Powered By Blogger

Monday, 10 February 2014

ప్రేమ గోల (లీల )

   మనసే  నీలా నను  పిలిచింది  ఈవేళ ..

   ఇది నీ లీలా .. చెప్పవే ఓ ప్రియురాలా ..

   ఏదోలా .. ఉందే ఎలా ? ఏంటోలా..  నను చూస్తే ఏమి కాను నేనిలా ?  

   నా మనసే నీలా నను పిలిచింది ఈ వేళా ...

   ముట్టు కుంటే కందిపోయే గులాబీల బాలా ..

   కుట్టి నావే చుప్పనాతి కందిరీగలా ...

   కట్టుకుంటే నిన్నే కట్టుకోవాలని  పించేలా ..

   చీరకట్టు లోనే ముద్దోచ్చేసావ్ అంతలా  ...

   బెట్టు చేసి కట్ అంటే పవర్ కట్ గుండె లోనా ..

   ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నన్ను చేరు కోమ్మా ..

   మహారాణి మళ్లే చూసుకుంటా డౌటేమీ లేదమ్మా .. మనసే   

   అల్లిబిల్లి చందమామా .. మబ్బు చాటు నేలా ?

   చిరుగాలి తాకితే మబ్బైన కరిగి చేరు నేల  ..

   గిల్లికజ్జాల భామా .. ఆపవా నీ గోలా ..
 
   చిరునవ్వు తో ఒడి చేరితే పాడనా జోలా ..

   తుళ్ళి పడే కన్నెపిల్లా .. పెళ్లి అంటే ఉలికి పడకలా ..

  మళ్ళి మళ్ళి రాని రోజూ .. నీకోసం వేచాడీ ఈ  రాజు

  నన్ను నమ్మి నాతో వస్తే ఈ జన్మకి చాలు నమ్మా ..  మనసే    


Sunday, 9 February 2014

రుధిర సౌధం 71






యశ్వంత్ కి ఎందుకో అనుమానం వచ్చి పైకి చూసాడు .. తమ వైపే చూస్తున్న ఆ భయంకర మైన కన్ను ప్రళయ

భయానకం గా కనబడింది .. యశ్వంత్ .. పైకి చూడటాన్ని గమనించి రచన ఏమిటా అని చూసింది .. ఆమెకేం

కనబడలేదు . మళ్ళి కిందకి చూసింది .. దిక్సూచి తిరగడం ఆపి దక్షిణం వైపు చూపించింది ..

యష్ .. సంతోషం గా అరచింది రచన .

నుదుటికి పట్టిన చెమటని తుడుచుకొని ఆమె వైపు చూసాడు యశ్వంత్ .

ఇది దక్షిణం వైపు చూపిస్తుంది .. అన్నది రచన .

ఓకే .. అని మళ్ళి పైకి చూసాడు యశ్వంత్ . అంతా మామూలు గానే ఉంది .

యశ్వంత్ .. ఏమయింది ? ఎందుకలా పైకి చూస్తున్నావు ? అనుమానం గా అడిగింది రచన .

అబ్బే .. ఏం లేదు .. అని లేచి నిల్చున్నాడు .. ఇంతలో హృదయ విదారకం గా వైజయంతి గదిలోంచి ఓ ఏడుపు

వినిపించింది .. ఆ ఏడుపు వింటుంటే అది చెవిలో రంపపు కోతలా ఉంది ..

యష్ .. అంది భయంగా రచన .

రచనా .. భయపడకు .. ఏవీ నిజాలు కాదు . మనల్ని దారి తప్పించడానికే అంతా .. మన మనస్థైర్యమె మనల్ని

కాపాడుతుంది . అని దిక్సూచి దక్షిణం వైపు చూపించింది అన్నావు కదా .. ఇటు వైపు దక్షిణం అంటే .. మేడ మీదకి

వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి .. కానీ మనం ఈ మహల్ ని ఓసారి చూశాం కదా .. మహల్లొపల ఆలయం ఎక్కడ

ఉండి ఉంటుంది .. అని ఆలోచనలో పడ్డాడు యశ్వంత్ .

యష్ .. నాకర్థ మైంది .. ఆలయం భవనం లో లేదు .. భవనం వెనుక వైపు .. మనం భవనం వెనుక వైపు వెతకాలి ..

అంది రచన .

రచనా ... ఐతే పద .. భవనం వెనుకకే వెళ్దాం అని గుమ్మం వైపు నడవబోతుండగా తలుపులు పెద్ద శబ్దం చేస్తూ

మూసుకున్నాయి .

ఓహ్ గాడ్ .. మనం బయటికి వెళ్ళకుండా తలుపులు మూసేసింది ఈ వైజయంతి .. పళ్ళు కొరుకుతూ అంది రచన .

ఏం ఫర్వాలేదు . భవనం లోపలి నుంచి కూడా వెనుక భాగం వైపు వెళ్ళడానికి ఖచ్చితం గా ఆస్కారం ఉండి

ఉంటుంది .. మనం లోపలనుంచే చూద్దాం రచనా .. అని రచన వైపు చూసాడు యశ్వంత్ .

ఆమె ఎందుకో బిగుసుకు పోయి ఉంది .

రచనా ఏమయింది ? అని ఆమె చూపు నిలిచిన వైపు చూసాడు యశ్వంత్ ..

మెట్ల మీద నల్లని బట్టల్లో జుట్టు విరబోసుకుని ఓ స్త్రీ వీరి వైపే చూస్తుంది ..

యశ్వంత్ రోమాలు నిక్కబొడుచు కున్నాయి .. నాలుక తడి ఆరిపోయింది .. ఆమె కళ్ళలో నల్ల గుడ్లు కనబడటం

లేదు .. రచనా .. ఆమె .. ఆమె .. దెయ్యం కదూ ... మెల్లిగా అన్నాడు యశ్వంత్ .

రచన కూడా .. మాట రాక స్థానువై ఉండిపోవటం తో అయోమయం గా తల ఊపింది .

సినిమాల్లో తెల్ల చీర కడతారు .. ఇక్కడేంటి ఈవిడ నల్లగా ... అని యశ్వంత్ అనబోతుండగా .. ష్ అంది రచన .

లేనిపోని ధైర్యం తెచ్చుకుంటూ .. మమ్మల్ని భయపెడదామని అనుకుంటున్నావా ? అంది రచన .

ఆ స్త్రీ భయంకరం గా అరచింది .. ఎంతలా అంటే వీళ్ళిద్దరి గుండె ఆగిపోయినంత పనయ్యింది ..

అయ్యో .. ఏం జరగబోతుంది ఇప్పుడు ? విధాత్రి రాదేం .. ఇప్పుడు ఈ వైజయంతి ఏం చేస్తుందో మమ్మల్ని ...

బయటికి దైర్యం గా ఉన్నా లోపల మాత్రం తడసి పోతుంది .. అనుకున్నాడు యశ్వంత్ మనసులోనే ..

కానీ రచన ని చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు యశ్వంత్ ..

ఆమె మొహం లో మెల్లిగా భయపు ఛాయలు మాయమై ధైర్యం గా అంది .. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో ...

వైజయంతీ ... ఈ మహల్ ని నువ్వు వీడి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది ... అంది రచన ..

ఆ స్త్రీ గొంతు భయంకరం గా పలికింది ...

కానివ్వను ... మీకు దక్కనివ్వను .. నాది కానిది మీది కానివ్వను . నీ ప్రాణం తీస్తా ... అంది ఆ స్త్రీ ..

ఆ .. రా .. అని రెండు అడుగులు ముందుకి వేసింది రచన .

వచ్చి నా ప్రాణాలు తీసుకో .. నీకూ తెలుసు .. నువ్వు అందరి ప్రాణాలు తీసినట్లు నా ప్రాణం తీయలేవని .. అంతే

కాదు .. వైష్ణవీ మాత ఆలయం కూడా నా ద్వారానే తిరిగి తెరవ బడుతుందని కూడా నీకు తెలుసు .. ప్రేతాత్మ గా

ఇంకెన్నాళ్ళు కాలం వెల్లదీస్తావు .. ప్రాణం పోయినా ఈ మహల్ మీద మమకారం చావదా నీకూ ? ఆవేశం గా

ప్రశ్నించింది రచన .

మంత్ర ముగ్ధుడై రచన వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు యశ్వంత్ .. ఈమె రచనా లేక విధాత్రా ? అని .

(ఇంకా ఉంది )

Saturday, 8 February 2014

నిర్లక్ష్యం కుదరదు

      కొన్ని సార్లు మనసు కూడా మూగబోతుంది..

      బాధ ఎందుకో కూడా తెలియని అయొమయ స్థితి..
      
      ఎదో తెలియని స్థబ్ధత..మది ని ఆక్రమించేస్తుంది..

      మనసు లొపల నిశ్సబ్దం భయపెడుతుంది...

      ఒక్క మాట చెప్పనవసరం లేకుండా..ఎవరైన ఓదార్చితే

      బావున్నని పిస్తుంది ...

      ఒంటరితనం వెక్కిరిస్తుంది ...

      సహనం ఇంక చాలనిపిస్తుంది...

      బహుశా ...ఇలాంటి భావాలు మనసులో కలిగితే..

      నిర్లక్ష్యం చేయకండి...ఎందుకంటే...ఇలాంటి ఆలోచనలు

      ఆత్మన్యూన్యతా చిహ్నాలు..    

రుధిర సౌధం 70




ఊరంతా చీకటిగా ఉంది .. కొన్ని ఇళ్ళల్లో కిరోసిన్ లాంతర్ల చిన్న పాటి వెలుగు .. మహల్ కి వెళ్ళే రూట్ అలవాటై

పోవడం వల్ల త్వరగానే చేరుకున్నారు ఇద్దరూ. సైకిల్ లు పక్కన పెట్టి గేటు తీసుకుని లోపలికి నడిచారు టార్చ్ లైట్

సహాయం తో ,,

రచనా .. ఇంతకీ ఈరోజు మహల్ రావటం వెనుక నీ ఉద్దేశ్య మేంటి ? ముందుకి నడుస్తూనే అడిగాడు యశ్వంత్ ..

యష్ .. ఈ మహల్ లో ఒక ఆలయం ఉంది .. అమ్మవారి ఆలయం .. కానీ ఆ ఆలయం ఎక్కడ ఉందో ఏమో నాకూ

తెలీదు .. అంది రచన ..

ఒక్కసారి  ముందుకి వెళ్తున్నవాడల్లా ఆగి .. ఈ మహల్లో ఆలయం ఉందని  నీకు ఎలా తెలుసు రచనా ? అని

అడిగాడు యశ్వంత్ ..

అదీ .. యష్ .. నాకు బసవరాజు చెప్పాడు .. ఆలయం లో దీపాలు వెలిగిస్తే ఈ మహల్లో ఉన్న క్షుద్ర శక్తి మహల్ ని

వీడి పోతుందని .. అంది రచన ..

ఓహ్ .. బహుసా విధాత్రి కూడా ఈ విషయం కోసమే నాకు ఆరోజు చెప్పి ఉంటుంది .. కానీ వినడానికి ఇంత సింపుల్

గా ఉన్న ఈ విషయం చేతల్లో కష్టం కావొచ్చు .. ఐనా మహల్లో ఆలయం ఉండటమే విచిత్రం గా తోస్తుంది .. అని

మనసులో అనుకుంటూనే ముందుకి కదిలాడు యశ్వంత్ ..

సింహద్వారాన్ని చేరుకొని తాళం తీయ బోతుండగా .. కాలి కి వెచ్చగా ఏదో తగిలి నట్లని పించి .. ఇద్దరు కిందకి

చూశారు ... టార్చ్ వెలుగులో చిక్కటి రక్తం .. తలుపు కింద నుంచి ప్రవహిస్తుంది ..

యష్ .. బ్లడ్ .. అని చెంగున పక్కకి దూకింది రచన ..

సందేహం లేదు రచనా .. ఇక్కడే బ్లడ్ మనకి కనిపించింది అంటే .. లోపల వైజయంతి మనకోసం కాచుకుని ఉంది .

అన్నాడు యశ్వంత్ .

ఎందుకో ఆమాట వినగానే గుండె ఝల్లు మంది రచన కి ..

యష్ .. అంది వణుకుతున్న కంఠం తో ...

ఎస్ .. నిన్ను రప్పించ డానికే ఇదంతా .. ఏం చేస్తే నువ్వోస్తావో తనకి తెలుసు .. అన్నాడు యశ్వంత్ .

యష్ ... నీ మాటలు .. నాకు ఆశ్చర్యం గా ఉన్నాయి .. అంది రచన .

రచనా .. నువ్వు నాతో చెప్పక పోయినా నాకు కొన్ని విషయాలు తెలుసు .. వాటి కోసం మనం తరువాత మాట్లాడు

కుందాం .. ప్రాణాలకి తెగించి నువ్విక్కడికి వచ్చావు .. నీకోసం నేను ప్రాణాల నయినా ఇస్తాను .. నిర్ణయం తీసుకో ..

లోపలకి వేళ్తున్నామా ? అని అడిగాడు యశ్వంత్ ..

ఆమె మౌనం గా తాళం తీసింది ..  తలుపుల్ని తీయగానే లోపల్నుంచి  కలప తో చేసిన ఓ టేబుల్ వీరి మీదకి ఎవరో

విసిరినట్టు రాసాగింది ..

యశ్వంత్ చురుగ్గా స్పందించి రచన ని పక్కకి లాగాడు .. విసురుగా వచ్చి కింద పడింది రచన ..

టేబుల్ మెట్ల మీదుగా దొరలు కుంటూ కింద పడింది ..

రచనా .. అంటూ ఆమె కి చేయి నిచ్చి లేపాడు యశ్వంత్ ... మెల్లిగా లేచి నిలబడింది రచన ..

ఆర్ యు ఓకే ? అని అడిగాడు యశ్వంత్ ..

యష్ .. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే .. నేను ఈ మహల్ ని  హస్తగతం చేసుకోవాల్సిందే .. అర్థం చేసుకో .. నాది

స్వార్థం కాదు .. ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర .. ఆ చీకట్లోనూ తళుక్కున మెరసింది ..

అతను చిన్నగా నవ్వి .. నేను నిన్ను స్వార్థ పరురాలివని ఎప్పుడన్నా అన్నానా ? నువ్వు చేసే ప్రతి పనీ న్యాయ

 పర మైనదే అని నాకూ తెలుసు .. ఆలస్యం చేయొద్దు పద .. మానసిక స్థైర్యం తో అడుగు ముందుకి వేద్దాం ..

ఆ వైజయంతి ఇంకేం చెయగలదొ చూద్దాం ... అన్నాడు స్థిరం గా యశ్వంత్ .

యష్ .. థాంక్  యు .. పద .. అని అతణ్ణి అనుసరించింది ఆమె .

ఇద్దరూ మెల్లిగా లోపలికి అడుగు పెట్టారు .. యశ్వంత్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ..

మొత్తం మహల్ లో ఉన్న హాల్ నంతటినీ పరికించి చూశారు .. ఇంతలో .. మేడ మీద ఉన్న గదిలోంచి ఏవేవో

శబ్దాలు వినబడ సాగాయి ..

రచనా .. ఆ శబ్దాలు ..   విన వస్తున్న గదే వైజయంతి ది .. ఆమె మనల్ని అక్కడకి రప్పించ టానికి ప్రయత్నిస్తుంది

మనం అక్కడికి తప్ప ఇంకెక్కడి కయినా వెళదాం .. అన్నాడు యశ్వంత్ ..

వారు నడుస్తున్న చోటంతా నెత్తుటి మయం .. కానీ అదేo  పట్టించు కోకుండా తన జేబులో ఉన్న దిక్సూచి ని

బయటికి తీసింది రచన ..

ఏంటి రచనా అది ? అడిగాడు యశ్వంత్ ...

యష్ .. అన్ని దిక్సూచి లాంటిది కాదు .. ఇది నేల పై పెడితే అది చుట్టూ తిరుగుతూ ఒక దిక్కుని చూపిస్తూ ఆగి

పోతుo ది అట .. ఇది సూచించే దిక్కు లోనే ఆ ఆలయం ఉంటుందని నాన్నగారు తన డైరీ లో వ్రాసు కున్నారు ..

అంది రచన ..

సరే .. పెట్టి చూడు .. అన్నాడు యశ్వంత్ .

ఇద్దరూ మోకాళ్ళ మీద కింద కూర్చున్నారు .. రచన ఆ దిక్సూచి ని కళ్ళకి అద్దు కొని కిందన పెట్టగానే కింద ఉన్న

నెత్తురంతా   మాయ మయింది .. రచన ,యశ్వంత్ లిద్దరూ సంతోషం ,ఆశ్చర్యం తో ఒకరి మొహాలొకరు చూసు

కున్నారు .. దిక్సూచి కింద పెట్టిన నిమిషం తర్వాత అది విచిత్రం గా తిరగటం మొదలు పెట్టింది .. ఇద్దరూ ఉత్కంట

దాని వైపు చూస్తున్నారు .. వారిని ఓ భయంకర మైన కన్ను ఆకలిగా కోపంగా చూస్తున్న విషయం వారు

గమనించే స్థితి లో లేరు .

(ఇంకా ఉంది ) 

Friday, 7 February 2014

మనసున నీవే కొలువైనావే

మనసున నీవే ..కొలువున్నావే ..

ఎదురుగ నీవే .. నిలిచావే ... ఓ మనసా ... ఇది తెలుసా ..

ప్రేమంటే మన ఇద్దరమే నని ..

మనసు న నీవే .. కొలువైనావే ..

చిరుగాలె నిను తాకి నీ ఊసె నావరకూ తెచ్చే ..

సిరిమల్లె పువ్వల్లె పరిమళమే నాలో నింపే ..

నీ ఊహ లోనే మొదలయ్యే ఉదయం .. ఈ దాహమెంటో తెలుసుకుందే హృదయం

నీ చెలిమి తోనే విచ్చుకుంది ప్రణయం .. నువ్వు పక్కనుంటే చేరగలద ప్రళయం ..

నువ్వే నా చిరునామా .. నీతోనే నా ప్రేమా ..

మనసున నీవే కొలువైనావే .. ఎదురుగ నీవే నిలిచావే ..

గగనాన జాబిలికి చేసానే నేనో  వినతీ ..

నిదురించే నా చెలికి నా జోల వినిపించమని ..

నాక్కూడా తెలియకుండా నాలోనే ఊయల లూగే .. నీ తలపు అలలు ఏవైనా..

ఓ వింత అనుభూతి ని మది తెలుసుకున్న తరుణ మిది  అవునా ?

నువ్వే నా తొలి ప్రేమా .. నా హృదయ సంబరమా ..

మనసున నీవే కొలువైనావే


Thursday, 6 February 2014

రుధిర సౌధం 69



నిద్ర పట్టక అటూ ఇటూ దొరలు తున్న యశ్వంత్ ని చూసి యష్ .. నిద్ర రావట్లేదా ? అని అడిగాడు శివ ..

లేదు శివా .. ఈ కరెంటు ఎప్పుడొస్తుందో .. ఈ వూళ్ళో కరెంట్ ఉన్న సమయమే తక్కువ .. రాత్రుళ్ళు తీసేస్తే ఇంకా

నిద్రేముంటుంది .. అని లేచి కూర్చున్నాడు యశ్వంత్ ..

అవును .. మనం తెచ్చిన బుక్ చదువుదా మన్న ఈ చీకట్లో చదవడం కుదరదు .. అన్నాడు శివ ..

ఇంత చీకట్లో ఈ సత్య కి ,మురారికి నిద్రెలా పట్టిందో .. కదా .. అంటూ లేచి శివా .. రచన దగ్గరకి వేల్లోస్తాను ..

అన్నాడు యశ్వంత్ ..

ఇప్పుడా ? టైం 10 అయింది .. అన్నాడు శివ కంగారుగా ..

అవుననుకో .. నాకు తెలసి తానింకా నిద్రపోయుండదు .. ఓసారి వేల్లోస్తాను .. అన్నాడు యశ్వంత్ ..

సరే .. మరి త్వరగా వచ్చెయ్ .. అన్నాడు శివ ..

హ .. అని 10 సెకన్లలో గుమ్మం దాటి చీకట్లో కల్సి పోయాడు యశ్వంత్ ..

బంగ్లా దగ్గరకి వచ్చి రచన కిటికీ కి కట్టిన తాడు ని అందుకొని పైకి ఎగ బాకాడు .. కిటికీ రెక్కని అందుకొని .. లోపలికి

తొంగి చూసాడు .. రచన ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద కుర్చుని ఉంది .. బెడ్ పక్క టేబుల్ పైన టార్చ్ వెలుగుతూ

ఉంది ..

ఇంతలో తలుపు తట్టిన సౌండ్ వినబడి యశ్వంత్ .. తల ని కిందికి దించి పక్కకి నక్కాడు ..

వెళ్లి తలుపు తీసింది రచన .

వెంగమ్మ ఓ కొవ్వొత్తి తో పాటు నిలుచుంది ..

నువ్వింకా నిద్రపోలేదా .. అని ఈవిడ సమాధానం చెప్పదుగా .. అని మనసులో అనుకొని .. ఆమె చేతిలో ని

కొవ్వొత్తి ని అందుకుని .. థాంక్స్ అంది రచన .. వెంగమ్మ మౌనం గా వెనుదిరిగి వెళ్ళిపోయింది .. కొవ్వొత్తి టేబుల్

మీద పెట్టి తలుపు ఘడియ వేసింది రచన .

తలుపు వేసిన శబ్దం వినగానే కిటికీ లోపలికి మళ్ళి తొంగి చూసాడు యశ్వంత్ .. రచన ఒక్కతే ఉందని నిర్థారించు

కున్నాక మెల్లిగా కిటికీ ఎక్కి లోపలికి దూకాడు ..

శబ్దం విని అటువైపు చూసిన రచన .. యష్ .. నువ్వా .. అంది ఆశ్చర్యం గా ..

ఆమె వైపు చిరునవ్వు తో చూసి ఆమె ని సమీపించాడు ..

ఏంటి ఇలా వచ్చావు ? అన్నదామె చిరునవ్వు తో ..

ఎందుకో నిన్ను చూడాలని పించింది .. వచ్చేసాను అన్నాడు యశ్వంత్ ..

ఆమె చిన్నగా నవ్వి .. థాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ .. అని కిటికీ కి తగిలించిన గిఫ్ట్ వైపు చూసింది ..

ఆమె చూసిన వైపు చూసి .. ఆర్ యు హ్యాపీ అన్నాడు యశ్వంత్ ..

యష్ .. ఐ అమ్ వేరి హ్యాపీ కానీ .. మనసు ప్రశాంతం గా లేదు అంది రచన .

ఏమయింది రా ? అని అడిగాడు యశ్వంత్ ..

ముందు నువ్విలా కూర్చో .. అని బెడ్ మీద కూర్చుంది రచన .. అతడు కూర్చున్నాక ..

అలా ఎదురుగా చూడు యశ్వంత్ .. అని తూర్పు కిటికీ వైపు చూపించింది రచన ..

అతడు అటువైపు చూసి .. ఆ కిటికీ ని ఎందుకలా మేకులు కొట్టి మరీ క్లోజ్ చేసారు ? అని అడిగాడు యశ్వంత్ ..

కాసేపటి క్రితం ఏం జరిగిందో తెలుసా ? అని జరిగినదంతా చెప్పింది రచన ..

అంతా విని .. కంగారుగా .. నౌ ఆర్ యు ఓకే ? అన్నాడు యశ్వంత్ ..

నేను ఓకే యష్ .. కానీ నాకు ఓ సారి మహల్ కి వెళ్ళాలని ఉంది .. నువ్వు నాతో వస్తావా ? అని అడిగింది రచన ..

లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ ..

అతని వైపు సంతృప్తి గా చూసి .. థాంక్స్ యష్ .. ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తాను .. అని బెడ్ మీంచి లేచి కప్

బోర్డు లో డ్రెస్ తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళింది రచన ..

ఈలోపు మంచం మీద నించి లేచి రచన చెప్పిన కిటికీ దగ్గరకి వెళ్లి పరీక్ష గ చూసాడు యశ్వంత్ ..

"అస్సలు రచన చెప్పింది జరగ డానికి అవకాశమే లేనట్టుంది .. కానీ తన మాట ని కొట్టి పారేయలేను .. ఇలా

ఎందుకు జరిగి ఉంటుంది ? ఎందుకైనా సరే .. రచన తో ఓసారి మహల్ కి వెళ్ళడం మంచిదే .. విధాత్రి ని కలిసే

అవకాశం కలగొచ్చేమో .. ఆమె మాత్రమె చెప్పగలదు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు .. "అని యశ్వంత్ తనలో తానె

ఆలోచిస్తుండగా నే ..

యష్ నేను రెడీ .. అన్న రచన మాటలు వినబడి వెనక్కి తిరిగి చూసాడు యశ్వంత్ ..

యష్ .. వెళదామా .. రాత్రంతా కరెంటు ఉండదు .. మనల్ని ఎవరూ గమనించరు ..

అంది రచన ..

సరే అని కిటికీ వైపు నడిచాడు యశ్వంత్ .

ఇద్దరూ కిటికీ గుండా కిందికి దిగారు ..

యష్ .. పద .. అంది రచన .

రచనా .. మన సైకిల్ లు ఉన్నాయిగా .. నేను తీసుకొస్తాను .. నువ్వు ఇంటి బయట ఉండు .. అని యశ్వంత్ వాళ్ళు

ఉండే ఇంటి వైపు నడిచాడు .. శివ కూడా మెల్లిగా నిద్రపోవడం తో యష్ రాకని గమనించలేదు ..

మెల్లిగా రెండు సైకిల్ లను బయటకి తెచ్చి తలుపు వేసాడు యశ్వంత్ ..

ఇద్దరూ చెరో సైకిల్ తీసుకుని రాణి మహల్ వైపు సాగిపోయారు .



(ఇంకా ఉంది )

బాల భానుని జన్మదినం

 


దినకరుడు ,శుభకరుడు .. వెలుగుల రేడు భాస్కరుడు . 

దివాకరుడు .,ప్రభాకరుడు .. ప్రభావించాడు నేడు ..

సప్తాశ్వ రథా రూఢ .. సూర్య నారాయణ ..

ఏక చక్ర ధర ..ఆరోగ్య ప్రదాతా .. హిత కారక .. క్రిమి సంహారకా ..

జగము ని మేల్కొలుపు నీ ఆగమనం ..

వెలుగు లు ప్రసరించు నీ కిరణం ..

ప్రత్యక్ష దైవం నీవయ్య .. ఈ లోకం సమస్తం నీదయ్య ..

అర్కుడ నీవు .. మార్తాండు డవు .. అల్పుల మేము .. ఆధారము నీవు ..

జనార్దన .. తామర వల్లభ .. దీవెన లీయగ రావయ్యా ..      

ఉదయ కిరణాలు బ్రహ్మ స్వరూపాలు .. మధ్యాహ్న కిరణాలు శివ మయాలు ..

సాయంత్ర కిరణాలు విష్ణు స్వరూపాలు .. రేయి న వెలిగే ఇన బింబ వెన్నెలలు

సంధ్యా ,ఛాయా సహిత శ్రీ సూర్య నారాయణ .. తిమిరము మాయము నీ సమక్షమ్ ..

రథ సప్తమి పర్వదినం .. బాల భానుని జన్మదినం .. జగతిని మేల్కొలుపు పుణ్య దినం ..

ఉత్తర దిక్కుకి నీ పయనం .. వేసవి కాలపు ఆరంభం .. ప్రచండ ,ఉగ్ర స్వరూప .. నీకిది యే మా అభినందనం

రుధిర సౌధం 68

హాల్ లో గుమస్తా శంకరం తో ఏదో మాట్లాడు తున్న రత్నం రాజు కి మేడ మీది గది నుంచి గట్టిగా అరుపు వినిపించింది
అతను ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు .. శంకరం గారు .. మీకూ ఎవరో అరచి నట్లు వినిపించిన్దా ? అని అడిగాడు శంకరం ను
అవును బాబూ .. అరుపు .. పట్నం అమ్మాయి గది లోంచే .. అన్నాడు అతను కళ్ళద్దాలు సరిచేసుకుంటూ 
పైకి చూస్తూ .. 
 అయ్యో .. ధాత్రి కేమయి ఉంటుంది .. నేను వెళ్లి చూసోస్తాను .. అని పరుగున మెట్లెక్కి ధాత్రి గది తలుపు దగ్గరకి 
 చేరుకొని తలుపు తట్టాడు .. 
 ధాత్రీ ఏమయింది ? ఓసారి తలుపు తీయ్ .. అని గట్టిగా అరిచాడు రత్నం
 స్పందన లేక పోయేసరికి .. పక్కనే ఉన్న కిటికీ తలుపు ముందుకు తోసాడు .. కిటికీ తలుపులు తీసే ఉండటం తో 
కిటికీ గుండా లోపలికి దిగి చూసాడు రత్నం రాజు .. 
 నేల పై అచేతనం గా పడి ఉంది రచన .. 
 ధాత్రీ .. ధాత్రీ .. అని పిలుస్తూ ఆమె ని సమీపించి ఆమె ని తట్టి లేపాడు .. ఆమె లేవక పోయే సరికి .. వెంగమ్మా .. 
 అని గట్టిగా అరిచాడు .. వెంగమ్మ పరుగున వచ్చి తలుపు తట్టే సరికి .. వెళ్లి గది తలుపు తీసి .. వెంగమ్మ ముందు 
 నీళ్ళు తీసుకురా .. అని చెప్పి ధాత్రి ని తన రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పరుండ బెట్టాడు .. 
వెంగమ్మ చెంబు తో నీళ్ళు పట్టు కొచ్చింది .. 
 కంగారు పడుతూ కొంచెం నీళ్ళని రచన మొహం మీద చిలకరించాడు రత్నం .. 
 మెల్లిగా కళ్ళు తెరచి చూసింది రచన .. 


ఆమె మొహం లో మొహం పెట్టి కంగారు గా చూస్తున్న రత్నం ని చూసి తటాలున లేచింది రచన .. 
అప్పుడు గమనించింది గదిలో వెంగమ్మ కూడా ఆమె వైపు పరీక్ష గా చూస్తుంది .. ఏదో జరిగింది .. లేకపోతె 
వీళ్ళిద్దరూ గదిలో ఉన్నారేంటి ? అని ఆలోచన లో పడింది
ధాత్రీ ... ఎలా ఉన్నావు ? అసలేమయింది ? కంగారుగా అడిగాడు రత్నం .. 
అదీ .. అంటూ ఓసారి తూర్పు కిటికీ వైపు చూసింది రచన కానీ అది ఎప్పటిలానే మూసి ఉంది .. 
 ఏమయింది ధాత్రీ ? అంతలా అరిచావు .. నేనొచ్చే సరికి కింద పడున్నావు .. అన్నాడు రత్నం .. 
 అదీ రాజు గారూ .. అని  ఏం చెప్పాలి ... అని కొన్ని సెకెన్లు మనసులో తర్జన భర్జన పడి .. అదీ రాజు గారు .. 
 ఎలక .. ఎలక .. నా మీదికి దూకింది .. భయం తో గట్టిగా అరచేసాను .. అంది తడబడుతూ రచన .. 
 ఫక్కున నవ్వాడు రత్నం .. 
 అవునా ? నీకు ఎలక అంటే అంత భయమా .. ? మూర్చ పోయి నంతలా .. అని తెరలు తెరలు గా నవ్వాడు రత్నం
ఆమె ఇబ్బందిగా నవ్వి .. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నట్లు ఉన్నాను .. ఆమ్ సారీ .. అంది రచన .. నొచ్చుకుంటూ
 అయ్యో .. అదేo లేదు గానీ .. సరే .. నువ్వు హాయిగా పడుకో .. వెంగమ్మ భోజనం పైకే తెస్తుంది .. భోజనం చేసి 
 పడుకో .. సరేనా ? అన్నాడు ఆప్యాయం గా రత్నం .. 
 థాంక్స్ రాజు గారూ .. అంది రచన
 చిన్నగా నవ్వి .. వెంగమ్మా .. పద .. అని బయట కి నడిచాడు .. అతన్ని అనుసరిస్తూ వెంగమ్మ ఒక్కసారి వెనక్కి 
 తిరిగి రచన వైపు చూసింది .. ఆమె సంకోచం గా తూర్పు వైపు కిటికీ వంక చూడటం గమనించి .. వెటకారం గా 
 నవ్వుకుంది వెంగమ్మ .. 
 వాళ్ళిద్దరూ వెళ్ళాక గబగబా మంచం మీద నుంచి లేచి కంగారు గా కిటికీ దగ్గరకి ఒక్క అంగ లో వెళ్లి కిటికీ ని 
పరీక్ష గా చూసింది రచన .. 
 ఏంటి ? అంతా ఎప్పటిలానే ఉంది .. అది నా భ్రమ కాదు కదా .. నో .. కాదు నా కళ్ళు నన్ను మోసం చేయవు .. 
  సంఘటన వెనుక ఏదో ఉంది .. నేను మహల్ కి వెళ్ళాలి .. స్వామీజీ ఇచ్చిన తాయెత్తు నాదగ్గర ఉంది ..  
వైజయంతి మాయలు నన్నేం చేయగలవు ? నేను సమయం వృధా చేసేస్తున్నాను .. ఇలా కాదు .. కాకూడదు .. 
 సాధ్యమైనంత తొందరగా నేను నా లక్ష్యాన్ని చేరుకోవాలి .. అని మనసులో ధృడo గా అనుకుంది రచన
హాల్ లో వెంగమ్మ తో .. చూడు వెంగమ్మ .. ధాత్రి ఏవిదం గానూ ఇబ్బంది పడటం నాకిష్టం లేదు .. ఇంట్లో ఒక్క 
 ఎలక కూడా  కనబడ కూడదు .. మరోసారి ధాత్రి కి పరిస్థితి రాకూడదు .. అని చెప్పాడు రత్నం రాజు .. 
వెంగమ్మ మౌనం గా సరే నంటూ తల ఊపింది 

(ఇంకా ఉంది  )

Wednesday, 5 February 2014

ఆశ (song)

                                         

                                            కనుల గంగ పొంగే .. చెక్కిలి వొడ్డు దాటె
                                            మనసు కిది ఓ శాపమా .. ఓ జన్మలో పాపమా ..
                                            కలత వొడి చేరే .. కలల తడి మాయె ..
                                            మమత కిక మిగిలే శోకమా .. మరుల ముడి విప్పే భారమా ..

                                            ఆశ చిగురించే జాడ లేనట్టు .. ఆమనే రాని కాలమయి నట్లు
                                            మౌనమై పోకే ఇలా ... చినబోయిన ఓ కోయిలా ..
                                            చినుకు తడి తోనే నేల పులకించు ..
                                             ఆ నేల వొడి లోనే మొలక చిగురించు
                                            వేచుండవే వెన్నెలా .. అమవాస పున్నమై మారే రోజులా ..
                                            కలికి చిలకమ్మా .. ఆశ విడవకులే ..
                                            నీ అలక తీరే రోజు ముందరున్నదిలే ..
                                            నాడు విరబూయవే .. సిరిమల్లెలా ..

                                            పరుగునాపదే కాలమూ ,,,పలచనవ్వదె హృదయము ..
                                            ఫలిత మనుకున్నది .. ఫలము కాదే మరీ ..
                                            నిజము నిప్పని పించులే .. దాచుట సాధ్యమే కాబోదులే
                                            అడుగు వెంట అడుగు వేయులే పాదము ..
                                             అడిగినంత ఇవ్వలేనిదే సమయము..
                                            ఆశయం నీ తోడుగా .. సాగితే అది చాలుగా
                                            మంచు తునకమ్మ ..   కరిగి పోకమ్మ ..
                                            కరిగి పొతే నీకు రూప మేదమ్మ ?
                                             హిమ శిఖరమై నిలిచేవులే ..
                                             

ఓ వెల్లువలా ముంచినదా .. సాగరమైన ప్రేమా


ఓ వెల్లువలా ముంచినదా .. సాగరమైన ప్రేమా 

నీ అల్లికలో మల్లిక గా  .. సువాసన పంచిన ప్రేమా 

ఇరు మనసులలో ఉక్కిరి బిక్కిరి తుంటరి ఊహే నమ్మ .. 

నునులేత  చెక్కిలి పై ఎర్రదనం ఏ సూర్యుని మహిమా .. 

ఈ గాలులలో .. ఏ గాలి మరి .. నీ శ్వాసే అవుతున్నది .. 

నా ఊపిరి లో  ఎందుకనో  నీ శ్వాసే మమేకమైనది .. 

ఏ పరిచయమో స్నేహమయి బంధం ధృఢ మవుతున్నది .. 

ఏ పరిమళమో  నాసిక తాకి  నీ సిగ లో  పుట్టానన్నదీ .. 

మనలోని అనురాగం ఏ వింత సంగీతం .. ? లేకుంటే ఈ రాగం  ప్రాణం లేనిదా సంగీతం . 

ఏ వేకువ లో మెలకువ గా మారింది ఈ ప్రేమ .. 

ఏ పున్నమి లో వెన్నెలగా  కురిసింది  ఈ ప్రేమ .. 

బతుకు నే పండుగ చేసే కళ  ఉన్నదీ ప్రేమా .. 

మనసునే మచ్చిక చేసి పాలించునీ ప్రేమా .. 

అనుభూతి తో  తెలిసే రుచి ఉన్నదీ ప్రేమా .. వివరించి చెప్పాలంటే  భిన్నమై కనబడునమ్మా .. 

రుధిర సౌధం 67


రచన బంగ్లా లోకి అడుగు పెట్టగానే హాల్ లో కూర్చున్న రత్నం రాజు .. మొహం ఆనందం తో వెలిగి పోయింది ..

రచన అతడిని చూసి పలకరింపు గా నవ్వింది .

ధాత్రీ వచ్చేసావా ? ఇంత ఆలస్య మయింది .. అన్నాడు ఆప్యాయం గా .

రాజు గారూ .. యశ్వంత్ వాళ్లకి కొన్ని ఐటమ్స్ కావాలని పక్క ఊరు వెళతామన్నారు .. నాకూ కొన్ని అవసరాలు

ఉన్నాయి.. అందుకే వారితో పాటూ నేనూ వెళ్ళాను .. అంది రచన .

అయ్యో .. ఆ విషయం నాతో చెబితే నేనే నిన్ను తీసుకువెళ్ళే వాణ్ని .. అన్నాడు రత్నం నొచ్చు కుంటూ ..

మిమ్మల్ని ప్రత్యేకం గా ఇబ్బంది పెట్టడం ఎందుకు రాజు గారూ .. ? సరే .. నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను ..

తరవాత  మాట్లాడదాం .. అంది రచన .

అవునవును .. బాగా అలసి పోయుంటావు .. వెళ్లి రెస్ట్ తీసుకో అన్నాడు రత్నం .

థాంక్స్ రాజు గారూ .. అని జింక పిల్లలా అక్కడ నుంచి మేడ మెట్లెక్కి తన గది కి వచ్చేసింది రచన ..

గది లోకి రాగానే బాగ్ మంచం మీదకి విసిరేసి ..  స్నానం ముగించుకొని నైట్ డ్రెస్ లోకి మారిపోయింది రచన ..

హమ్మయ్య .. ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది .. యష్ .. ఇప్పుడు నీ గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చా ? అనుకుంటూ బాగ్ లో ఉన్న

గిఫ్ట్ ప్యాక్ బయటికి తీసింది . ఆతృత గా ప్యాకెట్ విప్పిన రచన కళ్ళు ఆశ్చర్యం తో విచ్చు కున్నాయి .. యష్ .. ఇదా

నీ గిఫ్ట్ .. అంటే .. ఇది నువ్వు ఈరోజు కొనలేదు .. నీతో పాటే ఎప్పట్నుంచో తిప్పుతున్నావు .. హౌ క్రేజీ యు ఆర్ ..

అనుకొని దాన్ని బయటకి తీసింది .. అది ఒక రూఫ్ హేంగింగ్ ఐటమ్ ..

బలూన్ షేప్ లో ఉండి పాదరసం కిందికి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉన్న భావన కలిగిస్తుంది . అది మొదటి సారి ..

తన తండ్రి తన చిన్నతనం లో రచన కి కానుక గా తెచ్చారు .. పక్కింట్లో ఉండే యశ్వంత్ .. దాని దారం తెంపి

వేశాడని ఎంత గొడవ పడిందో ...

ఆ జ్ఞాపకం ఆమె పెదవుల మీద చిరు దరహాసాన్ని నిలిపింది .. ప్యాక్ లో ఉన్న చిన్న లెటర్ బయటకి తీసింది ..

డియర్ రచనా ..

                ఇదే మన ఇద్దరి పరిచయానికి కారణం .. దీన్ని పాడు చేశాననే చిన్నప్పటి నుంచీ నువ్వు నాతో గొడవ

పడుతూనే ఉన్నావు .. కానీ వయసు తో పాటూ నాకు నీ మీద ప్రేమా పెరిగింది .. ముంబై లో ఓ షాప్ లో కనబడింది

ఇది .. అచ్చం అంకుల్ నీకిచ్చిన అదే గిఫ్ట్ లా అనిపిస్తుంది కదూ .. అందుకే .. దీన్ని నీకు కానుక గా ఇవ్వాలని

కొన్నాను .. ఈనాటి వరకూ దాన్ని జాగ్రత్త గా కాపాడుతూ వచ్చాను .. దీన్ని చూసి నప్పుడు నీకు మీ నాన్న గారితో

పాటూ నేనూ గుర్తు రావాలి .. నీకు సంతోషమే కదూ ... నీ యష్ .


ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టి చిరునవ్వు తో దాన్ని కిటికీ కి ఉన్న చిన్న మేకు కి తగిలించి దాని వంక మురిపెం గా

చూసింది రచన .

మెల్లిగా చల్లగాలి ఆమె కురులని పలకరిస్తుంది .. ఉన్నట్టుండి కిటికీ తలుపు

గాలి కి గట్టిగా కొట్టుకుంది .. యశ్వంత్ తలపులతో ఉన్న ఆమె ఆ శబ్దానికి

ఉలిక్కి పడి చూసింది . అయ్యో .. అప్పుడే కిటికీ తలుపులు కొట్టుకునేంత గాలి

ఎక్కడ్నుంచి వచ్చింది ? అని గబగబా కిటికీ తలుపుల్ని మూసింది . ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం అలముకుంది ..
ఇంతలో ఆమె చెవులకి చిన్నగా సర్రున ఏదో కోస్తున్న శబ్దం వినబడింది ..

ఆమె అయోమయం గా చుట్టూ చూసింది .. ఎక్కడ్నుంచి ఈ శబ్దం వస్తుంది .. శబ్దాన్ని చెవులు రిక్కించి వింది ..

ఆ శబ్దం .. ఆ తూర్పున ఉన్న కిటికీ దగ్గర నుంచి ..



ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ ఆ కిటికీ దగ్గరకి చేరి విస్మయం గా చూసింది దాని వైపు .. ఆమె అనుమానం

నిజమే ..  మేకులు కొట్టి మరీ మూసేసిన ఆ కిటికీ తలుపులు దడదడ శబ్దం చేస్తూ చిన్నగా కదులు తున్నాయి ..

ఆమె గుండె శరవేగంగా కొట్టుకుంది .. మెల్లిగా తన చేతిని ఆ కిటికీ రెక్క మీద వేయ బోతుండగా .. భళ్ళున ఆ కిటికీ

బద్దలైనట్టు గా ఆ కిటికీ తలుపులు రెండుగా విడిపోయాయి .. ఒక్క ఉదుటున ఆమె కింద పడిపోయింది ..

ఆమె కి జరిగింది అర్థం కావటానికి ఓ 5 నిమిషాలు పట్టింది .. మెల్లిగా లేచి నిలబడి కిటికీ వైపు చూసింది ..

కిటికీ తలుపులు విడివడ్డం తో ... కిటికీ లోంచి చూస్తే ఎత్తైన గుట్ట మీద ఉన్న రాణి మహల్ స్పష్టం గా

కనబడుతుంది ... సాయంత్రపు వెలుగు తగ్గిపోతున్న ఎంతో స్పష్టం గా కనబడుతోంది .. రాణి మహల్ ...

రచన్ కి చెమటలు పడుతున్నాయి .. ఏం జరుగుతోంది .. ? అని మనసు ప్రశ్నిస్తున్న అయోమయం గా ఆమె

మహల్ వంక చూస్తుంది .

మహల్ గోడలు నల్లగా మసి బారిపోయి ఉన్నాయి .. ఆకాశం లో మేఘాలు వివిధ వర్ణాలలో కనిపిస్తున్నాయి ..

మహల్ దగ్గర ఎత్తుగా దుమ్ము రేగు తున్నట్లు కనిపిస్తుంది .. ఆమె చూస్తుండగానే ఆ దుమ్మంతా దట్టం గా

అలముకొని ఊరి వైపు రాసాగింది .. ఆమె కి మహల్ మరి కనబడటం లేదు .. ముంచు కోస్తున్న ముప్పల్లె ఆ

దుమ్ము మేఘం ఊరిని మింగేస్తున్నట్లు  కమ్మేసింది ..

ఆ దుమ్ము మేఘం బంగ్లా వైపు ,కిటికీ వైపు ,రచన వైపు వస్తుంది .. నో ........ గట్టిగా అరచింది రచన .

(ఇంకా ఉంది )
           

Tuesday, 4 February 2014

హే వనమాలీ ...

         


               
                                                             


                    హే వనమాలీ ...దర్శ న  మీయవ .... ధన్యను  చేయగా రా కన్నయ్యా ..

                   కృష్ణ మురారీ .. పాప వినాశ ... నీదయ చూపగ రా కన్నయ్యా ...
                 
                   మనసే బృందావని లా తోచి .. మురళీ లోలా నీకై వేచి ..
             
                   రాధే శ్యామా .. హే పరంధామా ... నీ రాకను కనులే వీక్షించే

                    వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ...


                    రాధిక మదిలో విరహము రేపిన గోపాలునివీ నీవెనయ్యా...

                    కుచేలుని మూ ట లో అటుకులు  సేవించి ధన్యుని చేసిన మిత్రునివయ్య..
                 
                    రుక్మిణి ప్రేమని గెలిచి నవాడివి ... మనువాడిన తనవాడివి ....

                    దర్పంతోనయిన సత్యాదేవి నిను భ ర్త గ పొందిన వైనము తెలియదా ...

                    గొపికలెన్దరినొ నీ గానముతో మైమరపున నువ్వు ముంచెయలెద ...

                     గోవిందా ... హే గోపాల ... మరి నాపై నీకూ    కినుకేలా ?2
                 
                     వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ...


                  తులసికి తూగిన ఓ నటలాల .... నా భక్తి కి తూ గవ ... ఓ విట లా...
               
                  ఆవులు కాసిన వేళ లో ఐనా  ... నీ లీలలు చూపగ రాలెవా...
               
                  పరమార్థం తెలిపే  గీతాబోధ ... వెలుగులు నింపిన  నరకాసుర వధ

                  కొలిచితినయ్య నా  మదితోడా .... నీ తపసే నాకూ తోడునీడ ...

                   కొండను ఎత్తిన పసివాడా ... నా గుండెలొ  నిండిన చిన్మయుడా ...

                  నీవేనయ్యా నా ఆణువణువూ ... నాకోసం ఎందుకు రావూ ?2
               
                  వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ...

                 
                  చెలువల చీరలు దోచినవాడే ... ద్రౌపది మానం కాచిన వాడే ...

                   మామని చంపిన అల్లుడు వాడే ...ధరణి కి భారము తీర్చిన వాడే

                   నల్లని రంగు ఆ మేని ఛాయా ... నీ హృదయము రంగు తెల్లనిదయ్య
                                 
                  నీ వేణువు లో గాలే పాటా ... మా మనుగడ  నువ్వు ఆడే ఆటా ....

                  పరమానందము నీ  పథ మంటా .... నీకై సాగే నా పదమంటా ....

                 నువు నడచిన నేల మధురేనయ్య .... నిను కొలిచిన మనసు మధువేనయ్య 2

                 వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ..