నారు .. అదే .. మన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ .. అన్నాడు మురారి .

ఇక్కడ .. ఇక్కడకి రండి మీ ఇద్దరూ .. గట్టిగా అరిచాడు యశ్వంత్ కొంత దూరం లో నుండి .

హే .. మనోడు అక్కడున్నాడు పద .. అని యశ్వంత్ వైపు నడిచాడు శివ .. మురారి కూడా శివ ని అనుసరించాడు .

యశ్వంత్ దగ్గరకి చేరుకోగానే .. యశ్ , మురారిని ఆప్యాయం గా హత్తుకున్నాడు . తరువాత అక్కడ ఉన్న చైర్స్

లో ముగ్గురూ ఆసీనులయ్యారు .

వేరి హ్యాపీ యశ్ .. మనం ఈ మహల్ దగ్గరికి చాలా సార్లు వచ్చాం .. బట్ ఈరోజు ఈ మహల్ దగ్గరికి సంతోషాన్ని

తెచ్చాం .. అన్నాడు మురారి .

అవును మురారి .. బట్ వుయ్ ఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ .. సత్య .. సత్య కూడా ఇప్పుడు మనతో ఉంటె బావుంటుంది .

ఇంతకీ తను ఎలా ఉంది ? అని అడిగాడు యశ్వంత్ .

తనకేం అయిందో నాకు అర్థం కావడం లేదు యశ్వంత్ .. తింటుంది .. అన్ని వింటుంది .. బట్ తను మనలో లేదు ..

బై ది వే .. సత్య గురించి రచన ఏమన్నా చెప్పిందా ? తనెలా కోలుకునేది ఏమిటని ? అన్నాడు మురారి ఆత్రుత గా .



ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 22 July 2014

రుధిర సౌధం 202



ఆలోచిస్తే అన్ని ఇప్పుడు అర్థం అవుతున్నాయి రచనా .. అందుకనే భూపతి నీ విషయం లో ఎప్పుడు కోపంగా

బిహేవ్ చెయ్యలేదు .. వీరస్వామి కూడా నీకందుకే సహాయం చేసుంటాడు .. రత్నం మనసులో ప్రేమ .. అతడి లో

పిరికితనాన్ని అధిగమించుంటుంది.. అతడు నీకోసమే కోట కి వెళ్ళుంటాడు .. అన్నాడు నిర్లిప్తం గా యశ్ .

అతడికి ఏదన్నా జరిగితే దానికి కారణం పరోక్షం గా నేను .. యశ్ .. రత్నాన్ని ఎలాగైనా కాపాడాలి .. అంది రచన .

ఎలా ? ఇప్పుడు సమయం తక్కువ ఉంది .. తెల్లారే సరికల్లా నువ్వు ఆలయం తెరిచే పనిలో ఉండాలి .. ఏం తోచడం

లేదు .. అన్నాడు యశ్వంత్ .

అయ్యా .. నేనీ విషయం భూపతి గారితో చెప్పాలి .. మీరు మాకు ఒక్క సహాయం చెయ్యండి చాలు .. కొంత మంది

ని  మాకు సాయంగా పంపండి .. మేమే చినబాబు ని వెదికి తీసుకొస్తాం .. అన్నాడు శంకరం .

అలాగే శంకరం గారూ .. మీరు వెళ్ళండి .. ఎవరు సహాయం గా కావాలంటే వారిని తీసుకెళ్ళండి .. అన్నాడు

యశ్వంత్ .

యశ్ .. ఏమిటిదంతా ? బాధగా అంది రచన.

నువ్వేం బాధపడకు రచనా ? రత్నం అమాయకుడు .. ఏం కాదులే తనకి .. ముందు మనం మహల్ కి వెళ్దాం పద ..

అని ఆమె భుజం మీద చేయి వేసి .. వెనక్కి తిరిగి .. శివా .. అని కేక వేసాడు యశ్వంత్ .

పరుగున వచ్చాడు శివ .. రచన ని చూసి .. అరె .. నువ్వేప్పుదోచ్చావ్ .. అలా ఉన్నారేంటి ఇద్దరూ ? అంటూ ప్రశ్నల

వర్షం కురిపించారు .

అవన్నీ మనo మహల్ కి వెళ్లి మాట్లాడుకుందాం .. నీ కూరగాయలు కొనడం అయిపోతే పద ముందు మహల్ కి

పోదాం .. అన్నాడు యశ్ .

యశ్ .. మురారి వస్తానన్నాడు గా .. నేను వాడిని పట్టుకుని వస్తాను .. ముందు మీరు వెళ్ళండి అన్నాడు శివ .

అవును కదూ .. సరే .. మీరిద్దరూ వెహికల్ లో వచ్చేయండి .. మేమిద్దరం వెళ్తాం .. అన్నాడు యశ్వంత్ .

ఎందుకో ఇద్దరూ డల్ గా ఉన్నారు .. నాతో చెప్పొచ్చుగా విషయమేమిటో .. అన్నాడు శివ .

శివా ... రత్నం రాజు కోసం తెలిసింది .. అతడు ఆ పాడుబడ్డ కోట వైపు వెళ్ళాడని అంటున్నారు .. అంది బాధగా

రచన .

వ్వాట్ .. అతనికి అక్కడేం పని ? అన్నాడు శివ ఆవాక్కవుతూ ..

శివా .. అన్ని తీరిగ్గా మాట్లాడుకుందాం .. చాలా పనైతే ఉంది కదా .. ముందు అర్జెంటు గా మురారిని పట్టుకొని

వచ్చేయ్ .. అన్నాడు యశ్వంత్ .

ఓకే .. కూరలు .. ఇంకా మిగతా సామాన్లు వెహికల్ లో ఉన్నాయి .. మీరిద్దరూ వెహికల్ లో వెళ్ళిపొండి ...

నేను , మురారి నడుచుకుంటూ వచ్చేస్తాం అన్నాడు శివ .. వెహికల్ కీస్ యశ్వంత్ చేతిలో పెడుతూ ..

నువ్వు రా రచనా .. అని బండి స్టార్ట్ చేసాడు యశ్వంత్ ... రచన ఎక్కి కూర్చుంది ..

బండి మహల్ వైపు దూసుకు పోతుంది ...

యశ్ .. నేను ప్రమాదం లో ఉన్నానన గానే ఏమీ ఆలోచించకుండా నాకోసం బయల్దేరాడట రత్నం .. అంత అతడికి

నామీద ఉన్నప్పుడు .. అది నాకెందుకు తెలియలేదు యశ్వంత్ ... తెలిసుంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని

అతడికి చెప్పుండే దాన్ని .. అతడిలా ప్రమాదం జోలికి వెళ్లక పోయుండేవాడు కదా .. అంది రచన .

స్టాపిడ్ .. రచన .. నువ్వు సెన్సిటివ్ ఎప్పుడయ్యావు ? నువ్వు ఇప్పుడు గుడికోసం మాత్రమె ఆలోచించు .. రత్నం

కోసం కాదు .. చిరాగ్గా అరిచాడు యశ్వంత్ .

రచన మౌనం గా ఉండిపోయింది .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 21 July 2014

రుధిర సౌధం 201




రావణపురం కూరగాయల వ్యాపారం జరిగే స్థలం .. రైతులు , చేతి వృత్తుల వారు తమ తమ సామాన్లు విక్రయించే

స్థలం అది .

ప్రజలు ఆనందం గా పాటలు పాడుతున్నారు . ఆ పాటలు హుషారుగా డాన్సు చేస్తున్నాడు శివ .. యశ్వంత్

చప్పట్లు కొడుతూ అతడిని ఉత్సాహ పరుస్తున్నాడు .

యశ్ .. యశ్ .. గట్టిగా అరచింది రచన .

గిరుక్కున వెనక్కి చూసి .. హే ..

నువ్వెప్పుడొ చ్చావు ? సర్లే ..

సమయానికి వచ్చావు .. రా.. రా .. ఈ

ఊరికి మంచి  రోజులు రాబోతున్నాయని ప్రజలంతా ఎంత ఉత్సాహం గా ఉన్నారో చూడు .. మన శివ చూడు .. ఎలా

గెంతులేస్తున్నాడో .. అన్నాడు హుషారుగా యశ్వంత్ ఓ వంక శివ ని చూస్తూ ..

ఆ .. అంది నీరసంగా రచన .

అరె .. ఏమైంది ? ఎందుకలా ఉన్నావు ? అడిగాడు యశ్వంత్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ .

యశ్ .. బాలయ్య వచ్చాడు .. అంటూ .. బాలయ్య చెప్పిన విషయం అంతా యశ్వంత్ చెవిన పడేసింది రచన .

ఓహ్ .. అని తల పట్టుకున్నాడు .. యశ్వంత్ .

మనం ఈ విషయం భూపతి కి చెబుదామా ?  అంది రచన .

అమ్మాయి గారూ .. అన్న మాట విని పక్కకి తిరిగి చూశారు ఇద్దరూ .. గుమస్తా శంకరం ఉన్నాడు అక్కడ .

అతడిని అక్కడ చూడగానే .. యష్ , రచన ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని .. రా రచనా .. అని శంకరం

వైపు నడిచాడు యశ్వంత్ .

మీరు .. ఈ మార్కెట్టు కి వచ్చారా ? అన్నాడు శంకరం .

శంకరం గారు ఆ విషయం పక్కన పెట్టండి .. అని రత్నం విష్యం చెప్పారు శంకరానికి.

అయ్యా .. ఎంత ఘోరం ? ఇది వింటే భూపతి తట్టుకోలేడు .. అన్నాడు శంకరం .

అసలు రత్నం ఎక్కడికి వెళ్ళుంటాడు చెప్పగలరా మీరు ? అమాయకంగా అడిగింది రచన .

ఇంకెక్కడికి అమ్మా .. మీరు ప్రమాదం లో ఉన్నారనుకొని ఏమీ ఆలోచించకుండా ఆ కోటకే వెళ్లి పోయుంటాడు ...

ఇంతవరకు తిరిగిరాలేదు .. అంటే .. ఏమైపోయాడో కుర్రాడు అన్నాడు శంకరం బాధగా .

లేదు శంకరం గారూ .. రత్నం చాలా పిరికివాడు .. అంతవరకూ ఎలా వెళ్తాడు ? నేను బాలయ్య కి వెదకమని

పంపాను .. ఐనా నేను ప్రమాదం లో ఉన్నననుకొని అతడు రావడమేంటి ? నాకర్థం కాలేదు .. అంది రచన .

రత్నం బాబు నిన్ను ఇష్టపడ్డాడమ్మా .. ఇష్టపడినోడు ప్రాణం అనుకున్న పిల్ల కోసం ఏమైనా చేస్తాడమ్మా .. అన్నాడు

శంకరం బాధగా .

వ్వాట్ .. రత్నం రాజు నన్ను ఇష్ట పడ్డాడా ? ఏం మాట్లాడుతున్నారు మీరు ? అతడి ఇష్టా ఇష్టాలు ప్రాణత్యాగం

చేసేంత  గొప్పవి కావని మీకు తెలీదా ? కోపంగా అంది రచన .

మౌనంగా ఉండిపోయాడు యశ్వంత్ .

లేదమ్మా ? ఆ బాబు చెడు తిరుగుళ్ళు తిరిగిన మాట నిజమే .. నీ మీద అలాంటి ఇష్టమే ఉందను కొన్నాం .. కానీ

రత్నం బాబు వాల్లయ్య తో చెప్పాడు .. ధాత్రి ని నేను ప్రేమిస్తున్నాను .. తను లేకుండా ఉండలేను .. అని .. భూపతి

గారు కూడా రేపో మాపో మీతో ఈ విషయం ప్రస్తావించేవారు కూడా .. కానీ ఈ లోపే .. ఏవేవో జరిగి పోయాయి ..

నేను చెప్పేది నిజమమ్మా .. అన్నాడు శంకరం .

నో .. అని కన్నీళ్ళ పర్యంత మయింది రచన .

ఇంకా ఉంది









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 19 July 2014

కృతజ్ఞతాభివందన మాల - "రుధిర సౌధం" నవలా పాఠకులకి




ప్రియాతి  ప్రియమైన "రుధిర సౌధం " పాఠ కులకి ,




                 ముందుగా దేశ ,విదేశాల్లో ఉన్నపాఠకులకి కృతజ్ఞతాభివందనములు .. ఈరోజు బ్లాగ్ నవల రచయిత్రి

గా రూపు దాల్చిన నాకు మీరిచ్చిన ప్రోత్సాహం అమోఘమైనది . ఈరోజు తో రుధిర సౌధం నవల 200 భాగాలను

పూర్తి చేసుకుంటుంది .. మరికొన్ని రోజుల్లో క్లైమాక్స్ కి చేరబోతున్న ఈ నవల నాకు ఎందరో అభిమానుల్ని తెచ్చి

పెట్టింది . కాకతాళీయం గా ఒక భాగాన్ని చదివిన వారు .. తిరిగి మొదటి భాగం నుండి చదవడం మొదలు పెడు

తున్నారు . ఫోన్ ద్వారా , మెసేజ్ ల ద్వారా ,బ్లాగ్ లో మెసేజ్ ఇవ్వటం ద్వారా వాళ్ళ అభిప్రాయాలని ,సలహాలని

ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నారు .. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగువారు వాళ్ళ విలువైన సమయాన్ని నా

నవల చదివేందుకు వినియోగిస్తున్నారు .. అందుకు నిజంగా మీకు కృతజ్నతలు . ఇంకా రచన ల పట్ల , తెలుగు

పట్ల ఉన్న ప్రేమ , శ్రద్ధ , అభిమానాలు అందుకు కారణాలు అయి ఉండవచ్చు .


నేను పెద్ద రచయిత్రి నేం కాదు .. కాని చిన్ననాటి నుండి చిన్న చిన్న కవితలు , కథలు రాస్తుండటం .. మా

నాన్నగారికి వాటి పట్ల ఆసక్తి , నైపుణ్యం ఉండటం .. అవి నాకు ప్రాప్తించాయి అనుకుంటా ..

ఇకపోతే "రుధిర సౌధం " నేను రాసిన మొదటి నవల కాకపోయినా బ్లాగ్ లో ప్రచురితమైన మొదటి నవల .. నా

పట్ల  నాకు నమ్మకాన్ని , నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచిన ఓ ప్రయత్నం . కాగితం ఉపయోగించకుండా సరాసరి

బ్లాగ్ లోనే రాసిన నవల .. నేను స్త్రీ వాది  ని కాకపోయినా స్త్రీ సబల , అబల కాదన్న నమ్మకం ఉన్న వ్యక్తిని .

అందువల్లే ఈ నవల లో "రచన " పాత్ర ని బలీయం గానే తీర్చి దిద్దాను .. తెలివితేటలు , అందం ,సాహసం నేటి

అతివ లక్షణాలు .. ఏదైనా సాధించేందుకు ప్రయత్నించడం లో పురుషులకి ఏమాత్రం తీసిపోదు నేటి మహిళ .

నా ఆలోచనలకి తగ్గట్టు గానే ఉంటుంది రచన పాత్ర . ఏదో సరదాగా మొదలు పెట్టిన ఈ నవల ఇప్పుడు నా

దినచర్య గా  మారిపోయింది . ఏమాత్రం అశ్లీలానికి తావివ్వని నా రచనా శైలి మీ అందరికీ నచ్చిందనే

భావిస్తున్నాను .. చాలా మంది  పాఠ కుల కోరిక ప్రకారం "రుధిర సౌధం " పూర్తి కాగానే మరొక నవల మొదలు

పెట్టబోతున్నాను .. అందుకు కూడా మీ అందరి సహకారం ఉంటుందనే భావిస్తున్నాను ... "నా రచన  " లో నా

రచన లు కవన ప్రపంచం లో అనుభవజ్ఞుల కెవరికన్న తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను సరిదిద్దేందుకు ఓ క్షణం

కూడా ఆలోచించవద్దని , మీ అమూల్య మైన సలహాలను అందజేస్తారని భావిస్తున్నాను .. ఇకపోతే

" రుధిర సౌధం " పాఠకులు కూడా వారి అమూల్యమైన అభిప్రాయాలని తెలియజేస్తూ ఉండమని అర్థిస్తున్నాను .

200 వ భాగం తో పాటు మిగతా భాగాలు కూడా మీలో ఆసక్తి ని , ఉత్సుకత ని రేపేలా ఉంటాయని మాటిస్తున్నాను .

మరోసారి మీ అందరికి కృతజ్నతలు .. ఇక సెలవా మరి ..

                                                                                                   మీ అభిమానాన్నిఎల్లప్పుడూ కాంక్షించే

                                                                                                           - రాధిక ఆండ్ర  














క్లిక్ ఆన్     Naarachana.com 
like the posts of this blog in face book also by clicking on facebook/naarachana; or search as "నా రచన" in facebook.

రుధిర సౌధం 200 వ భాగం





అప్పుడే స్నానం ముగించుకొని అద్దం ముందు నిలబడి తన రూపాన్ని అపురూపం గా చూసుకొంది  రచన .

 అసలు నా గురించి పట్టించుకొనే సమయమే లేక పోయింది .. గుడి కార్యక్రమం ముగిసాక బలేశ్వర్ కి చెప్పాలి

జాబు   రిజైన్ చేస్తున్నాన్నని .. అమ్మ తో నా ప్రేమ కోసం చెప్పేయాలి .. యశ్వంత్ ని ప్రేమిస్తున్నాను అంటే

కాదనదు .. పైగా  సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బు అయిపోదుా  అమ్మ .. అని తనలో తానె నవ్వుకొంది రచన ..

చెవులకి జూకాలు తగిలించి .. తలారా స్నానం  చేసిన జుట్టు ని సుతారం గా దువ్వుకొని రెడీ అయి మహల్ బైటికి

వచ్చింది రచన .

బయటకి రాగానే ఎదురుపడ్డాడు తాత(సరస్వతి తాత ) .

తాతా .. నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా ? చిరునవ్వుతో అడిగింది రచన .

ఎక్కడమ్మా ? పని తెమిలితేనా ? ఒక్కసారి బయటకి వచ్చి చూడమ్మా .. మహల్ చుట్టూ పూల మాలల తో

అలంకరించారు మనవాళ్ళు .. అన్నాడు తాత .

అవునా ? అని చుట్టూ చూసింది రచన .

మహల్ గోడలకి బంతిపూల దండలు వేలాడుతున్నాయి ..

మహల్ అంతా కాగడాల వెలుతురులో దేదీప్యమానం గా వెలుగుతోంది ..

ఆమె కళ్ళల్లో అసంకల్పితం గా కన్నీరు నిండింది ... ఆమె కళ్ళల్లో కన్నీరు చూసి .. తాత అడిగాడు ..

అమ్మా .. ఇదంతా చూసిన ఆనందం లో నీ కళ్ళు వర్షిస్తున్నాయి .. మాకూ ఆనందం గా ఉండమ్మా .. ఎన్నో ఏళ్ళ

నిరీక్షణ ఫలించినట్టు .. అన్నాడు తాత .

అవును తాతా .. నా మనసులో భావాలని నేనిప్పుడు చెప్పలేను .. కానీ .. ఈ ఆనందం జన్మజన్మలకి సరిపోతుంది

అంది చెమర్చిన కళ్ళతో రచన .

అమ్మా .. ఆలయం పౌర్ణమి రోజు తెరవాలన్న నీ నిర్ణయం సముచితమైనదే గానీ ముహూర్తం నిర్ణయించాల్సిన

అవసరం కూడా ఉంది తల్లీ .. అన్నాడు తాత .

అవును తాతా .. ఎవరు నిర్ణయించాలో ఆ తల్లే చూసుకోవాలి .. పౌర్ణమి ఘడియలు ఎప్పుడు మొదలవుతున్నా

యన్నది నాకు చెప్పండి తాతా .. అంది రచన .

ఈరాత్రి గడవాలి .. తెల్లవారు ఘడియలలోనే చతుర్దశి పోయి పౌర్ణమి వస్తున్నది .. ఈ పౌర్ణమి .. మిగులు తగుల్లు

లేకుండా రేపటి రోజంతా పౌర్ణమి .. నిండు పౌర్ణమి .. శుభం తల్లీ .. అన్నాడు తాత .

నిజమే తాత .. ఇదంతా ముందే అంతా నిర్ణయింపబడినట్టు ఉంది కదూ  తాతా .. అంది రచన చుట్టూ పరికిస్తూ .

ఎవరికొసమైనా చూస్తున్నావా అమ్మా ? అన్నాడు తాతా .

అవును తాతా .. చీకటి పడుతోంది గా .. యశ్ , శివ కనబడరేం ? అంది రచన .

వాళ్ళు బయటికి వెల్లారమ్మ .. అన్నాడు తాత .

ఓహ్ .. అని లోపలి కి వెళ్ళబోతూ బాలయ్య వగరుస్తూ రావడం చూసి .. ఆగి .. బాలయ్య వైపు నడచి ..

ఏమైంది బాలయ్యా ? ఎందుకంత కంగారు పడుతున్నావు ? అంది రచన .

అమ్మాయి గారూ ... రత్నం రాజు బాబుగారు ఉదయం నుండి కనబడటం లేదు కదమ్మా .. వెళ్లి కనుక్కురమ్మని

యశ్వంత్ బాబు చెప్పారమ్మ .. వగరుస్తూ అన్నాడు బాలయ్య .

అవునా ? మరి నువ్వు కనుక్కున్నావా ? ఎక్కడున్నాడు అతను ? అంది రచన .

అమ్మా .. నిన్న నాతో పాటే సరస్వతి ని తీసుకెళ్ళటానికి మరో ఇద్దరు వచ్చారు కదా .. వాళ్ళు అక్కడి నుండి పారి

పోయి భూపతి ఇంటికి ఉదయాన్నే వచ్చి రత్నం బాబు గార్ని కలిసారట . మీరు ఆ పాడుబడ్డ కోటలో ఉన్నారని

చెప్పారట . అంతే .. వాళ్ళు చెప్పే మిగతా మాటలేం వినకుండా వెంటనే రత్నం బాబు జీప్ తీసుకొని వెళ్లిపోయారట .

ఆ బాబు మీకోసమే ఆందోళన పడ్డారట అమ్మాయి గారూ .. అన్నాడు వగరుస్తూ బాలయ్య ..

మై గాడ్ .. రత్నం రాజు .. చాలా పిరికి వాడు .. అలాంటిది .. తను .. తను .. కొంపదీసి ఆ పాడుబడ్డ కోట వైపు

వెళ్లాడ?  అయినా ఇంతవరకూ వెనక్కి రాక పోవటానికి కారణం ఏమై యుంటుంది ? కంగారుగా అంది  రచన .

అయ్యో .. అతడెందుకు ఆ కోట వైపు వెళ్ళాలి ? అయినా .. ఈ విషయం నువ్వెళ్ళి భూపతి తో చెప్పు బాలయ్య ..

తన కొడుకు కోసం అతడే చూసుకుంటాడు .. అన్నాడు తాత .

లేదు తాతా .. నా మనసెందుకో కీడు సంకిస్తుంది .. ఏదో జరిగింది .. రత్నం కి చాల భయం . అంత ధైర్యం గా కోట

దగ్గరికి  వెళ్ళడు .. ఐనా ఆ దారిలోకి జీప్ వెళ్ళదు .. అని సాలోచన గా .. బాలయ్య వైపు చూసి ...

బాలయ్యా .. నువ్వు ఓ పని చెయ్ .. కోటకి వెళ్ళే దారిలో జీప్ ఎక్కడైనా ఉందేమో చూడు .. భయపడి రత్నం

ఎక్కడైనా ఉండిపోయాడేమో... అంది రచన .

అలాగే అమ్మాయి గారు .. అని తల ఊపాడు బాలయ్య .

నీతో పాటు ఇంకెవర్నైనా తీసుకు వెళ్ళు .. ఒంటరిగా నువ్వు కూడా వెళ్ళకు .. ఒకవేళ ఎక్కడైనా జీప్ కనిపిస్తే నాకు

వెంటనే వచ్చి చెప్పు బాలయ్య .. అంది రచన .

అలాగే నమ్మా .. అని అక్కడి నుండి కదిలాడు బాలయ్య .

రచన మనసంతా అదోలా అయిపొయింది .. రచన నలా చూసిన తాత .. అమ్మాయ్ .. నువ్వు   ఇతర విషయాలకి

లొంగకూడదు .. గుడి తెరిచే లోపు ఆటంకాలు ఎన్నైనా రావొచ్చు .. కానీ నీ దృష్టి ఈ కార్యం మీదనే ఉండాలి

అర్థమైందా ? అన్నాడు తాత .

అలాగే తాత .. నేను వెంటనే యశ్వంత్ వాళ్ళని కలవాలి .. మీరు ఇక్కడుంటారా ? అని అడిగింది రచన .

అలాగేనమ్మా .. వెళ్లిరా .. అన్నాడు తాత .

వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది రచన .

                                                   ******************************
ఇంకా ఉంది


రుధిర సౌధం 201 వ భాగం కొరకు వేచి చూడండి







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది