Powered By Blogger

Monday 31 March 2014

రుధిర సౌధం 107

మడుగు లో తన కాళ్ళని ఆడిస్తూ .. లేదు యశ్వంత్ .. నేనేమీ తప్పు చేయటం లేదు కదా అని ఆలోచిస్తున్నాను ..

అంది నిరాసక్తంగా రచన .

అదేంటి ?ఇంతకీ ఏ విషయం లో ఇలా ఆలోచిస్తున్నావు ? అని అడిగాడు యశ్వంత్ .

యశ్ .. ఇంతకి ముందు సత్య నాతొ ఏమందో తెలుసా ? అంటూ సత్య కి తనకి నడుమ జరిగిన సంభాషణ కోసం

చెప్పింది రచన .

ఓహ్ అంతేనా ? దీనికోసమా ఇంత ఆలోచిస్తున్నావు ? ఒక్కోసారి  మీ ఆడవాళ్ళు వెంటవెంటనే అభిప్రాయా లు

మార్చేసుకుంటారు .. సత్య కూడా అంతే .. నాకలా జరగటం చూసి తనలా మాట్లాడి ఉంటుంది . తనకి మురారి

నచ్చచెబుతాడు లే . నువ్వేం ఆలోచించకు .. అయినా ఎన్ని అడ్డంకుల నైనా ఎదుర్కొని ఇంతా చేస్తున్నాం .

అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం ఆలోచన అవసరమా ? పద .. నాకు చాలా ఆకలిగా ఉంది .

అని లేచి ఆమె కి తన చేయి అందించాడు యశ్వంత్ .

ఆమె అతడి వైపు చిరునవ్వు తో చూసి అతడి చేతిని అందుకొని లేవటానికి ప్రయత్నించింది . కానీ మడుగు లో

కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం వల్ల ఆమె గౌన్అంచు దేనికో చిక్కుకు పోయింది .

అయ్యో .. యశ్ .. నా గౌన్ దేనికో చిక్కుకు పోయింది .. చిరిగిపోతుందేమో .. ఆందోళన గా అంది రచన

డోంట్ వర్రీ మేడం .. నేను దాన్ని చిరిగిపోకుండా తీస్తాను గా అని మడుగులోకి దిగాడు యశ్వంత్ . ఆమె గౌన్

చిక్కుకు పోయినట్లు కనిపిస్తున్న చోట చేయి పెట్టి తీయబోయాడు . ఏదో తలుపు ఘడియ లా అనిపించి నొసలు

చిట్లించి రచనా వన్ మినిట్ అని నీటిలోకి మునిగి చూశాడు .

అతని కళ్ళు ఆశ్చర్యానందాలతో చెమర్చాయి . మడుగు అడుగుభాగం అంతా వెదికిన దొరకని రాతి పలక ద్వారం

మడుగు గోడల మీద కనిపించేసరికి అతడికి సంతోషం తో మాటలు రాలేదు .

యశ్ .. ఏమయింది ? నా గౌన్ దేనికి చిక్కుకు పోయింది ? ఒడ్డు మీద నుంచి అడిగింది రచన.

అతడి నీటి పైకి వచ్చి రచనా .. వుయ్ గాట్ ఇట్ .. సంతోషంతో గట్టిగా అరిచాడు యశ్వంత్ .

ఏమయింది యశ్వంత్ ... ద్వారం కనిపించిందా ? కళ్ళింత చేసి అడిగింది రచన .

ముందు నువ్వు మడుగులోకి రా .. అని ఆమె చేయి పట్టుకొని మడుగులోకి లాగాడు యశ్వంత్ .

ద్వారం ఘడియ కి చిక్కుకుపోయిన గౌన్ జాగ్రత్త గా తీసి రచన ని చూపించాడు ఆ రాతి పలకని .

మనిషి కుర్చుని మాత్రమే లోపలికి ప్రవెసించగలిగి నట్లు ఉందది . రచన కనులు ఆనందం తో వెలిగాయి .

ఇద్దరూ కల్సి రాతి పలక ని అతి కష్టం గా తొలగించగానే .. మడుగులోని నీరంతా ఆ మార్గం గుండా రాతి పలక

వెనుక ఉన్న సొరంగ మార్గం లోకి వెళ్ళిపోయాయి .

మడుగు నీళ్ళు లేకుండా బురద తో నిండిపోయున్నా మళ్ళి ఒకరంద్రం గుండా నీళ్ళు ధారగా రావటం గమనించాడు

యశ్వంత్ .

రచనా .. మడుగులో నీళ్ళు ఖాళీ కాగానే మళ్ళి ఆ చెరువు లో నీరు వచ్చి చేరుతోంది . మడుగు నిండే లోగా మనం

ఈ లోపలికి వెళ్ళాలి ఈ పలక మూసేయాలి లేదంటే సొరంగమార్గం అంతా నీళ్ళతో నిండిపోతే కష్టమైపోతుంది . అన్నాడు యశ్వంత్ .

తల ఊపి మేను ఒంచి లోపలికి వెళ్ళింది రచన . ఆమె వెనుకే వెళ్లి పలక ని యథా స్థానం లో పెట్టాడు యశ్వంత్ .

ఇంకా ఉంది 























మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Sunday 30 March 2014

ఉగాది ని ఆహ్వానిద్దాం



కొంగ్రొత్త ఏడాది .. తెచ్చింది ఉగాది ...

కోయిలమ్మ కచేరి .. మావిచిగురు చెంత చేరి ..

స్థితి గతుల చింత మరచి భవిత కొరకు ఆరాలు తీసి

వేదపండితుల చుట్టూ చేరి .. జాతకాల ఫలిత మెరిగి

పంచాంగ శ్రవణాల సంప్రదాయాలని గౌరవించి ..

అమావాస్య వెళ్ళిపోయి పున్నమే వచ్చినట్టు ..

అందరూ ఒక చోట చేరి ఆటపాటలతో మైమరచి ..

విందులు ,వినోదాలు ఆనందపు సంబరాలు ..

షడ్రుచుల జీవితాన్ని మేళవించు పచ్చడి ..

ఆరగించి జీవితాన సుఖ దుః ఖపు లోతులు ..

చూడగలడు తెలుగు వాడు కష్టాలకి వెరవడు ..

మావి పూత సొగసులద్ది వేసవి రుచి చూపుతుంది ..

కోయిలమ్మ కూత లోన హాయి రుచి మరుగుతుంది ..

చైత్రవీణ మనసు నిలిపి కమ్మని రాగాలను మీటుతుంది

సరికొత్త ఆశలని ఉగాది మోసుకొస్తుంది ..

ఆ దైవం దీవెనలు ఊరూరా పంచుతుంది ..




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday 28 March 2014

రుధిర సౌధం 106




మడుగు లోంచి యశ్వంత్ ,మురారి ఇద్దరూ బయట కి వచ్చారు .

టవల్ తో ఒళ్ళు తుడుచు కుంటూ .. మనకి ఇప్పుడు ఫలితం దక్కక పోయి ఉండొచ్చు కానీ ఈ మడుగు లోనే

గుడి ద్వారం ఉందని నాకు బలంగా అనిపిస్తుంది మురారి .. అన్నాడు యశ్వంత్ .

అవును యశ్ .. నిరాశ పడాల్సిన అవసరం లేదు . అదేపని గా ప్రయత్నిస్తే ఫలితం తప్పక దక్కుతుంది . ..

అన్నాడు మురారి .

నిజమే కానీ గుడి ద్వారం అందులో ఉండాలి కదా . ఉంటేనే దొరుకుతుంది .. లేకుంటే ఎలా దొరుకుతుంది .

ప్రయత్నం ,సమయం రెండు వృధా .. అంది సత్య వారి వద్దకి వయ్యారం గా నడిచి వస్తూ ..

రచన ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది . ఎందుకని సత్య ఇలా మాట్లాడుతుంది . .. ఆమె మనసు బాధగా

మూలిగింది .

అదేంటి సత్యా .. అలా అనేసావు? ఇంత మందికి ఉన్న నమ్మకం నీకు లేదా ? అన్నాడు యశ్వంత్ .

మురారి ఆమె వైపు అసహనం గా .. నిస్సహాయంగా చూశాడు .

సత్య .. ఇంతకు ముందు నీకు జరిగిన ప్రమాదం మరచిపోయినట్లు లేదు . అందుకే అలా మాట్లాడుతుంది . అని

సత్య వైపు తిరిగి .. సత్యా .. ఇలాంటి మాటలు మనకి వర్తించవు . నువ్వీ టాపిక్ వదిలేయ్ ..  అన్నాడు శివ .

సత్య మౌనంగా ఉండిపోయింది .

యశ్ .. మాటలదేముంది గానీ .. ఇప్పుడెం చేద్దాం ? అన్నాడు మురారి .

మురారీ .. ఎలాగూ మధ్యాహ్నం అయింది ... భోజనాల వేళ . ఇంటికి వెళ్ళి కాస్త ఏదన్నా తిని వద్దాం .. ప్రయత్నం

మాత్రం వదిలేది లేదు .. ఏమంటావ్ ? అన్నాడు యశ్వంత్ .

ఓకే .. అయితే ఇంటికి వెళదాం .. అని ముందుకి నడిచాడు మురారి .

మంచిది . ఇప్పుడు వీరంతా ఇంటిదారి పడితే మహల్ కి రాకుండా నేనేమన్నా చేయోచ్చు .. మనసులో అనుకొంది

సత్య వికృతంగా మొహం పెట్టి .

రచన మనసు కకావికలం గా ఉంది . ఆమె అడుగులు వెనక్కి వేసి మడుగు ఒడ్డున కూర్చుండి పోయింది నిరాశగా .

ఇంటికి వెళ్ళటానికి ముందుకి నడవబోతు .. వెనక్కి చూసి .. అరె రచనా .. నువ్వెంట లా ఉన్నావు ? అక్కడే

కూర్చున్నావ్ .. ఇంటికి వెల్లొద్దా ? అన్నాడు యశ్వంత్ ఆమె వైపు వస్తూ ..

లేదు యశ్వంత్ . నా మనసెం బాగాలేదు . మీరంతా వెళ్ళండి .. నేను తర్వాత వస్తాను . అంది నిర్లిప్తం గా రచన .

రచన రాక పోవటం తో వెనక్కి తిరిగి వీరికోసం చూస్తున్న సత్య ,శివ ,మురారి లని చూసి .. మీరు ఇంటికి పదండి

మేమిద్దరం కాసేపట్లో వస్తాం . మా మేడం గారు ఎందుకో డల్ అయ్యారు .. అన్నాడు యశ్వంత్ చిరునవ్వు తో ..

సరే యశ్వంత్ .. మేము వెళ్తాం . రచన ని పట్టుకోచ్చేయ్ కలసి లంచ్ చేద్దాం . అన్నాడు శివ .

సరే .. మీరు వెళ్ళండి అన్నాడు యశ్వంత్ .

వారు ముగ్గురూ అక్కడ్నించి వెళ్ళిపోయాక .. ఏంటిరా .. నిరాశ పడ్డావా గుడి ద్వారం దొరకలేదని .. ? అని లాలనగా

అడిగాడు యశ్వంత్ .


ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది ; like the posts on facebook also; www. facebook.com/naa rachana





రుధిరసౌధం 105



సత్య కళ్ళు అసహనం తో ,కోపం తో మరింత ఎర్రబడ్డాయి .

అదన్న మాట సంగతి . వీరంతా ఈ మహల్ అడుగుపెట్టినప్పటి నుంచీ వీరందరినీ సంహరించడానికి ఎంతగా

ప్రయత్నించిన వీరంతా నన్ను ఎదురించి నిలబడడానికి కారణం ఇదన్న మాట . అంటే నా కళ్ళ ముందరే మహల్

చేయి జారిపోకూడదు . నా శక్తి వీరి ముందు ఓడిపోకూడదు . నేను వీరి ప్రాణాలని తీయలేకపోవోచ్చు గాక . కాని

ఇబ్బందుల పాలు చేయగలను . తద్వారా మహల్ ని రచన ని దక్కనివ్వను .. మనసులో స్థిరంగా అనుకొని ..

రచన దగ్గరగా వెళ్లి రచనా .. నాకెందుకో ఇదంతా వృధా ప్రయాస లా అనిపిస్తుంది . యశ్వంత్ నీ కనుల ముందరే

అంత ఇబ్బంది పడ్డాడు . అయినా నువ్వేం అడ్డుకోలేదు . మళ్లి మడుగు లోకి దూకినా నువ్వు వద్దన లేదు .

ఈ మహల్ కోసం నువ్వు వారి ప్రాణాల ని పణం గా పెట్టడం సమంజసమా ? అంది సత్య లో ఉన్న వైజయంతి తన

మాటలు రచన కి మాత్రమే వినబడేలా .

సత్య మాటలకి విస్తుపోయి చూసింది రచన .

సత్యా .. నువ్వేనా ఇలా అంటుంది ? నా ఉద్దేశ్యం నీకు తెలీదా ? యశ్ ,మురారి ఎవరి బలవంతం తోనూ ఈ పని

చేయటం లేదు . మనస్ఫుర్తి గా చేస్తున్నారు . నువ్విలా అంటుంటే నాకు ఇబ్బందిగా ఉంది .. అంది రచన

చిన్నబుచ్చు కుంటూ .

అయ్యో .. నా ఉద్దేశ్యం నిన్ను తప్పుబట్టడం కాదు రచనా .. నువ్వే ఆలోచించు . ఈరోజు కాకపోతే రేపు యశ్వంత్

నువ్వూ భార్యా భర్తలు కావాల్సిన వారు . యశ్వంత్ కి ఏమైనా జరిగి ఉంటె పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించావా ?

అంది సత్య .

రచన ఆమె వైపు విచిత్రంగా చూసింది . నువ్వు మాట్లాడుతూ ఉంటె నీ మాట తీరు .. అసలు నువ్వు సత్య వేనా అని

పిస్తుంది . అని అక్కడి నుంచి ముందుకి నడచి మడుగు ఒడ్డునే నిలబడి యశ్వంత్ ,మురారిలని గమనించ సాగింది

రచన .

సత్య కొంచెం తొట్రుపాటు పడినా .. తేరుకొని .. నువ్వీ క్షణం నా మాటల్ని పట్టించుకో పోవొచ్చు గాక . కానీ నా

పలుకులు నీ గుండె ని గుచ్చుకోవటం గమనించానే చిన్నదానా ... అనుకొంది మనసులో .

ఇంతలో నీటి పైకి తేలారు యశ్వంత్ ,మురారిలు .

శివ ఆత్రుతగా ఏమైనా కనిపించిందా ? అని అడిగాడు .

లేదు శివా .. మడుగు అడుగంతా గాలించాం . ఆ చెరువు లో కనిపించినట్లు ఏటువంటి రాతి పలకలు కనబడలేదు .

నిరాశగా అన్నాడు యశ్వంత్ .

మురారి సత్య వైపు అనుమానం గా చూశాడు . " ఈమె వల్ల  ఈ ప్రయత్నం విఫలం కాలేదు కదా ? అనే ఉద్దేశ్యం తో

చూసిన మురారి చూపును చూసి వ్యంగ్యంగా నవ్వింది సత్య .

ఇంకా ఉంది 


Thursday 27 March 2014

ఉగాది శుభాకాంక్షలు

ఎండలు ముదురుతున్నాయి ..

చెమటలతో విసుగూ మొదలయ్యిందీ ...

ఆపై కరెంటు కోతాయే ..

అరరె ఉగాది పరుగున వస్తుంది ..

మార్చ్ నెలలో చివరి రోజున తెలుగు నూతన సంవత్సర మొదటి రోజు ..

బావుంది కదూ ..

ఇంత ఎండలో ... వద్దులే .. అలా కాస్త సూర్యుడు శాంతించాక సాయంత్రం పూట షికారుకి వెళ్లి రండి ..

