Powered By Blogger

Tuesday 31 December 2013

రుధిర సౌధం 37


అయ్యో ! ఇంత రక్తం ... రచనా ఏదో ఒకటి చెయ్ .. మురారికి ఏమైనా అయితే నేను తట్టు కోలేను .. ఏడుస్తూ అంది

సత్య ..

సత్యా .. ముందు మురారిని ఇక్కడ నుంచి తీసుకెళ్దాం .. మన వెహికల్ ఉంది కదా .. అక్కడ వరకు ఎలా అన్నా

తీసుకు వెళ్ళాలి .. అంది ఆందోళన గా రచన .

హా .. సరే .. లేని ధైర్యం తెచ్చుకొని మురారి ని లేవదీయ టానికి ప్రయత్నించింది సత్య ...అంతే విసురుగా గాలి వారి

మీదనుండి వెళ్లి నట్లయి .. మురారి ని మెట్ల మీదుగా పైకి ఈడ్చుకు పోయింది ..

బాధ తో విల విల్లాడు తున్నాడు మురారి ..

మురారీ .. ఇద్దరూ గట్టిగా అరిచారు ..

వాళ్ళ కళ్ళ ముందే మురారి మాయమయ్యాడు ...

ఆ హటాత్పరిణామానికి తట్టుకోలేక పోయింది సత్య .. శరీరం మీద అదుపు తప్పి కూల బడిపోయింది ..

సత్యా ... అని కింద పడిపోయిన సత్య ని కుదప సాగింది ..

మెల్లిగా కళ్ళు తెరచి .. అంతా నీవల్లే .. నీవల్లే రచనా .. యష్ వద్దన్నాడు .. కానీ నువ్వు .. నీకోసమే వాళ్ళు

ప్రాణాలకు   తెగించి వచ్చారు .. వాళ్లకి ఎం జరిగినా దానికి కారణం నువ్వే ... మెల్లిగా అంది నిస్సహాయం గా సత్య ..

రచన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ..

సత్యా .. అని ఆమె ని గుండెలకి హత్తుకుంది ..

నువ్వు చెప్పింది నిజమే .. ఇదంతా నావల్లే .. కానీ నువ్వు భయపడకు .. మురారి ని నేను కాపాడతాను ..

నువ్వు నాతొ వస్తావా ? నేను పైకి వెళ్తున్నాను .. అంది రచన ..

మురారి అక్కడ ఉంటాడా ? ఆశ గా అడిగింది సత్య ..

ఉండొచ్చు కదా ... బాధ ని అణచు కుంటూ అంది రచన ..

మెల్లిగా లేచి నించుంది ఆమె .. పద రచనా ... మన వాళ్ళని కాపాడుకుందాం .. అంది సత్య ..

హ్హ .. పద .. అని ఆమె భుజం మీద చేయి వేసి ముందుకు నడిచింది రచన ..

ముందున్న మెట్లు ఎక్కబోతుండగా .. మెట్ల మీద నుంచి రక్తం ధారలయి ప్రవహిస్తుంది .. ..

రచనా ! రక్తం .. ఆందోళన గా అంది సత్య ..

అంతా అబద్ధం సత్యా .. మన కళ్ళు ఇప్పుడు మనల్ని మోసం చేస్తాయి .. నమ్మకు .. ఫర్వాలేదు ... పద .. అని

ఇద్దరు  మెల్లిగా మెట్లు ఎక్కసాగారు ...

రచన పైకి మాత్రమె చూడసాగింది .. కానీ సత్య కిందున్న రక్తాన్ని చూస్తూ భయం భయం గా నడవ సాగింది ..

నన్ను వదులు రచనా .. కాలు జారుతోంది .. అని రచన చేతిని తన భుజం మీద నుంచి తీసేసింది సత్య .

అంతే .... సర్రున కిందకి ఎవరో తోసేసి నట్లు జారి పడింది సత్య ..

అయ్యో ... సత్యా .. అని వెంటనే మెట్లు దిగి సత్య దగ్గర కి పరుగున వచ్చింది రచన ..

అమ్మా ... బాధ తో మూలిగింది సత్య ..

సత్యా .. సత్యా .. కళ్ళు తెరవు సత్యా .. అని ఆమె ని తన చేతుల్లోకి తీసుకుంది రచన ..

రచన ఆమె ని తాకగానే .. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది సత్య ..

ఆశ్చర్యం గా లేచి నిలుచుంది సత్యా ..

రచనా !నేను నీ చేయి వదిలించ గానే .. ఎవరో తోసేసినట్లు గా పడి పోయాను .. మల్లి నువ్వు తాకగానే నిస్సహాయం

పడిన నేను లేవగలిగాను .. ఏముంది నీ దగ్గర ? రచన భుజాలను కుదిపేస్తూ అడిగింది సత్య ..

నాదగ్గర ? నాదగ్గర ఏముంది ? అయోమయం గా అంటూనే ఆమె దృష్టి తన చేతికి కట్టి ఉన్న తాయెత్తు మీద

పడింది ..

తాయెత్తు ... స్వామీజీ ఇచ్చిన తాయెత్తు .. అర్థమైంది .. ఆమె మొహం లో ఆందోళన మాయమై ధైర్యం ప్రకాశించింది .
సత్యా .. పద .. మనం మురారి ని కాపాడదాం .. మన వాళ్లకి ఎం కాదు .. నాకు బసవరాజు చెప్పాడు .. మన

వాళ్ళని కాపాడే సామర్థ్యం నాకున్నదని  మర్చి పోవద్దన్నాడు .. ఎట్టి పరిస్థితుల లోనూ నా చేయి వదలకు ..

పద .. అంది రచన .

చిన్నగా తల పంకించి .. ఆమె చేయి గట్టిగా పట్టుకుంది సత్య ..

ఇద్దరూ ధైర్యం గా మెట్లెక్కి పై అంతస్తు లోకి చేరుకున్నారు ..
                                                        **************************
మెల్లిగా శివ సహాయం తో  మహల్ ముందు భాగానికి చేరుకున్నాడు యశ్వంత్ ...

యశ్వంత్ .. అటు చూడు .. మహల్ ద్వారం తెరుచుంది .. మనం వచ్చినప్పుడు .. తలుపులు మూసి ఉన్నాయి

కదా ! ఆశ్చర్యం గా అన్నాడు శివ ..

అవును శివా .. అంటే ఆ తలుపులు తీయగలిగెది రచన ఒక్కతే ... రచన ఇప్పుడు వచ్చిందా ? ఏంటి ? ఆశ్చర్యం

గానే తన అనుమానాన్ని వ్యక్త పరిచాడు యశ్వంత్ ..

మురారి లోపల ఉన్నాడేమో ? ఆశగా అన్నాడు .. శివ ..

వెళ్లి చూద్దాం శివా !నిండా మునిగాక చలెందుకు .. అని సింహద్వారం వైపు అడుగులో అడుగు వేసుకుంటూ

నడిచాడు యశ్వంత్ .. అతన్ని అనుసరించాడు శివ

(ఇంకా ఉంది )  

మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు .


ప్రియమైన నా రచన రీడర్స్ కి ,

                ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు .. నేను బ్లాగ్ ఓపెన్ చేసిన కొన్నాల్లకే మీ ప్రోత్సాహం 

నాకు కొండంత బలాన్నిఇచ్చింది . మీ ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే  నాకీ నూతన సంవత్సరం మరింత 

ప్రత్యేకం  అవుతుంది .. 

               "నా రచన " లో నేను రాస్తున్న కవితలకి ,పాటలకి ,రుధిర సౌధం సీరియల్ కి మీ ఆదరణ 

లభిస్తున్నదనటానికి   సాక్ష్యమే పై ఫోటో . అందుకు మీకు చాలా చాలా కృతజ్నతలు . 

              ఈ నూతన సంవత్సరం మీకు ... ... మీ కుటుంబాలకి కొత్త వెలుగులు తెచ్చిపెట్టాలి .. ఎన్నో విజయాలు 

మిమ్మల్ని పలకరించాలి . ఇంకెన్నో సంతోషాలు మీకై వేచి ఉండాలని మనసారా కోరుకుంటూ .. 

            మరోసారి  నూతన సంవత్సర శుభాకాంక్షలు . 

                                                                                          ఎల్లప్పుడు మీ ఆదరణ కోరుకునే 

                                                                                               మీ రాధిక  

రుధిర సౌధం 36

పరుగు పరుగున యశ్వంత్ వాళ్ళు ఉన్న ఇంటిని చేరుకుంది రచన .. కంగారు గా తలుపులు దబదబా బాదింది ..

లోపల అశాంతి గా ఉన్న సత్య వెంటనే వచ్చి తలుపులు తీసి రచన ని చూసి విస్తు పోయింది ..

రచనా .. నువ్వా ? నువ్వు మహల్ కి వెళ్ళలేదా ? అంది ఆశ్చర్యం గా సత్య ..

మహల్ ? నేను వెల్లడమేంటి ? అంటే వీళ్ళు వెళ్ళారా ? ఎందుకు ? అంది అంతే కంగారుగా రచన ..

రచనా .. నువ్వు గదిలో లేవని .. మహల్ కి వెళ్లి ఉంటావని .. వీళ్ళు ముగ్గురూ వెళ్ళారు .. నువ్వేమో వెళ్ళ లేదని

అంటావు... అసలేం జరుగుతుందో .. నాకర్థం కావటం లేదు .. కంగారు గా అంది సత్య ..

ఓ క్షణం .. బసవరాజు అన్న మాటలు గుర్తుకొచ్చాయి రచన కి ..

అయ్యో .. నాకే అర్ధం కాలేదు .. నీ స్నేహితులు ఆపద లో ఉన్నారని బసవ రాజు మహల్ తాళం చెవి ఇచ్చినప్పుడే

అర్థం  చేసుకుని ఉండాల్సింది .. ఆలస్యం చేసి లాభం లేదు .. త్వరగా వెళ్ళాలి .. అంది రచన కంగారుగా ..

రచనా .. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు .. బసవరాజు నీకు చెప్పాడా ? మనవాళ్ళు ఆపద లో

ఉన్నారా? కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే .. గద్గద స్వరం తో అంది సత్య ..

సత్య .. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ .. అంటూ ఆమె ని హత్తుకొంది రచన .
 రచనా .. వాళ్ళకేం కాదని చెప్పు .. అంది సత్య ఏడుస్తూ ..

ఏం కాదు .. నువ్వు ధైర్యం గా ఉండు .. నేనోసారి వేల్లోస్తాను .. అంది రచన ..

ఒక్కసారిగా .. ఆమెని వదలి .. నో రచనా .. నేను వస్తాను .. నేను ఒంటరిగా ఇక్కడ ఉండలేను .. అంది సత్య ..

సరే పద .. అంది రచన ..

ఇద్దరూ పరుగు లాంటి నడక తో మహల్ వైపు సాగి పోయారు ..
                                                              ******************

యష్ .. లే .. యష్ .. మెల్లిగా .. అతన్ని లేపటానికి ప్రయత్నిస్తూ విఫల మవుతున్నాడు శివ .

లేవలేక అవస్థ పడుతున్నాడు యశ్వంత్ ..

ఇంతలో ఎత్తుగా దుమ్ము ధూళి తో సుడిగాలి రేగింది .. అది శివ వైపే రాసాగింది ..

శివా .. అటు చూడు .. దూరం గా వెళ్ళు .. ఆ సుడిగాలి నీ వైపే వస్తుంది .. బాధ అణచి పెడుతూనే అన్నాడు

యశ్వంత్..

ఏమనుకున్నాడో శివ యశ్వంత్ చేతిని విడిచిపెట్టలేదు .. చిన్నప్పుడు బామ్మ నేర్పించిన ఆంజనేయ దండకం

పఠి0చటం  మొదలుపెట్టాడు ..

ఆశ్చర్యం గా ఆ సుడిగాలి మాయమయింది ..

శివ మనసులోనే భగవంతునికి కృతజ్ణతలు చెప్పుకున్నాడు ..

యశ్వంత్ .. నాకు నమ్మకం వచ్చింది .. నువ్వు లేవగలవు .. ఆ భగవంతుని స్మరించుకొని .. లేవటానికి

ప్రయత్నించు ... అన్నాడు శివ ..

శివా .. రచన కనబడలేదు .. మురారి ఏమైయాడో తెలీదు .. నన్ను వదిలేయ్ .. నువ్వు వెళ్ళిపో శివా .. బాధ గా

అన్నాడు యశ్వంత్ ..

కంటికి కనిపించకుండా మనల్ని భయపెట్టే ఒక దుష్ట శక్తి .. మనల్ని విడదీయలేదు యష్ .. అని జై వీరాంజనేయ ..

అని లేవలేక పోతున్న యశ్వంత్ ని ఒక్కసారిగా పైకి లేపాడు శివ ..

 మానసిక స్థైర్యం తో అడుగు ముందుకు వేసాడు యశ్వంత్ ..

అదే సమయం లో మహల్ కి చేరుకున్నారు సత్య,రచన ..

రచనా .. ఎవ్వరూ కనబడటం లేదు .. నాకెందుకో భయం గా ఉంది .. అంది సత్య ..

భయపడకు సత్యా .. భయమే మనకి శత్రువు .. నువ్వు నా వెంట ఉండు .. అస్సలు విడిచి పెట్టి ఎక్కడకి వేళ్ళకు ..

ముందు మహాల్లోకి వెళ్దాం .. అని గబగబా అడుగులు ముందుకి వేసి సింహద్వారం వైపు చేరుకుంది ..

సత్య నువ్వు టార్చ్ పట్టుకో .. నేను తాళం తీస్తాను .. అని టార్చ్ సత్య చేతికిచ్చింది ..

టార్చ్ లైట్ వెలుగులో తాళం తీసింది రచన ..

తలుపులు ముందుకి తోసింది కిర్రుమంటూ శబ్దం చేస్తూ అవి తెరచుకున్నాయి ..

తలుపులు తీయగానే హాల్లో కనిపించిన దృశ్యం చూసి హతాసులు అయ్యారా ఇద్దరూ ...

రక్తపు మడుగు లో పడిఉన్నాడు మురారి ..

మురారీ .. గట్టిగా అరచి మురారి దగ్గరకి పరుగున చేరుకుంది సత్య ..

సత్య వెనకాలే అక్కడకి వెళ్లి .. మురారీ .. మురారీ .. అని పిలిచింది రచన ..

మురారీ .. లే మురారీ .. కన్నీళ్ళతో అతన్ని తడిపేస్తుంది సత్య ..

రచన కి కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు .. మురారి ఇలా ఉన్నాడంటే .. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు ?

వారెలాంటి స్థితి లో ఉన్నారో .. ఆందోళన గా అనుకుంది రచన ..

(ఇంకా ఉంది )

Monday 30 December 2013

నా రచన బ్లాగ్ రీడర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ...

ఎన్నో ఊసులు.. ఎన్నో ఆశలు .. 

మోసుకోస్తున్నదే నూతన వర్షం .. 


తీపి తీపి జ్ఞాపికలో .. చేదు నింపిన అనుభవాలలో .. 


మేళవించిన విజయాలలో .. వెల్లువై ముంచిన అపజయాలలో .. 


అనురాగ సంభందాలలో .. చెలరేగే హింసా కాండలో .. 


రణ రాజకీయాలలో .. ప్రజాహితుల ఆసీస్సులలో .. 


ప్రతి చోట .. ఏదో కొంత .. మంఛి ఉంది చెడు ఉందీ .. 


జనులలో తరిగిపోనీ ఆశావాదం ఉంది .. 


కష్టముంది .. నష్ట ముంది .. ప్రేమ ఉందీ .. మోసం ఉందీ .. 


ఏదోలా గడిచిందా .. అని వాగ్వాదం కూడా ఉంది .


గత మెప్పుడు గతమేలే .. భావి కెపుడు స్వాగతమేలే .. 


చేదు మరచి పోవాలె .. మంచి నిలుపుకోవాలే .. 


వికటాట్ట హాసం చేసే చెడు ని చీదరించాలే .. 


దీనం గా అర్థిస్తున్న మంచిని కాపాడాలే ... 


తీయనైన ఊహలు ఎన్నో .. ఊరిస్తూ న్నాయంట ... 


కమ్మనైన బంధాలెన్నో కవ్విస్తుంటా యంటా ... 


నిజమేదో గ్రహియించాలి .. విజేతవే కావాలి .. 


గత చరితల ఘనతని మరవక భవిత ని నువ్వు పిలవాలి .. 


ఆనందం పంచాలి .. పంచి దాన్ని పెంచాలి .. 


సౌభాగ్యం వర్ధిల్లాలి .. వందేళ్ళు  నిలవాలి .. 


ఒకపరి త్యాగ నిరతులకు అంజలి ఘటియించాలి .. 


నీ దేశం పట్ల నీ వంతు బాధ్యతను ఎరగాలి ... 


గత ఏడాది ఏమిచ్చినా .. కొత్త ని స్వాగతించాలి .. 


కడలి కెరటాలు ఎరుగని అలసట నీ నవ్వుల కేలా ?


పెదవుల తీరం తాకుతూ అల్లరి చేయాలంటా .. 


హృదయం లో మానవత్వ మను మొక్క ని ఇక నాటాలి ... 


స్నేహభావమును పెంచే ఎరవు దాని కేయాలి .. 


ప్రేమ అనే పూ వులు పూస్తే .. మాలగ నువు కూ ర్చాలి .. 


భరతమాత మెడలో వేసి ముద్దు బిడ్డ కావాలి .. 


ఆనాడే సంతోషాలు .. నింగి కెగయు సంబరాలు .. 


పరిమళించు అనుబంధాలు ... పరవశించు ప్రతి హృదయాలు .. 


అటువంటి ఎన్నో ఉదయాలు .. కావాలి మహోదయాలు .. 


నూతన సంవత్సరాలు .. ప్రగతి కవే సోపానాలు ... 


మారాలి ఆలోచనలు ... నవ భారత హృదయ వీచికలు .. 


ఎన్నెన్నో శుభాకాంక్షలు .. నునువెచ్చని అరుణ కిరణాలు .. 


అరవిరిసే మది కుసుమాలు .. స్వాగతించు ఆనందాలు .. 


చురుకు మనే గ్రీష్మాలు ..... వర్షించే ముత్యపు చినుకులు 


శరత్కాల వెన్నెల కాంతులు ... హేమంతపు తుషారాలు .. 


వెంట తెచ్చు ఆ శిశిరం .. ఆమని కోయిల గానం ... 


కరిగిపోదా శ్రావణ మేఘం .. మురిసి పోదా ఫాల్గుణ మాసం .. 


పొగమంచుల జనవరిలో .. సంక్రాంతుల సందడులే .. 


విసిగించే వేసవి లో .. సెలవులిక మొదలవులే .. 


హాయి ఉంది రేయి ఉంది .. ఏడుపుంది .. నవ్వుంది .. 


వీటన్నిటి కలయిక లో కొత్తదనం ఇమిడింది .. 


అదే కదా నూతన రాగం .. కాలపు వీణ పలికే ... 


శుభం జరగాలని తలచే మనసు కి తోడై పాడే ... 


ఆహ్వానమందిద్దాం తీయని ఆశలతో .. కొత్త ఏడాది కి .. 


వీడుకోలు చెబుతూనే పాత ఏడాది గుర్తుంచుకుందాం 


గత మెంతో చేదైనా .. భావి ఎపుడు తీపే అన్న పెద్దలను స్మరి యిద్దాం .. 


కొత్త ప్రణాళిక లతో నూతన సంవత్సరాన్ని స్వాగాతిద్దాం .. 


నా రచన బ్లాగ్ రీడర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ... 


                                                                       మీ రాధిక 


Sunday 29 December 2013

రుధిర సౌధం 35

యష్ .. అటు చూడు .. ఊరంతా ఎంత చీకటిగా ఉంది ? కానీ ఇక్కడ ఏదో కాంతి ఉంది చుట్టూరా ... మహల్ ని

చేరుకుంటూ నే అన్నాడు శివ .

యశ్వంత్ మహల్ వైపు పరీక్ష గా చూసాడు .. ఆకాశం అంతా  మేఘావృతమై ఉంది .. కానీ ఆ ఆకాశం లో ఏదో

కాంతి మహల్ పై పడి వింతగా మెరుస్తుంది ..

యష్ .. ఈ గేటు తెరవనా ? లోపల రచన ఉందంటావ ... అన్నాడు కాస్త సంశయం గా మురారి ..

చిన్నగా తల పంకించి .. గేటు ని గట్టిగా ముందుకు తోసాడు యశ్వంత్ ..

అది కిర్రుమంటూ తెరచుకొంది .. గేటు ఆ శబ్దం చేయగానే .. ఏ మూల ఉన్నాయో గానీ గబ్బిలాలన్ని ఒక్కసారి గా

ఎగిరాయి  .... గుడ్లగూబలు భయంకరం గా కూస్తున్నాయి ..

దూరం గా కుక్కల అరుపులు హృదయ విదారకం గా ...

మెల్లిగా మహల్ ప్రాంగణం లోకి అడుగుపెట్టారు ముగ్గురూ .. ఎందుకో వారందరి గుండె సడి వారికే భయానకం గా

విని పిస్తుంది ..

శివా ... మహల్ ముందు ద్వారం తాళం వేసి ఉంది .. మనం ముందు నుండి వెళ్ళ లేం .. కానీ ఆ సి .బి .ఐ ఆఫీసర్

తన డైరీ లో రాసిన దాన్ని బట్టి వెనక నుండి భవనం పై అంతస్తు కి వెళ్ళొచ్చు .. రోప్ ఉంది కదా .. అన్నాడు యష్ ..

ఉంది .. వెనక వైపు నుండి అంటే అలా వెల్లొచ్చు .. అని శివ అనడం తో భవనానికి కుడి వైపు నుండి భవనం

వెనుకకి చేరుకున్నారు ముగ్గురూ ..

ఆ విశాల మైన కారిడార్ లో మెల్లిగా అడుగు లో అడుగు వేసుకుంటూ .. భవనం పైకి వెళ్ళే మార్గాన్ని

అ న్వేషిస్తున్నారు ..

యష్ .. భవనం బయట గానీ భవనం లోపల గానీ ఎటువంటి శబ్దాలు వినబడటం లేదు .. అసలు రచన లోపలి కి

వెళ్ళే ఉంటుందా ? అనుమానం గా అడిగాడు మురారి .

నాకు అదే అనుమానం గా ఉంది .. జరగారానిదేదన్న రచన కి జరగలేదు కదా ..  అన్నాడు శివ

 ఏమి కాదు .. ఈరోజు మన చుట్టూ ఉన్న ఏ పరిస్థితి ని నమ్మకూడదు మనం .. జాగ్రత్త .. అన్నాడు యశ్వంత్ ..

యష్ .. ఆ పైన కిటికీ విరిగి పోయి ఉంది .. బహుశా అదే పైకి వెళ్ళే మార్గం  కావొచ్చు .. అన్నాడు మురారి ..

ఎస్ .. శివా .. రోప్ తీసి పైకి విసురు .. ముడి పడేలా ... అన్నాడు యశ్వంత్ ..

శివ అలాగే చేసాడు .. తాడు కిటికీ రెక్క కి చిక్కుకుంది ...

ఓకే .. ఇక పైకి ఎక్కొచ్చు .. అన్నాడు శివ ..

సరే అని ముందు గా మురారి తాడు పట్టుకున్నాడు ... మెల్లిగా పైకి ఎగబాకడం మొదలు పెట్టాడు ...

అతడు పైకి మెల్లిగా చేరుకున్నాడు ఆసరా కోసం కిటికీ రెక్క పట్టుకున్నాడు ..

అతడు పైకి చేరాడు కదా అని యశ్వంత్ కూడా సన్నద్ధం మవుతుండగా ... ఆ .. అని గట్టిగా అరిచాడు మురారి ..

అతని అరుపు విని పైకి చూసిన యశ్వంత్ శివలకు గుండె

ఒక్కసారి అదిరింది ..

కిటికీ లోంచి మురారి ని ఎవరో లోపలికి లాగేసి నట్లని పించింది ..

మురారి కనబడలేదు మరి ..

అతని కేక తర్వాత  భయంకర నిశ్శబ్దం ...

శివ నుదుటి మీద నుండి స్వేదం కింద పడి టప్ .. మన్న శబ్దం

కూడా వినిపిస్తుంది ..

షాక్ నుండి ముందు తేరుకుని .. మురారీ ... గట్టిగా అరిచాడు యశ్వంత్ ..

మురారీ .. ఎక్కడున్నావ్ ? మురారీ .. మురారీ .. గట్టిగా  అరుస్తున్నాడు యష్ ..

యష్ .. ఎవరో లోపలనుండి మురారి ని లోపలికి లాగేయడం కళ్ళారా చూసాను రా ... మెల్లిగా వణుకు తున్న

స్వరం  తో అన్నాడు శివ ..

శివా .. అని అమాంతం గా హత్తుకున్నాడు యశ్వంత్ శివ ని ..

రేయ్ .. వాడిక మనకి లేనట్టేనా ? అన్నాడు మెల్లిగా శివ ..



ఒక్కసారిగా శివ ని వదిలి .. రేయ్ .. ఈ లోకం లో మంచి ఎలా ఉందో .. చెడు అలానే ఉంది .. కానీ మంచి మీద చెడు

విజయం ఎప్పుడు అశాశ్వతం  ..  మనసులో ధైర్యం కోల్పోకు .. మురారి చాలా ధైర్యం ఉన్నవాడు ..

మొండివాడు ..

పోరాడతాడు .. ఇక మన వంతు .. జై ఆంజనేయా ..

అని తాడు పట్టుకొని ఎగబాకడం మొదలు పెట్టాడు

యశ్వంత్ ..

కానీ ఎవరో అతన్ని విసిరేసి నట్టు .. తాడు తో సహా ..

అక్కడ ఉన్న ఎండిపోయిన మడుగు లో పడ్డాడు

యశ్వంత్ ..

కళ్ళ ముందు జరుగుతున్నది నిజమా అబద్ధమా నిశ్చయించుకోలేక మ్రాన్పడి పోయి చూసాడు శివ ..

ఇక్కడ నుంచి యశ్వంత్ అంత దూరం ఎలా వెళ్ళాడు ? యశ్వంత్ ... అని పిలుస్తూ పరుగున యశ్వంత్  దగ్గరికి

వెళ్ళాడు ..

లేవలేక ఇబ్బంది పడుతున్నాడు .. అబ్బా .. గట్టిగా అరిచాడు యశ్వంత్ ..

లే యష్ .. లే .. యశ్వంత్ లేవదీయ దానికి శాయశక్తులా కష్ట పడుతున్నాడు శివ ..


(ఇంకా ఉంది )

Thursday 26 December 2013

రుదిరసౌధం 34

రచన వెంగమ్మ వెనకాలే నడవ సాగింది .. చలి గాలి ఝుమ్మని తాకుతుంది .. మంత్రం వేసినట్టు నడుస్తుంది

వెంగమ్మ.. ఆమె వెనకాలే నడుస్తున్న రచన చుట్టూ పరికించి చూసింది .. ఆ ప్రాంతం ఆమె కి కొత్త  గా అనిపించింది ..
చీకట్లో సరిగా చూడలేక పోతున్నా వెంగమ్మ చేతిలో ఉన్న లాంతరు వెలుగు లో పరిసరాలను గుర్తు పెట్టుకుంటూ

వెంగమ్మ కి తెలియ కుండా అనుసరిస్తుంది .

ఓ చోట హటాత్తు గా ఆగింది వెంగమ్మ ..

ఆమె వెనక్కి తిరుగు తుందేమోనని గభాలున అక్కడున్న చెట్టు వెనక్కి వెళ్ళింది రచన ..

మెల్లిగా తొంగి చూసింది రచన ..

వెంగమ్మ వెనక్కి చూడలేదు .. లాంతరు ఒక చెట్టు కొమ్మ కి తగిలించింది .. నెత్తి మీద ఉన్న నీళ్ళ కుండ కిందకి

దించింది ... భుజానికి తగిలించి ఉన్న సంచి లోంచి ఒక పూల దండ .. తీసి రెండు అడుగులు ముందుకు వేసి

 ముందర ఉన్న ముళ్ళ కంపలని తొలగించినది...

రచన ఆమె ప్రతి చర్య ని ఆశ్చర్యం గా చూస్తుంది ..

ఆశ్చర్య పడాల్సింది ఏమిటంటే ఆమె ముళ్ళ కంపలను తొలగించగానే .. రాతి తో కట్ట బడిన సమాధి ఒకటి

బయట పడింది ..

ఆమె పూల దండను పక్కన పెట్టి వెనక్కి వచ్చి తాను తీసుకు వచ్చిన నీళ్ళ కుండ ను తీసుకు వెళ్లి ఆ సమాధి ని

నీటి తో శుభ్రం చేసింది .. తాను తెచ్చిన పూల దండ ని సమాధి పై వేసి కళ్ళు మూసుకొని నమస్కరించింది ..

తరువాత ఒక ఆ కు లో కారియర్ లో తెచ్చిన భోజనాన్ని వడ్డించి మళ్ళి నమస్కరించింది ..

 తరువాత .. అరచింది  గట్టిగా ..  రా .. త్వరగా .. వచ్చి ఆరగించు .. ఈ అమవాస ఎవరి ప్రాణం తీస్తుందో

త్వరగా రా .. అని పిలిచింది ..

రచన అయోమయం గా చూస్తుంది .. ఎప్పుడు మాట్లాడని వెంగమ్మ .. ఇప్పుడిలా అరుస్తోంది ఏంటి ? ఆమె

మనసులో సంశయం ..

ఇంతలో హటాత్తుగా పెనుగాలి రేగింది .. చెట్లు పిచ్చి పట్టినట్లు ఊగిపొతున్నాయి ..

వెంగమ్మ మొహం లో చిరు దరహాసం .. మళ్ళి చేతిలోకి లాంతరు తీసుకొని .. ఖాలీ ఐన కారియర్ ని తీసుకుని

వెనకకి  నడిచింది .. రచన అయోమయం గా తనని దాటి వెళ్ళిపోతున్న వెంగమ్మ ని చూసింది ..

అసలేమిటిది ? అసలు ఈ సమాధి ఎవరిదీ ? అని వెనక్కి తిరిగి సమాధి ని చూసిన రచన ఒక్కసారిగా అదిరి పడింది ..
అక్కడ సమాధి పై కూర్చొని బసవ రాజు వెంగమ్మ వడ్డించిన పదార్ధాలను ఆబగా తింటున్నాడు ..

ఆమె ఆ హటాత్పరిణామానికి విస్తు పోయింది .. ఇప్పటి వరకు లేని వ్యక్తీ ఇప్పుడెలా ఇక్కడికి వచ్చాడు ... ?

ఆమె ఆవేశం గా ముందుకి నడచి .. బసవ రాజూ .. ఎలా వచ్చావు ఇంత హటాత్తు గా .. ? అంది రచన .

తింటున్న వాడల్లా ఒక్కసారి మొహం ఎత్తి ఆమె ని చూసి వికటాట్ట హాసం చేసాడు ..

ఎందుకు నవ్వుతున్నావు ? నేనడిగిన ఏ ప్రశ్న కి సరిగ్గా సమాధానం చెప్పవా ?? అసలేంటి ఇదంతా ? ఆ వెంగమ్మ

ఇక్కడకి భోజనం ఎందుకు తెచ్చింది ? నువ్వెందుకు దాన్ని తింటున్నావు ? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉంది

రచన ..

అతడు చిన్నగా నవ్వి .. ముందుగా నువ్వడిగిన ప్రశ్న .. నేనిక్కడికి ఎలా వచ్చానని ? నేనిక్కడకి రాలేదు .. ఇక్కడే

ఉన్నాను..  ఇదే నా స్థానం .. అదుగో చూడు ... అని సమాధి వంక చేయి చూపించాడు ..

ఆమె ఆశ్చర్యం అతడు చూపిన వైపు దృష్టి ని నిలిపింది .. అక్కడ సమాధి పై ఓ వ్యక్తి  వదనాన్ని రాతిపై చిత్రించి

ఉంది... అది బసవ రాజు వదనం ..

ఆమె చిగురుటాకు లా వణికి పోయింది .. భయం తో మాట పెగల్లేదు ఆమె కి ..

అంటే .. అంటే .. నువ్వు .. ఆమె భయం గా అంది ..

హా .. నేను మరణించి 80 ఏళ్ళు అయింది .. అన్నాడు బసవరాజు ..

ఆమె కళ్ళు భయం తో రెపరెప లాడాయి ..

ఎందుకు   భయ పడుతున్నావు ? నువ్వు మాట్లాడుతున్నది .. ఓ ఆత్మ తోనే .. ఆరోజే చెప్పాను కదా .. ఈ వూరి

వాళ్ళు చెప్పే కథల్లో నేను ఒకడి నని .. కాని ఈరోజు నువ్వు చూస్తున్నది నిజం .. కథా కాదూ .. కలా కాదు ..

అతడు గఉ ట్టిగా అరిచాడు ..

మరి .. నేను  నిన్నెలా చూడగలుగుతున్నాను .. పెదవులు వనుకుతుండగా గద్గద స్వరం తో అడిగింది రచన ..

చిన్నగా నవ్వి .. ఆ వైష్ణవీ దేవి వల్ల .. విశిష్ట జననం నీది .. కారణ జన్మురాలివి కనుక... అన్నాడు ..

నాకర్ధం కావడం లేదు .. అంతులేనన్ని సందేహాలు కలుగు తున్నాయి .. ఈ సందేహాలతోనే నా తల వేయి

చెక్కలయ్యేలా ఉంది .. అంది రచన ..

నీ సందేహాలతో కాలయాపన చేయకు .. నువ్విక్కడకి ఎందుకు వచ్చావో .. నాకయితే పూర్తిగా తెలుసు .. నీ లక్ష్యం

నెరవేర టానికి ఒకే ఒక్క మార్గం ఉంది .. ఆ మహల్ లో ఉన్న వైష్ణవీ దేవి ఆలయం .. తిరిగి దీప కాంతులతో

వెలుగొందాలి ... కానీ అదంత తేలికయిన పని కాదు .. అన్నాడు బసవ రాజు ..

మహల్లో ఆలయమా .. ఎక్కడ ఉంది ? అంది రచన ఆశ్చర్య చాకితురాలై ..

అవును .. ఉంది .. భూగర్భం లో .. ఆలయాన్ని నువ్వే కనుగొనాలి తప్పదు .. అన్నాడు బసవ రాజు ..

అసలు నువ్వెవరు బసవరాజు ? అని అడిగింది రచన దీనం గా ..

జవాబు చెప్పే సమయం వచ్చేదాకా వేచి ఉండు .. ఇక ఆలస్యం చేయక తిరిగి వెళ్ళు .. నీ మిత్ర బృందం కష్టాల్లో

ఉంది .. అన్నాడు బసవరాజు.

ఏమంటున్నావు ? అంది ఆందోళన గా ..

ఇదుగో మహల్ తాళం చెవులు .. వెళ్లి రక్షించుకో .. నీకా

సామర్థ్యం ఉందన్న సంగతి మర్చి పోకు .. అన్నాడు

బసవరాజు .

అతడి చేతిలో తాళం చెవి ని తీసుకుని పరుగు న ఇంటి దారి

పట్టింది రచన .

(ఇంకా ఉంది )

















Wednesday 25 December 2013

రుధిర సౌధం 33



నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లు తున్న యశ్వంత్ కి ఇక తనకి నిద్ర పట్ట దని పించింది . అబ్బా .. ఎందుకో .. నా

మెదడు నాకే హెచ్చ రిస్తుంది . జరగరానిదేదో జరగ బోతోన్నదని .. మెల్లిగా పక్క మీంచి లేచాడు .. శివ ,మురారి

గాఢ నిద్ర లో ఉన్నారు .. వేరే గదిలో సత్య నిద్రపోతోంది ..

వీళ్ళలో ఏ ఒక్కరిని నష్ట పోలేను .. నన్ను నమ్మిన స్నేహితులు .. అందుకే మహల్ దగ్గరకి వెళ్ళటానికి

నిరాకరించాను .. ఇంతకీ రచన ఎలా ఉందొ .. ఎప్పుడేం తోస్తే అదే చేస్తుంది .. అనుకుంటూ గుమ్మం వైపు నడిచి

కిటికీ ఓపెన్ చేసి రచన గది వైపు చూసాడు .

గదిలో లైట్ వెలుగుతుండటం , గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటూ ఉండటం గమనించి అతని మెదడు చురుగ్గా

పని చేసింది .. ఏదో జరిగింది .. రచన గది లో లేదని పిస్తుంది .. చేతికి ఉన్న వాచ్ చూసుకున్నాడు .. టైం 11. 20

నిమిషాలు  చూపిస్తుంది . వెంటనే వచ్చి మురారీ మురారీ .. శివా లేవండి .. అని వాళ్ళిద్దర నీ తట్టి లేపాడు ..

తటాలున లేచి .. ఏం జరిగింది ? అని అడిగారు ఇద్దరు ఒకేసారి .

నేనోక్కసారి రచన గదిలో ఉందో లేదో చూసొస్తాను .. మీరు రెడీ గా ఉండండి .. మన operation కి .. త్వరగా అని వీధి

గుమ్మం వైపు పరుగు తీసాడు యశ్వంత్ ..

తలుపులు తెరచి బంగ్లా వైపు పరుగు పెట్టాడు ..

ఏం జరిగి ఉంటుంది మురారి .. అన్నాడు శివ .. లేచి రెడీ అవుతూనే ..

చేతిలోకి గన్ తీసుకుంటూ .. జస్ట్ బి రెడీ .. అని.. సత్య నిద్రపోతున్న గది వైపు చూసి  సత్యా అని పిలిచాడు మురారి ..

యశ్వంత్ ఒక్క పరుగు తో బంగ్లా వెనుక భాగాన్ని చేరుకొని పైప్ సహాయం తో పైకి ఎగబ్రాకాడు .. ..

కిటికీ రెక్క ని అందుకొని రూం లోకి తొంగి చూసాడు .. గదిలో రచన లేదు .. పైపెచ్చు లోపలనుండి తలుపు

ఘడియ పెట్టి ఉంది .. చుట్టూ పరికించి చూసాడు .. బాత్ రూం ఘడియ బయట నుండి వేసి ఉంది .. అంటే రచన

బాత్ రూం లో కూడా లేదు .. అంటే రచన ఈ కిటికీ గుండానే బయటికి వెల్లుంటుంది .. హౌ ఫూలిష్ .. కోపాన్ని అణచి

పెట్టుకుని కిందకి దిగి తిరిగి పరుగున వారుండే ఇంటికి చేరుకున్నాడు యశ్వంత్ ..

యశ్వంత్ .. ఏం జరిగిందీ ? శివ ఎదురొచ్చి ప్రశ్నించాడు ..

శివా ! రచన రూం లో లేదు .. కిటికీ గుండానే కిందికి దిగిందని ఖచ్చితం గా చెప్పగలను . ఎక్కడికి వెళ్లిందో ..

ఆందోళన గా అన్నాడు .. యశ్వంత్ .

ఇంకెక్కడికి ? ఖచ్చితం గా మహల్ కె యశ్వంత్ .. డౌట్ లేదు అన్నాడు మురారి .

ఐతే ఆలస్యం చేయకుండా వెంటనే బయల్దేరడం తప్పనిసరి యశ్వంత్ .. అన్నాడు శివ .

శివా .. ఈరోజు ఆపరేషన్ వద్దనుకున్నాం .. కాబట్టి నేనే వెళ్లి రచన ని తీసుకొస్తాను .. అన్నాడు యశ్వంత్ .

సారీ .. యశ్వంత్ .. వెళ్తే మనం కలిసే వెళ్తున్నాం .. అదీ ఇప్పుడే .. ఇంకా ఎలాంటి వాగ్వివాదాలు వద్దు .. అన్నాడు

మురారి ..

అవును యష్ .. నువ్వు మాకోసం ఆలోచించావు .. మేము నిన్నెలా ఒంటరిగా పంపిస్తాం .. ?మేము వచ్చి తీరతాం

.. పద అన్నాడు శివ .

థెన్ లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ ..

నేనూ వస్తాను .. అంది వెనకాలే వీరి సంభాషణ విన్న సత్య .

నో సత్యా .. నువ్వుండు .. మనలో ఒకరు ఉండటం మంచిది .. మేము వస్తామని ఆశిస్తున్నాం .. బట్ ఏమైనా

జరిగితే నువ్వు ఆఫీసు కి తెలియజేద్దువు గానీ .. అన్నాడు మురారి .

మురారీ ప్లీజ్ .. అంది దీనం గా సత్య .

నా మాట వింటావు కదూ .. అని బాయ్ చెప్పి యష్ లెట్స్ గో .. అన్నాడు ..

సత్య చూస్తూ ఉండగానే ఆ ముగ్గురూ చీకట్లో కలసిపోయారు .. ఓహ్ గాడ్ .. ప్లీజ్ సేవ్ థెమ్ .. అని మనసులోనే

ప్రార్థించి లోపలకి వచ్చి తలుపులు వేసుకుంది సత్య . 

అసలెందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది రచన .. ? ఎవరికీ చెప్పకుండా మహల్ కి ఎందుకు వెళ్ళాలి ??? యశ్వంత్

వద్దని చెప్పాక కూడా ... ఇప్పుడు ఏం జరుగుతుందో .. ఆమె మోకాళ్ళ మీద కూల బడి పోయింది నిస్సహాయం గా .

(ఇంకా ఉంది )


Tuesday 24 December 2013

యమునా తటి లో నల్లనయ్య కై ..

యమునా తటి లో నల్లనయ్య కై ..

వేచిన విరహిణి రాధ ప్రేమ కై ..

వడి వడి అడుగులలో సాగి .. అలక ని తీర్చర దరి చేరి ..

కోపముతోన ఎర్రబారిన కనులలో కన్నీరే ..

ఉప్పొంగి వెల్లువై మరో యమున ఉద్భవమె జరగక మునుపే ..          యమునా


బరువెక్కిన హృదయం వేదన తో తల్లడిల్లుతోందేమో ..

పదునెక్కిన విరహం ఆరాధన లో మమేక మే అయ్యిందో ..

అన్నుల మిన్న తను .. ప్రేమగ బుజ్జగింపు కోరును ..

అడవి లో వెన్నెలలా .. తన మది ఉందేమో అనును ..

కానీ .. నీ కొరకే వేచిన చిన్నదాని మనసే కను ...

ప్రళయం తెచ్చే ఆవేదన లోకాన్నే ముంచక మునుపే                         యమునా


మురళీ గానం తో  సేద తీర్చాలి కన్నయ్యా ..

బాధ ని రేపిన ఎడబాటును తరిమేయాలి క్రిష్ణయ్య ..

రాధిక మానసచోరా..  ఒక పరి బ్రతిమాలిన తప్పేం లేదయ్యా ..

గోపిక లెందరు ఉన్నా ... రాధే ప్రాణం అనవయ్యా ..

కానీ .. నమ్మని మాటలు ఎన్నని చెప్పినా కాదనలేనిది ఆ ప్రేమ ..

ఆ ప్రణయం తీపిని ఎరుగని వాడవు కావుగా నీవు పదవయ్యా ..            యమునా


మధురమే మధురమే .. నీ పెదవి పలికిన రాగమే ..

మధురమే మధురమే .. మనసు దోచే గానమే ..

మధురమే మధురమే .. నీ పెదవి పలికిన  రాగమే ..

మధుర లోనా రాజ్య మేలినా కంసునీ వధ తధ్యమే ..

మధుర మైన బాధ రేగినా రాధ మది ఆరాధ్యమే ..

మధురమే మధురమే .. నంద సుత సుమధురమే

బృందావని లో ఆమని కోయిల నీ కొరకే పాడేనులే ..

ఆ నింగిన సౌదామిని లా ఆనందం మెరిసేనులే ..

హృదయపు పరవళ్ళు .. ఆ యమునా గలగలలు ..

గోపీ కృష్ణా నీ రస లీల న మురిసిన గోపిక లా ముని పుంగవులు ..

నీ  జ్యేష్టునిగా అవతారం .. ఆది శేషునిది ఆ భాగ్యం ..

 కాళేయ మర్ధనం .. అంతర్మధనం .. సోచించినచో అవునవగతం ..

మధురం మధురం నీ నామం ..

మధురం మధురం నీ చరితా శ్రవణం ..

రేపల్లె మురిసినదయ్యా ... నీ పాదం మోసిన దయ్యా ..

శ్యామ సుందరా .. నీ మధురం కాదా .. మైమరపించే నీ బాల్యం ..

తలచిన వారి జన్మే ధన్యం .. యశోదా తనయుని గా నీ స్మరణం ..

భవ బంధాలను దాటించే వని .. నిన్నే కొలిచిన భక్తులను ..

రాక్షస సంహారం చిరునవ్వులతో ఒసగిన పసివాడి లీలలను ..

మనసున తలచిన మధురం కాదా ..

లీలా కృష్ణా నీ సన్నిధిలో ..

వెలిగే దివ్వె గా జన్మను ఈయరా .. లేకుంటే మురళి గ నను మలచర ..

హోరువాన లో యమునా నదిలో వసుదేవుని తల పై నిదురించిన ..

చక్కనయ్య నీ చత్రము నాగము .. దారి చూపెను ఆ నది తానె ..

మురళీ కృష్ణా పరమావధి గా ..

నను కరుణించు .. నా పెన్నిధి గా .. మధురం కాదా నీ గానం ..

వెదురు లో ఒదిగిన తీయని రాగం ..





Monday 23 December 2013

రుధిర సౌధం 32


యశ్వంత్ మనసు లో మహల్ కి వెళ్ళ కూడదని తీర్మానించు కుంటూ నే ఇంకో పక్క విధి నిర్ణయిస్తే తప్పదని

సంసిద్ధం గా ఉన్నాడు . యశ్వంత్  మనసులో ఉన్న ఆందోళన ని అతని మిత్ర బృందం కూడా అర్ధం చేసుకుంది ..

వారు కూడా సంసిద్ధం గా ఉన్నారు .

యశ్వంత్ .. కిటికీ లోంచి చూసాను .. రచన గది లో లైట్ వెలుగుతూనే ఉంది . తానింకా మనం ఏమైనా

చె బుతామని  ఎదురుచుస్తుందని అని పిస్తుంది నాకు .. అన్నాడు శివ .

హా .. అవును కదా యశ్వంత్ .. తను మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో కూడా చెప్పింది .. ఏం చెబుదాం రచన కి ?

అన్నాడు మురారి .

హాయిగా నిద్రపోమని చెప్పు .. అన్నాడు యశ్వంత్ .. సాలోచన గా ..

శివా .. చిన్న స్లిప్ తీసుకుని .. నో అని రాసి ఇవ్వు అన్నాడు మురారి .

నేను రాస్తాను .. అని ఒక స్లిప్ మీద రాసి .. మురారి కి ఇచ్చింది సత్య .

కానీ ఈ స్లిప్ రచన కెలా .. అని అంటున్న శివ ని చూసి నువ్వు నాతొ రా శివా .. అన్నాడు మురారి .

ఇద్దరు కల్సి మెల్లిగా వీధి తలుపు తీసారు ..

అంతా నిశ్శబ్దం గా ఉంది .. అంతా అప్పుడే నిద్రపోయారు మురారీ .. అన్నాడు శివ .

అవును అని .. బంగ్లా వైపు నడిచాడు .. 10 అడుగులలో బంగ్లా వెనుక భాగాన్ని చేరుకొని రచన గది కిటికీ దగ్గరకి

చేరారు.

రచన గది కిటికీ నుండి తాడు వేలాడుతూ ఉంది ..

శివ కి అర్ధమైంది .. తాడు ని చేతిలోకి తీసుకున్నాడు . మురారి ఆ స్లిప్ తాడు చివరి అంచు కి అతికించ మన్నాడు ..

శివ అలాగే చేసాడు .. స్లిప్ అంటిన్చాక తాడు ని కొంచెం విసురుగా అటు ఇటూ  ఊపి మళ్ళి వెనుకకి నడిచారు .

గదిలో మంచం మీద బోర్లా పడుకుని ఆలోచిస్తున్న రచన కి కిటికీ కి కట్టిన తాడు కదులుతున్నట్లు అనిపించింది .

వెంటనే లేచి కిటికీ దగ్గర కి వెళ్లి కిందకి చూసింది .

మురారి ,శివ వీధిలో ఇంటి వైపు వెళ్తూ కనబడ్డారు ..

వెంటనే తాడు ని పైకి లాగింది .. తాడు చివరన ఉన్న స్లిప్ తీసి

తాడు ముడి విప్పేసింది ..

స్లిప్ మీద డిఫరెంట్ గా నో అని రాసి ఉంది .. నేనిది ఊహించాను ..

 అయినా యశ్వంత్ ఏ విషయం లోనయినా బాగా

ఆలోచిస్తాడు .. నేను తన మాట కాదని ఎలా అనగలను ? అని మనసులో అనుకొని రూం లో లైట్ ఆఫ్ చేసి బెడ్

మీదకి చేరింది . కాసేపట్లోనే మగత గా నిద్రపట్టేసింది రచన కి .

కిటికీ లోంచి రచన గది కేసి చూసి యశ్వంత్ .. రచన నిద్రపోయి నట్లుంది .. గదిలో లైట్ ఆఫ్ చేసింది .. అని చెప్పింది

సత్య .

ఓకే .. మీరు కూడా నిద్ర పొండి .. అని పక్క మీదకి చేరాడు యశ్వంత్ .

                                                                 ********************

టైం 11 కావొస్తుంది .. కిటికీ తెరచి ఉండటం తో చల్ల గాలి వణుకు పుట్టిస్తుంది .. చలి  మొదలు కావటం తో గాఢ

నిద్రలో ఉన్న రచన కి హటాత్తు గా మెలకువ వచ్చింది ..

దుప్పటి కోసం బెడ్ మీద తడిమింది .. చేతికి దొరకక పోవటం తో లేవక తప్పలేదు ఆమె కి ..

లేచి గదిలో లైట్ వేసింది .. ఆమె కళ్ళు గదిలో దుప్పటి కోసం వెతికాయి .. ..

కనబడలేదు .. కప్ బోర్డు లో ఉందేమో .. అని కప్ బోర్డు వైపు నడిచింది .. cupboard లో ఉన్న దుప్పటి తీసుకుని ,

తిరిగి బెడ్ దగ్గరకి రాబోతూ కిటికీ వైపు చూసింది .. ఓహ్ .. తలుపులు వేయలేదు కదూ .. అనుకుంటూ కిటికీ

చేరి తలుపులు వేయబోతు వీధిలోకి చూసిన ఆమె హతాసురాలయింది .

కింద .. వీధి లో ఓ స్త్రీ నడచి వెళ్తోంది .. ఆమె తలపై మంచి నీళ్ళ కుండ .. చేతిలో ఓ కారియర్ .. చిన్న లాంతరు ..

ఎవరీమె .. ఈ టైం లో ఎవరూ బయటికే రారు .. అలాంటిది ఈమె ఒక్కతే ఎలా తిరుగుతుంది ? అని పరీక్ష గా

చూసింది రచన .

ఆమె కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి .. ఆమె భూపతి ఇంట్లో పని మనిషి వెంగమ్మ ..

"వెంగమ్మ" ఈమె .. ఈ టైం లో ఇంట్లో లేకుండా ఎక్కడకు వెళ్తోంది .. ఏదో ఉంది .. నేను ఖచ్చితం గా వెంగమ్మ ని

ఫాల్లో అయి తీరాల్సిందే .. అని వెంటనే బెడ్ పక్కనున్న లాంగ్ కోట్ తీసి వేసుకుని కిటికీ నుండి కిందకి దిగింది

రచన .

రచన కి ఓ పది అడుగుల ముందే ఉంది వెంగమ్మ ..

చప్పుడు కాకుండా ఆమె ని అనుసరించసాగింది రచన .


( ఇంకా ఉంది )


:"రుధిర సౌధం " చదువు తున్న  readers దయ చేసి తమరి అమూల్య మైన సలహాలని , అభిప్రాయాలని 

కామెంట్ బాక్స్ లో తెలియ జేయండి  . 

                                                                                         మీ 

                                                                                             రాధిక 












జీవితం

కురిసే ఆ చినుకు కి తెలియదు లే ఓ సంగతీ

జాడే ఉండదు అనీ నేలని తడిపిన తదుపరీ ..

మెరిసే ఆ మెరుపుకి తెలియదులే ఓ సంగతీ ..

క్షణ కాలమే తన పని ముగిసాక ఏముందని ..

గత మంతా ఏదో చేదే ఉందంటూ స్వాగతము చెప్పవా భవితకి ..

మనసంతా ఏదో దిగులుంది అంటూ చిరునవ్వు ని వదల రాదే మరీ ..                కురిసే


ఈ జీవితం ఓ అద్భుతం అనుకుంటే తప్పేమీ కాదే ..

ఈ జీవితం కాదె శాశ్వతం అనుకుంటే ముప్పేమీ లేదే ..

ఇచ్చింది మూన్నాళ్ళ బ్రతుకయినా ... జీవించి చూపించు లోకాన

కష్టాలు ,కన్నీళ్లు ఎన్నున్నా .. ..అవి నీతోనే ఉండేనా ఎన్నాళ్ళైన ..

నిష్ఫల మైన నూరేళ్ళ కన్నా .. నిను నిలబెట్టు కొన్నేల్లె మిన్న                          కురిసే


నీకై నువ్వు బ్రతికేస్తే అది బ్రతుకని పించదులే ..

పదుగురితోను ముడిపడితేనే బ్రతుకే సార్థకం అవుతుంది లే ..

ఒకడి గానే పుడతావు .. ఒకడి గానే వెళతావు .. నడుమ ఉన్న

సమయం అంతా పంచుకునేందుకు ఒకరన్నా ..

లేని నాడు  జీవితమెందు కురా ..

చినుకు చినుకు కలిసి జారితే వాన అని అంటాము రా ..


రుధిర సౌధం 31



సరే .. ఐతే నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే యష్ . నాకు తెలుసు .. నువ్వందరి గురించీ 

ఆలోచిస్తావని .. ఈరోజు రాత్రి కి మహల్ కి వేల్లటమా లేదా అన్నది నువ్వే నిర్ణయించు .. అన్నాడు మురారి 
ఇంకా టైం ఉంది .. ఇప్పుడు టైం 4 అవుతుంది .. మరో 2గం లో చీకటి పడటం మొదలవుతుంది . అని రచన వంక

తిరిగి రచనా ..  మరో అరగంట లో రత్నం రాజు తో సహా వెళ్ళిపో .. లేదంటే భూపతి మన మీద కాన్సంట్రేషన్ 

పెట్టొచ్చు . నువ్వు చూపించి నట్లు ఆ కిటికీ దగ్గర కొచ్చి నీకేదన్నా తెలియజేస్తాం మహల్ కి వెళ్ళేది లేనిది సరేనా ? 

అన్నాడు యశ్వంత్ . 

సరే .. నా దగ్గర ఓ రోప్ ఉంది .. కిటికీ నుంచి దాన్ని కిందికి వదులుతాను .. ఏదైనా ఉంటె పేపర్ మీద రాసి దానికి 

కట్టండి .. ఓకే ? అంది రచన . 

సరే .. అన్నాడు యశ్వంత్ .. 

సరే .. నేను కాసేపు సత్య తో మాట్లాడి వెళ్తాను అంది రచన . 

సరే నన్నట్లు తల ఊపాడు .. యశ్వంత్ . 

రచన ఆ గది లోంచి వెళ్లి పోయింది .. 

మురారీ .. నాకెందుకో ఈరోజు మనం ఎంత కాదనుకున్నా మహల్ కి వెళ్తామని పిస్తుంది .. అన్నాడు యశ్వంత్ . 

ఎందుకలా ? అన్నాడు మురారి . 

sixth sense అన్నాడు  యశ్వంత్ . 

సాలోచన గా తల ఊపా డు మురారి .. 

మురారి .. ఒక బుక్ తీసుకుని మనం వచ్చినప్పటి నుండి ఇప్పటి మన సంభాషణ వరకూ అంతా నోట్ చెయ్ .. మన 

తర్వాతా  అది మరొకరి పరిశోధన కన్నా పనికి రావాలి .. లేదంటే ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలగాలి .. అన్నాడు 

యశ్వంత్. 

అంటే యశ్వంత్ ...  అన్నింటికీ సిద్ధం గా ఉండమంటావు .. చిరునవ్వు తో అన్నాడు మురారి . 

ఎస్ .. మై ఫ్రెండ్ .. ఇది మనందరం గడపబోయే చివరి రోజు కావొచ్చు .. కాకపోనూ వచ్చు అన్నాడు యశ్వంత్ అదే 

చిరునవ్వు తో . 

సరే .. నేను అంతా నోట్ చేస్తాను .. అన్నాడు మురారి . 

                                                                             *****

మెల్లిగా కనులు తెరచి పూర్ణ కలశం వంక చూసాడు రమనానంద మహర్షి .. 

ఆయన కలశం వంక చూస్తూ ఏదో మంత్రం ఉచ్చరించాడు .. అంత వరకు భూమి పైన ఉపస్థిత ఐన ఆ కలశం 

మెల్లిగా గాలి లోకి లేచింది . ఆ దృశ్యాన్ని చూసి చుట్టూ ఉన్న భక్తులంతా గట్టిగా హర హర మహాదేవా శంభో 

శంకరా ! అంటూ జయ జయ ధ్వానాలు చేసారు . 

రమణా నంద ముఖం లో చిరు దరహాసం .. ప్రశాంత వదనం తో ఆయన కలశానికి ఎదురుగా ఉన్న గిరిజా దేవి 

వంక చూసి కమండలం లో నీటిని తీసి ఆమె పై చల్లాడు . 2రోజులలో కనులు మూసుకొని ధ్యానం లో ఉన్న ఆమె 

ఒక్కసారిగా కనులు తెరచింది .. 

ఎదురుగా గాలి లో తేలుతున్న కలశాన్ని చూసి ఆమె కళ్ళ వెంట నీళ్ళు జలా జలా రాలాయి .. 

స్వామీజీ .. నేను చూస్తుంది నిజమేనా ? కల కాదు కదా .. గద్గద స్వరం తో అడిగింది ఆమె . 

అమ్మా .. ఓ తల్లిగా ఆ జగత్జనని మరో తల్లి కోరిక కి న్యాయం చేకుర్చకుండా ఉండదు .. నీ అకుంటిత దీక్ష ,శ్రద్ధా 

భక్తులు ,నీ బిడ్డ పట్ల నీ వాత్సల్యం .. వీటి ఫలితమే .. ఆ పూర్ణ కలశం . అన్నారు మహర్షి . 

స్వామీ .. మీకు నేను రుణపడి పోయాను .. మీరు నా బిడ్డ ని రక్షించారు .. అంది గిరిజ ఆర్తి గా . 

నీ బిడ్డ కి ఆయుష్షు పోసింది నువ్వే తల్లీ .. .. నేను నీకు మార్గాన్ని మాత్రమె చూపాను .. అన్నారు స్వామీజీ .. 

కృతజ్నతలు చెప్పకుండా ఉండలేను స్వామీజీ .. తదుపరి ఏం చేయాలో సెలవివ్వండి .. అంది గిరిజ . 

నిశ్చల మనస్కురాలవై ఆ అంబ ని సహస్రం తో కుంకుమార్చన చెయ్యు ;అని గిరిజ కి చెప్పి గోపాలస్వామి వంక 

తిరిగి  మృత్యుంజయ హోమానికి సర్వం సిద్ధం చెయ్యి గోపాలస్వామీ .. అని చెప్పారు రమనానంద . 

సరే స్వామీ .. అని ఏర్పాట్లలో మునిగి పోయాడు గోపాలస్వామి . 

                                                               ********************

రాత్రి 8 కావొస్తుంది . ఊరు ఊ రంతా స్మశాన నిశ్శబ్దం లా ఉంది .  7 గం లకే రాత్రి భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పోయారు భూపతి ఇంట్లో .

రచన మాత్రం తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తుంది .. 

"అమావాస్య .. అమావాస్య .. రానే వచ్చింది .. ఏం జరుగుతుంది ?  అందరు ఇంతలా భయపడుతున్నారు .. 

మనసులో అనుకొని.. కిటికీ లోంచి యశ్వంత్ వాళ్ళు ఉన్న ఇంటి కేసి చూసింది .. 

వీళ్ళెం చేస్తున్నారో .. అయినా తాడు

కడతా .. అనుకున్నా కదా .. అని సూట్ కేసు లో ఉన్న రోప్ ని తీసి కిటికీ కి కట్టి వేలాడ దీసింది.

ఆపని పూర్తయ్యాక .. మళ్ళి అటు ఇటూ పచార్లు   చేయసాగింది ..

అనుకోకుండా ఆమె దృష్టి తూర్పున ఉన్న కిటికీ మీద పడింది .. మెల్లిగా

కిటికీ వైపు నడిచి .. దాన్ని ఒకసారి పరిశీలన గా చూసింది .. ఎవరు ఓపెన్

చేయకుం డా మేకులు కొట్టి ఉన్నాయి.. 

అన్నట్టు దీనికి ఒక చిన్న కన్నం ఉండాలే .. అని పరీక్ష గా చూసేసరికి

కనబడింది .. ఆ కన్నం దగ్గర కన్ను పెట్టి అటువైపు చూసింది  .. దట్టమైన

చీకటి తప్ప ఏం కనబడలేదు .. 

మళ్ళి వచ్చి తటాలున బెడ్ పై పడి ఆలోచించ సాగింది .. ఎందుకో మనసు

మహల్ వైపు మల్లుతోంది .. ఆమె మనసు లో సంఘర్షణ మొదలయ్యింది ..

ఇలా వేళ్ళు కొరుక్కుంటూ కూర్చోనా లేక .. అని పరి పరి విధాల ఆలోచిస్తుంది 

(ఇంకా ఉంది )
  















Friday 20 December 2013

రుధిర సౌధం 30

 రచనా ... .. మెల్లిగా పిలిచాడు యశ్వంత్ . ..
భారం గా ఉన్న  కనురెప్పల్ని మెల్లిగా తెరచి చూసింది రచన .
తలుపు కొట్టిన శబ్దం లీల గా వినిపించింది ... ఆమె చెవులకి ..
రత్నం రాజు వచ్చినట్లు ఉన్నాడు .. అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ భుజానికి ఆనుకున్న తన తల ని పక్కకి తీసి మెల్లిగా లేచి  నిలబడింది ...
యశ్వంత్ కూడా లేచి నిలబడి తలుపు  తీయ మన్నట్లు సైగ చేసాడు శివ కి ... శివ వెళ్లి తలుపు తీసాడు ..
రత్నం రాజు ...
నిద్రపోతున్నారా ? అంటూ లోపలికి వచ్చాడు ...
లేదు .. సినిమా చూద్దాం .. అన్నారు కదా .. అందుకే వెయిట్ చేస్తున్నాం .. సత్యా ... సత్యా .. అని పిలిచాడు యశ్వంత్ .
సత్య వచ్చి రత్నం ని పలక రించి లాప్ టాప్ లో అప్పటి పాజ్ లో ఉన్న మూవీ ప్లే లో పెట్టింది ..
రత్నం సినిమా లో లీన మయ్యాడు ..
యష్ .. యష్ .. గుస గుస గా పిలిచాడు మురారి లోపలి గది లోంచి ..
ఏంటి ? అన్నట్లు కళ్ళ తోనే అడిగాడు యశ్వంత్ ..
ఓసారి లోపలికి   రా .. మెల్లిగా అన్నాడు ..
అదంతా గమనిస్తున్న రచన .. యశ్వంత్ ని ప్రశ్నార్థకం గా చూసింది ..
తనతో పాటూ లోపలికి రమ్మని సైగ చేసాడు యశ్వంత్ ..
ఇద్దరూ .. మురారి ఉన్న గది లోకి  వెళ్ళారు ...
వాళ్ళిద్దరూ లోపలికి వచ్చాక గది తలుపులు మూసాడు మురారి ...
ఏమైంది మురారీ ? అడిగాడు యష్ .
యష్ .. ఈ గదిలో ఓ సూట్ కేసు ఉంది .. అటు చూడు .. అన్నాడు మురారి ..
అతడు చూపించిన వైపు చూసాడు యశ్వంత్ ..
అంత త్వరగా ఎవరి కళ్ళ కి కనబడని ప్లేస్ అది ... గదిలో మూలగా ఒక చెక్క బీరువా ఉంది .. దానికి గోడకి మధ్యలో ఉందది ...
యశ్వంత్ వెంటనే వెళ్లి ఆ సూట్ కేసు ని బయటకి తీసాడు .. చాలా చిన్నది .. ఫైల్స్ అవీ పెట్టుకోవడానికి మాత్రమే వాడతారు .
ఈ పల్లె లో ఇలాంటి సూట్ కేసు ఎవరు వాడతారు .. అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది .. సిటీస్ లో తప్ప ఇలాంటి చోట్ల దొరకదు కూడా .. అంది రచన .
ఇది ఇంతకు ముందు  మనలాగే వచ్చిన వాల్లదయి ఉంటుంది ... అన్నాడు యశ్వంత్ దాన్ని పరీక్ష గా చూస్తూ ...
యశ్వంత్ .. ఓపెన్ చేద్దామా ? అన్నాడు మురారి ..
ఇలాంటి సూట్ కేసు ఓపెన్ చేయడం కొంచెం కష్టమే ... ఎనీ వేస్ .. మన టూల్ కిట్ తీసుకు రా .. అన్నాడు యష్ .
మురారి 2 నిమిషాల్లో టూల్ కిట్ తో వచ్చాడు ..
సూట్ కేసు వెనుక   భాగం నుండి మరలన్ని విప్పారు .. సూట్ కేసు పావు గంట లోనే తెరచుకుంది ...
హమ్మయ్య .. ఓపెన్ అయింది .. అని లోపల ఉన్న ఫైల్స్ అన్నీ తీసి యశ్వంత్ కి ఇచ్చాడు .. మురారి ..
ఫైల్స్ నుండి జారి పడిన ఐ డి కార్డు ని తన చేతి లోకి తీసుకుంది రచన ..
అరుణాచలం , సి . బి . ఐ ఆఫీసర్ .. అంది రచన ..  ఆశ్చర్యం గా ..
అవునా ? అని ఆమె చేతిలో ఉన్న కార్డు తీసుకుని ... ఓహ్ గాడ్ .. ఈయనే ఇంతకు ముందు ఇక్కడికి  వచ్చింది .. చాలా ఘోరం గా చని పోయాడు ... అన్నాడు యశ్వంత్ .
ఓహ్ .. అని యష్ .. ఇందులో ఏదో డైరీ  కూడా ఉంది .. అని ఓ డైరీ తీసి యశ్వంత్ చేతిలో పెట్టాడు మురారి ..
ఇది అతనిదే అయుండొచ్చు యష్ ... ఆయన మహల్ గురించి ఏమైనా రాసుండొచ్చు .. అంది రచన .
 హా చదువుదాం .. అని మురారీ ఓసారి రత్నం రాజు ఏం చేస్తున్నాడో చూడు .. శివ కి చెప్పు .. రత్నం ని ఇటు రానివ్వ కుండా చూడమని .. అన్నాడు యశ్వంత్ .
ఓకే .. నేను చూసుకుంటాను .. అని మురారి బయట కి వెళ్ళాడు ..
నువ్వు చదువు యశ్వంత్ ఏముంది అందులో ???  అంది కంగారు గా రచన .
హా .. అని డైరీ ఓపెన్ చేసాడు యశ్వంత్ .. ఆ డైరీ చదువు తుంటే అతని భ్రుకుటి ముడి పడింది ..
ఇంతలో మురారి వచ్చాడు .. వాళ్ళంతా మూవీ చూస్తున్నారు ... ఏం ఫర్వాలేదు .. అన్నాడు మురారి ..
ఏముందో తెలీదు మురారి .. యష్ చదువు తున్నాడు .... అంది రచన .
చిన్నగా తల పంకించి యశ్వంత్ వంక ఆసక్తి గా చూసాడు ..
డైరీ చదవడం పూర్తయ్యాక ... మిస్టర్ అరుణాచలం .. అమావాస్య నాటి సాయంత్రం వరకు ఈ గది లోనే గడిపారు .. తర్వాత డైరీ లో పేజి లు ఖాళీగా ఉన్నాయి .. అన్నాడు యశ్వంత్ సాలోచన గా ..
అంటే ? అన్నాడు మురారి ..
ఆరోజు రాత్రే ఆయన చనిపోయారు .. అంది రచన .
అంటే అమావాస్య రాత్రి ఆయన మహల్ కి వెళ్ళారు ... అన్నాడు మురారి ..
అవును మురారి .. ఒక్కసారి ఈ డైరీ చదువు మురారీ .. రచన కి ఎదురైన పరిస్థితులన్నీ ఈయన కి ఎదురయ్యాయి .. కాక పొతే ఈ యన మహల్ తాళం తీసి లోపలకి వెళ్ళలేదు .. మహల్ వెనుక భాగం నుంచి మొదటి అంతస్తు నుంచి వెళ్ళారు .. ఈయనకూడా ఆ మహల్ లో గోడలతో సహా నేలంతా రక్తం ఏరులై పారటం చూశానని వ్రాసారు .. రచన కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది .. అన్నాడు యశ్వంత్ .
అంటే అమావాస్య కి ముందు ఆ మహల్ లోకి ప్రవేశించినా ప్రాణ భయం ఉండదు .. కానీ అమావాస్య మాత్రం ప్రాణాలని  హరిస్తుంది .. అంతేనా ? అన్నాడు మురారి ..
మరి బసవ రాజు .. అతను అరుణాచలం  గారికి కనిపించాడా ? అని అడిగింది రచన ..
ఆ ప్రస్తావన మాత్రం ఇందులో లేదు .. అంటే అరుణాచలం కి బసవరాజు కనిపించలేదు ... అన్నాడు యశ్వంత్ .
నిజం గా ఈ కేసు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది .. కానీ ఈరోజు ఏం జరగబోతోందో మాత్రం తెలీదు ... అన్నాడు మురారి ..
అందుకే నేను కొంచెం టైం తీసుకుందాం అన్నాను మురారీ .. అన్నాడు యశ్వంత్ .
బాగా ఆలోచిద్దాం మురారీ .. తొందర పడి  ప్రాణాలు కోల్పోయే కన్నా ఒకసారి ఆలోచించడం మంచిది .. ఎందుకంటే
ఇక ఏ అమావాస్యా ఈ వూరి లో ఏ ఒక్కరి ప్రాణం తీయకూడదని అనుకుంటున్నాను ... అన్నాడు యశ్వంత్ ..
(ఇంకా ఉంది )

















అందాల రాకుమారీ .. నిను చూసి మనసు జారీ ..

అందాల రాకుమారీ .. నిను చూసి మనసు జారీ ..

తిరిగే రానందీ .. ఏం చేసావో మరీ ..

సొగసైన ఓ సుకుమారీ .. నిన్నే నే ఏరి కోరీ ..

వలచానే ఎందుకో లేదే ఏ దారీ ..  

కాలాన్ని ఎదిరించైనా నీ కోసం వస్తా నారీ ..

హృదయాన్ని ఎంతిస్తున్నా ఇంకా కావల0టావా పిసినారీ .. అందాల

 కాశ్మీరం నుండి ఆ కన్యా కుమారి .. తిరిగాడే నీకోసం ఈ బాటసారి ..

కనరాక నువ్వే ఇంకొక్క సారి .. పిచ్చెక్కి పోతుందమ్మా విసిగి వేసారి ..

నీ నవ్వే రువ్వే ముత్యాలే ఏరి .. నీ మెడలో వెయ్యాలే ఓ సొగసరీ

నువు నడిచే వేళల్లో ఏ రహదారీ .. నిన్నే చూపిస్తే చాలు నాకొక పరీ ..

అరుదయిన అప్సరసా .. నువ్వున్నది ఏ నగరీ ????????????????  అందాల

ఆనందపు శిఖరాల అంచులలో చేరి  , ఆ నీలి  మేఘానికి  పెట్టాలె గురీ ..

ఆ వాన విల్లు ని తాకాలని ఎగిరీ ... ఈ విశ్వం అంతటినీ చూడాలే మరీ ..

చినుకు చినుకూ కలసీ అయ్యింది గోదారీ .. ఆ నీటి నురగల్లో తడిసాక మది మారీ

నువ్వే నా గుండెల్లోనా ఉన్నావని తొలిసారి .. ఆ భావం మైకం పెంచే మళ్ళి మరో సారీ ..

అరుదయిన అప్సరసా .. నువ్వున్నది ఏ నగరీ ????????????????  అందాల

 




  

రుధిర సౌధం 29



అంతే కాదు .. మన ప్రాచీన కాలం నాటి మునుల తెలివితేటలు సామాన్య మైనవెమ్ కావు .. హనుమాన్ చాలీసా లో భూమి కి సూర్యునికి మధ్య దూరం మన సైంటిస్ట్లు లు కనుగొనక ముందే తెలపబడింది .. మనం వెనక బడినా ఇతర దేశాలు మన భగవద్గీత లో అన్ని నిజాలే చెప్పబడ్డాయని ఒప్పుకున్నాయి ..కానీ మనమే ఇంకా డైలమా లోనే ఉన్నాము .. అంది రచన .
ఐతే ఇప్పుడు మనం పోరాడాల్సింది మనిషి తో కాదు ఓ ఆత్మా ? అడిగాడు మురారి .
మురారి .. మనం పోరాడాల్సింది ఆత్మ తోనా మనిషి తోనా అన్నది ముఖ్యం కాదు .. మనం పోరాడాల్సింది ఓ సమస్య తో .. అంతే . కాకపొతే .. ఇప్పుడు రత్నం చెప్పిందంతా నిజమయే ఉంటుందని నేనూ చెప్పలేను .. బట్ అన్ని రకాలు గానూ మనం సిద్ధం గా ఉండాలి .. అన్నాడు యష్ .
ఒక మనిషి తో పోరాడాలంటే మన దగ్గర భుజ బలం ఉంది .. గన్స్ కూడా ఉన్నాయి .. కానీ ఓ ఆత్మ ని ఎదురించాలంటే ఏమి ఉండాలి ? అన్నాడు శివ .
బుద్ధి బలం , మానసిక స్థైర్యం , అన్నింటిని మించి దైవ బలం .. అంది రచన .
కానీ రచన .. నాకెందుకో మనం ఈ విషయం లో సరిగ్గా ఆలోచించలేదని పిస్తుంది .. కేవలం ఒక్కరు కూడా ఆ మహల్ కి వెళ్లి బతకలేదని అంటున్నారు కదా .. మరి అలాంటప్పుడు నీకేం కాలేదు .. నువ్వు ఇప్పుడు మా మధ్యే ఉన్నావు .. మరి అలాంటప్పుడు అక్కడ ఏ సమస్యా లేక పోయి కూడా ఉండొచ్చు కదా .. అంది సత్య .
సమస్య ఉందా లేదా అన్నది తెలియాలంటే మనం ఈరోజు మహల్ కి వెళ్లి తీరాలి యశ్వంత్ . మనం కనుక అక్కడ ఏ సమస్య లేదని నిరూపించ గలిగితే ఈ వూరి ప్రజల భవిష్యత్తే మారిపోతుంది .. .. అన్నాడు మురారి .
అవును .. నిజం గా ఆలోచిస్తే నాకూ మనం ఓ సారి మహల్ కి వెళ్ళటం మంచిది అనిపిస్తుంది . అన్నాడు శివ .
కానీ ఈరోజు మనం మహల్ కి ఎలా వెళ్తాం? ఈ వూరిలో ఎవరు చూసిన .. మనల్ని వెళ్ళనివ్వరు కదా .. అంది సత్య యశ్వంత్ మనం ఐదుగురం ఉన్నాము .. ఏ పరిస్థితి నయినా సరే ఎదుర్కొందాం .. మహల్ కి వెళ్దాం .. అంది రచన .
సరే ఐతే .. మీ అందరు వెళ్దాం అంటే నేనెలా వద్దంటాను ? ఈరోజే మన ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం .. కానీ మన ఆపరేషన్ కి ఏమని పేరు  పెడదాం ? అన్నాడు యశ్వంత్ .
నేను మహల్ లోకి వెళ్ళిన వెంటనే రుధిర ధారల్ని చూసాను ..ఎంతో మంది రక్తం కళ్ళ జూసిన ఆ మహల్ ని రక్తానికి సంభందించిన పేరే పెట్టాలి .. అంది రచన
సరే రక్తం అంటే రుధిరం .. మరి మహల్ ని ... అని యశ్వంత్  ఆలోచిస్తుండగా .. శివ అన్నాడు .. సౌధం .. అంటే ?అని
ఓహ్ వేరి నైస్ శివా .. నేటి నుంచి మన ఆపరేషన్ పేరు "రుధిర సౌధం " నువ్వు లాప్ టాప్ లో నోట్ చెయ్ సత్యా అన్నాడు యశ్వంత్ .

ఎస్ బాస్ అంది సత్య చిరునవ్వు తో .
సో .. ఐతే ఈరోజే మనం ఆ రుధిర సౌధం లోకి వెళ్తున్నాం ..  వైజయంతి కి హాయ్ చెబుతున్నాం .. అన్నాడు మురారి .
ఎస్ .. ఆ యువరాణి ని  కలవాలని అంత ఆత్రం గా ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు .. అన్నాడు శివ .
ఇప్పుడైతే భోజనం చేద్దాం ..  రాత్రి ఊరంతా నిశ్శబ్దం అయాక మహల్ కి వెళ్దాం అన్నాడు యశ్వంత్ .
అందరూ  అంగీకరించారు .
మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు .. ఎందుకో రచన మనసు మాత్రం కలవరం గా ఉంది ..
యశ్వంత్ .. నీ గిటార్ తెచ్చావా ? అని అడిగింది .. రచన .
తెచ్చాను .. నువ్వు దాని కోసం అడిగావంటే ఎందుకో అశాంతి గా ఉన్నావు .. అన్నాడు ఆమెకి  సామీప్యం గా వచ్చి మంచి మ్యూజిక్ వినాలని ఉంది .. ప్లీజ్ .. నాకోసం .. అంది దీనం గా మొహం పెట్టి ..
శివా .. నా గిటార్ .. అని అరిచాడు యశ్వంత్ .
శివ గిటార్ తెచ్చి ఇచ్చాడు ..
గోడ కి ఆనుకొని  కూర్చుని ప్లే చేయసాగాడు యశ్వంత్ .. అతని పక్కనే కూర్చుని అతని భుజం పై .తలవాల్చి నిశ్చింత గా కళ్ళు మూసుకొంది రచన
 
(ఇంకా ఉంది  )


















.

Thursday 19 December 2013

మది మురిసిన క్షనమది నిజమేనా ?

 
నిను చూసిన ఆ తొలి  నిమిషానా ..
నా మనసుకి తెలుసా ఏమైనా ..
నిను కలిసిన ఆ తోలి ఉదయాన
అలజడి రేగిందే హృదయాన ...
 ఈ తెలియని తికమక ప్రేమేనా ?
మది మురిసిన క్షనమది నిజమేనా ?

ఒక కమ్మని పాట లోనా చరణానివి నీవేనా ?
ఇటు రమ్మని పిలిచానంటే నీ  చరణం కదిలేనా ?
అరె కురిసే చినుకులు అన్నీ ముత్యాలే అయ్యేనా ?
అర విరిసే చిరునవ్వుల్లో అన్నీ పెదవి ముత్యాలు అవునా ?
వాలు తున్న చూపుల్లో సిగ్గు రాజ్య మేలు తుందనా ?
రాలు తున్న పూలల్లొ సువాసనే ఉండదనా ... ?
అర్ధాలే వేరని పిస్తున్నా .. భావాలే  ఒకటని అంటున్నా ...
నువు చెబుతున్నది అది ఏమైనా నాకోసం అని భావిస్తున్నా ...

ఓ అల్లరి చూపుల జాణా .. నీ తలపే నాదయ్యేనా ?
ఈ అందరి మధ్యన నిన్నే నే చులకన చేస్తున్నానా ?
నువు నడిచే దారి లోనా నే నడవటము తప్పేనా ?
నువు పీల్చే గాలి లోనా నా శ్వాస ని  నేనింపేయ్ నా ..
నువు పిలిచే పిలుపు లోనా నా పేరే వినాలని ఉన్నా ..
నీ కోసం అను నిత్యం మళ్ళి మళ్ళి పుడుతున్నా ...

నువ్వెంతగా తపిస్తూ ఉన్నా .. తెలియని మనసై జీవిస్తున్నా ..
నాకోసం నా వెంటున్నా .. నను వీడి నిను వెళ్ళమన్నా ...  

 

Wednesday 18 December 2013

రుధిర సౌధం 28



ఇద్దరు యువరాణులు ఎంతో ప్రేమ గా ఉండేవారట . కానీ మహా రాజు మాత్రం రెండో భార్య పిల్లలనే ఎంతో ప్రేమ గా చూసే వాడని అది కొంత కాలం తర్వాత వైజయంతి కి నచ్చలేదని అందుకే తన తమ్ముడిని ,చెల్లెలిని చంపాలను కుందట . అందుకు చాలా ప్రయత్నాలే చేసిందట .. అది మహా రాజు కని పెట్టి ఒక రోజు వైజయంతి ని తన గది లోనే ముక్కలు ముక్కలు చేసి చంపేసాడట .. రక్తం ఏరులై పారిందట .. వైజయంతి ని చంపేయటం తో సమస్య పరిష్కారం అయిందని రాజు అనుకున్నాడు . కానీ తన కూతురికి అన్యాయం జరిగిందని పెద్ద రాణి ఒక మాంత్రికుని తో చేతులు కలిపి తన కూతురి ఆత్మ ని ప్రేతాత్మ గా బలీయం చేసిందట .. అప్పటి నుండి వైజయంతి ఆత్మ ఆ మహల్ లోనే  ఉన్నదని అందరూ నమ్ముతారు .. ఉన్నదని ఆధారాలు కూడా ఉన్నాయట .. అని గట్టి గా ఊపిరి పీల్చు కున్నాడు రత్నం .
కానీ మరి రాజు ఫామిలీ ఏమయింది ? అడిగాడు యశ్వంత్ .
వైజయంతి ఆత్మ  ఆ తరువాత చిన్న  రాణి ని చంపేసింది .. అప్పుడే అది వైజయంతి పని అని రాజు కి తెలిసింది .. కానీ రాజు పూజించే దేవత వాళ్ళ కుటుంబాన్ని కాపాడి0దట ..చిన్న  యువరాణి దేవి భక్తు రాలట . ఆమె పిలిస్తే దైవం పలికేదట .. . ఆమె భక్తీ  వల్ల.. వాళ్లకి ఏ హానీ జరగ లేదట . కానీ మహా రాణి ఆ వైజయంతి ఆత్మ ని క్షుద్ర శక్తి గా మార్చేసిందట .. ప్రతి అమావాస్య కి ఆమె ప్రళయ భయంకర శక్తి గా ఎదుగుతుందట .. ఒక అమావాస్య నాడు ఆమె కన్న తండ్రి నే చంపేసిందట .. ఇంకోసారి చెల్లెలిని కూడా .. రాజు కొడుకు మాత్రం మహల్ నుండి పారిపోయాడో .. లేక మరేం అయ్యాడో .. ఆ తరువాత ఆ మహల్ దెయ్యాల కోటే అయ్యింది .. మా ఊరికి శాపం అయింది .. అన్నాడు రత్నం రాజు .
ఇంటరెస్టింగ్ గా ఉందీ కథ .. అన్నాడు మురారి .
అందుకే .. మీరంతా మంచివాల్లలా ఉన్నారు .. ఆ మహల్ లోకి వెళ్ళకండి .. ఆ వైజయంతి మిమ్మల్ని చంపకుండా వదలదు .. అన్నాడు రత్నం రాజు ..
సరే .. అన్నాడు యశ్వంత్ .. ఓ పక్క ఈ కథంతా విని ఆలోచన లో మునిగి పోయిన రచన ని ఓరకంట  చూస్తూనే ..
ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినబడింది ..
శివ వెళ్లి తలుపు  తీసాడు .. ఎదురుగా బాలయ్య .. పెద్ద క్యారేజ్ పట్టుకొని ఉన్నాడు ..
అయ్యగారు భోజనం పంపారు .. అన్నాడు బాలయ్య ..
లోపలికి రా .. అని లోపలకి నడిచాడు శివ ..
అదుగో భోజనాలు వచ్చాయి .. మీరు భోజనం కానివ్వండి .. నేను ,ధాత్రి భోజనం చేసి వస్తాము . .. అన్నాడు రత్నం అలా మీరు మల్లి వెళ్ళటం దేనికి ? . అందరం  కలిసి  ఇక్కడే తిందాం  ....  అన్నాడు యశ్వంత్ .
లేదు నాన్న గారు ఎదురు  చూ స్తూ ఉంటారు ... అన్నాడు రత్నం .
వెంటనే రచన వంక చూసి...  పోనీ ... ధాత్రి గారూ .. మీరన్నా మాతో కలసి  భోజనం చేయండి .. అన్నాడు యశ్వంత్ ... తనని ఉండమని కళ్ళతో సైగ చేస్తూ ..
మెల్లిగా .. సరేనని తల ఊపింది రచన .
సరే .. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ధాత్రి ఇక్కడే ఉంటుంది .. నేను భోజనం చేసి మళ్ళి వస్తాను .. సినిమా మళ్ళి వేయాలి అన్నాడు రత్నం .
సత్య నవ్వుతూ తలూపింది ..
సరే .. ఐతే .. నేను వెళ్లి వస్తాను .. అని  వీరితో చెప్పి బాలయ్యా పద పద .. అని బాలయ్య తో పాటు  బయటికి నడిచాడు .. రత్నం
వాళ్ళిద్దరూ వెళ్ళాక తలుపులు  మూసి వచ్చాడు శివ .
ఇతను చెప్పిన దంతా నిజమే నంటారా ? అంది సత్య ..
సత్యా .. అందులో కొంత నిజం ఉండొచ్చు .. కొంత అబద్ధం కూడా ఉండొచ్చు .. ఎవరు ఖచ్చితం గా చెప్పలేం కదా ..
అన్నాడు మురారి .
కానీ ఈ కథంతా విన్నాక నాకొకటి అనిపించింది ... రచన ఆ మహల్ కి వెళ్ళినపుడు  తనేం భ్రమ పడలేదు .. తను తీసిన  గది తలుపులు వైజయంతి వె అయి ఉండొచ్చు .. ... అన్నాడు  యశ్వంత్
. అంటే నీ ఉద్దేశ్యం వైజయంతి ఆత్మ ఇంకా ఆ మహల్ లో  ఉంది అంటావా ? అన్నాడు మురారి ..
 రచన నిర్లిప్తం గా అంది ... యశ్వంత్ చెప్పింది నిజం .. ఆ మహల్ లో ఉన్నది వైజయంతి ఆత్మే ...
ఏం మాట్లాడు తున్నారు మీరు ? ఈ సైన్స్  యుగం లో కూడా దెయ్యాలు ,భూతాలు ఉన్నాయంటారు ... ఇవన్ని ట్రాష్ ... ఇప్పటివరకు రత్నంచెప్పిన వాటిల్లో కొన్ని సంఘటనలు ఆ మహల్ లో జరిగి ఉండొచ్చు .. అంత మాత్రాన ఆ వైజయంతి ఇప్పటికి ఆ మహల్ లో  ఉండటం .. ఇదంతా ఎవరో  అల్లిన కట్టు కథ . ... అన్నాడు మురారి ..
మురారీ .. ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది ..   నేను ఒప్పు కుంటాను .. కాని అదే సైన్స్ మనిషి  శరీరం లో ఆత్మ ఉంటుందని .. అది మరణం తర్వాత  శరీరాన్ని వీడి వెళ్తుందని నిరూపించింది . అన్నాడు యశ్వంత్ .
అవును నేనొక మాగ్ జిన్ లో చదివాను .. అమెరికా లో డాక్టర్స్ ఆపరేషన్  చేస్తూ ఉండగా మథ్యలొ ఆ పేషెంట్  చని పోయాడట ..   ఆ తర్వాత ఆ ఆపరేషన్ వీడియొ ఆ డాక్టర్స్ చూసినపుడు ఆ రోగి శరీరం నుండి ఒక తెల్లని పొగ లాంటి ఆకారం శరీరం నుండి వేరు అయి వెళ్ళటం కనబడిందట . అది కరెక్ట్ గా అతను చని పోయిన సమయం తో మ్యాచ్  అయిందట .. అన్నాడు శివ .
నిజమే .. ఆ న్యూస్ అప్పట్లో సంచలనం సృష్టించింది .. అంది సత్య .
( ఇంకా ఉంది )







ఓ చిలిపి కలా ............

ఓ చిలిపి కలా .. వలపువలా .. తలపు అలా అలలా ...
నను తాకుతుంటే ఇంతలా ..
నువ్ చూపు కళా .. చిత్రమిలా .. చంద్రిమలా
ఉంటే మెరిసిందిలే వెన్నెలా ...
నీ కనుల కాటుక లా రేయి కె చీకటలా ..
నీ నవ్వు పున్నమిలా వెలుగునే చిమ్మునలా .. ఓ చిలిపి  కలా

నా ఆశలా...  పూవులా .. విరియు వేళా ..
నీ శ్వాసిలా ..వెచ్చగా .. మీటునే మేను నే అలా ...
ఓ పడుచు హంసలా .. నడిచిరావే ఇలా ..
ఎడబాటు  హింసలా ... బాధ పెడితేఎలా ?
కదలి రావాల మధుబాలా నిన్ను చేరేలా ..
కడలి కెరటాల కౌగిలిలో నది వోదిగేలా ...  ఓ చిలిపి కలా

నీ ఊహ లా .. మేఘమాల ..   తేలుతుందలా ..
ఈ మోహమేలా ... నిలువెల్లా .. నన్ను కాల్చేనేలా ?
అనురాగమాల ..నీ మెడ లో వేయాలా ?
కన్నయ్య లీలా ... నేను గా చూపాలా ?
వలపు విరహాలా .. మదినేల .. కుదిపెయ్యాలా ?
పిలుపులిక చాలా ?ఇంకా నిన్నడుగు తుండాలా ?     ఓ చిలిపి కలా



రుధిర సౌధం 27

 ఇందులో  సినిమాలు చూడొచ్చు కదూ   .... ఏ సినిమా అన్నా పెట్టు .. నేనోసారి చూస్తాను ..  అంటున్నాడు రత్నం రాజు .
సరే చెప్పు .. ఏ సినిమా పెట్టను ? అని తన లాప్ టాప్ వంక ఆసక్తి గా చూస్తున్న రత్నం రాజు ని చూస్తూ అడుగుతోంది సత్య .
ఏదన్నా పెట్టు .. ఈ ఊరిలో అసలు సినిమా హాల్ లేదు .. సినిమా చూడటమంటే 50 కి .మీ పోవాల్సిందే  ..అంటున్నాడు రత్నం రాజు ..
వీళ్ళ సంభాషణ నంతా కాస్త దూరం లో నిల్చుని చూస్తున్నారు రచన ,యశ్వంత్ .
రత్నం అమాయకుడే .. అతన్ని చూస్తే అనిపిస్తుంది .. అన్నాడు యశ్వంత్ .
అయ్యుండొచ్చు .. కాని అంత త్వరగా ఎవరిని అంచనా  వేయలేము ... అంది రచన ..
సర్లే .. కానీ..  భూపతి ఏమైనా నీతో అన్నాడా మాగురించి ?అడిగాడు యష్ .
అవును .. విసుక్కుంటున్నాడు .. అది భయమో లేక తన రాజయోగం పోతుందేమో అన్న అనుమానమో .. ఏమో మరి ... అంది రచన .

 ఉంటుంది లే రచన .. అది మామూలే .. అన్నాడు రత్నం రాజు ని గమనిస్తూ ..
అతడి చూపు ని గమనించి రత్నం కి దెయ్యాలంటే  చాలా భయం .. ఆ మహల్ పేరెత్తితే చాలు భయం తో వణికి పోతాడు .. అంది చిరునవ్వు తో రచన ..
అది సరే  కానీ .. నాకో చిన్న అనుమానం .. నువ్వు ఆ మహల్ లోకి  వెల్లానన్నావు .. తాళం చెవి ఆ బసవ రాజు దగ్గర దొరికిన్దన్నావు .. అదీ ఓకే .. కానీ నీకు ఆ పెట్టె లోనే తాళం చెవి ఉన్నదని ఎలా తెలిసింది .. అన్నాడు యష్ .
అతడి ప్రశ్న కి బిత్తర పోయింది రచన .. "" నా దగ్గర ఉన్న పుస్తకం కోసం యష్ కి చెప్పకూడదు .. "అనుకొని అదీ యష్ .. నాకు ఆ బసవరాజు కనబడ గానే ఆ మంటపం లోనికి వెళ్ళా కదా .. అక్కడ ఆ పెట్టె కొంచెం నాకు ప్రత్యేకం గా కనబడింది .. అందులో ఏమున్నాయో అని చూసాను .. కీ దొరికింది .. కానీ ఇప్పుడు ఆ కీ నా దగ్గర లేదు .. ఏమైందో తెలీదు .. ఇప్పుడు ఆ మహల్ లోనికి ఎలా వెళ్ళాలో .. ఆందోళన గా అంది రచన .
ఆ కీ కోసం అదే మండపం లో వెతికితే .. అన్నాడు యశ్వంత్ ..
చిన్నగా తలూపి ఐ హోప్ సో .. అంది రచన .
ఇకపోతే బసవ రాజు...  నీకే   ఎందుకు కనిపిస్తున్నాడు ? ఇదీ ఆలోచించాల్సిన విషయమే .. అన్నాడు సాలోచన గా యశ్వంత్ ..
యష్ .. ఇంకో మాట చెప్పనా .. భూపతి ఇంట్లో పనిజేసే వెంగమ్మ .. ఆమె  మాట్లాడటం నేనింత వరకు వినలేదు ..
అంది రచన .
అవునా ?మూ గదా ? అన్నాడు యష్ .
ఈ అనుమానం ఎవరికన్నా  వస్తుంది .. కానీ కాదు .. ఎందుకో మాట్లాడదు .. ఆమె చూపులు మాత్రమే మాట్లాడతాయి .. అంది రచన ..
ఐతే ఈ వూళ్ళో చేదిన్చాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి .. అన్నాడు యష్ .
చిరంజీవి సినిమా ఏదో లాప్ టాప్ లో పెట్టి నట్లుంది సత్య .. చాలా శ్రద్ధ గా చూస్తూ మధ్యలో ఈలలు వేస్తూ .. చప్పట్లు
కొడుతూ సంతోషం గా ఉన్నాడు రత్నం .
మనకేమన్నా పనికొస్తాడా రత్నం రాజు ? అతని వంక ఓరకంట చూస్తూ అన్నాడు యశ్వంత్ ..
ఏరకం గా ? అంది రచన ..
తరవాత  చెప్ప్తాను .. అని రత్నం రాజు దగ్గరికి   నడిచి .. అతని భుజం మీద చేయి వేసి చిరు ఫ్యాన్ వా ? అన్నాడు .
ఆ .. చాలా ఇష్టం .. అన్నాడు రత్నం ..
అది సరే గాని .. ఇందులో బోలెడు సినిమాలు ఉన్నాయి నీ హీరో వి .. అన్ని చూడొచ్చు నువ్వు .. అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ అతనితో అంత సన్నిహితం గా ఏం మాట్లాడుతున్నాడో అని తానూ వారి వద్దకి నడిచింది .. రచన .
నిజానికి మేము   అలాంటి హీరోలమే ..  తెలుసా .. అన్నాడు యశ్వంత్ .
సత్య సినిమా ని pause లో పెట్టి శ్రద్ధ గా వీళ్ళ మాటల్ని  విన సాగింది ..
మీరా ? మీరు ఫైట్స్ చేస్తారా ? డాన్సులు కూడా చేస్తారా ? అడిగాడు కాస్త ఆశ్చర్యం గా రత్నం .
కాదు అంతకి మించిన  సాహసాలు చేస్తాము .. మీ ఊరి లో ఉన్న మహల్ లాంటిదే .. ఇంకో కోట జై పూర్ లో ఉండేది .. అక్కడ ఇలాగే దెయ్యాలు , భూతాలు ఉన్నాయంటూ పుకార్లు ఉండేవి .. మేము ఆ కోట కి వెళ్ళాం .. చాలా  పరిశోధన లు చేసాం .. ఆ కోట లోనే కొన్నాళ్ళు  ఉన్నాం కూడా .. మాకేం కాలేదే .. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం .. ఇక్కడ కూడా అదే పుకార్లు .. అన్నాడు యశ్వంత్ ..
లేదు లేదు .. ఇవి పుకార్లు కావు .. నిజాలు .. అన్నాడు రత్నం .
నిద్ర పోవటానికి ప్రయత్నిస్తున్న శివ , మురారి వీళ్ళ సంభాషణ విని లేచి వచ్చి వీళ్ళ దగ్గరే కూర్చున్నారు . రచన .,సత్య చెవులు రిక్కించి వింటున్నారు .
పుకార్లు కావా .. నేను నమ్మను .. అన్నాడు యశ్వంత్ .
లేదు యశ్వంత్ గారూ .. నేను చెప్పేది  నిజం .. ఆ మహల్ లో దెయ్యం ఉంది ... ఆమె ఎవరను కుంటున్నారు ?ఒక యువరాణి .. అన్నాడు కళ్ళింత చేస్తూ రత్నం .
నిజమా ? అంది సత్య .

అవును సత్యా .. ఆమె రాజు గారి పెద్ద భార్య కూతురు .. పేరు వైజయంతి .. అన్నాడు రత్నం .
పెద్ద భార్య అంటున్నావు .. అంటే ఇంకో భార్య ఉందా ? అన్నాడు మురారి .
వాళ్ళలా శ్రద్ధ గా తన చుట్టూ కూర్చుని వినడం నచ్చింది రత్నం కి .
అవును .. ఇంకో భార్య ఉండేదట .. ఆమె కి ఒక కొడుకు ,కూతురు ఉండేవారట .. అన్నాడు రత్నం
(ఇంకా ఉంది )





Tuesday 17 December 2013

రుధిర సౌధం 26



అయ్యో .. మీరు టిఫిన్స్ చేయలేదా .. ఒక్క నిమిషం .. నేను మీకోసం టిఫిన్ తెప్పిస్తాను ..   పక్కనే చిన్న హోటలు ఉంది .. అని ధాత్రీ .. నువ్వు కాసేపు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు .. ఇప్పుడే వస్తాను .. అని ఉన్న పళం గా లేచి వీరు వారించే లోపే గుమ్మం దాటేసాడు రత్నం .
ఎం కంగారు రా బాబూ .. అని చెప్పండి ధాత్రి గారూ .. అన్నాడు యశ్వంత్ .
ఇంక చాలు యశ్వంత్ .. రత్నం లేడు కదా .. ఇక నీ ఓవర్ ఏక్షన్ తగ్గించు .. అంది రచన .
ధాత్రి నుంచి రచన లోకి వచ్చేసావా ? ఇంతకీ టిఫిన్ చేశావా ? అన్నాడు యశ్వంత్ .
చేశా గానీ .. యశ్వంత్ .. నువ్వొచ్చినపుడు అమ్మ ని కలిసావా ? ఆత్రం గా అడిగింది రచన .
.. అని తల ఊపి .. నువ్వు ఆవిడని ఎప్పుడు టెన్సన్ పెడతావు గా .. వెళ్లి కలిసాను .. నీకోసం ఎంతో బెంగ గా ఉన్నారు .. అన్నాడు యశ్వంత్ .
బాధ గా తలదించుకొ0ది రచన
హే .. ఎందుకలా ముఖం మాడ్చేసుకున్నావు ?నేను ఇక్కడికి వస్తున్నానని అనగానే .. ఎగిరి గెంతెసారు .. మా అమ్మాయి కి ఎలాగు నువ్వే బాడి గార్డ్ వి .. నువ్వుంటే ఇంకేం టెన్షన్ లేదు నాకు అన్నారు .. అన్నాడు తమాషాగా
చేతులు తిప్పుతూ యశ్వంత్ ..
చిన్నగా నవ్వి .. చూసావా శివా యశ్వంత్ ఎంత ఓవర్ ఏక్షన్ చేస్తున్నాడో .. అంది శివ వంక చూసి .
శివ నవ్వి .. నీకోసం యశ్వంత్ ఎంత టెన్షన్ పడ్డాడో నీకు తెలియదు రచనా .. నువ్విక్కడకి వచ్చావని తెలియగానే తనకి నిద్రలేకుండా పోయింది .. అన్నాడు శివ .
అతని మాటలు విన్న రచన హృదయం ద్రవించి పోయింది .. యశ్వంత్ కళ్ళలోకి ఆరాధన గా చూసింది ..
అతడు ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు .
ఇంతకీ అతను రత్నం రాజేనా ? అడిగాడు శివ .
అవునన్నట్లు తల పంకించి .. ఇప్పుడు టిఫిన్ లే కాదు మధ్యాహ్నం భోజనాలు కూడా భూపతి ఇంటి నుండే వస్తాయి .. అంది రచన .
వెరీ గుడ్ ఆతిథ్యం బాగానే ఉంది .. కానీ నిన్ను ఇంట్లో ఉంచాడు .. మమ్మల్ని మాత్రం వేరే ఇంటిలో పెట్టాడు .. అన్నాడు యశ్వంత్ .

అంత ఫీల్ అవకు యశ్వంత్ .. నెక్స్ట్ నా గది ఇటు వైపే   ఉంటుంది యశ్వంత్ .. ఇలా రండి చూపిస్తాను .. అని .. గుమ్మానికి ఇరువైపులా ఉన్న కిటికీ లలోఒకదాన్ని తెరచి భూపతి బంగ్లా చూపించి .. అదే భూపతి బంగ్లా .. తెలుసు కదా .. అంది .
కిటికీ లోంచి తొంగి చూస్తూ అవును అన్నారు శివ, యశ్వంత్
మొదటి అంతస్తు వైపు చూడండి .. చివరన ఉన్న కిటికీ ఉంది కదా .. అది నా గది కిటికీ నే .. కిటికీ పక్క ఉన్న పైపు గుండా కిందికి దిగి రాత్రుళ్ళు మహల్ దగ్గరకి వెళ్ళేదాన్ని .. అంది రచన .
ఓహ్ .. సో కిటికీ నుంచి నువ్ చూస్తే ఇల్లు కనిపిస్తుంది .. గుడ్ ఇదీ .. బాగానే ఉంది .. అన్నాడు యశ్వంత్ .
యష్ .. ఇంతకీ ఈరోజు మనం మహల్ దగ్గరికి వెళ్తున్నామా లేదా ?అన్నాడు శివ .
లేదు శివా .. ఈరోజు వద్దు .. మనం రేపట్నించి  మొదలు పెడదాం .. అన్నాడు యశ్వంత్ .
హాయ్ రచనా .. అంటూ వెనక నుంచి మురారి పలకరించాడు .
హాయ్ మురారి .. అని     పలకరించి ఇక్కడ నేను ధాత్రి .. అంది మెల్లిగా .
చిన్నగా నవ్వి ఎవ్వరూ లేరు కదా ఇక్కడ .. అన్నాడు మురారి .
రచన రత్నం తో వచ్చింది మురారి .. అతడు బయటికి వెళ్ళాడు .. క్షణం లోనైనా రావొచ్చు మళ్ళి .. అన్నాడు శివ .
ఓహ్ .. అని యశ్వంత్ మహల్ దగ్గరికి  ఎందుకు  వద్దంటు న్నావు ? ప్రతి అమావాస్య కె కదా ఇక్కడ హత్యలు జరిగేది .. ఈరోజు మనం వెళ్తే కదా మనకా నిజం తెలిసేది ?అన్నాడు మురారి .
లేదు మురారీ .. ముందు మహల్ లోకి వెళ్ళాలి .. అంతా పరికించి చూడాలి .. దీనికి కొన్ని రోజులు పడుతుంది .. అదే ఈరోజే మనం వెళ్తే రహస్యం బట్టబయలు చేసే ప్రయత్నం లో మనలో ఎవరన్నా ప్రమాదం లో పడొచ్చు .. అన్నాడు యశ్వంత్ ..
అందరూ నిశ్శబ్దం గా తల లూపారు.. 
ఇంతలో టిఫిన్స్   ఒక పని వాడి తో పాటు వచ్చాడు .. రత్నం 
రత్నం ,ధాత్రి లతో మాట్లాడుతూనే టిఫిన్స్ కానిచ్చారు యశ్వంత్ బృందం . 
ఆ కొద్ది సేపట్లోనే రత్నం అమాయకత్వం నచ్చింది వాళ్లకి .. అతను భూపతి లాంటి వాడు కాదని మనసులో అర్థం చేసుకున్నారు .. 
(ఇంకా ఉంది)