Powered By Blogger

Tuesday 4 March 2014

మల్లెల రాణి ,మంజుల వాణి .. నా అలివేణి ..


మల్లెల రాణి ,మంజుల వాణి .. నా అలివేణి .. నీవేని

తీయని కలని కాంచిన కనులని అలరించగ రా విరిబోణి ..

ఆశల పల్లకి ఎక్కమనీ అడిగిన నేను నీ బోయీ ని ..

ఊహల జగతిని ఏలమనీ కోరిన నే నీ దాసుడని ..

నాహృదయాన్ని కానుక సేయనీ .. ప్రతి ఉదయాన్ని నీకై రానీ .. మల్లెల 

చుక్కల సీమలో వెలిగే చంద్రుని నిను చూసి విలవిల లాడనీ ..

నా మది సీమలో కొలిచే దేవిని వలచిన వేళలో పున్నమి రానీ ..

వెన్నెల బొమ్మా .. విరికొమ్మా .. నీ మోమున సిగ్గే మెరిసేనమ్మ ..

ఓ చినుకమ్మా .. ఇది నా ప్రేమా ..  గొడుగై కాచి తోడవునమ్మా .. మల్ల్లెల


ఆమని ఋతువు లో తొలి గీతాన్ని  .. ఆలపించే కోయిల గానాన్ని  ..

ప్రేమను మధువు లో తీయదనాన్ని .. ఆస్వాదించే నీ అంతరంగాన్ని ..

వన్నెల రెమ్మా .. నే నచ్చానమ్మా .. ఓ లతలా నిను అల్లానమ్మా ..

ఓ చిలుకమ్మా .. నే వచ్చానమ్మా .. నీ గూటిలో చోటడిగానమ్మా .. మల్లెల

7 comments:

sukanya said...

beautiful...

you are too good in expressing your thoughts

gajula sridevi said...

చాల బాగుంది.

రాధిక said...

thank you sridevi gaaru

సతీష్ కొత్తూరి said...

కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉండి బ్లాగ్ లో సంచరించ లేదు రాధిక గారు. బాగుంది లైవ్ లీగా ఉంది. మల్లెపూలు ఘొల్లుమంటే... ప్రణయ మంజుల నాదమే మరి...

రాధిక said...

న్యవాదాలు సతీష్ గారూ .. నిజమే నండీ .. నేనూ ఈమధ్య బిజీ గా ఉండటం తో అతి తక్కువ సమయం మాత్రమె బ్లాగ్ కి కేటాయిస్తున్నాను . కానీ బ్లాగ్ కి వస్తున్న ఆదరణ మెల్లిగా నన్ను ఎక్కువ సమయం కేటాయించేలా చేస్తుంది ... పోనీ లెండి .. మళ్ళి బ్లాగ్ ప్రపంచం లో తీరిగ్గా విహరించండి

రాధిక said...

న్యవాదాలు సతీష్ గారూ .. నిజమే నండీ .. నేనూ ఈమధ్య బిజీ గా ఉండటం తో అతి తక్కువ సమయం మాత్రమె బ్లాగ్ కి కేటాయిస్తున్నాను . కానీ బ్లాగ్ కి వస్తున్న ఆదరణ మెల్లిగా నన్ను ఎక్కువ సమయం కేటాయించేలా చేస్తుంది ... పోనీ లెండి .. మళ్ళి బ్లాగ్ ప్రపంచం లో తీరిగ్గా విహరించండి

రాధిక said...
This comment has been removed by the author.