Powered By Blogger

Wednesday 19 February 2014

రుధిర సౌధం 79

 


కొంచెం ముందుకి అలా నడిచే సరికి సిగ్నల్ వచ్చింది  రచన సంతోషానికి అవధులు లేవు . వెంటనే గిరిజ నెంబర్

కి డయల్ చేసింది . అటువైపు గిరిజ ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ్మా... అంది ఆర్ద్రం గా రచన . 

రచన గొంతు వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లని పించింది గిరిజ కి .. రచనా .. నువ్వేనా .. తల్లీ .. అంది గద్గద 

స్వరం తో . 

ఎలా ఉన్నవమ్మా ? అంది రచన బాధ గా . 

అమ్మ నీకు ఇప్పుడు గుర్తు కొచ్చిందా ? చిరు కోపం గా అంది గిరిజ . 

అమ్మని ఎవరన్న మర్చిపోతారా ? అంది రచన . 

ఎలా ఉన్నావు ? ఎక్కడున్నావు ? ఏ ప్రమాదాల జోలికి పోవడం లేదుగా .. అంది గిరిజ ఆత్రం గా . 

 లేదమ్మా .. ఐన నేనేం ఇక్కడ ఒంటరిగా లేనుగా .. నాకు తోడుగా యశ్వంత్ ,మురారి ,శివ ,సత్య ఉన్నారు గా . 

ఐనా నేను వచ్చిన పని కూడా కొంత వరకు కొలిక్కి వచ్చినట్లే .. అంది రచన . 

నువ్వు సంతోషం గా ఉంటె నాకదే పెద్ద నిశ్చింత . .. అంది గిరిజ . 

స్వామీజీ ఎలా ఉన్నరమ్మా ?? అని అడిగింది రచన . 

బావున్నారు రచన .. నీ క్షేమం కోసం నాకన్నా ఎక్కువ గా ఆరాటపడతారు . అంది గిరిజ . 

నాకు తెలుసమ్మా .. నేను ఫోన్ చేసానని ఆయనకీ తెలియజేయు .. అంది రచన . 

రచనా .. మరో వారం లో అన్నయ్య అమెరికా నుండి వస్తున్నాడు .. ఫోన్ చేసాడు .. అంది గిరిజ . 

నిజమా ? నాకు చాలా సంతోషం గా ఉందమ్మా .. అంది ఉత్సాహం గా రచన . 

కానీ రచన .. వాడు నీ గురించి అడిగితె ఏం చెప్పను ? అన్నయ్య కోప్పడతాడు కదమ్మా .. అంది గిరిజ . 

నిజమే .. కానీ ఏదో ఒకటి చెప్పమ్మా .. అంతేగాని విక్రాంత్ అన్నయ్య కి నేనిక్కడ కి వచ్చానని చెప్పకు .. అంది 

రచన . 

సరే .. అంది గిరిజ . 

వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తానమ్మా .. నాకోసం బెంగ పడకు . వేళకి భోజనం చెయ్ .. మరిక ఉంటానమ్మా 

అంది రచన . 

నువ్వు కూడా తల్లీ .. జాగ్రత్త గా ఉండు .. వైష్ణవీ మాతా నిన్ను సదా కాపాడుతుంది . అంది గిరిజ . 

బాయ్ అమ్మా .. అని ఫోన్ పెట్టేసింది రచన .. "అన్నయ్య వస్తున్నాడు ... అమెరికా నుండి .. నీకోసం ఈ చెల్లెలు 

ఇచ్చే కానుక రాణి మహల్ అన్నయ్య ... అని మనసులో అనుకుంది రచన . 

ఇంకా ఉంది   

8 comments:

సతీష్ కొత్తూరి said...

మీ రుధిర సౌధాన్ని కుదురుగా చదవడం నాకు కుదరడం లేదండి. మీరు చాలా సీరియస్ గా రాస్తున్నట్టున్నారు.
ఎక్కడైనా పబ్లిష్ అవుతోందా... మీరు బ్లాగ్ లో మాత్రమే పెడుతున్నారా...

రాధిక said...

లేదు సతీష్ గారు .. నేను ఈ సీరియల్ ని వేరెక్కడ పబ్లిష్ చేయటం లేదు . బ్లాగ్ లో మాత్రమే ప్రచురితం అవుతోంది

సతీష్ కొత్తూరి said...

మరి పబ్లిష్ చేసే ఆలోచన లేదా... ఇక్కడైతే చూసే వాళ్లు చాలా తక్కువ కదా... ఇంత కష్టపడి రాసిందానికి ఫలితం ఉండదేమోనని... నా ఉద్దేశం. మీ మెయిల్ ఐడీ ఇస్తే.. నేనొక కథ రాశాను. లోగడ. మీకు సెండ్ చేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతేనే మెయిల్ ఐడీ ఇవ్వండి లేకుంటే లేదు.

రాధిక said...

పబ్లిష్ చేయాలనీ ఉంది .. కానీ అలా ప్రయత్నించిన ప్రతిసారీ ఓడిపోయాను . నా రచన లకి వేరొకరి పేరు ఉండటం జరిగింది . మన సమాజం తీరే నన్ను ఓడించింది మరి . నన్ను నేను నిరూపించు కునేందుకు నాకు దొరికిన ప్లాట్ ఫాం ఇదే సతీష్ గారూ .. చదివే వాళ్ళు తక్కువే కావొచ్చు .. కాని నాకు సరైన అవకాశం రావటానికి నా బ్లాగ్ నాకు సహకరిస్తుందేమో ఎవరికి తెలుసు ? ఏమో గుర్రం ఎగరావచ్చు ... సతీష్ గారూ

సతీష్ కొత్తూరి said...

సమాజం ఓడిస్తుంది.. అదే సమాజం గెలిపిస్తుంది కూడా. ట్రైం చేద్దామా ఈ సారి మీ నోవెల్ పబ్లిష్ చేయడానికి... ఏమంటారు.

రాధిక said...

ముందుగా మీకు థాంక్స్ సతీష్ గారూ .. నా పేరు ఏదైనా మేగజిన్ లో చూడాలనే ఆశ నాకూ ఉంది సతీష్ గారు ..

కానీ దీనికి ఏం చేద్దామంటారు ? మీరే సలహా ఇవ్వండి .. ప్రోత్సాహం తో పాటు సలహా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండేం

Unknown said...

Radhika garu..naa peru yaduvamsi....
''rudhura soudham'' ante emiti ?

రాధిక said...

యదు వంశి గారూ ...

ముందుగా నా బ్లాగ్ కి మీకు స్వాగతం .. రుధిరం అంటే రక్తం అని అర్థం ,సౌధం అంటే భవంతి లేదా పెద్ద కట్టడం అని అర్థం . నా నవలకి ఈ పేరు ఎందుకు పెట్టాననేదీ మీరు నవలని చదివితే అర్థమవుతుంది .