Powered By Blogger

Thursday 13 November 2014

నీతోనే నీ పోరాటం

నీ కనులలో కనిపించని చిరునవ్వుల నెతికా .. 

నీ పెదవులపై కమ్మని కల గురుతుల నెతికా .. 

కనరాని నిజమేదో కన్నది నా హృదయం .. 

ఎనలేని స్నేహాన్ని ఇవ్వాలని నేస్తం .. 

నీ గుండెకే ఓదార్పు నేను .. నీ అడుగు తో అడుగేస్తున్నాను 

కలిసే చేద్దాము లోకం తో యుద్ధం .. చిరకాల సమరానికి మన మనసులు సిద్ధం  -నీ కనులలో 

బడబాగ్ని దాచింది ఆ సంద్రమయితే .. 

నిలువెల్లా ఉప్పని కన్నీరే రూపయితే .. 

అలలల్లె నవ్వింది .. నింగి కి కడలగెగసింది.. 

హృదయాన్నే కాల్చేటి బాదే నీదయితే .. 

ఉదయాన్నే వెలివేసే వేదన నిను ముంచితే .. 

వెలుగుల్నే నీకిస్తా ..నీడగా నే తోడుంటా .. 

ఆకాశమంటే అoతె రుగని శూన్యం .. 


కొలవగలవా ఆ తీరం .. దూరం ..

 ఊగిస లాడకే ఓ మనసా .. నచ్చచెప్పవె నీ మది కీ ..         నీ కనులలో 


నటరాజు సిగలో జలపాతం .. నేలని తాకటం మానవ యత్నం .. 

సాధించటం నీ అభిమతం .. అయితే వెనుదిరిగి చూడకు ఏ మాత్రం .. 

కలలే కంటూనే నిదురిస్తూ ఉంటామా ?

కనులే తెరచి నిజమును కనమా ?

కన్నీటి కొలతెంతో లెక్కలు వేస్తుంటామా ?

చేరాల్సిన గమ్యం ముందర చూస్తామా ?

నీలోను ఉన్న శత్రువు నీవేలే .. నిన్నే నమ్మేది నువ్వేలే .. 

కనిపించని విరోధి తో పోరాటం చెయ్యాలి .. 

విషమించిన ఆవేదనని అంతం ఇక చేయాలి .. 

పొగమంచు పోయే ముందు ఈ శోధన తప్పదులే .. 

నునువెచ్చని కిరణాలు  లోకాన్ని మేల్కొలుపులే .... - నీ కనులలో   





    





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

7 comments:

Unknown said...

http://www.netitelugu.com/telugu/facebook-video-creating-option/

Unknown said...

http://www.netitelugu.com/telugu/facebook-video-creating-option/

రాధిక said...

చిరంజీవి గారూ .. ఇంకో రుధిర సౌధం కి కొంచెం సమయం పడుతుందండి . . కానీ తప్పని సరిగా నానుండి మీరు కోరుకునే రచనలు .. నా రచన లో తప్పక ప్రచురిత మవుతాయి .. మీ అభిమానాన్ని మాత్రం ఇలాగే కొనసాగిస్తారు కదూ ..

subhadra said...

రాధిక గారూ .. రుధిర సౌధం తర్వాత బాగా గ్యాప్ ఇస్తున్నట్టున్నారు . వద్దండి .. మేము చాలా ఈగెర్ గా ఎదురు

చూస్తున్నాం .. మీ తరువాతి రచన కోసం .

రాధిక said...

తప్పకుండా .. సుభద్ర గారూ .. ఎక్కువ ఆలస్యం చేయను .. త్వరలోనే నా నుండి మరో సీరియల్ వస్తుంది .

srinivas said...

MEE BLOG CHALABAGUNDANDI

రాధిక said...

Who am i annaru..elaa mimmalni sambhodinchaalo teleedu..anyways thanks for your compliment.