దారిలో కొన్ని మామిడి కాయలు , (ఎవరి చెట్లో అన్నా దొంగతనం గా కోసేయండి .. నేనిలా చెప్పానని ఎవరికీ

చెప్పకండెం .. దొరికి పొతే నన్ను తిట్టుకోకండి ),కాస్త వేప పువ్వు , పచారీ కొట్లో కొంచెం బెల్లం , చింత పండు ,అరటి

పళ్ళు తెచ్చి అమ్మ చేతిలో పెట్టేయండి .

ఉగాది రోజు తలారా స్నానం చేసి అమ్మ చేతితో చేసిన కమ్మని ఉగాది పచ్చడి , మిగతా పిండి వంటలతో

లాగించేయండి ..

ఉగాది చైత్ర మాసపు తొలి రోజే కాదు జయనామ సంవత్సర ఆరంభం . మీకంతా జయం కలగాలని మనసారా

దేవుణ్ణి నేను ప్రార్థిస్తా .. మీరూ నాకోసం ప్రార్థిస్తారుగా ..

ఉగాది రోజు పంచాంగ శ్రవణం మరచిపోకండెం .. అది మన సాంప్రదాయం కదా ..

ఇంతకీ మీకో అనుమానం వస్తుంది కదూ .. నాలుగురోజుల ముందే ఈ సోది ఎందుకని ..

మరేమంటే .. ఉగాది పండుగ కి నేను మా ఊరు వెళ్తున్నా .. అదీ రేపే ... అందుకే ఇంత  ముందుగా మీ అందరికి

ఉగాది శుభాకాంక్షలు . అయిపోయిందండీ .. ఇంకా చదివితే ఎలా ? మరో పోస్ట్ ఏదన్నా చదవండి .. లేదంటే

మా మిత్రుల బ్లాగ్స్ కూడా ఓసారి ఓ లుక్కేయండి ..

మరోసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు












మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday 26 March 2014

రుధిర సౌధం 104




"అదే నిజమైతే ఈ వైజయంతి బారి నుండి నా సత్యని కాపాడు అమ్మా .. " అనుకున్నాడు మనసులో మురారి .

ముందు మడుగులోకి దూకుదాం మురారి . మరోసారి ప్రయత్నిద్దాం . ఇప్పుడు మన దగ్గర క్లూ కూడా ఉంది ..

అన్నాడు యశ్వంత్ హుషారుగా .

జై వైష్ణవీ మాతా .. అంటూ మడుగులోకి దూకాడు మురారి .

మురారి వెనుకే యశ్వంత్ దూకాడు . కలువలు చూపించిన దిశ లో మట్టి ని పక్కకి తప్పించి చూశారు . కానీ

అక్కడేం కనబడలేదు . పనిలో పనిగా మడుగునంతా పరిశీలించి చూశారు . ఎక్కడా ఎటువంటి మార్గమూ కనబడ

లేదు . ఇద్దరూ నీటి పైకి తేలి యశ్వంత్ ఏం కనబడలేదు .. ఏం చేద్దాం ? అన్నాడు మురారి .

లేదు మురారి మార్గం తప్పక ఇందులో ఉండి ఉంటుంది .. మనసు చెబుతుంది మరోసారి వెతుకుదాం .

యశ్వంత్ అనగానే  మళ్ళి నీటిలో మునక వేశారు .

శివ , రచన నీటి వంక శ్రద్ధ గా చూస్తుండగా అనుమానం రాకూడదనే తలంపు తో సత్య కూడా వచ్చి వారితో

నిలబడింది .

"విధాత్రీ .. అడుగడుగునా వీరికి సహాయపడుతున్నావు . మహల్ ని నానుండి చేజిక్కించు కోవాలనే యోచన

ఇంకా నీలో ఉండటం నీ  అత్యాశ . ఈ రచన చేతినుండి ఈ రక్షదారాన్ని తొలగిస్తాను . అప్పుడే దీనిని చంపగలను ...

అనుకొంది మనసులో సత్య .

సత్య చెవిలో గాలివాటం గా కొన్ని మాటలు వినబడ్డాయి .

' ఈ అమాయకురాలిని వదిలిపెట్టు సోదరీ .. ప్రేతాత్మ గా ఇంకెన్నేళ్ళు ? మోక్షం కోసం ప్రయత్నించాల్సిన సమయం

లో శాశ్వతం కాని ఈ మహల్ కోసం పంతం కోసం పట్టుదలకి పోవటం సరికానిది . అమ్మవారి ఆలయం లో దీపం

వెలిగితే మహల్ కి పట్టిన దోషం వైదొలగుతుంది . నీకూ నాకూ ఈ మహల్ పట్టుకుని వేలాడుతున్న మరెన్నో

ప్రేతాత్మలకి ముక్తి లభిస్తుంది . నా మాట ని మన్నించు సోదరీ .. నా ప్రయత్నానికి అడ్డు నిలవకు . ఈ పసి వాళ్ళని

ఇబ్బందుల పాలు కానివ్వకు . నేను నిన్ను అర్థిస్తున్నాను .. అన్న విధాత్రి మాటలు .

గాలి కి ఎగురుతున్న కురులని అదుపులో పెడుతూ తన చెవిదగ్గర ఉన్న విధాత్రి ఆత్మా నుద్దేశించి "లేదు విధాత్రీ నీ

ఈ చిలక పలుకులని కట్టి పెట్టు . ప్రేతాత్మనే నేను కావొచ్చు గాక .. కానీ నా పంతం వీడుట నా కు సరికాజాలదు .

నా ఎదురుగా నిలిచి నా తో పోరాటాన్ని కట్టిపెట్టు . దుష్కర్మల ఫలితం నీవు , నీ పరివారము అనుభవింతురు గాక .

 మనసులోనే హెచ్చరించింది వైజయంతి .

సోదరీ .. నీవు చేసిన దుష్కర్మల ఫలితమే ఇదంతా .. ఆత్మాహుతి చేసుకున్నందున నేను ప్రేతమైనాను . కానీ దైవ

శక్తి నాకు తోడుగా నిలిచింది . సదుద్దేశం కారణంగా ఈ స్నేహితులని ఈ కార్యానికి ఎంచుకొనేందుకు అమ్మ నాకు

సాయం చేసింది . నీవు వీరిని ఇబ్బందులు పెట్టగాలవు కానీ ప్రాణాలను తీయలేవు . వీరందరూ వారి జాతక రీత్యా

ఈ పనికి ఎన్నుకోబడిన వారు . సంపూర్ణ ఆయుష్మంతులు . దైవకార్యానికి నిర్దేసింప బడిన వారు . ఈ రహస్యం

వారికీ తెలిసినచో నీ పట్ల వారికి మరింత చిన్నచూపు కలుగును కదా .. నా మాట  విని ఈ వృధా ప్రయత్నం

మానుకొమ్ము సోదరీ .. అని విధాత్రి ఆత్మ అక్కడి నుంచి నిష్క్రమించింది

ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
www.facebook.com/Naarachana

ఏమని చెప్పను ?



నేనెవరంటే ఏమని చెప్పను ?

నిశ్చల మైన సరస్సులో తరంగమని చెప్పనా ?

మేఘాన్ని కరిగించే చిరుగాలి నని చెప్పనా ?

తొలకరి జల్లు కి మురిసే అవని నని చెప్పనా ..

శిశిరపు విరహాన్ని తాళలేని వనాన్ని కౌగలించే వసంతాన్నని చెప్పనా ?

నింగి వీడి నేల జారిన ముత్యపు చినుకునని చెప్పనా ?

మావిచివురు తిని తీయగ పాడే కోయిలనని చెప్పనా ?

నీలాకాశం లో విహరించే విహంగాన్నని చెప్పనా ?

తొలిపొద్దు కిరణాల  చుంబన లో మురిసే జలపాతమని చెప్పనా ?

నెలరేడు ప్రణయ దాహాన్ని తీర్చే కోనేటి కలువనని చెప్పనా ?

అలుపెరగక సాగే  నదీమ తల్లి ప్రవాహ వేగాన్నని చెప్పనా ?

తుంటరిగా పూవన మంతా తిరిగే సీతాకోక చిలుక నని చెప్పనా ?

భావాల  వెల్లువని కవిత గా మలచే శిల్పి నని చెప్పనా?

 ఈ అంతర్జాలం లో ఇంద్రజాలం చేసి మీ మనసుల్ని దోచుకోవాలని వచ్చానని చెప్పనా ?

ఏమని చెప్పను ?




www.facebook.com/Naarachana
 

రుధిర సౌధం 103




రచన వెనుకగా వచ్చి నీకెలా తెలిసింది రచనా ? యశ్వంత్ ఆపదలో ఉన్నాడని ?అడిగాడు శివ .

ఆమె వెనక్కి తిరిగి తెలియడం లేదు శివా .. నాకే తెలియకుండా నేను మడుగులోకి దూకాను . యశ్వంత్ ని

రక్షించాను . కానీ ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగినట్లు అనిపిస్తుంది . అంది

రచన మడుగు లోని కలువల వంక చూస్తూ .

శివ ఆలోచనలో పడ్డాడు .. తల తిప్పి సత్య ,మురారిల తో మాట్లాడుతున్న యశ్వంత్ వైపు చూసాడు .

శివా .. ఇంత జరిగినా ఈ మడుగులోని పూలు ముందెలా ఉన్నాయో అలానే ఉన్నాయి . ఆశ్చర్యంగా లేదూ ..

అంది రచన .

యశ్వంత్ మీదినుంచి దృష్టి ని మరల్చి కలువల వైపు చూసాడు శివ .

నొసలు చిట్లించి మళ్ళి కలువల వైపు చూశాడు శివ . అతని మెదడు లో ఒక ఆలోచన స్ఫురించింది . స్ఫురించిన

వెంటనే యశ్ .. గట్టిగా అరిచాడు .

ఏమైంది శివా ? అని కుర్చున్నాదల్లా లేచి నిలుచుంది రచన .

శివ అరుపుకి యశ్ ,మురారిల తో బాటు సత్య కూడా ఆసక్తిగా చూసింది శివ వైపు .

యశ్ ఇలారా .. ఈ కలువలు మనకి మార్గాన్ని చూపిస్తున్నాయి యశ్వంత్ . ఆనందంగా అరిచాడు శివ .

యశ్వంత్ ,మురారి  పరుగున మడుగు వద్దకి వచ్చారు . సత్య అసహనం గా చూసింది వీరివైపు .

ఏంటి శివా ? ఎలా చెప్పగలుగుతున్నావు ? అన్నారు ఇద్దరూ ఒకేసారి .

రచన ఆశ్చర్యంగా శివ వైపు మడుగు వైపు చూస్తుంది .

అలా చూడు .. రచన చెప్పినట్లు ఈ కలువలు మీరు మడుగులో దూకక ముందు ఎలా ఉన్నాయో అలానే

ఉన్నాయి .. అంతే కాదు కలువల అమరిక దక్షిణం వైపు చూపిస్తుంది ఒక బాణం గుర్తు లా . సరిగ్గా గమనించండి ..

అన్నాడు శివ .

శివ చెప్పింది విన్నాక మడుగులో పూలని పరీక్షగా చూశారు మురారి , యశ్వంత్ ... వారి పెదవులపై చిరునవ్వు

అప్రయత్నం గా వెలువడింది .

ఈ మహల్ లో మనకి హాని చేయాలనుకున్న క్షుద్ర శక్తి తో పాటూ మరేదో శక్తి ఉంది .. ఆ శక్తి మనకి హెల్ప్

చేస్తుందేమో  అనిపిస్తుంది యశ్వంత్ . ఈ కలువ పూలు .. నిన్ను రచన అనుకోకుండా కాపాడటం .. ఇవన్ని

చూస్తుంటే మీకూ నాలా అనిపించటం లేదా ? అన్నాడు శివ .

శివ వైపు చిరునవ్వుతో చూసి నిజమే శివా ... అన్నాడు యశ్వంత్ .

ఇంకెవరు ఆ వైష్ణవీ మాతే మనకి అడుగడుగునా సహాయం చేస్తుందేమో ఎవరికీ తెల్సు ? అంది తన చేతిలోకి

ఓ కలువని తీసుకుంటూ రచన .




ఇంకా ఉంది 



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday 25 March 2014

అందమైన లోకం













ఎందుకో కొత్త గా కనిపిస్తున్నది ఈ లోకం ..                                    

రోజుకో వింతలా కవ్విస్తున్నది  భూలోకం

రెక్కలు విప్పిన యవ్వనం చేసింది  గగన విహారం

రేకులు విచ్చిన పూవనం వేసింది ఓ సుమహారం

గల గల పారే సెలయేరే మంది ? నా కిల కిల నవ్వే తనదంది ..

మిల మిల మెరిసే తారక ఏమంది ? తన మిసమిస సొగసే నాదంది ..

కొమ్మల్లో కోయిలా .. కూసిందిలే ఇలా .. కుహు కుహు పాటలా .. సరిగమల తోటల  ..

మెరిసేటి వెన్నెలా .. కురిసింది జోలలా .. నిదురించు వేళలా .. కలలు నా కన్నులా ..

సరికొత్తగా .. గమ్మత్తుగా ఊయలూపింది లోకమే ఇలా ..


పూవు ల భాష ఏదో .. తుమ్మెదా..  నీకు తెలుసేమో ..

చిరుగాలి ఊసుల్ని వింటూ పైరు తల ఊపుతుందేమో ..

నింగి చెక్కిలి పైన .. సిగ్గు ఒలికించు స్సూరీడు .. మబ్బుల చీర తెచ్చి .. కానుకే ఇచ్చి ఉంటాడు .

వేకువ వాకిలి లోనా .. ముగ్గు పెట్టేవాడు .. హరివిల్లు రంగులు కూర్చి .. చిరుజల్లు కురిపించుంటాడు ..

ఆనందమా .. ఆహ్లాదమా ? ఈ జగతిలో ఇంతందమా ?

పచ్చాని రాచిలుక  కమ్మని పలుకులా

మా వూరి రహదారి మెలికల  కులుకుల ..

సిరి మువ్వ సవ్వళ్ళ..  దోబూచు లాట లో  .. గోధూళి వేళలో .. కన్నె దూడ సంబరాలు

సందె పొద్దు నీడలోనా  .. .. తెల్లవారు పల్లె లోనా  .. మంచు జాణ ఇలకి చేర .. విచ్చు  మందారాలు

చాలవేమో కళ్ళు రెండు .. సొగసులద్దిన ప్రకృతిని చూడ ..









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

రుధిర సౌధం 102



రచన తన ఒడిలో యశ్వంత్ తల ని పెట్టింది  యశ్వంత్ ని నేల పై పరుండబెట్టి ..

అతను ఆమె కళ్ళలోకి చూశాడు . ఆమె కళ్ళలో అంతులేని ఆర్ద్రత . తన చేతితో అతని తలని ప్రేమగా నిమిరింది

ఆమె .

సత్య ఓటమి ని తాళలేక కోపంగా చూసింది వారివంక .

నీకెలా తెలిసింది రచనా ? నీటిలోపల యశ్వంత్ ప్రమాదం లో ఉన్నాడని ? అడుగుతున్నాడు శివ .

శివ ప్రశ్న యశ్ చెవులకి లీలగా వినిపిస్తుంటే అతడు మాత్రం రచన కళ్ళలోని లోతైన భావాలని చదువుతున్నాడు .

విధాత్రి .. రాకుమారి విధాత్రి .. మీకు నా కృతజ్నతలు . అతని మనసు పలికింది .

ఆమె కళ్ళలో సన్నని వెలుగు మాయమై వెంటనే .. యశ్ ఎలా ఉంది నీకు ? అసలు నీటిలో అంత ఇబ్బంది ఎలా

పడ్డావు ? ఆదుర్దాగా అడిగింది రచన .

అతడి పెదవులపై సన్నని చిరునవ్వు .

యశ్ .. ఆర్ యు ఓకే .. ? భయంగా ,ఆందోళన గా అడిగాడు మురారి నీటిలోంచి పైకి వచ్చి .

మెల్లిగా రచన ఒడిలోంచి లేచి అందరివైపు చూసి ఐ యాం ఓకే ఫ్రెండ్స్ .. అన్నాడు యశ్వంత్ .

చూశావా యశ్వంత్ ? ఎంత ప్రమాదం దాటిందో ? ఇలాంటివన్నీ చూస్తేనే భయం కలుగుతుంది . మనమీ ప్రయత్నం

మానుకుంటే మంచిదేమో . .. అమాయకత్వం నటిస్తూ అంది సత్య లో ఉన్న వైజయంతి .

రచన పొడి టవల్ తెచ్చి ఇచ్చింది . తల తుడుచు కుంటూ ప్రమాదం ఉంటుందని తెలిసేకదా సత్యా మనమీ పని కి

పూనుకున్నది .. ఇప్పుడు భయపడి వెనక్కి తగ్గితే అది ఓడిపోవటమే . ఓడిపోవటాన్ని నేను ఇష్టపడను . అన్నాడు

యశ్వంత్ .

ఓడిపోతే అది పెద్ద విషయం కాదు యశ్వంత్ . కానీ ప్రాణాలు పోతే .. నొక్కి పెట్టి అంది సత్య .

ప్రాణం పోవటమా ? ఎవరివల్ల .. ఆ బ్లడీ వైజయంతి వల్ల నా ? నెవెర్ .. తను మన ప్రాణాలు తీయగలిగి ఉంటె

ఇప్పుడు కాదు ఎప్పుడో తీసేయగలిగేది . తనని మించిన శక్తి మనకి తోడుగా ఉంది ... చెడు ఎప్పుడూ మంచి

ముందు పరాజయం పొందక తప్పదు . మనిషి సంకల్పం ముందు ఏమైనా ఓడిపోవలసిందే అన్నాడు యశ్వంత్

స్థిరంగా ...

కోపంగా ఎర్రబడిన కళ్ళతో చూసింది వైజయంతి(సత్య ) .

మురారి వారిద్దరి సంభాషణ ని విని  .. యశ్వంత్ ఇంత ప్రమాదం నుండి బయటపడ్డావు కాసేపు నువ్వు విశ్రాంతి

తీసుకో .. అన్నాడు మురారి .

అవును .. బట్ నేను విశ్రాంతి తీసుకోదల్చుకోలేదు . అని కొలను వైపు చూశాడు . ఏమాత్రం చెదిరి పోకుండా

కలువలు కొలువుదీరున్నాయి .

రచన మడుగు ఒడ్డునే కూర్చుంది ఆలోచిస్తూ ....

ఇంకా ఉంది 









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday 24 March 2014

ఓ చిరుగాలీ ..నా ప్రియురాలి జాడే తెలుపవే



ఓ చిరుగాలీ .. నా ప్రియురాలి

జాడే తెలుపవే ఊరేగే వేళా ...

ఓ సిరిమల్లి .. నా జవరాలి

సిగలో జాబిలి నీవయ్యే వేళా  ..

కమ్మని కబురే చెప్పాలి .. నా మది మాటున చెలి నవ్వాలి .. 2 ఓ చిరుగాలి

తీయని పాటలో పల్లవి తానే .. రాగం నేనై ఒదగాలి ..

పున్నమి రేయి న వెన్నెల నేనే  .. చంద్రిమ తానై ఉండాలి

ఎదలోతులలో తన మువ్వల సవ్వడి .. నా తలపులలో చెలి రేపే అలజడి

కన్నుల ఎదురుగ కనబడదేమో మరి ..                            ఓ చిరుగాలీ


కోయిల కూసిన పలికావనుకున్నా  .. ఊయల ఊగినా వచ్చావనుకున్నా

మల్లెలు పూసిన నీ నవ్వులు కన్నా .. మువ్వలు మోగితే పిలిచావనుకున్నా

నిను చూసే రోజే పండుగని .. నిను చూడని రోజున నే లేనని ..

తెలపాలే చెలియా కనరావే ..                                            ఓ చిరుగాలి




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది  

Sunday 23 March 2014

రుధిర సౌధం 101

తన చేతిలోని కలువ వంక విచిత్రంగా చూస్తున్న రచన వంక క్రోధపు చూపు చూస్తూ రచనా .. ఏంటి అలా విచిత్రం

గా చూస్తున్నావు ? అంది సత్య రచన భుజం మీద చేయి వేసి ..



అంతే ఒక్కసారిగా సత్య ఒంట్లో విద్యుత్ ప్రవహించి నట్లయి ఆ తాకిడి ని తట్టుకోలేక వేసిన చేతిని వెంటనే వెనక్కి

తీసుకుంది సత్య .. కోపంగా రచన చేతికి ఉన్న రక్షా దారం వైపు చూసింది .

అదే0 లేదుగాని సత్యా .. ఈ పువ్వు చూశావా ? నేనిలాంటి కలువని ఇది వరకెప్పుడు చూడనే లేదు . ఇందులో

ఎన్ని రెక్కలున్నాయో చూడు . అంది రచన .

అవును ఇలాంటి కలువలు రెండు వందల ఏళ్ళ క్రితం పూసేవి . కాని ఇప్పుడు ఇలాంటివి కానరావడమే కష్టం .

అంది ఆమె రక్షదారం పై దృష్టి నిలిపి సత్య .

అవునా ? నీకెలా తెలుసు ? అంత ఖచ్చితం గా చెబుతున్నావు .. అడిగింది సత్య వైపు చిరునవ్వు తో చూస్తూ ..

తత్తర పడుతూ .. ఏదో పుస్తకం లో చదివాను . అంది సత్య .

ఈలోపు మురారి యశ్వంత్ ఇద్దరూ మడుగు లోకి దిగారు . మడుగులో దిగిన మురారి కొంత భయంగా సత్య వైపు

చూసాడు . ఆమె అతడి వైపు క్రూరంగా చూసింది .

మురారి మడుగులో మట్టి మెత్తబడింది . గమనించావా ? అన్నాడు యశ్వంత్ .

హా .. హా .. అని సత్య మీద నుంచి దృష్టి ని మరల్చి యశ్వంత్ లోపల వేరే ఏదన్నా మార్గం ఉందేమో గమనించాలి ..

అన్నాడు మురారి .

సరే .. అని ఇద్దరూ నీటిలోకి మునిగారు . శివ ,సత్య ,రచన గట్టు మీద నిలబడి ఆసక్తి గా చూస్తున్నారు .

సత్య కనుగుడ్లని అటూ ఇటూ తిప్పి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది .

నీటిలో ఉన్న యశ్వంత్ శ్వాస ఆడక ఇబ్బంది పడసాగాడు . కాళ్ళని ఎవరో కట్టేసి నట్లని పించింది .  చేతులు

నియంత్రణ కోల్పోయాయి .  కొద్ది దూరం లోనే ఉన్న మురారిని చూస్తున్నా ఏమీ చేయలేని అశక్తత . ప్రాణం పోవటం

మరికొద్ది సెకెన్లలో ఖాయమని పించింది . మురారి ని మడుగు అడుగున మట్టి ని గమనిస్తున్నాడు .

కష్టం గా నీటి పైన గట్టు మీద లీలగా కనిపిస్తున్న రచన ని చూశాడు . నీటిపైకి రావటానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం

వృధా కాసాగింది . ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది . బహుశా వైజయంతి కావొచ్చు . విధాత్రి మనసులో మెదిలింది .

విధాత్రీ .. నువ్వే నన్ను రక్షించగలవు .. మనసులో నే అనుకున్నాడు .. యశ్వంత్ .

అతని కళ్ళు మూసుకు పోతున్నాయి .

గట్టు మీద నుండి చూస్తున్న రచన ఏందుకో రెండు అడుగులు వెనక్కి వేసి ఒక్కసారిగా మడుగులోకి దూకింది .

ఈదుకుంటూ వెళ్లి క్షణం లో యశ్వంత్ ని నీటి పైకి తీసుకు వచ్చింది .

పోతున్న ప్రాణం మల్లి శరీరం లోనికి ప్రవేశించినట్లయింది యశ్వంత్ కి .

మాట పెగల్చుకొని రచనా .. యు సేవ్ డ్ మై లైఫ్ అన్నాడు యశ్వంత్ .

ఏదో జరిగిందని నీటి పైకి వచ్చాడు మురారి .

యశ్ .. ఏం జరిగింది అంటూ కంగారుగా వచ్చాడు శివ .

ఇంకా ఉంది 


 అభిప్రాయం మాకు అతి విలువైనది

Saturday 22 March 2014

వీక్షకులతో కాసేపు

బ్లాగ్ వీక్షకులకి .. 

               నేను " నా రచన " లో వ్రాస్తున్న రుధిర సౌధం సీరియల్ ఈరోజు తో 100 వ భాగానికి చేరుకుంది . 

సీరియల్స్ రాయటం నా హాబీ . అలా అని ఇంతవరకు ఏ మ్యాగ్ జిన్ లోనో  పబ్లిష్ చేయటం కోసం సంప్రదించే 

ప్రయత్నం చేయలేదు . కానీ సీరియల్ చదువుతున్న వారు పబ్లిష్ చేయమని సలహాలు ఇస్తున్నారు . ఎంతగానో 

ప్రోత్సహిస్తున్నారు . ఏ కళ ఐనా మరింత వన్నె పెరిగేది ప్రోత్సాహం వలెనే కదా . కాబట్టి వీక్షకులందరికి ఎంతగానో 

కృతజ్ఞతలు చెప్పుకోవటం లో నా ఆనందం ఉంది . మీ ఆశీర్వాదం తో ముందుకు సాగాలని ఆశ పడుతున్నాను . 

ఇకపోతే రుదిరసౌధం కథ నా మనసులో 5ఏళ్ళ నుంచీ నానుతుంది . దానికి ఇన్నాళ్ళకి అక్షర రూపం 

ఇవ్వగలిగాను . సీరియల్ మీ అందరికి నచ్చినందుకు చాల సంతోషం . మరెన్నో సంతోషాలని మీతో 

పంచుకునేందుకు ఎప్పుడు సిద్ధం అని మీకు తెలియజేస్తూ ... 

                                                                                                                           
                                                                                                                       రాధిక


Friday 21 March 2014

రుధిర సౌధం 100

యశ్వంత్ .. మహల్ కె బయల్దేరుతున్నావా ? సత్య ప్రశ్నకి వెనక్కి తిరిగి .. హా .. మురారి నిద్రపోతున్నాడా ? ?

అడిగాడు యశ్వంత్ నిర్లిప్తం గా .

అతడి వంక వెటకారం గా చూసి .. ఇంకా నిద్రపోవట మేంటి ? రెడీ అవుతున్నాడు .. గుడి వెతకటం ముఖ్యమే కదా .

అంది సత్య కొంచెం వ్యంగ్యం గా .



అవును . మురారి ఉండటం చాలా ముఖ్యం . నువ్వూ వస్తావా సత్యా .. అన్నాడు యశ్వంత్ .

తప్పకుండా యశ్వంత్ . తప్పక వస్తాను .. అని టేబుల్ పక్కనే ఉన్న కుర్చీ తీసుకొని కూర్చుంది .

ఇంతలో .. హాయ్ .... అంటూ చేతులు ఊపుతూ వచ్చింది రచన .

హాయ్ .. రచనా .. సమయానికి వచ్చావ్ .. మహల్ కె స్టార్ట్ అవుతున్నాము . అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. అని సత్య వైపు చూసి హాయ్ సత్యా .. గుడ్ మార్నింగ్ .. అప్పుడే ఫ్రెష్ అయ్యావే .. అంటూ వచ్చి ఆమె కి

ఎదురుగా ఉన్న కుర్చీ లో కూర్చుంది . ..

ఆమె వైపు  ద్వేషం తో నిండిన చూపు చూసి పెదవులపై ఓ అబద్ధపు నవ్వు పులిమి నీకోసమే చూస్తున్నాము

రచనా ... నువ్వోచ్చాకే బయల్దేరోచ్చు కదా అని . అంది సత్య

ఇంతలో అందరికి కాఫీ తీసుకొచ్చాడు శివ . మురారి కూడా రెడీ అయి వచ్చాక అందరూ కాఫీ సిప్ చేయసాగారు .

మురారి క్రీగంట సత్య వైపు చూసాడు . ఈ వైజయంతి కూడా అక్కడికి వస్తుంది . ఏమియ్యి ఉంటుంది ఈమె ఉద్దేశ్యం

?గుడి బయటపడనివ్వకుండా చేస్తుంది . ఓ క్షుద్ర శక్తి పన్నాగాల ముందు  మానవ ప్రయత్నం ఫలిస్తుందా ??

అని ఆలోచిస్తున్నాడు మురారి .

పదండి పదండి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు . త్వరగా వెళ్దాం .....  తొందర పెట్టింది సత్య .

లెట్స్ గో అంటూ ముందుకి కదిలాడు యశ్వంత్ .

అందరూ యశ్వంత్ ని అనుసరించారు .

                                         
                                           ***********************************

కాసేపట్లోనే అందరూ మహల్ వెనుక భాగానికి చేరుకున్నారు . యష్ .. అటుచూడు .. వింతగా ఉంది కదూ .. అని

శివ చూపించిన వైపు అందరూ  చూశారు .

అందరి కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి . ఓహ్ గాడ్ .. ఒక్కరోజు లోనే ఈ మడుగు లో ఇన్ని కలవ పూలు ఎలా

పూసాయి . ..? అన్నాడు మురారి ఆశ్చర్యంగా .

నిజమే .. నిన్నటి వరకూ మడుగులో నీళ్ళే లేవు .. ఈరోజు ఇన్ని కలువ పూలు .. ఎంత అందంగా ఉన్నాయో ..

ఆశ్చర్యానందాలతో అంది రచన .

మురారి వాటిని చూసి ఆలోచన లో పడ్డాడు . దీని వెనుక ఏదో రహస్యం ఉండి ఉంటుంది అనుకున్నాడు మనసులో

సత్య వాటిని చూసి కోపంగా పళ్ళు కొరికింది .  విధాత్రీ .. నేను నీ ప్రయత్నాన్ని సఫలం కానివ్వను . అని కోపంగా

ముందుకి నడిచింది .

సత్యా .. ఆగు .. నేనూ ఆ పూలని కాస్త దగ్గరగా చూస్తాను .. అని రచన పరుగున ఆ మడుగు దగ్గరకి వచ్చింది .

వంగి మడుగులో ఉన్న ఓ కలువ ని తీసి పరీక్షగా చూసింది . ఆమె కళ్ళు వింతగా మెరిసాయి ..

ఇంకా ఉంది 

మీతో ఓ చిన్న మాట : రుధిర సౌధం సీరియల్ ని ఆదరిస్తున్న బ్లాగ్ వీక్షకులకి సదా కృతజ్ఞురాలిని . మీ అభిమానం 

ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తు ... 100 భాగం వరకూ చేరుకున్న ఈ సీరియల్ ఇంకా ముందుకి 

కొనసాగాలని భావిస్తూ

                                                                                                                                     మీ రాధిక



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది.. 

ఈరోజు ప్రపంచ కవిత్వ దిన మట




అక్షరాల పూలన్నీ అందమైన భావమనే దారానికి కూర్చి కవిత అనే పూదండ చేసి మా బ్లాగ్ వీక్షకుల మెడలో

వేద్దామనుకుంటే దారం రీలు దొరకలేదాయే ..

ఏం చేద్దాం మరి ?

ఈరోజు ప్రపంచ కవిత్వ దిన మట .. ఒక అందమైన భావాన్ని అక్షర మాలని చేయటానికి . అది భగవంతుని మెడలో

వేయటానికి ప్రత్యేకించి ఓ దినం అవసరమా ? ఏమో .. మనసు స్పందించినపుడు ఎద వీణ పై తీయని రాగాలని

మీటుతున్నప్పుడు  రాత్రైతే నేం పగలైతేనేం తీయని కవిత మది పొరల్లోంచి ఊడి పడుతుంది ..

ఒప్పుకుంటారా ? ఏమైతేనేం ఎవరో ఒకరు కవితలకి ఒక రోజుని కేటాయించారు కదండీ .. శుభాకాంక్షలు

చెప్పుకుంటే మన సొమ్మేం పోదు కదండీ .. కాబట్టి ప్రపంచ కవిత్వ దినాన మీకివే నా శుభాకాంక్షలు ..








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday 20 March 2014

రుధిర సౌధం 99



హాల్ లో అడుగు పెట్టె సరికి సోఫాలో పేపర్ చదువుతూ రచన కోసమే వేచి చూస్తున్న రత్నరాజు లోపలికి అడుగు

పెట్టిన రచన ని చూడగానే లేచి నిల్చుని ధాత్రీ .. నిన్నంతా ఇంటికి రాలేదేం ? ఎక్కడ కి వెళ్లావు ? అని ఆదుర్దా గా

అడిగాడు రత్నరాజు .

ఆమె అతడి వంక కొంత అసహనం గా చూసిన ఆ ఫీలింగ్ బయట పెట్టకుండా అదీ .. నిన్న సరస్వతి ని తీసుకొని

పోలీస్ స్టేషన్ కి వెళ్లాను . సాయంత్రం అయింది . తర్వాత మురారి పుట్టిన రోజంటే వాళ్ళ తోనే ఉండి పోయాను ..

మీకు చెప్పకుండా ఉండిపోయినందుకు సారీ .. అంది రచన .

అయ్యో .. నువ్వు రోజంతా కనిపించక పోయే సరికి కంగారు పడ్డాను . నాన్నగారు కూడా నీ గురించి అడిగారు .

పోనీలే .. మురారి పుట్టిన రోజంటే నేనూ ఏదో ఒక కానుక ఇచ్చుంటే బావుండేది . అన్నాడు రత్నం .

ఫర్వాలేదు రాజు గారూ .. కానుక అయితే తర్వాత అయినా ఇవ్వొచ్చు . నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను . ఇంకో

చిన్న పని ఉంది బయట కి వెళ్ళాలి . అంది రచన .

మళ్ళీనా ? నీతో కొంచెం మాట్లాడు దామను కుంటే నువ్వు చిక్కడమే లేదు అన్నాడు రత్నం .

రాజు గారు .. నేనీ ఊరు వచ్చిందే పని మీద . ఆ పని పూర్తీ చేసుకోవాలి కదా . అయినా మీ ఇంట్లో ఆశ్రయ మిచ్చి

సహాయం చేసినందుకు మీకూ కొంత సమయం కేటాయిన్చాల్సిందే . తప్పనిసరిగా మాట్లాడదాం . కానీ ఇప్పుడు

కాదు . అంది రచన .

అలానే ధాత్రీ .. నువ్వెప్పుడు తీరిగ్గా ఉంటావో అప్పుడే మాట్లాడదాం . వెళ్లి ఫ్రెష్ అయిరా . కలసి టిఫిన్ అన్నా చేద్దాం .

అన్నాడు రత్నం రాజు .

ష్యూర్ .. కాసేపట్లో వస్తాను . అని మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోతున్న రచన ని చూసి చిన్నగా నిట్టూర్చాడు రత్నం

                                                      *************************

యశ్ .. లేచావా ? త్వరగా ఫ్రెష్ ఆవు . టిఫిన్ చేద్దువు గాని .. అన్నాడు శివ కళ్ళు నులుము కుంటూ లేచిన యశ్

ని చూసి .

లేచి కూర్చున్నాడు యశ్వంత్ .

శివా .. సత్యా , మురారి వచ్చారా ? అని అడిగాడు యశ్వంత్ టిఫిన్ పొట్లాలు విప్పుతున్న శివ ని చూస్తూ .

ఆ వచ్చారు .. మనతో అబద్ధం చెప్పి మురారి ప్రశాంతం గా ఉన్నట్టు లేడు . డల్ గా ఉన్నాడు . ఇద్దర్నీ విశ్రాంతి

తీసుకో మన్నాను . అన్నాడు శివ .

శివా .. మురారి మనతో నిజం చెప్పలేక పోవటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది . సమయం వచ్చినపుడు అన్నీ

తెలుస్తాయి . ముందు గుడి గురించి తెలుసుకోవాలి అన్నింటి కన్నా అదే ముఖ్యం . రచన ఎక్కడుంది ? అన్నాడు

యశ్వంత్ .

తను భూపతి బంగ్లా కి వెళ్ళింది . ఫ్రెష్ అయి వస్తానంది . అని గుడి గురించి తెలిస్తే అన్ని సమస్యలు

తొలిగిపోతాయని  నమ్ముతున్నావా యశ్వంత్ ? అన్నాడు శివ .

అవును శివా . తెలుసుకోవటమే కష్టం . బట్ తెలుసు కోవాలి . అదొక్కటే పరిష్కారం .. నిన్న జరిగిన సంఘటన

కూడా   నిర్లక్ష్యం చేయదగినది కాదు . అన్నాడు యశ్ .

సరే .. నువ్వు ఫ్రెష్ అయి వస్తే మహల్ కి బయల్దేరదాం అన్నాడు శివ .

 ఇంకా ఉంది 


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది ,,Like the posts on face book also ;
click on www.facebook.com/Naarachana

ఆవేదన


ఇది కట్టలు తెగిన ప్రవాహం .. ఏనాటికి తీరని దాహం ..

ఇది వీడని వాడని మొాహం .. తావివ్వదు ఏ సందేహం ..

ఆవేదన కిది దాసోహం .. కన్నీళ్ళతో తడిసెను దేహం .. ఇది కట్టలు


సంద్రమంత వేదనా గుండె నే ముంచి వేసేనా ?

చినుకంత ఓదార్పుకె  మది ఎదురుచూడ సాగెనా ?

అల్లంత దూరాన సంతోషమే దాగి దోబూచులాడుతున్నది

కళ్ళింత చేస్తున్నా కనరాని అంబరమే శూన్యమై పోతున్నది ..

నా మౌనమే శోకాన్ని అణచదా .. నా ప్రాణమే లోకాన్ని మరువదా ..

నిస్పృహల నడుమే జీవితం  .....                             ఇది కట్టలు  


ఆ అష్ట దిక్కులలో  హద్దుల్ని చెరిపెసేలా ...

ఆ  అంతరిక్షం లో మెరుపులా మెరవాలా ...

చిరునవ్వు ఎరుగని పెదవులది ఏ పేరని .. సిరిమల్లె మనసులో వేదనకి చోటేలని ...

చిరుగాలి తాకని మబ్బు గతి ఏమౌనని .. సిరిమువ్వ సవ్వడిని నచ్చని వారెవరని ..

నీ ధైర్యమే నడిపించదా .. నీ గమ్యమే నిర్దేశించదా ...

సుఖ దుః ఖపు  కలయికే జీవితం




 అభిప్రాయం మాకు అతి విలువైనది

Wednesday 19 March 2014

రుధిర సౌధం 98




తెల తెలవారుతుండగా తలుపు తట్టిన సౌండ్ విని తలుపు తీసాడు శివ .

ఎదురుగా మురారి ,సత్య ... పాలిపోయిన మొహానికి నవ్వు పులిమి గుడ్ మార్నింగ్ శివా అన్నాడు మురారి . సత్య

నవ్వుతూ నిలబడింది .

శివ  కూడా చిరునవ్వు నవ్వి రండి లోపలికి అని అడ్డు తోలిగాడు గుమ్మానికి . స త్య మురారి వైపు చూసి ఒక

విషపు నవ్వు నవ్వి లోపలికి అడుగు పెట్టింది . ఆమె వంక అసహనం గా చూసి తానూ లోపలికి నడిచాడు మురారి

వాళ్ళిద్దరూ లోపలికి వచ్చేసాక తలుపులు మూసి తానూ వారితో నడిచాడు శివ .

సవ్వడి విని లేచిందోమో  రచన ఎదురుగా వచ్చి .. వచ్చేసారా ? అని సత్య చెవి లో ఆర్ యు హ్యాపీ ? అంది కన్ను

గీటుతూ రచన .

సత్య సిగ్గు పడింది .. కాని అదెందుకో రచన కి  వింతగా కనిపించింది . కానీ ఆ భావన ని బయటకి కనబడ

నీయకుండా  .. సరే .. నేను బంగ్లా కి వెళ్తున్నా .. ఫ్రెష్ అయి మల్లి కలుస్తా .. సరేనా ? అని మురారి దగ్గరికి వచ్చి

మురారీ .. యశ్ నిద్ర పోతున్నాడు . మీరు విశ్రాంతి తీసుకోండి . నేను నిన్నటి నుండీ బంగ్లా కి వెళ్ళలేదు ..

వేల్లోస్తాను .. అని ముందుకి నడచింది రచన .

వెళ్ళిపోతున్న రచన ని నిస్సహాయం గా చూస్తున్న మురారి దగ్గరకి వచ్చి .. నువ్వేం చేస్తావో  తెలీదు . కానీ ఇక పై

ఆమె ఇక్కడే ఉండాలి .. నా కళ్ళ ఎదురుగా .. అర్థమైందా ? అంది సత్య మురారికి వినబడేలా ..

 అతడు బాధగా తల ఊపాడు .

ఆమె వయ్యారం గా నడుస్తూ ముందుకి నడచింది .

మురారి బాధగా తల  పట్టుకున్నాడు . ఏం చేయాలి ఇప్పుడు ? ఇటు సత్య నీ ,అటు నా స్నేహితులనీ ఈ పిశాచి

బారి నుండి కాపాడాలి .. ఎలా ? ఈ విషయం నేను వీళ్ళతో చెప్పలేను .. ఒంటరిగానే ఈ సమస్య నుండి బయట

పడాలి . నిన్నరాత్రి  జరిగిన సంఘటన ని అంత తేలిగ్గా యశ్ వదిలేయడు అనే అనుకుంటున్నా .. ఈ విషయం

ఎలా  అయినా యశ్వంత్ ,రచన లకి తెలియజేసి తీరాలి .. అనుకున్నాడు మురారి .

మురారీ .. అంటూ మురారి దగ్గరకి వచ్చి ఏంటి అలా ఉన్నావు ? ఎనీ థింగ్ రాంగ్ ? అని మురారి భుజం మీద చేయి

వేసి అడిగాడు శివ .

ఎదురుగా ఉన్న గది కిటికీ లోంచి వెటకారం గా చూస్తున్న సత్య ని ఓరకంట గమనించి .. అదేం లేదు శివా ..

నైట్ నిద్రలేదు .. టైర్డ్ గా ఉంది . నేను స్నానం చేసి వస్తాను .. అన్నాడు మురారి .

మురారీ ఈరోజు మడుగులో వెతకాలి కదా .. నువ్వు మాతో వస్తున్నవుగా .. అనుమానంగా అడిగాడు సివ.

సత్య వంక భయంగా చూసి .. శివా .. తరవాత వేల్లోచ్చుగా .. అదే .. నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలిగా .. అన్నాడు

మురారి .

ఏంటో మురారి .. నువ్వు కొత్తగా ఉన్నట్లని పిస్తుంది . సర్లే .. ఇంకా యశ్వంత్ ఎలాగూ నిద్రలేవలేదు . రచన కుడా

బంగ్లా నుండి రావటానికి సమయం పట్టొచ్చు . ఈలోపు నువ్వూ ,సత్యా విశ్రాంతి తీసుకోండి .. నేను టిఫిన్స్ తీసు

కొస్తాను . అని గుమ్మం వైపు నడిచాడు శివ .

ఇంకా ఉంది 





































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

కృతజ్నతలు

రుధిర సౌధం 100 వ భాగానికి 

చేరుకోబోతున్నందున రీడర్స్ అందరికి కృతజ్నతలు 


                                               -మీ రాధిక 

Naa Rachana: రుధిర సౌధం 97

Naa Rachana: రుధిర సౌధం 97: ప్లీజ్ నా సత్య నొదిలి వెళ్ళిపో వైజయంతీ .. సత్య నీకేం హాని చేసింది .. నా సత్య లో నిన్ను చూడలేను .. దీనంగా అర్థించాడు మురారి . నేను ఇ...

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ఒక మంచి మాట .. అందరూ చెప్పేదే .. కాని మరోసారి

నడినెత్తిన సూరీడు నీడని నిలువ నీయడు ..

పోటెత్తిన గోదారి ఊరు వాడా మిగుల నీయదు .

కోపం తో మసకబారిన మెదడు  విచక్షణ ఎరుగ నీయదు .

ద్వేషం తో నిండిన మనసు మంచి ని వెతుకనీయదు ..

రోషం తో వేసిన అడుగు గమ్యానికి చేరనీయదు ..


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
Like the posts on face book also ; 
click on www.facebook.com/Naarachana

రుధిర సౌధం 97



ప్లీజ్ నా సత్య నొదిలి వెళ్ళిపో వైజయంతీ .. సత్య నీకేం హాని చేసింది .. నా సత్య లో నిన్ను చూడలేను .. దీనంగా

అర్థించాడు మురారి .

నేను ఇలా వచ్చేలా చేసింది మీరే . ఎందుకు ? ఎందుకు నా మహల్ జోలికి వచ్చారు ? ఇది నా సౌధం . నా రుధిరం

తో తడిసిన మహల్ ఇది . నా ప్రాణం పోయింది ఇక్కడే ... ఏ హక్కుల కోసం నా ప్రాణం తీసారో ఆ హక్కు కోసం

ప్రేతాత్మ లా ఈ సౌధాన్ని పట్టుకు వేలాడుతున్నాను . ఎప్పటికీ ప్రేతాత్మగా మసల డానికి సిద్ధం గానీ ఆ రచన కి

మాత్రం ఈ సౌధాన్ని దక్కనిచ్చేది లేదు . ఘర్జించింది కోపంగా వైజయంతి .

రచన కూడా మీ వారసురాలేగా ఎందుకని తన మీద ఈ ద్వేషం ? ఆవేశం గా అడిగాడు మురారి .

హహహా హ్హా .. గట్టిగా  వికటాట్టహాసం చేసింది వైజయంతి .

రచన లో విధాత్రి పోలికలు ఉన్నాయి . నాకు రచన ని విధాత్రికి మధ్య తేడా కనిపించడమే లేదు .. విధాత్రి చావుకి

నేనెలా కారణం అయ్యానో .. ఈ రచనని కూడా అలాగే .. అని గట్టిగా నవ్వింది వైజయంతి .

విధాత్రి ఎవరు ? ఆశ్చర్యంగా అడిగాడు మురారి .

"'నా శత్రువు " కళ్ళు భయంకరంగా తిప్పుతూ అంది వైజయంతి .

శత్రువా ??? వింతగా ఆమె ని చూస్తూ అడిగాడు మురారి .

ఆమె తన చేతిలోకి అతడి చేతిని తీసుకొని మహల్ తలుపుల్ని విసురుగా ముందుకి తోసింది ..

అతడ్ని బలవంతం గా ఓ గదిలోకి ఈడ్చుకేల్లింది ..

చూడు .. ఆమె గురించే అడుగుతున్నావు కదూ .. ఆమె నా శత్రువు విధాత్రి  అని  గోడ మీదున్న చిత్రపటం కేసి

కోపం గా చూపించింది వైజయంతి .


ఆమె వంక భయంగా చూస్తూ గోడ వైపు దృష్టి సారించిన మురారి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి .

ఈమె ... అచ్చు రచన లా...  ఉంది .. మాటలు కూర్చుకుంటూ అన్నాడు మురారి .

మీరంటున్న ఆ రచన ఈ విధాత్రి కుటుంబానికి వారసురాలు . నాకు కాదు . ఈ మహల్ నాది ... నాది .. నాది ..

గట్టిగా అరచింది వైజయంతి .

మురారి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ చిత్రపటం దగ్గరికి నడిచాడు .

చిరున్నవ్వుతో దేవకన్య లా ఉందామె .

"విధాత్రి " ... అతని పెదవులు అప్రయత్నం గా ఉచ్చారించాయి .

ఆ రాక్షసి మూలంగానే నా తండ్రే నన్ను నరికి చంపాడు . నా రక్తం తో మహల్ తడిసి పోయింది . నా రక్తం చిందిన

ఈ సౌధం లో రక్తం చిందించటానికి సిద్ధం కండి .. అని గర్జించింది

(ఇంకా ఉంది )