Powered By Blogger

Saturday 31 May 2014

రుధిర సౌధం 160

ఓ ముసలాయన .. ఓ నడివయస్సు దంపతులు .. ఓ చిన్న పిల్లవాడు ఉన్నారక్కడ .

యశ్వంత్ ముందుగా వారిదగ్గరకి నడిచి .. కిందన కూర్చుని విగ్రహం వైపు ఆరాధన గా చూస్తున్న ముసలాయన్ని

ఉద్దేశించి ... తాతా .. అని పిలిచాడు .

ఆ పిలుపు కి ఆశ్చర్యంగా వెనుదిరిగి  చూశాడు ఆ ముసలి వాడు .

ఆ నడి వయస్సు దంపతులు కూడా వీరివంక ఆశ్చర్యం గా చూశారు .


మీరు .. ఇంత రాత్రి వేళలో .. ఈ విగ్రహానికి పూజ చేస్తున్నారు .. ఎవరు మీరు ? అని అడిగాడు యశ్వంత్ .

నాకు ఆశ్చర్యంగా నే ఉంది నాయనా .. మీరెవరు ? ఇంత రాత్రి వేళ ఈ అడవిలో మీకు పనేంటి ? అన్నాడు అతడు ..

యశ్వంత్ చిన్నగా నవ్వి .. మేము .. రావణ పురం నుంచి వచ్చాం .. ఇక్కడి ప్రాచీన భవనము లమీద పరిశోధన లు

జరిపేందుకు .. అన్నాడు .

ఆ నడి వయస్సు వ్యక్తి వీరిదగ్గరకి వచ్చి .. అంటే మీరు పట్నం వాళ్ళు .. మీకు తెలియదేమో .. ఆ భవనాలు అంత

మంచివి కావు మీ పనులు చేసుకునేందుకు అయినా .. అన్నాడు .

యశ్వంత్ చిన్నగా నవ్వి .. ఇంతకీ మీరెవరు అన్నది చెప్పనే లేదు .. అన్నాడు ..

దానికి ఆ ముసలాయన .. నా పేరు పరంధాముడు .. వీడు నా కొడుకు చిన్నారావు .. ఆమె నా కోడలు సీతమ్మ ..

ఈ చిన్నోడు నా మనవడు .. పేరు దినేష్ .. మేమిక్కడ కి అమ్మవారి పూజ చేసుకునేందుకు వచ్చాం .. అన్నాడు .

అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంత రాత్రి వేళ పూజలేంటి ? అన్నాడు యశ్వంత్ వెనకాల నుండి శివ ..

ఆ ముసలాయన .. శివ .. మురారిల వైపు చూసి .. మళ్ళి యశ్వంత్ వైపు చూసి .. నీ స్నేహితులా .. అన్నాడు .

యశ్వంత్ చిరునవ్వుతో తల ఊపాడు ..

అతడు శివ వైపు చూసి .. ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారు వైష్ణవీ మాత .. ఈమె ఒకప్పుడు ఆ రావణ పురం

మహల్ లో ఉండే ఓ ఆలయం లో ఉండేది .. ఆ కోటలో యువరాణి అమ్మవారిని ప్రతినిత్యం కొలిచేది .. ప్రతి

పౌర్ణమి కి ముందు 3 వ  రోజు నుండి పౌర్ణమి వరకు ప్రత్యెక పూజలు జరపటం ఆనవాయితీ .. ఆ తల్లి అలా

అమ్మవార్ని కొలిచేది .. ఆ అమ్మవారు ఆ తల్లి పిలిస్తే పలికేది .. కానీ కాలం ఎప్పుడు ఒక్కలా ఉండదు కదా ..

ఆ యువరాణి అనుకోకుండా ఒకరోజు ప్రాణత్యాగం చేసుకుంది .. ఆమె మరణం తరువాత మహల్లో తాంత్రిక శక్తులు

తిరుగాడుతుండేవి .. తరువాత మరో యువరాణి వైజయంతి ని మహారాజే స్వయంగా హత్య చేశారని ఒక పుకారు .

ఆమె .. ఆ మహల్లో దుష్ట శక్తిగా తిరుగుతుందని కూడా అంటారు .. ఆ లక్షణాలతో ఆలయం దైవత్వాన్ని కోల్పోయి

పవిత్రత ని త్యజించింది . అమ్మవారు ఆలయాన్ని వదిలి ఇలా ఈ అడవి లోకి వచ్చి చేరిందని మా నమ్మకం .

ప్రతి పౌర్ణమి కి ముందు 3 రోజుల నుండి ఇలా వెన్నెల వెలుగులో ఈ తల్లి ని కొలవటం మా అలవాటు .. అన్నాడు .

అమ్మవారు ఇక్కడికి వచ్చేసిందని మీకెవరు చెప్పారు ? అన్నాడు మురారి .

మా నాన్న .. మా నాన్న కి కలలో అమ్మ చెప్పిందట .. ఇక్కడున్నానని .. వచ్చి చూసేసరికి ఈ విగ్రహం ఉంది ..

అప్పటి నుండి అమ్మవార్ని ఆయన కంటికి రెప్పలా చూసుకున్నాడు .. ఇప్పుడు మేము .. కానీ మా నాన్న

చెప్పినట్టు మళ్ళి ఈ అమ్మవారు మహల్ ఆలయానికి వేల్లిపోతుందట .. ఆ రోజు త్వరలోనే రాబోతుంది .. అన్నాడు

ఆ ముసలాయన .


ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday 30 May 2014

రుధిర సౌధం 159


అంటే నువ్వు పవిత్రుడవు కావనేగా అర్థం .. నిజమే .. భూపతి స్వార్థం కోసం పాపపు పనులు చేసే నువ్వు

పవిత్రుడవు ఎలా కాగలవు లే .. కానీ నువ్వు ఈ అమ్మాయి ని కాపాడ లేకపోతె .. ఆత్మల్ని బంధించగలవు .. నాకు

ఆ విషయం స్పష్టం గా తెలుసు . బసవరాజు ని నువ్వే బందించావు . మళ్లి వాడిని బంధించు .. ఇప్పుడే ఇక్కడే ..

అంది .. రచన .

నీకు తెలియదేమో పిల్లా .. ఇక్కడ భయంకర మైన ఒక శక్తి ఆనవాళ్ళు ఉన్నాయి .. ఆ శక్తి ఏ క్షణమైనా మన మీద

విరుచుకు పడవచ్చు . ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా ఇక్కడినుండి కదలాలి మనం .. అన్నాడు చుట్టూ

గుండ్రం గా కనుగుడ్లు తిప్పుతూ ..


నీతో ఎటువంటి చర్చా నాకొద్దు వీరస్వామి . నా గన్ తొందరపడక ముందే .. ఆ బసవరాజు ని .. బంధించు .. అంతే

కాదు .. నువ్వు చెబుతున్న ఆ భయానక శక్తి వైజయంతి  అయుంటే దానిని కూడా .. నువ్వు వెంటనే పూజలో

కూర్చోక పోతే .. నా గన్ నిర్దాక్షిణ్యం గా వ్యవహరిస్తుంది . ఆడపిల్ల చేతిలో ఉన్నంత మాత్రాన అది సున్నితం గా

గాయం చేయదు .. నీ ప్రాణం .. నీ తాంత్రిక విద్యలు అన్నీ గాలిలో కలసిపోతాయి .. అంది రచన గంభీరంగా ..

ఆమె చెప్పినట్లే చెయ్యి వీరస్వామి .. ఎప్పుడో ఎంటీవోడి సినిమాలో చూశా గన్ను .. అది నిజంగానే పేనం తీస్తది ..

తర్వాత చూసుకుందాం .. ముందు పూజ మొదలెట్టు .. అన్నాడు బాలయ్య .

అంతవరకూ వాళ్ళ పక్కన అయోమయం గా నిల్చున్న సరస్వతి .. తనని ఎవ్వరూ పట్టుకోలేదని అప్పుడే

గమనిన్చినట్టుగా .. పరుగున రచన వెనకాల కొచ్చి నిలబడింది .

వీరస్వామి .. రచన వంక చూస్తూ .. అక్కడే కూర్చున్నాడు .. బాలయ్య కూడా కూర్చుంటూ .. వీరాసామి .. ముందు

ఆ పూజేదో ఈ పిల్ల కట్టుబడేలా చేసెయ్యి .. తెలుత్తదా .. ఏమి ? అన్నాడు .. బాలయ్య వీరస్వామి చెవిలో వినబడేట్టు .

"నీకు తెలీదు బాలయ్యా .. ఈ పిల్ల మాటల్లో , చేతల్లో రాజసం ఉట్టి పడుతోంది .. ఒకవేళ నా అంచనా ప్రకారం ఈమె

రాచ బిడ్డే అయ్యుంటే .. నా లక్ష్యం నెరవేరుతుంది .. అమ్మవారి గుడి తెరిచే శక్తి ఈమె కి మాత్రమె ఉంటుంది ..

ఈమె చెప్పినట్టు ఆ వైజయంతి ఈడనే ఉంది , బసవరాజు కూడా .. ఆ ఆత్మల్ని బంధించడం నాకు వెన్నతో పెట్టిన

విద్య . అలాగే ఈ పిల్ల ని విడిపించటం కూడా .. ఇప్పుడు ఈమె చెప్పినట్టే ఆత్మల్ని బంధించి వేస్తా .. అని మనసు

లోనే అనుకొని బాలయ్య వైపు తిరిగి .. పూజ సామాన్లు .. ఆ మూలన  ఉన్నాయి పట్టుకురా అన్నాడు వీరస్వామి .

చిన్నగా తలూపి బాలయ్య ఆ మూలకి వెళ్లి ఓ పాత బుట్ట ని తీసుకు వచ్చాడు .

రచన మాత్రం వారికి గన్ గురిపెట్టి అలానే నిలబడింది . సరస్వతి ఆసక్తిగా వారి వైపు చూస్తోంది .

                                                         ******************

యశ్వంత్ ,మురారి .. శివ కొంత దూరం నడిచేసరికి వారికి ఓ దృశ్యం ఆశ్చర్యం కలిగించింది ..

ఓ చెట్టు కింద చిన్న దేవత విగ్రహం .. ఆ విగ్రహానికి ఓ కుటుంబం పూజలు జరుపుతుంది .. ఇలాంటి అడవిలో

వాళ్ళలా కనబడటం వారికి ఆశ్చర్యం కలిగించింది .

యశ్ .. ఎవరు వాళ్ళు ? ఇంత రాత్రి వేళ ? అన్నాడు ఆశ్చర్యంగా శివ .

పద వెళ్లి కనుక్కుందాం .. అన్నాడు యశ్వంత్ .

ముగ్గురూ వారివైపు నడిచారు .

ఇంకా ఉంది




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday 29 May 2014

రుధిర సౌధం 158

అంత జరిగినా ఏమాత్రం భయం లేకుండా ముందుకి నడుస్తున్న ఆమె వైపు  ఆశ్చర్యం గానే చూస్తూ

అనుసరించారు .. మిగిలిన వాళ్ళు .

సత్య పడున్న చోటికి సరాసరి నడిచింది .. రచన .

అతి దీన పరిస్థితి లో పడున్న సత్య ని చూడగానే .. వీరాస్వామి పాదాల కింద భూకంపం వచ్చినట్టయింది .. ఈమె ..

ఈమె .. ఇక్కడ .. అన్నాడు తడబడుతూ ..

అవును .. తనని కూడా మీరు  రక్షించ వలసిందే .. మొండిగా అంది రచన .


చూసావా ? ఈ పిల్ల ఆ పట్నామోల్ల పిల్ల .. ఈ పిల్ల తనని కాపాడ మంటోంది . వీళ్ళిద్దరూ ఇక్కడ నుండి క్షేమం గా

వెళ్తే మన సామి కష్టాల్లో పడతాడు .. ఈ సరస్వతి గురించిన నిజం ఊరంతా తెలుస్తుంది .. అన్నాడు బాలయ్య .

అవును .. నేనీ పిల్ల ని రక్షించ బోను .. అన్నాడు వీరస్వామి .

లేదు రక్షించాలి .. లేదంటే ఇక్కడ నుండి మీరెవ్వరు కదలలేరు .. మొండిగా అంది రచన .

ఈ పట్నమోల్లు ఇంతే .. కష్టం నుండి కాపాడాం అన్న బుద్ధి లేదాయే .. మాకు కట్టమొచ్చే పని మేము  చేస్తామా ?

చెయ్యం .. అన్నాడు బాలయ్య .

కష్టం లో ఉన్న ఈ ఆడపిల్ల ని రక్షించ నంటున్నారు .. మరో ఆడపిల్ల ని కష్టం లోకి నెట్టేస్తున్నారు .. మీరు

మనుషులనుకోవటం నా తప్పు కదూ .. అంటూ .. పాకెట్ లోని గన్ తీసి వారికి గురి పెట్టింది రచన ..

ఆ హటాత్ పరిణామానికి విస్తుపోయి చూశారు వాళ్ళు ..

ఏంటి అలా చూస్తున్నారు ? కళ్ళ ముందు అన్యాయం జరగబోతుంటే చూస్తూ ఊరుకోను .. ముందు సరస్వతి ని

వదలండి అంది రచన .

వాళ్ళు విడిచి పెట్టకుండా అలానే చూడసాగారు ...

రచన కోపం గా వాళ్ళ కాళ్ళ కింద గన్ గురిపెట్టి కాల్చింది .. వాళ్ళు సరస్వతి ని వదిలేసి ఆ ఇద్దరూ పరుగు తీసారు .

వీరస్వామి , బాలయ్య అయోమయంగా ,భయం గా చూశారు .. అంతలోనే తేరుకొని వీరస్వామి మంత్రం ఉచ్చరించ

బోతుండగా ..

కమాన్ .. వీరస్వామి .. నువ్వు మంత్రం పూర్తీ చేసేలోపు నా గన్ లోని బుల్లెట్ నీ తలలో ఉంటుంది .. అతిగా కష్ట

పడకు .. ముందు సత్య ని కాపాడు లేదంటే నేను చెప్పిందే చేస్తాను అంది రచన .

వీరస్వామి కంగారుగా సత్య వైపు చూశాడు .. అతనికేం అర్థమైందో .. కానీ కళ్ళల్లో భయం కనబడింది ..

ఈమె భూతావరణం లో ఉంది .. ఒక పూజ చేస్తే గానీ ఈమె ని ప్రాణాలతో కాపాడలెం .. అన్నాడు వీరస్వామి ..

కబుర్లు చెప్పకు .. వీరాస్వామీ .. నన్ను విడిపించావు .. ఈమె ని కాపాడ లేవా ? నువ్వు కాపాడక పొతే

చచ్చిపోతావు .. అంది రచన .

చూడు పిల్లా .. నిన్ను మామూలు కట్టు వేశాడు .. ఆ బసవన్న .. కానీ ఈ పిల్ల ని భూతావరణం లో బంధించింది

క్షుద్ర శక్తి .. నా శక్తి చాలదు .. దీని నుండి కాపాడడానికి .. కానీ దీనికి ఓ పూజ చేయాల్సి ఉంటుంది .. ఆ పూజ

పరమ పవిత్రుడైన వ్యక్తీ చేయాల్సి ఉంటుంది .. అన్నాడు వీరస్వామి .

ఇంకా ఉంది 













మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

నన్నిలా బ్రతకనీ ...............

కరిగిపోయే క్షణాలని .. మరిగిపోయే మనసుని ..

నియంత్రించలేని అసహాయత అసమర్థత కాదులే ..

మరవలేని స్మృతులను . మరలరాని రోజులను ..

స్మరించకుండా ఉండలేకపోవటం అపరాధమయితే కాదులే ..

గుండె నిండా వెల్లువైన ప్రేమ తాకిడి కి ఆనకట్ట వేయలేని

కనుల చెలియలి కట్ట దాటిన కన్నీటి వరద నను ముంచనీ ..

పెదవి పైన మాసి పోని  పూల ఋతువు ని  ఆహ్వానించనీ ..

పొదివి పట్టి ఓదార్పు నిచ్చే మనసు కై వెతుకులాట సాగనీ ..

మసకబారిన  ఎద గూటిలో వెండి వెన్నెల  పరచు కొనే ..

రోజు కొరకు వేచి చూడటమే .. అలవాటుగా మార్చుకోనీ ..

నన్నిలా బ్రతకనీ ............... 













మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday 28 May 2014

రుధిరసౌధం 157

ఆ బసవరాజు .. ఇలా ఎందుకు చేసుంటాడు? వాడు చాలా ఘటికుడు .. ఇక్కడే ఉన్నడంటే మనల్నేం చేస్తాడో ఏమో

వెల్లిపోదాం వీరాస్వామి .. అన్నాడు బాలయ్య .

"బాలయ్య .. నీకు తెలీదు .. ఈ పిల్లని తన కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాడు భూపతి .. ఈ పిల్ల నిలా

చూసి వదిలేసి వెళ్తే భూపతికి కోపం వస్తుంది .. " అనుకొని రచన ముందుకి వెళ్లి .. ఏవేవో మంత్రాలు ఉచ్చరించాడు

వీరస్వామి ..

కళ్ళు మూసుకొని అతడు మంత్రాలు ఉచ్చరిస్తుంటే రచన తో పాటూ అంతా ఆసక్తిగా చూశారు వీరస్వామి వైపు.

మెల్లిగా కళ్ళు తెరచి .. ఊ ... లే .. లేచి .. నిలబడు .. అన్నాడు వీరస్వామి .

రచన నమ్మశక్యం గానట్టు చూసింది ..

అలా చూస్తావేం .. నేను కట్టు విప్పాను.. లేచి నిలబడ గలవు .. లే .. అన్నాడు వీరస్వామి .

ఆమె ఆశ్చర్యంగా తన చేతులు కదిపి చూసింది .. స్పందన చూసాక కాళ్ళు మెల్లిగా కదిపింది .. మెల్లిగా లేచి

నిలుచుంది.


బాలయ్య భయంగా ఆమెని చూస్తూ .. ఈ వీరస్వామి ఈమె ని ఎందుకు  రక్షించాడు ? ఇప్పుడు సరస్వతి విషయం

బయటపడిపోదా ? మెల్లిగా నసిగాడు ..

థాంక్స్ .. మీరు నాకు సహాయం చేసారు .. అంది రచన మాట పెగల్చుకొని .

అమ్మా .. ధాత్రమ్మా .. నువ్వు నన్ను రక్షించు .. వీళ్ళు నన్ను బంధించారు .. అంది గట్టిగా సరస్వతి .

ఆమె సరస్వతి వైపు ఆందోళన గా చూసి .. మీరు సరస్వతి ని ఎందుకు బంధించారు ? అని అడిగింది .. రచన .

చూడు .. మేము నీ ప్రాణాలను రక్షించి నాము .. నువ్వు ఈమె గురించి మర్చిపో .. భూపతి గారి మనిషి వని నిన్ను

కాపాడాము .. నువ్వు ఆ పట్నం వాళ్లకి ఈ విషయం చెప్పకూడదు .. లేదంటే .. ఇప్పటి గతె నీకు పడుతుంది ..

అన్నాడు వీరస్వామి .

రచన వారి వైపు సీరియస్ గా చూసి పరిస్థితి ని అంచనా వేసింది ..

వీరస్వామి .. ఈమె ఊరుకోదు .. ఆ పట్నం వాళ్లకి చెప్పేస్తుంది .. అన్నాడు బాలయ్య ...

చెప్పను .. అంది రచన .. ఒక్కసారిగా ..

బాలయ్య .. ఓ పక్క .. సరస్వతి ఓ పక్క ఆమె వైపు ఆశ్చర్యంగా చుసారు ..

అవును .. చెప్పను .. కానీ చెప్పకూడదు అనుకుంటే మీరు నాకు తప్పని సరిగా ఇంకో సహాయం చేయాలి .. అంది

రచన ..

ఇంకానా ? ఏమిటది ? అన్నాడు వీరస్వామి ..

పైన .. నాలాగే ఇంకో అమ్మాయి ఇలాంటి తాంత్రిక కట్టు లో ఉంది .. మీరు ఆమె ని విడిపించాలి .. అప్పుడే మీరను

కొన్నట్టు నేను సరస్వతి విషయం మర్చిపోతాను .. అంది రచన .

ఇంకో అమ్మాయా ? ఎవరు ? అని అడిగాడు వీరస్వామి ..

పదండి .. చూపిస్తాను .. అని ముందుకి కదిలింది రచన .

ఇంకా ఉంది 








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday 27 May 2014

రుధిర సౌధం 156


వదలండి .. వదలండి ........ అంటూ పెనుగులాడుతోంది .. సరస్వతి ..

నోర్ముయ్ .. అని గట్టిగా అరిచాడు వీరాస్వామి .. ముందుకి సాగిన వాళ్ళ అడుగులు కోట దరికి చేరగానే ఆగి

పోయాయి ..

ఆమె ని గట్టిగా అదిమి పట్టుకొనే భయం భయం గా చూసాడు బాలయ్య . మిగతా ఇద్దరు కూడా ....

వీరస్వామి చుట్టూరా చూసి .. పదండి .. ఆగిపోయారేం ? నేనున్నా కదా .. అన్నాడు ముందుకి ఒక అడుగు వేసి ..

ఏంటో సామీ .. ఈ కోట చూస్తావుంటే భయంగానే ఉండాది .. దెయ్యాలంటే నాకు భయ్యం .. అన్నాడు బాలయ్య ..

బాలయ్య .. ఈ కోట లో బోలెడు దెయ్యాలున్నాయి .. నాకు మా తాత చెప్పాడు .. నాకు భయంగా ఉంది ..

వేరేక్కడన్నా ఉంచండి నన్ను .. ఇక్కడ  ఉంచ మాకండి .. పెనుగులాడుతూనే బ్రతిమలాడింది సరస్వతి ..

బాలయ్యా .. దాన్ని లోపలకి తీసుకు రా .. అని వీరస్వామి కోట లోపలికి నడిచాడు ..

భయంగానే సరస్వతి ని పట్టుకొని లోనికి నడిచారు వాళ్ళు ..

వీరా స్వామికి  .. కోట లో అడుగుపెట్టగానే ఒళ్ళు జలదరించింది ..

ఏమిటిది ? ఏదో వ్యత్యాసం కనబడుతోంది .. కోటలో .. ఏదో బలమైన శక్తి .. తిరుగాడుతున్న భావన .. ఏదో మంత్రం

ఉచ్చరించాడు .. కళ్ళు మూసుకొని .. వీరస్వామి .

మిగిలిన వాళ్ళు వీరస్వామి కేసి భయంగా చూస్తున్నారు ..

వీరస్వామి కళ్ళు తెరవగానే .. సరస్వతి .. గుడి ఎక్కడుందో .. నేను చెప్తాను స్వామీ .. నన్ను వదిలెయ్యి .. అంది

సరస్వతి ..

వీరస్వామి ఆమె వంక కళ్ళెర్ర జేసి చూసాడు .. తరువాత బాలయ్య వాళ్ళ వైపు చూసి .. దీన్ని ఆ దుంగ కి కట్టి

పడెయ్యండి .. అన్నాడు .. ఎదురుగా ఉన్న గది వైపు చూస్తూ ..

హా.. అని ఆమె ని ఆ గదిలోకి తీసుకు వెళ్ళిన వాళ్ళు .. అక్కడ నేల పైన అచేతనం గా పడున్న ధాత్రి ని చూసి

గట్టిగా అరిచారు ..

సరస్వతి కంగారుగా ధాత్రమ్మా .. అని అరిచింది ..

ఆ అరుపుకి దీనం గా కళ్ళు తెరచి చూసింది ధాత్రి (రచన ).

బాలయ్య ఆమె ని అలా చూసి .. తత్తరపడ్డాడు .. వీరాస్వామి ఇటు ఓ సారి రా .. అన్నాడు ..

అప్పుటికే అక్కడికి వచ్చిన వీరాస్వామి .. ఇక్కడ ఈమె ఉన్నదేంటి ? అన్నాడు అయోమయంగా ..

నోటివెంట మాట .. శరీరం సహరించక పోవడం తో దీనంగా వారివైపు చూడటం తప్ప వేరేం చేయలేకపోయింది రచన

ఆమె ఉన్న స్థితి ని చూసి .. ఆశ్చర్యపోయాడు .. ఈ కట్టు బసవరాజు మాత్రమె వేయగలడు .. అంటే నానుండి

తప్పించుకున్న ఆ బసవన్న .. ఈమె ని ఎందుకు బంధించాడు ? అంటే బసవడి ఆత్మ ఇక్కడనే ఉంది ..

దొరికినావు  బసవన్నా .. మళ్ళి నాకు దొరికినావు .. అనుకున్నాడు మనసులో వీరస్వామి ..

వీరస్వామి .. ఈ పిల్ల ఇక్కడున్నది .. ఏన్దంటావు ? ఏమి జరిగుంటాది? ఆందోళన గా అన్నాడు బాలయ్య ..

ఈ పిల్ల మీద ఆ బసవరాజు గాడి కట్టు ఉన్నది బాలయ్య .. వాడే ఈ విధం గా సేయగలడు .. అన్నాడు వీరస్వామి

చుట్ట పీలుస్తూ  .

ఇంకా ఉంది  








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday 26 May 2014

రుధిర సౌధం 154 & 155

ఎంత దూరం నడుస్తున్నా బాలయ్య వాళ్ళు కానరాలేదు ..

ఓహ్ షిట్ .. మనం దారి తప్పాం .. అనుమానం లేదు అన్నాడు యశ్వంత్ చిరాగ్గా ..

లేదు యశ్వంత్ .. వాళ్ళు మనం వాళ్ళని అనుసరిస్తున్నామని తెలుసుకునే ఉండి ఉంటారని పిస్తుంది .. కావాలనే

మనల్ని దారి తప్పించి ఉండొచ్చు .. చుట్టూ పరికించి చూస్తూ అన్నాడు మురారి .

నాకెందుకో ఈ అడవిని చూస్తుంటే జంతువులు కూడా ఉండి ఉంటాయని పిస్తుంది . ఈ అడవి లో రచన సేఫ్ గా

వెళ్లి ఉండుంటుoదా ? అన్నాడు శివ .

తను సేఫ్ గానే వెల్లుంటుంది శివా .. తనని సేఫ్ గా ఉంచటం ఆ అమ్మవారి పని .. కానీ ఇప్పుడు మనమేం

చేయాలన్నది  ఆలోచించాలి .. అన్నాడు యశ్వంత్ .. రచన గురించిన కలవరాన్ని మనసులోనే అదిమిపెడుతూ ..

యశ్ .. విధాత్రి మనల్ని అక్కడే వేచుండ మని చెప్పింది .. మనం అడవిలోకి వచ్చేసాం .. అన్నాడు మురారి .

అవును .. కానీ కొన్ని మన చేతుల్లో ఉండవుగా మురారి .. ఇప్పుడు మన ముందు మార్గం లేదు .. కానీ గమ్యం

ఉంది .. కాబట్టి మార్గాన్ని మనమే ఏర్పరచుకోవాలి .. అన్నాడు యస్వంత్.





యశ్వంత్ .. ఏదేమైనా మనమొచ్చిన ఈ మార్గం సరైంది కాదు అని తేలిపోయింది .. ఇప్పుడెం చేయాలో చెప్పు ..

అన్నాడు మురారి .

యశ్వంత్ .. చుట్టూరా చూశాడు .. వాళ్ళు నించున్న చోటు కి కొంత దూరం లో ఉన్న

ఓ చెట్టు ని చూడ గానే ..

యశ్వంత్ కళ్ళలో వెలుగు వచ్చింది .

శివా .. ఆ చెట్టు చూశావా ... చాలా ఎత్తులో ఉంది .. నాకు తెలిసి ఆ చెట్టు ఎక్కితే నలువైపులా ఏమున్నాయో ..

కనబడుతుంది ,.. ఎలాగు వెన్నెల ఉంది .. అన్నాడు యశ్వంత్ .

గుడ్ ఐడియా యశ్వంత్ .. అని చెట్టు వైపు నడిచాడు శివ .. శివ ని అనుసరించారు ..

మిగతా ఇద్దరూ ..

చకా చకా శివ చెట్టు ఎక్కుతుంటే ఆ చెట్టుకింద నిలబడి పైకి చూడసాగారు యశ్వంత్ , మురారి .

అరగంట లో ఆ చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చుని చుట్టూ చూశాడు శివ .

ఓ పక్క రావణ పురం ఊరి శివార్ల లోని రాణి మహల్ వెన్నెల వెలుగు లో దీటు గా కనిపిస్తుంటే ..దాని కి ఎదురుగా

అంటే పశ్చిమ దిశలో ఓ పాడుబడిన కట్టడం ఒంటరిగా శివ కళ్ళకి కాన వచ్చింది .. బహుసా ఆ పాడుబడిన కట్టడమే

ఆ కోట అయిఉండ వచ్చా ? అనుకోని సాలోచన గా అటువైపు పరికించి చూసిన శివ కి .. లీలగా ఎవరో నలుగురు

వ్యక్తులు ఆ కోట వైపు వెళ్ళటం కనబడింది ..

ఎస్ .. వాల్లెవరో పోల్చడం కష్టంగా ఉన్నా .. వాళ్ళు బాలయ్య వాళ్ళే అయి ఉంటారని ఊహించాడు శివ .. అంటే

ఖచ్చితంగా ఆ కట్టడమే ఆ కోట .. అనుకొని .. తామున్న ప్రదేశం

నుండి ఎలా వేల్లోచ్చో మార్గం చూశాక  సంతోషం

గా .. కిందకి చూసి అరిచాడు శివ .

యశ్ ... కోట కనబడింది .. మనం దగ్గరలోనే ఉన్నాం .. అని .. ఆ

అరుపు యశ్వంత్ ,మురారిల చెవులకి చేరేలోగా

శివ కూర్చున్న కొమ్మ హటాత్తుగా విరిగి బాలన్స్ తప్పి చెట్టుకు

అటువైపున్న లోయవైపు కిందకి జారి పడ్డాడు

శివ .. అటువైపు లోయ ఉండటం తో .. పల్లం వైపు జారిపోతున్నాడు .. తన శరీరం పై పట్టు తప్పి ..

క్షణాల్లో జరిగిన ఆ హటాత్ సంఘటన కి విస్తుపోయినా .. జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టి .. శివ జారిపోతున్న

వైపు మెరుపులా కదిలాడు యశ్వంత్ ..

మురారి కూడా వెంటనే అటువైపు కదిలాడు ..

తిన్నగా జర్రున జారి లోయలో పడబోయే వాడే శివ .. కానీ అదృష్టవశాత్తు .. యశ్వంత్ సమయానికి అతడి చేతిని

ఒడిసి పట్టుకున్నాడు ,,

దడదడ లాడుతున్న తున్న గుండెని ఒడిసి పట్టుకున్నట్లు .. యశ్ .. రైట్ టైం .. అన్నాడు చెరగని చిరునవ్వు తో ..

శివ ..

శివ బరువు కి యష్ కూడా లోయవైపు జారబోయే లోగా మురారి కూడా వచ్చి శివ ని బలం గా పైకి లాగాడు ..

ముగ్గురూ .. గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు .. దగ్గరిలో ఉన్న చెట్టు బెరడు కి ఆనుకొని కూర్చుని .. ఒకరి వైపు

ఒకరు  చూసుకొని చిలిపిగా నవ్వుకున్నారు ..

శివా అంత కంగారేంటి ? చెట్టు దిగడానికి .. మెల్లిగా దిగోచ్చుగా అన్నాడు యశ్వంత్ .. వగరుస్తూనే ..

ఫర్లేదు యశ్ .. మనం ఫిట్  గానే ఉన్నాం .. సమయానికి చేరుకున్నాం .. అన్నాడు మురారి ..

శివ నవ్వి .. ఇట్స్ ఏ గ్రేట్ థ్రిల్ .. కానీ కొమ్మ విరగటం గమనించలేదు .. అన్నాడు ..

ఇంతకీ .. కోట కనిపించిందా ? అన్నాడు యశ్వంత్ .

ఎస్ .. యశ్వంత్ .. కోట ఈ దిశ గా వెళితే త్వరగా చేరుకోవోచ్చు .. అన్నాడు శివ లేచి వాయవ్య దిశగా చూపిస్తూ ..

ఓకే .. పదండి వెళదాం .. ఇంకా ఆలస్యం చేయొద్దు .. అని లేచాడు యశ్వంత్ .

అడుగు ముందుకి వేయబోతూ .. అబ్బా అన్నాడు శివ ...

శివా .. అయ్యో .. చెట్టు కొమ్మలు గీసుకు పోయినట్టున్నాయి .. నీ మోకాలి నుండి రక్తం కారితుంది అన్నాడు

మురారి కంగారుగా .

అవును శివా .. నువ్వు నడవగలవా .. అన్నాడు యశ్వంత్ బాధగా శివ వైపు చూస్తూ ..

హే .. పదండి .. ఇలాంటి గాయాలు మనల్నేం చేస్తాయి .. లెట్స్ గో .. అన్నాడు శివ .

(ఇంకా ఉంది )






(శనివారం భాగం కూడ సోమవారం భాగం లో కలపడమైనది ;)

















మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday 23 May 2014

రుధిర సౌధం153

అత్యంత భయంకరంగా ఆమె ముందు ప్రత్యక్షమయింది .. వైజయంతి ..

ఆమె రూపం గుండెల్లో గుబులు పుట్టిస్తుంది . రచన ఒంట్లో ఒకరకమైన వణుకు మొదలైంది .. ఆమె చూపు లో

బేల తనం కనబడుతుంది .

ఎంత పిచ్చి పని చేసాను ? ఎందుకింత బలహీనమై పోయాను అని ఆమె మనసు నిలదీస్తున్నా సమాధానం

చెప్పలేని నిస్సహాయత మనసుని కమ్మేస్తుంది .

ఏం మాట  రావడం లేదా ? నువ్వు నోరు విప్పితే గల గలా మాటల వర్షం కురుస్తుందే .. మరి .. నన్ను .. ఈ

వైజయంతి... ఇంద్ర నగరి రాకుమారి వైజయంతి నే అవమానం పాలు జేస్తావా ? ఇప్పుడు .. ఇప్పుడు ..

తెలుస్తుంది  .. ఈ పగబట్టిన పిశాచం నిన్ను ఏం చేయబోతోందో .. అంది ఆవేశంగా .. వైజయంతి .

ఆ మాటలు రచన రక్తం లోని రాచరికాన్ని తట్టిలేపాయో ఏమో .. నీవు .. ఇంద్రానగరి రాజకుమారి వైతే .. నేను

రాకుమారినే .. ఆ రక్తం పంచు కుని ఉన్నదాన్నే .. ఇప్పటికి ఏమీ కాలేదు వైజయంతి .. నేను ఏ రక్షా దారాల మీద

ఆధారపడి ఇక్కడకి రాలేదు .. ప్రాణాలను ఒడ్డైనా సరే నా సంకల్పాన్ని నేరవేర్చుకుందామని వచ్చాను .. ఇప్పుడు

కూడా నీ బెదిరింపులకి కాదు స్వచ్చమైన స్నేహానికి తలొంచి .. ఆత్మార్పణ కి సిద్ధమయ్యాను .. ఇదుగో .. ఈ

బసవరాజు .. బ్రతిమ లాడుతుంటే .. అది నాకు రక్షదారమ్  అని తెలిసి దాని అతడి రక్షణ కోసం వినియోగించాను .

రాచ కుటుంబపు అన్ని లక్షణాలను నేను పుణికి పుచ్చుకున్నాను వైజయంతి .. కానీ నీవు .. ఇలాంటి నీచ రాజ

కీయాలకు పాల్పడ్డావు . చచ్చిన తర్వాత కూడా ఇహ పర సుఖాలపై మోజు వీడలేకున్నావు .. న్యాయానికి

ఎప్పుడు ద్రోహం చేయాలనే ఆలోచన నే వృద్ధి పరచుకున్నావు .. ఇప్పటికి నువ్వు నన్నేం చేయలేవు .. ఎందుకంటే

ఆ వైష్ణవీ మాత ఆశీర్వాదం ఎల్లవేళలా నా పై ఉంటుంది .. నా కళ్ళలో ని తీక్షణత నిన్ను దగ్ధం చేయగలదు .. అని

నిండు ఆత్మ విశ్వాసం తో అంది రచన .

రచన్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్న వైజయంతి రచన పరుష వాక్కులకి మాన్ప్రదిపోయింది ..

ఈలోపు ఏదో అడుగుల సడి దగ్గరగా వినపడసాగింది ..

వైజయంతీ .. ఎవరో మనషులు ఇటు వైపుగా వస్తున్నారు .. ముందుగా ఈమె ని నా మంత్ర బలం తో బంధించి

ఉంచుతాను ,.. అన్నాడు బసవరాజు .

కానీ మావయ్యా .. అంది వైజయంతి ..

బసవరాజు ఏదో మంత్రం ఉచ్చరించాడు .. అంతే .. రచన కాళ్ళు చేతులు అచేతనం గా మారిపోయాయి .. ఆమె

బాలన్స్  తప్పి కింద పడింది .. ఆ వెంటనే వైజయంతి నోటితో గాలి ఊదగానే రచన విసురుగా ఓ గదిలోనికి తోయ

బడింది . ఆమె బాధగా మూలిగింది .. కానీ ఆమె శరీరం అప్పటికే అదుపు తప్పింది .. ఆమె మెదడు మాత్రం

చురుగ్గా ఆలోచిస్తుంది .. తదుపరి ఏం చేయాలా అని ?

ఇంకా ఉంది


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday 22 May 2014

రుధిర సౌధం152

చెబుతాను తల్లీ .. చెప్పాల్సిన సమయమైతే ఆసన్నమయింది .. కానీ దానికి ముందు నీవు నన్నిక్కడ నుండి

విడిపించు .. లేదంటే వాడు మళ్ళి వస్తాడు .. నన్ను బంధించడం వెనుక వాడి ఉద్దేశ్యం కడు నీచమైనది .. అన్నాడు

బసవరాజు .

కానీ నేను నిన్నెలా విడిపించ గలను ? అంది సాలోచన గా రచన .

నీ చేతికి ఉన్న దారం మహత్తర మైనది .. అది నీకు రక్షా కవచం .. కానీ నేడు అదే నన్ను విడిపించగలదు .. నీ

చేతికి ఉన్న దారం తో నా చుట్టూ వలయకారం ఏర్పాటు చేయాలి . అప్పుడు దేవి రక్ష  నా చుట్టూ ఉన్న దుష్ట

వలయాన్ని చేధిస్తుంది .. అన్నాడు బసవరాజు .



ఈదారమా .. ? అని చేతి వైపు చూసింది .. అది మహర్షి రమణానంద ఇచ్చినది .. నాకు రక్షణ గా .. కానీ

ఆత్మార్పణ  కోసం వెళ్తున్న దానిని .. నాకింకేం రక్షణ అవసరమవుతుంది ? కనీసం ఈ బసవరాజు నైనా విడిపించిన

దానిని అవుతాను .. అనుకుంటూనే ఆమె మనసులో .. మరో ఆలోచన తళుక్కు మంది .. ఈ దారం ఈ వలయాన్ని

చేధించ గలిగితే సత్య చుట్టూ ఉన్న వలయాన్ని చేధించ గలదేమో .. అన్న ఆలోచన వచ్చింది ఆమెలో ..

ఆమె ఆలోచన గ్రహించి నట్టుగా .. నీ స్నేహితురాలు ఇంకా బలమైన వలయం లో బంధింప బడి ఉంది .. నువ్వు

ముందు నన్ను రక్షించడానికి ప్రయత్నించు .. నేను నీ స్నేహితురాలిని కాపాడే మార్గం తప్పనిసరిగా కనుగొంటాను

నామీద నమ్మక ముంచు .. అన్నాడు బసవరాజు ..

ఆమె ఆలోచన లో పడింది . " నా మరణం నా స్నేహితులని కాపాడుతుంది .. నా చేతిలో ఉన్న ఈదారం ఇతడ్ని

కాపాడుతుందని అంటున్నాడు .. విధి ఇదే నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే అలాగే కానీ .. అని తన చేతికి ఉన్న

దారం మెల్లిగా విప్పి ఆ దారాన్ని బసవరాజు చుట్టూ వలయాకారం గా ఉంచింది .. తక్షణం ఆ దారం నుండి

మంటలు  ఉద్భవించి ఆ దారం మాయం అయింది .

అతడు గట్టిగా నవ్వాడు .. వైజయంతీ .. రా .. నీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను .. అని గట్టిగా అరిచాడు

అతడు .

నిశ్చేష్టు రాలై .. బసవరాజు .. అంటే నువ్వు కూడా .. అంది రచన .

అతడు పెద్దగా నవ్వి .. అవును .. నేను కూడా .. వైజయంతి కి సహాయకుడిని .. నా మేనగోడలికి దక్కనిది

వేరొకరికి ఎలా దక్కనిస్తాను ? నాకు తెలుసు నీవు విధాత్రి అంశ తో జన్మించావని .. నిన్ను ఎదుర్కోవడానికి మోస

మే మార్గం .. అని వైజయంతీ రా .. అని గట్టిగా పిలిచాడు .

వైజయంతి నవ్వు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది ..

రచన మోహంలో రక్తపు బొట్టు కూడా లేనంతగా పాలి పోయింది .. చుట్టూ భయంగా చూసింది ..

ఇంకా ఉంది  




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday 21 May 2014

రుధిర సౌధం 151

రచన నిర్లిప్తం గా ముందుకి నడిచింది . ఆమె మనసులో కోటి సునామీలు వెల్లువై నట్టు . ఉంది . కళ్ళ ముందు

గిరిజ రూపం కదలాడింది.. తన తండ్రి ఆశ గుర్తుకువచ్చింది .

నన్ను  క్షమించండి నాన్నా .. నేను మీ కోరిక ని తీర్చలేకపోగా నేను నా జీవితాన్ని అంతం చేసుకోబోతున్నాను ..

మరేం చేయను ? సత్య ఈ నరకం అనుభవించలేక పోతోంది .. భరించలేక తను తనను తాను అంతం చేసుకుంటే

నేను నన్ను క్షమించకోలేను .. ఈ క్షణం నా లక్ష్యం కన్నా ఏ ఒక్కరి శాపనార్థాలు మన కుటుంబానికి తగల

కూడదని భావిస్తున్నాను . నా బాధ ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను .. మనసులో నే తండ్రికి

క్షమాపణలు చెప్పుకొంది . కన్నీరు ఆమె చెంప ని తడిపేస్తుంది . ..

యశ్వంత్ గుర్తుకువచ్చాడు ..


" రచనా .. నాకు చాలా ధైర్యం ఉంది .. కానీ ఎలాంటి మనిషైనా తన ప్రాణం లా భావించే వ్యక్తి ప్రమాదం లో

ఉన్నారంటే   ఆ ధైర్యం సనగిల్లిపోతుంది .. ఆ మాట నిజమని నీ విషయం లో నాకు అర్థమైంది .. నువ్వు ఇక్కడ కి

వచ్చావని తెలియగానే ఒక్కక్షణం కూడా నేను ముంబై లో ఉండలేకపోయాను .. " అన్న యశ్వంత్ మాటలు

గుర్తుకు వచ్చాయి .

ఈపాటికి యశ్వంత్ కి నేనేక్కడుంది తెలిసిపోయి ఉంటుంది .. మురారి చెప్పే ఉంటాడు .. నాకోసం తప్పనిసరిగా

ఇక్కడకి బయల్దేరి ఉంటాడు . కానీ దారిలో తనకెలాంటి సమస్య ఎదురైందో .. అయినా ఇది నాతొ మొదలైంది

నాతోనే అంతం కానీ .. అనుకొంది రచన .. ఆమె ముందుకి నడుస్తుంది ...

రచనా .. అన్న పిలుపు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఎందువల్ల నంటే ఆ స్వరం ఆమెకి సుపరిచితం గా

అనిపించింది .

కానీ ఆమె వెనుక ఉన్న వ్యక్తి ని చూసి ఆమె ఆశ్చర్యం తో ... బసవరాజు .. అంది ..

అవునమ్మా .. బసవరాజు నే .. ఈ పాడుబడ్డ కోట లో బందీ ని .. నన్ను విడిపించు తల్లీ .. అన్నాడు అతడు దీనంగా

ఆమె వైపు చూస్తూ ..

నువ్విక్కడ ? .. ఎలా ? అని అయోమయంగా అడిగింది రచన .

నన్ను ఓ మాంత్రికుడు బంధించాడు .. కానీ మీరే నన్ను విడిపించారు . ఆరోజు మీ చేతిలోని సీసా జారిపడ్డప్పుడు

బయటకి వచ్చిన నేను మళ్ళి వాడికే చిక్కాల్సి వచ్చింది . నన్ను వాడు ఈ కోట లో బంధించాడు .. దెయ్యాలతో

చెలగాటాలు ఆడేవాడు ఆ మాంత్రికుడు .. వాడు గీసిన రేఖ దాటి వెళ్ళలేక పోతున్నా తల్లీ .. అన్నాడు బసవరాజు .

అసలు నిన్ను ఎందుకు బంధించాడు వాడు ? అసలు ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు అడిగాను నిన్ను .. కానీ నువ్వు

ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు .. కనీసం ఇప్పుడైనా చెప్పు ? ఎందుకు నిన్ను బంధించాడు ఆ వీరస్వామి ?

నీ ద్వారా వాడికి కలిగే లాభం ఏమిటి ? ఆవేశం గా అడిగింది రచన .

ఇంకా ఉంది 






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday 20 May 2014

రుధిర సౌధం 150

వైజయంతి మాటలకి హతాసురాలై కింద పరుండి బాధతో విల విల లాడుతున్న సత్య వైపు చూసింది రచన .

కన్నీళ్లు నిండిన కళ్ళతో ' రచనా .. ఈ నరకాన్ని అనుభవించే శక్తి ఇక నాలో లేదు .. దయచేసి నన్ను విడిచి

పెట్టమని చెప్పు రచనా .. నేనే నా ప్రాణాలను తీసేసుకుంటాను .. మీ ఎవ్వరి దారులకి అడ్డురాను .. నన్ను సుఖంగా

చావనివ్వండి .. " దీనంగా ఏడుస్తూ అంది సత్య .

సత్యా .. కాస్త ధైర్యంగా ఉండు .. నిన్ను క్షేమం గా ఇక్కడ నుండి తీసుకువెళతాను .. అంది రచన .

రచనా .. నా యాతన ఇంకా నీకు అర్థం కావడం లేదా? దయచేసి నా ప్రాణం నువ్వే నీ చేతులతో తీసేయి .. నన్ను

చంపేయ్ .. అని వేదన తో ఆవేశంగా అంది రచన .

వైజయంతీ .. నీ కోపం నా మీద .. ఇలా నన్ను శిక్షించు .. అంతే గని ఇలా సత్యని కాదు .. సత్య ని వదిలేయ్ ..

నువ్వు ఇలా చేయటం సరైంది కాదు .. అంది రచన .

చూడు రచనా .. నువ్వెన్ని చెప్పినా సత్య ఇక్కడ్నుంచి తప్పించుకోలేదు .. ఉన్నదల్లా ఒక్కటే మార్గం .. నా దారి లో

నువ్వే అడ్డు . స్వచ్చందంగా నువ్వు నిన్ను అంతం చేసుకో .. అప్పుడే నీ స్నేహితులతో నాకు శత్రుత్వం ఏమీ లేదు

కనుక వారిని విడిచి పెడతాను . నీవల్ల వాళ్ళు ఇంత బాధ పడుతున్నందుకు వారికి నువ్వు విముక్తి  కలిగించి

వెళ్ళిపో .. ఈ లోకం నుంచి .. అంది వైజయంతి .

రచన విస్మయంగా చూసింది .. వైజయంతి కేసి .

సత్య అంది .. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు రచనా .. నీ ప్రాణం మీద కొచ్చేసరికి ఇంతలా ఆలోచిస్తున్నవా?

కానీ మా ప్రాణాలను పణం గా పెట్టేందుకు ఏమాత్రం ఆలోచించలేదు నీవు .. ఈ నరక యాతన నువ్వు అనుభవించి

ఉంటె తెలిసుండేది .. నన్ను , మురారి ని విడదీసిన పాపం నీదే .. శివ , యశ్వంత్ .. అందరూ నిన్ను నమ్మి కష్టాల

పాలయ్యాం .. ఇంకా చాలు .. ఒకటి నన్ను చంపేసి .. మురారితో నన్ను చంపెసానని చెప్పు .. రెండోది .. నువ్వు ..

వెళ్ళిపోయి మమ్మల్ని బ్రతకనివ్వు .. బాధగా ఆవేశంగా అంది సత్య .

సత్య మాటలు రచన ని నిలువెల్లా చీల్చేసినట్లని పించింది ..

మాట రాక స్తానువై పోయింది .. మనసు బాధగా మూలిగింది ..

వైజయంతి భయంకరం గా నవ్వింది ..

ఇప్పుడు నీ స్థితి .. నాకు అర్థమవుతుంటే సంతోషంగా ఉంది .. అంది వైజయంతి .

మౌనంగా ఉన్న ఆమె .. పెదవి విప్పి .. సరే  వైజయంతి .. రాచ కుటుంబం మాట తప్పదు .. కావున .. నువ్వు

సత్యని విడిచి పెట్టు .. నేను ఆత్మార్పణ చేసుకుంటాను .. అంది రచన వణుకుతున్న గొంతుతో ..

దగ్గరలోనే ఉన్న పర్వతం నీకోసం ఎదురుచూస్తుంది వెళ్ళు .. అంది వైజయంతి ..

హ .. వెళ్తున్నా .. అని సత్య వైపు బాధగా చూసి .. సత్యా ,,ఎన్నో చెప్పాలని ఉంది .. కానీ మాటలు పెగలటం లేదు .

ఇంకా సెలవు అని ముందుకి నడిచింది రచన

ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday 19 May 2014

రుధిర సౌధం 149


ప్రయోజనమా ? అని భయంకరంగా నవ్వింది ఆమె .

మహల్ ...... రాణి మహల్ .. నా తండ్రి .. ఆ చేతగాని మహారాజు .. తన రెండో భార్య మాయలో పడి .. మా అమ్మ కి

అన్యాయం చేసి .. ఆ వసుంధర కి కట్టబెట్టిన మహల్ .. న్యాయంగా అయితే అది నాది .. కానీ నాది కాకుండా ..

వేరొకరికి కట్టబెట్టాలనుకోవటం .. తప్పే కదా ... ఆమె మరింత ముందు కి నడుస్తూ అంది .

కానీ ఇప్పుడు .. నువ్వు ప్రాణాలతో లేవు వైజయంతి .. శరీరమే లేని నీకు .. నివాసం ఎందుకు ? భోగ భాగ్యాలపై


ఆశ ఎందుకు ? అడిగింది ఆవేశం గా రచన తన అడుగులు వెనక్కి

వేస్తూ ..

ఆమె గట్టిగా నవ్వింది తెరలుతెరలుగా నవ్వింది ... ఆ నవ్వు ఆ

భవనం అంతటా భయంకరంగా ప్రతిధ్వనిస్తుంది ..

ప్రతీకారం .. నా అడ్డ్డు తొలగించు కొనేందుకు నన్ను ప్రాణాలతో లేకుండా చేసారు . ఏ మహల్ పై ఆశ పడ్డానో ఆ

మహల్ నే నా సమాధి చేశారు .. నేను ఊరుకుo టానా ? నా శరీరం లో జీవాన్ని దూరం చేశారు .. కానీ నా

మనసులో కోపాన్ని , మహల్ దక్కించుకోవాలన్న నా కోరిక ని నానుండి దూరం చేయగలిగారా ? లేదు .........

ఎప్పటికి రాణి మహల్ నాదే ........ గట్టిగా అరచింది వైజయంతి .

వైజయంతీ .. ఒక ఉత్తమ వంశం లో పుట్టిన నీవు ఇలా చేయడం సరికానిది . నువ్వు ఆ మహల్ లో ఓ ప్రేతం వై

తిరుగుతున్నావు . ఎందరి ప్రాణా లనో పొట్టన పెట్టుకొని దానిని దెయ్యాల మహల్ గా మార్చేసావు .. నీ దుశ్చర్యల

వల్ల ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారు . కష్టాలతో ,ఇక్కట్లతో నలిగిపోతున్నారు .. ఓ రాచ కన్య వైయుండి ప్రజల

గురించి ఆలోచన చేయక నీ స్వార్థం తో ఇలా చేయటం తో రాచ కుటుంబానికి మచ్చ తెచ్చినట్టు కాదా ?

ఆవేశం తో వెనక్కి పడుతున్న పాదాలను ఆపి గట్టిగా అరచింది రచన .

ఆహా .. నువ్వు చెప్పే కబుర్లు ఆపు .. ఆస్తి కోసం ఇంతవరకు వచ్చావు ..  నీ వెంట వచ్చిన స్నేహితుల ప్రాణాలను

పణం గా పెట్టిన నీవా ? నాకు నీతులు చెప్పేది .. అన్నది వైజయంతి నిప్పులు కక్కుతున్న చూపులతో ..

అవును వైజయంతీ .. ఆస్తి కోసమే వచ్చాను .. తరతరాల ఖ్యాతి ని , వైష్ణవీ మాత ఆలయాన్ని దక్కించుకోవాలని

చెడుని అంతం చేయాలని .. మంచి ని స్థాపించాలని వచ్చాను .. ఇక్కడి ప్రజలను ఇక్కట్ల నుండి తప్పించాలని

వచ్చాను . బ్రిటిష్ వారి నుండి భారతీయులకి స్వాతంత్ర్యం లభించింది వైజయంతి .. రావణ పురo ప్రజలకి నీ నుండి

స్వాతంత్ర్యం రావాలి ....... అందుకు నా ప్రాణాలను అడ్డేసి మరీ పోరాడతాను .. అంది రచన .

ఈ వంశపు మొండితనం ,ధైర్యం నీలోను ఉన్నాయే పిల్లా .. కానీ ఎంతైనా ఇది నీ కోరిక .. అది నువ్వు

ఒప్పుకోవాల్సిందే .. కానీ నీ స్వార్థానికి వీరిని బలి ఇవ్వటం రాచ కుటుంబం లో పుట్టిన నీకు మాత్రం ?

సముచితమేనా ? వెటకారం గా అంది వైజయంతి .

వైజయంతీ .. నువ్వు వీరిని ఏమీ చెయ్యలేవు .. అది నీకు ఇది వరకే చెప్పాను .. అది నీ బలహీనత .. అంది రచన .

నిజమే .. ఒప్పుకుంటాను .. కానీ .. మిమ్మల్ని మీరే అంతం చేసుకునేలా చేయగలను .. అడుగు నీ స్నేహితురాలిని

అంది వైజయంతి

ఇంకా ఉంది .


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday 16 May 2014

రుధిర సౌధం 148


మనం వాళ్ళని అనుసరిస్తున్నామని వారు గమనించలేదు కదా .. అందుకే మాయమయ్యరేమో అన్నాడు శివ .

శివా .. ఇది చాలా దట్టమైన అడవి .. దారి తెలియకుండా ప్రయాణిస్తే తప్పిపోవడం ఖాయం .. అన్నాడు యశ్వంత్ .

యష్ .. గుర్తొచ్చింది .. ఆ పాడుబడ్డ కోట పశ్చిమ దిశ గా ఉందని వైజయంతి అంది .. దిశ ఆధారం గానే మన రచన

కూడా వెళ్లి ఉంటుంది .. మనం కూడా అలానే వెళ్దాం .. అన్నాడు మురారి .



అవును .. కానీ మన ముందు 3 దారులు కనిపిస్తున్నాయి .. అన్ని పశ్చిమ దిసకే వెళ్తున్నాయి . వీటిలో ఏది సరైన

దారో చెప్పలేం .. కానీ ఏదో ఒక దారిని ఎంచుకోక తప్పదు .. సమయం వృధా కాక ముందే పదండి .. అని మధ్యలో

ఉన్న దారి లోకి నడిచాడు యశ్వంత్ .

                                                 *****************************

రచన పరుగుపరుగున అరుపు వినబడిన వైపు చేరుకుంది ... అక్కడ ఆమె సత్య ని చూడగలిగింది .. నేల పై

పరుండి గిలగిలా కొట్టుకుంటుంది సత్య .

ఆమె చేతులు వెనక్కి కట్టేసి నట్టు పెట్టేసున్నాయి .. కాళ్ళు కూడా .. ఆమె తీవ్రమైన బాధ తో విలవిల్లాడుతుంది ..

సత్యా అని ఆమె ని చేరుకోవడానికి ప్రయత్నించింది రచన ..

కానీ సత్య చుట్టూ గీసిన ఓ అదృశ్య రేఖ నిప్పులు చిమ్ముతూ రచన ని అడ్డుకుంది .

ఏంటిది ? ఎందుకు నేను సత్యని చేరుకోలేక పోతున్నాను ? స్వగతం గానే అంది రచన ..

ఎందుకేమిటే ............ అంత సులువా ? ఈ వైజయంతి సృష్టించిన వలయాన్ని చేధించడం ? అన్న మాటలు

వినిపించి పక్క కి చూసింది రచన కంగారుగా ..

అక్కడ .........

వైజయంతి నేల పై కులాసా గా కుర్చుని ఉంది .. ఆమె కురులు తెల్లగా మెరుస్తున్నాయి వెన్నెల వెలుగులో ..

అవి నేలని తాకుతున్నాయి .. ఆమె కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి .. ఆమె చేతులు పాలిపోయినట్లు ఉన్నాయి ..

మొహం చీము కారుతున్నట్లు రక్తం తో ఓడుతున్నట్లు ఉంది ..

వైజయంతి ని తొలిసారి అలా చూసిన రచన ఒళ్ళు గగుర్పొడిచింది ...

ఆమె లేచి నిలుచుంది ..

ఏమిటలా  చూస్తున్నావు ? చూసావుగా ఈ కోట.... అని ,చుట్టూ చూస్తూ ... , కూలిపోయింది .. సర్వనాశన

మైపోయింది . ఇది నా స్థానం కాదు .. నీవాల్లందర్నీ హతమార్చి .. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ..

వారి ఆత్మల్ని ఇక్కడే బంధించి ఉంచుతున్నాను . ఈ సత్య గతి కూడా అదే .. అంటూ రచన ముందుకి రాసాగింది .

ఎందుకు ? ఇలా చేయటం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏమిటి ? అంది రచన తన అడుగుల్ని వెనక్కి వేస్తూ ..

ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది