Powered By Blogger

Monday, 14 April 2014

రుధిర సౌధం119





మురారి ,రచన ఇంటికి చేరే సరికి వీధి తలుపు తీసే ఉంది .

రచనా తలుపు వేసి రాలేదా నువ్వు ? ఆందోళన గా అన్నాడు మురారి .

లేదు మురారి కంగారులో .. అలానే వచ్చేసాను .. అని లోపలకి అడుగు పెట్టిన ఆమె మండువా లో స్పృహ తప్పి

పడిపోయిన సత్య ని చూసి .. మురారీ .. అటు చూడు .. సత్య .. అంది బిత్తరపొతు ..

అరె కింద పడుంది ఏంటి ? అని రెండు అంగల్లో ఆమె ని చేరుకొని ఆమె చెంతనే మోకాళ్ళ పై కూర్చుని ఆమెని తన

ఒడిలోకి తీసుకున్నాడు మురారి .

రచన కూడా అక్కడ కి చేరుకొని కంగారుగా ఆమె వైపు చూసింది .

సత్య మొహం అంతా వడలి పోయి ఉంది . ఒంటిలో ఏమాత్రం శక్తి లేనట్టు చర్మం అంతా పాలిపోయింది ..

సత్యా .. అన్నాడు మురారి గద్గద స్వరం తో ..

అణువంత కూడా శక్తి లేని ఆమె శరీరం లోకి అతని పిలుపు రవ్వంత శక్తి నిoపిoదేమో .. నెమ్మదిగా కళ్ళు తెరచి

మురారీ .. అంది సత్య .

ఆమెనలా చూసాక వాళ్ళిద్దరి కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి .

అతడు ఆమెని పొదివి పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు . రచన కూడా బాధ ని దిగమింగుకోలేక పోయింది .

మురారీ .. ఆ  వైజయంతి సత్య ని విడిచి పెట్టింది . మనం ఇప్పుడన్నా సత్య ని కాపాడుకోవాలి . ముందు తనని

సోఫాలో కూర్చో పెడదాం .. అంది రచన .

అలాగే అని ఆమె ని రెండు చేతులతో ఎత్తుకొని సోఫా లో  కూర్చో బెట్టి తను కూర్చొని వాలి పోతున్న ఆమె తలని

తన గుండెలపై పెట్టుకున్నాడు మురారి .

మురారీ .. ముందు సత్య తినడానికి ఏమైనా తెస్తాను . బాగా నీరస పడిపోయింది .. అంది రచన .

సరే రచనా .. అని సత్య ని మరింత దగ్గరగా పొదివి పట్టుకున్నాడు మురారి .

రచనా వంట గదిలోకి వెళ్ళింది . వెళ్లి బ్రెడ్ కాలుస్తుండగా ఎవరో కింద పడిన శబ్దం వినబడింది . అరె .. ఏంటా శబ్దం ?

అని హాలులోకి వెళ్ళిన ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి వణికి పోయింది .

సత్య మొహం లో క్రూరత్వం .. మురారి ని చెంప  పగల గొట్టడం తో అతడు అల్లంత దూరం లో పడ్డాడు .

వైజయంతీ .. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను .. నువ్వు నా సత్య ని విడిచి పెట్టు .. మురారి చేతులు జోడించి అర్థిస్తూ

కనిపించాడు .

రచన బిత్తర పోయి చూసింది .. అంటే సత్య శరీరం లోకి మళ్ళి వైజయంతి .. ఆమె మనసు బాధతో విలవిలలాడింది .

ఓరీ మూర్ఖుడా .. ఎందుకు రా ? నీ ప్రియురాలి ప్రాణాలను నువ్వే అపాయం లో పెట్టుకుంటావు . ఊరి బయట

నువ్వు నాకోసం అనవసర ప్రేలాపనలు చేస్తే అది నాకు తెలియ కుండా పోతున్దనా ... అని వికటాట్టహాసం చేసింది

సత్య లో  ఉన్న వైజయంతి .

ఇంకా ఉంది






 అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 12 April 2014

రుధిర సౌధం 118



కన్నీళ్లు తుడుచు కొని అంది .. నేను నా కళ్ళారా చూశాను మురారి . నిర్థారించు కున్నాను . ఆమె సత్య కానే కాదు

వైజయంతి . తనలో మార్పు ప్రస్ఫుటం గా కనిపిస్తున్నా అర్థం చేసుకోలేక పోయాను . కాని ఈరోజు అద్దం లో ఆ

వైజయంతి అసలు రూపం బయట పడింది మురారి . ఈ విషయం తెలిసాక ఒక్క క్షణం కూడా మామూలు గా

ఉండలేక పోయాను . వెంటనే మిమ్మల్ని కలవాలని బయల్దేరాను . నాకే ఇలా ఉంది .. నీకు సత్య అంటే ప్రాణం .

నువ్వీ విషయాన్ని మనసులోనే ఎలా దాచుకున్నావు మురారీ .. కన్నీళ్ళతో ప్రశ్నించింది రచన .

బాధని గుండెల్లో అడుముకుని భరిస్తున్నా రచనా .. నోరు విప్పితే నా సత్య కి ప్రమాదం . తనని ప్రాణాలతో రక్షించు



కోవాలి . నా సత్య లో వున్న ఆ రక్కసి వల్ల మీకెవరికి ఏ ప్రమాదం రాకుండా చూడాలి . గడచిన కొన్ని గంటల

నుండీ నరకం అనుభవిస్తున్నా రచనా .. గొంతు పూడుకు పోతుంటే అన్నాడు మురారి .

మురారీ .. ఎంత మంచి వాడివి నువ్వు ? నీకు , సత్య కి రాకూడని కష్టం వచ్చింది .. బాధగా అంది రచన .

అందుకే రచనా .. నువ్వు తనతో ఒంటరిగా ఉన్నావన్న ఆలోచన నన్ను నిలవనీలేదు .. వెంటనే వాళ్లకి సత్యని

వదిలి రాలేనని చెప్పి వచ్చేసాను .. దారిలో నువ్వు కనిపించేసరికి ఏం జరిగిందో అని భయం వేసింది .. అన్నాడు

మురారి .

లేదు మురారీ .. నాకేం కాలేదు . కానీ ఈ విషయం మనం దాచకూడదు .. పద .. మనం వెళ్లి యశ్వంత్ ,శివలకి

చెప్పేద్దాం అంది రచన .

నో రచనా .. వద్దు . వాళ్లకి తెలిసినదని .. ఈవెన్ నీకు కూడా తెలిసిందని ఆ వైజయంతి కి తెలిస్తే సత్య మనకి

దక్కదు. ప్లీజ్ ఇది నీ మనసు లోనే దాచుకో రచనా .. అర్థింపు గా అన్నాడు మురారి .

మరైతే ఏం చేద్దాం మురారీ ? ఆ వైజయంతి బారి నుండి సత్య ని ఎలా కాపాడుకుందాం ? అంది రచన్ .

ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది రచన . కానీ ఆ మార్గం ఏదో మనకి తెలియాలి . ఇప్పుడు నాతొ పాటూ నీకూ

నిజం  తెలిసింది . నాక్కొంచెం ధైర్యం వచ్చింది . ఇప్పుదెలాగైనా సత్య ని కాపాడుకుందాం .. అన్నాడు మురారి .

నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను మురారీ .. సత్య నా స్నేహితురాలు .. తన కోసం నా ప్రాణం ఇమ్మన్నా

ఇస్తాను .  అంది రచన .

థాంక్ యు రచనా .. మనం ఇప్పుడు చేయవలసింది యశ్వంత్ వాళ్లకి ఈ విషయం చెప్పటం కాదు . సత్య ని

కాపాడు కోవటం . నువ్వీ విషయం వాళ్ళతో చెప్పనని మాటివ్వు రచనా .. అని తన చేయి ముందుకి చాచాడు

మురారి .

అతని చేతిలో చేయి వేసి .. అలాగే మురారీ .. నేను చెప్పను . అంది రచన గద్గద స్వరం తో ..

పద ఇంటికి వెళ్దాం .. అన్నాడు మురారి .

మెల్లగా తల ఊపి జీప్ ఎక్కి కూర్చుంది రచన .

మురారి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని జీప్ స్టార్ట్ చేసాడు . జీప్ రావణ పురం వైపు దూసుకు పోయింది

ఇంకా ఉంది   












మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 11 April 2014

రుధిర సౌధం 117



ఇంట్లో ఎటువంటి సవ్వడి వినబడక పోయేసరికి మెల్లిగా బయటకి వచ్చి తొంగి చూసింది సత్య .

