Powered By Blogger

Friday 14 March 2014

రంగుల కేళి .





ఇంద్ర ధనువు నే వంచి రంగులు కొన్ని సేకరించా ... 

రోజా పూల రంగుని అడిగి మీకోసం దాచి ఉంచా .

మల్లె పూలు కూడా తమ వర్ణాన్ని అప్పు ఇచ్చాయి .. 

చామంతులు ,బంతులు మరెన్నో పూలు తమ రంగుల్ని నాకిచ్చాయి 


ఆకాశం నీలి రంగుని దోసిలి లో పోసింది . రాతిరి నల్లని రంగు పులిమింది . 




చెట్లు పచ్చదనాన్ని నవ్వుతూ అరువి చ్చాయి .. 

సీతాకోకచిలుక వెదుక్కుంటూ వచ్చి మరింత శోభ నిచ్చింది 

ఎన్నెన్ని వర్ణాలో ప్రకృతి ముగ్ధ మోహన రూపం లో .. 

అన్నీ చేరి నాకు మరింత సంతోష పెట్టాయి .. 

వాటితో పాటు  నా ఆనందపు రంగుని కలిపి తీసుకొస్తున్నా హోలీ పండుగని . 

కాచు కోండి మరి ప్రకృతి వర్ణాలలో మమేకమై చిరునవ్వుల దొంతరలను కూర్చడానికి . 






7 comments:

gajula sridevi said...

హోళీ అద్భుతంగా చూపించారుగా ,రాధికా ఆడడమే తరువాయి.

రాధిక said...

ధన్యవాదాలు శ్రీదేవి గారూ .. ఇంకేం మొదలు పెట్టండి రంగుల కేళి రంగేళి

Karthik said...

Beautiful pics..
happy Holi..radhika gaaru:):)

రాధిక said...

thank you karteek gaaru

రాధిక said...

thank you karteek garu..

and wishing you very happy holi

సతీష్ కొత్తూరి said...

హూలీ శుభాకాంక్షలు

రాధిక said...

వన్నెల పండుగ వెన్నెల వేళ

వసంత కేళి ఆడెను హోళీ ..

మీకు కూడా హోలీ శుభాకాంక్షలు సతీష్ గారూ