Powered By Blogger

Thursday 3 November 2016

పెద్దరికం

వర్షం పడి  బురద గా ఉంది రోడ్ అంతా ..

ఒక పెద్ద మనిషి పంచె పైకి లాక్కుంటూ విసుక్కుంటూ నడుస్తున్నాడు ..

ఇంతలో రోడ్ పై  ఒక గుంట బురద నీటితో నిండి ఉందేమో పెద్దాయన చూసుకోలేదు .. అంతే

కాలుజారి జర్రున జారి పడ్డాడు ..

పక్కనే వెళ్తున్న ఒక వ్యక్తి .. అయ్యో పడి పోయారా .. అంటూ చెయ్యి అందివ్వ బోయాడు ..

పెద్దాయన చెయ్యి అందిస్తున్న అతడిని నఖ శిఖ పర్యంతం చూసి .. ఇతడా ? తక్కువ కులం

వాడు .. అని మెల్లిగా గొణుక్కొని .. ఆ పక్కగానే వెళ్తున్న గుడి పూజారి శర్మ గారిని చూసి ..

ఏమయ్యా శర్మా ? ఇలా వఛ్చి నన్ను కొంచెం లేపవయ్యా .. అన్నాడు.

చెయ్యి అందించేందుకు ప్రయత్నించిన వ్యక్తి కి విషయం అర్థమైంది .. కానీ అతడు చిన్న

బుచ్చుకోకుండా పెద్దాయన వైపు చిరునవ్వు తో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

శర్మగారు పెద్దాయన ని లేపడం , పెద్దాయన అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగి పోయాయి .

కొన్నాళ్ల తరువాత .....

పెద్దాయన కి ఒక చిన్న ఏక్సిడెంట్ .. రక్తం పోయింది .. రక్తం సమయానికి ఎక్కించాలంటే

అరుదైన వర్గపు రక్త మాయే .. పెద్దాయన కుటుంబం బెంబేలు పడిపోయింది.

ఇంతలో నర్స్ వఛ్చి చెప్పింది . దాత దొరికాడు సుమీ .. పెద్దాయన ప్రమాదం నుంచి బయట

పడ్డాడు . ఇంటికి చేరాడు సంపూర్ణ ఆరోగ్యం తో .

పెద్దాయన పూర్తి గ కోలుకున్నాక పెద్దాయన భార్య ఒక నాడు అంది. మీ ప్రాణాలని కాపాడిన

డాక్టర్ గారికి కృతజఞతలు చెప్పి వద్దామండి  అని. పెద్దాయన సరే అన్నాడు ..

ఇద్దరు డాక్టర్ ని కలిసేందుకు వెళ్లారు . డాక్టర్ ఒక వ్యక్తి తో మాట్లాడుతూ కనపడ్డాడు.

పెద్దాయన ని చూసి డాక్టర్ లోపలి ఆహ్వానించాడు . డాక్టర్ తో మాట్లాడుతున్న వ్యక్తి పెద్దాయన

ని చిరునవ్వు తో చూసి మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ? అన్నాడు .

పెద్దాయన అతడి ని చూసి  ఇతడా ? ఆ కులం తక్కువ వాడే కదూ .. అనుకుంటూ .. అతని

పలకరింపు ని లక్ష్య పెట్టక డాక్టర్ ని చూసి ..

మీరు మా ప్రాణం కాపాడారు .. మీకు కృతజఞతలు చెప్దామని వచ్చాం .. అన్నాడు పెద్దాయన .

అయ్యో .. మా డ్యూటీ మేము చేసాం . నిజానికి కృతజఞతలు చెప్పాల్సింది ఈయన కె నండి .

ఆరోజు మీకు రక్తం ఇచ్చింది ఈయనే .. సమయానికి ఈయన రక్తం ఇవ్వకుంటే ఈ పల్లె లో

బొటాబొటి వైద్య సదుపాయాలున్న ఈ చోట మిమ్మల్ని కాపాడటం మాకు సాధ్య మయ్యేది కాదు .

అన్నాడు డాక్టర్ .

పెద్దాయన విస్తు బోయాడు . నోట మాట రాలేదు ఆయనకి .

ఆ వ్యక్తి లేచి పెద్దాయన తో .. అవునండి .. మీ రక్త వర్గం నా రక్త వర్గం ఒక్కటే .. కానీ కులాలు వేరు

. నేను కులానికి తక్కువ వాడిని .. గుణానికి కాదు . అని డాక్టర్ గారి దగ్గర సెలవు పుచ్చు కొని

వెళ్ళిపోయాడు .


పెద్దాయన కళ్ళు నీళ్లతో నిండి పోయాయి .. అవి పశ్చాత్పాపం తోనా అవమానం తోనా ..

ఆ భగవంతుడికే తెలియాలి .

                                             

                                     

దూరమయిన బంధం



మిణుగురుల వెలుతురులా .. గోదారి ఒడ్డున మసక వెన్నెల .. 

నునువెచ్చ్చని గ్రీష్మపు తాకిడి .. నుదుట పట్టిన చెమట తడి . 

నడి మధ్య అలల తో తెరచాప .. చిరుగాలికి నా పైట రెపరెపా . 

వెచ్చ్చని ఇసుక తిన్నెల పై నా బొటన వేలు సంభాషణ .. 

మబ్బుల్లోకి చంద్రుడు .. మరి రా డే  నా ఇంద్రుడు .. ?

మౌనం గా గోదారి తో మాట్లాడుతున్నా .. కళ్ళ వెంబడి వరదలైన గోదారిని 

ఏ దారిన పంపాలని అడుగుతున్నా .. 

ప్రతి ఏడు ఇదే చోటు .. ప్రతి సారి ఇదే నేను .. మరి ఈసారి ఆ ప్రతి సారి కాలేదే . 

ముక్కలైన హృదయాన్ని ఏరుకునే మనసు లేదు .. 

సెలవిచ్చ్చిన సంతోషాన్ని కోరుకునే వయసు కాదు . 

జ్ఞాపకాలే ఆలంబన గా సాగుతున్న జీవితాన్ని .. మాయమైన నీ చిరునవ్వుని 

గోదావరి గల గల ల  సవ్వడి లో వెతుకు తున్నా .. 

పిల్ల గాలుల పల్లకి లో నీ ఊసుల దొంతరలు నాదాకా వస్తాయేమో అనుకున్నా .. 

మరి రావని జత కావని ఇక లేవని ఆలోచనే తనువెల్లా  తాకుతుంటే 

నిస్పృహలే తోడుగా నిస్తేజపు అడుగులతో ఈసారికి వెళుతున్నా .. 

మనసు నిక్కడ ఉంచి నేను జీవచఛవ మై  నడిచా .. 

ఈనాడల్లే ప్రతి ఏడు నీ కొరకే మరలి వస్తా ... 

నిను కడుపున దాచుకున్న గోదారిని నిలదీస్తా .. 

ఎందుకు దూరం చేసిందని ...

 తన ఒడ్డున పుట్టిన ప్రేమ కి తానె అసూయ ఎందుకు పడిందని ... ????


















మీ అభిప్రాయం మాకు అతి విలువైనది