హాలులో ఎవరూ కనబడలేదు . ఏమైంది ఈ రచన అని రచన్ గది తలుపులు తీసి చూసింది అక్కడ ఎవ్వరు లేక

పోయే సరికి  ఎక్కడకి పోయింది ఇది ? అని ఇల్లంతా వెదికి చూసింది వైజయంతి (సత్య ).

రచన కనబడక పోయేసరికి ఇది ఎక్కడికో పోయింది ఉన్నట్టుండి .. ఎక్కడకి అయుంటుంది ? ఇంట్లో ఎవ్వరూ లేరు

వాళ్ళు నాకు తోడుగా ఉండమని చెప్పినా బయటకి వెళ్లిందంటే .. ఏదో ఉంది .. అది ఎక్కడకి వెళ్లిందో తెలుసు

కోవాలి  .. అదేం చేస్తుందో తెలుసుకొని తీరాలి .. అనుకొన్న వైజయంతి .. వికృతంగా నవ్వింది .

కాసేపు నీ శరీరాన్ని వదిలి పెడుతున్నాను సత్యా .. అని సత్య శరీరం లోంచి ఓ పొగలాంటి ఆకారం బయటకి

వచ్చింది . ఆ ఆకారం బయటకి రాగానే వడలిపోయిన తోటకూర కాడ లా కింద పడిపోయింది సత్య శరీరం . స్పృహ

లేని ఆమె జీవచ్చవం లా నేల మీద పది ఉంది .. వైజయంతి ప్రేతాత్మ రచన ని వెదక డానికి గాలిలో కలసి పోయింది .                                        
                                          *********************************

జీప్ ని ఎంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నా ఎక్కువ వేగం తో వెళ్ళకుండా రచన సహనానికి పరీక్ష పెడుతుంది .

అయ్యో .. నేనెంత త్వరగా వీలుంటే అంత త్వరగా చెప్పాలి యశ్వంత్ వాళ్ళతో .. కానీ ఈ జీప్ నడవటమే లేదు

సరిగ్గా .. విసుగ్గా అనుకొంది  రచన డ్రైవ్ చేస్తూనే . ఆమె మనసు ఆందోళన గా ఉంది .

కొంచెం దూరం వెళ్ళాక ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న మురారి ని చూసి ఆశ్చర్యంగా జీప్ స్లో చేసింది రచన .

అతని మొహం లో కంగారు ప్రస్ఫుటంగా కనబడుతుంది . నడక లో వేగం అతని మది లో కలవరాన్ని సూచిస్తుంది .

మురారీ .. మురారి ఒంటరిగా వస్తున్నాడు ఏంటి ? అని మనసులో అనుకొంది రచన .

ఎదురుగా జీప్ లో వస్తున్న రచన ని చూసి మురారి కూడా అంతే ఆశ్చర్యం గా చూశాడు . ఈలోపు జీప్ మురారి

దగ్గరకి వచ్చి ఆగింది .

ఆమె ని చూస్తూనే రచనా .. నువ్వు బాగానే ఉన్నావు కదా .. కంగారుగా అడిగాడు మురారి .

మెల్లగా తల ఊపి .. నువ్వేంటి ఒంటరిగా వస్తున్నావు ? అనుమానం గా అడిగింది రచన .

అదీ .. నేను యశ్వంత్ వాళ్ళతో బయల్దేరాను గానీ .. సత్య కి ఒంట్లో బాగాలేదు అంది కదా .. తనని విడిచి పెట్టి వెళ్ళ

బుద్ధి కాలేదు . అందుకే యశ్ వాళ్ళతో చెప్పి మధ్యలో దిగిపోయాను .. తడబడుతూ చెప్పాడు మురారి .

అంతేనా మురారి ? అయితే నేను కనిపించగానే సత్య ఎలా ఉంది ? అని అడగలేదు నువ్వు ? రచనా నువ్వు ఎలా

ఉన్నవని  అడిగావు ... ఎందుకని ? ఆవేశం గా ప్రశ్నించింది రచన .

రచనా .. అది .. నువ్వు .. ఇంట్లో ఉండాల్సిన దానివి .. ఒక్కసారి బయట కనబడే సరికి అలా అడిగేశాను .. సత్య

ఎలా ఉంది ? బాధ ని దిగమింగుకుంటూ అన్నాడు మురారి .

ఇంకా ఎందుకు మురారీ దాస్తావు ? ఇదంతా నావల్లేగా .. నీకు నా మీద కోపం రావటం లేదా ? నావల్లెగా సత్య కి

ఈ దుస్థితి ? కన్నీళ్ళతో అంది రచన .

రచనా .. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ? గాబరాగా అడిగాడు మురారి .

మురారి .. ఇంట్లో ఉంది సత్య కాదు వైజయంతి .. నాకు తెలిసి పోయింది .. నాకు తెలిసి పోయింది మురారీ ..

ఏడుస్తూ అన్నదామె .

నీకు ... నీకెలా తెలిసింది ? భయంగా తడబాటు తో అడిగాడు మురారి

ఇంకా ఉంది 



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 10 April 2014

రుధిర సౌధం 116




ఆమె గొంతు పూడ్చుకు పోయినట్లైంది .. నేను చూస్తుంది నిజమా కలా .. నుదుటికి పట్టిన చెమటని

తుడుచుకుంటూ మెల్లిగా మెడ వెనక్కి తిప్పి సత్య వైపు చూసింది రచన . ఆమె మామూలుగా సత్య లానే కన -

బడటం తో మెల్లిగా ఊపిరి పీల్చుకొంది . నేనే పొరపాటు పడ్డట్లున్నాను .. అనుకొని సత్య వైపు మరో సారి చూసింది .

ఆమె పుస్తకం చదవటం లో నిమగ్న మయి ఉన్నట్లే కనిపించింది . నిశ్చింతగా నిట్టూర్చి మళ్ళి అద్దం వైపు తిరిగి

అద్దం లో ఆమె ని చూసిన రచన కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లని పించింది . అదే భయంకర ఆకారం .. ఆ

ఆకారం వైజయంతి .. భయం తో ఆమె గొంతు మళ్ళి పూడుకు పోయింది .. ఓరకంట మెడని వెనక్కి తిప్పి చూసింది

రచన . సత్య మామూలుగా కనిపిస్తుంది .. మళ్లి అద్దం లో చూసింది అదే భయంకర ఆకారం . అనుమానం లేదు

ఈమె సత్య కాదు .. అన్న ఆలోచన రాగానే ఆమె మనసు కలవరానికి లోనయ్యింది . వణుకుతున్న పాదాలతో

మెల్లిగా గది బయటికి వచ్చింది రచన .

ఓహ్ గాడ్ ... ఇదెలా సాధ్యం సత్య రూపం లో ఉన్నది వైజయంతి . అంటే ఆ మహల్ ని వదిలి మాతో ఉంటోంది ..

కానీ ఎవరికీ హాని చేయలేదు .. ఎందుకని ? అసలు సత్య ఏమయ్యింది ? ఎంత పిచ్చిదాన్ని అనవసరంగా సత్య ని

ఎంతలా అపార్థం చేసుకున్నాను . ఒక ప్రేతం తో పాటూ ఉంటున్నా ఆ విషయం తెల్సుకోలేక పోయాం .

అసలీవిషయం మురారికి తెలుసా ? వైజయంతి సత్య శరీరం లోకి ఎలా ? అని ఆలోచిస్తున్న ఆమెకి సడన్ గా గుర్తు

వచ్చింది మురారి పుట్టిన రోజున జరిగిన సంఘటన . అంటే అక్షరాలా నిజం యశ్వంత్ వాళ్ళు చెప్పింది . ఆరోజు

నిజంగానే నా మూర్ఖత్వం వల్ల సత్య ఇబ్బందిలో పడింది . పైగా ఈ విషయాన్నీ నేను అర్థం చేసుకోవడానికి

ప్రయత్నించలేదు . అంటే మురారికి ఈ విషయం తెలుసు . తెలిసీ ఎవరికీ చెప్పకుండా ఎందుకు మౌనం గా

ఉన్నాడు ? లేదు .. ఏదో ఒక కారణం ఉంది మురారి నోరు విప్పకుండా చేసే కారణం . కాని సత్య .. తన పరిస్థితి ఏంటి

? అయ్యో .. నాకేం పాలుపోవటం లేదు . ఈ దెయ్యం పోయి పోయి ఇలా ఇంట్లోనే వచ్చి కూర్చుంది . ఏదో అదృష్ట

వశాత్తు ఈ నిజం నాకు తెలిసింది . ఇప్పుడీ విషయం వెంటనే యశ్వంత్ వాళ్లకి తెలియజేయాలి .. లేదంటే ఏం

జరుగుతుందో ... కానీ వాళ్ళు ఈ పాటికే ఊరు దాటిపోయుంటారు . ఎలా ? ఎలా వాళ్ళని వెంటనే కలవాలి ? ఆమె

మనసు పరిపరి విధాల పోతుంది . అప్పుడామే కి రత్నం గుర్తుకి వచ్చాడు . ఎస్ .. రత్నం రాజు దగ్గర వెహికేల్

ఉంది . తనని అడిగి ఎలా అయినా యశ్వంత్ వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి .. వెంటనే ఈ విషయం వాళ్ళతో చెప్పాలి ..

ఆలోచన వచ్చిందే తడవుగా ఆమె వెంటనే బయటకి దారి తీసింది . బంగ్లా వైపు వడివడిగా నడిచింది .

బంగ్లా లోకి అడుగు పెట్టగానే ఎదురు పడ్డాడు రత్నం .

ధాత్రీ ఏమయిపోయావు ? ఉదయం నుండీ కనబడనే లేదు అన్నాడు రత్నం .

రాజు గారూ అన్నీ తరవాత చెబుతాను . నాకు వెంటనే మీ జీప్ కావాలి అంది రచన .

ధాత్రీ ఏమయింది ? ఎందుకంత ఆదుర్దాగా ఉన్నావు ? ఎక్కడికి వెళ్ళాలి ? నేను తీసుకెల్తా పద .. అన్నాడు రత్నం .

లేదు రాజుగారు ..  నేనే వెళ్ళాలి . నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్న నన్నేం ప్రస్నించకుండా వెళ్ళనివ్వండి

ప్లీజ్ అంది రచన .

సరే వెళ్ళు అని జీప్ కీస్ ఇచ్చాడు ఆమె వైపు అయోమయంగా చూస్తూనే రత్నం .

కాసేపట్లోనే అతడు చూస్తుండగానే జీప్ కనుమరుగయ్యింది

ఇంకా ఉంది 








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

శ్రీరామనవమి శుభాకాంక్షలు


ఎంగిలి పళ్ళని తిని శబరి భక్తి ని మెచ్చిన శ్రీరాముడు ,మన రాముడు .. పితృవాక్య పరిపాలకుడు , ఆదర్శ 

సోదరుడు .. రాతిని నాతిగా చేసిన వాడు , జానకి నోముల పంట వాడు .. రావణ సంహారకుడు , హనుమత్సేవితుడు 

కోదండ రాముడు .. పట్టాభి రాముడు .. భద్రాద్రి రాముడు .. అరవింద లోచనుడు .. 

అట్టి రాముని దివ్య ఆశీస్సులు మీ అందరికి శిరస్సు లపై కురవాలని మనసారా కోరుకుంటూ ....... 

మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు 













మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 9 April 2014

రుధిర సౌధం 115



భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే విశ్రాంతి కి తావివ్వకుండా సరస్వతి విషయం కనుక్కునేందుకు బయలు దేరారు
శివ ,యశ్వంత్ ,మురారిలు .

వెళ్తూ వెళ్తూ .. సత్య కి కొంచెం ఒంట్లో బావుండలేదు తోడుగా ఉండమని చెప్పటం తో ఇష్టం లేకపోయినా సత్య తో

పాటే ఆ ఇంట్లో ఉండిపోయింది రచన .

వాళ్ళు వెళ్ళాక రచన ఏమైనా తనతో మాట్లడుతుందేమోనని చూసింది సత్య .

కానీ ఏమీ మాట్లాడకుండా సత్య ఉన్న గది పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకుంది రచన .

హు .. కోపమే .. ఫర్వాలేదు . మీ మథ్య అంతరాలు కోసమే నా ఆరాటమంతా .. అని నవ్వుకొంది సత్య లో ఉన్న

వైజయంతి .

తలుపులు వేసుకొని గదిలో కి వెళ్ళిన రచన కి అలా ప్రవర్తించటం కూడా ఎందుకో బాధగా అనిపించింది . గోడకి

తలని ఆనించి ఆలోచిస్తూ ఉండిపోయింది .

ఎందుకు సత్యా ... అలా మాట్లాడావు నువ్వు ? నీతో మాట్లాడకుండా ఉండటం కూడా కష్టం గా ఉంది నాకు . కాని

నేనీ మాత్రం కోపం చుపించకుంటే మళ్ళి మరోసారి నువ్వు నాతో ఇలా మాట్లాడవని నమ్మకం ఏమిటి ? నువ్విలా

నాతొ ముభావం గా ఉండటం , ఆ సరస్వతి విషయం లో ఇలా సమస్య తలెత్తడం వల్ల ... అయ్యో .. గుడి

కనిపించిందన్న సంతోషాన్ని పంచ్వ్హుకోలేక పోయాను . పాపం ఈ సమస్య వల్ల యశ్వంత్ కూడా శివ , మురారిలకి

ఈ విషయం చెప్పనే లేదు . పోనీ జరిగినదంతా మరచి పోయి సత్య తో ఈ విషయం చెప్పేస్తే .. గుడి కనిపించదనే

కదా సత్య నాతో అలా మాట్లాడింది .. ఇప్పుడు తన అంచనా తప్పైందని చెబితే తనే అర్థం చేసుకుంటుందేమో ..

అనవసరం గా సమస్యలని పెంచుకోకుండా అపార్థాలని తొలగించుకోవటమే మంచిది . అయినా చిన్నపిల్లల్లా ఈ

కోపాలేంటి ? నో .. నేనే వెళ్లి సత్య తో మాట్లాడతాను . అని గది తలుపుల్ని తీసి బయటకి చూసింది రచన .

హాలు లో కనపడలేదు సత్య .

అయినా ముందు ఎలా మాట్లాడాలి .. తను గదిలో ఉన్నట్లుంది . ఏ సాకు తో తన గదిలోకి వెళ్ళాలి ? ముందు తన

మూడ్ ఎలా ఉందో గమనించాలంటే తన గదికి వేల్లాల్సిందేగా .. అనుకొంది రచన

అప్పుడు గుర్తొచ్చింది రచన కి సత్య గదిలో అడ్డం ఉంది . మొహం కడుక్కొని ఫ్రెష్ అవటానికి వెళ్తే సరి .. అని హాలు

లో మండువా లో ఉన్న బకెట్ లో నీటితో మొహం కడుక్కొని దండెం మీదున్న టవల్ తీసి మొహం

తుడుచుకుంటూ వెళ్లి వేసిఉన్న సత్య గది తలుపుల్ని ముందుకి తోసింది .

లోపలున్న సత్య .. ఏమిటన్నట్లు సీరియస్ గా చూసింది .

అంత సీరియస్ గా చూడాలా .. అని అనుకుంటూ అద్దం దగ్గరికెళ్ళి జుట్టు దువ్వుకోసాగింది రచన .

సత్య  ఆమె వైపు చూసి పట్టించుకోనట్లు ఏదో పుస్తకం చదువుకోసాగింది .

తన తలని దువ్వుకుంటూ సత్య ఏం చేస్తుందా అని అద్దం లోంచే సత్యని చూసిన రచన అవాక్కయింది ..

ఒక భయంకర ఆకారం పుస్తకం చదువు తున్నట్లు కనపడింది ఆమె కి .. ఆమె కళ్ళు భయం తో పెద్దవయ్యాయి .

ఇంకా ఉంది 










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 7 April 2014

రుధిర సౌధం 114




నిజమే .. ఇదీ ఆలోచించాల్సిన విషయమే .. భూపతి ఏమన్నా చేసి ఉంటాడా సరస్వతిని ... అన్నాడు మురారి .

భూపతి ఏమన్నా చేసాడే అనుకుందాం .. కానీ సరస్వతి వీరితో అబద్ధం ఎందుకు చెబుతుంది ? ఈ విషయం కోసం

ఇంతగా ఆలోచించే కన్నా అక్కడికి ఓసారి వెళ్లి ఎంక్వయిరీ చేయడం మంచిది . అన్నాడు యశ్వంత్ .

ఇంతలో భోజనం రెడీ .. అంటూ శివ అక్కడికి వచ్చాడు .. అరె యశ్వంత్ మీ ఇద్దరూ కూడా వచ్చేసారా ? రచన

మూడ్ మారిందా లేదా ?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించే సాడు .

అందరూ మౌనం గా ఉన్నారు .

అరె ఏమయింది మీ అందరికి ?  ఇంత ముభావం గా ఉన్నారేం ? ఆశ్చర్యంగా అడిగాడు శివ .

శివా .. ఏం జరిగిందంటే ... అంటూ అంతా వివరంగా చెప్పాడు మురారి .

అంతా విని చిన్నగా నిట్టూర్చాడు శివ . ఇప్పుడెం అయిపోలేదు  మనకిలాంటివెం కొత్తకాదు గా .. ముందు

భోజనాలు చేయండి .. భోజనం పూర్తయ్యాక యశ్వంత్ .. నువ్వూ ,మురారి , నేను ముగ్గురం అక్కడికి వెళ్లి వద్దాం ..

అప్పటికి గాని విషయం తేలదుగా .. అన్నాడు శివ .

బావుంది శివా .. ముందు  ఆకలిగా ఉంది భోజనం పెట్టు .. అన్నాడు యశ్వంత్ .

అందరూ భోజనానికి ఉపక్రమించారు .

వీళ్ళ దృష్టి అయితే పక్కకి మళ్ళింది . ఆలయం కోసం ఆలోచన ఈ విషయం తేలకుండా ఆలోచించక పోవొచ్చు ..

అని మనసులో నవ్వుకొంది సత్య .

                                      ****************************************

 గోపాలా ... అంటూ స్వామీజీ పిలవగానే పరుగున వచ్చాడు గోపాల స్వామి .

స్వామీజీ  పిలిచారా .. అంటూ వినయం గా నిలబడ్డాడు గోపాల స్వామి .

అవును గోపాలా .. నీతో ఒక మాట చెప్పవలసిన అవసరమున్నది . సమయం ఆసన్నమయింది నా స్వస్థలానికి

చేరుకోవటానికి . ఆ తల్లి నన్ను కూడా ఓ కార్యక్రమానికి ఎన్నుకొన్నది . ఆ కార్యం నేరవేర్చుటకి ప్రయాణం

కావలసి ఉన్నది .. అన్నారు రమనానంద మహర్షి .

స్వామీ .. స్వస్థలమా ? నాకేమీ అవగతం కావటం లేదు స్వామీజీ .. ఇప్పుడు తమరు ఎక్కడికి ప్రయాణం చేయ

సంకల్పించారు ? ఆశ్చర్యంగా అడిగాడు గోపాలా స్వామి .

చిరు మందహాసం తో నాయనా గోపాలా .. ప్రతి వ్యక్తీ ఈ భూమి పై కార్యోన్ముఖుని గానే పుడతాడు . ఆ  విధాత తను

చేసిన బొమ్మ నుదుటి పై విధి ని లిఖించి నట్లే ఓ బాధ్యత ని కూడా నిర్వర్తించేలా రాత రాసి భూమి పైకి వదిలి

వేస్తాడు..  మనకి ఉద్దేశించిన బాధ్యతని మనం నిర్వర్తించక తప్పదు నాయనా . ఎక్కడ కి వెళ్ళాలన్న ప్రశ్న వదిలి

నువ్వు నాతొ రాదలచుకున్నవొ లేదో తెలియ జేయి .. అన్నారు స్వామీజీ .

ఎంత మాట స్వామీజీ .. మీరెక్కడో నేనక్కడే .. మీ ప్రియ శిష్యునికి ఇలాంటి ప్రశ్న వేయుట ధర్మం కాదు .. అన్నాడు

గోపాల స్వామీ.

అయితే నాయనా మరో వారం లో మన ప్రయాణం ఉండవచ్చును . అన్ని ఏర్పాట్లు చేయనారంభించు . ఒక పరి

ప్రయాణానికి మునుపు గిరిజ దేవిని ఆశ్రమానికి రమ్మని కబురు పంపు . అన్నారు స్వామీజీ .

తప్పకుండా స్వామీజీ .. అని స్వామీజీ కి నమస్కరించి అక్కడ నుంచి కదిలాడు గోపాల స్వామీ .

ఇంకా ఉంది 











మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ఆశ చిగురు వేసింది .............

వేసవిలో చిరుజల్లులా .. 

చీకటిలో చిరు వెలుగులా .. 

శిశిరం లో మొలక చిగురులా .. 

ఆశ మిణుకు మిణుకుమంటోంది .. 

కరిమబ్బు కరిగి వర్షమై కురిసినట్టు .. 

చిరుగాలి ఆత్మీయంగా స్పర్శించి నట్టు .. 

ఉప్పెనైన కన్నీటికి ఆనకట్ట వేసి నట్టు .. 

ఎడతెగని సంతోషానికి దారేదో తెలిసి నట్టు .. 

శ్వాస ఎగసిఎగసి పడుతోంది .. 

మంత్రమేదో వేసినట్టు .. 

లోకాన్ని జయించేసి నట్టు ,,,

అదృష్ట దేవత వరించినట్టు .. 

వరములెన్నొ కురిపించినట్టు .. 

కల కనుల లోగిలి చేరుతోంది .. 

ఇవన్నీ నిజమో కాదో .. కానీ చెలియా నీ పరిచయం 

ఎడారి లో ఒయాసిస్సై నా దాహాగ్ని ని చల్లార్చింది .. 

స్నేహం అను బంధం లో రుచిని నాకు తెలిపింది .. 

ఆశ చిగురు వేసింది ............. 









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 6 April 2014

రుధిరసౌధం 113



"ఈ సరస్వతి ఎవరు " అని మనసులో అనుకొని .. ఏం జరిగింది ఆమె కి ? అని కూల్ గా అడిగింది సత్య .

ఆరోజు మీరు స్టేషన్ దగ్గర వదిలి పెట్టాక ఆమె ఇంతవరకు ఇంటికి చేరలేదు . ఇప్పుడు వాళ్ళ తాత మనల్ని అడుగు

తున్నాడు .. అన్నాడు యశ్వంత్ కొంచెం స్వరం పెంచి .

ఈ సరస్వతి ఎవరో తెలియకుండా యశ్వంత్ తో ఈ విషయం మాట్లాడటం సరైన పని కాదని మౌనం గా

ఉండిపోయింది సత్య .

యశ్వంత్ మాటలు విని బయటకి వచ్చిన మురారి .. సరస్వతి కనిపించక పోవట మేంటి ? వీళ్ళతో ఆమె నిన్న

రాలేదా ? అని అడిగాడు .

లేదు మురారి .. రాలేదు . వీళ్ళతో బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పింది అబద్ధమని వాళ్ళ తాత మాటల్ని బట్టి

అర్థమైంది .. ఆమె ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థం కావటం లేదు .. అన్నాడు యశ్వంత్ .

ఆలోచన లో పడ్డాడు మురారి .

యశ్ .. నిన్న సాయంత్రమే కదా ఆమెని అక్కడ విడిచి పెట్టి వచ్చింది . నిజంగా ఆమె బంధువుల ఇంటికే వెల్లిందేమో

ఒకవేళ అలా వెళ్లుంటే ఈరోజు మధ్యాహ్నానికి వచ్చేయాలని నిభందన ఏమీ లేదుగా . ఊరి లోపలికి రావటానికి

వెహికేల్స్ కూడా ఉండవు . ఈమాత్రం ఆలస్యానికి అనవసరం గా కంగారు పడుతున్నామేమో .. ఆన్నాడు మురారి .

నిజమే మురారి కానీ .. మనం ఒక విషయం మర్చిపోకూడదు . సరస్వతి పల్లెటూరి పడుచు . భర్త ని కోల్పోయిన

వాళ్ళు ఇలా పది రోజులు పూర్తీ కాకుండా ఎక్కడికి వెళ్ళరు .. వాళ్ళ బంధువులు కూడా లోపలికి రానీయరు ..

అన్నాడు యశ్వంత్ .

మరి తను మన దగ్గరికి వచ్చినదిగా .. అన్నాడు మురారి .

మనం అలాంటి నమ్మకాలు లేనివాళ్ళం . అందుకే తనని రానిచ్చాం . అన్నాడు యశ్వంత్ .

సత్య వీళ్ళ మాటలు వింటూ పరిస్థితి ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది .

మురారి చెప్పినట్లు ఎందుకు కాకూడదు యశ్ . మనలా ఆలోచించే బంధువులు తనకి ఉన్నారేమో .. ఎందుకంటే

సరస్వతి లో చాల ఆధునిక భావాలు ఉన్నాయి . మనం ఓసారి అక్కడకి వెళ్లి ఎంక్వయిరీ చేద్దాం . తను ఏ ఆపదలో

ఉందని నాకు అనిపించడం లేదు అంది రచన

రచన వైపు తిరిగి అదీ చెప్పలేం .. కానీ నా మనసు కెందుకో ఇది కూడా మన చుట్టూ ఎవరో బిగిస్తున్న ఉచ్చులా

అనిపిస్తుంది . నిన్నరాత్రే ఆ ముసలాయన మనదగ్గరకి వచ్చి అడిగుండాలి కదా .. ఎందుకు అడగలేదు ?

అన్నాడు యశ్వంత్ సాలోచన గా .

అవును సాయంత్రం నుంచీ రాత్రి ఊరిలో అంతా నిద్రపోయే వరకూ ఎవరో ఒకరం ఇంట్లోనే ఉన్నాం . ఆ ముసలాయన

మనల్ని వచ్చి అడిగి ఉండొచ్చు .. కానీ అడగలేదు .. అంటే దీని వెనుక ఏదో ఉంది . అన్నాడు మురారి .

భూపతి .. భూపతి ఏమన్నా కుట్ర చేసి ఉంటాడా ? అంది రచన సాలోచన గా ..

ఇంకా ఉంది 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday, 5 April 2014

రుధిరసౌధం 112



యశ్వంత్ ,రచన ఇద్దరూ మహల్ దగ్గరే ఉండిపోయారు . వచ్చి ఇంతసేపు కావొస్తుంది .. వారిరువురూ మాత్రం

అక్కడే ఉండి పోయారు .. వారికి గుడి మార్గమైతే తెలియ రాలేదు కదా .. ఆందోళన గా మనసులో అనుకుంది

వైజయంతి .

సత్యా .. ఏమిటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు ? ఏమైనా వండి పెట్టొచ్చు కదా .. ఆకలిగా ఉంది . అన్నాడు శివ .

ఏమిటీ వంటా ? నేనా ? అందామె కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు ..

అదేంటీ అల్లా అంటావు ? నువ్వు మా అందరిలో కెల్లా ఎక్స్పర్ట్ కదా వంటలో .. వంట రానట్టు మొహం పెట్ట వేంటి ?

అన్నాడు శివ .

ఆమె వైపు నిరాసక్తం గా చూసి .. శివ వైపు తిరిగి .. శివా ఈరోజు వంట నేను చేస్తాను . తనకి కొంచెం హెల్త్

బాగాలేదు .. అని వంట గది వైపు వెళ్తున్న మురారి ని చూసి ..

మురారీ .. నువ్వసలే అలసి పోయావు .. నువ్వు కాదు .. నేను చేస్తాను .. సరేనా ? అని సత్య వైపు చూసి ..

సత్యా నువ్వు విశ్రాంతి తీసుకో .. నేను వంట చేస్తాను .. అని వంటగదిలోకి నడిచాడు శివ .

శివ వంట గది లోకి నడిచాక .. మురారి వైపు చూసి .. నేను రాకుమారి ని .. వంట చేయడం నాకు రాదు . నిత్యం

సేవకులు సేవ చేస్తూ ఉంటారు మాకు . ఇటువంటి పనులని నాకు పురమాయించ వద్దని అతడికి చెప్పు ..

లేదంటే అతడి మెదడు మాంసం వండి పెట్టగలను .. అంది సత్య మురారి వంక క్రూరంగా చూస్తూ .

కానీ నా సత్య చాలా బాగా వంట చేస్తుంది . ఇలాంటి కర్కసమైన మాటలు తన నోటి వెంట రానేరావు . ఇకపోతే

నువ్వు .. కోటని వదిలి ఇక్కడ వరకూ వచ్చావు . శాశ్వతం గా ఆ కోట ని వదిలి ఉండాల్సి వస్తుందేమో ఆలోచించు

రాకుమారి వైజయంతీ .. అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు మురారి .

ఇంతలో గుమ్మం వైపు సవ్వడి వినబడటం తో అటువైపు దృష్టి సారించింది సత్య .


పాలిపోయిన మొహాలతో వస్తున్న రచన , యశ్వంత్ లని చూసి తనలో తానె నవ్వుకుంది సత్య .. వీరి మొహాలు

చూస్తుంటే నేను అనుకున్నట్లు ఏం జరిగినట్లు లేదు అనవసరం గా వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను .. అని

అనుకొన్నది సత్య   .

లోపలికి అడుగుపెట్టగానే కనిపించిన సత్యని చూసి చూడనట్టు ముందుకి నడిచి టేబుల్ పక్కనే ఉన్న చైర్ లో కూల

బడింది రచన .

ఆమె తో బాటే వచ్చి తానూ ఓ చైర్ లో కూల బడ్డాడు యశ్వంత్ .

ఇద్దర్నీ అలా చూసి తనలో తానె నవ్వుకొని .. ఏం జరిగింది యశ్వంత్ ? మీ ఇద్దరూ అలా ఉన్నారే ? అని అడిగింది

సత్య .

ఆమె వంక అసహనం గా చూసి .. నెమ్మదిగా అడుగుతున్నావా సత్యా ? ఏపని మీ ఇద్దరూ సరిగ్గా చేయరు .. ఇలా

సమస్యలు తీసుకొస్తారు . సరస్వతి ని మీతోనే తీసుకొస్తే ఏం పోయుండేది ? ఇప్పుడు సరస్వతి కనిపించడం లేదు .

కోపంగా అన్నాడు యశ్వంత్ .

ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 4 April 2014

రుధిర సౌధం 111


యశ్వంత్ మనసులో కలవర పడ్డాడు . రచన ఈమధ్య ఎందుకు ఆలోచించలేక పోతోంది .. అతడు తల

పట్టుకున్నాడు .

కానీ తాతా .. నాకు స్వయంగా సరస్వతే చెప్పింది తను మీ బంధువుల ఇళ్ళకి ఆ పదో రోజు కార్యక్రమానికి పిలవ

డానికే వెల్తాఅని  .. ఇదంతా మీ ప్రాంతం కదా .. నిజమే అయుంటుందని నేనూ ఒప్పుకున్నాను .. అంది రచన

కాసింత కంగారుగా .

లేదమ్మా .. సరస్వతి తెలిసి తెలిసి ఏ తప్పూ సేయదమ్మ . నా బిడ్డ ఏ పెమాదం లోనో పడలేదు కదా .. అతడు కళ్ళ

నీళ్ళు పెట్టుకున్నాడు .

తాతా .. సరస్వతికి ఏం కాదు .. నువ్వేం భయపడకు .. ఆమె ఎక్కడున్నా ఆమెని నీకు అప్పగించే బాధ్యత మాదే ..

సరేనా ? అన్నాడు యశ్వంత్ కల్పించుకొని .

అలాగే నయ్యా .. నా మనవరాలిని నాకు అప్పగించండయ్యా .. అన్నాడు సరస్వతి తాత .

అలాగే నువ్వు వెళ్ళు తాతా ... అన్నాడు యశ్వంత్ . అతడు కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు .

మాన్పడి పోయి నిలబడిన రచన ని చూసి .. రచనా .. అని పిలిచాడు యశ్వంత్ .

అతడి పిలుపు కి ఉలిక్కిపడి .. ఇప్పుడు ఈ సమస్య ఏంటి యశ్ .. నాకేం అర్థం కావడం లేదు .. అంది రచన .

అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు ఇలాంటి తప్పు చేసావు రచనా .. నువ్వు ,సత్యా ఆమెని తీసుకువెళ్ళారు .. తిరిగి

మీరే తీసుకురావాలి కదా .. అది మీ బాధ్యత . ఇప్పుడు సరస్వతి కనిపించడం లేదంటే మొట్ట మొదటి ప్రశ్న మీ

మీదకే బాణం లా దూసుకు వస్తుంది నీకది తెలియదా ? అసహనం గా అన్నాడు యశ్వంత్ .

నిజమే యశ్వంత్ .. కానీ నేను సరస్వతి ని నమ్మ్మాను .. కానీ నాతో అబద్ధం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏముంది

సరస్వతికి ? ఎందుకని నాతో అబద్ధం చెప్పుంటుంది ? ఆందోళన గా అంది రచన .

నువ్వేం వర్రీ కాకు .. ఆలోచించి అడుగేద్దాం .. ఇంతకీ వాళ్ళ బంధువుల ఇళ్ళు ఎక్కడున్నాయని చెప్పింది ?

అన్నాడు యశ్వంత్ .

స్టేషన్ కి దగ్గరలో అని చెప్పింది . ఆరోజు సత్య వేల్లనీలే అనేసరికి నేనూ ఒప్పుకోవాల్సి వచ్చింది .. అంది రచన .

ఆపైన బర్త్ డే ఏర్పాట్లు .. వెరసి ఈ సమస్య మన ముందుకి వచ్చింది .. ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది ..

నీతో సరస్వతి అబద్ధం చెప్పింది .. కావాలని .. చెప్పింది .. ముందు అక్కడికి వెళ్ళాలి . ఈ తాత ని కూడా పట్టుకేల్దాం

ఎవరు అక్కడ బంధువులో తెలుసుకుందాం .. సరేనా ? అన్నాడు యశ్వంత్ .

ఏంటో యశ్వంత్ .. గుడి కనిపించిందన్న సంతోషం అంతా ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది . అంది రచన నిరాశ గా .

అవును .. కానీ ముందు మనం సరస్వతి విషయం తేల్చుకోక పొతే మరో పెద్ద సమస్యలో పడిపోతాం రచనా ..

అది మన లక్ష్యానికి అడ్డుకావోచ్చు .. అన్నాడు యశ్వంత్

ఇంకా ఉంది 





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

విఫల ప్రేమ


విడదీయగలవేమో నా మదిని ,తనువుని 

అతికించలేవమ్మ విరిగిన నా మనసుని .. 

చెదరగొట్టగలవేమో నేను కన్న కలలని .. 

చెరపనేలేవమ్మ గుండెల్లో జ్ఞాపకాలని .. 

చేదుగా ఉన్నా నీ తలపు రుచి ని వద్దని చెప్పలేని నిస్సహాయుణ్ణి .. 

కుదురుగా లేని నా మనసు గతిని హేళనే చేయవద్దని నీకు నా మనవి .. 

విఫల మైన .. సఫల మైన..  ప్రేమకి ఫలితం కన్నీరే .. 

గుర్తు లేదా చేసుకున్న బాస కి ద్రోహం నీ తీరే .. 

ఎదురు చూసిన కన్నుల తడిని కనలేని ప్రేయసి .. 

మోసమే నీ స్నేహమైతే తీర్చేసుకో కసి .. 

మనసు పొరల్లో రూపు దిద్దుకున్న అపురూప సౌందర్యాన్ని 

సొగసు తెరల్లో దాగి ఉన్న వంచన అని అనలేను గానీ .. 

నీ  ప్రేమ మైకం లో మునిగి లోకాన్ని మరవటమే తప్పు .. 

శాపమో వరమో .. నిన్నిపుడు మరవటమే ఒప్పు 



వీక్షకులతో ఓ మాట :  ప్రేమ లో విఫలమవట మంటే అదేమంత పాపం కాదు . ఆ ఓటమిని అంగీకరించి గెలుపు 

కోసం అడుగు  ముందు కేయటమే సరైనది . ప్రేమంటే .. ప్రియురాలినుండో ,ప్రియుని నుండో మాత్రమే పొందేది కాదు 

అమ్మ నుండి ,నాన్న నుండి , చెల్లి , తమ్ముడు ,అక్క ,అన్న .. ఎన్నో బంధాలు ఉన్నాయి ప్రేమని పంచటానికి . 

ఇన్ని బంధాలు పంచె ప్రేమని కించపరచి వేరెవరి ప్రేమో దక్కలేదని క్రుంగిపోవటమో ,పగతీర్చు కోవటమో లేక 

ప్రాణాలు తీసుకోవటమో సరి అయినదేనా .... ? కాదు .. జీవితం లో ఇంకెన్నో బంధాలున్నాయి .. ఇంకెన్నో 

పరిచయాలుంటాయి .. అవి బంధాలై పెనవేసుకుంటాయి . వేచిచూడండి .. ఏదీ ఎవరికోసం ఆగదు .. మీ జీవితం 

కూడా ఆగిపోదు .. మీరు ఆపకండి .. ముందుకి సాగిపోనివ్వండి .. ఈ నా మాటలు ప్రేమ మత్తులో పడి జీవితాల్ని 

నాశనం చేసుకుంటున్న చెల్లెళ్లకి , తమ్ముళ్ళకి ,స్నేహితులకి .. అర్థం అయింది కదూ .. 






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 3 April 2014

రుధిర సౌధం 110




యశ్వంత్ రచన వైపు ఆర్తిగా చూస్తూ .. మనం మన లక్ష్యానికి అతి చేరువలో ఉన్నాం రచనా .. తప్పకుండా మనం

ఈ ప్రయత్నం లో సఫల మవుతాం . మీ నాన్నగారి కల నెరవేరే అవకాశం అతి తొందర లో ఉంది . .. అన్నాడు

యశ్వంత్ .

నిజమే యశ్వంత్ .. అయినా నీలాంటి వాడు నాకు తోడుగా ఉంటె నేనెన్ని కలలైనా కనొచ్చు కదూ .. అంది చిలిపిగా .

అదిగో మళ్లి నీలాంటి వాడు అంటావు .. నేనే స్వయంగా ఉన్నప్పుడు .. అన్నాడు ఉడుక్కుంటూ యశ్వంత్ .

సరే యశ్వంత్ .. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తుంది . పద త్వరగా వెళదాం .. అంది చిరునవ్వుతో ..

పద అని ఆమె భుజం మీద చేయి వేసి ముందుకి నడిపించాడు యశ్వంత్ .

వారిద్దరూ అక్కడినుంచి వెళ్లిపోతుంటే .. అంతవరకూ వాళ్ళిద్దర్నీ ఆప్యాయంగా చూస్తున్న విధాత్రి ఆత్మ వారిని

మనసారా దీవించింది .

మహల్ ని విడిచి ఊరి వైపుగా నడుస్తూ .. నాకెందుకో కొంచెం సత్యలో ఏదో మార్పు కనిపిస్తుంది యశ్ .. అంది

రచన .

అంటే ... ఏవిధమైన మార్పు ..? అన్నాడు యశ్వంత్ .

తన నడక , బాడీ లాంగ్వేజ్ , మాట్లాడే తీరూ .. సత్యలా అనిపించడమే లేదు . సత్య రూపం లోనే ఎవరో కొత్తవారిని

చూస్తున్నట్లు ఉంది . అంది రచన .

చిన్నగా నవ్వి .. మనం చూసే కోణాన్ని బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది . మనం ఎవరి నైనా పాజిటివ్ ఏంగిల్ లో

చూసామనుకో వాళ్ళెం చేసినా బాగానే ఉంటుంది .. అదే నెగటివ్ ఏంగిల్ అయితే వారు ఎంత పనులు చేసినా ..

మనకి నచ్చదు .. అన్నాడు యశ్వంత్ .

అంటే నేను సత్యని నెగటివ్ ఏంగిల్ లో చుస్తున్నానంటావా ? అది తప్పు యశ్ .. అంది బాధగా రచన .

ఇంతలో వీరి వైపు ఓ ముసలాయన వస్తు కనిపించాడు .

రచనా .. అతను సరస్వతి వాళ్ళ తాత కదూ .. అన్నాడు యశ్వంత్ అతడిని చూస్తూ ..

అవును యశ్వంత్ .. మనల్ని కలవాలనే వస్తున్నట్లున్నారు .. అని కాస్త వడివడిగా నడిచి "తాతా బావున్నావా ?'

అని అడిగింది రచన .

ఏం బాగు తల్లీ ? సరస్వతి ఇంతవరకూ ఇల్లు చేరలేదు . నీకేమన్నా తెలుస్తుందేమోనని వచ్చినా .. అన్నాడు అతడు

అవునా ? నిన్న మాతోనే వచ్చింది గానీ తిరుగు ప్రయాణం లో తను మాతో రాలేదు . ఆ పోలిస్ స్టేషన్ దగ్గరలో మీ

బంధువులేవరో ఉన్నారని వాళ్ళని కలిసి వస్తానని అంది . నేనూ కాదనలేకపోయాను .. వచ్చేస్తున్దిలే తాతా .. అంది

రచన .

యశ్వంత్ వీరి మాటలు విని దిగ్భ్రాంతి కి లోనయ్యాడు .

అదేంటి ధాత్రీ .. మీతో పాటూ నిన్న సరస్వతి రాలేదా ? అన్నాడు ఆశ్చర్యంగా ..

లేదు యశ్వంత్ .. చెప్పానుగా తను వాళ్ళ బంధువులింటికి వెళ్ళింది ... అంది రచన .

ఏం మాట్లాడుతున్నావు తల్లే ... ఓ విధవరాలు మొగుడు చచ్చినాక సూతకం పాటించక , పదో రోజు భోజనాలెట్టక

ఎవరైనా చుట్టపోలింటికి ఎల్తదా ? ఎల్లదు తల్లే .. అది తప్పు .. సరస్వతి అలా సేయదు .. అన్నాడు ముసలోడు .

(ఇంకా ఉంది )








ఆదివారం "రుధిర సౌధం " ప్రచురించబడదు ;గమనించగలరు

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ఆమని కోయిల

చిగురాకు రెమ్మల్లో కూసింది లే కోయిలా

చిరుగాలి తాకిడి కె ఊగింది కొమ్మ ఊయలా ..

కంగారు పడకే చిలిపి కోయిలా .. బంగారు మనసున్నచిన్నారి కోయిలా

నీ ఎదురుచూపులన్ని ఆమని రాక కై కదా ..

ఓ వాసంత వీచిక రాగా బెదిరిపోతే ఎలా ..

నిను కోరి వచ్చే ప్రేమ మాసం .. రాగాల ఊయల ఊపే ఈ చైత్ర గీతం

మధుర రసమేదో ఒలికించి గొంతులో ,కుహు కుహు పాటలతో  అందించు  గానామృతం

మావిచివురే తిని మధువు మదిలో కని మండుటెండ నైనా కూయవే కోయిలా

వేసవి వడగాల్పుల్లో తీయని  రాగం తీసి చిరుగాలి అలల తేలవే ముద్దుల కోయిలా

నీ గొంతు వింటే పరవశ మొందని హృదయము ఉండదు ..

నీ శృతి లో జతి కావాలనుకోని రాగం ఉండదు ..

ప్రణయ ఝంఝా మారుతం లా నీ కూత అలా ప్రకృతి కన్యని పులకరింప జేయదా ..

వాసంతం కురులు విప్పి ఆనంద తాండవం చేయగా వడివడిగా తరలి రాదా ..

రూపవిహీనమైన గానీ మధుర గానాన రాణీ .. నీకు సాటి వేరెవరు లేని గాన సుధ వి నీవే కానీ






అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 2 April 2014

రుధిర సౌధం 109

నీటిలో పడటం తో పెద్దగా దెబ్బలేమీ తగల్లేదు యశ్వంత్ కి .

యష్ .. ఏం కాలేదు కదా నీకు ? ఆందోళన గా అడిగింది రచన .

అరె లేదు రచనా .. అని కాస్త తేరుకున్నాక ఆలయ ద్వారం వైపు చూసాడు .

ఆలయద్వారాన్ని ముట్టుకోగానే ఇలా వచ్చి పడ్డావంటే .. కారణం ఏమయ్యుంటుంది ? భయం గా అంది రచన .

లేదు రచనా .. నువ్వేం బాధపడకు . ఆలయద్వారం అంత తేలిగ్గా ఎలా తెరచుకుంటుంది .. అదీ ఎప్పుడు పడితే

అప్పుడు .. అన్నాడు యశ్వంత్

మరి ? అంది రచన సందేహంగా ..

రచనా .. ఎన్నాళ్ళు నుండో మూసి ఉన్న ఈ గుడి ని ఏటువంటి ముహూర్తం నిర్ణయిన్చాకుండానే ఆలయద్వారాలని

తెరవాలని ఎలా అనుకుంటావు ? నువ్వే చెప్పు అనునయంగా అన్నాడు యశ్వంత్

అవును .. నువ్వు చెప్పేది నిజమే .. అన్నట్టు .. ఆలయం అంతా నీటిలోనే ఉంది యశ్వంత్ .. ఈ నీరు అంతా ఎలా

పోతుంది ఇక్కడి నుంచి . ఈ నీరిలా ఉంటె ఈ ఆలయం లో దీపాలు ఎలా పెట్టగలం ? అంది రచన సందేహంగా .

అవును రచనా .. నువ్వు దీపాలు పెట్టాల్సింది పౌర్ణమి రోజున . పౌర్ణమికి ఇంకా వారం సమయం ఉంది .. ఈలోపు

ఆలయం చుట్టుపక్కలా గమనించాలి . ఒక గొలుసు ఏర్పాటులా ఈ నీటి చక్రం పనిచేస్తుంది . ఇక్కడ్నుంచి ఈ నీటి

ని తొలగించే అమరిక ఉండే ఉంటుంది . అన్నాడు యశ్వంత్ .

అవును .. ఉండే ఉంటుంది యశ్వంత్ . లేదంటే నీటిలో దీపాలు వెలగవు కదా .. నా అంచనా ప్రకారం విగ్రహం కూడా

నీటిలోనే ఉండి ఉంటుంది . అంది రచన ఆలయం వైపు ఆరాధనా భావం తో చూస్తూ .

అవును .. రచనా .. నీటిలో ఇంతసేపు ఉండటం మంచిది కాదు పద .. మన వాళ్ళు మన కోసం ఎదురుచూస్తూ

ఉంటారు . ఇక బయటకి వెళ్లి తదుపరి కార్యక్రమం ఏమిటన్నది ఆలోచించుకోవోచ్చు .. అన్నాడు యశ్వంత్ .

సరే .. యశ్వంత్ .. అని ఆలయాన్ని కళ్ళనిండా నింపుకొని వెనుదిరిగింది రచన .

ఇద్దరూ కాసేపట్లోనే రాతి పలక దగ్గరకి చేరుకున్నారు . రాతి పలక ని తొలగించే సరికి మడుగు నీటితో నిండి ఉంది .

అరె అప్పుడే ఈ మడుగు నీటితో నిండి పోయింది యశ్వంత్ .. అంది కంగారుగా రచన .

మారుమాట్లాడకుండా రాతి పలకని యథా స్థానం లో ఉంచి మడుగు వెలుపలకి వచ్చారు ఇద్దరూ ..

నిజంగా ఎంత విచిత్రంగా ఉందొ ఈ ఏర్పాటు అంతా .. భూ గర్భం లో ఆలయం .. అని రచన ఇంకేదో అనబోతుంటే ..

జలదేవత సంరక్షణ .. అన్నాడు యశ్వంత్ .

వ్వాట్ ? అంది రచన .

అవును రచనా .. ఇదంతా అంత సామాన్య మైన విషయం కాదు . జలదేవత ఆలయాన్ని సంరక్షిస్తుంది . ఇలాంటి

విషయాలు కథల్లో వినడం వరకే తెలుసు మనకి . కళ్ళారా చూడగలగటం మన అదృష్టం .. అన్నాడు యశ్వంత్ .

నిజమే యశ్వంత్ .. వైష్ణవీ మాత లీలల గురించి చిన్నప్పుడు నాన్న కథలు కథలుగా చెప్పేవారు .. ఇదంతా

ఆయన కల . నెరవేర్చగాలిగితే ఆయన సంతోషానికి అవధులుండవు . నీళ్ళు నిండిన కళ్ళతో యశ్వంత్ వైపు

చూస్తూ అంది రచన

ఇంకా ఉంది     




























మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 1 April 2014

రుధిర సౌధం 108

లోపలంతా నీటితో నిండి ఉన్న సొరంగ మార్గమది . యశ్వంత్ ,రచన భుజాలకి మించి నీళ్ళు నిండి ఉన్నాయి .

యశ్వంత్ .. ఇదంతా చూస్తుంటే ఇదో పెద్ద సొరంగ మార్గం లా ఉంది . ఇంత సీక్రెట్ గా అమ్మవారిని ఉంచారంటే నాకు

ఆశ్చర్యంగా ఉంది .. అంది రచన ఉద్వేగాశ్చర్యాలకి లోనై .

అవును రచనా .. కానీ నాకు చాలా సంతోషం గా ఉంది . మనం ఈ మార్గాన్ని కనుగొన గలిగాం .. హుషారుగా

అన్నాడు యశ్వంత్ .

ఇలా నీటిని ఎదురీదటం కష్టం గా ఉంది . కానీ మనం కొంచెం ముందుకి వెళ్ళాలి యశ్వంత్ .. ముందుకి అతికష్టం

మీద సాగుతూ అంది రచన .

గుడిని మనం కనుగొనగలిగితే ఏ కష్టాన్ని అయినా ఎదిరించగలం రచనా .. నువ్వు నా చేతిని పట్టుకొని పద

ముందుకి .. అని ఆమె చేతిని అందుకొని ముందుకి సాగాడు యశ్వంత్ .

అలా అతికష్టం మీద ముందుకి నడిచిన వారికి ఎదురుగా కనిపించిన దృశ్యం చాలా ఆనందాన్ని కలగ జేసింది .

యశ్ .. అదే కదూ గుడి ముఖ ద్వారం .. ఆనందం తో గట్టిగా అరచింది రచన .

ఎస్ .. రచనా .. మనం సాధించాం . అదే కావొచ్చు .. అని రెట్టించిన ఉత్సాహం తో ఆ పాత రాతి ముఖద్వారాన్ని

చేరుకొని సంతోషంగా దాన్ని తాకి .. రచనా .. వీటి మీద ఉన్న శిల్పాలు చూడు .. ఎంత అద్భుతం గా ఉన్నాయో ..

అన్నాడు అబ్బురంగా వాటిని చూస్తూ యశ్వంత్ .

అవును యశ్ .. నాకు అసలు సంతోషం తో మాట రావటం లేదు . ఇప్పుడు  చాలా  సంవత్సరాలుగా ఈ

భూ నివాసం లో ఉన్న అమ్మవారిని  ఇన్నాళ్ళకి చూడబోతున్నాను అన్న సంతోషం ముందు ఇంకేదైనా

దిగదుడుపే యశ్వంత్ . అంది రచన .

అతడు సంతోషం తో ఆమె ని గుండె కి హత్తుకున్నాడు . రచనా .. మనం అనుకున్నది సాధించగలిగి నందుకు

ఏంటో సంతోషం తో కూడా గుండె బరువెక్కి నట్లుంది అన్నాడు యశ్వంత్ .

ఇదంతా నీవల్లే యశ్వంత్ . ... నువ్వు లేకపోతె ఏదీ సాధ్యం అయ్యేదే కాదు . కొన్ని తరాలకి దక్కని అదృష్టం ఇది .

మనం ఇంత వరకు రాగలిగం . ముందు నేను అమ్మవారిని చూడాలి యష్ .. లోపలికి వెళ్దాం . అంది రచన .

ఊ.. తప్పకుండా .. పద .. అని ఆమె చేతిని పట్టుకొని నీటిలో మునిగి ఉన్న మెట్లని ఎక్కి ఆలయ ప్రాంగణం లోకి

చేరుకున్నారు ఇద్దరు .

ఆలయం గర్భగుడి ద్వారం మూసి ఉంది . కానీ దానికి తాళం ఏదీ పెట్టి లేదు . ఎర్రని లావుపాటి దారం తో ఎవరు

ఆలయద్వారం తెరవ కుండా కట్టి ఉంచారు .

రచనా .. నేను తలుపు తెరుస్తాను .. అని ఆ దారాన్ని విప్పేందుకు తాకాడు యశ్వంత్ . అంతే ... కరెంటు షాక్ కొట్టి

నట్టు అల్లంత దూరం లో ఎగిరిపడ్డాడు . అతడు నీటి లో అంత బలంగా పడటం తో గట్టిగా చప్పుడైంది .

ఆ హటాత్ పరిణామానికి విస్తుపోయి .. యశ్ .. అంటూ పరుగున యశ్వంత్ దగ్గరికి వచ్చింది రచన .

ఇంకా ఉంది












మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
www.facebook.com/Naarachana

Monday, 31 March 2014

రుధిర సౌధం 107

మడుగు లో తన కాళ్ళని ఆడిస్తూ .. లేదు యశ్వంత్ .. నేనేమీ తప్పు చేయటం లేదు కదా అని ఆలోచిస్తున్నాను ..

అంది నిరాసక్తంగా రచన .

అదేంటి ?ఇంతకీ ఏ విషయం లో ఇలా ఆలోచిస్తున్నావు ? అని అడిగాడు యశ్వంత్ .

యశ్ .. ఇంతకి ముందు సత్య నాతొ ఏమందో తెలుసా ? అంటూ సత్య కి తనకి నడుమ జరిగిన సంభాషణ కోసం

చెప్పింది రచన .

ఓహ్ అంతేనా ? దీనికోసమా ఇంత ఆలోచిస్తున్నావు ? ఒక్కోసారి  మీ ఆడవాళ్ళు వెంటవెంటనే అభిప్రాయా లు

మార్చేసుకుంటారు .. సత్య కూడా అంతే .. నాకలా జరగటం చూసి తనలా మాట్లాడి ఉంటుంది . తనకి మురారి

నచ్చచెబుతాడు లే . నువ్వేం ఆలోచించకు .. అయినా ఎన్ని అడ్డంకుల నైనా ఎదుర్కొని ఇంతా చేస్తున్నాం .

అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ఆలోచన అవసరమా ? పద .. నాకు చాలా ఆకలిగా ఉంది .

అని లేచి ఆమె కి తన చేయి అందించాడు యశ్వంత్ .

ఆమె అతడి వైపు చిరునవ్వు తో చూసి అతడి చేతిని అందుకొని లేవటానికి ప్రయత్నించింది . కానీ మడుగు లో

కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం వల్ల ఆమె గౌన్అంచు దేనికో చిక్కుకు పోయింది .

అయ్యో .. యశ్ .. నా గౌన్ దేనికో చిక్కుకు పోయింది .. చిరిగిపోతుందేమో .. ఆందోళన గా అంది రచన

డోంట్ వర్రీ మేడం .. నేను దాన్ని చిరిగిపోకుండా తీస్తాను గా అని మడుగులోకి దిగాడు యశ్వంత్ . ఆమె గౌన్

చిక్కుకు పోయినట్లు కనిపిస్తున్న చోట చేయి పెట్టి తీయబోయాడు . ఏదో తలుపు ఘడియ లా అనిపించి నొసలు

చిట్లించి రచనా వన్ మినిట్ అని నీటిలోకి మునిగి చూశాడు .

అతని కళ్ళు ఆశ్చర్యానందాలతో చెమర్చాయి . మడుగు అడుగుభాగం అంతా వెదికిన దొరకని రాతి పలక ద్వారం

మడుగు గోడల మీద కనిపించేసరికి అతడికి సంతోషం తో మాటలు రాలేదు .

యశ్ .. ఏమయింది ? నా గౌన్ దేనికి చిక్కుకు పోయింది ? ఒడ్డు మీద నుంచి అడిగింది రచన.

అతడి నీటి పైకి వచ్చి రచనా .. వుయ్ గాట్ ఇట్ .. సంతోషంతో గట్టిగా అరిచాడు యశ్వంత్ .

ఏమయింది యశ్వంత్ ... ద్వారం కనిపించిందా ? కళ్ళింత చేసి అడిగింది రచన .

ముందు నువ్వు మడుగులోకి రా .. అని ఆమె చేయి పట్టుకొని మడుగులోకి లాగాడు యశ్వంత్ .

ద్వారం ఘడియ కి చిక్కుకుపోయిన గౌన్ జాగ్రత్త గా తీసి రచన ని చూపించాడు ఆ రాతి పలకని .

మనిషి కుర్చుని మాత్రమే లోపలికి ప్రవెసించగలిగి నట్లు ఉందది . రచన కనులు ఆనందం తో వెలిగాయి .

ఇద్దరూ కల్సి రాతి పలక ని అతి కష్టం గా తొలగించగానే .. మడుగులోని నీరంతా ఆ మార్గం గుండా రాతి పలక

వెనుక ఉన్న సొరంగ మార్గం లోకి వెళ్ళిపోయాయి .

మడుగు నీళ్ళు లేకుండా బురద తో నిండిపోయున్నా మళ్ళి ఒకరంద్రం గుండా నీళ్ళు ధారగా రావటం గమనించాడు

యశ్వంత్ .

రచనా .. మడుగులో నీళ్ళు ఖాళీ కాగానే మళ్ళి ఆ చెరువు లో నీరు వచ్చి చేరుతోంది . మడుగు నిండే లోగా మనం

ఈ లోపలికి వెళ్ళాలి ఈ పలక మూసేయాలి లేదంటే సొరంగమార్గం అంతా నీళ్ళతో నిండిపోతే కష్టమైపోతుంది . అన్నాడు యశ్వంత్ .

తల ఊపి మేను ఒంచి లోపలికి వెళ్ళింది రచన . ఆమె వెనుకే వెళ్లి పలక ని యథా స్థానం లో పెట్టాడు యశ్వంత్ .

ఇంకా ఉంది 























మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday, 30 March 2014

ఉగాది ని ఆహ్వానిద్దాం



కొంగ్రొత్త ఏడాది .. తెచ్చింది ఉగాది ...

కోయిలమ్మ కచేరి .. మావిచిగురు చెంత చేరి ..

స్థితి గతుల చింత మరచి భవిత కొరకు ఆరాలు తీసి

వేదపండితుల చుట్టూ చేరి .. జాతకాల ఫలిత మెరిగి

పంచాంగ శ్రవణాల సంప్రదాయాలని గౌరవించి ..

అమావాస్య వెళ్ళిపోయి పున్నమే వచ్చినట్టు ..

అందరూ ఒక చోట చేరి ఆటపాటలతో మైమరచి ..

విందులు ,వినోదాలు ఆనందపు సంబరాలు ..

షడ్రుచుల జీవితాన్ని మేళవించు పచ్చడి ..

ఆరగించి జీవితాన సుఖ దుః ఖపు లోతులు ..

చూడగలడు తెలుగు వాడు కష్టాలకి వెరవడు ..

మావి పూత సొగసులద్ది వేసవి రుచి చూపుతుంది ..

కోయిలమ్మ కూత లోన హాయి రుచి మరుగుతుంది ..

చైత్రవీణ మనసు నిలిపి కమ్మని రాగాలను మీటుతుంది

సరికొత్త ఆశలని ఉగాది మోసుకొస్తుంది ..

ఆ దైవం దీవెనలు ఊరూరా పంచుతుంది ..




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది