మడుగు లోంచి యశ్వంత్ ,మురారి ఇద్దరూ బయట కి వచ్చారు .
టవల్ తో ఒళ్ళు తుడుచు కుంటూ .. మనకి ఇప్పుడు ఫలితం దక్కక పోయి ఉండొచ్చు కానీ ఈ మడుగు లోనే
గుడి ద్వారం ఉందని నాకు బలంగా అనిపిస్తుంది మురారి .. అన్నాడు యశ్వంత్ .
అవును యశ్ .. నిరాశ పడాల్సిన అవసరం లేదు . అదేపని గా ప్రయత్నిస్తే ఫలితం తప్పక దక్కుతుంది . ..
అన్నాడు మురారి .
నిజమే కానీ గుడి ద్వారం అందులో ఉండాలి కదా . ఉంటేనే దొరుకుతుంది .. లేకుంటే ఎలా దొరుకుతుంది .
ప్రయత్నం ,సమయం రెండు వృధా .. అంది సత్య వారి వద్దకి వయ్యారం గా నడిచి వస్తూ ..
రచన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది . ఎందుకని సత్య ఇలా మాట్లాడుతుంది . .. ఆమె మనసు బాధగా
మూలిగింది .
అదేంటి సత్యా .. అలా అనేసావు? ఇంత మందికి ఉన్న నమ్మకం నీకు లేదా ? అన్నాడు యశ్వంత్ .
మురారి ఆమె వైపు అసహనం గా .. నిస్సహాయంగా చూశాడు .
సత్య .. ఇంతకు ముందు నీకు జరిగిన ప్రమాదం మరచిపోయినట్లు లేదు . అందుకే అలా మాట్లాడుతుంది . అని
సత్య వైపు తిరిగి .. సత్యా .. ఇలాంటి మాటలు మనకి వర్తించవు . నువ్వీ టాపిక్ వదిలేయ్ .. అన్నాడు శివ .
సత్య మౌనంగా ఉండిపోయింది .
యశ్ .. మాటలదేముంది గానీ .. ఇప్పుడెం చేద్దాం ? అన్నాడు మురారి .
మురారీ .. ఎలాగూ మధ్యాహ్నం అయింది ... భోజనాల వేళ . ఇంటికి వెళ్ళి కాస్త ఏదన్నా తిని వద్దాం .. ప్రయత్నం
మాత్రం వదిలేది లేదు .. ఏమంటావ్ ? అన్నాడు యశ్వంత్ .
ఓకే .. అయితే ఇంటికి వెళదాం .. అని ముందుకి నడిచాడు మురారి .
మంచిది . ఇప్పుడు వీరంతా ఇంటిదారి పడితే మహల్ కి రాకుండా నేనేమన్నా చేయోచ్చు .. మనసులో అనుకొంది
సత్య వికృతంగా మొహం పెట్టి .
రచన మనసు కకావికలం గా ఉంది . ఆమె అడుగులు వెనక్కి వేసి మడుగు ఒడ్డున కూర్చుండి పోయింది నిరాశగా .
ఇంటికి వెళ్ళటానికి ముందుకి నడవబోతు .. వెనక్కి చూసి .. అరె రచనా .. నువ్వెంట లా ఉన్నావు ? అక్కడే
కూర్చున్నావ్ .. ఇంటికి వెల్లొద్దా ? అన్నాడు యశ్వంత్ ఆమె వైపు వస్తూ ..
లేదు యశ్వంత్ . నా మనసెం బాగాలేదు . మీరంతా వెళ్ళండి .. నేను తర్వాత వస్తాను . అంది నిర్లిప్తం గా రచన .
రచన రాక పోవటం తో వెనక్కి తిరిగి వీరికోసం చూస్తున్న సత్య ,శివ ,మురారి లని చూసి .. మీరు ఇంటికి పదండి
మేమిద్దరం కాసేపట్లో వస్తాం . మా మేడం గారు ఎందుకో డల్ అయ్యారు .. అన్నాడు యశ్వంత్ చిరునవ్వు తో ..
సరే యశ్వంత్ .. మేము వెళ్తాం . రచన ని పట్టుకోచ్చేయ్ కలసి లంచ్ చేద్దాం . అన్నాడు శివ .
సరే .. మీరు వెళ్ళండి అన్నాడు యశ్వంత్ .
వారు ముగ్గురూ అక్కడ్నించి వెళ్ళిపోయాక .. ఏంటిరా .. నిరాశ పడ్డావా గుడి ద్వారం దొరకలేదని .. ? అని లాలనగా
అడిగాడు యశ్వంత్ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది ; like the posts on facebook also; www. facebook.com/naa rachana




































.jpg)
