Powered By Blogger

Friday 20 December 2013

రుధిర సౌధం 30

 రచనా ... .. మెల్లిగా పిలిచాడు యశ్వంత్ . ..
భారం గా ఉన్న  కనురెప్పల్ని మెల్లిగా తెరచి చూసింది రచన .
తలుపు కొట్టిన శబ్దం లీల గా వినిపించింది ... ఆమె చెవులకి ..
రత్నం రాజు వచ్చినట్లు ఉన్నాడు .. అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ భుజానికి ఆనుకున్న తన తల ని పక్కకి తీసి మెల్లిగా లేచి  నిలబడింది ...
యశ్వంత్ కూడా లేచి నిలబడి తలుపు  తీయ మన్నట్లు సైగ చేసాడు శివ కి ... శివ వెళ్లి తలుపు తీసాడు ..
రత్నం రాజు ...
నిద్రపోతున్నారా ? అంటూ లోపలికి వచ్చాడు ...
లేదు .. సినిమా చూద్దాం .. అన్నారు కదా .. అందుకే వెయిట్ చేస్తున్నాం .. సత్యా ... సత్యా .. అని పిలిచాడు యశ్వంత్ .
సత్య వచ్చి రత్నం ని పలక రించి లాప్ టాప్ లో అప్పటి పాజ్ లో ఉన్న మూవీ ప్లే లో పెట్టింది ..
రత్నం సినిమా లో లీన మయ్యాడు ..
యష్ .. యష్ .. గుస గుస గా పిలిచాడు మురారి లోపలి గది లోంచి ..
ఏంటి ? అన్నట్లు కళ్ళ తోనే అడిగాడు యశ్వంత్ ..
ఓసారి లోపలికి   రా .. మెల్లిగా అన్నాడు ..
అదంతా గమనిస్తున్న రచన .. యశ్వంత్ ని ప్రశ్నార్థకం గా చూసింది ..
తనతో పాటూ లోపలికి రమ్మని సైగ చేసాడు యశ్వంత్ ..
ఇద్దరూ .. మురారి ఉన్న గది లోకి  వెళ్ళారు ...
వాళ్ళిద్దరూ లోపలికి వచ్చాక గది తలుపులు మూసాడు మురారి ...
ఏమైంది మురారీ ? అడిగాడు యష్ .
యష్ .. ఈ గదిలో ఓ సూట్ కేసు ఉంది .. అటు చూడు .. అన్నాడు మురారి ..
అతడు చూపించిన వైపు చూసాడు యశ్వంత్ ..
అంత త్వరగా ఎవరి కళ్ళ కి కనబడని ప్లేస్ అది ... గదిలో మూలగా ఒక చెక్క బీరువా ఉంది .. దానికి గోడకి మధ్యలో ఉందది ...
యశ్వంత్ వెంటనే వెళ్లి ఆ సూట్ కేసు ని బయటకి తీసాడు .. చాలా చిన్నది .. ఫైల్స్ అవీ పెట్టుకోవడానికి మాత్రమే వాడతారు .
ఈ పల్లె లో ఇలాంటి సూట్ కేసు ఎవరు వాడతారు .. అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది .. సిటీస్ లో తప్ప ఇలాంటి చోట్ల దొరకదు కూడా .. అంది రచన .
ఇది ఇంతకు ముందు  మనలాగే వచ్చిన వాల్లదయి ఉంటుంది ... అన్నాడు యశ్వంత్ దాన్ని పరీక్ష గా చూస్తూ ...
యశ్వంత్ .. ఓపెన్ చేద్దామా ? అన్నాడు మురారి ..
ఇలాంటి సూట్ కేసు ఓపెన్ చేయడం కొంచెం కష్టమే ... ఎనీ వేస్ .. మన టూల్ కిట్ తీసుకు రా .. అన్నాడు యష్ .
మురారి 2 నిమిషాల్లో టూల్ కిట్ తో వచ్చాడు ..
సూట్ కేసు వెనుక   భాగం నుండి మరలన్ని విప్పారు .. సూట్ కేసు పావు గంట లోనే తెరచుకుంది ...
హమ్మయ్య .. ఓపెన్ అయింది .. అని లోపల ఉన్న ఫైల్స్ అన్నీ తీసి యశ్వంత్ కి ఇచ్చాడు .. మురారి ..
ఫైల్స్ నుండి జారి పడిన ఐ డి కార్డు ని తన చేతి లోకి తీసుకుంది రచన ..
అరుణాచలం , సి . బి . ఐ ఆఫీసర్ .. అంది రచన ..  ఆశ్చర్యం గా ..
