కానీ స్వతహాగా రత్నం బలమైన వాడే .. అతడిని అలా చేయాలంటే ఆ హంతకుడికి అంత కన్నా వేయిరెట్లు బలం
ఉండాలి .. అతడి పొట్టలో చెట్టు కొమ్మలు చొచ్చుకు పోయి ఉండటం తో ప్రేవులు బయటికి తన్నుకొచ్చాయి ..
యశ్వంత్ కి అతడిని అలా చూస్తున్నప్పుడు కంటిలోనీరు కట్టలు తెగింది .. అతడి నవ్వు మొహం గుర్తుకు వచ్చింది
.. అతడు తమతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి .. " యశ్వంత్ గారూ .. ఈసారి మీరు బొంబాయి వెళ్ళినప్పుడు
నన్నూ తీసుకు పొండి .. మీలా నేను స్టైల్ గా తయారవ్వాలి " అన్న అతని అమాయకపు మాటలు గుర్తుకు
వచ్చాయి ..
ఎలా ? ఎలా రత్నం ఈ పరిస్థితి కి వచ్చుంటాడు ? అతడి మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది .. రచన చెప్పిన
ప్రకారం వైజయంతి , బసవరాజులు బంధించ బడి ఉన్నారు .. మరి రత్నం కి ఆ పాడుబడ్డ కోటలోఎవరు ఈ పరిస్థితి
కి కారణం అయి ఉంటారు ? అని ఆలోచిస్తున్నాడు యశ్వంత్ .
యశ్వంత్ బాబూ .. ఏం చేయమంటారు ? అని అడిగాడు బాలయ్య .
బాలయ్యా .. భూపతి గారి జీపు నీకు నడపడం వచ్చు కదా .. అని అడిగాడు యశ్వంత్ .
వచ్చని తల ఊపాడు బాలయ్య .
వెంటనే రత్నం శవాన్ని పట్నం తీసుకుపో .. పోలీస్ స్టేషన్ లో జరిగింది చెప్పి శవపరీక్ష చేయించు .. ఈ ఘాతుకం
చేసింది ఎవ్వరో మనకి తెలియాలి అన్నాడు యశ్వంత్ .
అలాగే బాబూ .. అన్నాడు బాలయ్య .
శంకరం గారూ మీరూ వెళ్ళండి బాలయ్య తో పాటూ .. భూపతిని కూడా జాగ్రత్త గా తీసుకువెళ్ళండి .. నేను రేపు
మిమ్మల్ని కలుస్తాను అన్నాడు యశ్వంత్ .
అంతా మౌనం గా తల ఊపారు .
బాలయ్య వెహికల్ వైపు వెళ్లబోతుండగా .. బాలయ్యా .. ఒక్క నిమిషం .. ఇలా రా .. అని పిలిచాడు యశ్వంత్ .
బాలయ్య .. దగ్గరికి వచ్చి ఏందయ్యా ? అన్నాడు .
చూడు ,,రేపు మహల్లో జరగబోయే పూజ ఈ ఊరందరి మంచి కోసం .. ఆ పూజ మీ దాత్రమ్మే చేయాలి .. తనకి
పూజ పూర్తి అయ్యేవరకు ఈ విషయం తెలియకూడదు .. అది ఈ ఊరికి మంచిది కాదు .. అన్నాడు యశ్వంత్
అలాగేనయ్యా .. నేను జాగ్రత్త పడతాను .. పోలీస్ బాబు కి మీరు పంపారని చేబుతానయ్యా .. అన్నాడు బాలయ్య .
హా .. అని అన్నట్టు నీకు వీరాస్వామి ఎక్కడ ఉంటాడో తెలుసా ? అని అడిగాడు యశ్వంత్ .
ఆడా ? ఊరవతల .. లేదంటే దెయ్యాల దిబ్బ .. అదే ఆ పాడుబడ్డ కోట కాడ .. లేదంటే బసవడి సమాధి కాడ ..
ఉండొచ్చు బాబూ .. అన్నాడు బాలయ్య .
సరే .. మీరు వెళ్ళండి .. అన్నాడు యశ్వంత్ .
బాలయ్య .. జీపు వైపు నడిచాడు .. శంకరం బలవంతం గా భూపతి ని జీపు ఎక్కిస్తున్నాడు .. కాసేపట్లో జీపు
అక్కడ్నించి కనుమరుగై పోయింది .. చిన్నగా నిట్టూర్చి వెనుదిరిగే సరి వెంగమ్మ అసహనం గా చూస్తూ కని
పించింది .. యశ్వంత్ కి .
ఇంకా ఉంది
రుధిర సౌధం
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది



No comments:
Post a Comment