అంతా విన్నాక కాసేపు ఆలోచన లో పడ్డాడు యశ్వంత్ .
ఏం ఆలోచిస్తున్నావు యశ్వంత్ ? అంది రచన అతని ని చూస్తూ ..
నువ్వు చెప్పింది వింటుంటే రాముడి హత్య వెనుక భూపతే ఉన్నాడని నాకూ అనిపిస్తుంది .. కానీ ఆ విషయం
మనం సాక్ష్యాలతో నిరూపణ చేయాల్సి ఉంటుంది .. అన్నాడు యశ్వంత్ .
అవును యష్ .. నేను అక్కడ పరికించి చూసాను .. వాళ్ళేదో పాతిపెట్టడం .. కానీ అక్కడ కి వెల్లిచూస్తే భూమి పై
అలాంటి ఆనవాల్లె లేవు .. అంది రచన ..
రచన .. మనం ఓ సారి అక్కడ కి వెళదామా ? ఏమన్నా తెలియొచ్చు కదా .. అన్నాడు యశ్వంత్ ..
వద్దు యష్ .. వాళ్ళ మాటల్లో మన ప్రస్తావన కూడా వచ్చింది .. ఆ వీరాస్వామి .. మాంత్రికుడు .. మంత్రాలతో
మనుషుల ప్రాణాలు తీసుకునేలా చేయగలడు .. వాడిప్పుడు అక్కడే ఉంటాడు .. మనం ఇప్పుడు వెళ్ళటం అంత
మంచిది కాదు అంది రచన .
అదీ నిజమే .. నాకిప్పుడు ఆలోచిస్తుంటే ఒకటి అనిపిస్తుంది .. నువ్వేమన్నావు ? వాళ్ళు మొదట్లో ఏదో .. ఆత్మని
బంధించాం అని అన్నారు అన్నావు కదా .. అన్నాడు యశ్వంత్ .
అవును యశ్వంత్ .. కొంపదీసి వాళ్ళు బసవరాజు ని బంధించలేదు కదా .. అంది రచన ..
కావొచ్చు .. అని " విధాత్రి ఆత్మయితే కాదు కదా ... " అని మనసులో కలవర పడ్డాడు యశ్వంత్ ..
అందుకే .. అందుకే .. బసవరాజు నన్ను కలవలేదు .. యష్ .. ఒకవేళ వాళ్ళు బసవరాజు ఆత్మనే బంధించి ఉంటె
మనం తప్పక అతన్ని విడిపించి తీరాలి .. అతను మనకి సహాయం చేయగలడు ... అంది రచన .
మనం ముందు మనవాళ్ళతో మాట్లాడాలి రచన .. వాళ్లకి జరిగినదంతా చెబుదాం ... అంతా కల్సి రేపు అక్కడికి
వెళ్దాం ... ఏమంటావ్ ? అన్నాడు యశ్వంత్ ..
సరే యష్ .. మహల్ తాళం వెయ్యు .. మనం వెళదాం ... అంది రచన .
యశ్వంత్ .. మహల్ కి తాళం వేసి .. తాళం చెవి రచన కి తెచ్చి ఇచ్చాడు ..
ఆమె మల్లి దానిని తన మెడలో వేసుకుంది ..
ఇక వెళదామా ? అన్నాడు యశ్వంత్ ..
ఊ .. అని కూర్చున్న చోటినుండి లేచి యశ్వంత్ ని అనుసరించింది రచన ..
వాళ్ళు వెళ్ళిపోయాక ... ఓ భయంకర ఆకారం గేటు దాటు తున్న యష్ ,రచన ల వైపు క్రూరం గా చూసింది ..
****************************
మీరు చెప్పేది నిజమా ? ఆశ్చర్యం గా అడిగాడు మురారి ..
అవును .. అందుకే రాముడి హత్య వెనుక భూపతి ఉన్నాడన్న అనుమానం బలపడుతుంది .. అన్నాడు యశ్వంత్ .
యష్ .. నేను కొన్ని న్యూస్ పేపర్స్ లో చదివాను .. ఇప్పటికి కొన్ని పల్లెటూళ్ళలో వాళ్ళు అనుకొన్నవి
నేరవేరటానికి,కోరికలు తీరటానికి ,క్షుద్ర పూజలు చేయిస్తుంటారట ... వాటి కోసం మనుషుల్ని బలి కూడా ఇస్తారని
విన్నాను ... అన్నాడు శివ .
అవును .. రాముడి విషయం లో కూడా అదే జరుగుంటుందని నాకని పిస్తుంది ... అన్నాడు యశ్వంత్ ..
యష్ .. ఇప్పుడంతా మెల్లిగా అర్థమవుతుంది .. రాముడు మహల్ దగ్గరకి ఎలా వచ్చాడు అని మనం
ఆలోచిస్తున్నాం ... పోస్ట్ మార్టెం రిపోర్ట్ లో కూడా ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు .. కానీ అతడి పీక నులమబడి ,కాళ్ళ
దగ్గర కూడా ఎవరో గట్టిగా మెలి తిప్పటం వల్ల ఎముక విరిగింది .. రక్త ప్రసరణ నిలిచిపోయింది .. అని వ్రాసుంది ..
అవునా .. ? అన్నాడు మురారి .
అంతా అవునని తల ఊపారు ..
కానీ ఇదెలా సాధ్యం ? అలా ఎవరన్నా చేసుంటే వాళ్ళ చేతి గుర్తులు పడకుండా ఉంటాయా ? అందులోను నేరగాళ్ళ
సైకాలజీ ప్రకారం ఏదో ఒక ఆధారం వదల కుండా ఉండరు .. అన్నాడు మురారి ..
నిజమే మురారీ .. కానీ మనకి ఏ ఆధారం దొరకలేదు .. అంది రచన .
ఆధారం దొరకదు రచనా ... రాముడికి చేతబడి జరుగుండాలి .. అంటే ఏంటో తెలుసా ? మన భారతదేశం లో ఉన్న
ప్రాచీనవిద్య .. నేను కొన్ని పుస్తకాల్లో చదివాను .. ఇలాంటి కేసు కూడా నాకొకటి తగిలింది ఇంతకు ముందు ..
అన్నాడు మురారి .
ఏంటి మురారి ? వివరం గా చెప్పు .. అంది సత్య కుతూహలం గా ...
(ఇంకా ఉంది )



No comments:
Post a Comment