Powered By Blogger

Wednesday 18 December 2013

రుధిర సౌధం 27

 ఇందులో  సినిమాలు చూడొచ్చు కదూ   .... ఏ సినిమా అన్నా పెట్టు .. నేనోసారి చూస్తాను ..  అంటున్నాడు రత్నం రాజు .
సరే చెప్పు .. ఏ సినిమా పెట్టను ? అని తన లాప్ టాప్ వంక ఆసక్తి గా చూస్తున్న రత్నం రాజు ని చూస్తూ అడుగుతోంది సత్య .
ఏదన్నా పెట్టు .. ఈ ఊరిలో అసలు సినిమా హాల్ లేదు .. సినిమా చూడటమంటే 50 కి .మీ పోవాల్సిందే  ..అంటున్నాడు రత్నం రాజు ..
వీళ్ళ సంభాషణ నంతా కాస్త దూరం లో నిల్చుని చూస్తున్నారు రచన ,యశ్వంత్ .
రత్నం అమాయకుడే .. అతన్ని చూస్తే అనిపిస్తుంది .. అన్నాడు యశ్వంత్ .
అయ్యుండొచ్చు .. కాని అంత త్వరగా ఎవరిని అంచనా  వేయలేము ... అంది రచన ..
సర్లే .. కానీ..  భూపతి ఏమైనా నీతో అన్నాడా మాగురించి ?అడిగాడు యష్ .
అవును .. విసుక్కుంటున్నాడు .. అది భయమో లేక తన రాజయోగం పోతుందేమో అన్న అనుమానమో .. ఏమో మరి ... అంది రచన .

 ఉంటుంది లే రచన .. అది మామూలే .. అన్నాడు రత్నం రాజు ని గమనిస్తూ ..
అతడి చూపు ని గమనించి రత్నం కి దెయ్యాలంటే  చాలా భయం .. ఆ మహల్ పేరెత్తితే చాలు భయం తో వణికి పోతాడు .. అంది చిరునవ్వు తో రచన ..
అది సరే  కానీ .. నాకో చిన్న అనుమానం .. నువ్వు ఆ మహల్ లోకి  వెల్లానన్నావు .. తాళం చెవి ఆ బసవ రాజు దగ్గర దొరికిన్దన్నావు .. అదీ ఓకే .. కానీ నీకు ఆ పెట్టె లోనే తాళం చెవి ఉన్నదని ఎలా తెలిసింది .. అన్నాడు యష్ .
అతడి ప్రశ్న కి బిత్తర పోయింది రచన .. "" నా దగ్గర ఉన్న పుస్తకం కోసం యష్ కి చెప్పకూడదు .. "అనుకొని అదీ యష్ .. నాకు ఆ బసవరాజు కనబడ గానే ఆ మంటపం లోనికి వెళ్ళా కదా .. అక్కడ ఆ పెట్టె కొంచెం నాకు ప్రత్యేకం గా కనబడింది .. అందులో ఏమున్నాయో అని చూసాను .. కీ దొరికింది .. కానీ ఇప్పుడు ఆ కీ నా దగ్గర లేదు .. ఏమైందో తెలీదు .. ఇప్పుడు ఆ మహల్ లోనికి ఎలా వెళ్ళాలో .. ఆందోళన గా అంది రచన .
ఆ కీ కోసం అదే మండపం లో వెతికితే .. అన్నాడు యశ్వంత్ ..
చిన్నగా తలూపి ఐ హోప్ సో .. అంది రచన .
ఇకపోతే బసవ రాజు...  నీకే   ఎందుకు కనిపిస్తున్నాడు ? ఇదీ ఆలోచించాల్సిన విషయమే .. అన్నాడు సాలోచన గా యశ్వంత్ ..
యష్ .. ఇంకో మాట చెప్పనా .. భూపతి ఇంట్లో పనిజేసే వెంగమ్మ .. ఆమె  మాట్లాడటం నేనింత వరకు వినలేదు ..
అంది రచన .
అవునా ?మూ గదా ? అన్నాడు యష్ .
ఈ అనుమానం ఎవరికన్నా  వస్తుంది .. కానీ కాదు .. ఎందుకో మాట్లాడదు .. ఆమె చూపులు మాత్రమే మాట్లాడతాయి .. అంది రచన ..
ఐతే ఈ వూళ్ళో చేదిన్చాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి .. అన్నాడు యష్ .
చిరంజీవి సినిమా ఏదో లాప్ టాప్ లో పెట్టి నట్లుంది సత్య .. చాలా శ్రద్ధ గా చూస్తూ మధ్యలో ఈలలు వేస్తూ .. చప్పట్లు
కొడుతూ సంతోషం గా ఉన్నాడు రత్నం .
మనకేమన్నా పనికొస్తాడా రత్నం రాజు ? అతని వంక ఓరకంట చూస్తూ అన్నాడు యశ్వంత్ ..
ఏరకం గా ? అంది రచన ..
తరవాత  చెప్ప్తాను .. అని రత్నం రాజు దగ్గరికి   నడిచి .. అతని భుజం మీద చేయి వేసి చిరు ఫ్యాన్ వా ? అన్నాడు .
ఆ .. చాలా ఇష్టం .. అన్నాడు రత్నం ..
అది సరే గాని .. ఇందులో బోలెడు సినిమాలు ఉన్నాయి నీ హీరో వి .. అన్ని చూడొచ్చు నువ్వు .. అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ అతనితో అంత సన్నిహితం గా ఏం మాట్లాడుతున్నాడో అని తానూ వారి వద్దకి నడిచింది .. రచన .
నిజానికి మేము   అలాంటి హీరోలమే ..  తెలుసా .. అన్నాడు యశ్వంత్ .
సత్య సినిమా ని pause లో పెట్టి శ్రద్ధ గా వీళ్ళ మాటల్ని  విన సాగింది ..
మీరా ? మీరు ఫైట్స్ చేస్తారా ? డాన్సులు కూడా చేస్తారా ? అడిగాడు కాస్త ఆశ్చర్యం గా రత్నం .
కాదు అంతకి మించిన  సాహసాలు చేస్తాము .. మీ ఊరి లో ఉన్న మహల్ లాంటిదే .. ఇంకో కోట జై పూర్ లో ఉండేది .. అక్కడ ఇలాగే దెయ్యాలు , భూతాలు ఉన్నాయంటూ పుకార్లు ఉండేవి .. మేము ఆ కోట కి వెళ్ళాం .. చాలా  పరిశోధన లు చేసాం .. ఆ కోట లోనే కొన్నాళ్ళు  ఉన్నాం కూడా .. మాకేం కాలేదే .. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం .. ఇక్కడ కూడా అదే పుకార్లు .. అన్నాడు యశ్వంత్ ..
లేదు లేదు .. ఇవి పుకార్లు కావు .. నిజాలు .. అన్నాడు రత్నం .
నిద్ర పోవటానికి ప్రయత్నిస్తున్న శివ , మురారి వీళ్ళ సంభాషణ విని లేచి వచ్చి వీళ్ళ దగ్గరే కూర్చున్నారు . రచన .,సత్య చెవులు రిక్కించి వింటున్నారు .
పుకార్లు కావా .. నేను నమ్మను .. అన్నాడు యశ్వంత్ .
లేదు యశ్వంత్ గారూ .. నేను చెప్పేది  నిజం .. ఆ మహల్ లో దెయ్యం ఉంది ... ఆమె ఎవరను కుంటున్నారు ?ఒక యువరాణి .. అన్నాడు కళ్ళింత చేస్తూ రత్నం .
నిజమా ? అంది సత్య .

అవును సత్యా .. ఆమె రాజు గారి పెద్ద భార్య కూతురు .. పేరు వైజయంతి .. అన్నాడు రత్నం .
పెద్ద భార్య అంటున్నావు .. అంటే ఇంకో భార్య ఉందా ? అన్నాడు మురారి .
వాళ్ళలా శ్రద్ధ గా తన చుట్టూ కూర్చుని వినడం నచ్చింది రత్నం కి .
అవును .. ఇంకో భార్య ఉండేదట .. ఆమె కి ఒక కొడుకు ,కూతురు ఉండేవారట .. అన్నాడు రత్నం
(ఇంకా ఉంది )





No comments: