Powered By Blogger

Thursday 6 March 2014

రుధిర సౌధం 88




రచనా .. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎందుకో అన్ సేక్యుర్డ్ గా ఉన్నాను . కాని ఎందుకో

ఈరోజు నాకు చాలా సంతోషం గా ఉంది . మురారి తో కొంత సమయం గడపబోతున్నందుకు .. అంది సత్య ..

మహల్ వైపు నడుస్తూ .

"నాకు తెలుసు నీలోని అభద్రతాభావం .. అందుకే గా ఇదంతా ప్లాన్ చేసింది " అని మనసులో అనుకుంటూ ..

మహల్లో ఉన్న పాత చైర్స్ .. టేబుల్స్ మండపం దగ్గర ఏర్పాటు చేసాను .. నువ్వెలాగు మండపం అంతా పూలతో

అలంకరించేసావు .. సరదాగా స్పెండ్ చెయ్ తనతో .. అంది రచన

తప్పకుండా .. థాంక్స్ రచనా .. అంది సత్య .

ఎన్నిసార్లు చెబుతావు .. బహుశా నువ్వు చాలా ఆనందం గా ఉన్నావు కదా అందుకేనేమో .. ఇన్ని సార్లు థాంక్స్

చెబుతున్నావు .. అని ముందుకి చూసి మహల్ దగ్గరకి వచ్చేసాం .. అని గేటు ని ముందుకి తోసింది రచన .

ఎందుకో మహల్ వైపు అంత చీకటిలో చూడగానే వొళ్ళు గగుర్పొడిచింది సత్యకి .

గేటు దగ్గరే ఆగిపోయిన సత్యని చూసి తన చేతిలో ఉన్న చార్జింగ్ లైట్ ఆన్ చేసి .. అక్కడే ఆగిపోయావెం .. రా సత్యా .

అంది రచన .

హ .. అని నుదుటికి పట్టిన చెమట ని తుడుచుకుంటూ తాను వేసుకున్న పొడవాటి ఎర్రగౌనుని కాళ్ళ మధ్య

పడకుండా కొంచెం ఎత్తి పట్టుకుని లోపలికి నడిచింది సత్య .

వారిద్దరూ సరాసరి దక్షిణం గా మండపం వైపు నడిచారు .

వెలుగులు చిమ్ముతూ ఉందక్కడ .

అరె .. ఇన్ని లైట్స్ .. ఎప్పుడు అర్రంజ్ చేసావు రచనా ? ఆశ్చర్యం గా అడిగింది సత్య .

శివ కి చెప్పాను ముందే మనం వచ్చాక శివ మహల్ కి వచ్చి ఈ ఏర్పాటు చేసాడు .. అన్ని చార్జింగ్ లైట్స్ ..

ఫరవాలేదు .. రాత్రంతా వెలుగుతాయి .. అంది రచన .

సో నైస్ అఫ్ యు బొత్ .. అంది సత్య అబ్బురంగా ,అందం గా సొగసులద్దిన ఆ మండపాన్ని చూస్తూ ..

మండపం పక్కగా టేబుల్ ,చైర్స్ వేసి ఉన్నాయి .

వెళ్లి అక్కడ కూర్చుంది రచన .. సత్య కూడా ఆమె ఎదురుగా ఉన్న కుర్చీ లో కూర్చుంది ..

నేను కాసేపు ఉండి వెళతాను సత్యా .. నీకేం భయం లేదుగా ఆ తర్వాత ... అంది రచన .

లేదు రచనా .. ఈ ఏర్పాటు నంతా చూసాకా నాకు భయం లేదు సరికదా .. మురారికోసం ఎంతసేపు అయినా

వేచి ఉండగలనని పిస్తుంది .. అంది సత్య .

సరే ఐతే .. నాకైతే ఇప్పుడే నేను వెళ్తే వెంటనే మురారి వస్తాడనిపిస్తుంది .. అంది చిలిపిగా కన్ను గీటుతూ ..

పో రచనా .. అంటూ అందం గా సిగ్గుపడింది సత్య .

పోతానులేమ్మా .. తినడానికి ,తాగడానికి అన్ని ఉన్నాయి .. దేనికీ ఇబ్బంది పడవద్దు .. మరైతే నేను వెళ్ళనా ?

అని లేచింది రచనా ..

సరే .. నేను మురారి కోసం వేచి చూస్తాను .. అంది సత్య .

నీ నిరీక్షణ ఎంతసేపు ? నేనిలా వెళ్ళగానే మురారి వస్తాడు .. బాయ్ సత్య .. హావ్ ఏ గుడ్ టైం .. అని గేటు వైపు

నడిచింది రచన ..

ఇంకా ఉంది 



No comments: