యష్ ఏం చూస్తున్నావు ? ఏమయింది నీకు ? ఆందోళన గా అంది రచన .
రచనా .. నీకు ఆలయం మార్గం కావాలి కదా .. అన్నాడు యశ్వంత్ ఆ మడుగు వంకే చూస్తూ ..
అవును .. నీకు మార్గం గురించి తెలిసిందా ? అంది యశ్వంత్ వంక తేరిపార చూస్తూ రచన .
లేదు .. కానీ కచ్చితం గా లేదని కూడా చెప్పలేను .. అని ఆమె వంక చూసి తన రెండు చేతుల్లోకి ఆమె మొహాన్ని
తీసుకుని .. రచనా మన ముందున్న లక్ష్యం కష్ట సాధ్య మయినది .. మన ఇద్దరమే చేయలేనిది .. ఒకసారి మనం
శివ వాళ్ళని అడిగి చూద్దాం .. వాళ్ళు కోరుకుంటే మనకి సహకరిస్తారు .. లేదంటే వాళ్ళని ఇక్కడ్నుంచి వెళ్ళిపోమని
చెబ్దాం .. ఏమంటావ్ ? అన్నాడు యశ్వంత్ .
అతని చేతుల్లో ఉన్న తన మొహాన్ని తీసుకొని .. యష్ .. మీరంతా వృత్తి రీత్యా మీ కర్తవ్య నిర్వహణకి మాత్రమె
వచ్చారు .. కానీ నేను .. అలా కాదు .. ఇది నా కుటుంబం కోసం .. ఇది నా అస్తిత్వం కోసం .. మా ఉనికి కి కాపాడు
కోవటం కోసం .. ఇది స్వార్థం కావొచ్చు మరేదన్నా కావొచ్చు .. నా బాధ్యత కోసం మరెవర్నీ బలి పెట్టటం నాకిష్టం
లేదు .. ఈ మహల్ మా పూర్వీకులది .. కొన్ని పరిస్థితుల దీనికి దూరం కావాల్సి వచ్చింది . నా చిన్నప్పుడే అమ్మా
, నాన్న తో ఈ వూరొచ్చాను . కానీ నాన్న అశాంతి తో తిరిగి వెళ్ళాల్సి వచ్చింది .. మా మహల్ ని మేమే
వదిలేయాల్సి వచ్చింది .. మనం ఎంతో ప్రేమించే ఇంటిని పదిమంది దెయ్యాల కోటగా పిలుస్తుంటే ఆ ఆవేదన అర్థం
చేసుకోగలవా యశ్వంత్ ? ఓ రాచ కుటుంబం లో జన్మించి అనామకం గా ఏన్ని తరాలు వెళ్లిపోవాలి .. అలా
కాకూడదు .. ప్రయత్నం నేను మొదలు పెట్టాను .. నేను .. నా తర్వాత వేరొకరు .. ఏదో రకం గా దీనిని మనుషులు
స్వేచ్చ గా తిరిగే గూడు గా చూడ గలగాలి .. ఈ మహల్ వల్ల ఈ వూరి ప్రగతి ఆగిపోకూడదు .. ప్రజలకి మంచి
జరగాలి .. ఈ మహల్ ఈ ఊరికి శాపం అయింది .. నేను దీన్ని వరం గా మార్చాలని భావిస్తున్నాను .. అందుకోసం
నా ప్రాణం పణం గా పెట్టల్సోచ్చిన సరే వెనకడుగు వేయను . స్థిరం గా అంది రచన .
రచనా .. నేను నిన్ను అర్థం చేసుకున్నాను .. నువీ రాచ కుటుంబపు వారసురాలివని నువ్వు చెప్పక ముందే
నాకు తెలుసు . అన్నాడు యశ్వంత్ .
ఎలా యశ్వంత్ ? నీకెలా తెలుసు ? అంది రచన .
విధాత్రి .. రాకుమారి విధాత్రి వలన .. అన్నాడు యశ్వంత్ .
విధాత్రి ... ఏం మాట్లాడుతున్నావు నువ్వు ? నేనీ పేరు మా నాన్న గారి నోట రెండు సార్లు విన్నాను .. అంది
ఆశ్చర్యం గా రచన .
అవును రచనా .. విధాత్రి ని నేను చూసాను .. కలిసాను మాట్లాడాను .. అంతెందుకు ? కొద్ది సేపటి క్రితం నిన్నూ
నన్నూ ఆ వైజయంతి బారి నుంచి కాపాడింది కూడా విధాత్రే .. అన్నాడు యశ్వంత్ .
ఆమె మాన్ప్రడి పోయి చూసింది అతడి వైపు ..
(ఇంకా ఉంది )

2 comments:
Radhika gaarooo, really beautiful:-):-)
thanks karteek gaaru..roju ilaage follow avandi
Post a Comment