అవునా ? అని ఆమె చేతిలో ఉన్న కార్డు తీసుకుని ... ఓహ్ గాడ్ .. ఈయనే ఇంతకు ముందు ఇక్కడికి  వచ్చింది .. చాలా ఘోరం గా చని పోయాడు ... అన్నాడు యశ్వంత్ .
ఓహ్ .. అని యష్ .. ఇందులో ఏదో డైరీ  కూడా ఉంది .. అని ఓ డైరీ తీసి యశ్వంత్ చేతిలో పెట్టాడు మురారి ..
ఇది అతనిదే అయుండొచ్చు యష్ ... ఆయన మహల్ గురించి ఏమైనా రాసుండొచ్చు .. అంది రచన .
 హా చదువుదాం .. అని మురారీ ఓసారి రత్నం రాజు ఏం చేస్తున్నాడో చూడు .. శివ కి చెప్పు .. రత్నం ని ఇటు రానివ్వ కుండా చూడమని .. అన్నాడు యశ్వంత్ .
ఓకే .. నేను చూసుకుంటాను .. అని మురారి బయట కి వెళ్ళాడు ..
నువ్వు చదువు యశ్వంత్ ఏముంది అందులో ???  అంది కంగారు గా రచన .
హా .. అని డైరీ ఓపెన్ చేసాడు యశ్వంత్ .. ఆ డైరీ చదువు తుంటే అతని భ్రుకుటి ముడి పడింది ..
ఇంతలో మురారి వచ్చాడు .. వాళ్ళంతా మూవీ చూస్తున్నారు ... ఏం ఫర్వాలేదు .. అన్నాడు మురారి ..
ఏముందో తెలీదు మురారి .. యష్ చదువు తున్నాడు .... అంది రచన .
చిన్నగా తల పంకించి యశ్వంత్ వంక ఆసక్తి గా చూసాడు ..
డైరీ చదవడం పూర్తయ్యాక ... మిస్టర్ అరుణాచలం .. అమావాస్య నాటి సాయంత్రం వరకు ఈ గది లోనే గడిపారు .. తర్వాత డైరీ లో పేజి లు ఖాళీగా ఉన్నాయి .. అన్నాడు యశ్వంత్ సాలోచన గా ..
అంటే ? అన్నాడు మురారి ..
ఆరోజు రాత్రే ఆయన చనిపోయారు .. అంది రచన .
అంటే అమావాస్య రాత్రి ఆయన మహల్ కి వెళ్ళారు ... అన్నాడు మురారి ..
అవును మురారి .. ఒక్కసారి ఈ డైరీ చదువు మురారీ .. రచన కి ఎదురైన పరిస్థితులన్నీ ఈయన కి ఎదురయ్యాయి .. కాక పొతే ఈ యన మహల్ తాళం తీసి లోపలకి వెళ్ళలేదు .. మహల్ వెనుక భాగం నుంచి మొదటి అంతస్తు నుంచి వెళ్ళారు .. ఈయనకూడా ఆ మహల్ లో గోడలతో సహా నేలంతా రక్తం ఏరులై పారటం చూశానని వ్రాసారు .. రచన కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది .. అన్నాడు యశ్వంత్ .
అంటే అమావాస్య కి ముందు ఆ మహల్ లోకి ప్రవేశించినా ప్రాణ భయం ఉండదు .. కానీ అమావాస్య మాత్రం ప్రాణాలని  హరిస్తుంది .. అంతేనా ? అన్నాడు మురారి ..
మరి బసవ రాజు .. అతను అరుణాచలం  గారికి కనిపించాడా ? అని అడిగింది రచన ..
ఆ ప్రస్తావన మాత్రం ఇందులో లేదు .. అంటే అరుణాచలం కి బసవరాజు కనిపించలేదు ... అన్నాడు యశ్వంత్ .
నిజం గా ఈ కేసు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది .. కానీ ఈరోజు ఏం జరగబోతోందో మాత్రం తెలీదు ... అన్నాడు మురారి ..
అందుకే నేను కొంచెం టైం తీసుకుందాం అన్నాను మురారీ .. అన్నాడు యశ్వంత్ .
బాగా ఆలోచిద్దాం మురారీ .. తొందర పడి  ప్రాణాలు కోల్పోయే కన్నా ఒకసారి ఆలోచించడం మంచిది .. ఎందుకంటే
ఇక ఏ అమావాస్యా ఈ వూరి లో ఏ ఒక్కరి ప్రాణం తీయకూడదని అనుకుంటున్నాను ... అన్నాడు యశ్వంత్ ..
(ఇంకా ఉంది )

















No comments: