Powered By Blogger

Friday 29 November 2013

రుధిర సౌధం 14 (29వ తేది తరువాయి భాగం )


                                                             రుధిర సౌధం 
                                                                                          (29వ తేది తరువాయి భాగం )



"వైజయంతి "' ఆ పేరు  ఉచ్చారించాయి రచన పెదవులు అప్రయత్నం గా .
ఆ .. ఆమె పేరు వైజయంతే ..  మా తాత చెప్పేవాడు ఆ కథ .. ఆ మహల్ కి ముగ్గురు యువరాణులు ఉండేవారని . వారి మథ్య తగువులేవో ఉండేవని .. రాజు ఆ ఇద్దరు యువ రాణు లని నరికి చంపెసాడని .. కానీ ఆ యువరాణులు మనసు చావక ఆ మహల్ లోనే దెయ్యాలు గా తిరుగుతున్నారని .. ఏవేవో కథలున్నాయి .. అంది సరస్వతి కళ్ళింత చేసి చెబుతూ ..
చిన్నగా నవ్వి . .. అలాగా ? కథ బావుంది . కాని వారి వల్ల  ఈ గ్రామం అభివృద్ధి చెందకుండా ఉండటం మాత్రం తప్పు , అందుకే ఈ గ్రామం లో ఉన్న సమస్యలు అన్ని తెలుసుకుని పరిష్కరిద్దామని వచ్చాను . మీరేం చెప్పాలనుకున్నా నాతో చెప్పవచ్చు .. అంది రచన .
ఆమె అటు ఇటు తొంగి చూసి .. ఎవరు వినడం లేదని నిర్థారించుకున్నదానిలా .. ఆ దెయ్యం మాటేమో గాని .. ఈ ఊరిలో రాక్షసుడు మాత్రం ఉన్నాడమ్మ .. అంది సరస్వతి .
  వింత గా చూసి రాక్షసుడా ? అంది ఆశ్చర్యం గా రచన .
ఆ .. రాక్షసుడే .. మా బాధలు ఎన్నటికీ తీరవమ్మ .. ఈవూరికి ఏమి రానీయడు .. బాగుపడ నీయడు . జనం తెలివి మీరితే ఆయన గారి పెత్తనం చెల్లదు కదా .. అంది సరస్వతి .
ఎవరా రాక్షసుడు ? భూపతా ? అంది రచన .
అరె మీకెలా తెలిసిన్దమ్మ ? ఈ వురి గురించి ఎవరు వచ్చిన భూపతి వాళ్ళింట్లోనే ఉంచుకుంటాడు .. ఏదో రకం గా లొంగ దీసు కుంటాడు .. ఈ వూరి గురించి నిజాలు బయటికి పోక్క నివ్వడు .. కాసింత కసి గా అంది సరస్వతి .

మరి ఈ వూరి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు ?ఎదురిస్తే భూపతి ఎం చేస్తాడు ?ఆవేశం గా అంది రచన .

భయపడక తప్పదమ్మ .. కొంత మందికి అప్పులున్నాయి .. మరి కొంత మంది భూపతి ని ఎదురించి ఆ మహల్ కాడ శవాలు అయినారు .. వారిలో మా అన్న ఒకడు . .  కళ్ళలో సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని అనచుకుంటూ అంది సరస్వతి .
నువ్వీ గ్రామం లో ఉండి పోవటం వల్ల ఎవరికీ నీ గొప్పతనం అర్థం కావటం లేదు గానీ సరస్వతీ .. నీలో మంచి ఫైర్ ఉంది .. అంది  నవ్వుతూ  రచన .
అంటే .. అర్థం కానట్లు అడిగింది సరస్వతి .

అంటే ప్రజల కోసం ఆలోచించే గుణం .. మంచితనం . అంది రచన

సరస్వతి సిగ్గుపడింది ..
నువ్వు నాకు స్నేహితురాలివి అవుతావ? అంది రచన .

నేనా?మీరు చదువుకున్నొల్లు .. అంది సరస్వతి ..

స్నేహానికి అవన్నీ అవసరం లేదు సరస్వతీ .. నాకొక సాయం చేస్తావ?అని అడిగింది రచన

ఇంత పెద్ద మనసు చూపించారు .. నన్ను మీ స్నేహితురాలినన్నారు . . . మీరేం అడిగినా చేస్తాను అంది సరస్వతి .
అలా ఐతే .. ఈ ఊరిలో అందరు నీలాగే నిజాలు చెప్తారా ? అందరూ భూపతి కి వ్యతిరేకం గా చెపితేనే ఆ మాట కి బలం ఉంటుంది .. అంది రచన .

చెబుతారమ్మ .. కొందరు .. మనసు పంచుకుంటే ఈ ఊరిలో ప్రతి ఇంటిలోనూ బాధ ఉన్న దమ్మా .. అంది సరస్వతి
కానీ బాలయ్య .. బాలయ్య అంటే నీకు తెలుసు కదా .. అంది సందేహం గా రచన .

తెలుసమ్మా .. ఆడో పెద్ద వెధవ .. అంది సరస్వతి .

తను నన్ను ఫాలో అవుతున్నాడు సరస్వతీ .. అంది గుమ్మం వంక తొంగి చూస్తూ .. రచన
అంటే మీ ఎనకాలె వస్తుండు కదా .. ఆ భూపతే పంపి ఉంటడు .. నీకు మేమేం చెబుతమో అని ఆది భయ్యం .. అంది సరస్వతి .. అలా అంటూ కిటికీ కొంచెం  తెరచి బయటికి చూసింది .
ఆడు ఈడనే నక్కి ఉన్నాడమ్మ .. ఓ పని చెయ్యి .. ఈ వెనకాల గుమ్మం నుండి పో .. సరాసరి బాపన వీధి కి పోతవు .. అంది సరస్వతి .
చాలా థాంక్స్ సరస్వతి .. నేను నీ ఇంటికి మల్లి వస్తాను .. అని రచన వెళ్ళ బోతుండగా ..
ఇంతకీ నీ పేరు చెప్పలేదమ్మ .. అంది సరస్వతి ..
రచన చిన్నగా నవ్వి ... ధాత్రి .. అని చెప్పి బయటికి నడిచింది .
"ధాత్రి .. ఎంత మంచి పేరో .. కనీసం ఈయమ్మ మూలా నయినా ఈ వూరు బాగు పడితే బాగుండు .. ఎందుకో ఆమెని చూసేసరికి ఎవరో పరాయిది అనిపించలే .. " అనుకొంది సరస్వతి తనలో తానె .
                                         
                                         ********************************
బాలయ్య నుండి మెల్లిగా తప్పించుకొని మెల్లిగా మహల్ వైపు నడిచింది రచన ..
మహల్ దగ్గర పడుతుంటే బాగా పరికించి చూసింది .. నిట్ట నిటారుగా కొండంత రహస్యాన్ని గుండెల్లో మోస్తున్న పెద్ద మనిషి లా కనిపించింది ..
మెల్లిగా గేటు ని ముందుకి తోసింది .. కిర్రుమంటూ తెరుచుకుంది ..
లోపలి కి ప్రవేశించి చుట్టూ చూసింది .. మెల్లిగా సూర్యుడు మహల్ కి వెనుక భాగం నుండి మహల్ నెత్తి మీదకి వస్తున్నాడు ..
మెట్లెక్కి మహల్ ప్రాంగణం లోకి చేరుకుంది రచన ..
మహల్ వెనక నుండి ఎండా రావటం తో ఆ ప్రాంగణం అంటా నీడ గానే ఉంది .. అప్పుడప్పుడూ పైరుల మీద నించి వస్తున్నా పిల్ల గాలి రచన కురులను పలకరిస్తుంది ..
"అద్దాల మంటపం ..  ఎక్కడుంది ? నేను చదివిన ట్లు ఇక్కడ కనబడటం లేదే .. అని ఒక పక్కగా ఉన్న స్తంభాల
ప్రాంగణాన్ని చేరుకుంది .. దానికి ఎదురుగా అలాంటి మండపమే ఇంకొకటి ఉండటం గమనించి అటు నడవబోతు ఓ క్షణం అటువైపు పరికించి చూసింది రచన .. ఆ మండపం నుంచి పొగ రావటాన్ని గమనించింది ..
అక్కడ ఎవరో ఉన్నారు ... అనుకొని వడివడిగా అటు నడిచింది . .. (ఇంకా ఉంది )






రుధిర సౌధం 13

                                                              రుధిర సౌధం          
                                                                                    (28వ తేది తరువాయి భాగం )



మెల్లిగా వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి .. సూర్యుడు తూర్పున పయనం మొదలుపెట్టాడు .. 
రోడ్ కి ఆవల వైపున టెంట్స్ వేసుకుని నిద్రపోయిన యశ్వంత్ బృందం మెల్లిగా  మళ్ళి ప్రయాణానికి సిద్ధమవుతుంది . 
శివా ... గట్టిగా పిలిచాడు యశ్వంత్ .. 
కొంచెం   దూరం లో మూడు రాళ్ళని పొయ్యి లా చేసి టీ కాస్తున్న శివ వెనుదిరిగి చూసాడు .. పక్కనే ఉన్న సత్య అనే అమ్మాయి ని చూసి .. యశ్వంత్ పిలుస్తున్నాడు సత్యా .. దీన్ని కొంచెం చూసుకో .. అని చెప్పి యశ్వంత్ కేసి నడిచాడు . 
శివా .. టైం తక్కువ గా ఉంది . అంతా సిద్ధం గా ఉన్నారా ? బయల్దేరుదాం ..  అన్నాడు యశ్వంత్ .. 
ఉమ్మ్ .. అంతా సిద్ధం కాని .. ఇక్కడ నుంచి ఇంకా ఎంత సమయం పడుతుంది రావణ పురం చేరడానికి ..   అడిగాడు శివ . 
ఇప్పుడు టైం 7 అవుతోంది .. ఇంకా 10 గంటలు ప్రయాణం చేయాలి .. నా అంచనా ప్రకారం .. కానీ ఇంకా త్వరగా వెళ్ళటానికి ప్రయత్నిద్దాం .. మనం చేసే ఆలస్యం .. అక్కడ ఒక ప్రాణానికి ప్రమాదం కాకూడదు .. ఆ మొండి పిల్ల ఎలా ఉందో .. అన్నాడు యశ్వంత్ .. 
ఈలోపు సత్య టీ తీసుకొచ్చింది .. చెరో కప్పూ అందుకొన్నారు .. 
సత్యా .. మురారి ఎక్కడ ?అడిగాడు యశ్వంత్ .. 
బలేశ్వర్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాడు .. నిన్న రాత్రి లోపు రచన  బలేశ్వర్ ని కాంటాక్ట్ చేసిందేమో .. అని  తెలుసు కుంటున్నాడు . కానీ రచన కాంటాక్ట్ చేసినట్లు లేదు .. అదిగో వస్తున్నాడు మురారి .. అంది సత్య .. 
ఈలోపు వీరి దగ్గరకి వచ్చాడు మురారి .. 
యశ్వంత్ రచన బలేశ్వర్ కి ఆ వూరు వెళ్ళినప్పటి నుంచీ కాంటాక్ట్ చేయలేదు .. అంటే ఆమె ఏదైనా ప్రమాదం లో లేదు కదా .. అన్నాడు కాస్త ఆందోళన గా మురారి . 
చెప్పలేం మురారి.. కానీ  నీ అనుమానమూ నిజం కావొచ్చు ..  కాకపోనూ వచ్చు .. ఎందుకంటే రావనపురం లో ఫోన్ సిగ్నల్స్ ఉండవు  .. నెట్ కూడా వర్క్ చేయదు .. ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకున్నా .. ఆ వూరి నుంచి సుమారు 70km బయటికి వస్తే ల్యాండ్ లైన్ ఫోన్  ఫెసిలిటి వాడుకోవోచ్చు .. సెల్ ఫోన్ వాడాలంటే ఇంకా దూరం రావాలి .. అన్నాడు యశ్వంత్ . 
అలాంటి పరిస్థితి లో ఐతే రచన సమయాన్ని వృధా చేయదు .. ఏదో ఒకటి తేలాల్సిందే .. అనుకోని ఆ ఊర్లోనే ఉండిపోయుంటుంది .. అన్నాడు శివ . 
కానీ మన కంపెనీ రూల్స్ ప్రకారం .. ఆ వూరు చేరుకోగానే కంపెనీ కి ఇంటిమేట్ చేయాలి .. అంది సత్య . 
అవకాశం లేనప్పుడు రూల్స్ ఎలా పాటిస్తాం .ఽ అది కుదరని పని .. అని యశ్వంత్ ఇక బయల్దెరదామ్ .. అన్నాడు మురారి .. 
అందరు టీ తాగటం ముగించి .. వెహికల్ ఎక్కారు .. 
వారు ఎక్కిన ఇన్నోవా రావనపురం వైపు దూసుకుపోతుంది .. 


