Powered By Blogger

Wednesday 29 January 2014

ఇంటి భోజనం (ఓ చిన్న కథ )

                                 ఇంటి భోజనం
 అరె  ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ పెరుగన్నం,పులిహోర,వైట్ రైస్ ,ముద్దపప్పు... ఇవేనా ?  తినాలి అంటే .... బోర్ 
కొడుతుంది ప్రియా ... విసుగ్గా అన్నాడు శరత్ . 
  శరత్ నీకీమధ్య బయట తిండి అలవాటు అయింది ... అందుకే వీటన్నింటిని వద్దంటున్నావు . ఐనా నీకోసం ఎంత 
ప్రేమగా చేస్తానో ఆలోచించావా? అంది ప్రియ ఓ పక్క శరత్ లంచ్ బాక్స్  సిద్ధం చెస్తునె. 
    నేనెంత చెప్పినా నువ్వేమన్నా వింటావా ? నీకు నచ్సినట్లే కానీ ... కాస్త కోపాన్ని అదుపు లో పెట్టుకునే అన్నాడు 
శరత్ . 
 సరె.. వేళకి తిను శరత్ ... చిరునవ్వుతో లంచ్ బాక్స్ బాగ్ ని అందించింది ప్రియ . 
అలాగే కానీ ..వారమ్ లో 2రోజులైనా నాకు నచ్చిన భోజనం చేయనీ ప్రియా.. అన్నాడు శరత్ .. 
వద్దు శరత్ .. బయటి భోజనం ఆరోగ్యానికి మంచిది కాదు... రుచికరం గ ఉందని అలవాటు చేసుకోవటం తోనే మొదలవుతున్ది.. అనారొగ్యమ్... నేనుండగా మీకే సమస్య రానీయను కదా... అంది స్థిరం గ ప్రియా . 
             సర్లే ... నేనైతే నీతో వాదించలేను .. ఆఫీసు కి టైం ఐంది గానీ నేనింక బయల్దేరుతాను .. అన్నాడు శరత్ 
సరే ... అంది ప్రియ చిరునవ్వు తో . 
            బైక్  స్టార్ట్ చేసి ఆఫీసు కి అరగంట లో చేరుకున్నాడు సరత్
                                                                              *  *   *  
ఆఫీసు లో లంచ్ టైం . 

        ఏం  శరత్ .. ఈరోజు కూడా మాతో పాటు లంచ్ కి రావటం లేదా నువ్వు? అడిగాడు  కొలీగ్ ప్రసాద్ . 
లేదు ప్రసాద్ ... నాకు లంచ్ ఉంది ... అన్నాడు శరత్ 
ఏంటి ఆ  పుళిహోరా ,దద్దోజనమేనా? నవ్వుతూ అడిగాడు ప్రసాద్ 
అవునన్నట్లు తలాడించాడు  శరత్ . 
ఏం ఫుడ్ బాస్ అది? హాయిగా ఏ పిజ్జా నో లాగించక. అన్నాడు ప్రసాద్ 
ఐనా ఆఫీసు లో అందరం క్యాంటీన్ తింటున్నాం కదా... కొత్త కొత్త రుచులు బయట అనేకం ఉన్నాయి బ్రదర్ ... అన్నాడు ప్రసాద్ . 
అవును ... ఈరోజైతే  నేను లంచ్ తెచ్చుకున్నకదా ... రేపు మీతో వస్తాను ప్రసాద్ ... అన్నాడు శరత్ 
సరే ఐతే నీ  లంచ్ కానివ్వు నేనీరోజు చీస్ పిజ్జా తిని వస్తాను అన్నాడు ప్రసాద్ . 
ప్రసాద్  అటు అలా వెళ్ళ గానే లంచ్ బాక్స్ ఓపెన్ చేసాడు శరత్ ... అబ్బా !ఎప్పుడు ఇవే తినాలా ? ఈరోజుకి బయట ఏ పిజ్జానో తింటేనో .... ప్రియ కే మన్నా తెలుస్తుందా ఏంటి ? కావలిస్తే ఇంటికి వెళ్లేముందు బాక్స్ ఖాళీ చేస్తే సరి అనుకున్నాడు శరత్ ... కానీ పాపం ఉదయాన్నే లేచి నాకోసం కష్టపడి అన్ని వంటలు చేస్తుంది ... నేను వీటిని పారేయ్యలేను కదా ... అనుకుని తినడం ఆరంభించాడు శరత్ . 
                                                                              ******
ఇప్పుడెం చేశావు ప్రియా   డిన్నర్ కి ? చేతులు శుభ్రం చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అడిగాడు శరత్ .. 
ఆమె నవ్వుతూ ప్లేట్ లో వడ్డించిన పదార్ధాన్నిచూసి ఆశ్చర్య పోయాడు శరత్ . 
పిజ్జా నా ?నాకోసం నువ్వు పిజ్జా తెప్పించావా ?అడిగాడు శరత్ 
లేదు ... నేనే చేశాను అంది ప్రియ చిరునవ్వుతో . 
పిజ్జా నా ?నీకిది చేయటం వచ్చా?అని అడిగాడు శరత్ ... 
వచ్చేది కాదు కానీ పక్కింటి రాణీ కి వచ్చు తన దగ్గర నేర్చుకున్నాను ... మీకిలాంటి ఫుడ్ అంటే ఇష్టం కదా ... అందుకే మీకు పిజ్జా చేసి పెట్టాలనుకున్నాను ...  రుచి చూసి చెప్పండి ఎలా వుందో ... అంది ప్రియ ఆత్రుత గా 
 నాకోసం తాపత్రయపడతావు ప్రియా ... అనుకొని ఓ చిన్న ముక్క తిని అద్భుతం అన్నాడు శరత్ 
సంతోషం గా నవ్వింది ప్రియ . 
                                                                           *******

ఏంటి బాస్ ఈ రోజు ఇంత డల్ గా ఉన్నారు  అడిగాడు శరత్ ప్రసాద్ ని . 
టైం చూసావా శరత్ 3గం దాటింది ... బాగా ఆకలిగా ఉంది ... అన్నాడు ప్రసాద్ 
అదేంటి ?ఇంతకూ ముందు మీరంతా లంచ్ కి వెళ్లారు కదా !ఏమి తినలేదా ?ఆశ్చర్యం గ అడిగాడు శరత్ 

బాస్ .. ఈరోజు సిటీ లో బంద్ .. కాంటీన్ కూడా ఈరోజు లేదు సరికదా ఒక్క రెస్టారంట్ కూడా ఈరోజు ఓపెన్ చేయలేదు ... ఫలితం ఈరోజు భోజనం లేదు అన్నాడు నీరసం గా ప్రసాద్ 
అయ్యొ... అలా ఐతే నాకు మీకు భోజనం ఆఫర్ చేయాలనీ ఉంది కానీ ఇలాంటి భోజనం మీకు నచ్చదు కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు  శరత్ . 
అదేంటి నువ్వింకా తినలేదా అడిగాడు ప్రసాద్ 
వర్క్ ఉంది అందుకే తినలేదు ఐనా ఈరోజు హోలీ పండగ కూడా ...  నా వైఫ్ ఏవేవో specials చేసుంటుంది ... అన్నాడు గమ్మత్తు గ శరత్ . 

అయ్యో శరత్ బాగా ఆకలి గ ఉంది ... ఈరోజు నీ లంచ్ బాక్సే గతి నాకు ... అన్నాడు ప్రసాద్ 
సరే రా ... కలసి తిందాం అన్నాడు శరత్ 
ఇద్దరూ కలసి భోజనం ముగించారు ... 
ఏ మాట కా మాటే చెప్పాలి శరత్ .. ఇంత రుచికరమయిన భోజనం నేనెక్కడా తినలేదు ... నువ్వు అదృష్టవంతుడివి శరత్ .. నీ వైఫ్ నీకు ప్రేమ గ లంచ్ బాక్స్ కడుతుంది ... నా భార్య నాలాగే ఉద్యోగానికి వెళుతుంది ... తను లంచ్ ఏ రెస్టారంట్ లోనో చేస్తుంది ... నేను అంతే .. జీవితం యాంత్రికం అయిపోతుంది ... డబ్బు సంపాదిస్తున్నా మన్న మాటే గానీ జీవితం లో తృప్తి లేదు ..ఆ  అశాంతి తో ఉన్నా నన్న నిజం ఇప్పుడు అర్థమయింది . ఇంటి భోజనం ఆకలి తీర్చడమే కాదు మన ఆత్మీయుల ప్రేమ ని పంచుతుంది... ఇది నిజం బాసూ అన్నాడు ప్రసాద్ 

సంతృప్తి గా తల ఊపాడు శరత్ . 
                                                        ********************
ప్రియా .... ఈరోజు లంచ్ కొంచెం ఎక్కువ కట్టు అని చెప్పాడు శరత్ ... 
అదేమిటీ ....ఈరొజు లంచ్ కోసం ఇంత  శ్రద్ధ చూపిస్తున్నారు ... రోజూ నేను సిద్దం చేసే వంటకాలని గేలి చేస్తారుగా ... 
అంది ప్రియ 
నీ చేతి వంట తినాలంటే అదృష్టమే చేసుకోవాలి .... ఆ విషయం ఇప్పుడే అర్ధం చేసుకున్నాను ... చదువుకున్నా ఉద్యోగం చేయకుండా అనుక్షణం నాకోసమే పాటు పడతావు ... ఏంతో  ఇష్టం గా నాకోసం వంట చేస్తావు .... నాకేది ఇష్టమో తెలుసుకుని నేర్చుకుని మరీ నాకు వండి పెడతావు ....నాపై ప్రెమనీ..  . శ్రద్ధ నీ ఎంతగానో  చూపిస్తావు 
అలాంటి నీ ప్రేమని నేను గేలి చేసినందుకు నన్ను క్షమించు ప్రియా... అన్నాడు శరత్ 
ప్రియ కనుల నిండా నీళ్ళూ 
థాంక్స్ శరత్  ... నువ్వు నా కష్టాన్ని ప్రేమనీ గుర్తించావు .... అది చాలు .... నీకీ రోజు పిజ్జా పెట్టనా లంచ్ కి అని అంది 

లేదు ...నీ స్పెషల్ పులిహోర ,దద్దోజనం చాలు ... అన్నాడు శరత్ 
ప్రియ ఆనందం గా తల ఊపి వంటగదిలోకి వెళ్ళింది 
"ప్రసాద్ .... నీ వల్ల నా భార్య గొప్పతనాన్ని,ఇంటి భోజనపు రుచి విలువనీ తెలుసుకున్నాను థాంక్స్ "అని  మనసులోనే ప్రసాద్ కు కృతజ్ణతలు చేప్పుకున్నాడు శరత్ 

                                                              సమాప్తం  

7 comments:

Anonymous said...

Please change the black template Radhika garu .It can strain the eyes.

బాల said...

బాగా రాశారండీ.
దేని విలువ అయినా అది దూరం అయిన తర్వాతే అర్ధం అవుతుందేమో????

రాధిక said...

కృతజ్ఞతలు బాల గారూ ..నా "నా రచన" కి మీకు స్వాగతం ..
అది మనిషి నైజం అండి .. అందిన వాటిని చులకన గా చూడటం .. అందని వాటిని ఆరాధించటం .. ఏదైనా దూరం అయినప్పుడే దాని విలువని గుర్తించ గలగటం ..

జ్యోతిర్మయి said...

నూతనత్వం వరవడిలో కొట్టుకుపోతున్న వారికి కనువిప్పు...బావుంది కథ.

రాధిక said...

"నా రచన " కి మీకు స్వాగతం జ్యోతిర్మయి గారూ .. మీ అభిప్రాయం వ్యక్త పరచినందుకు ,మీ ప్రశంస కి నా కృతజ్నతలు.

Anonymous said...

Pulihora daddojanam bagundhi andi

రాధిక said...

very funny comment kiran ji..

enjoy the food. thank you