కనుల గంగ పొంగే .. చెక్కిలి వొడ్డు దాటె
మనసు కిది ఓ శాపమా .. ఓ జన్మలో పాపమా ..
కలత వొడి చేరే .. కలల తడి మాయె ..
మమత కిక మిగిలే శోకమా .. మరుల ముడి విప్పే భారమా ..
ఆశ చిగురించే జాడ లేనట్టు .. ఆమనే రాని కాలమయి నట్లు
మౌనమై పోకే ఇలా ... చినబోయిన ఓ కోయిలా ..
చినుకు తడి తోనే నేల పులకించు ..
ఆ నేల వొడి లోనే మొలక చిగురించు
వేచుండవే వెన్నెలా .. అమవాస పున్నమై మారే రోజులా ..
కలికి చిలకమ్మా .. ఆశ విడవకులే ..
నీ అలక తీరే రోజు ముందరున్నదిలే ..
నాడు విరబూయవే .. సిరిమల్లెలా ..
పరుగునాపదే కాలమూ ,,,పలచనవ్వదె హృదయము ..
ఫలిత మనుకున్నది .. ఫలము కాదే మరీ ..
నిజము నిప్పని పించులే .. దాచుట సాధ్యమే కాబోదులే
అడుగు వెంట అడుగు వేయులే పాదము ..
అడిగినంత ఇవ్వలేనిదే సమయము..
ఆశయం నీ తోడుగా .. సాగితే అది చాలుగా
మంచు తునకమ్మ .. కరిగి పోకమ్మ ..
కరిగి పొతే నీకు రూప మేదమ్మ ?
హిమ శిఖరమై నిలిచేవులే ..

No comments:
Post a Comment