వెహికల్ రావణ పురం వైపు దూసుకుపోతున్న యశ్వంత్ మనసులో మాత్రం ఆందోళన  తగ్గటం లేదు .. అతని మనసు ఆలోచనలతో సతమతమవుతూనే ఉంది 
                                                                *****************
ధాత్రీ .. టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి బయల్దేరావు ? గుమ్మం నుండి అడుగు బయటికి తీయబోతున్న రచన రత్నరాజు మాట విని ఆగి వెనక్కి తిరిగి చూసింది .. 
ఆమె వైపే వస్తూ కనిపించాడు రత్నం / 
ఎం చెప్పాలి వీడికి ? అని ఓ క్షణం ఆలోచించి .. రాజు గారూ .. మీరు నాకు ఊరంతా చూపించారు కదా .. నేనెంత బాగా గుర్తుంచుకున్నానో ఈ ఊరిలో వీధులను .. నాకు నేనే పరీక్ష పెట్టుకుంటాను .. నన్నోసారి వెళ్ళనివ్వండి . అంది రచన పెదవులపై నవ్వు పులుముకుంటూ .. 
అంత అవసరం ఏమొచ్చింది ధాత్రీ .. ఉండు నీతో పాటూ నేను వస్తాను .. అన్నాడు రత్నం . 
వద్దు ..కంగారు గా అని .. వద్దు రాజు గారూ .. నేనీరోజు ఇక్కడి ప్రజల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను .. మీరు నా వెంట  ఉంటె వారు నాతొ ఫ్రీ గా మాట్లాడలేరు .. నేనే వెళ్తాను .. అని సందేహం గా చూసింది అతని వంక . 
సరే .. కానీ త్వరగా వచ్య్చేస్తావుగా ..  మురిపెం గా అన్నాడు రత్నం . 
చిరునవ్వుతో తల ఊపింది రచన . 
సరే వెళ్ళు .. అన్నాడు రత్నం .. 


రచన  బంగ్లా దాటి నడవసాగింది .. ఎందుకో ఆమె  ని ఎవరో అనుసరిస్తున్నట్టు అనిపించి ఓరకంట వెనక్కి చూసింది .. బాలయ్య .. ఆమెకి తెలియకుండా అనుసరిస్తున్నాడు . 
ఓహ్ .. వీడా .. ఇప్పుడు వీడినెలా తప్పించుకోవాలి .. అని ఆలోచించి ఒక ఇంటి తలుపు కొట్టింది .. 
ఆ ఇంటామె ఆ తలుపు తెరచి రచన వంక వింత గా చూసింది .. 
నేను పట్నం నుండి వచ్చానమ్మా .. మీ సమస్యలు అవీ తెలుసుకోవటానికి .. అంది మెల్లిగా .. ఓ పక్క బాలయ్య ని గమనిస్తూనే .. 
రండమ్మా .. మీరే కదూ .. బంగ్లా కి వచ్చింది . .. అన్నదామె . 
ఆ .. అంటూ ఆ ఇంట్లోకి నడిచింది రచన . 
ఆమె కూర్చోవడానికి కుర్చీ చూపించి చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది . 
కొంచెం తాగి గ్లాస్స్ ఆమె చేతిలో పెట్టింది రచన . 
ఆమె పొయ్యి వెలిగిస్తూ అంది  చెప్పండమ్మా .. ఎం తెలియాలి మీకు ? అని అందామె . 
మీ పేరు ? అని అడిగింది రచన . 
నా పేరు సరస్వతి .. క్షమించండి వంట చేస్తూనే మీక్కావాల్సిన వివరాలు చెపుతాను .. అంది సరస్వతి . 
అలాగే .. ఎందుకని ఈ ఊర్లో అందరు పేదవాళ్ళు గానే ఉండిపోయారు ? ఎవ్వరు ఈ ఊరికి రాలేదా ? మీ కస్టాలు అడిగి తెలుసుకోలేదా ? అడిగింది రచన . 
ఆమె చిన్నగా నవ్వి .. లేదమ్మా .. ఈ వూరు రావాలంటే అందరికి భయం .. దెయ్యాలు చంపేస్తాయని .. వోట్లకి కూడా రారు .. అసలు చాల మటుకు ఈ మూలా ఓ వురున్నదనే తెలవదు చాలామందికి అన్నదామె . 
సరస్వతి... మరి మీకు భయం లేదా ? దెయ్యాలంటే .. అంది సందేహం గా రచన . 
లేదమ్మా .. భయం ఉంటది .. కానీ ఆ మహల్ కాడికి ఎలితే .. ఎల్లకపోతే మాపాలికి మేముంటాం . ఆయమ్మ కూడా అమవాస కి మహల్ కాడికి వేల్లినోడి ప్రాణాలే తీస్తంది . . అంది సరస్వతి . 
ఆయమ్మా ... అంటే ఎవరు ఆమె ? అడిగింది రచన ఉత్సుకత గా . 
వైజయంతి .. అన్నది సరస్వతి 
                                                                                                                         (ఇంకా ఉంది )








Thursday 28 November 2013

రుధిర సౌధం 12

                                 రుధిర సౌధం 
                                                                                             (27 తేది తరువాయి భాగం )



వెంగమ్మ భోజనాలు పూర్తయాక డైనింగ్ టేబుల్ పైన ఉన్న పాత్ర లన్నింటిని సర్దటం లో నిమగ్నమయింది . భోజనం ముగించుకుని మెడ మీది గదికి వెళ్ళబోతున్న  రచన ని చూసి భూపతి .. అమ్మాయ్ .. అని పిలిచాడు .
మొదటి మెట్టు మీదున్న కాలిని వెనక్కి తీసి ,వెనక్కి తిరిగి భూపతి వంక చూసింది రచన .

ఏమైంది ? ఈరోజు నీ పని ఎంత వరకు వచ్చింది ? అని అడిగాడు అడిగాడు భూపతి .

అవుతుంది .. నేను మీ ఇంట్లో ఉండటం మీకేమైనా ఇబ్బందా ? అతని కళ్ళలోకి  సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆమె .
చిన్నగా నవ్వి ... చిన్నతనం .. అని ఆమె వంక చూసి .. నువ్వే కాదు ఈ ఊరంతా వచ్చి నా ఇంట్లో తిన్నా నాకేం ఇబ్బంది లేదు .. కానీ  నేనడుగుతున్నది నీ పని గురించి .. ఈ వూరి కష్టములు తెలుసుకోవటానికి రోజులు అక్కర్లేదు .ఒక రోజు చాలు .. కదూ ... అన్నాడు భూపతి .

నిజమే .. కష్టాలు తెలుసుకోవటానికి ఒక రోజు చాలు .. కానీ ఆ కష్టాలు వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి సమయం కావాలి .. నేనిప్పుడు ఆ పని లోనే ఉన్నాను .. ధ్రుడం గా అన్నదామె .

అతని కెక్కడో చివుక్కుమంది .. ముఖం కంద గడ్డ లా మారింది .

నేనిక వెళ్లి పడుకోనా .. ఉదయాన్నే మళ్లి ఊర్లోకి వెళ్ళాలి అంది రచన ..
చిన్నగా తల పంకించాడు భూపతి .
మెట్లెక్కి పైకి వచ్చి తన గది తలుపు వేసుకొని బోల్ట్ పెట్టింది ..
మళ్లి మహల్ కి వెళ్ళాలి ..సొ కాసేపు నిద్ర పోవాలి .. అనుకుంటూనే .. ముందు తాళం చెవి ...   సూట్ కేసు తెరచి అందులో బట్టల అడుగున ఉన్న ఒక పాత పుస్తకాన్ని తీసింది .

సూట్ కేసు యథాస్థానం లో పెట్టేసి ఆ పుస్తకం తో పాటు సోఫా లో కూర్చుని పుస్తకం ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది ..

పేజీలు  ఒకటొకటి మారుతున్నాయి .. కాని ఓ పేజి వద్ద ఆమె భ్రుకుటి ముడిపడింది .

ఆమె పెదవులు పదేపదే ఆ వాక్యాలను చదువుతున్నాయి ..

ఓ క్షణం అప్రయత్నం గా ఆమె పెదవుల పై నవ్వు విరిసింది ..

"ఉదయం లేచాక రాజు గారితో చెప్పాలి నా సూట్ కేసు కీ దొరికిందని .."అనుకోని హాయిగా నవ్వుకుంది రచన

సోఫా మీద నించి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ తూర్పున ఉన్న కిటికీ ని చేరుకుంది రచన ..

 "ఈ రాత్రి హాయిగా నిద్రపోతాను .. ఉదయాన్నే నీదగ్గరకి వస్తాను .. పగ తో రగిలిపోక హాయిగా నిద్రపో .. ""' అని వెనక్కి వచ్చి బెడ్ మీద వాలింది .. తను వేసుకున్న లాంగ్ హాండ్స్ నైటీ ...  గాయం ని కనబడనివ్వట్లేదు ..  చురుక్కు మంటూ .. చిన్న నెప్పి ఉండనే ఉంది ..
ఏదో ఆలోచిస్తూనే మెల్లిగా నిద్రలోకి జారుకుంది రచన

                                                        *************************
పూజ కి అన్నీ సిద్ధం  ఉన్నాయి స్వామీజీ  .. ఇంకా గిరిజ గారు రావటం ఆలస్యం .. పూజ  మొదలు పెట్టొచ్చు .. అన్నాడు  గోపాలస్వామి ..
 ... చిన్నగా  పంకించి .. పవిత్ర నదీ జలాలు .. తెప్పించి ఉంచాము కదా ..  కూడా పూజా స్థలం లో సిద్ధం చేయండి . గిరిజమ్మ ఒక బంగారు కుంభాన్ని తెస్తుంది .. ఎంతో జాగ్రత్త గా దానిని కాపాడాలి .. అది బంగారు లోహం తో తయారు చేయబడినందుకు కాదు .. నేను జాగ్రత్త అని చెప్పేది .. అది ఆమె బిడ్డ ఆయుష్షు .. అన్నారు స్వామీజీ
అలాగే స్వామీ .. అదిగో గిరిజ గారు వచ్చేసారు ఆన్నాడు గోపాలస్వామి .
గిరిజ వచ్చి స్వామీజీ కి నమస్కరించింది .
అమ్మా .. పూజ మొదలుపెడతాము .. నువ్వూ పూజా స్థలానికి నడువు .. అని ముందుకు నడిచారు స్వామీజీ .
ఓ క్షణం గిరిజ మనసులో వర్ధనరావు మెదిలాడు..
"ఏమండీ .. ఏ త్యాగమయితే మీ బిడ్డ కోసం మీరు చేసారో అదే ఇపుడు నేనూ చేయాల్సిన అవసరం  వచ్చింది  ..
పైనుండి నన్ను ఆశీర్వదించండి . మీ బిడ్డని అనుక్షణం కాపాడుతూ ఉండండి ..  "అని మనసులోనే వర్ధన రావు ని ప్రార్థించి పూజస్తలి వైపు కదిలింది

                                                                                                                            (ఇంకా ఉంది )


Tuesday 26 November 2013

రుధిర సౌధం11

                                                               రుధిర సౌధం 
                                  (26వ తేది తరువాయి భాగం )   

యశ్వంత్ .. నువ్వు కావాలని చెప్పిన వస్తువులన్నీ సిద్ధం గా ఉన్నాయి .. మాతో పాటు .. . చెప్పాడు శివ . 
గుడ్ శివా .. రేపే మనం ఆ రావణ పురానికి బయల్దేరుతున్నాం .. ఆ ఊరిలో ఉండటానికి వసతి ఏమి లేక పోవొచ్చు .. కాబట్టి టెంట్స్ వేసుకోవాలి .. అవీ సిద్ధం గా ఉన్నాయా .. ?అడిగాడు యశ్వంత్ . 
అవన్నీ మనకి అలవాటేగా .. .. అన్ని సిద్ధం . అన్నాడు శివ . 
శివా .. మనం వెళ్ళే చోటు ప్రమాదకరమైనది .. మీరు అన్నింటికీ సిద్ధం గానే ఉన్నారా ? సాలోచన గా అన్నాడు యశ్వంత్ .. 
యశ్వంత్ .. మనం కలిసి ఎన్నో కేసు లు చూసాము ..కా ని ... ఈరోజెందుకో నీ స్వరం కొత్తగా విన బడుతుంది .. 
భయం మన దరిదాపుల్లోకి ఏనాడు రాలేదు .. మరి ఇప్పుడు ఎందుకీ ఆలోచన ? వింతగా ఆ ప్రస్నేమిటి ? చిరునవ్వు తో అడిగాడు శివ . 
శివా .. నిజమే .. మనం ఎన్నో కేసు లు చూసాము . కానీ ఇది వాటి అన్నింటి కన్నా కాస్త విభిన్న మైనది .. ఈ కేసు గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను .. గత 50 ఏళ్ళు గా ఆ మహల్ లో హత్యలు జరుగుతున్నాయి .. అదీ ప్రతి హత్యా .. అమావాస్య రోజు నే జరుగుతున్నాయి .. రీసెంట్ గా జరిగిన హత్యలు అన్ని పోలీస్ ఆఫీసర్స్ వె .. అదీ ఆ హత్య ల కోసం పరిశోదించడానికి వెళ్ళిన వారివే .. అంతే కాదు .. పోలీసులు చేతులెత్తేశారు .. ఈ హత్య లన్ని దెయ్యాలు చేస్తున్నాయని ఓ కథనం .. ఊరిలో వాళ్ళు అదే చెబుతున్నారట . 
అన్నాడు యశ్వంత్ . 

అవునా .. నిజం గ ఇంటరెస్టింగ్ గా ఉంది .. అన్నాడు శివ .. 
అవును .. ఇప్పుడు రచన అక్కడే ఉంది .. నాకు కంగారు గా ఉంది .. అన్నాడు యశ్వంత్ . 
యశ్వంత్ .. రచన  తెలివయింది .. అంత తేలిగ్గా ప్రమాదం లో పడదు .. నువ్వు టెన్స్ కాకు అన్నాడు శివ 
సరే .. బలేశ్వర్ గారికి మార్నింగ్ ఫోన్  చేసి స్టార్ట్ అవుదాం .. వెళ్లి నిద్రపో శివా .. అన్నాడు యశ్వంత్ . 
సరే .. నువ్వు త్వరగా నిద్రపో .. అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు శివ . 
యశ్వంత్ నీలాకాశం  వైపు చూసాడు .. చంద్రుడు దాదాపు తరిగిపోయాడు .. ఓ గాడ్ .. మే బి  2రోజుల్లోనే అమావాస్య ఉందనుకుంటాను ..   అంటే అమావాస్య కి ముందే మేమక్కడికి చేరుకోవాలి .. లేదంటే ... లేదంటే .. జరగరానిదేదయినా రచన కి జరిగితే నన్ను నేను క్షమించుకోలేను .. తల పట్టుకున్నాడు .. యశ్వంత్ 

ఒక్కసారి తను ఢిల్లీ  వెళ్ళిన ముందు రోజు జరిగిన సంఘటన అతని మదిలో మెదిలింది .. 

ఆరోజు .. 
ఏదో తీవ్రం గా ఆలోచిస్తూ కనబడింది రచన .. 
ఎంతో  అందం గా ఉన్న తన వదనం లో ఏదో అప్రసన్నత.. ఆందోళన .. 

ఏమిటిలా .. డల్ గా ఉంది .. అనికొని ..  రచనా .. గుడ్ మార్నింగ్ .. అని దగ్గరకి వెళ్ళాడు యశ్వంత్ . 
అతని మాట వినిపించిన తరవాత .. తలెత్తి చూసింది రచన .. నువ్వా అంది అనాసక్తం గా 
నన్ను చూడగానే మొహం అలా పెట్టకపోతే కాస్త నవ్వుతు పలకరించోచ్చు కదా .. అని టకాలున ఆమె చేతిలో ఉన్న ఫైల్ తీసుకున్నాడు యశ్వంత్ . 
ఏయ్ .. ఏంటిది ? బలవంతం గా తీసుకు0టున్నావు? ఐనా  నా దగ్గర ఎందుకింత చనువు ప్రదర్సిస్తావు ?నాకిలాంటివి నచ్చవు యశ్వంత్.. సీరియస్ గా అతని మొహానికి చేతిని చూపిస్తూ అంది రచన . 
అమ్మా తల్లీ .. నీ మాటలు వింటే నేనేదో నిన్ను ఏడిపిస్తున్నా ననుకుంటారు .. ఐన నేను నీ చిన్ననాటి స్నేహితుడ్ని .. కాని నువ్వేమో నన్ను శత్రువు లా చూస్తున్నావు ... ఎందుకని ?అన్నాడు యశ్వంత్ . 
యశ్వంత్ .. స్నేహితుడిలా ఉన్నావా నువ్వు ? ఐ లవ్ యూ అంటూ కొత్త అల్లరి మొదలుపెట్టావు .. అందుకే నీకు దూరం గా ఉంటున్నది ..  నన్నిలా ఉండనీ.. ముందా ఫైల్ ఇవ్వు .. అని అతడి చేతిలో ఉన్న ఫైల్ తీసుకోడానికి ప్రయత్నించింది .. రచన 

ఆమె కి అందకుండా ఆ ఫైల్ పెట్టి .. ఆ ఫైల్ వంక  చూసాడు యశ్వంత్ .. 
ఈ ఫైల్ నీ చేతిలో ఉందేంటి ? అడిగాడు ఆశ్చర్యం గా యశ్వంత్ .. 
ఏం .. ఉంటె తప్పేంటి ? ఈ కేసు నేన్ను అటెండ్ అవుదామనుకుంటున్నాను .. బలేశ్వర్ తో మాట్లాడాలి ఇంకా .. అంది రచన . 
రచనా .. నీకేమయినా పిచ్చా ? ఈ కేసు కోసం మర్చిపో .. ఇంకా చాల కేసు లు ఉన్నాయి నువ్వు అటెండ్ కావడానికి .. అయినా ఈ కేసు విషయం లో అందరు భయపడుతున్నారు .. నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు ?ఆమె మొహానికి దగ్గరగా తన మొహాన్ని పెట్టి అడిగాడు యశ్వంత్ . 
యశ్వంత్ .. నువ్వు ఇక్కడ నా కొలీగ్ వి మాత్రమే .. ఎక్కువ  రియాక్ట్ అవ్వకు .. అంతే  కాదు నేనే కేసు తీసుకోవాలో నువ్వు చెప్పక్కరలేదు ..? ఆవేశం గా అంది రచన . 
ఎందుకంత కోపం రచనా  ?? నీ మంచి కోసమే చెబుతున్నాను .. ఆ కేసు వద్దు .. ఇంకేదన్నా చూడు .. నేను ఓ కేసు పని మీద ఢిల్లీ వెళ్తున్నాను .. వచ్చాక వివరం గా చెప్తాను నీకు ఎందుకు వద్దంటు న్నానో .. ప్లీజ్ .. రెండు చేతులు జోడించి అన్నాడు యశ్వంత్ . 
ఆమె ఏం మాట్లాడలేదు .. 
గుడ్.. స్వీట్ గర్ల్ .. అని చిరునవ్వు తో వెళ్ళిపోయాడు యశ్వంత్ .. 

"ఆరోజు రచన నా మాట వింటుంది అనుకున్నాను .. కాని నేను వచ్చేలోపే వెళ్ళిపోయింది .. రచనా .. నువ్వు నా ప్రేయసి కాకముందు .. నాకు చిన్ననాటి స్నేహితురాలివి .. ఎందుకని నా మాట గౌరవించలేదు  ... అయినా నేను నీకేం కానివ్వను .. రచనా .. వస్తున్నాను .. నీకు రక్షణ ఇవ్వటానికే కాదు .. ఆ మహల్ అంతు తేల్చడానికి కూడా . "
అనుకున్నాడు మనసులో యశ్వంత్ 

(ఇంకా ఉంది )
















రుధిర సౌధం10

                               రుధిర సౌధం 
                                                                                                                (25వ తేది తరువాయి భాగం )





ఏవో ఫైల్స్ తిరగేస్తున్న బలేశ్వర్ తలుపు తట్టిన చప్పుడు విని తలుపు వైపు చూసాడు . 27 ఏళ్ళ యువకుడు అక్కడ నిలబడి ఉండటం చూసి  అతని పెదవులపై మందహాసం విరిసింది .
హే యశ్వంత్ .. .. నువ్వా ..రా .. వచ్చి కూర్చో .. అని ఆత్మీయం గా పిల్చాడు బలేశ్వర్ .
అతను మాత్రం సీరియస్ గా వచ్చి కూర్చున్నాడు .
ఏంటి ? మొహం అ లా పెట్టావు .. ఏమైంది ? అన్నాడు బలేశ్వర్ అతని వంక సీరియస్ గా చూస్తూ .
రచన ని ఎక్కడకి పంపారు మీరు ? కాస్త కోపం గా అడిగాడు యశ్వంత్ .
రాణి మహల్ కేసు ఇన్వెస్టిగేషన్ కి .. అంతే గంభీరం గా అన్నాడు బలేశ్వర్ .
ఆ కేసు ఒకరు సింగల్ గా వెళ్లి చేయాల్సిన కేసు కాదు కదా బలేశ్వర్ గారు .. మరి రచన ని వొంటరి గా ఎలా పంపారు ? ఆవేదన గా అడిగాడు యశ్వంత్ .
యశ్వంత్ .. రచన చాలా శ్రద్ధ చూపించింది ఈ కేసు పైన .. అంతే కాకుండా తను ఒక్కతే దీనిని హేండిల్ చేయగలను అంది .. నాకు తన మీద నమ్మకం ఉంది .. అయినా ఈరోజుల్లో కూడా దెయ్యాలూ ,భూతాలూ ఉన్నాయంటావా ? ఆ మహల్ లో జరిగే హత్యల గురించి  ఇంత వరకు ఏమి తెలియలేదు .. మన కలాంటి కేసు లేగా వస్తాయి .. ఎవరో ఆ మహల్ లో దెయ్యాలు ఉన్నాయని భయాన్ని క్రియేట్  చేసి హ్యాపీ గా హత్యలు చేసుకుపోతున్నాడు .. రచన తెలివైంది .. ఈ కేసు తను ఖచ్చితం గా సాల్వ్ చేయగలదు .. అందుకే తనని పంపాను .. ఆవేశం గా అన్నాడు బలేశ్వర్ ..
నిజమే కావొచ్చు . కాని శత్రువు ని సరిగ్గా అంచనా వేయటం కుడా మనకు ముఖ్యమే కదా .. ఇంతకు  ముందు ఆ కేసు సాల్వ్ చేయటానికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఒక నార్మల్ పర్సన్ కాదు .. ఎన్నో గొప్ప కేసు లని సాల్వ్ చేసారాయన .. కానీ అదే మహల్ లో అతని శవం మిగిలింది .. కొన్నేళ్ళ నుంచి హత్యలు జరుగుతునాయక్కడ .
ఆ హత్యల  రహస్యం ఇప్పటికి అంతు  పట్టలేదు .. ఆలోచించండి బలేశ్వర్ .. రచన ఒక్కతే వెళ్లి చేయాల్సిన పని కాదు  ఇది .. ఈ టాస్క్ లో రచన కేదన్న ప్రమాదం జరిగితే .. కాసింత బాధ గా అన్నాడు యశ్వంత్ .
ఒకవేళ అలా ఏమైనా జరిగితే ఆ కేసు కోసం ఇంకొకరు వెళ్తారు యశ్వంత్ .. మన పని లో ప్రమాదాల కోసం ఆలోచించం .. అన్నింటికీ సిద్ధపడే ఈ ఫీల్డ్ ని ఎంచుకున్నాం .. మరలాంటప్పుడు .. నాకర్థ మయింది యంగ్ బాయ్ .. .. నువ్వు రచన ని ప్రేమిస్తున్నావు .. అందుకే నీకింత బాధ .. అవునా ? చిన్నగా నవ్వుతు అన్నాడు బలేశ్వర్

ఈ పరిస్థితి లో ఎవ్వరున్న నేనిలానే మాట్లాడతాను .. ఈ కేసు వెళ్ళింది రచన అయినా మరెవ్వరైనా ఒక్కరే వెళ్ళటం వ ల్ల  ఫలితం ఉండదు .. స్థిరం గా అన్నాడు యశ్వంత్

ఆలోచిస్తే నువ్వన్నదీ నిజమేనని పిస్తుంది యశ్వంత్ .. సరే .. ఓ టీం ని ఫార్మ్  చెయ్ .. 4 గురిని నీతో పాటు తీసుకు వెళ్ళు ..ప్లాన్ ఏంటో నువ్వే ఆలోచించు .. రచన నాకు కాంటాక్ట్ చేస్తే మీరు వస్తున్నారని చెప్తాను . . అన్నాడు బలేశ్వర్ .

సరే సర్ .. బట్ టీం రెడీ గానే ఉంది .. నేను ,శివ ,సత్య ,మురారి .. వీలుంటే రేపే బయల్దేరుతాం .. అన్నాడు యశ్వంత్ .
గుడ్ .. నీలో నాకు నచ్చేది ఈ గుణమే యశ్వంత .. నువ్వెప్పుడు సిద్ధం గా ఉంటావు . అన్నాడు బలేశ్వర్ .
థాంక్ యు సర్ .. ఇప్పుడే మాకవసరమయ్యె సామాను అంతా సిద్ధం చేసుకుంటాము .. అండ్ మాకొక వెహికల్ కావా లి .. అన్నాడు యశ్వంత్ .
రచన వెహికల్ కావాలని కూడా అడగలేదే .. అన్నాడు బలేశ్వర్ ..
 ఒక్కోసారి  .. ప్రాణాలు రక్షించుకోవటానికి గన్ తో పాటూ వెహికల్ కూడా అవసరమవుతుంది సర్ .. అన్నాడు యశ్వంత్ .
అలాగే..  అలాగే ,, తీసుకువెళ్ళు యశ్వంత్ .. అండ్ గుడ్ లక్ టు  యూ.. అన్నాడు   బలేశ్వర్
 థాంక్ యూ ..స ర్ అని లేచాడు యశ్వంత్
                                                             ***********************************
ఊరంతా తిరిగాం .. అన్ని ఫోటో లు తీసుకున్నావు .. బాగానే ఉంది గాని .. నాకూ ఒక్క ఫోటో .. అని మెల్లిగా నసిగాడు రత్నం .
ఓ .. దానికేం .. ఆ  చెట్టు కింద నిల్చో0డి రాజు గారు.. అంది  రచన .
రత్నం వెళ్లి జడల మఱ్ఱి చెట్టు కింద నిలుచున్నాడు ..
మంచి స్టిల్ ఇవ్వండి మరి .. అంది రచన ..
హీరోలా కొంచెం కామెడి ఫోజ్ ఇచ్చాడు రత్నం ..
కెమెరా క్లిక్ మనిపించింది రచన ..
బాగా తీశారా ? అన్నాడు రత్నం ..
ఊమ్..   అని  తల ఊ పి .. రాజు గారూ .. ఇక్కడ .. కంసాలి వాళ్ళెవరు లేరా ? అని అడిగింది .. రచన
ఉన్నారు .. వాళ్లతో మీ కెం పని అన్నా డు రత్నం .
అదా .. నా చెవి జూకాలు కొంచెం .. మెరుగు పెట్టించాలి అందుకే .. అంది రచన .
ఓహ్ .. అలా ఐతే పదండి .. చూపిస్తాను .. అన్నాడు రత్నం .

అంతే కాదు .. డూప్లికేట్  తాళం .. తయారుచేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? అడిగింది రచన .
ధాత్రీ .. ఉన్నారు కానీ వాళ్ళెందుకు ?అడిగాడు ఆశ్చర్యం గా రత్నం ..
నా సూట్ కేసు కీ పోయింది .. నా బట్టలు ,చాలా వస్తువులు అందులో ఉండిపోయాయి అందుకే .. అంది రచన .
అలా ఐతే నేను వాళ్ళకి కబురు పెడతాను ..వాళ్ళు బంగ్లా కె  వస్తారు .. రత్నం
సరే .. ఐతే .. ఇక మనం బంగ్లా కి వెళ్దాం .. అంది రచన .
సరే .. పద .. అని  ముందుకి నడిచాడు రత్నం .
"ఎలా అయినా ఆ మహల్ తాళం చెవి సంపాదించాలి .. లేదంటే నేను మహల్ లోకి ఎలా వెళ్తాను ? డూప్లికేట్ కీ చేయమంటే వాళ్ళు భూపతి కి తెలియకుండా తయారు చేస్తారా ? చూద్దాం .. ముందు పరిస్థితులని ఆకళింపు చేసుకోవాలి .. "' అని ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె కి మెరుపులా ఓ ఆలోచన తట్టింది .. ఆమె పెదవులపై చిరునవ్వు మెదిలింది .
                                                     *********************

కాలింగ్ బెల్ మోగటం తో ... వెళ్లి తలుపు తీసిన గిరిజ ..  వచ్చిన వ్యక్తీ ని చూసి కళ్ళు పెద్దవి చేసి నువ్వా యశ్వంత్ ?ఎప్పుడు వచ్చావు ఊ రి నుంచి ? అని అడిగింది ఆత్మీయం గా ..

నిన్ననే వచ్చాను ఆంటీ .. రాగానే తెలిసింది రచన గురించి .. అన్నాడు లోపలికి అడుగు పెడుతూ యశ్వంత్ .

నా మాట వినదు కదా .. తన ఇష్టాన్ని నేను కాదనలేను .. అంది గిరిజ నిర్లిప్తం గా

నేను రచన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఆంటీ .. రేపే బయల్దేరవచ్చు .. అన్నాడు యశ్వంత్ ..

నిజం గానా .. యశ్వంత్ ? ఆనందం గా అడిగింది గిరిజ ..

అవునాంటీ .. నేనే కాదు తనకి తోడుగా మరో నలుగురం వెళ్తున్నాం .. అన్నాడు యశ్వంత్ .

కులదేవత పూజ చేద్దాము అనుకుంటుండ గానే దాని ఫలితం కనబడింది .. నాకు ఇపుడు చాలా ధైర్యం గా ఉంది .. బాబూ .. అంది గిరిజ వెలిగి పోతున్న మొహం తో ..

ఆంటీ .. టైం లేదు .. నేనిక బయల్దేరతాను .. మీకీ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను అన్నాడు యశ్వంత్

అతని వంక కృతజ్ఞత గా చూసింది గిరిజ
                                                                                                                               
(ఇంకా ఉంది )









Monday 25 November 2013



భారతదేశం ఒకప్పుడు చిన్న చిన్న దేశాలుగా ఉండేది.

 ఆంధ్రదేశం, కన్నడదేశం. ఇలా వుండేది. అలా ఒక దేశపు రాజుగారు తన 

భటులతో, మంత్రులతో కలిసి తన దేశంలో ప్రజల యోగక్షేమాలు 

తెలుసుకోవడం కోసం బయలుదేరాడు. అలా వెళుతూ ఉండగా ఒక రాయి 

వచ్చి తలకి తగిలి బాగా నెత్తురు కారిపోయింది. పక్కనే ఉన్న భటులు

 చుట్టూ వెతికి బక్కచిక్కి, డొక్కలు ఎండి, గోచి పెట్టుకున్న వ్యక్తీ ఒకడు

 కనిపించదు. వాడిని లాక్కొచ్చి రాజు ముందు నిలబెట్టారు. రాజుగారు

 వాడిని పైనుండి క్రింది వరకు చూసి ఎవరు నువ్వు? రాయితో ఎందుకు 

కొట్టావు?అని అడిగితె! నేను నేరేడు పండుకోసం చెట్టుమీదకి రాయి వేస్తె 

అది పొరపాటున వచ్చి మీకు తగిలింది. క్షమించండి అన్నాడు. పక్కనే 

ఉన్న మంత్రులు, భటులు వీడని క్షమించేది ఏమిటి? ఉరి శిక్ష వేయండి 

అని అన్నారు. రాజు మంత్రులవైపు, చూసి నవ్వి భటులతో ''ఈకుర్రాడి 

ఇంటికి ఒక సంవత్సరానికి సరిపడా ఆహారధాన్యాలు పంపించండి'' అని 

ఆజ్ఞ వేశాడు. అందరు ఆశ్చర్యపోయి! అదేమిటి మహారాజ మిమ్మల్ని

 రాయితో కొడితే ఆహారధాన్యాలు పంపమంటున్నారు? అన్నారు. రాజు

చిరుమందహాసం చేసి ఆకలితో ఉన్నవాడు రాయితో కొడితే ఎటూ

 కదలలేని చెట్టే పళ్ళు ఇస్తుంటే, ఒక దేశానికి రాజునైవుండి ప్రజలు 

యోగక్షేమాలు చూడవలసిన నేను ఇంకెన్ని ఇవ్వాలి? అన్నాడు. ఇది 

ప్రజలను ఏలే ప్రభువులు చేయవలసినది. ఇది 250 సంవత్సరాల క్రిందట

 జరిగిన యధార్ధగాధ.

రుధిర సౌధం 9



                                  రుధిర సౌధం 

                                                                                                 (23వ తేది తరువాయి భాగం )
ఎక్కడి నుండో ఓ సూర్య కిరణం .. మొహాన్ని సూటిగా తాకగానే మెల్లిగా కనులు తెరిచింది రచన ..
ఎలా ? తూర్పు వైపు కిటికీ మూసిఉన్నపుడు ఈ కిరణాలు నన్నెలా తాకుతున్నాయి ? అని లేచి కిటికీ వంక చూసింది రచన .
కిటికీ తలుపులకి ఉన్న చిన్న రంధ్రం కాంతి ని లోపలికి  ప్రసరింపజేస్తుంది . ఓహ్ .. అదా సంగతి .. అనుకొని గడియారం వైపు చూసింది . టైం 8గం కావొస్తుంది ..
మెల్లిగా మంచం మీద నించి లేచి హాల్ వైపున్న కిటికీ ని కొంచెం తెరచి చూసింది .. కింద డైనింగ్ టేబుల్ వద్ద భూపతి టిఫిన్ తింటూ కనిపించాడు .. దానికి కాస్త దూరం లో ఉన్న సోఫా లో కూర్చుని ఉన్నాడు రత్నం .. మే డ మెట్ల వైపు  ప్రతి  2 నిమిషాలకోసారి చూస్తూ ఉన్నాడు ..
రచన తనలో తనే నవ్వుకొంది   .. వీడైతే నాకోసమే ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు .. నేను కిందికి వెళ్ళే దాకా టిఫిన్ కూడా చేయడేమో .. త్వరగా రెడీ అయి కిందకి వెళ్ళాలి .. అని బాత్రూం లోకి నడిచింది .

కింద టిఫిన్ చేయడం ముగించిన భూపతి .. సోఫాలో ..కుర్చుని రచన కోసం ఎదురు చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నిట్టూర్చి .. ఆ అమ్మాయి కోసమేనా ఈ నిరీక్షణ .. కాసింత గంభీరం గా అడిగాడు .
ఆ .. అదీ ,.. నాన్న గారూ .. ఇంకా ఆకలి వేయటం లేదు .. అందులోను ధాత్రి మన అతిథి కదా .. అతిథి తినకుండా ఎలా  తినేస్తాను చెప్పండి .. అన్నాడు మెల్లిగా ..

చూడు రత్నం .. ఆ పిల్ల పట్నం పిల్ల .. పట్నాలూ..వాళ్ళ పోకడలు .. మన పద్ధతులకి వేరుగా ఉంటాయి . వాళ్లీ సమయానికి నిద్రలేవరు .. నువ్వు ముందు టిఫిన్ తినేయ్యి .. అన్నాడు భూపతి .
అలాగే నాన్నా .. అన్నాడు రత్నం .

నిన్న ఆ పిల్ల ని మహల్ వైపున్న పొలాల వరకు తీసుకు వెళ్ళావు.. వద్దన్నాను .. నువ్వు నా మాట వినదలచు కాలేదా ? కాసింత కటువు గా అడిగాడు భూపతి .

జవాబు ఏమని చెప్పాలో తెలియక మిన్నకుండి పోయాడు రత్నం .
ఆ అమ్మాయి ఇక్కడ కి ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాని విషయం .. కానీ నాకు నువ్వు బ్రతికి ఉండటం అవసరం .. అర్థమైందని అనుకుంటాను అన్నాడు భూపతి ..
చిన్నగా తలూపాడు రత్నం .
నేను పొలం దాకా వెళ్లి వస్తాను .. ఇంట్లో ఉండు .. అని చెప్పి భూపతి వెళ్లి పోయాడు ..
ఈలోపు  మెట్లు దిగి వచ్చింది రచన ..
రచన ని చూసి హాయిగా నిట్టూర్చి .. హమ్మయ్య వచ్చావా ధాత్రీ .. ఆకలి గా ఉంది .. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు రత్నం .
అలానా ? ఐతే ముందు టిఫిన్ చేసేద్దాం .. అని టేబుల్ ముందు కూర్చుంది రచన ..
రత్నం కూడా కూర్చున్నాడు ..
రాత్రి నిద్ర పట్టిందా ? అడిగాడు రత్నం .. ..
ఊ .. భేషుగా పట్టింది . అంది రచన .
వెంగమ్మ వచ్చి ఇద్దరికీ టిఫిన్ వడ్డించింది ..
ఏవేవో కబుర్లతో ఇద్దరు టిఫిన్ కానిచ్చారు ..
రాజు గారూ .. ఈరోజు నేను  కొన్ని  ఫొటోస్ తీయాలి .. ఊర్లోకి వెళ్లి . ... అంది చేతులు కడుగుకుంటూ రచన .
అవునా .. మహల్ వైపైతే వేల్లనవసరం లేదు గా .. అన్నాడు రత్నం కాసింత కంగారు గా .
చిన్నగా నవ్వి .. లేదు .. పచ్చని పొలాలని .. ఊరి పల్లె  పడుచులని ..  స్థితి గతులనీ .. వీటన్నింటినీ ఫోటో లు తీయాలి .. అంది రచన .
ఓహ్ .. అలా ఐతే దున్నెయొచ్చు .. ఈ ఊరిలో ప్రతి మూలా నాకు తెల్సు .. నేను చూపిస్తాను .. అన్నాడు రత్నం ..
థాంక్ యు రాజు గారూ .. అంది రచన .
మరి ఐతే బయలుదేరుదామా ? అంది రచన ..
పదండి .. అన్నాడు  రత్నం .
కానీ .. ఈరోజు మీ జీప్ లో వద్దు కాలి నడకనే వెళ్దాం .. అంది రచన .
మీ ఇష్టం .. అన్నాడు రత్నం
ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరారు ..
                                    *************************************************

స్వామీ .. నన్ను రమ్మని చెప్పారట .. అంది గిరిజ కొంత ఆత్రుత గా ..
అవును తల్లీ .. కంగారు పడకు .. రచన క్షేమం గానే ఉంది .. అన్నారు స్వామీజీ
సంతోషం స్వామీ .. మీ మాట నాకు కొంత ఓదార్పు నిచ్చింది .. అంది గిరిజ ..
చూడు తల్లీ .. రచన మంచి కోసమే .. ఆశ్రమం లో చండీ యాగం ,మృత్యుంజయ హోమమం చేయాలని సంకల్పించాను .. అది నీ చేతుల మీదుగా జరగాలి .. అన్నారు స్వామీజీ .
అలాగే స్వామీ .. మీరు చెప్పినట్లే చేద్దాము .. సన్నాహాలను మొదలుపెట్టండి స్వామీ .. అంది గిరిజ .
వీటితో పాటూ ..కొన్నే ల్లనుండి ఆగిపోయిన మీ కులదేవత పూజ కూడా జరగాలి అన్నారు స్వామీజీ ..
స్వామీ .. ఆశ్చర్యం గా అడిగింది గిరిజ ..
చూడు తల్లీ  ..నీ ఆశ్చర్యానికి కారణం నాకు తెలుసు .. కానీ నేను చెప్పేది నిజమే.. కులదేవత పూజ జరగాలి .. అందుకు నువ్వేమి చేయాలో తెలుసు కదా .. అన్నారు స్వామీజీ .
తెలుసు స్వామీ .. నేను నా బిడ్డ కోసం ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనగలను .. మీరు మూహూర్తం నిర్ణయించండి ..
పూజ కి సర్వము నేను సిద్దం చేస్తాను .. అంది గిరిజ .. రానున్న అమావాస్య కి ముందు మూడు రోజులు పూజ లు జరగాలి . రచన పేరు మీద హోమాలు జరుగుతాయి .. కులదేవత పూజ కి సిద్దం గా ఉండు .. ఆ తరువాత ఆ పరంధాముడే నీ బిడ్డ కి రక్ష ...  నింగి వంక చూస్తూ అన్నారు స్వామీజీ .
అలాగే స్వామీజీ .. ఇక నేను వెళ్లి వస్తాను .అ ని లేచింది గిరిజ..
అభీష్ట ఫల సిద్ధి రస్తు .. అని దీవించారు స్వామీజీ .
(ఇంకా ఉంది )
   

















 

Saturday 23 November 2013

రుధిర సౌధం8

                                  రుధిర సౌధం
                                                                                                (22 వ తేది తరువాయి భాగం ) 

ఆమె మరోసారి మహల్ సింహద్వారం వైపు చూసింది .. ప్చ్ .. తాళం చెవి దొరికి ఉంటె పరిస్థితి మరోలా ఉండేది .. ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది .. కాని నేను ఊరికినే వోడిపోయి వెల్లేరకం కాదు ... అనుకుని ..
గట్టిగా అరచింది ..ఎవరు ? ఎదురుగా వచ్చి నిలబడు .. భయపెడితే పారిపోయే రకం కాదు నేను .. ..ఓ డి పోయి  వెళ్ళ ను ... మళ్ళి  వస్తాను .. నాకోసం వేచి ఉండాలి నువ్వు...  తప్పదు . ..అంది గట్టిగా ..
అంతే ఉవ్వెత్తున ఓ సుడిగాలి లేచి ఆమె వైపు రాసాగింది ..

ఆమె బిత్తరపోయి చూసి .. వెంటనే తేరుకుంది .. భయపడకుండా సూటిగా అటువైపు చూ సింది .. ఆమె కళ్ళలో ఎరుపు .. జంకు లేనితనం గుర్తి0ఛి0దేమో ఆ అదృశ్య శక్తి .. ఒక్క సారి గా సుడి గాలి విచిత్రం గా మాయమయింది ..
గట్టిగా ఊ పిరి తీసుకుని ముందుకు కదిలింది రచన ..

ఆకాశం వివిధ వర్ణాలతో కనబడుతుంది భయానకం గా .. ఆమె మెల్లిగా గేటు దగ్గరికి వచ్చింది ..చేతి నొప్పి  ఎక్కువవసాగింది ..  చేతికి కట్టిన కట్టు ని గట్టిగా పట్టుకుని మెల్లిగా ఆ ప్రాంతాన్ని దాటింది ..
ఆమె వస్తున్నపుడు ఆమె వెనుకగా మహల్ గేటు తానంతట తానె మూసుకు పోవటం ఓరకంట గమనించింది .
విసురుగా గాలి .. చెట్లు పిచ్చేక్కినట్లు ఊగిపోతున్నాయి .. పొలాల వెంబడి నడుస్తూ  ఎందుకో వెనక్కి తిరిగి మహల్ వైపు చూసింది .. నింగి అరుణ వర్ణం లోకి మారటం వల్లనో ఏమో ఆ మహల్ కూడా ఎర్రని రంగు లో కనబడింది ..
వడివడిగా నడుస్తూ బంగ్లా వెనుక భాగాన్ని చేరుకుంది ..
చేతి నొప్పి తాళలేక  పోతున్న మెల్లిగా పైపు ని పట్టుకుని పైకి ఎగబాకి కిటికీ ని అందుకొంది రచన .
కిటికీ గుండా గదిలోనికి ప్రవేశించి మెల్లిగా మంచం మీదకి చేరింది ..
ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది .. జరిగినదంతా కళ్ళ ముందు మెదిలింది ..

ఏమిటది ? ఏదైనా అతీత శక్తి ? లేదంటే ఎవరో కావాలనే అలాంటి పరిస్తితుల్ని సృష్టించి ఉంచారా? లేదు .. నేనా ప్రాంతం ఉన్నపుడు ఆకాశం కూడా వికృతం గా కనబడింది .. అనుకుంటూ కిటికీ లోంచి ఆకాశం వంక చూసింది .. ఏమి జరగనట్లు ప్రశాంతం గా ఉంది ..
అబ్బా.. చేతి నొప్పి ఆమె ని ఇబ్బంది పెట్టింది ..లెచి తను తెచ్చుకున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని తీసి గాయం తగిలిన చోటు నంతటిని స్పిరిట్ తో శుభ్రం చేసి బ్యాండ్ ఎయిడ్ వేసింది ..
గడియారం 3గం కొట్టింది ..
ముందు కాసేపు నిద్ర పోవాలి .. లేదంటే తెల్లారేసరికి నా మొహం చెప్పేస్తుంది రాత్రంతా నేను నిద్రపోలేదని .. భూపతి కి అనుమానం రాకూడదు .. ఏదేమయినా నా చేతల్ని గమనించమని ఎవరికో చెప్పే ఉంటాడు ..
సాధ్యమయినంత త్వరగా పరిస్థితులని చక్కబరచు కోవాలి .. అనుకొని డ్రెస్ మార్చుకుని నిద్ర కి ఉపక్రమించింది .
                             *************************************************

స్వామీ .. ఇంత వేళ దాటినా మీరింకా ధ్యానం లోనే ఉన్నారేంటి? అంటూ ప్రశ్నించాడు .. భోజనాన్ని కూడా స్వీకరించకుండా   అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం లో ఉన్న రమణా నంద మహర్షి ని శిష్యులలో ఒకరైన గోపాలస్వామి .
మెల్లిగా కనులు తెరిచి .. విలయం మనం నిద్రపోతే ఆగదు .. జాగరూకత తో ఉన్నా ఆగదు .. కాని భగవంతుడనే వాడు తలచుకుంటే .. ఎన్ని అద్భుతాల నైన సృష్టించ గలగుతాడు . అన్నాడు
అర్థం కాలేదు స్వామీ .. అన్నాడు గోపాల స్వామి .
ఆ తల్లి లీలను అర్థం చేసుకునే శక్తి నీకింకా రాలేదు నాయనా .. అన్నాడు మహర్షి .
స్వామీ .. ఆ జగత్జనని లీలను నేను అర్థం చేసుకోలేక పోయిన ఎవరో ఆపదలో ఉన్నారని .. వారికోసమే మీరింత వరకు ప్రార్థించి ఉంటారని ఊ హించగలను స్వామీ .. అన్నాడు గోపాలస్వామి .
స్వామీజీ చిరునవ్వు తో .. గోపాలం .. తెల్లవారగానే వర్ధనరావు భార్య గిరిజమ్మ కి ఆశ్రమానికి రమ్మని కబురు ప0పు ..అన్నారు స్వామీజీ ..
అలాగే స్వామీ .. స్వయం గా నేనే వెళ్లి ఆమె ని తోడ్కొని వస్తాను .. మీరిక విశ్రమించండి స్వామీ .అ ని అక్కడి నుంచి నిష్క్రమించాడు గోపాలస్వామి .

హే జగత్జననీ .. నీ బిడ్డ ని కాపాడావు తల్లీ .. నా  నమ్మకాన్ని ,పూజ ని అలక్ష్యం చేయలేదు నీవు .. అనుక్షణం ఆ బిడ్డ వెంట ఉండి కాపాడు తల్లీ .. అని ప్రార్థించాడు రామనానంద మహర్షి .
                                                                                                                                       (ఇంకా ఉంది )












Friday 22 November 2013

రుధిర సౌధం 7

                                                           రుధిర సౌధం 

ధాత్రీ ..సిద్దమ్ గా ఉన్నావా ? ఊరి లోకి వెళ్దాం .. అంటూ వచ్చాడు రత్నం
హా .. అని సెల్ బాగ్ లో పడేసి లాక్ చేసి రత్నం ని అనుసరించింది రచన .
 కింద జీప్ రెడీ గా ఉంది .. ఇద్దరు ఎక్కి కూర్చున్నాక రత్నం జీప్ స్టార్ట్ చేసాడు ..
బాగా పల్లెటూరు .. జనం  విచిత్రం గా చూస్తున్నారు రచన ని ..
ఏంటి అంతా నన్ను వింతగా చూస్తున్నారు .ఽని ప్రశ్నించింది రత్నాన్ని .
అదా .. మా వూళ్ళో ఆడపిల్లలు ఎవరు జీన్స్ వేసుకోరు .. వాళ్ళకి నీ వేషధారణ కొత్తగా కనిపిస్తుంది .. అని చెప్పాడు చిరునవ్వుతో రత్నం .
అతనితో అలా పిచ్చాపాటీ మాట్లాడుతూనే వూళ్ళో అన్ని మార్గాలని క్షుణ్ణం గా పరిశీలించ సాగింది రచన .
ఊరికి  చివర్లో ఉన్న పొలాల వరకు వచ్చి .. ఇవే మాఊ రి పొలాలు .. అని చెప్పి ఇక్కడి నుంచి వెనక్కి వేల్లిపోవటమే .. అన్నాడు రత్నం
అదేంటీ .. ఆ ముందంతా ఎంత బావుంది ? చూద్దాం .. మారం చేస్తున్నట్లు అంది రచన .
అమ్మో .. అటు వైపా.. లేదు ధాత్రీ .. అటు మనం వెళ్ళకూడదు . అటువైపు రాణి మహల్ ఉంది .. పైగా సాయంత్రమయిపోవోస్తుంది .. అన్నాడు   రత్నం .
ఎందుకంత భయం ఆ మహల్ అంటే .. అటువైపు పొలాలు ఎంత పచ్చగా ఎంతబావున్నాయి ?అంది రచన తెలివి గా
సరే .. కానీ మరి కొంచెం ముందుకి పోనిస్తానంతే .. అని ముందుకి పోనిచ్చాడు .
జీప్ ముందుకు వెళ్తుంటే దూరం గా కనిపించింది ఓ పురాతన భవనం ..
ఆమె ఆసక్తి గా చూసింది ..
అదుగో .దూరం లో కనిపిస్తున్నదే .. అ దె రాణి మహల్ .. వణికిపోతూ చెప్పాడు రత్నం .
ఆమె పరీక్ష గా చూసింది అటువైపు .
ఆమె ని అడగకుండానే జీప్ ని వెనక్కి పోనిచ్చాడు రత్నం .
                                                ***********************************
భోజనాలు పూర్తయినాక తన  గది లోకి వెళ్లి అందరు నిద్రపోయేవరకు తానూ నిద్రపోయినట్లు నటించింది .
పల్లెటూరు కావటం తో 9 గం కొట్టేసరికి ఊరంతా నిశ్శబ్దం అయిపొయింది .. ఎక్కడో దూరం లో హృదయ విదారకం గా కుక్కలు అరుస్తున్నాయి .. వాటి అరుపులు తప్పితే ఏమి వినిపించడం లేదు .
11గం కొట్టేసరికి మెల్లిగా బెడ్ మీది నుంచి లేచి గదిలో ఉన్న కిటికీ తెరచి హాల్లోకి చూసింది రచన . అందరు నిద్రపోతున్నారు . ఇదే సరి ఐన సమయం ... అని గది  తలుపులు లోపలి నుంచి మూసి  గదంతా పరికించి చూసింది .. అ గదికి దక్షిణం గా ఉన్న కిటికీ తెరచి చూస్తే.. ఆవలి వైపు ఉన్న వీధి కనబడుతుంది .. కిటికీ తలుపులు తెరచి చూసింది ..  వీధి అంతా నిశ్శబ్దం గా ఉంది .. ..

ఆ కిటికీ కి   చువ్వలు లేకపోవటం తో నిశ్చింత గా ఊపిరి పీల్చుకుంది .. కిటికీ కి దగ్గ్గరలో బాత్రూం పైపు ఉండటం తో దాని సహాయం తో కిందికి దిగోచ్చని తలచి .. తనకి కావాల్సిన వస్తువులతో పాటు గన్ తీసుకుని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంది రచన .. మెడ చుట్టూ స్కార్ఫ్ చుట్టుకుని .. కిటికీ దగ్గరికి వచ్చి .. కిటికీ లోంచి సునాయాసం గా పైపుని అందుకుంది రచన .. పైపు ని సహాయం గా పట్టుకుని జర్రున జారింది
కొన్ని క్షణాల్లోనే రచన బంగ్లా వెనుకవైపున ఉన్న వీధి లోంచి మాయమయింది .

వీధుల్లో ఎవరు లేరు .. అందరు గాఢ  నిద్ర లో ఉన్నారు .. రచన మహల్ వైపు వడి వడిగా నడిచింది ..పొలాల మధ్యలోంచి వెళుతుంటే చల్లని గాలి మేను ని వణికిస్తుంది .. దూరం గ ఎక్కడో నక్క  వూల .. భయానకం గా .
దేనికి చలించకుండా మహల్ దగ్గరికి చేరుకుంది రచన ..

ఆ చీకట్లో ఏ మూలనుంచి వస్తుందో తెలియదు గాని ఓ రక మైన వెలుగు ఆ మహల్ మీద పడటం తో వింతగా మెరుస్తుంది .. దాదాపు శిథిలావస్థ లో కొన్ని గోడల మీద పెరిగిపోయిన పిచ్చిమొక్కలతో జడల దెయ్యం లా ఉంది ..
మహల్ దగ్గరకి వచ్చేసరికి ఆమె పాదాలు వేగాన్నితగ్గించాయి .. పరిశీలన గ చుట్టూ పరికించి చూసాక ముందుకు నడిచింది . మహల్ ముందు ఉన్న గేటు బలహీనం గా ఉంది .. మెల్లిగా దానిని ముందుకి తోసింది .. కిర్ర్ మంటూ అది చేసిన శబ్దం కూడా కర్ణ కటోరం గా తోచింది రచన కి .

మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకి నడిచింది ..
విశాల మైన ప్రాంగణం లో మహల్ లోనికి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి ..  చాలా పెద్దగ గొప్ప నైపుణ్యం తో నిర్మించిన ఆ మెట్లు సరాసరి సింహద్వారానికి తీసుకేల్తాయి ..
ఉత్సుకత తో మెట్లన్నీ ఎక్కి సింహద్వారాన్ని చేరుకుంది రచన ..
చేతిలో ఉన్న టార్చ్ తో ఆ ద్వారాన్ని చూసింది తలుపులు వేసి తాళం వేసి ఉంది ..
అయ్యో ..లొపలికి ఎలా వెళ్ళటం ..తాళం వేసి ఉంది .. ఇంత  పెద్ద తాళాన్ని ఏ రాతితో కూడా బద్దలుకొట్టడం కష్టం ... మరి మహల్ లోకి ఎలా వెళ్ళటం ? అని చుట్టూ చూసింది .. ఎత్తైన స్తంభాలతో వరండాల ఉన్న ఆ ప్రాంగణం లో నడుస్తూ ఉంటె భవనం వెనక్కి చేరుకోవోచ్చు .. క్షణం ఆలస్యం చేయకుండా ముందుకి నడిచింది రచన .
భవనం వెనుక వైపు పాత తటాకం ఉంది .. నీళ్ళు మాత్రం లేవు .. వెనుక వైపు ఉన్న అన్ని ద్వారాలు కూడా మూసి ఉన్నాయి .. ఆమె లోపలి వెళ్ళే  అన్వేషిస్తూ ముందుకి  నడుస్తున్న ఆమె  కి   ఏదో సవ్వడి  వినిపించింది .
ఆగి   రిక్కించి విన్నదామే .. మెత్తని అడుగుల  సవ్వడి ..
ఆమె  వెంటనే జేబులో ఉన్న గన్ పై వేసి వెనక్కి తిరిగింది .. ఓ క్షణం ఆమె విస్తుపోయింది ఆ దృశ్యం చూసి ...
ఆమె వైపు రెండు కా 0తి  వలయాలు శర  వేగం తో దూసుకు వస్తున్నాయి ... ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది






వెంటనే ఆమె  అక్కడ  నుంచి కిందికి దుమికింది .. ఎత్తు  ఉన్నప్పటికీ ఆమె కింద పడటం తో  ఆమె మోచేయి 
రగిడి రక్తం కారసాగింది .. లేచి నిలబడి మల్లి వరండా వైపు చూసింది .. అక్కడంతా   సాధారణం గా ఉంది .. మోచేయి రక్తం కారడం తో మెడకి ఉన్న స్కార్ఫ్ ని తొలగించి మోచేయికి కట్టు కట్టింది .. మెల్లగా ముందు కి నడిచిన ఆమె కి ఒక్కసారిగా దుమ్మురేగటం తో తన కళ్ళకు అడ్డం గా రెండు చేతులు పెట్టింది ... ఆకాశం అరుణ వర్ణం లోకి మారుతోంది .. మేఘాలు వడివడిగా సాగిపోతున్నాయి .. కళ్ళు తెరిచి చూసింది రచన .. 

మెల్లిగా భవనం ముందు వైపుకి వచ్చింది రచన .. వాతావరణం లో మార్పు స్పష్టం గా అర్థమవుతున్దామే కి .. 
ఏమిటిదంతా .. ఆమె క ళ్ళ ముందు జరుగుతున్నదాన్ని మౌనం గా అంగీకరించింది .. ఆ పరిస్తితు లని ముందుగా ఊహించినట్లు .. 
                                                                                              (ఇంకా ఉంది )








Thursday 21 November 2013

రుధిర సౌధం6


                                 రుధిర సౌధం
                                                            (20 వ తేది తరువాయి భాగం )


             
వెంగమ్మ మౌనం గా రచన లగేజ్ ని మేడ మీదికి తీసుకువెళ్ళింది .. రచన నుంచి వెంగమ్మ ప్రతీ పని మౌనం గానే చేస్తుండటం ఆశ్చర్య పరిచింది రచన ని ..
కింది గది వేసి బయటకు వస్తుండగా రత్నరాజు ఎదురుపడ్డాడు .
ధాత్రీ .. నాన్నగారు అలా మాట్లాడినందుకు బాధ పడ్డావ .. అన్నాడు కాస్త  దీనం గా మొహం పెట్టి ..
లేదు .. సూటిగా మాట్లాడేవారు నాకు నచ్చుతారు .. భూపతి గారు నాకు బాగా నచ్చారు .. అంది రచన  చిరునవ్వుతో ..
నిజం గానా .. ? మరి నేనూ ? అన్నాడు రత్నరాజు చిన్న పిల్లాడి లా ..
హ్మ్ .. నువ్వు కూడా .. అంది  రచన .. కాస్త ఇబ్బంది గా .
అవునా .. సరే .. ముందు నీకు పై గది చూపిస్తాను రా .. నీ సామానంతా వెంగమ్మ పెట్టేసింది .. అన్నాడు రత్నరాజు..
 మెట్లు ఎక్కుతూ .. ఈ వెంగమ్మ మూ గదా .. ? అడిగింది రచన .
లేదు .. తను మాట్లాడదు అంతే .. అన్నాడు రత్నరాజు ..
మాట్లాడదా ? అదేంటి ? ఎందుకు ? అంది రచన ..
అదంతే .. ఐన ఇన్ని ప్రశ్నలా ? నేను ఉపిరి తీసుకోవోద్దా ... అని  ఓ గది ముందు ఆగి .. ఇదే ఇక పై నీ గది .. అన్నాడు రత్నరాజు ..
గది తలుపులు తీసి లోపలి వెళ్ళారు ..
వెంగమ్మ  గదంతా చిమ్ముతుంది ..
చిమ్మటం ఐపోతే .. నువ్వింకా వెళ్ళు వెంగమ్మ .. అన్నాడు రత్నరాజు ..
ఆమె అతడిని కాల్చేసేలా చూసి చీపురు పట్టుకుని బయటికి వెళ్లి పోయింది ..
ఆమె చూపు గమనించిన రచన .. ఈ వెంగమ్మ   కూడా వింతగా ప్రవర్తిస్తుందే .. అనుకుని .. క్రీగంట రత్నరాజు ని గమనించింది .. అతడామె ని చూపులతోనే సోదా చేస్తున్నాడు ..
ఏంటో .. వీడి పిచ్చి వదిలించే రోజు దగ్గరలోనే ఉందని పిస్తుంది .. అనుకోని ... గది బావుంది .. విశాలం గా . .అంది అతని చూపుల్ని తప్పించుకోవటానికి .
నీకు నచ్చితే సరే .. . అన్నట్లు ఈ జీన్స్ లో నువ్వు చాల బావున్నావు ధాత్రి .. అన్నాడు రత్నరాజు
అవునా? ఐతే థాంక్స్ .. కాని నా అభి రుచులే నీకు నచ్చక పోవొచ్చు అంది రచన .
అదేంటి? నచ్చుతాయి ... నువ్వు చెప్పి చూడు .. అన్నాడు రత్నం .
నేను చెబితే ..నచ్చక పొఇనా నువ్ నచ్చాయని చెప్పేస్తే .. నేనే తెలుసుకోవాలి .. దేనికైనా కొంచెం సమయం కావాలి కదా .. అంది గారం గా .
ఆమె ని అర్థం చేసుకున్నట్లు గా సరే .. అన్నాడు సిగ్గు పడుతూ రత్నం .




వీడి సిగ్గు మండిపోనూ .. అనుకోని గదంతా కలయ చూసింది ..  తూర్పున ఉన్న కిటికీ వైపు ఆమె ద్రుష్టి నిలిచి పోయింది ..
అన్ని కిటికీలు తెరిచి ఉన్నాయి .. కాని ఈ కిటికీ ఎందుకలా మేకులు కొట్టి మూసేశారు .. అడిగింది ఆ కిటికీ దగ్గర కి వెళ్తూ రచన ..
ఓ .. అదా .. ధాత్రీ .. దాన్ని అలానే ఉండ నీ .. తెరవ టానికి ప్రయత్నించకు .. అన్నాడు రత్నరాజు ..
కిటికీ వైపు నిశితం గా చూ స్తున్నదల్లా ..ఒక్కసా రిగ.. రత్నం వైపు తిరిగి ..ఎన్దుకని అంది రచన ..
ధాత్రి .. ఆ కిటికీ ఓపెన్ చేస్తే ..ఎదురుగా రాణీ మహల్ కనబడుతుంది .. అది అంత మంచిది కాదు .. అన్నాడు రత్నం ..
రాణి మహల్ ... ? ప్రశ్నార్థకం గా చూసింది    రచన .
హా .. నీకు చెప్పకూ డ దనే   అనుకున్నాను .. కానీ చెప్పక తప్పేలా లేదు .. అది   రాజుల కాలం నాటి కోట .. కానీ ఇప్పుడు ఆ కోట లో ఎవరు లేరు .. ఊరిలో అంతా దానికి దెయ్యాల కోట అని పేరు పెట్టారు . అందులో దెయ్యాలున్నాయని నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను .. అన్నాడు రత్నం రాజు .
ఓ .. అదా విషయం .. చాల ఆసక్తికరం గాఉం ది .. అని అందుకేనా ? ఇంతకు ముందు మీ  నాన్నగారు కూడా ఆ రాణి మహల్   గురించి మాట్లాడారు  అంది రచన .
హా .. ఆ రాణి మహల్ కోసం ఏదో పరిశోదించాలని వచ్చిన వారంతా మృత్యువాత పడ్డారు .. కొన్నినెలల ముందే ఓ పోలీసాఫీసర్ వచ్చాడు .. చనిపోయాడు .. అదీ అతి భయంకరం గా .. ముఖం లో భయాన్ని ప్రస్ఫుటం గా తెలియజేస్తూ చెప్పాడు రత్నం ..
అంటే దెయ్యం అతనిని చంపిందని నమ్ముతున్నారా ? అతని ముఖ కవలికలని గమనిస్తూ అందామె .
అవును .. నువ్వు అలా ఆ మహల్ కోసమే వచ్చవేమో నని నాన్న గారి అనుమానం .. అన్నాడు రత్నం .
నీకు  లేదా ? అంది రచన .
లేదు ..కొమ్పదీసి నాన్న గారి అనుమానం నిజమా ?  భీతి గా అన్నాడు ..
చిన్నగా నవ్వి .. నన్ను నమ్మిన నువ్వే0 అనుకుంటున్నావో అదే నిజమనుకోవటం మంచిది అంది రచన..
అలా ఐతే ఫర్వాలేదు .. నిశ్చింత గా ఊపిరి పీల్చుకున్నాడు రత్నం .
రాజూ .. నేను మిమ్మల్ని ఇలా పిలవొచ్చు గా .. అంది కాస్త సందేహం గా ..
 నువ్వెలా పిల్చినా పలికేస్తాను ధాత్రి .. అన్నాడు తన్మయం గా రత్నం
 నేనోసారి ఊ రుచూడాలీ .. అంది  రచన
చూపిస్తాను  నువ్వెప్పుడు అంటే అప్పుడే అన్నాడు రత్నం రాజు ..
ఇప్పుడు కాదు సాయంత్రం .. అలా షికారుకి వెళ్దాం .. సరేనా అంది రచన .
ఓ .. నేను రెడీ .. అన్నాడు రత్నం .
థాంక్స్ .. నేనే రెడీ  అయాక చెబుతాను .. ఇప్పుడైతే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను ..ప్రయాన బడలిక ఇంకా తీరనే లేదు .. అంది రచన .
సరే సరే .. నేనిక కిందికి వెళతాను .. నువ్వు విశ్రాంతి తీసుకో .. అని రత్నం వెళ్ళగానే తలుపులు మూసి కిటికీ వంక చూసి .. దగ్గరగా నడిచింది .. కిటికీని ఎవరు తెరవ కుండా మేకులు కొట్టి ఉంచారు . ఈ కిటికీ తెరిస్తే రాణి మహల్ కనబడుతుంది .. కిటికీ తెరవాలి ..కాని ఎలా?.. ఇది సమయం కాదు .. ముందు లాప్టాప్ లో మొత్తం నోట్ చేయాలి అని బాగ్ లోంచి లాప్ టాప్ తీసి కొన్ని విషయాల్ని నోట్ చేసింది .. ఆ పని పూర్తయ్యాక మనసులో  "రాణి మహల్ ... నా టాస్క్ .. ఆ రహస్యం ముళ్ళు విప్పటానికి .. వచ్చిన వారంతా చనిపోయారు ..  నిజాలు బయట పడలేదు .. ఈ వూరు రావటమే   ప్రాణా 0 తక మని ఎవ్వరు ఈ వూరు రారు .. చాలా మంది వలస పోయారు .. ప్రభుత్వ సదుపాయాలు లేవు .. బాహ్య ప్రపంచం ఈ ఊరిని దాదాపు మరచిపోయింది .. దీనంతటికి కారణ మైతే .. ఓ ఆత్మా ? కాదు మరేదో ఉంది .. ఆ మరేదో ..ఏంటో కనిపెట్టాలి .. ముందు ఆ రాణి మహల్ ని చూడాలి .. ఆణువణువూ చూడాలి .. దీనంత టికి కారణం దెయ్యమో ..లెక ప్రజల భయమో .. హత్యలు ఎలా జరిగాయి ? ఎందుకు ? ఇందులో ఎవరి హస్తమైనా ఉందా / ఈ ప్రశ్న లన్నింటికి సమాధానాలు వెతకాలి .. అనుకుంటూ మంచం మీద వాలింది .. అలసిన మేను ని నిద్ర ఆవహించింది
                                             ****************************************
సాయంత్రమయ్యేసరికి తలుపులు బాది మరీ టీ తెచ్చి ఇచ్చింది వెంగమ్మ ..
టీ తాగుతూ అక్కడే ఉన్న స్టడీ టేబుల్ మీద కూ ర్చుని టేబుల్ పై మెనూ ని వాల్చి ఫోన్ ఓపెన్ చేసి గిరిజ ఫోటో చూస్తూ అనుకుంది రచన .. అమ్మా .. ఎంత కంగారు పడుతున్నవో నాకోసం .. ఇక్కడ సిగ్నల్స్ లేవు పోనీ నీతో
మాట్లాడదాం అన్నా .. నాకోసం భయపడకమ్మా .. స్వామీజీ నీకు ధైర్యం చెబుతారనే అనుకుంటున్నాను .. నేను ఇక్కడ నా ఆత్మ విశ్వాసానికి పరీక్ష పెట్టుకున్నానమ్మ .. గెలవాలని ఆశీర్వదించు ..

                                                                                                                     (ఇంకా ఉంది )









Wednesday 20 November 2013

రుధిర సౌధం 5



రుధిర సౌధం  
(19 తేది  భాగం  )


50 ఏళ్ళ వ్యక్తి ఠీ వి గా లోపలికి నడచి వచ్చి కూర్చున్నాడు అక్కడ ఉన్న సోఫా లో ..
వెంగమ్మ మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది . తాగి నీళ్ళ గ్లాస్ టీ పయ్ మీద పెట్టాడు .
ఇంతలో అయ్య   గారు.. మీతో ఒక మాట చెప్పాలండి .. అంటూ ముందుకు వచ్చాడు గుమస్తా శంకరం .
ఏమిటన్నట్లు కళ్ళు ఎగరేసి నొసలు చిట్లించి  చూసాదతను ..
అదీ .. అబ్బాయి గారు .. ఇంతకూ ముందే ఎవరో పట్నం అమ్మాయి ని వెంటేసుకు వచ్చారండి .. మెల్లి గ నసిగాడు .
అమ్మాయా ? ఏకం గా ఇంటికే తెచ్చాడా ? గంభీరం గా  పలికింది అతని స్వరం ..
ఎవరో ... ఈ ప్రాంతం అమ్మాయి లా లేదు .. బాగా చదువుకున్న అమ్మాయి లా తోచింది .. అబ్బాయి గారు వివరాలెం చెప్పలేదు . అన్నాడు శంకరం .
రత్నం ... గట్టిగా అరిచాడు.. అతడు
పరుగున వచ్చాడు రత్నరాజు .. నాన్న గారూ .. అంటూ .
ఎవరా అమ్మాయి ? గద్దించాడు అతడు
ఎవరు ? ఓ .. ఆ  అమ్మాయా ? ధాత్రి .. పేపర్ ఆఫీసు లో పనిచేస్తుంది అంట .. రామంత పురం లో కనిపించింది . మన వూరి గురించి రాయటానికి వచ్చిందట .. ఈ వూరు ఎవరొచ్చినా ఆతిధ్యం మనింట్లోనే కదా అని ఇంటి కి తీసుకొచ్చాను నాన్నగారూ .. వినయం గా జవాబు చెప్పాడు రత్నం
పేపర్ అమ్మాయా ? మన వూరి గురించి రాస్తుందా ? ఆశ్చర్యం గా అడిగాడు అతడు ..
అవును నాన్నగారు .. నాతో  చెప్పింది .. అన్నాడు రత్నం ..
వెంగమ్మ .. ఆ అమ్మాయి తో నేను మాట్లాడాలి .. గర్జించింది అతని స్వరం ..
ఏ మూల ఉందో వెంగమ్మ పరుగున రచన గది తలుపు కొట్టింది ..
స్నానం ముగించుకొని ఫ్రెష్ అయిన రచన .. మెల్లిగా తలుపు తీసింది ..
ఎదురుగా ఉన్న వెంగమ్మ ని చూసి .. ఏమిటన్నట్లు చూసింది రచన ..
ఏమి మాట్లాడకుండా .. పక్కకి తప్పుకుని హాల్ వైపు కళ్ళు తిప్పింది వెంగమ్మ ..
ఆమె ఉద్దేశ్యం అర్థమైనట్లు .. హాల్ వైపు చూసింది రచన .. హాల్ లో ఉన్న సోఫా లో కుర్చుని ఉన్న ఓ ముసలాయన .. ఎదురుగా గుమస్తా శంకరం ,రత్నం .
రత్నం హాల్ లోకి రామ్మన్నట్లు గ కనుసైగ చేసాడు ..
బహుసా ఇతడు .. జమిందారు కావొచ్చు .. అనుకుని ముందుకి నడిచి హాల్ లోకి నడిచింది ..
నాన్న గారూ .. ..  ఆ  అమ్మాయి  ధాత్రి .. అన్నాడు రత్నం ..
రచన వైపు చూపు మరల్చాడత ను ..
రచన చిరునవ్వుతో నమస్కరించింది ..  నఖసిఖపర్యంతం అతడు రచన వంక చూసాడు ..
ధాత్రీ .. మా నాన్న గారు ..భూపతిగారు .. చెప్పాడు  రత్నం ..
మీది ఏ ఊరు తల్లీ .. అడిగాడు గంభీరం గ భూపతి ..
ముంబై .. చెప్పింది రచన ..
ఏ పేపర్ లో పనిచేస్తున్నావు ? అనుమానం  గా అడిగాడు ..
తడుముకోకుండా" హిందూ"" అని చెప్పింది రచన .
మా వూరి కోసం పేపర్ లో రాయటానికి ఏముంది ?అని అడిగాడు   నిలదీస్తున్నట్లు గా భూపతి .
ఈ  ఊ రికి పెద్దవారు .. ఏమి లేదని  ఎలా  అంటున్నారు ? ఈ యోడా ఊరిలో ఎటువంటి సదుపాయాలూ లేవు .. రోడ్స్ లేవు .. నీళ్ళు లేవు .. రవాణా సౌకర్యాలు లేవు .. ప్రభుత్వానికి తెలియొద్దా ? అంది రచన .
ఆ విషయాలు అన్ని ప్రభుత్వానికి తెలియనివి కావు .. ఎవరు రాసిన ఈ గ్రామానికి ఏ సదుపాయాలూ రావు .. ఈ గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ ,ఒక జర్నలిస్ట్ ..ఇలా ఎవరు వచ్చినా ఒకందుకే వస్తారు .. అది ఆ రాణి మహల్ గురించి .. తెలివి గా సమాధానం చెప్పానని అనుకుంటున్నా వేమొ .. నీ వయసు నా అనుభవమంతా ఉండదు .. అన్నాడు భూపతి .
అతని వైపు చురుగ్గా చూసింది రచన ..
కారణ మేదైనా .. మా  వూరు వచ్చావు .. ఉన్నంత కాలం మా ఇంట్లోనే ఉండొచ్చు .. అని వెంగా .. అని వెంగమ్మ వైపు చూసి ఈ అమ్మాయి కి మే డ  మీది గది ఇవ్వు .. అన్నాడు
ఫర్వాలేదు .. కింది గది బాగానే ఉంది అంది రచన ..
ఆ గది తలుపు కి ఘడియ లేదు .. అన్నాడు కొడుకు వంక కాసింత కన్నెర్ర చేసి చూస్తూ ..
చిన్న గా నవ్వి థాంక్స్ .. అంది రచన
చూడు అమ్మాయి .. ఈ వూరు వచ్చావు బాగానే ఉంది ..  తిరిగి క్షేమం గా వెళ్లాలని దేవుని ప్రార్థించు .. అన్నాడు భూపతి
నేను తిరిగి క్షేమం గానే వెళ్తాను భూపతి గారు    ... అందులో నాకే అనుమానము లేదు స్థిరం గ అని అక్కడ నుంచి కదిలింది రచన
                                                   ****************************




అయ్యా .. పిలిచారా ? అంటూ వచ్చాడు బలిష్టం గా ఉన్న ఓ వ్య్కక్తి భూపతి వద్దకి .. 
బాలయ్య .. గమనించే ఉంటావు ..చిన బాబు ఒకామ్మాయి ని పట్టు కొచ్చాడు కదా .. నువ్వు ఆ అమ్మాయి ని ఓ కంట కనిపెట్టాలి .. గంభీరం గా అన్నాడు భూపతి . 
అలాగే అయ్యా .. అన్నాడు బాలయ్య .. 
నువ్వు ఆ అమ్మాయిని గమనిస్తున్నట్లు ఆ అమ్మాయి కి ఏ మాత్రం అనుమానం రాకూడదు బాలయ్య .. అన్నాడు భూపతి . 
అలాగే నయ్య .. అని  అక్కడి నుంచి నిష్క్రమించాడు బాలయ్య . 
బాలయ్య వెళ్ళాక ..గుమస్తని పిలిచి శంకర్ ... చినబాబు ఓ కంట కనిపెట్టుకుని ఉండు .. ఏ తప్పు జరగ కూడదు 
అన్నాడు భూపతి . 
కష్టమయ్య .. చినబాబు ని చూస్తుంటే పూర్తిగా ఆ పిల్ల మాయ లో ఉన్నట్లు అనిపిస్తున్దయ్యా .. అన్నాడు శంకర్ 
ఆ పిల్ల తెలివైంది .. చాలా తెలివైంది .. తెలియకూడా నివి తెలుస్తాయేమో .. సాలోచన గా అన్నాడు భూపతి . 
తెలుసుకోన్నవాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు కదయ్యా అన్నాడు శంకర్ . 
చిన్నగా తల పంకించాడు భూపతి 

                                                                     ******************
                                                                                                                                     (ఇంకా ఉంది )


Tuesday 19 November 2013

రుధిర సౌధం 4

                                                          రుధిర సౌధం 
                                                                   (18 తేది తరువాయి భాగం )
                 
           స్వామీజీ ... ఎక్కడున్నారు ? నేనాయనను వెంటనే కలవాలి....  కలవాలి ... ఆందోళన గా అం ది రచన తల్లి గిరిజ .
స్వామీజీ .. ఆ  పశ్చిమాన ఉన్న గుట్ట మీద ధ్యానం లో ఉన్నరమ్మా ... ఆ గుట్ట వైపు చేయి చూపుతూ చెప్పాడా శిష్యుడు .
కంగారు గ అటు పరుగులు పెట్టింది గిరిజ .

గుట్ట మీద ధ్యానం లో నిమగ్నమైన స్వామీజీ గిరిజ రాకని మనసులోనే గుర్తించి కనులు తెరిచారు ..
స్వామీ .. స్వామీ .. అంటూ పరుగున వచ్చింది గిరిజ ..
కలత చెందకు బిడ్డా ... రా.. ఇలా వచ్చి కూర్చో .. అన్నారు ప్రశాంతం  గా ..
స్వామీజీ ఎదుట కుర్చుని ఎలా స్వామీ .. మనసుకి కుదురు లేదు .. చాల కలవరం గా వున్నది స్వామీ .. అంది గిరిజ కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీటిని అణచిపెడుతూ ..
అమ్మా .. గిరిజా .. నీ కలవరానికి కారణం.. రాత్రి వచ్చిన పీడ  కల ... అవునా? అన్నారు కళ్ళు మూసుకుని .
స్వామీ .. సర్వం తెలిసిన వారు మీరు .. కాని రచన ని ఎందుకు ఆ ఊరికి వెళ్ళమన్నారు స్వామీ ??   అంది బాధ గా ..

       రచన కన్నతల్లి గా నీ భయం సమంజసమే తల్లీ .. కానీ .. విధి రాత ని ఎవరు మార్చలేం కాదా... అన్నాడాయన .
స్వామీ .. రచన కేమన్న జరిగితే ఇంక నాకు క్షమా రహత ఉండదు స్వామీ .. అంది గిరిజ .
తల్లీ .. రచన కారణ జన్మురాలు ... తనకోసం మిగిలి ఉన్న పని ని గుర్తించి జన్మించినది .. రచన ఎవరో .. నీకు ఇది వరకే చెప్పాను కదా ... అన్నారు స్వామీజీ
స్వామీ గతాన్ని మరచి జీవిస్తున్నాం .. ఆస్తులు అక్కర్లేదు .. భవంతులు అక్కర్లేదనుకుని ఇక్కడ బ్రతుకుతున్నాం .. కాని గతం నీడ లా వెంట వస్తున్నదనుకోలేదు స్వామీ .. రచన కి ఎంతగానో చెప్పను వెళ్ళవద్దని .. కానీ మీరిలా వేల్లమన్నారని తెలియగానే అయిష్టం గానే ఒప్పుకోవాల్సి వచ్చింది .. కాని నా కల నన్ను హెచ్చరిస్తున్నది స్వామీ .. అంది గిరిజ
      భయపడకు తల్లీ .. రచన కి అక్కడకి వెళ్ళటం తప్పనిసరి .. రచన కి తెలియని నిజాలని నువ్వనుకుంటున్నావు .. కాని అవి ఆమె   జన్మ రహస్యాలు .. తెలుసుకోకుండా ఉండటం జరగని పని తల్లీ .. రచన తనని తను కనుగొనే సమయం ఆసన్నమయింది .. ఇది పరీక్షా సమయమే ఆమె కి . సమస్యలు చుట్టూ ముట్టక తప్పదు .. కాని సంకల్ప బలం ముందు ఎటువంటి శక్తి ఐన వోడిపోక తప్పదు .. రచన తననుకున్నది సాధించి వస్తుంది .. అది తథ్యం .. అని తిరిగి కళ్ళు ముసుకున్నాడాయన .

మెల్లిగా లేచి కళ్ళు తుడుచుకుని స్వామీజీ కి నమస్కరించి .. వెనుదిరిగింది గిరిజ .
                                          ***********************************

            జీప్ మెల్లిగా ఓ భవన్తి ముందు ఆగింది .. కొంచెం పురాతన మైనదే అయినా రంగులు వేసి ఉండటం వలన
అందం గా కనిపిస్తుంది .భవంతి ముందు చాల ఖాళి స్థలం ఉంది ..
           ఇదే మా ఇల్లు .. కాసింత గర్వం గా అన్నాడు రత్నరాజు .. దిగండి అని జీపు లో ఉన్న  లగేజ్ ని తీయమని అక్కడే ఉన్న పనివాడిని కనుసైగ తో చెప్పాడు .

          రచన జీప్ దిగి .. చాల బావుంది .. అంది హుషారు గా .
లోపలి కి పదండి .. అని దారి తీసాడు రత్నం . రచన అతడిని అనుసరించింది ..
విశాల మైన హాల్ .. గోడలకు పురాతన మైన పెయింటింగ్స్ .. రిచ్నెస్స్ ఉట్టి పడే ఫర్నిచేర్ ... హాల్ లో మధ్య లో మొదటి అంతస్తు కి వెళ్ళటానికి మెట్లు .. అన్నీ గమనిస్తూ ఉన్న రచన ని చూసి ..
ధాత్రీ... నాన్న గారు బయటకి వేల్లినట్లున్నారు .. ఈ ఊరికి ఎవరు కొత్త గా వచ్చినా సరే ఆతిథ్యం మా ఇంట్లోనే ..
 చేసి ఫ్రెష్ ఆవు .. ఈలోపు నాన్న గారు వచ్చేస్తారు.. అన్నాడు రత్నరాజు .
అలాగే నన్నట్లు తల ఊపిన్ది రచన .
వెంగా .. అమ్మగార్ని ఆ పక్క గది చూపించు .. లగేజ్ కూ డా లోపల పెట్టించు .. అని అక్కడే ఉండి గమనిస్తున్న
ఒకామె తో చెప్పాడు ..
ఆమె నిశ్శబ్దం గా ఆ గది వైపు నడిచింది ..
రచన ఆమె ని అనుసరించింది ...
ఆమె వెళ్ళాక .. కుందనపు బొమ్మ లా ఉంది .. అదృష్టం తానై వరించినట్లు నా చేత చిక్కింది .. ఎక్కడకి పోతుంది .. వేటగాడికి విందు దొరికింది ..  అనుకున్నాడు మనసులో రత్నరాజు .

 గది చూపించి ,లగేజ్ లోపల పెట్టి   వెళ్ళిపోయింది వెంగమ్మ
గదంతా కలయ తిరిగి చూసింది .. విశాలం గా ఉన్న ఆ గది లో పాత కాలం నాటి పట్టే మంచం .. ఓ పక్క గా నిలువుటద్దం .. ఓ మూలగా స్నానాల గది ..

ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి .. చాల విసుగ్గా ఉంది ప్రయాణం .. తర్వాత ఈ రోజు నుంచే నా ప్రయత్నం మొదలుపెట్టాలి అనుకుని సూట్ కేస్ తెరిచి బట్టలు తీసుకుని  స్నానానికి వెళ్ళింది రచన

(ఇంకా ఉంది )







Monday 18 November 2013

రుధిర సౌధం 3

                                                             రుధిర సౌధం
                                                            (15 వ తేది తరువాయి భాగం)


రామనంతపురం....

బస్సు కిటికీ లోంచి కనిపిస్తున్న బోర్డు చూసి కూర్చున్న సీట్ లోంచి లేచి నిలుచుంది రచన . ఇక్కడ దిగుతారా బస్సు డోర్ వద్ద నిలబడ్డ వ్యక్తీ రచన ని చూసి అడిగాడు ..
హా .. అని తను డోర్ వైపు నడిచింది ..
 ఏ వూరు పోవాలె ... ? అడిగాడతను రచన వంక కొంత  చూస్తూ ...
రావనపురం .. అంది అతడి వైపు కొంత తమాషా గ చూస్తూ ..
రావనపురమా ? అతడు ఉలిక్కిపడ్డాడు ...
అక్కడకి వెళ్ళాలంటే ఇక్కడే దిగాలి కదా ... అంది రచన ..
అతడింకా ఆమెను విచిత్రం గా చూస్తూనే .. హా హా .. ఇక్కడే .. అని ఓ విజిల్ వేసాడు ... బస్సు ఆగింది ..
రచన కిందకి దిగింది .. లగేజ్ దించడం లో సాయం చేసాడతను .. చుట్టూ పరికించి చూసింది .. కొంచెం దూరం లో ఓ మట్టి రోడ్ కనబడింది ..
ఆమె అలా చూడటం చూసిన అతడు ... ఆ మట్టి రోడ్ లోనే పోవాలె ... బళ్ళు ఏమి ఉండవు .. అప్పుడప్పుడు ఎద్దుల బళ్ళు తిరుగుతాయి .. ఇంత లగేజ్ ఉంది కనుక ఆ బండి కోసమే ఎదురు చూడాలి .. అన్నాడు .
అతనికి థాంక్స్ చెప్పి లగేజ్ ని ఈడ్చుకుంటూ ఆ మట్టి రోడ్ దగ్గర కనిపిస్తున్న చిన్న బడ్డీ  నడిచింది రచన .
బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్లి పోయింది .

ఆ బడ్డి ముందున్న పాత కర్ర బెంచీ మీద కూల బడింది రచన .
సోడా తా గుతవమ్మా .. అడిగాడు బడ్డి వాడు .. ఆ .. ఇవ్వు తాతా .. అంది రచన ...
అతడు ఓ పిక్క సోడా కొట్టి ఇచ్చాడు .. పైన ఎండా మండి పోతుండటం తో గట గటా తాగేసింది రచన ..
ఎక్కడకి వెళ్ళాలమ్మ .. ? అడిగాడు ..
 తాతా... రావణ పురం వెళ్ళాలి .. ఏవో ఎద్దుల బళ్ళు వస్తాయట గా .. ఎప్పుడు వస్తాయి .. అడిగింది రచన ..
అక్కడికా ? పసిపిల్ల వి . ఆ ఊర్లో నీకు పనేమిటి తల్లీ .. అతడి మాటల్లో కంగారు ధ్వనిస్తుంది .
ఆ .. అదీ .. ఓ పేపర్ ఆఫీసు లో పని చేస్తున్న తాతా .. ఈ ఊల్లొ ఏ సదుపాయాలూ లేవట గా .. ప్రభుత్వానికి తెలియజేద్దామని .. అంది రచన .
అతడు .. కాస్త ఆలోచించి .. ఎవరో ఈ వూరు గురించి తెలియని వాళ్ళు ఈ ఊరికి వస్తారేమో గాని తెలిసిన వాళ్ళు రారమ్మ . . ప్రమాదం పొంచి ఉంది .. తిరిగి వెళ్లి పొమ్మా .. అన్నాడతను ..
ఆమె చిన్నగా నవ్వి .. బళ్ళు ఎప్పుడు వస్తాయి తాతా .. అంది .
వినవని అర్థమైంది .. వివరం గా  చెబుతాను విను .. నువ్వు పేపర్ ఆఫీసు లో పని జేస్తున్ననన్నావు .. ఇంతకూ ముందు నీలానే ఓ పోలీసోడు వచ్చిండు .. ప్రాణాలతో తిరిగిపోలె .. అందుకనే చెబుతుండా బిడ్డా .. అన్నాడు తాత .
ఉ  .. అని మెల్లిగా తలాడించింది రచన .. ఇంతలో ఏదో వెహికల్ సౌండ్ వినబడి వెనక్కి చూసింది .. పాత కాలం నాటి జీప్ అది .. ఆ మట్టి రోడ్ వైపే టర్న్ తిరిగింది .. తాత లోపలికి వెహికల్స్ ఏవి పోవని చెప్పారు . మరి అది ఎవరిదీ అని అడిగింది  ...
అతడు తొంగి చూసి,  జమీందారు కొడుకు .. రత్నం గారిది .. అన్నాడు .
ఓహ్ .అ ని.. ఆ వెహికల్ వేల్లిపోతోందని ..   హలో అని గట్టిగా అరచింది రచన ..
రచన ప్రయత్నం ఫలించింది .. వెహికల్ ఆగింది ...
అమ్మా .. అతనితో వెళ్తావ ? అతడంట మంచివాడు కాదు .. కంగారుగా అన్నాడు తాత .
ఫర్లేదు తాతా .. నేను చూసుకుంటాను అని లగేజ్ మోసుకుంటూ వెహికల్ వైపు నడిచింది .. నిస్సహాయం గా చూసాడు తాత .
ఆమె ని చూసి వెహికల్ మెల్లిగా వెనకకు వచ్చి ఆమె ముందు ఆగింది ..
డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తీ కి 30 ఏళ్ళు ఉంటాయి .. కొంచెం మోటు గా ఉన్న్న దర్జా వెలగబోస్తున్నాడు .
రచన వంక పరీక్షగా చూసాడు .. చూడగానే చూ పుతిప్పుకోలేని సౌందర్య రాసి ఆమె .. ఆమె అందానికి హతాసుడై అలానే చూస్తున్న అతదినుద్దేసించి .. మీరు రావనపురం వెళ్తున్నారా ? అంది రచన మోహనం గ నవ్వుతూ
అతడు మంత్రం వేసినట్టు తల ఊపాడు ..
లిఫ్ట్ ఇస్తారా ? నేను అక్కడికే వెళ్ళాలి .. అంది రచన ..
అవునా? ఎవరింటికి ? అడిగాడతను వెలిగిపోతున్న మొహం తొ..
జమీందారు గారి ఇంటికి .. అంది రచన చిరునవ్వుతో ..
అంటే .. మా ఇంటికే .. మీరు ? అన్నాడతను సందేహం గా .
మీరు జమీందారు గారి అబ్బాయా? అంది  రచన ..
అవును ..నా  పేరు రత్నరాజు .. అన్నాడు అతడు
ఓహ్ ..చాల బావున్నారు మీరు అంది రచన .. వెదక  బోయిన తీగె కాలికి తగలిందన్న సంతోషం లొ.
థాంక్స్ .. అన్నాడతను .. ఇంతకీ మీరెవరో చెప్పలేదు నాకు .. అన్నాడతను
మీరు లిఫ్ట్ ఇస్తే బండి లో కుర్చుని మాట్లాడుకోవోచ్చు అంది చిలిపి గా
హా హా .. రండి .. అన్నాడతను . లగేజ్ బ్యాక్ సీట్ లో పెట్టి డ్రైవింగ్ సీట్ పక్కన కుర్చుందామే .
తన పక్కనే కూర్చున్న ఆమె ని చుస్తే మతి పోయింది రత్నం కి .
తనని మింగేసేలా చూస్తున్న అతని చూపులకి కాస్త ఇబ్బంది పడినా అదేమీ మొహం లో కనబడనీయకుండా .. ఇక వెళదామా ? అంది రచన .
మీ పేరు .. అన్నాడతను .. వోరకంట రచన ని చూస్తూ ..
నా పేరు ధాత్రి .. హిందూ పేపర్ లో పని చేస్తున్నా .. అంది రచన
మీ అంత అందం గా ఉంది మీ పేరు కూడా .. అన్నాడు రత్నం ..
మురిపెం గా నవ్విన్దామె .




ఆమె నవ్వటం తో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు .. రత్నం
. ఇంతకీ మీకు మాతో పనేమిటి ? అన్నాడతను . 
గురుడు దారి లోకి వచ్చాడు ,.. ముందు ఈ రత్నం గాడ్ని నమ్మించాలి .. అప్పుడే వచ్చిన పని సులువవుతుంది .. అందులోను వెహికల్ ఉంది వీడి దగ్గర .. అనుకుంది మనసులో రచన 

 నేను పేపర్ లో పనిచేస్తున్నానని చెప్పాను కదా ... నేను ఈ వూరి గురించి చాల విన్నాను .. పేపర్ లో రాద్దామని .. అంది రచన ..  క్రీగంట అతనిని చూస్తూ . 
అంటే .. మా బంగ ళా గురించా ? కంగారు గ అడిగాడతను .. 
బంగ్లా ... ? ఏంటి ? దాని స్పెషల్ ? తెలియనట్లు అడిగిందామె ... 
అందమైన అమ్మాయి అడిగితె నా సర్వస్వం ఇచ్చేస్తాను ..  కాని ఆ బంగ్లా గురించి అడగకండి ? అన్నాడు రత్నం 
అయ్యో .. నేనైతే పల్లెల్లోని సంప్రదాయాలను ,పాత కట్టడాల గురించి, వాటి చరిత్రల గురించి పరిశోధన చేద్దామని వచ్చాను .. ఈ వూళ్ళో అంత  గొప్ప బంగ్లా ఉంటె నాకు కాస్త చెప్పరూ.. అంది రచన 
వద్దండి .. మీలాంటి సుకుమారి తెల్సుకోదగ్గ విషయం కాదు .. మీరెందుకు మా  ఊ రోచ్చినా  సరె.. నాకు మాత్రం మీరు నాకోసమే వచ్చారనిపిస్తుంది .. మీకే సహాయం కావాలన్న నేనున్నానని మర్చిపోకండి అన్నాడు 

"బంగ్లా కోసం ఎక్కువ మాట్లాడకూడదు " అనుకోని .. కాస్త సిగ్గు పడ్డట్లు నటించింది రచన . 
సుమారు 70 నిముషాలు గడిచాక ధాత్రి గారు .. మనం మరో 10 నిమిషాల్లో మా వూరు చేరుకోబోతున్నాం .. అన్నాడు రత్నం 
ఆమె అతని వంక చూసి .. చుట్టూ చూసింది .. చుట్టూ పొలాలు,గుట్టలు,పెద్ద పెద్ద వృక్షాలు తప్పితే ఏమీ లెవు.. మనుష్య సంచారం  అతి తక్కువ . 
""అతి తక్కువ టైం లోనే నేను నా గమ్యాన్ని చేరుకోబోతున్నాను ..ఎంతో  అప్రమత్తం గా ఉండాలి .. అనుక్షణం జాగ్రత్త గా ఉండాలి ... అనుకున్నది సాధించాలి ... మనసు లో స్థిరం గ అనుకుంది రచన 
                                                    ****************************

                                                                                                                        (ఇంకా ఉంది )