Powered By Blogger

Tuesday, 18 March 2014

అమ్మ



                           
                         
                           తీయని పిలుపై నిత్యం మాతో నిలిచేవా అమ్మా ..

                           మాయని ప్రేమని అనునిత్యం పంచే దేవత నీవమ్మా .. 

                           త్యాగానికి మరు రూపం నీవు .. అనురాగానికి అసలు రూపువు . 

                           ఎల్లలు ఎరుగని మమకారం .. గుండెల నిండుగా అభిమానం .. 

                           అల్లరి భరియించె నేస్తం .. మా ఆశల వెనుక నీ హస్తం .. 

                           సరిలేని అనుబంధం తీగల్లె అల్లిన నీ ప్రేమ సుగంధం .. 

                           మాటలు చాలవు నిను వర్ణించాలంటే .. 

                           అమృత మయినా దిగదుడుపు నీ ముందే .. 

                           భగవంతుడు కూడా బిడ్డగా వచ్చే ..  అమ్మ ప్రేమ ని ఆస్వాదించే .. 

                           నీ ఒడిని మించిన హాయి వేరే చోట లేదమ్మా .. 

                           తోలి బడి వి నువ్వై లోకాన్ని నేర్పావమ్మ .. 

                         

రుధిర సౌధం 96

అదే మాకూ అర్థం కానిది ఇదంతా ఆ పిశాచి మాయా ? లేక ఇంకేమైనా అని అన్నాడు శివ .

వాళ్ళు లోపలకి వెళ్ళటం చూసాను . మహల్ నుంచి బయటకి రాలేదు . కానీ మనకి మాత్రం బయట ఉన్నట్లు గా

కనబడ్డారు .. అదే విచిత్రం గా ఉంది అన్నాడు యశ్వంత్ .

ఆలోచిస్తే ఏదో జరిగిందనే అనిపిస్తుంది .. తేల్చుకుందాం కానీ ఈ విషయం కోసం మురారి ,సత్యలతో ఎక్కువ

మాట్లాడకపోవటమే మంచిది అంది రచన .

హమ్మయ్య .. నువ్వు నమ్మావు అది చాలు .. సారీ రా .. అనవసరంగా నిన్ను కొట్టాను అన్నాడు యశ్వంత్ .

నో యశ్ .. నీ పరిస్థితి లో నేనున్నా అలానే చేసేదాన్నేమో . నిన్ను తప్పుగా నేనెలా భావించానో అర్థం కావటం లేదు .

పాపం మురారి కుడా అన్నాడు యశ్వంత్ తప్పు చేయడు .. యశ్వంత్ ని నమ్ము అని .. అంది రచన .

అవునా ? అన్నాడు ఆశ్చర్యం గా శివ .

అవును శివా .   అంది రచన .

యశ్ .. అయితే  మనం చూసింది ఖచ్చితంగా నిజమే . యశ్వంత్ తప్పు చేయడు అని మురారి చెప్పటంలో మన

కేదో హింట్ ఇచ్చాడని పిస్తుంది . మురారికి కూడా అంతా తెలుసు కానీ మన దగ్గర నిజం ఎందుకు దాచాడు ?

అన్నాడు శివ

అవును శివ .. ఏదో జరగటం మాత్రం నిజం .. అన్నీ బయటకి వస్తాయి . ముందు మనం ఇంటికి వెళదాం ..

అన్నాడు యశ్వంత్

ఆగు యస్వంత్ .. ఇందాక మహల్ కొచ్చినపుడు గమనించాను . మేము సాయంత్రం మండపం లో పూలని అందం

గా అలంకరించామ్ . కానీ ఇప్పుడు పూలన్నీ చిందరవందరగా పడున్నాయి . నేను సత్య ని అడిగాను కూడా .

సరదాగా పూలతో ఆడుకున్నాం అని చెబుతోంది . కాని నాకు గుర్తుంది . సత్య కి ,మురారికి ఇద్దరికీ పూలంటే

చాలా ఇష్టం . అవి వాడిపోవటమే భరించలేరు అలాంటిది .. అలా వాటిని చిందరవందర గా కాళ్ళకింద తోక్కేస్తారా ?

సొమెథింగ్ రాంగ్ .. వాళ్ళిద్దరూ మన దగ్గర ఏదో దాస్తున్నారు .. అంది రచన .

అవును అదేంటో తెలుసు కోవటానికి మనమే ప్రయత్నించాలి . ముందు నిద్ర పోవాలి . రేపు ఉదయాన్నే మహల్

వెనక ఉన్న మడుగు ని సోదా చేయాలి . గుడి గురించి తెలిసిందంటే మన ముందున్న అన్ని ప్రశ్నలు గాలి

బుడగలలా తేలిపోతాయి . అన్నాడు యశ్వంత్ .

అవును యస్వంత్ .. ముందు ఈ మహల్ కి పట్టిన దెయ్యాన్నైతే వదిలించాలి అన్నాడు శివ .

పదండి ఇంటికి వెళదాం . అంది రచన .

ముగ్గురూ ఇంటిదారి పట్టారు

ఇంకా ఉంది 








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 17 March 2014

'శ్రీ' కవితలు: || హోలీ ||

'శ్రీ' కవితలు: || హోలీ ||: మకరందపానం చేస్తూ... మాధుర్యాన్ని అందించిన సీతాకోక చిలుకలకి  సిగ్గులభారాన్ని లెక్కచేయక... వాటి రెక్కలకి తమ వర్ణాలని అద్దుతూ ప్రతి సుమం...

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

అల్లరి మరదలి వసంతోత్సవం

మువ్వల సవ్వడి మెల్లిగా నా వీనుల విందుచేసే ..

గాజుల గలగల అల్లరిగా వింతగ వంత పాడే ..

కొంటె చూపుల కోణంగి నా తుంటరి మరదలు సివంగి ..

జడ ని వయ్యారం గా తిప్పి .. పైట ని అలవోక బొడ్లో దోపి ..

ధనువు లాంటి కనుబొమలని పైకెగరేసి నవ్వింది .

ఆ నవ్వే కన్నులకి పాకి చిలిపి చూపు అర మెరసింది ..

రంగు నీళ్ళని కుండలో నింపి  సగం వంచిన నడుం మీద

ఆశ్రయమిచ్చి రాజహంసలా నా వైపు కి నడచి వచ్చింది ..

అందానికి హతాశుడినయి నేను  ఏమరుపాటు గా చూస్తున్నాను .

విసురుగా రంగు నీళ్ళని చల్లి జలపాతం ఉరికినట్టు నవ్వింది .

అల్లరి మరదలు చేసిన పని కి జవాబు చెప్పాలనుకొని ..

గుప్పెడు గుండె ని అదుపులో పెట్టి గుప్పెట నిండా రంగుని పట్టి

ఇందు ముఖి నా మరదలు ముఖముని వర్ణ శోభితం చేశాను .

వసంతం మది కి ఉత్సవ మవగా వసంతోత్సవం ముద్దుగా మురవ ..

రంగులలోనా తనువే తడవ .. నా మరదలి తో ఇక తీయని గొడవ .


Sunday, 16 March 2014

రుధిర సౌధం 95




యశ్వంత్ .. ఈ టాపిక్ వదిలేయ్ .. రచనోస్తుంది .. మెల్లిగా గొణిగాడు శివ .

వీరి ముందు నుంచి వీరిద్దర్నీ కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది రచన .

ఆమె నే చూస్తున్న యశ్వంత్ ని చూసి .. యశ్ .. తనని కొట్టావు .. ఏదో ఆవేశం లో అలా చేసావు గాని .. దానికి

రచన బాధపడి ఉంటుంది కదా . కోపం గా ఉంది .. వెళ్లి తనని బుజ్జగించు యశ్వంత్ .. అన్నాడు శివ .

ఊ .. అని తల ఊపి రచన వెంట పరిగెత్తి ఆమె చేతిని అంది పుచ్చుకొని ఆగు రచనా అన్నాడు యశ్వంత్ .

అతని చేతిలోని తన చేతిని విసురుగా వెనక్కి లాగి .. సో ఎమ్బరాస్సింగ్ యశ్వంత్ .. అంది రచన .

సారీ .. ఐ ఆమ్ రియల్లీ సారీ .. నేనలా చేసుండాల్సింది కాదు రచనా .. ఐ ఫీల్ బాడ్ అబౌట్ ఇట్ .. నిజాయితీ గా

అన్నాడు యశ్వంత్ .

ఎందుకు యశ్వంత్ ? చేసింది ఓ సారీ తో చెల్లిపోతుందా ? సారీ చెప్పినంత తేలిక అయితే కాదుగా ఇప్పుడు

జరిగింది మరచిపోవటం . నా మాట విననేలేదు నువ్వు .. కనీసం నా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేదు . వాళ్ళని

మనం ఇప్పుడు వదిలి వచ్చేసాం . బట్ నువ్వు చేసిన ఈ గలాటా వల్ల వాళ్ళు డిస్టర్బ్ గానే ఉంటారు . ఇదేనా

నువ్వు కోరుకున్నది ఆవేశం గా అన్నది రచన .

రచనా ప్లీజ్ లిజన్ .. నేను నిన్ను కొట్టడం తప్పే .. అప్పుడు నేనున్నపరిస్థితి అటువంటిది రచనా ... అన్నాడు యశ్ .

ఏంటీ ? ఏంటో జరిగిపోయిందన్న భ్రమ లో ఉన్న పరిస్థితా ? అంది కోపంగా రచన .

ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేదు రచనా .. ఏరోజైనా నేను భ్రమ లో ఉండి మాట్లాడానా ? ప్రాణం లాంటి నిన్ను

బాధపెట్టానా ? ఆలోచించు రచనా .. అన్నాడు యశ్వంత్ .

ఆమె సాలోచన గా అతడ్ని చూసింది .

ఆమె రెండు భుజాలపై చేతులు వేసి .. నేను .. నేనే కాదు శివ కూడా .. ఇద్దరం పొరపాటు పడే అవకాశం ఉందంటావ

?లేదు రచనా .. నా కళ్ళ ముందు కనిపించిన దృశ్యం ఇంకా నా స్మృతి పథం నుంచి చెరగటం లేదు . సత్య

ఒక్కసారిగా గట్టిగా అరచి మహల్ వైపు పరుగు తీసింది . సత్య నలా చూసి కంగారుగా మురారి ఆమె వెంట పరుగు

తీయటం గమనించి నేనూ ,శివా ఇద్దరం వాళ్ళని రక్షించటం కోసం పరుగుతీసాం . బట్ వాళ్ళిద్దరూ లోపలికి పోగానే

మహల్ తలుపులు యథాతధం గా మూసుకు పోయాయి . ఇదంతా మా కళ్ళ ముందు జరిగింది రచనా .. ఉద్వేగం

గా అన్నాడు యశ్వంత్ .

వెనక్కా వీరివద్దకి వచ్చిన శివ .. అవును రచనా .. మా మాట నమ్ము .. యశ్వంత్ చెప్పింది నిజం . వాళ్ళ ప్రాణానికి

ముప్పు వచ్చిందన్న తలంపుతో యశ్వంత్ నీ మీద చేయి చేసుకున్నాడు  అన్నాడు .

వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూసి .. ఎందుకిలా జరిగుంటుంది ఐతే నిజంగా అలా జరిగి ఉంటె మరి సత్య

మురారి మాములుగానే ఉన్నారే .. అంది రచన .

ఇంకా ఉంది







































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 14 March 2014

రంగుల కేళి .





ఇంద్ర ధనువు నే వంచి రంగులు కొన్ని సేకరించా ... 

రోజా పూల రంగుని అడిగి మీకోసం దాచి ఉంచా .

మల్లె పూలు కూడా తమ వర్ణాన్ని అప్పు ఇచ్చాయి .. 

చామంతులు ,బంతులు మరెన్నో పూలు తమ రంగుల్ని నాకిచ్చాయి 


ఆకాశం నీలి రంగుని దోసిలి లో పోసింది . రాతిరి నల్లని రంగు పులిమింది . 




చెట్లు పచ్చదనాన్ని నవ్వుతూ అరువి చ్చాయి .. 

సీతాకోకచిలుక వెదుక్కుంటూ వచ్చి మరింత శోభ నిచ్చింది 

ఎన్నెన్ని వర్ణాలో ప్రకృతి ముగ్ధ మోహన రూపం లో .. 

అన్నీ చేరి నాకు మరింత సంతోష పెట్టాయి .. 

వాటితో పాటు  నా ఆనందపు రంగుని కలిపి తీసుకొస్తున్నా హోలీ పండుగని . 

కాచు కోండి మరి ప్రకృతి వర్ణాలలో మమేకమై చిరునవ్వుల దొంతరలను కూర్చడానికి . 






Thursday, 13 March 2014

రుధిరసౌధం 94

ఆమె వైపు అయోమయం గా చూశాడు యశ్వంత్ .

మళ్ళి సత్య , మురారిల వైపు తిరిగి సారీ .. మేమంతా వెళ్తాం .. యు బోథ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ .. అంది రచన .

ఫర్వాలేదు ఎలాగూ డిస్టర్బ్ అయ్యాం .. కలిసే వెళ్దాం ఇంటికి .. అన్నాడు మురారి .

నో మురారీ .. మీరు ఉండండి .. అని వెనక్కి తిరిగి యశ్వంత్ ,శివాల వైపు కోపం గా చూస్తూ మీరిక్కడే కాపలా

కాస్తారా లేక వస్తారా ? అంది రచన .

రచనా .. మేము మా కళ్ళతో చూశాం .. సత్య పిచ్చి పట్టిన దానిలా లోపలికి పరిగెత్తింది . సత్య వెనుకే మురారి ..

మా మాట నిజం .. అన్నాడు శివ .

మురారి శివ వైపు బాధ గా చూశాడు .. యశ్వంత్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు ..



వాళ్లిద్దరూ సరదాగా అటూ ఇటూ పరుగులు పెడితే ఏదో జరిగిపోయిందని అనుకోవడమేనా ? అంతే కాదు ఆవేశానికి

లోనై పోవటం నా చెంప పగలకోట్టేయటం .. వెరీ గుడ్ .. కాసేపు వాళ్ళని వదిలేసుంటే వాళ్ళు సంతోషం గా

గడిపేవాళ్ళు .. ప్రతీ విషయాన్నీ పరిశోదిస్తూ పోతే మనశ్శాంతి కరువైపోతుంది .. కోపం గా అంది రచన .

సారీ సత్యా .. పొరపాటు పడ్డాం .. తప్పుగా అనుకోవొద్దు .. అని మొహం దించుకుని వారి ముందు నించి

వెళ్ళిపోయాడు యశ్వంత్ .

యశ్వంత్ ని చూసి శివ కూడా సారీ అని చెప్పి యశ్వంత్ వెనుకే నడిచాడు .

మురారి ని సత్య ని చూసి ..  ఇదంతా మనసులో పెట్టుకోవొద్దు .. వాళ్ళిద్దరికీ ఎప్పుడు కర్తవ్య నిర్వహణ తప్ప వేరే

ఏం పట్టదు . మీకే మన్నా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడ్డారు . ఏవోవో ఊహించుకొని మిమ్మల్ని ఇలా ..

అని రచన ఇంకేదో అనబోతుండగా ..

ఫర్వాలేదు రచనా .. కానీ నువ్వు యశ్ ని యెప్పుడు తప్పుగా భావించకు . అతడెప్పుడు తప్పు చేయడు ..

అన్నాడు  మురారి కళ్ళతోనే రచన కేదో చెప్పాలని ప్రయత్నిస్తూ ..

సరే .. నేనింకా మీ టైం వేస్ట్ చేయను . బాయ్ అని చెప్పి వెళ్ళబోతూ .. ఏదో అనుమానం వచ్చిన దానిలా వెనక్కి

తిరిగి .. సత్యా వచ్చేటపుడు చూసాను మండపం లో పూలు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయేంటి ? వాటినలా

చూసి నిజం గానే మీకేమన్నా జరిగిందేమోనని నేనూ భావించాను .. అంది రచన .

అదీ .. రచనా .. పూలతో ఒకరినొకరు సరదాగా కొట్టుకున్నాం .. అందువల్లే .. అని సంకోచం గా అంది సత్య .

ఓహ్ .. సారీ ఇలా అడిగినందుకు .. సరే ఇక నే వెళ్తాను .. అని ముందుకి నడిచింది రచన .

గేటు దగ్గర నిలబడిన యశ్వంత్ భుజం మీద చేయి వేశాడు శివ .

ఒక్కసారి వెనక్కి తిరిగి .. శివా .. నాతో పాటూ నువ్వూ చూశావు .. ఒకేసారి ఇద్దరు పొరపాటు పడే అవకాశం

ఉంటుందా? అదెలా సాధ్యం .? వాళ్ళు లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకు పోయాయి కూడా .. అన్నాడు యశ్

అవును యశ్ .. నాకూ అదే అర్థం కావడం లేదు . బట్ మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయా ? ముందు జరిగిన

సంఘటన ని ఇవే కళ్ళు చూశాయి . ఆ తర్వాతా ఇవే కళ్ళు తరువాతి సంఘటన ని చూశాయి . ఏది నిజమని

నమ్మాలి ? అన్నాడు శివ .

మన కళ్ళు ,చెవులు నిజాలని నిర్థారించ లేకపోవోచ్చు .. కాని మనసు .. నా మనసు ఏదో జరిగిందని నాకు

చెబుతోంది శివా అన్నాడు యశ్వంత్

ఇంకా ఉంది 















































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రంగుల హొయలు


చిరునవ్వు పొదరిల్లు పెదవమ్మ లోగిళ్ళు ఎర్రాని రంగులోనా మెరిసేటి అధరాలు

స్వప్నాల వాకిళ్ళు నీలాల కనులు ,  నల్లాని  కాటుక పెడితే రెప్పల చాటు భావాలు ..

నునుసిగ్గు చెక్కిళ్ళు గులాబీల  రేకల్లె , రాణీ వర్ణం తానంటూ బుగ్గల్లోనా పూసే

పండిన వరి పైరల్లే తళుకు లీనే మేను , పచ్చాని పాదాల్లో మురిసే మువ్వ దే రంగు ?

ప్రియుని తలపే ఊదా రంగై తనువల్లా సోదా చేసే .. అంబరమే తాకే సంబరానిది ఏ రంగు ?

జాలువారే కురులు నిశి వర్ణ మయినా సిగలోనా నవ్వింది జాబిల్లి సిరిమల్లి ..

మెడలోన ఒదిగిందో పసుపు పుత్తడి హారం .. తెల్లాని రంగులోనా ముత్యాల భారం

కాషాయపు రంగేమో గోరింటై పూసింది .. మనసిచ్చేవాడి ప్రేమ స్వచ్చమైన రంగంది .

మదిలోని భావాలన్నీ ఏడు రంగుల హరివిల్లు .. అది కురిసే వెన్నెల జల్లు





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 93


తలుపులు తీసేసరికి గుమ్మం లో వగరుస్తూ కనిపించాడు శివ .

అతణ్ణి చూడగానే ఆశ్చర్యం తో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ..

శివా .. ఏంటిలా ఉన్నావు ? ఏమయింది ? ముందు లోపలికి రా .. అంది రచన కంగారుగా .

మురారి ,సత్య ఆపదలో ఉన్నారు .. త్వరగా రా రచనా .. వగరుస్తూనే అన్నాడు శివ .

వ్వాట్ ? అదిరిపడింది రచన .

ఆమె చేయి పట్టుకొని సమయం లేదు .. పద అని మళ్ళి పరుగు మొదలుపెట్టాడు శివ . ఆమె అతని వెంటే పరుగు

తీసింది .

పరిగెడుతూనే శివా ఏం జరిగిందో చెప్పు శివా ? అంది రచన ఆయాసపడుతూనే .

శివ ఏం మాట్లాడలేదు . కాసేపట్లోనే వాళ్ళు మహల్ చేరే సరికి తలుపు బద్దలుకొట్టే ప్రయత్నం లో ఉన్నాడు

యశ్వంత్ .

యశ్ .. ఏమయింది ? ఏం చేస్తున్నావు నువ్వు ? అంది అతని వెనకాలే నిలబడి రచన .

ఆమె గొంతు విని వెనక్కి తిరిగిన యశ్వంత్ విసురుగా చాచి పెట్టి ఆమె బుగ్గమీద ఒక్కటిచ్చాడు .

విసురుగా వెళ్లి నేల పై పడింది రచన . కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ... యశ్ ..  అంది బుగ్గమీద చేయి వేసి రచన .

ఆమె బుగ్గ ఎర్రగా కందిపోయింది .

ఇదంతా నీవల్లే రచనా .. ముందు మహల్ కీస్ ఇవ్వు .. అన్నాడు కోపంగా యశ్వంత్ .

ఆమె చినబోయిన వదనం తో అతడికి కీస్ అందించింది . ఆమె దగ్గర కీస్ అందుకొని యశ్వంత్ తాళం తీస్తుంటే శివ

రచన కి చేయి అందించి ఆమెని పైకి లేపాడు .

ఇంతలో..  యశ్వంత్ .. అన్న మురారి పిలుపు విని తాళం తీయటం ఆపి ఒక్కసారిగా వెనక్కి చూసాడు యశ్ .

అక్కడ మురారి ,సత్య నిలబడి ఉన్నారు .

శివ ,యశ్వంత్ ఆశ్చర్యం గా అతడి వంక చూస్తుంటే రచన అయోమయం గా చూసింది .

యశ్వంత్ .. మీరంతా ఏం చేస్తున్నారిక్కడ ? అని అడిగాడు మురారి .

మురారీ .. అదీ .. ఇప్పుడే కదా మీరిద్దరూ .. లోపలికి .. అని అయోమయం గా అన్నాడు యశ్వంత్ .

లోపలికి ఏంటి ? ఏమయింది ? మీరంతా మా వైపు అంత విచిత్రం గా చూస్తున్నారు ఏంటి ? అన్నాడు లేనిపోని

ఆశ్చర్యం నటిస్తూ .. మురారి

శివ .. యశ్వంత్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నోట మాట రాక .

సత్యా .. మీ ఇద్దరూ బాగానే ఉన్నారుగా .. మీరేదో ప్రమాదం లో ఉన్నారని శివ చెబుతున్నాడు .. అంది గబ గబా

సత్య దగ్గరకి నడిచి .. రచన .

ప్రమాదమా ? అదేంటీ రచనా ? ఇక్కడ మేమిద్దరం ఎంజాయ్ చేస్తుంటే మీరే ఇక్కడ ఏదో హడావిడి చేస్తుంటే ఇలా

వచ్చి చూసాం . ఏమైంది మీ అందరికి ? అంది సత్య లో ఉన్న వైజయంతి .

రచన వెంటనే యశ్వంత్ వైపు కోపం గా చూసింది .

ఇంకా ఉంది 










































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 12 March 2014

కడలి కెరటం


 కడలి కెరటమై పైకి ఎగసి అశక్తత తో నేల తాకి మళ్ళి తల్లి సంద్రం లో కలసి పోయా ... 

 ఋణ పడినట్లు తీరాన్ని మళ్ళి మళ్ళి పలకరిస్తూనే ఉండిపోయా .. 

పైకి ఎగసే ఆశా చావదు .. నింగి తాక లేక నిరాశ కమ్ముకోకా మానదు .. 

పాల నురుగుని చిమ్ముతూ ఒడ్డు చేరాలని పరుగు పెడతా .. 

నీకంత మిడిసి పాటు తగదె అని సంద్రపు చేయి నన్ను వెనక్కి లాగుతూనే ఉంటుంది 

పెంకి అలలా మరలా తీరాన్ని చేరుతా .. నేల పై రాసిన రాతల్ని చెరిపేస్తా .. 


నింగి వంక ఆశగా చూస్తా .. సూరీడు తో దోస్తీ కడతా ... భానుడి వలపుతో 

వేడెక్కిన హృదయం  తో గగనాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తా .. 

తొందరపాటు తో సర్వస్వం అర్పించి ఆశలు ఆవిరై మేఘమై పోయా .. 

గూడు కట్టిన కన్నీటిని గుండెలో దాచి పశ్చాత్తాపం తో అమ్మ వంక ఆశ గా చూసా .. 

ఎంత జాలి గలదో కడలి తల్లి,, తన ప్రేమ చిరుగాలిలా నన్ను తాకింది .. 

ఇక ఆగలేక బాధతో కరిగిపోయి కన్నీరుగా వర్షించి అమ్మ వొడిలో ముత్యం లా వొదిగిపోయా .. 


 









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 11 March 2014

రుధిర సౌధం 92

సత్య భయంగా అతడి వెనుక నక్కింది . ఆ కాళ్ళు వీరివైపే వస్తున్నాయి . ఆ దృశ్యం ఒళ్ళు గగుర్పోడిచేలా ఉంది .

మురారి కత్తి తో ప్రతిఘటిస్తూనే ... యశ్వంత్ ... సేవ్ అస్ అని గట్టిగా అరిచాడు .

కానీ ఆ అరుపు అతని గొంతు దాటి బయటకి రాలేదు .

మురారీ భయంగా ఉంది .. అంది వణుకుతున్న గొంతుతో సత్య .

సత్య .. భయపడకు .. నేనున్నాగా .. ఈ వైజయంతి ఆటలు మన దగ్గరా ? ధైర్యాన్ని మనసులో నింపుకుంటూ

అన్నాడు మురారి .

వెంటనే సత్య అతని వెనక నుంచి ముందుకి వచ్చి అతని చేతిలో కత్తిని రెప్పపాటు లో తన చేతిలోకి లాక్కుంది

.  మరో చేతితో అతని జుట్టు ని గట్టిగా పట్టుకొని .. అంత ధైర్యమా నీకు ? వైజయంతి అంటే అంత చులకనా ? మహల్

నాది .. వేరొకరికి దక్కనివ్వను . మీ ప్రాణాలు పోవటానికి మరింక ఎంతకాలమో లేదు . ఆ గుడి దొరకదు . ఈ

మహల్ నీ స్నేహితురాలికి దక్కదు . ఈ క్షణం నుండీ మీ కష్టాలు మొదలుకానున్నాయి .. ప్రాణం పోదు .. ఎందుకు

ఉందా ? అనిపించేలా చేస్తాను ... అని విసురుగా అతణ్ణి ముందుకి తోసి .. ఇది నీ ప్రాణం కదూ .. దీని శరీరమే నాకు

అనువు . ఈ విషయం చెప్పాలని నువ్వెప్పుడు అనుకుంటావో ఆ క్షణం నీకళ్ళ ముందే దీని ప్రాణం గాలిలో కలసి

పోతుంది . మహల్ నాకు వదిలేయండి . లేదంటే ............. అని వికృతంగా అరచింది సత్య శరీరం లో ఉన్న ఆత్మ.

ఎవరు నువ్వు ? వైజయంతి వేనా ? మెల్లిగా అడిగాడు మురారి .

అవును .. రాకుమారి వైజయంతి ని . ఆ విధాత్రి అండ చూసుకొని నీ స్నేహితుడు మిడిసి పడుతున్నాడు . ఆ

మిడిసిపాటు ఇంకెంత కాలం ? నేను ప్రేతాన్ని మాత్రమె కాదు భయంకర జ్వాలా రూపాన్ని . గర్జించింది సత్య .

సత్యని వదిలేయ్ వైజయంతి .. అన్నాడు మురారి .

వదిలే ప్రసక్తే లేదు . ఇక నుంచీ నేను మీతోనే ఉండబోతున్నాను . ఈ విషయం నీ నోటి నుండి వచ్చిన క్షణం సత్య

మరణిస్తుంది . అని ప్రేతాత్మ చెప్పి సత్యని వీడి వెళ్ళిపోయింది .

తోటకూర కాడ లా కింద పడిపోయింది సత్య .

పరుగున సత్య దగ్గరకి వెళ్లి .. సత్యా .. అని ఆమెని గుండె కి హత్తుకున్నాడు మురారి .

                                                  *******************************


నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ అనుకోంది రచన .

ఈపాటికి మురారి ,సత్య ఒకరిఒకరు సంతోషం గా ఉండి ఉంటారు .

అనవసరం గా యశ్ మీద కోప్పడ్డాను . కాసేపు నేనూ అక్కడే ఉండాల్సింది . తనతో గడిపే అవకాశం నాకూ దక్కేది

ఆమె ఆలోచనలను చెదరగొడుతూ తలుపులు బాదుతున్న చప్పుడు వినిపించేసరికి మంచం మీదనుండి కిందకి

దిగి గుమ్మం వైపు పరుగుతీసింది రచన .

(ఇంకా ఉంది )


చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

ధగ ధగ మెరిసే బంగారం , రెపరెపలాడే పచ్చ నోట్ల  గారం

అధికారం పై మమకారం , లాభాలతో గుణకారం .. 

ఇదేనా సమాజం కోరిన తీరం ... 

మాయని బంగారం మనసైతే , కాసులకి లొంగని ప్రవర్తన ఉంటె  

అధికారాన్ని తృణ ప్రాయం గా భావించే నాయకుడు ఉంటె 

ప్రజల క్షేమమే లాభమని తలచే వాడైతే .. 

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా .. జై కొట్టి గెలిపించు తెలుగోడా 

కులాన్ని ప్రాతిపదిక గా ఎంచుకోకురా ... 

మతాన్ని వేదిక గా మార్చమాకురా .. 

పచ్చనోటు కి అయిదేళ్ళ భవిత తాకట్టు పెట్టకురా .. 

నీ హక్కుని నువ్వు సరిగ్గా ఉపయోగించరా .. 

అర్హత ఉన్నోడికే నీ వోటు రా ... 

ఎన్నికలు వచ్చేటపుడు నిను ఆకాసాని కేత్తెవోడు  నాయకుడు కాబోడురా .. 

కష్టమొచ్చి నువ్వు కూల బడితే నీ భుజం తట్టి చేయూత నిచ్చే వోడే మేటి నాయకుడురా .. 

అటువంటి నాయకుడికి , ప్రజా సేవకుడికి , నీ అయిదేళ్ళని కానుకివ్వరా 

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా ,జై కొట్టి గెలిపించు తెలుగోడా 

రుధిర సౌధం 91




శివా .. ఏదో అరుపులు వినిపిస్తున్నాయి .. సం థింగ్ రాంగ్ .. అని మండపం వైపు చూసాడు యశ్వంత్ .

యశ్ అటు చూడు .. సత్య మహల్ వైపు అలా ఎందుకు పరిగెడుతుంది ? ఏదో జరుగుతుంది లెట్స్ గో యశ్ .. అని

ముందుకి దూకాడు శివ .

యశ్వంత్ కూడా ముందుకి పరుగుతీసాడు .

సత్య ఎంత వేగం గా పరుగుతీసిందంటే ఆమె మహల్ ద్వారం చేరుకోగానే హటాత్తుగా మహల్ ద్వారం తెరచుకుంది .

కనురెప్ప తెరచేలోగా ఆమె మహల్ లోనికి పరుగుతీసింది . ఆమె లోపలి కి వెళ్ళగానే తలుపులు

మూసుకోబోతుండగా చూసిన మురారి ఒక్క ఉదుటున లోపలికి దూకాడు .

అతను లోపలికి దూకగానే విసురుగా తలుపులు మూసుకున్నాయి .

యశ్వంత్ ,శివ అక్కడికి చేరుకునే లోపే అంతా కనురెప్పపాటు లో జరిగిపోయింది ...

గాడ్ ... అని తల పట్టుకున్నాడు యశ్వంత్ .

శివ పరుగున వెళ్లి తలుపులు బాదటం మొదలుపెట్టాడు .. మురారీ .. డోర్ ఓపెన్ చెయ్ .. గట్టిగా అరుస్తున్నాడు శివ

యశ్వంత్ మనసు ఎందుకో కీడు శంకించింది . ఎందుకో పరిస్థితి అనుకూలం గా లేదనిపించింది .. ఏం చేయాలి

ఇప్పుడు ? తల పట్టుకుని ఆలోచించాడు . రచన మీద పట్టలేనంత కోపం వచ్చింది . ఎందుకు ఇలా జరిగింది ?

రచన చెప్పినప్పుడైనా తను వారించి ఉండి ఉండాల్సింది . అనుకొంటూనే శివ వైపు చూసాడు . పిచ్చిగా తలుపుల్ని

బాదుతున్నాడు శివ .

శివా .. మురారి ,సత్య తలుపులు తీసే పరిస్థితి లో ఉండి ఉండరు . ముందు త్వరగా ఇంటికి వెళ్లి రచన ని తీసుకురా

ఈలోపు నేనెలాగైనా లోపలికి వెళ్లటానికి ప్రయత్నిస్తాను అన్నాడు యశ్వంత్ .

ఇప్పుడెందుకు రచన ? అన్నాడు శివ బాధతో పూడుకుపోయిన గొంతుతో .

ప్లీజ్ డు వాట్ ఐ సే శివా ... అన్నాడు యశ్వంత్ .

సరే .. అని గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటివైపు దౌడు తీసాడు శివ .

శివ అలా వెళ్ళగానే చుట్టూ చూసి మండపం దగ్గర పడున్న ఒక పెద్ద కర్ర ని తీసుకొచ్చి తలుపుల్ని బద్దలు కొట్టే

పనిలో పడ్డాడు యశ్ .

                                   ******************************************

మురారీ .. మురారీ ఏమైంది లే మురారీ ...  అంటూ కిందపడున్న మురారి ని లేపసాగింది సత్య .

మెల్లిగా కళ్ళు తెరచి చూసాడు మురారి . అస్పష్టం గా సత్య రూపం కనబడింది . కళ్ళు నులిమి లేచి సత్యా నువ్వు

బాగానే ఉన్నావు గా .. అన్నాడు మెల్లిగా .

నేను బాగానే ఉన్నాను కాని మనం లోపలికి ఎలా వచ్చాం ? నువ్విక్కడ ఎలా పడున్నావు మురారీ ? అని అడిగింది

సత్య .

అదేంటీ సత్యా .. నువ్వేకదా లోపలికి పరిగెత్తావు ... నీవెంటే నేనూ వచ్చాను .. అయినా ఒక్కసారిగా నువ్వెందుకలా

ప్రవర్తించావు అని అడిగాడు మురారి .

నేనా ? విచిత్రం గానా ? అని తెరలుతెరలు గా నవ్వసాగింది ఆమె . ఆమె శరీర తత్వం చూస్తే ఆమె సత్యలా

అనిపించలేదు ముర్రారికి .

సత్యా .. అని ఆమె వంక విస్తుపోతూ చూసాడు మురారి .

మురారీ సేవ్ మీ .. అంటూ అంతలోనే దీనం గా అంది సత్య . ఆమె ఒంటి మీద గౌను అంతా చినిగి పోయి ఉంది ..

సత్యా .. ఏంటి ఇలా చేస్తున్నావు ? అనేలోపే మొండెం లేని కాళ్ళు వారి వైపు వస్తూ కనిపించాయి . ...

మురారి దగ్గరలోనే ఉన్న ఒక పాత కత్తి ని చేతిలోకి తీసుకొని ఆ విచిత్రాకారాన్ని కొట్టేందుకు ప్రయత్నించాడు .

ఇంకా ఉంది 





















































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 10 March 2014

రుధిర సౌధం 90



మురారి కోసం ఎదురుచూస్తూ తలని కుర్చీ కి ఆనించి నిశ్చింతగా కనులు మూసుకుంది సత్య .

ఆమె కళ్ళముందు మురారితో పరిచయం ,ప్రేమ .. సరదాగా గడిపిన సన్నివేశాలు మెదిలాయి . ఆమె పెదవులపై

అప్రయత్నం గా సన్నని చిరునవ్వు .

ఇంతలో ఆమె ముందు నుంచి ఎవరో వేల్లినట్లనిపించి అకస్మాత్తుగా కళ్ళు తెరచింది .

చుట్టూ చూసింది ఎవరూ లేరు . ఎందుకో ఓ క్షణం ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది . భయం తో వెంట్రుకలు నిక్క

బొడుచుకున్నాయి . నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అనవసరం గా భయపడుతున్ననేమో .. ధైర్యం

గా  ఉండాలి .. ఈరోజు సంతోషం గా గడపాలి .. లేనిపోని భయాలని మనసులోంచి తుడిచేయాలి .. అనుకుందామే .

ఇంతలో ఆమె భుజం పై ఓ చేయి పడింది . ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లైంది ..

గుండె ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది .

నిండు చంద్రుడిలా మురారి చిరునవ్వుతో చూస్తున్నాడు ..

ఆమె నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని నువ్వా ? అంది .

ఏం ? ఇంకెవర్నైనా పిలిచావా ? అని అంటూనే పూలతో అలంకరించిన మండపాన్ని చూసి వావ్ .. అన్నాడు మురారి

ఆమె అతడి కళ్ళలోని సంతోషాన్ని గుర్తించి అతని చేయి అందుకొని రా మురారీ .. అని ముందుకి నడిచింది ..

అతడు ఆమె వంక సమ్మోహనం గా చూస్తూ మండపం లోకి నడిచాడు .

ఈ ఏర్పాటు అంతా నీకోసమే .. ఎలా ఉంది ? అని అడిగింది సత్య .

నీ మనసులో నిండిన నాపై ప్రేమంత అందం గా ఉంది .. అన్నాడు మురారి .

ఆమె తన చేతిలోని వాచ్ వైపు చూసింది .. 12గం అవుతోంది ..

జన్మదిన శుభాకాంక్షలు మురారీ .. అని అతడి చేతిని ఆర్తిగా చుంబించింది సత్య .

థాంక్స్ సత్యా .. అని ఆమె వైపు ఆరాధన గా చూశాడు మురారి .

ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది .. ఈలోపు మురారి వెనుకగా ఒక అస్పష్ట రూపం ఆమె వంక తీక్షణం గా

చుస్తున్నట్లని పించి ఆమె కళ్ళు భయం తో పెద్దవయ్యాయి .

ఆమె కళ్ళలో మార్పు చూసి .. ఏమైంది సత్యా ? అని వెనక్కి తిరిగి చూసాడు మురారి .

అతనికెవరు కనబడలేదు .. మల్లి సత్య వంక చూసి ఏదో అనబోతుండగా .. ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మారాయి ..

ఆమె మొహం అరునవర్ణం లోకి మారింది .

సత్యా .. ఏమైంది నీకు ఆశ్చర్యంగా అడుగుతాడు మురారి .

ఆమె .. ఏ హ్.. అని వింతగా అరుస్తూ ఆమె రెండు చేతులతో మొహాన్ని గోళ్ళతో  గీరుకోసాగింది .

సత్యా .. అని గట్టిగా అరచి ఆమె ని పట్టుకొనే లోపు ఆమె పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ మహల్ వైపు పరుగుతీసింది .

ఆ హటాత్ పరిణామానికి విస్తుపోయి సత్యా .. అంటూ ఆమె వైపు పరుగు తీస్తాడు మురారి .

(ఇంకా ఉంది  )

Saturday, 8 March 2014

రుధిర సౌధం 89

వెళ్ళిపోతున్న రచన ని చూసి హాయిగా నిట్టూర్చి తన చేతిలోని పూలవంక చిరునవ్వుతో చూసింది .

ఆమె మనసు ఆక్షణం ఆమె రాణి మహల్ పరిసరాలలో ఉందన్న సంగతి మరచింది . మనసుపడ్డ వాడికోసం ఆశగా

ఎదురు చూస్తుంది .

మురారి కి ఇష్టమైన ఫ్లవర్స్ .. ఇష్టమైన కలర్ డ్రెస్ .. ఇష్టమైన నేను .. తన పుట్టినరోజుని సంతోషం గా

ఆహ్వానించాలి ... చల్లగాలికి ఎగురుతున్న కురులని సరిచేసుకుంటూ మనసులో తీర్మానిన్చుకుంది సత్య ..

మహల్ గేటు దాటి బయటకి వచ్చిన రచన గేటు బయట ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపించి .. ఎవరూ ? అని

అరచింది.

హే మెల్లిగా .. నేనే .. అన్నది ఓ మగ స్వరం .

యశ్ .. నువ్వా ? నువ్వేం చేస్తున్నావిక్కడ ? విస్తుపోతూ అడిగింది రచన .

ఏం చేయను ? నీకూ ,సత్య కి వచ్చిన ఐడియా మూలం గా నేనిక్కడ ఉండాల్సి వచ్చింది .. సత్య కి ,మురారికి

కాపలా ఉండాలి కదా .. వాళ్లకి ఎటువంటి సమస్యా ఎదురు కాకుండా .. అన్నాడు యశ్వంత్ .

యశ్ .. వాళ్ళ ఏకాంతానికి .. అని రచన ఏదో చెప్పబోతుంటే ..

వాళ్ళ ఏకాంతానికి ఏ భంగం వాటిల్లదు .. కానీ నువ్వు ఇక్కడే ఉండు .. నాకు తోడుగా .. శివ కూడా .. ఇక్కడే

ఎక్కడో  ఉండుంటాడు .. అన్నాడు యశ్వంత్ .

గాడ్ .. ఎలా చెప్పను ? వాళ్ళని సరదాగా గడపమని చెప్పి మనం వాళ్ళని గమనిస్తూ ఉంటామా ? బావుంది ..

సత్య చూస్తే ఏమనుకుంటుంది ? అంది రచన కోపం గా .

రచనా .. సిల్లీగా మాట్లాడకు .. ఇక్కడ వాళ్ళని ప్రమాదం ఒడ్డున పెట్టి నేను నిశ్చింతగా నిద్రపోలేను .. అయినా నేను

మురారికి చెప్పాను .. ఏదైనా సమస్య వస్తే తన దగ్గర ఓ అలారం ఉంది మొగించమని .. అన్నాడు చుట్టూ గమనిస్తూ

యశ్వంత్ .

వాళ్ళ సెలబ్రేషన్ ని కూడా నువ్వు ఆపరేషన్ చేస్తున్నావా యశ్ .. ? సత్య ఈ మధ్య డల్ గా ఉంటుంది .. ఆ డల్ నెస్

పోవటానికి తనలో కొంత సంతోషం నింపాలని నా ప్రయత్నం .. అర్థం చేసుకో యశ్ .. అంది రచన .

రచన .. నువ్వు వెళ్లి పడుకో .. మనం తర్వాత మాట్లాడుకుందాం .. నేను సత్య కి తెలియనివ్వను .. అంతేకాదు ..

నేను వాళ్ళని గమనించను .. కానీ మురారి అలారం మోగిస్తే అలెర్ట్ గా ఉండాలికదా .. అన్నాడు యశ్వంత్ .

గో టు హెల్ .. అని చిరాగ్గా ముందుకి నడిచింది రచన .

                                       ****************************************

  మురారీ .. అంటూ లోపలికి వచ్చిన రచన ని చూసి .. రా రచనా .. అన్నాడు మురారి .

తన చేతిలో ఉన్న గులాబీల బోకే అతని చేతికందించి హ్యాపీ బర్త్ డే .. అంది రచన .

థాంక్స్ .. అని .. నీ ఫ్రెండ్ మహాల్ల్లో వెయిట్ చేస్తుంది .. వెళ్ళాలి అన్నాడు మురారి .

అవును .. కానీ యశ్ .. అని ఆమె ఏదో అంటుండగా ..

యశ్ .. ఆలోచన నాకు తెలుసు రచనా .. యు డోంట్ వర్రీ .. నేను చూసుకుంటాను .. అన్నాడు మురారి .

సరే .. నేనిక్కడే నిద్రపోతాను .. బాగా లేట్ ఐంది .. భుపతివాళ్ళు నిద్రపోయుంటారు అంది రచన .

సరే రచనా .. నేవెల్తాను అని బయటికి నడిచాడు మురారి .


ఇంకా ఉంది 

Thursday, 6 March 2014

రుధిర సౌధం 88




రచనా .. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎందుకో అన్ సేక్యుర్డ్ గా ఉన్నాను . కాని ఎందుకో

ఈరోజు నాకు చాలా సంతోషం గా ఉంది . మురారి తో కొంత సమయం గడపబోతున్నందుకు .. అంది సత్య ..

మహల్ వైపు నడుస్తూ .

"నాకు తెలుసు నీలోని అభద్రతాభావం .. అందుకే గా ఇదంతా ప్లాన్ చేసింది " అని మనసులో అనుకుంటూ ..

మహల్లో ఉన్న పాత చైర్స్ .. టేబుల్స్ మండపం దగ్గర ఏర్పాటు చేసాను .. నువ్వెలాగు మండపం అంతా పూలతో

అలంకరించేసావు .. సరదాగా స్పెండ్ చెయ్ తనతో .. అంది రచన

తప్పకుండా .. థాంక్స్ రచనా .. అంది సత్య .

ఎన్నిసార్లు చెబుతావు .. బహుశా నువ్వు చాలా ఆనందం గా ఉన్నావు కదా అందుకేనేమో .. ఇన్ని సార్లు థాంక్స్

చెబుతున్నావు .. అని ముందుకి చూసి మహల్ దగ్గరకి వచ్చేసాం .. అని గేటు ని ముందుకి తోసింది రచన .

ఎందుకో మహల్ వైపు అంత చీకటిలో చూడగానే వొళ్ళు గగుర్పొడిచింది సత్యకి .

గేటు దగ్గరే ఆగిపోయిన సత్యని చూసి తన చేతిలో ఉన్న చార్జింగ్ లైట్ ఆన్ చేసి .. అక్కడే ఆగిపోయావెం .. రా సత్యా .

అంది రచన .

హ .. అని నుదుటికి పట్టిన చెమట ని తుడుచుకుంటూ తాను వేసుకున్న పొడవాటి ఎర్రగౌనుని కాళ్ళ మధ్య

పడకుండా కొంచెం ఎత్తి పట్టుకుని లోపలికి నడిచింది సత్య .

వారిద్దరూ సరాసరి దక్షిణం గా మండపం వైపు నడిచారు .

వెలుగులు చిమ్ముతూ ఉందక్కడ .

అరె .. ఇన్ని లైట్స్ .. ఎప్పుడు అర్రంజ్ చేసావు రచనా ? ఆశ్చర్యం గా అడిగింది సత్య .

శివ కి చెప్పాను ముందే మనం వచ్చాక శివ మహల్ కి వచ్చి ఈ ఏర్పాటు చేసాడు .. అన్ని చార్జింగ్ లైట్స్ ..

ఫరవాలేదు .. రాత్రంతా వెలుగుతాయి .. అంది రచన .

సో నైస్ అఫ్ యు బొత్ .. అంది సత్య అబ్బురంగా ,అందం గా సొగసులద్దిన ఆ మండపాన్ని చూస్తూ ..

మండపం పక్కగా టేబుల్ ,చైర్స్ వేసి ఉన్నాయి .

వెళ్లి అక్కడ కూర్చుంది రచన .. సత్య కూడా ఆమె ఎదురుగా ఉన్న కుర్చీ లో కూర్చుంది ..

నేను కాసేపు ఉండి వెళతాను సత్యా .. నీకేం భయం లేదుగా ఆ తర్వాత ... అంది రచన .

లేదు రచనా .. ఈ ఏర్పాటు నంతా చూసాకా నాకు భయం లేదు సరికదా .. మురారికోసం ఎంతసేపు అయినా

వేచి ఉండగలనని పిస్తుంది .. అంది సత్య .

సరే ఐతే .. నాకైతే ఇప్పుడే నేను వెళ్తే వెంటనే మురారి వస్తాడనిపిస్తుంది .. అంది చిలిపిగా కన్ను గీటుతూ ..

పో రచనా .. అంటూ అందం గా సిగ్గుపడింది సత్య .

పోతానులేమ్మా .. తినడానికి ,తాగడానికి అన్ని ఉన్నాయి .. దేనికీ ఇబ్బంది పడవద్దు .. మరైతే నేను వెళ్ళనా ?

అని లేచింది రచనా ..

సరే .. నేను మురారి కోసం వేచి చూస్తాను .. అంది సత్య .

నీ నిరీక్షణ ఎంతసేపు ? నేనిలా వెళ్ళగానే మురారి వస్తాడు .. బాయ్ సత్య .. హావ్ ఏ గుడ్ టైం .. అని గేటు వైపు

నడిచింది రచన ..

ఇంకా ఉంది 



నేను








ప్రియ సమీరమా ..

                                 నా ముంగురులని సవరించిపో ..

మృదు దరహాసమా ...

                                నా పెదవులపై ముచ్చటగా ఒదిగిపో ..

మధుర స్వప్నమా ..

                                నా కన్నులలో వెన్నెలను నింపిపో ..

తొలి అరుణమా ...

                                నా చెక్కిలి పై సిగ్గులా నిలిచిపో ..

భానుతేజమా ...

                                నా నుదుట తిలకమై వెలిగిపో ..

చినుకు ముత్యమా ..

                                  నా ముక్కెర లా తళుకు లీనిపో ..

ఇoదు  బింబమా ....

                                నా వదనాన్ని చుంబించి పో ..

నవనీతమా ...

                                నా హృదయ మార్దవమై మారిపో ..


                               



    

Wednesday, 5 March 2014

రుధిర సౌధం 87



యశ్ .. అందరికీ టిఫిన్స్ తెచ్చాను .. రండి .. ఆకలిగా ఉంది .. అంటూనే శివ ఎక్కడ ? అన్నాడు మురారి .

శివ ఎక్కడికో వేల్లినట్లున్నాడు మురారీ .. ముక్తసరిగా అన్నాడు యశ్వంత్ .

యశ్ .. ఏంటి డల్ గా ఉన్నావు ? ఇంతకు ముందు బాగానే ఉన్నావు గా .. నేను బయటికి వెళ్లి వచ్చేసరికి నీ

మూడ్ మారిందేంటి ? అన్నాడు మురారి ..

అలాంటిదేం లేదు మురారి .. అడ్వాన్సు గా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .. అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. నాకసలు గుర్తే లేదు .. అదిసరే .. ఈ శుభాకాంక్షలు కూడా నువ్వు హుషారుగా చెప్పలేదు .. ఏం జరిగింది

యశ్వంత్ ? అన్నాడు మురారి .

మురారీ .. ముందు నువ్వు ఇలా పక్కకి రా .. అని మురారి చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళాడు యశ్వంత్ ..

యశ్వంత్ .. వాట్ ఇస్ థిస్ ? అన్నాడు మురారి .

మురారీ .. నీ పుట్టిన రోజు విషయం నాకూ గుర్తులేదు .. సత్య చెప్తేనే తెలిసింది .. ఇప్పుడది కాదు సమస్య . సత్య

నీతో ఒంటరిగా గడపాలని ఆశిస్తోంది . నీకేదో surprise ఇవ్వాలని అనుకుంటోంది .. ఇవేవీ ప్రాబ్లం కాదు గానీ ..

ఆ surprise ఏదో వేరే చోట ప్లాన్ చేసుకోవోచ్చుగా .. రాణి మహల్ లో ప్లాన్ చేసింది .. అన్నాడు యశ్వంత్ .

మహాల్లోనా ?? అని గట్టిగా నవ్వాడు మురారి ..

నువ్వు నవ్వకు .. నాకు ఎందుకు రిస్క్ అనిపిస్తుంది .. ? అన్నాడు యశ్వంత్ .

నిజంగా సత్య అలా ప్లాన్ చేసుంటే సత్య ధైర్యానికి నాకు మెచ్చుకోవాలని పిస్తుంది యశ్వంత్ .. పోనీ .. నీ టెన్సన్

కూడా నాకు అర్థమైంది .. యు డోంట్ వర్రీ యశ్ .. నేను చూసుకుంటాను ... అన్నాడు మురారి .

లేదు మురారి .. నైట్ మీకు రక్షణ గా మేమూ ఉంటాం .. బట్ ఈ విషయం సత్య కి తెలియనివ్వకు . తనే విషయం

లోనూ హర్ట్ కావటం నాకిష్టం లేదు అన్నాడు యశ్వంత్ .

సరే మిత్రమా .. అని మనసారా హత్తుకున్నాడు యశ్వంత్ ని మురారి .
                                           
                                                ******************************

రచనా నేను మహల్ దగ్గరకి స్టార్ట్ అవుతాను యశ్ మురారి ని పంపిస్తాడు గా .. అంది సత్య .

సత్యా .. మురారి సమయానికి వస్తాడులే గానీ .. నేను కూడా నీతో మహల్ దగ్గరకి వస్తాను ... మురారి వచ్చేంత

వరకు నేను నీకు తోడుగా ఉంటాను . మురారి వచ్చేసే టైం కి నేను ఉండనులే అంది రచన .. చిరునవ్వుతో .

ఎరుపెక్కిన సత్య బుగ్గలు చిరునవ్వు తో మరింత మెరిసాయి ..

పద వెళదాం అంది సత్య .

ఇద్దరూ మహల్ వైపు నడిచారు







రుధిర సౌధం 86


అందుకే రేపు మురారి ,సత్యలను ఏకాంతం గా వదిలేద్దాం .. వాళ్లకలా ప్రైవసీ ఇవ్వటమే వాళ్లకి మనమిచ్చే గిఫ్ట్ ..

ఏమంటావ్ ? అంది రచన కొంటె గా సత్య వైపు చూస్తూ ..

ఓహ్ .. అలా అయితే .. ఓకే .. గానీ రేపు ఓ ఇంపార్టెంట్ టాస్క్ ఉంది కదా .. మురారి ఉండటం ఎంతో ముఖ్యం ..

అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. కం ఆన్ .. యశ్వంత్ . .. మనమంతా ఉన్నాం కదా .. మేనేజ్ చేస్కోలేమా ? అంది రచన .

సరే రచనా .. అని సత్య వైపు తిరిగి .. సత్యా .. నువ్వు మురారి తో హ్యాపీ గా స్పెండ్ చెయ్ .. మిగతా పనులు మేము

చూసుకుంటాం .. అన్నాడు యశ్వంత్ .

థాంక్స్ యశ్వంత్ .. బట్ నేను మురారికి నైట్ 12 గం లకి విష్ చేద్దామనుకుంటున్నా .. అంది సత్య .

ఓకే .. అది నీ ఇష్టం .. అన్నాడు యశ్వంత్ .

బట్ యశ్వంత్ .. మేము ఏర్పాట్లు మహల్ లో చేసాం .. అంది రచన .

వాట్ ? అరె తెలిసీ అలా ఎలా ఆలోచిస్తావు రచనా ? పార్టీ చేసుకోవాలంటే మనుషులు ఉండాలి .. దెయ్యాలు కాదు ..

అన్నాడు యశ్వంత్ చిరాకుగా ..

మహల్ లోపల కాదులే యశ్వంత్ .. అయినా మరో మంచి చోటు ఏముంది ఈ ఊరిలో .. నువ్వే చెప్పు .. అయినా

నేను బాగా అరేంజ్ మెంట్స్ చేసుకొన్నాను .. రాత్రి 12గం ఎవరూ రాకుండా ఉండే చోటు అదేకదా .. ప్లీజ్ అంది సత్య .

నీకింత ధైర్యం ఎలా వచ్చింది సత్యా ? ఐ డోంట్ బిలీవ్ దిస్ .. అన్నాడు యశ్వంత్ .

ధైర్యం అంటే మురారి వల్లనే .. అయినా మనం మహల్ కి ఎన్నిసార్లు వెళ్లి రాలేదు ? ఆ దెయ్యం మనల్ని ఏం చేయ

గలిగింది ? అంది సత్య .


సరే ..  నువ్వింత కాన్ఫిడెంట్ గా ఉంటే నువ్వనుకున్నట్లే కానీ .. అని ఆ గది లోంచి బయటకి వెళ్ళిపోయాడు యశ్ .

యశ్ ముభావం గా వెళ్ళిపోవడం తో .. రచనా .. యశ్ కేమన్నా కోపం వచ్చిందా ? అని అడిగింది సత్య .

నెవెర్ .. నువ్వేం వర్రీ కాకు . మనం సిస్టం లో మురారి కోసం బెస్ట్ మెసేజ్ టైపు చేద్దామనుకున్నం కదా .. పద

ముందు ఆ పని చేద్దాం .. అంది రచన .

ఇద్దరూ కలిసి సత్య గదికి వచ్చారు .

సిస్టం ముందు కూర్చుంది సత్య . సిస్టం కి కొంచెం దూరం లో నేల పై ఉన్న పరుపు పై మేను వాల్చింది రచన .

చెప్పు రచనా .. వర్డ్ ఓపెన్ చేసాను .. ఏదైనా మంచి థాట్ చెప్పు అంది సత్య .

ఆమె వంక చిరునవ్వుతో చూసింది రచన .

(ఇంకా ఉంది )