కడలి కౌగలి కై పరుగులిడిన నది ..
కదిలి దూర భారాలు దాటినది ..
ఎన్ని బంధాలు వీడి కదిలినది ..
ఎన్ని పాపాలు కడిగి సాగినది ..
పయన మంతా కష్టాన నడిచినది ..
అలసి సొలసి ప్రవహించు జీవనది ... ఈ నది .. తన ప్రేమదీ .. కడలి
నువు నడచు బాట కష్టాల మూట ..
అడుగడుగు లోన ఒడిదుడుకులంట ..
కల్మషాన్ని కడిగింది తానె .. ఆ విషము సేవించి తానె
పాషాణాల దారిలోన గాయాల బారిన పడిన గానీ
సాగిపోయే ముందుకే .. ఆగిపోదే కాలమే ..
పరమ పావని పరవళ్ళ తోనే నేల పులకిస్తున్నదే ..
కన్నీళ్లు తుడిచే చేయి తానై వరము ఇవ్వద పెన్నిధై ... ఓ నదీ .. నీ మనసదీ ..
ఆశలన్నీ అడుగంటి పోయి నేల బీడు వారితే ..
నింగి నుండి జాలువారి భువిన ఉరకలు వేయవే..
నీ పరుగు నాపే ఆనకట్ట బంధించగా నిను మించదె ..
పక్షపాతం చూపలేని ప్రేమ నీకూ సొంతమే ..
సస్యస్యామల భారతావని పులకరిస్తుందే ..
మానవాళి చేతలకి నీ బ్రతుకు కొడిగడు తోందే
ఎంత హాని చేసినా నీ బిడ్డలని కృప చూపుతావే గంగ వై .. శివ గంగ వై ..

No comments:
Post a Comment