Powered By Blogger

Thursday 6 March 2014

నేను








ప్రియ సమీరమా ..

                                 నా ముంగురులని సవరించిపో ..

మృదు దరహాసమా ...

                                నా పెదవులపై ముచ్చటగా ఒదిగిపో ..

మధుర స్వప్నమా ..

                                నా కన్నులలో వెన్నెలను నింపిపో ..

తొలి అరుణమా ...

                                నా చెక్కిలి పై సిగ్గులా నిలిచిపో ..

భానుతేజమా ...

                                నా నుదుట తిలకమై వెలిగిపో ..

చినుకు ముత్యమా ..

                                  నా ముక్కెర లా తళుకు లీనిపో ..

ఇoదు  బింబమా ....

                                నా వదనాన్ని చుంబించి పో ..

నవనీతమా ...

                                నా హృదయ మార్దవమై మారిపో ..


                               



    

8 comments:

Anonymous said...

meeru baavunnaru

sukanya said...

nice.. keep going

Anonymous said...

స్వప్నాన్ని మీ కన్నుల లో వెలుగు నింపమని అడిగారు , చాల బాగా రాసారు అండి
ఇన బింబం అంటే ఏంటి ?

రాధిక said...

"తెలుగోడు " గారూ .. ముందుగా నా బ్లాగ్ కి మీకు స్వాగతం .

ఇన బింబం అంటే ఏమిటని అడిగారు .. ఇన బింబం అంటే జాబిలి .. చందమామ , ఇనుడు అంటే చంద్రుడు .. అని అర్థం .

చంద్రుడ్ని చుంబించ మని అడగటం అంటే చంద్ర బింబం కంటే అందమైన వదనమని (వదనం అంటే ముఖం ) అంటే నా భావం చంద్రుడికే ముద్దొచ్చే లా ఉందని అర్థం

సతీష్ కొత్తూరి said...

చాలా బాగుంది... అలతి అలతి పదాలతో... వెన్నెల మీద సంతకం చేసినట్టు....

Anonymous said...

అర్థం ఇంత బాగా చెప్పినందుకు మీకు దన్యవాదములు.. మీ లాంటి వాళ్ళని చూసి నేను కూడా బ్లాగు లో వ్రాయటం నేర్చుకుంటున్నా.

రాధిక said...

వహ్వా .. బాగా చెప్పారండీ .. నిజంగా వెన్నెల మీద సంతకం చేయగలిగితే బావుణ్ణు

రాధిక said...

thank you telugodu gaaru