Powered By Blogger

Friday, 16 September 2016

మీతో కాసేపు


కాలం కరిగిపోతుంది .. కలం ముందుకి దూసుకు పోతుంది ..

కానీ మనసే ఎక్కడో ఆగిపోయింది ..

ఏదో అలజడి మదిలో ... అంతెరుగని శూన్యాన్ని చూసినట్టు ...

స్పందన లేనట్టు హృదయం ఊరుకోదు ..

చేతన లేనట్టు కలం ఒప్పుకోదు ..

అందుకే అక్షరాలు రంగు నింపుకున్నాయి .. ..

ఎప్పుడో విన్న సంగీత పాఠం గుర్తు చేసుకున్నట్లు గా ..

అలవోక గా ఇలా ముందుకు సాగుతున్నాయి నా వేళ్ళ కదలిక తో ..

అవును .. రచన లో నా ఇష్టం ఉంది .. నా అభిరుచి ఉంది .. నా దరహాసం ఉంది ..

నా విశ్రాంతి ఉంది .. మనఃశాంతి ఉంది ..

అందుకే విరిసే పూవు ని చూసినా ... ఆ పూవు పై ముత్యం లా మురిసే చినుకుని చూసినా

కవిత పొంగుకొస్తుంది .. భావుకత తన్నుకొస్తుంది .

పరిస్థితులు , విశ్రాంతి లేని సమయం , బాధ్యతలు , బంధాలు  కట్టిపడేస్తున్నా ..

ఒక్కసారి  నా " నా రచన " లో విహరించేందుకు కాలం కొన్ని నిముషాలు కానుకిచ్చ్చింది .

ఆపకంటూ నా వేళ్ళు కీబోర్డ్ పై నాట్యాన్ని చేస్తున్నాయి ..

కానీ .. మళ్ళి  కలుద్దాం అంటూ సెలవు తీసుకుంటున్నా ..

నా బ్లాగ్ చదివే వారందరికీ కృతజఞతలు .. త్వరలోనే మళ్లి  నా రచన లో లోతులు చూద్దాం



                                                                                             మీ
                                                                                                   రాధికా ఆండ్ర











మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 26 July 2016

అమ్మ ప్రేమ




అలవోక గా ని ను చూడగా .. చిరునవ్వుతో నన్ను చూస్తావుగా ..

ఆ మోము న వెన్నెలలు జలతారులై జాలువారుగా ...

అచ్చెరువై నేను నిను చూసి మురిసి ముద్దొఛ్చి నేనిన్ను ఒడి చేర్చగా ..

లేలేత చివురాకుల పెదవుల పై జడివానలా నవ్వులే కురియగా ..

ఆ చిన్ని కిట్టయ్య నే కన్న తల్లి యశోద నేనయ్యి మురిసానుగా ..

నా హృదయ ధార లే నీ బొజ్జ నింపగా .. కలువ రేకు కనులే నిదురమ్మ నడిగే ..

ఉయ్యాలలో సేద తీరేటి వేళా .. నా గొంతులో ఎన్ని రాగాల సుడులో ..

నునులేత పాదాలు నేలమ్మ తాకి పలుమారు నిన్నేమో ముద్దాడగా ..

ఆ చిన్ని కళ్ళల్లో కన్నీరు కూడా .. చూడంగ ముచ్చ్చట కాదా ..

నా చిన్ని తండ్రి అని గుండెలకి హత్తుకుంటే ఆ అనుభూతి చెప్పతరమా ..

నా చిన్ని ప్రపంచం లోకి వచ్సిన ముద్దుల కూనా .. నీ అల్లరి ఎంతిష్ట మో

మాటల్లో చెప్పేందుకు భాష చాలక నా కంటి కాటుక తీసి నీకు చుక్క పెట్టా ...

నింగి లోని చందమామే నా ఒడిలో ఉంటె బువ్వ తినిపిస్తూ చంద్రున్నెలా పిలవను?

ఆటబొమ్మే ఈ అమ్మ అయితే ఇంతకన్నా గొప్ప బొమ్మని ఏడ తేగలను ?








































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 14 July 2016

ప్రేమింతే ...





మనసు పలక  పై రాసిన అక్షరాలు .. 

 నీ పేరే అయినాయి శిలా క్షరాలై .. 

కనుపాప పై వాలిన నిదుర ను సైతం .. 

రానీయనంత పంత మేమిటో  ... 

గమ్యమెరుగని అడుగుల పయనం .. 

నీతో సాగితే దూరమెంతున్నా లేదు భయం .. 

పెనుభారం అవుతున్న హృదయం ... 

నీ ఒడి చేరితే దూది పింజ లా మారటం చిత్రం .. 

అందమైన పూదోట లా ఈ యవ్వనం .. 

ఒక్కసారే వచ్ఛే వసంతమై  ప్రణయం .. 

పగలు రాత్రి తేడాలు చూపదు నీ సాన్నిహిత్యం .. 

నువు కానరాని నిమిషం పగ తీర్చుకుంటుంది  కాలం .. 

నా హృదయ లోతుల్ని దాటే నీ దరహాసం .. 

విరహ వేళల్లో చేస్తుందెందుకు పరిహాసం .. 

నీకోసం నా ఈ నిరీక్షణ .. క్షణమొక యుగం .. 

నీ చుట్టూ నా మది ప్రదక్షిణ .. యుగ యుగాలకి నిజం 

చెలిమి నీడలో విరిసిన పుష్పమా .. 

చెలియ జాడనే తెలపవే స్నేహమా .. 

తనకోసం నా మది కలవరిస్తోందని . ... 










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 7 April 2016

ఉగాది కి స్వాగతం



కోటి కాంతుల ఉగాది .. కొత్త వెలుగుల ఉగాది .. 
తరలి వచ్చింది ఉగాది ... మరల తెచ్చింది నవ కాంతి .. 
చిట్టి కోయిలమ్మ రాగం .. స్వాగతిస్తుంది ఆమని సోయగం .. 
మావిచిగురు లేలేత ఎర్రదనం ... అరుణ కిరణాల సంయోగం ... 
ఆరు రుచుల పరమార్థం ... జీవితానికి నిర్వచనం .. 
భావి పైన ఆశల వర్షం ... వింటుంటే పంచాంగ శ్రవణం .. 
తెలుగు వారి పర్వదినం ... కలుగు సిరి సంపదల వాయనం .. 
ఇంటింట మావి పచ్చళ్ళు ... సరితూగవు  పిండి వంటలు .. 
నూతన సంవత్సర శుభాకాంక్షలు ... చెబుతున్నాయి తెలుగు వారి ముంగిళ్ళు ... 
ఎనలేని సుఖ సంతోషాలు .. చేకూరాలని ఇవే' నా రచన " అభిమతాలు










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 27 April 2015

వంచన



గుండె లో సవ్వడి స్పష్టం గా వినిపిస్తుంది .. 
కళ్ళ లో తడి నీ రూపాన్ని అస్పష్టం చేస్తుంది .. 
మాటరాని మౌనమేదో మనసు ని కమ్మేసింది .. 
అడుగు కూడా కదపలేని అసహాయత చుట్టుముట్టింది .. 
మంత్రమేదో వేసినట్టు శరీరం స్థాణువయ్యింది .. 

ఎదురుగా నిర్దయగా నువ్వు .. 
కాఠి న్యమైన  నీ చూపు .. 
నిలువునా నన్ను రంపపుకోత కోస్తుంది .. 
వేళ్ళును కున్న నమ్మకాన్ని సమాధి చేస్తుంది .. 

తడారి పోతున్న పెదాలపై జీవం లేని చిరునవ్వు .. 
ప్రత్యక్షమై ఏడవ లేక నవ్వుతున్నాను నేను .. 
ఆ నవ్వు చూసి తృప్తి గా నవ్వుకున్నావు నువ్వు .. 
నీ కాళ్ళ కింద నలిపేసిన బంధాన్ని మరోసారి నలిపావు . 

నిశీధి లో ఒంటరిగా  భారం గా పదము సాగి .. 
నిరాశ  తీరానికి అలసిపోయి చేరుకుంది .. 
ముక్కలైన మనసు కాస్త సేద తీర వేచి ఉంది .. 
చెక్కిలి పై కన్నీటి చార ఎప్పటికీ చెరగ నంది .. 
ఇంత జరిగినా నీ జ్ఞాపకం మనసు అట్టడుగున తడుము తూనే ఉంది .. 






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 20 March 2015

ఉగాది వెలిగిపోతోంది


కొమ్మల్లో కోయిల కూసింది .. 

రెమ్మల్లో  పల్లవి పాడింది ,, 

ఫాల్గుణి వీడ్కోలు పలికింది ,, 

చైత్ర వీణ సరాగాలు మీటింది .. 

మావిచిగురు లేత ఎరుపు నవ్వు నవ్వింది ,, 

శిశిర భామ పరవశించి నాట్యాలు చేసింది .. 

కొమ్మ మాటున పడుచు మామిడి కొంటె గా చూస్తోంది .. 

షడ్రుచులు ఏకమై జీవితాన్ని పిలిచింది .. 

గురిపెట్టిన మన్మధ శరం లా కొత్త ఏడాది వచ్చింది .. 

పంచాంగ శ్రవణాలు వింటూ ఉగాది తొలి అడుగు పెట్టింది .. 

శుభాలను కలిగిస్తానంటూ హామీలు ఇస్తోంది ,, 

తెలుగు ముంగిల్లలోనా ఉగాది వెలిగిపోతోంది ,, 

కోటి ఆశల దీపికలా ఆహ్వానం పలుకుతోంది. 


నా రచన అభిమానులకి మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు ..  





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 6 February 2015

ప్రేమ కలవరం

 సతమతమవుతున్నా సతమతమవుతున్నా ..
పరిచయమవుతున్న ఈ వింత హాయిలో అలా ..
తడబడి పోతున్నా తడబడి పోతున్నా ..
ఎదురుగ నువ్వున్నా అడుగింక సాగదే ఎలా ?
నా ఊపిరి గమనిస్తున్నా .. ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ..
ఈ ఒత్తిడి నీ వలెనే అనుకున్నా ..

హృదయం లో ఏమూలో భారం పెరిగిందేమో ..
ఉదయించే ప్రణయం వలనేమో ..
నయనం లో ఏదోలా నీ రూపే చిక్కిందేమో ..
స్వప్నం లా వెంటాడావేమో ..
ఇది ఎక్కడి అల్లరి చూపు ,,నను గిల్లే తుంటరి చూపు ..
తెలియకనే నే నువ్వవుతున్నా ..

ఇన్నాళ్ళు ఎరుగని దేదో తొలిగా తెలిసిందేమో ..
అనుభవమే కొత్తగా ఉందేమో ..
కొన్నాళ్ళుగా జరగనిదేదో మదికే మరి జరిగిందేమో
ఆ చిత్రం నవ్వుతూ చూస్తున్నానేమో ..
ఇది ఏమి అలజడో గానీ .. పరువం లో సందడి గానీ ..
నను నేనే మరచి పోతున్నా ...











ప్రేమికుల రోజు రాబోతున్నందుకు ప్రేమికులకి కానుక గా


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 31 December 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు ..


అరె మొన్న మొన్ననే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం .. అప్పుడే సంవత్సరం గడచిపోయిందా ? ఆశ్చర్యం గా ఎవరో ఎవరితోనో అంటున్నారు .. విన్న నాకు నవ్వు వచ్చింది .. నిజమే .. కాల చక్రం గిర్రున తిరిగి పోయింది .. 
అవును మరి .. ముందుకు సాగటమే తప్ప వెనక్కి చూడటం అలవాటు లేదుగా కాలానికి .. తన పని తాను 
చేసుకు పోతుంది .. 
ఎందరి ఆశలకి రెక్కలు తొడిగాను ? ఎందరి జీవితాలను ఒడ్డుకి చేర్చాను ? ఎందరి మనస్సులో ప్రేమని రగిల్చాను ?
ఎందరి విజయాలకి నాంది పలికాను ? ఎందరి పెదవుల్లో నవ్వుల పూలు పూయించాను ? అంటూ పొంగి పోదు .. 

ఎందరి జీవితాల్ని అతలాకుతలం చేశాను ? ఎందరికి ఓటమిని రుచి చూపాను ? ఎందరి ఆశయాల్ని మట్టిలోకి 
తొక్కాను ? ఎందరి మదిలో వేదనల్ని మిగిల్చాను ? ఎన్ని దుస్సంఘటన లను మోసుకెల్తున్నాను ? అంటూ 
లెక్కలు వేయదు .. మంచైనా , చెడైనా ముందుకి సాగటమే కాలం మనకి నేర్పేది . 
నిజమే .. ఎండ , వాన కలసి నపుడే నింగి , నేల ని కలిపే హరివిల్లు కనువిందు చేస్తుంది .. కష్టం , సుఖం కలగలసి 
నపుడే జీవితం వికసిస్తుంది , బంధాలు పరిపూర్ణ మవుతాయి .. 

2014 లో విషాదాలను వదిలేద్దాం .. మంచి సంఘటనలను జ్ఞాపకాలుగా మార్చేద్దాం .. కన్నీటిలో కొట్టుకు పోయిన 
వారిని ఒడ్డుకి చేర్చడానికి ప్రయత్నిద్దాం .. మనిషి ఎపుడూ ఆశావాదే .. కొత్త సంవత్సరపు రాక ని మరింత 
ఉత్సాహం గా ఆహ్వానిద్దాం .. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తి గా కాంక్షిద్దాం . 
విశాఖ కి మిగిలిన విషాద మయినా , నిన్నో , మొన్నో జరిగిన విమాన ప్రమాదం అయినా కాలం గుండె లో  గుబురు 
కట్టిన ఆవేదనే అనుకుందాం .. గతం మిగిల్చిన అనుభవాలని పాఠాలుగా మలచుకుందాం .. స్వాగతం చెబుతున్న 
భవిత ని మనసారా హత్తుకుందాం .. ఎందుకంటే మనం మనుషులం .. ఆశ  అనే ఆక్సిజన్ పీలుస్తున్న మనుషులం 
... అందుకే ఎల్ల వేళలా శుభాన్నే కోరుకుందాం .. ఉరుకుల పరుగుల జీవితం లో ఇరుక్కు పోయిన మనసులతో 
మన కోసం మరెన్నో అందమైన రోజుల్ని మోసుకొస్తున్న నూతన సంవత్సరానికి సాదరం గా స్వాగతం చెప్దాం .. 

 ఈ నూతన సంవత్సరం మీ మీ జీవితాలలో సరికొత్త వెలుగులు నింపాలని , కొత్త ఆశల్ని చిగుళ్ళు తోడిగేలా 
చేయాలని , ఆద్యంతం బంధాలను దగ్గర చేస్తూనే ఉండాలని , ఆనందాల మతాబులు మీ ఇంటి ముంగిట 
వెలుగుతూనే ఉండాలని .. మరపు రాని మధుర జ్ఞాపకాలని మీ మనసు ఖాతాలో వేయాలని .. మీ కోరికలన్నీ 
(మంచివైతేనే సుమండీ ) ఈ 2015 లో నెరవేరాలని మనసారా కోరుకుంటూ .. మీకు .. మీ కుటుంబాలకి .. 
నూతన సంవత్సర శుభాకాంక్షలు .. 

      wishing you all a very happy new year 2015
                      

                                                                                              మీ  రాధిక ఆండ్ర   






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 22 December 2014

అతి త్వరలో .. " సౌరభం ".

ఎన్నెన్నో కలలు .. వాటికి తోడు చిగురు తొడిగే ఆశలు .. మరెన్నో ఊరించే ఊహల నడుమ సతమత మవుతున్న

నేటి తరం యువత.. కేవలం కలలు కంటూ .. ఊహలలోనే బ్రతుకుతున్నారా .. ? లేదు .. ఆశయాలు ఉన్నాయి ..

చేధించేందుకు లక్ష్యాలు ఉన్నాయి .. సాధించేందుకు ధృఢ చిత్తం ఉంది .. క్లబ్బులలోను ,పబ్బుల్లోనూ .. పుట్టే

స్నేహాలు , ప్రేమలూ ఉన్నాయి .. మరో వైపు స్వచ్చమైన స్నేహం , మనసు ని పరవశింప చేసే ప్రేమా ఉన్నాయి .

ఆరుగురి జీవితాలు ,, నేటి యువత వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో చూపించబోతున్నాను .

మనసు పడితే సాధించలేనిది ఏదీ లేదన్నదొకరైతే .. ప్రేమలో ఓడిపోయినా వ్యక్తిత్వాన్ని గెలిపించుకునేది ఒకరు .

చేదు జ్ఞాపకాల్లోనే సంతోషాన్ని వెదికేది ఒకరైతే , అంతులేని సంతోషం లో బంధాల విలువ చాటేది ఒకరు ..

ఆశయం కోసం పేదరికం అడ్డు కాదన్న దోకరైతే .. లక్ష్యం కోసం ఎల్లల్ల్ని చెరిపేది  ఒకరు ..

ఆ ఆరుగురిని స్నేహం ఒకచోటికి చేర్చితే .. ప్రేమ వారి మధ్య ముచ్చటగా ఒదిగిపోతే .. వారి మధ్య రెక్కలు

తొడిగిన బంధం ..పూవులా వికసించి .. ఎప్పటికీ వాడనిదై ..  వెదజల్లిన సౌరభం .. నా రచన లో త్వరలో మీ మనసు

తీరాలను తాక నుంది .. మరి ఆ స్నేహ సుగంధాన్ని , వలపు సౌరభాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కండి ..

అతి త్వరలో .. మీ ముందుకు రానున్న సీరియల్ " సౌరభం ".







                                                                                           మీ రాధిక ఆండ్ర 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 3 December 2014

జీవన వాహిని (ఓ కథ )

ఆకాశం అంతా మేఘావృతమై ఉంది .. ఈదురుగాలులు మొదలయ్యాయి . .. సాయంత్రం 4 గం ..

వడివడిగా అడుగులు వేసుకుంటూ పలాస బస్ స్టాప్ చేరుకుంది వాహిని . బస్సు స్టాప్ పక్కనే ఉన్న పాన్ షాప్

అతను ఆమె ని గమనించి .. తుఫాన్ మొదలవుతుంది వాహినీ .. ఈరోజు స్కూల్ సెలవ్ పెట్టి ఇంట్లోనే ఉండలేక

పోయావా ? అన్నాడతను .

ఆమె అతడికి గత 3 ఏళ్ళుగా తెలుసు ..

లేదు బాబాయ్ .. సెలవ్ పెట్టడం కుదరలేదు .. బస్సు వెళ్లిపోయిందా బాబాయ్ ? అంది కంగారుగా ఆమె నల్లని

మేఘాలపై అప్పుడప్పుడు మెరుస్తున్న మెరుపుల్ని చూస్తూ .

ఇంకా రాలేదు .. వస్తుంది .. ఇంతలో బస్సు హార్న్ విని .. వాహినీ .. బస్సు వస్తుంది .. బయల్దేరమ్మా .. అన్నాడు

అతడు .

బస్సు ఆగగానే కంగారుగా హ్యాండ్ బాగ్ ని గట్టిగా ఒడిసి పట్టుకుంటూ బస్సు ఎక్కింది .. ముందర తనే ఎక్కటం

మూలాన సీట్ దొరికింది .. ఆమె వెనుక చాలా మంది ఎక్కినట్టున్నారు .. బస్సు కిక్కిరిసి పోయింది .

హమ్మయ్య .. సీట్ దొరికింది .. అనుకొని తన పక్కన ఉన్న ఆమె వైపు చూసింది వాహిని . ఆమె మొహాన్ని చున్ని

తో పూర్తిగా కప్పుకొని ఉండటం వలన పేస్ కనబడలేదు .

సీట్ పై తల ఆనించి నిశ్చింత గా కళ్ళు మూసుకుంది . " ఆ షకీల్ డబ్బు ఇవ్వడేమో అనుకున్నాను .. ఏదో దశ

బావుండి ఇచ్చాడు .. ఈరోజు తీసుకున్న డబ్బుతో లక్ష రూపాయలు వాడికి బాకీ పడ్డాను . ఏం చేయను ? మరి

నాన్న పోయాక అంతా తలకిందులయిపోయింది .. పి.జి చదవాలన్న తన కోరిక ఆవిరై పోగా కుటుంబ బాధ్యతలు

మీద పడ్డాయి . నాన్న ఉన్నప్పుడే అక్క పెళ్లి జరిగిపోయింది . నాన్న పోయాక చిన్నక్క పెళ్లి నానా పాట్లు పడి

చేయాల్సి వచ్చింది .. కట్నం బాకీ ఇంకా మిగిలే ఉంది .. ఇప్పుడు బావ ఇంట్లో అమ్మ బుర్ర తింటూ ఉండుంటాడు .

యాభై వేలు కావాలని . పాపం కంగారుగా ఉదయం ఫోన్ చేసింది అమ్మ .. ఈ డబ్బు తీసుకు వెళ్లి వాడి మొహం

మీద  కొట్టాలి .. అనుకొంది మనసులోనే వాహిని .

ఇంతలో తన పక్కన ఉన్నామె వాహిని చేతిని గట్టిగా పట్టుకోవడం తో ఆలోచనల్లోంచి బయటకి వచ్చి ఆమె వైపు

చూసింది వాహిని .

ఆమె ముసుగు తీయకుండానే .. ప్లీజ్ .. సేవ్ మీ .. అంది చాలా మెల్లగా వణుకు తున్న స్వరం తో .

వాహిని ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది .. బస్సు టెక్కలి లో ఆగి ఉంది .

కిటికీ లోంచి చూడండి .. అక్కడ కొంత మంది రౌడీలు ఉన్నారుగా .. వారు నన్నే వెతుకుతున్నారు .. అని హిందీ

లో చెప్పింది ఆమె .

వాహిని వారిని చూసింది .. నిజంగానే కొంతమంది చూపుకే గూండాల్లా ఉన్నారు . వారిలో ఒకడు బస్సు లో

అందరికేసి చూస్తుంటే .. ఇంకొకడు జనం దిగగానే బస్సు ఎక్కాడు .

వాహిని బుర్ర మెరుపు లా పనిచేసింది .. ఆమె తలని తన ఒడిలో పెట్టి తన కొంగుతో ఆమె ని కవర్ చేసింది ..

ఎక్కిన వాడు చుట్టూ అందర్నీ పరీక్ష గా చూస్తున్నాడు .. వాహిని తన మొహం లో ఎటువంటి తత్తర పాటు లేకుండా

స్థిరంగా కూర్చుంది .

వాడి చూపు వాహిని ఒడిలో ఉన్న ఆమె పై పడనే పడింది .. ఎవ్వరూ ? అని హిందీలో అడిగాడు .

మేరీ బహెన్ .. క్యూ ? అంది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ వాహిని .

అతడు వాహిని వైపు అదోలా చూసి .. కుచ్ నై .. అని దిగిపోయాడు వాడు . బస్సు మళ్ళి కదిలింది . కొంచెం దూరం

వెళ్ళాక ఉటో .. అంది వాహిని .

ఆమె మెల్లిగా లేచి .. థాంక్ యు .. అంది .

ఏం జరిగింది ? ఎవరు వాళ్ళు ? మెల్లిగా అడిగింది హిందీలో  ఆమె ని వాహిని .. ఆమె కళ్ళలో బెరుకు చూసి .

ఆమె చుట్టూ భయంగా చూసి .. నెల క్రితం వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు .. నేను తప్పించుకున్నాను .. అంది

ఆమె హిందీలో .

కిడ్నాపా ? విస్తుపోతూ అడిగింది వాహిని .

ప్లీజ్ కొంచెం మెల్లిగా .. అని చెప్పడం ప్రారంభించింది ఆమె . మాది ముంబాయి .. మా నాన్న గారు పెద్ద వ్యాపారవేత్త .

నా పేరు నిషా . కాలేజీ లో చదువుతున్నాను .. ఓ రోజు కాలేజీ నుంచి వస్తుంటే వెనక నుంచి ఎవరో కర్చీఫ్ పెట్టారు

ముక్కు మీద . అంతే .. కళ్ళు తెరచి చూసేసరికి ఓ పాడుబడ్డ ఇంట్లో ఉన్నాను .. వాళ్ళు నెల రోజులుగా నన్ను

ఎందుకు బంధించి ఉంచారో తెలీదు . కానీ ఈరోజు అదృష్టవశాత్తు గట్టిగా గాలి వీచి నా గది గోడ విరిగిపోయింది ..

నేను తప్పించుకున్నాను .. ఇదే ఏరియా నో నాకు తెలీదు . ఈ బస్సు కనిపించింది ఎక్కేసాను . అన్నదామె

భయంగా .

ముంబై లో నిన్ను కిడ్నాప్ చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో నిన్ను దాచిపెట్టారా ఆశ్చర్యంగా ఉంది . అంది వాహిని .

శ్రీకాకుళం అంటే .. అన్నదామె అమాయకం గా .

ఆంధ్ర .. నువ్వు ఆంధ్రలో ఉన్నావ్ .. అంది వాహిని .

అవునా ? అంటే చాలా దూరం .. నేను మా ఇంటికి వెళ్ళేలోపు వాళ్లకి దొరికి పోతానేమో అని భయంగా ఉంది ..

అంది నిషా .. భయంగా .

ఇంతలో కండక్టర్ .. టికెట్ .. టికెట్ .. అనగానే శ్రీకాకుళం కి రెండు టికెట్స్ ఇవ్వండి .. అని ఆమె కి కూడా టికెట్

తీసుకుంది వాహిని .

ఇంతలో బస్సు మరో స్టాప్ లో ఆగింది .. అక్కడ కూడా కొంత మంది నిషా కోసం వెదకడం గమనించి ఆమె చెప్పింది

నిజమే అని నిర్థారించుకోంది వాహిని .

నిషా భయపడకు .. నేను నీకు సహాయం చేస్తాను .. అని అంది వాహిని .

నిషా చేతులు రెండు జోడించింది . మెల్లిగా వర్షం మొదలైంది . ఈమె ని ముంబై క్షేమం గా ఎలా పంపాలి ? ఈమె

చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు .. ఎలా ? అని ఆలోచించింది . పోనీ వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిస్తేనో .. తుఫాన్ కదూ ..

ఫ్లైట్స్ కూడా కాన్సిల్ అయ్యుంటాయి . ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా .. రాము గుర్తొచ్చాడు ఆమె కి .. అంతే

ఏం చేయాలో బోధపడింది ఆమె కి .

బస్సు శ్రీకాకుళం లో ఆగింది . నిషా ని పట్టుకుని బస్సు దిగగానే ఆటో పట్టుకొని 7రోడ్ జంక్షన్ కి పోనీ .. అంది

వాహిని .

ఓ బట్టల షాప్ ముందు ఆటో ఆగాక .. ఇద్దరూ దిగారు . నిషా పద .. అని షాప్ లోకి నడిచింది వాహిని .

ఆమె అయోమయంగా వాహిని ని అనుసరించింది .. షాప్ లోకి వెళ్ళాక .. నీ సైజు డ్రెస్ ఏదన్నా తీసుకో .. ముందు

ఈ డ్రెస్ మార్చెయ్ .. వాళ్ళు గుర్తు పట్టక పోవొచ్చు .. అంది వాహిని .

ఆమె తల ఊపి కాసేపట్లో బట్టలు మార్చుకొని వచ్చింది . బట్టలకి బిల్ పే చేసి .. ఎదురుగా ఉన్న హోటల్ కి

తీసుకెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేసింది .. ఎప్పుడు తిన్నవో ఏమో తిను .. అంది వాహిని .

ఆమె వాహిని వైపు చూసి థాంక్ యు .. చాలా ఆకలిగా ఉంది .. అంది . ఆమె అమాయకపు వదనం చూస్తె

బాధ అనిపించింది వాహిని కి . ఆమె టిఫిన్ చేస్తుంటే రాము కి ఫోన్ చేసింది . వీళ్ళ టేబుల్ దగ్గరికి కాసేపట్లో

వచ్చాడు రాము .

అక్కా ? ఏంటి ఏదో అర్జెంటు గా మాట్లాడాలన్నావు ? అని .

రాము .. నువ్వు నాకో సహాయం చేయాలి . ఈ అమ్మాయి అర్జెంటు గా ముంబై వెళ్ళాలి . కానీ మనకి వైజాగ్ లో

ఫ్లైట్స్ ఉండి ఉండవు .. అందుకే విజయవాడ నీ కాబ్ లో తీసుకువెళ్ళు .. నిన్ను నమ్మి ఈ పని నీకు

చెబుతున్నాను .. ఆమె ని ఎయిర్పోర్ట్ లో దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి రా .. అని అతడితో చెప్పింది వాహిని .

కానీ అక్కా .. తుఫాన్ .. మొదలైంది .. ఎలా ? అన్నాడు రాము .

కష్టం లో ఉంది రాము .. మనలాంటి వాళ్ళు సహాయం చేయాలి కదా .. ? అంది వాహిని .

సరే అక్కా .. అన్నాడు రాము . బాగ్లోంచి 10000 తీసి అతడి చేతిలో పెట్టి దారి ఖర్చులకి వాడు అంది వాహిని .

మరో పది వేలు తీసి అనుమానం గా చూస్తున్న నిషా ని చూసి .. రేపు ఉదయం విజయవాడ నుండి ఏ ఫ్లైట్ ఉంటె

ఆ ఫ్లైట్ కి ముంబై వెళ్ళిపో . యితడు నా తమ్ముడు . నువ్వు తనని నమ్మొచ్చు .. ఇదిగో టికెట్ కి డబ్బు ..

అని ఆమె చేతిలో 10000 పెట్టింది వాహిని . ఆమె లో ఇంకా అనుమానం పోలేనట్టు ఉంది .

చూడు నిషా .. నేనీ సహాయం నాకు డబ్బు ఎక్కువై చేయటం లేదు .. నీ కష్టం విన్నాక కష్ట సుఖాలు తెలిసిన

దానిగా నీకీ సహాయం చేయాలనుకున్నాను . నా ఇంటి అవసరాల కోసం అప్పుగా తెచ్చిన డబ్బు . ఎందుకో నీ

అదృష్టం బావుండి భగవంతుడు నిన్ను నాకు కలిసేలా చేసాడు .. ఇది నా ఫోన్ నెంబర్ .. అని నెంబర్ రాసున్న

ఓ కాగితం ఆమె చేతిలో పెట్టి .. ఎక్కువ ఆలస్యం చేయకుండా బయల్దేరు . రాము నీకు సోదరుడే అనుకో .. అంది

వాహిని .

నిషా ప్రేమగా వాహిని ని హత్తుకుంది ..

ఇక మేము బయల్దేరుతాం అక్కా .. తుఫాన్ తీరం దాటక ముందే మేము ఇక్కడ్నుంచి వెళ్ళాలి అన్నాడు రాము .

అందరు కార్ దగ్గరికి నడిచారు . కార్ లో కూర్చున్నాక .. ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది నిషా .. ఆప్కా నాం ?

అని .

చిరునవ్వుతో .. వాహిని .. అని చెప్పింది వాహిని .

కార్ దూరమవుతున్నా నిషా వాహిని ని చూస్తూ చేయి ఊపుతూనే ఉంది .

ఇక తుఫ్ఫాన్ ఇంట్లో మొదలవుతుంది .. అని ఇంటికేసి నడిచింది వాహిని .

                                            ****************************

అయినా అంత దయ పనికిరాదే .. 20వేలు .. అయ్యో .. అయ్యో .. నీ రెండు నెలల జీతం కదుటే .. అలా ఎలా ఆ పిల్ల

మాటలు నమ్మి ఇచ్చేసావ్ .. ఆ డబ్బు ఉంటె మీ బావ కట్నం బాకీ పూర్తిగా తీరిపోయేది కాదే .. గట్టిగా అరుస్తుంది

సుశీలమ్మ .

అమ్మా .. అది జరిగి వారం అవుతుంది .. అయినా నువ్వింకా వదలటం లేదు . ఏదోలా ఆ మిగతా డబ్బు నేను

సర్దుబాటు చేస్తానమ్మ .. నాకీ రోజు భాష్యం స్కూల్ లో ఇంటర్వ్యూ ఉంది ఆశీర్వదించి పంపమ్మా .. అంది వాహిని .

సుశీలమ్మ కోపంగా వంటింట్లోకి వెళ్లి పోతూ .. తనకి మాలిన ధర్మం పనికి రాదు .. అంది .

అక్కా .. అమ్మ కోపం ఎన్నాళ్ళు కానీ .. ఆ అమ్మాయి కింద అంత డబ్బు ఖర్చుపెట్టావు ఎందుకు ? అంది చెల్లెలు

మాన్విక .

మాన్వి .. ఆ అమ్మాయికి నీ వయసే ఉంటుంది .. అయినా నాన్న ఎప్పుడూ చెప్పేవారు కదా సాటి వాళ్లకి

సహాయం చేస్తే భగవంతుడు మనకి ఇంకో విధంగా సహాయం చేస్తాడని . అంది వాహిని .

ఇంతకీ ఆ అమ్మాయి  క్షేమం గా ముంబై చేరిందా ? అని అడిగింది మానవిక .

ఆరోజు ఫ్లైట్ ఎక్కేముందు ఫోన్ చేసింది .. చేరాక లేదు . అయినా తుఫాన్ వల్ల నెట్వర్క్ అంతా చెడిపోయింది కదా ..

ఆమె క్షేమం గా వెళ్ళిందనే అనుకుంటున్నాను అంది వాహిని .

అక్కా .. అక్కా .. అని పరుగున వచ్చాడు రాము ..

రాము అన్న వచ్చినట్టు ఉన్నాడు అక్కా .. అంది వీధిలోకి చూస్తూ మాన్వి .

గుమ్మానికి ఎదురెళ్ళి .. వీడెందుకు వచ్చాడు ? అమ్మ వీడ్ని చూస్తే ఇద్దర్ని కలిపి మల్లి తిడుతుంది .. అనుకుంటూ

వెళ్ళిన వాహిని ని  చూసి . అక్కా .. ఎవరొచ్చారో చూడు .. నిషా .. అంటూ వగరుస్తూ అన్నాడు రాము .

నిషా నా .. అని ఆశ్చర్యంగా అని కార్ దిగుతున్న నిషా ని చూసి .. నిజమే .. అంది వాహిని .

నిషా .. అంటే ఆ అమ్మాయే కదక్కా .. అంది మాన్వి .

అవును మాన్వి .. వాళ్ళు అక్క ని వెదుక్కుంటూ వచ్చారు . నాకు ఫోన్ చేశారు .. ఈ రోజు ఫోన్స్ కలిసాయి ..

కదా .. వాళ్ళు ఫోన్ చేయగానే నేను వాళ్ళని కలిసి ఇంటికి తీసుకొచ్చేసా .. రాము మాన్వి తో ఏదో చెబుతూనే

ఉన్నాడు .

నిషా పరుగున వచ్చి వాహిని ని హత్తుకుంది .. నిషా .. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ మళ్ళి ? మళ్ళి నువ్వు ఆ రౌడీ

ల కళ్ళల్లో పడితేనో .. అంది వాహిని కంగారుగా .

నేనొక్కదాన్నే కాదు దీదీ .. పాపా , భయ్యా ఇద్దరూ నాతొ వచ్చారు . ఆ రౌడీలను పోలిస్ లు పట్టుకున్నారు .. ఇక

భయం లేదు .. ఫాస్ట్ గా చెప్పేసింది నిషా .

ఇంతలో కార్ దిగిన ఓ యువకుడు , ఓ పెద్దాయన వీరి వద్దకి వచ్చారు .

భేటీ .. బహుత్ బహుత్ షుక్రియా .. అన్నాడు ఆ పెద్దాయన చేతులు జోడించి  . అతడు నిషా తండ్రి అయుంటాడు

అనుకొని ..

పెద్దవారు .. మీరిలా నాకు నమస్కరించటం ఏంటీ ? ఇంట్లోకి రండి .. అని వాళ్ళని ఆహ్వానించింది  వాహిని .

మాన్వి చెప్పినట్లుంది .. సుశీలమ్మ కూడా వీరికి ఎదురుగా వచ్చి ఆహ్వానించింది .

అందరూ కూర్చొని టీలు కాఫీలు అయ్యాక .. ఆ పెద్దాయన అన్నాడు . నువ్వు చేసిన సహాయం ఏంటో నీకు

తెలీదు తల్లీ . నిషా మా అందరి ప్రాణం . తన జాడ తెల్సుకోవడానికి మేము చెయ్యని ప్రయత్నం లేదు .. పూర్తిగా

ఆశ వదిలేసుకున్నాం .. నువ్వు మా ఇంటి లో చీకటిని పారద్రోలావ్ తల్లీ .. అన్నాడు అతను .

చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది వాహిని .

మా అక్క అంతే నండి .. చాలా మంచిది .. అందరికి సహాయం చేస్తుంది .. అన్నాడు రాము .

తల్లీ నువ్వు చేసిన సహాయానికి వెల కట్టలేను గానీ .. మా సంతోషం కొద్దీ ఇస్తున్న కానుక అనుకో .. ఈ 50లక్షలు

తీసుకో తల్లీ .. అని ఓ సూట్ కేసు ఆమె ముందు పెట్టాడు అతడు .

క్షమించండి .. మీ నుండి ఏదో ఆశించి నేను నిషాకి ఆ సహాయం చేయలేదు .. కష్టం లో ఉన్న ఆడపిల్ల ని చూస్తూ

ఊరుకోలేక నా కర్తవ్యమ్ నేను నిర్వర్తించాను .. దయచేసి ఇలా డబ్బిచ్చి నన్ను బాధపెట్టకండి .. అంది వాహిని .

అతడు వాహిని వంక అచ్చెరువొందుతూ చూసి .. సుశీలమ్మ ని చూసి .. రెండు చేతులు జోడించి .. అమ్మా ..

మీరెంత గొప్పవారు .. ఇలాంటి బిడ్డ ని కన్న మీరు మహనీయులు . ఈరోజు ఈ బంగారు తల్లి ని చూస్తుంటే  నాకు

ఎంతగానో ఆనందం గా ఉంది . మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటానమ్మ .. అని గాద్గద స్వరం తో అంటున్న

అతడిని చూసి .. తన కూతురు వైపు గర్వం గా చూసింది సుశీలమ్మ .

నాన్నా .. ఆమె ని డబ్బిస్తామని చెప్పి కించపరచడం తప్పు .. తిరిగి ఆమె నే ఇంకో సహాయం అడుగుదాం ..

అన్నాడు నిషా అన్న .

అడగండి .. ఏ సహాయం కావాలి ? అన్నది వాహిని .

అందం తో పాటు ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా ? అని అడిగాడు అతడు .

వహ్ .. భయ్యా .. అలా జరిగితే ఎంత బావుంటుంది ? అంది నిషా సంతోషం గా .

ఒక్కసారిగా అవాక్కయింది .. వాహిని .

అవునమ్మా .. నీలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి మా ఇంటి కోడలిగా వస్తే మాకు సంతోషం . నా కొడుకు కోరిక

కాదనకు తల్లీ .. అన్నాడు పెద్దాయన .

కానీ మాకూ మీకూ .. అని ఆగిపోయింది సుశీలమ్మ .

అమ్మా .. ఏ బంధం ఉన్నదని మీ అమ్మాయి మా నిషా ని కాపాడింది ? మీరు సహాయం చేసినందుకు కాదు వాడు

మిమ్మల్ని అలా అడిగింది ? వాడి కళ్ళల్లోవాహిని  పట్ల ఇష్టం కనబడుతుంది .. వాహిని ఆత్మాభిమానం నచ్చి

అడుగుతున్నాడు .. అన్నాడు పెద్దాయన .

కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి .. నా చెల్లెలు .. చదువు , పెళ్లి .. ఇవన్నీ . నా బాధ్యతలు అన్నీ వదిలేసి

మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను .. అంది వాహిని .

సుసీలమ్మ వాహిని వైపు బాధగా చూసింది .

పెళ్లి తర్వాత మీకెలా మరికొన్ని బాధ్యతలు వచ్చిపడతాయో .. నాకూ అంతే వాహిని జి . మీరొప్పుకుంటే పెళ్లి

తరువాత నాకు నిషా ఎంతో మీ చెల్లెలు అంతే .. నా చెల్లెలి పట్ల నేను బాధ్యతలని నిర్వర్తించ వచ్చు .. అన్నాడు

అతడు ..

కానీ .. అని వాహిని అనబోతుండగా .. సుశీలమ్మ .. ఇంకా కాదనకు తల్లీ .. ఆ భగవంతుడే నీ మంచి మనసుకి

మెచ్చి ఇలా చేసాడేమో . వారంత పెద్దమనసుతో అడుగుతున్నారు .. కాదనకు .. ఈ పెళ్ళికి అంగీకరించు ..

అంది సుసీలమ్మ .

తల్లి మాటతో మౌనం గా తల ఊపింది  వాహిని .

సాయంత్రం వరకూ వీరితో గడిపి త్వరలోనే మళ్ళి వస్తామంటూ సెలవు తీసుకొని వాళ్లు కార్ ఎక్కి కూర్చున్నాక

ఏదో గుర్తొచ్చినట్టు అడిగింది వాహిని .. ఆప్ కా నామ్ ? అని .

జీవన్ .. మీకు నచ్చిందా ? అని కొంటె గా అడిగాడు అతడు . కార్ ముందుకి దూసుకుపోయింది .. వాహిని చేయి

ఊపుతూనే ఉంది .

అక్కా .. ఇంతమంచి వాళ్ళు .. నువ్వారోజు ఆ అమ్మాయి కి సహాయం చేయక పోయుంటే .. అంతా మామూలే ..

నువ్వు చేసిన సహాయం నీ జీవితాన్నే మార్చేసింది అక్కా .. అని మాన్వి వాహిని బుగ్గ పై ప్రేమగా ముద్దు

పెట్టుకుంది .

చిరునవ్వు నవ్వింది వాహిని .. తన జీవన వాహిని చేరనున్న మలుపు తల్చుకుని .

                                                   **************************
                                                                                                                         రాధిక  






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 26 November 2014

స్వచ్చ భారతం


 రా రా ఫ్రెండు  మన మొక దండు .. ఊరూ వాడా శుభ్రం చేద్దాం ..
మనమే ఉండు స్థలమే ముందు .. పరిశుభ్రo గా చేసి చూపుదాం
త్యాగాలక్కర్లేదు .. ప్రాణాలను ఇవ్వక్కరలేదు ..
మన చుట్టూ పరిసరాలను శుభ్రం గా ఉంచితే చాలు ..
స్వచ్చంధం గా దేశాన్ని స్వచ్చ భారతం చేస్తే చాలు ..
రారా ఫ్రెండు మన మొక దండు .. ఊరూ వాడా శుభ్రం చేద్దాం .

పరిశుభ్రత లోనే ఆరోగ్యం ఇమిడి ఉంది ..
రోగాలను తరిమే వీలు పరిశుభ్రత తోనే ఉంది .
ఐనా ఇది మన దేశం ..మన మంతా ఒకరను సందేశం ..
ప్రతి చోటు మన సొంతం .. మన పని మనమే చేద్దాం ..
మన ఇంటిని శుభ్రపరచుదాం .. మన వీధి ని శుభ్ర పరచుదాం ..
ప్రతి ఒక్కరి లో ఈ ఆలోచనా .. దేశాన్ని కాపాడుదాం .
భరతావని ని స్వచ్చంగా ఉంచి చూపుదాం ..
విదేశాలలో కీర్తి పతాక ఎగరవేయుదాం ..
ఇది స్వచ్చ భారతం .. స్వేచ్చా భారతం ....





రండి .. మనమూ మన వంతు బాధ్యత ని నెరవేరుద్దాం ..












మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 13 November 2014

నీ జీవితం.. it's your life

రెపరెప కన్నులు తెరవగా .. అది జననం ..

ఆ కనురెప్పలు మోయగా .. అది మరణం ..

నడుమ జీవనం తెలుసుకో ఈ క్షణం ..

రాసే ఉండుంటుంది ఎన్ని శ్వాసలు నీ వంతో ..

కలిసే తీరుతుంది నీకై ఏ బంధం ఉందో ..

ఉన్న నాళ్ళు గడుపు జీవితం .. సంతోషమే  పంచు జీవితాంతం   .

నువ్వు పెంచిన మంచినే తీసుకెళ్ల గలవు ..

మనసు పంచిన మమత నే మిగిలుంచగలవు ..

నీది నాదను దేముంది ? నీ వెంట వచ్చే దేముంది ?

ఈ నిజము తెలియని మనుషుల లెందరో ..

మనసు పడి జీవించ రెందుకో ..

పెదవి పైన చిందే నవ్వే ఆయువే పెంచేను ..

కల్మషాలు లేని నాడే బంధమే వికసించేను ..

కన్ను మూసినా తదుపరి కూడా ..

బ్రతగ గలగే వీలుంది ..

అది అంతరంగాల్లో నిలిచే జ్ఞాపకాలై  నీ జీవితం ..







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

నీతోనే నీ పోరాటం

నీ కనులలో కనిపించని చిరునవ్వుల నెతికా .. 

నీ పెదవులపై కమ్మని కల గురుతుల నెతికా .. 

కనరాని నిజమేదో కన్నది నా హృదయం .. 

ఎనలేని స్నేహాన్ని ఇవ్వాలని నేస్తం .. 

నీ గుండెకే ఓదార్పు నేను .. నీ అడుగు తో అడుగేస్తున్నాను 

కలిసే చేద్దాము లోకం తో యుద్ధం .. చిరకాల సమరానికి మన మనసులు సిద్ధం  -నీ కనులలో 

బడబాగ్ని దాచింది ఆ సంద్రమయితే .. 

నిలువెల్లా ఉప్పని కన్నీరే రూపయితే .. 

అలలల్లె నవ్వింది .. నింగి కి కడలగెగసింది.. 

హృదయాన్నే కాల్చేటి బాదే నీదయితే .. 

ఉదయాన్నే వెలివేసే వేదన నిను ముంచితే .. 

వెలుగుల్నే నీకిస్తా ..నీడగా నే తోడుంటా .. 

ఆకాశమంటే అoతె రుగని శూన్యం .. 


కొలవగలవా ఆ తీరం .. దూరం ..

 ఊగిస లాడకే ఓ మనసా .. నచ్చచెప్పవె నీ మది కీ ..         నీ కనులలో 


నటరాజు సిగలో జలపాతం .. నేలని తాకటం మానవ యత్నం .. 

సాధించటం నీ అభిమతం .. అయితే వెనుదిరిగి చూడకు ఏ మాత్రం .. 

కలలే కంటూనే నిదురిస్తూ ఉంటామా ?

కనులే తెరచి నిజమును కనమా ?

కన్నీటి కొలతెంతో లెక్కలు వేస్తుంటామా ?

చేరాల్సిన గమ్యం ముందర చూస్తామా ?

నీలోను ఉన్న శత్రువు నీవేలే .. నిన్నే నమ్మేది నువ్వేలే .. 

కనిపించని విరోధి తో పోరాటం చెయ్యాలి .. 

విషమించిన ఆవేదనని అంతం ఇక చేయాలి .. 

పొగమంచు పోయే ముందు ఈ శోధన తప్పదులే .. 

నునువెచ్చని కిరణాలు  లోకాన్ని మేల్కొలుపులే .... - నీ కనులలో   





    





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday, 5 November 2014

నిస్పృహ

ఎందుకో మనసు  మూగబోతుంది .. 

నా మదిలో  నిశ్శబ్దం నన్నే కలవర పెడుతోంది .. 

కన్నీటి అలలు ఎంత చెంప తడిమినా .. 

 గుండె భారం దిగను పొమ్మంది .. 

పెదవులపై మాటలతో యుద్ధం మౌనమే గెలిచినట్టుంది .. 

నింగి కృంగి నేల పై నిస్సహాయంగా పడుతున్నట్లుంది .. 

గాలి స్తంభించి కాలం ఆగిపోతున్నట్లుంది .. 

ఊపిరి శబ్దం కూడా ఉండుండి భయపెడుతోంది .. 

ఎందుకిలా ఉందంటే మూగగా రోదిస్తున్న హృదయం చెప్పింది .. 

నిన్ను నువ్వే కోల్పోయావే పిచ్చిదానా అని .. 

నిజమే ఈ క్షణం అర్థమయింది నాలో నేను లేనని .. 

కూలిపోయిన ఆత్మవిశ్వాసపు గోడల మీద .. 

చిరిగిపోయిన చిత్రపటం లా .. 

ఒంటరితనపు శిశిరం లో మోడువారిపోయిన వాసంతాన్నని .. 

ఓటమి , గెలుపుల మధ్య అంతరాన్ని అయ్యానని .. 

మొక్కని వీడి రాలిపోయిన పూల సుగంధాన్ని నేనేనని .. 

తెలుసుకున్నా .. చితికి పోయిన ఆశ కిక ఆయువు లేదని ...        

నిరాశా నిస్పృహ ల నడుమ జీవితం ఊగిస లాడుతుందని .. 



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

"రుధిర సౌధం " పూర్తి చేశాను

డియర్ రీడర్స్ ..

             
              మీ అందరి అభిమానం తో విజయవంతం గా బ్లాగ్ లో "రుధిర సౌధం " పూర్తి చేశాను . ఈ రోజు తో

మీ అభిమాన పాత్రలు మీ మనసు లో చెరగని ముద్ర వేసి వీడుకోలు చెప్ప బోతున్నాయి .. మీ అభిమానం తో

పాటుగా మీ అభిప్రాయాలను పంచారు .. సలహాలను ఇచ్చారు . చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ .

మీ అందరికీ నచ్చే మరో నవల తో మళ్ళి మీ మనసుల్ని చూరగొనాలని ఆశిస్తాను . మీ అమూల్య మైన

సలహాలకి , అభిప్రాయాలకి " నా రచన " ఎప్పుడు స్వాగతం చెబుతుంది .

ధన్యవాదాలు ..



                                                                                                     -   రాధిక ఆండ్ర 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 275





అలా అయితే మళ్ళి వద్దాం .. కానీ ఇప్పుడైతే వెళ్దాం .. శివ ఎదురు చూస్తుంటాడు పద . అని సూట్ కేసు పట్టుకుని

గది బయటికి నడిచాడు మురారి .

హడావిడి గా తిరుగుతున్న సరస్వతి ని చూసి .. సరస్వతీ .. రచనా , యశ్వంత్ ఎక్కడున్నారు ? అని అడిగాడు

మురారి .

రత్నం బాబు సంగతి తెలిసిన కాడి నుంచీ బాధ గానే ఉన్నారు దాత్రమ్మ . ఆ పూల తోటలో కూర్చున్నారు యశ్వంత్

బాబు ఇప్పుడే అటు వెళ్లి నట్టున్నారు .. అంది సరస్వతి .

సరే .. ఈలోపు నేను ఆంటీ తో మాట్లాడతాను .. అని .. పద సత్యా .. అని ముందుకి దారి తీశాడు మురారి .

రచన పూల మధ్య ఒంటరిగా కూర్చుంది .ఆమె మనసు లో జరిగినవన్నీ జ్ఞాపకాలు గా సుళ్ళు తిరుగుతున్నాయి ..

అనుకున్నదాని కంటే వైభవం గా సహస్ర యాగం జరిగింది . గుళ్ళో అమ్మవారు స్థిరపడింది .. సరస్వతి ఊరి

బాగోగులు చూసుకునేందుకు ఒప్పుకుంది .. అంతా ఆనందమే .. ఒక్క రత్నం విషయం తప్ప .. యశ్వంత్ , శివ

మురారి అంతా నా దగ్గర దాచారు .. కానీ వాళ్ళ తప్పేముంది ? ఎంతో ఉన్నతం గా ఆలోచించారు .. వీరస్వామి

చనిపోయాడు .. అమ్మవారి హారాన్ని దూరం చేయాల్సిన అవసరం కలగలేదు .. ప్రతీ విషయం లోనూ ఒక స్థిరత్వం

ఏర్పడింది . స్వామీజీ తన శేష జీవితాన్ని అమ్మవారి సేవ లోనే గడుపు తానన్నారు .. ఆయన తో పాటూ గోపాలం .

ఈరోజు పరిస్థితులు అన్ని చక్క బడ్డాయంటే యశ్వంత్ , శివ , మురారి , సత్య .. వీళ్ళే కారణం .. నా జీవితం నుండి

ఎప్పటికీ వీరేవ్వర్ని దూరం   కానివ్వకు తల్లీ .. అని మనసులోనే అమ్మవారిని ప్రార్థించింది రచన .

రచనా .. అని పిలిచాడు యశ్వంత్ ..

ఆమె ముక్త సరిగా చూసింది ..

సారీ .. అన్నాడు యశ్వంత్ ఆమె పక్కనే కూర్చుంటూ .

ఎందుకు ... నేను అర్థం చేసుకోగలను .. యశ్వంత్ . నాకన్నా నువ్వే ఎక్కువగా నువ్వే బాధ పడున్టావు కదూ ..

అంది అతని భుజం మీద తల వాలుస్తూ .

నీకుకోపం లేదా నామీద ? నేను నీ దగ్గర రత్నం విషయం , వీరస్వామి విషయం తో పాటూ విధాత్రి కోసం కూడా

దాచాను కదా .. అన్నాడు యశ్వంత్ .

తర్వాత అయితే చెప్పెసావుగా .. నేను నిన్ను నమ్ముతాను యశ్ .. అన్ని పరిస్థితులని నువ్వే చక్కదిద్దావు ..

ఒక్క క్షణం ఆలోచిస్తే .. నా మనసు ఇప్పుడు ఎంత ప్రశాంతం గా ఉందో తెలుసా ? అంది రచన .

ఉంటుందే ఉంటుంది .. నాకు తెలియ కుండా ప్రేమా ? అన్న మాటలు విని ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు ..

అక్కడ గిరిజ , విక్కీ , సత్య , మురారి , సరస్వతి వీరి వైపు నవ్వుతూ చూస్తూ కనబడ్డారు .

అమ్మా .. అది .. అంటూ కంగారుగా ఏదో అనబోయింది రచన ..

రచనా .. నువ్వు చెప్పక పోయినా నీ ప్రేమ గురించి నాకు తెలిసి పోయింది .. నేను అమ్మ తో చెప్పేసా .. నిన్ను

ఎవరు  భరిస్తారా ? అనుకుంటే ఆఖరికి యశ్వంత్ బుక్ అయిపోయాడన్న మాట . అన్నాడు విక్కీ .

యశ్వంత్ హాయిగా నవ్వేశాడు .

అన్నయ్యా .. నిన్నూ .. అంది రచన .

ఈ రుధిర సౌధాన్ని ప్రేమ సౌధం గా మార్చారు మీరు .. ఈ మహల్లో జరిగే తోలి శుభకార్యం మీ పెళ్ళే కావాలి ..

యశ్వంత్ .. ముహూర్తాలు పెట్టించేయనా ? అంది గిరిజ .

మీ ఇష్టం .. ఆంటీ .. అన్నాడు చిరునవ్వుతో యశ్వంత్ .

ఐతే .. ఫంక్షన్ ఉంది .. నేనిప్పుడు నీతో రాను మురారి .. నా ఫ్రెండ్ పెళ్లి .. అంది సత్య అల్లరిగా .

నేను మాత్రం వెళ్తున్నానా ? పెల్లైయ్యేవరకు ఇక్కడే .. అన్నాడు మురారి .

ఇంతకీ శివ ఎక్కడ ? అని అడిగింది రచన .

మొన్న సరస్వతి వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా .. అప్పట్నించి శివ ఆమె వెనకాలే తిరుగుతున్నాడు .. అన్నాడు

మురారి .

అవునా ? అయితే సరస్వతి ఒప్పుకుంటే మరో పెళ్లి కూడా ఇక్కడే .. అన్నాడు యశ్వంత్ .

నాకేం అభ్యంతరం బాబు .. దాని అదృష్టం .. అంది సరస్వతి కృతజ్ఞతగా .

ముందు కాస్త మాకు ప్రైవసీ వదుల్తారా లేదా ? అరచింది రచన .

అందరూ నవ్వుతూ .. అన్నారు .. మాకు పెళ్లి పనులున్నాయి .. అని .. నవ్వుతూ అక్కడ్నించి వెళ్లి పోయారు .

యశ్వంత్ కళ్ళలోకి ఆరాధన గా చూసింది రచన .

మనకింకా చాలా బాధ్యతలు ఉన్నాయి కదా రచనా .. ఊళ్లోకి అన్ని సదుపాయాలు రావాలి. ప్రభుత్వం ఏదో

చేస్తుందని చూసేకంటె మనమే అన్ని కల్పిస్తే పోలే .. మన దగ్గర డబ్బు కూడా ఉంది .. ఏమంటావు ? అన్నాడు

యశ్వంత్ ఆమె ని దగ్గరకి తీసుకుంటూ .

నీ ఇష్టం యశ్వంత్ .. అని అతని గుండెలపై తలని వాల్చి వెచ్చగా ఒదిగిపోయింది రచన .

పూలు వారి వైపు నవ్వుతూ చూస్తున్నాయి ..

రావణ పురం తన రూపు రేఖల్ని మార్చుకోడానికి ముచ్చటగా ఆ ప్రేమికుల మనసులో లక్ష్యం లా నిలిచిపోయింది .

                                                         
                                                                  సమాప్తం 

ఈ సీరియల్ ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు .. మరో చక్కని సీరియల్ తో మళ్ళి కలసుకుందాం ..

                                                                                                                       - రాధికఆంద్ర





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 4 November 2014

రుధిర సౌధం 274



మేము మిమ్మల్ని మరవలేము .. రాకుమారీ .. అన్నారు శివ , మురారీ బాధగా .

మీకందరికీ కృతఙ్ఞతలు .. అని కంటనీరుతో .. తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్కీ దగ్గరికి వెళ్లి .. నీవు ఈ

వంశానికి మిగిలిన వారసుడివి . వంశ గౌరవాన్ని ఎల్లవేళలా కాపాడు . అంది విధాత్రి .

అయోమయం గా తల ఊపాడు విక్కీ .

అందర్నీ ఓసారి బాధగా చూసి .. ఇది ఆనందం .. ఈనాడు నా కల , నా కర్తవ్యమ్ నెరవేరింది .. సెలవు .. అని

అనగానే ఆమె శరీరం నుండి ఓ కాంతి వెళ్లి పోయి అచేతనం గా పడిపోయింది రచన .

వెంటనే రచనా .. అంటూ అందరూ ఆమె వైపు చేరుకున్నారు .

చిరునవ్వుతో .. ఆమె ని ఆమె గదిలోకి చేర్చండి . విశ్రాంతి అవసరం .. అన్నారు స్వామీజీ .

విక్కీ తన రెండు చేతులతో చెల్లెల్ని ఎత్తుకుని మహల్ లోకి నడిచాడు .. వెళ్తున్న అతడి వైపు , రచన వైపు

తదేకం గా చూస్తున్న యశ్వంత్ భుజం మీద వెచ్చగా ఓ చేయి పడటం తో .. ఒక్కసారిగా వెనుదిరిగి చూశాడు .

స్వామీజీ .. చిరునవ్వుతో .. ఇక ముందు వైజయంతి సమస్య లేదు .. మీరంతా ఆనందం గా ఉండొచ్చు .. అన్నారు

స్వామీజీ .

అవును స్వామీజీ .. చాలా ఆనందం గా ఉంది .. ఉద్వేగం తో మనసు నిండి పోయింది .. అన్నాడు యశ్వంత్ ..

హద్దుల్లేని ఆనందం తో .

మాకింకా ఇదంతా కలా నిజమా అని అనుమానం గా నే ఉంది స్వామీజీ .. అన్నారు శివ , మురారి .

సందేహించకండి .. మీరు విజయం సాధించారు .. అన్నారు స్వామీజీ .

ఇంత సులువుగా వైజయంతి కథ సమాప్తం అవుతుందని అనుకోలేదు .. అన్నాడు యశ్వంత్ .

ఇది సులువుగా జరిగిన పని కాదు నాయనా .. ఎవర్నైనా దెబ్బతీయాలంటే వారి బలహీనత ని తెల్సుకొని తగిన

సమయం కొరకు వేచి ఉండాలి .. అదే ఇప్పుడు మనమూ చేసింది . ఆమె అసంతృప్తి ని ఆమె నుండి దూరం చేసే

క్రమం లో విముక్తి పూజ జరిపి .. ఆమె మనసుని శుద్ధి పరచి మామూలు ఆత్మ గా ఆమె కి పరలోక ప్రాప్తి ని

కలిగించాం .. అంతే .. అన్నారు స్వామీజీ .

అవును స్వామీజీ .. కానీ ఇక్కడ మేము ఎదుర్కొన్న ప్రతీ అనుభవమూ .. విచిత్ర మైనదే .. జీవితం అంతా ..

బహుశా మా పిల్లలకి కథల్లా చెప్పుకోవోచ్చ్చు . అన్నాడు శివ .

ఇందులో మా కృషి కన్నా .. మీ తోడ్పాటు ఇంకా మరచిపోలేనిది స్వామీజీ .. అన్నాడు మురారి .

స్వామీజీ .. రచన త్వరగానే  కోలుకుంటుంది కదా...  అన్నాడు యశ్వంత్ .

మరో పది నిమిషాల్లో కోలుకుంటుంది .. మీకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది .. అదుగో జనం రావటం

మొదలు పెట్టారు .. యాగానికి సమయం కావొస్తుంది .. మీరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి అని లోపలికి నడిచారు

స్వామీజీ .

స్వామీజీ వెళ్ళిపోయాక .. యాహూ .. అంటూ ఒకర్నొకరు హత్తుకుని వారి ఆనందం పంచుకున్నారు  ఆ ముగ్గురు

స్నేహితులు .

                                       *********************************
మూడు రోజుల తరువాత


నిజమా ? అంత జరిగిందా ? అయ్యో నేనిదంతా చూడలేక పోయానే .. అంది సత్య .

ఇప్పటికి 51 వ సారి అన్నావు . టైం అవుతోంది సత్యా .. పద . అన్నాడు మురారి .

ఇప్పుడంతా క్లియర్ అయిపోయిందిగా మురారీ నాకూ కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది .. అంది గోముగా

సత్య .

ఇంకా ఉంది



 మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 3 November 2014

కనులు కలువలాయే .. నా కనులు కలువ లాయే ..

కనులు కలువలాయే .. నా కనులు కలువ లాయే .. 

కలల కొలను లోనా విరిసే కనులు కలువలాయే .. 

మనసు ముత్య మాయె .. నా మనసు ముత్యమాయే .. 

కురిసే స్వాతి చినుకు తాకి నా మనసు ముత్యమాయె .. 

ఆశలు .. నా ఊహలు .. విహరించనీ అంబరాలు .. 

శ్వాసలు .. నా ఊసులు .. జరిపించనీ సంబరాలు .. 

వీచే గాలితో సాగిపోనీ .... ఎల్లలెరుగని మదినీ ...      -కనులు 


హిమములా పూల సొగసుని ముద్దాడనీ .. తనివి తీరా .. 

తరంగమై సెలయేటినే పలకరించనీ ... మనసు తీరా .. 

ఊపిరే సంగీతమై .. నినదించనీ వేణుగానమా  .. 

అల్లరి గారాలని .. చూపించనీ ప్రేమ మధురిమా .. 

కొత్తగా ఉండదా .. ఈ లోకమే నిండుగా ... నవ్వగా .. నవ్వగా .. -- కనులు 



రుతువులన్ని ముస్తాబయి వచ్చాయిలే ..  ఒక్కసారిగా .. 

నాల్గు కాలాలు వింతగా స్నేహ హస్త మందిన్చగా .. 

ఆకాశమే తారల సాక్షి గా .. ఈ భూమి తో జోడీ కట్టగా 

ఆనందమే దిక్కుల సాక్షిగా .. నలువైపులా వ్యాపించగా .. 

బ్రతకడం పండుగా .. ప్రతిక్షణం అండగా .. నవ్వుండగా .. నవ్వు తుండగా ..                                                                                              -కనులు 






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 273



బాధ పడకండి .. ఆ దెయ్యం పీడ శాశ్వతం గా వదిలి పోతుంది . మీరలా చూస్తూ ఉండండి అంతే .. అన్నాడు

గోపాల స్వామీ .

నిస్సహాయం గా తల లూపారు శివ , మురారి , విక్కీ .

స్వామీజీ ఏవేవో మంత్రాలు చదువుతున్నారు .. యశ్వంత్ అతడి కనుసైగల్ని అర్థం చేసుకుని మెలగుతున్నాడు .

తల్లీ .. ముందు నువ్వు లేచి అగ్ని దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు ఒనర్చు .. అన్నారు స్వామీజీ .

వైజయంతి లేచి అలానే చేసింది .. స్వామీజీ పెదవులపై చిరునవ్వు విరిసింది ..

కలశం మీద ఉన్న మాంగల్యాన్ని పూజించు తల్లీ .. అన్నారు స్వామీజీ .. ఆమె తన ముందర ఉన్న అక్షితలని

చేతిలోకి తీసుకోబోయింది .. కానీ ఆమె చేత వాటిని ధరించలేక పోయింది ..

స్వామీజీ .. నేను వీటిని తాక లేక పోతున్నాను .. అన్నదామె ఆవేదనగా .

చింతించకు తల్లీ .. మీ కులదైవమైన అమ్మవారిని తలచుకొని అక్షితలు తాకే భాగ్యం కల్పించ మని అడుగు ..

అన్నారు స్వామీజీ .

అమ్మవారినా ? నేనే ఆమెని బయటకి వెళ్ళ గొట్టాను .. ఆమె నా ప్రార్థన మన్నిస్తుందా ? అని అడిగింది వైజయంతి .

తప్పక మన్నిస్తుంది . ఎందువల్లనంటే ఆమె తల్లి . తల్లి కి బిడ్డలందరూ సమానమే .. అన్నారు స్వామీజీ .

అలాగే అని .. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్ధించ సాగింది వైజయంతి .

ఆమె కళ్ళు మూసుకోగానే .. గోపాల స్వామి ఒక దారపు పోగుని యశ్వంత్ కి అందించాడు .

అది అందుకొని స్వామీజీ వైపు చూశాడు యశ్వంత్ .

ఆ దారాన్ని ఆమె చుట్టూరా గుండ్రం గా చుట్టమని సైగలతో చెప్పారు స్వామీజీ .

యశ్వంత్ లేచి కళ్ళు మూసుకుని ప్రార్ధిస్తున్న ఆమె ని చూసి దారం చివరికొన  ని పట్టుకుని క్షణం లో ఆమె ని

చుట్టి చివరి కొనని హోమ గుండం లోకి వేశాడు .. శివ , మురారి , విక్కీ ఉత్కంట గా చూశారు . విధాత్రి ఆశ్చర్యం

గా చూసింది . హోమాగ్ని క్షణాలలో దారపు కొనని తాకి ఓ వెలుగులా ఎగబాకి వైజయంతి ని గుండ్రం గా చుట్టబడిన

దారాన్ని తాకుతూ ఒక్కసారిగా ఆమెని హోమగుండం లోకి లాగింది . అందరూ చూస్తుండగానే వైజయంతి

హోమ గుండం లో ఆవిరై పోయింది .

ఏమిటి స్వామీజీ ఇది ? నా సోదరి కోరిక ని తీర్చ కుండా ఆమెని మోసం చేశారా ? బాధగా అడిగింది విధాత్రి .

ఈ పసుపు కలిపిన బియ్యాన్ని తాకలేని ఆమె మాంగల్యం మెడన ఎలా ధరించగలదు విధాత్రీ ? ఆమె కి ముక్తి

లభించింది .. పరలోకానికి సాగే ఆఖరి నిమిషం లో ఆమె తన తప్పుని మన్నించి శుభాన్ని కలగ జేయమని

అమ్మవారిని ప్రార్థించింది . ఆమె ప్రార్థన ని అమ్మవారు మన్నించింది . ఒక ప్రేతం గా ఈ వివాహం జరగరానిది ..

అందుకే ఆమెకి మరుజన్మ ప్రసాదిస్తుంది .. మాంగల్య భాగ్యాన్ని కలగజేస్తుంది .. నీ సోదరి ముక్తి ని పొందింది

ఇక నీ వంతు .. సమయం ఆసన్న మయింది .. ఆత్మ నైవేద్యం అమ్మవారికి నివేదించి శంఖం పూరించు ..

సహస్ర యాగానికి సమయమయింది .. అన్నారు స్వామీజీ .

చిత్తం మహర్షి .. అని యశ్వంత్ దరిచేరి .. ఇక సెలవు .. రచన ని మనువాడి ఆనందం గా ఉండండి .. అంది విధాత్రి .

విధాత్రీ .. మీరిక మళ్ళి కనబడరు కదా .. బాధగా ఉంది .. అన్నాడు యశ్వంత్ .. అతడి కనుకోసల్లో తలుక్కుమన్న

కన్నీటి పొర .

ఎందుకు కనబడను ? రచన రూపం నాదేగా .. కానీ మీ ప్రేమ పొందాలని ఉంది .. అందుకై మీకు , రచన కి బిడ్డగా

జన్మించే అదృష్టం ఇమ్మని అమ్మని ప్రార్థిస్తాను .. అంది విధాత్రి .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 30 October 2014

రుధిర సౌధం 272



కానీ అనిరుద్ధుడు మాట తప్పని వాడు .. ప్రియురాలి కోరిక ని కాదనని వాడు .. అంది విధాత్రి .

అసహనం గా తల విదిలించాడు యశ్వంత్ .

ఇది త్యాగమే కావొచ్చు .. లేదా మీ మనసుకి విరుద్ధమే కావోచ్చ్చు .. కానీ లోక కళ్యాణం .. ఈ కళ్యాణం ఆమె ని

ఈ మహల్ మీ ద ఉండి పోయిన మమకారాన్నుండి దూరం చేస్తుంది .. శాశ్వతం గా ఆమెని పరలోకానికి పంపు

తుంది .. నా సోదరికి ముక్తి ని ప్రసాదించండి .. అని అర్థించింది విధాత్రి .

ఏమీ అనలేక .. చిన్నగా నిట్టూర్చి .. నేనొక సారి స్వామీజీ తో మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ .

ఆమె సరేనని తల ఊపింది .

యశ్వంత్ స్వామీజీ వైపు నడిచాడు .

వీరిద్దరి సంభాషణ నంతా విన్న శివ , మురారి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .

తన వైపు వస్తున్న యశ్వంత్ ని చూసి .. రా నాయనా ? నీ నిర్ణయం తెలుపు .. అన్నారు .

స్వామీజీ .. అన్నీ తెలిసిన వారు .. ఇప్పుడు నా మదిలో సంఘర్షణ ని అర్థం చేసుకోలేరా ? అన్నాడు యశ్వంత్ .

చూడు నాయనా .. ఏ విషయాన్ని ఐనా మనం చూసే కోణాన్ని బట్టే అది మనకి అర్థమవుతుంది .. ఈ కార్యం

వైజయంతి , విధాత్రుల దృష్టి లోనే వివాహం .. కానీ నీ దృష్టి లో యుద్ధం .. కత్తి పట్టి తుదముట్టించ డానికి ఆమె

మరణం లేనిది .. తంత్ర విద్యా పారంగతురాలైన ఆమె ఓ రాచ కన్య . ఆమె లోని క్రూరత్వం నీతో పెళ్లి అనగానే

సౌమ్యతగా మారింది . తన కోరిక నేరవేరబోతుందన్న ఆనందం ఆమె లోని వివేకాన్ని మూసివేస్తుంది .. అదే నీవు

శత్రువు ని ఓడించగల తరుణం .. అని నర్మ గర్భం గా నవ్వారు స్వామీజీ .

యశ్వంత్ కి అర్థమైంది .. అతడి పెదవులపై చిరునవ్వు విరిసింది .. చిన్నగా తల ఊపాడు యశ్వంత్ .

మరేమిటి ? నీ నిర్ణయం కోసం అక్కడ పెళ్లి మండపం లో వధువు వేచి చూస్తుంది .. అన్నారు స్వామీజీ .

పదండి స్వామీజీ .. మండపం కి వెళ్దాం .. అని ముందుకి నడిచి .. రాకుమారి విధాత్రి ని కాదని .. అనిరుద్ధుడ నైన

నేను .. ఈ సుందరాంగి .. రాకుమారి వైజయంతి ని మనువాడ నిశ్చయించాను .. అని గట్టిగా అరిచాడు యశ్వంత్ .

శివ , మురారి అయోమయం గా ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే .. ఏం జరుగు తోంది ఇక్కడ ? అని

అడిగాడు  విక్కీ వగరుస్తూ .

మాకూ అర్థం కావడం లేదు .. కానీ చూస్తూ ఉండటమే మంచిది అన్నాడు శివ .

యశ్వంత్ ప్రకటన కి ఉబ్బితబ్బిబ్బయింది వైజయంతి .. నిస్సహాయం గా బేలగా చూసింది విధాత్రి ...

శుభం భూయాత్ .. అని గోపాలా వరునికి నూతన వస్త్రాలు తీసుకురా .. అన్నారు స్వామీజీ . 5 నిమిషాల్లో వచ్చాడు

గోపాల స్వామి .. రాచకుమారుల వస్త్రాలతో .

ఈ వస్త్రం ధరించి ఖడ్గం చేతబూని వరుని గా రా నాయనా ... అన్నారు స్వామీజీ .

యశ్వంత్ అతడు చెప్పినట్లే చేశాడు ..

వెళ్ళు .. మండపం లో ఆశీనుడివి కా .. అని తానూ మండపం వైపు నడిచారు స్వామీజీ ..

యశ్వంత్ వెళ్లి వైజయంతి పక్కన ఆమె వైపు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నాడు ..   ఆమె సిగ్గుతో తల

దించుకుంది. స్వామీజీ వారికి పక్కగా కూర్చుని వినాయక పూజ మొదలు పెట్టారు .. గోపాల స్వామి హోమ మ్

మండించి .. నేతి కోసం  పక్కకి రాగానే .. గోపాల స్వామీ .. ఏం జరుగుతుంది ? దెయ్యానికి , మనిషి కి పెళ్లి ఏంటండీ

?మా యశ్వంత్ ని ఏం చేస్తున్నారు ? అని అడిగాడు శివ కోపంగా .

ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది