ఏ లోకం లో విహరిస్తూ ... ఈ లోకాన్నే మరిచావే ...
నీకోసం నే వేచున్నా మౌనం గా ..
నా రూపం లో జీవిస్తూ ... నా సర్వం నువ్వయినావే ...
నా అనుమతి నడగ క ననువీడి వెళ్ళవు గా
ఎందరితో కలిసున్నా నా మనసే నిను వెతికిందీ ..
నా కనులకు నువ్వు కనరాక.. కన్నీరే పొంగిందీ ... ! ఏ లోకం లో!
నా గుండె సడి లో నువ్వు నూరేళ్ళు ఉంటావు ... నీ జతని వీడిన నా మది నేమిచేయమంటావు ?
నా కనుల గుడిలో నువ్వు దేవతవు అయినావు ... ఇలలోనా చూపలేని కనులనేమి అంటావు?
ఓ ప్రియతమా .. నా ప్రాణమే నీవు ... నీ ప్రాణమే నాకిచ్చి వెళ్ళిపోయావు .....
ఓ హృదయమా .. నా గానమే నీవు... ఆ గగనమై నానుండి వేరు అయినావు
నువ్వు లేని... నే లేనే ... అడుగైన... వేయలేనే .... జీవించమంటూ ఓ శాపమిచ్చి వెల్లావె ...! ఏ లోకం!
నా ప్రేమ నదిలా నీవు .. నాలోనా ప్రవహించావు ...ఈ కడలి కౌగిలి నొదిలి ఏల మాయమైనావు ?
పూలలో సౌరభ మల్లె నాలోనా ఒదిగావు .... రూపాన్ని విడిచి ప్రేమ వాసనల్లే మిగిలావు
ఓ త్యాగమా ... నిను మించలేరె వరు ... ఓ అందమా నిను చూపగల వారెవరూ ?
ఓ బంధమా ... నిను వివరించువారెవరు? ఓ విరహమా ... నిను ఓడించ గలవారెవరు?
ఓ చెలీ చేరవా ... నీవు నాతోడూ .. ఓ సఖీ .. చావునే గెలిచి నను చేరూ ....
ఏ లోకం లో విహరిస్తూ ఈ లోకాన్నేమరిచావే .. నీకోసం నే వేచున్నా మౌనం గా ....
నా రూపం లో జీవిస్తూ ... నాసర్వం నువ్వయినావే ... నన్నే ఒంటరి చేసి ఎటువెల్లావే ?
నీ మరణం సత్యం అయినా .... నీ స్మరణం నిత్యం చెయన...
ఓ రూపం లేని నీడై నిను నాలో కనుగొన్నా .... ఏ లోకం లొ

No comments:
Post a Comment