మురారి కోసం ఎదురుచూస్తూ తలని కుర్చీ కి ఆనించి నిశ్చింతగా కనులు మూసుకుంది సత్య .
ఆమె కళ్ళముందు మురారితో పరిచయం ,ప్రేమ .. సరదాగా గడిపిన సన్నివేశాలు మెదిలాయి . ఆమె పెదవులపై
అప్రయత్నం గా సన్నని చిరునవ్వు .
ఇంతలో ఆమె ముందు నుంచి ఎవరో వేల్లినట్లనిపించి అకస్మాత్తుగా కళ్ళు తెరచింది .
చుట్టూ చూసింది ఎవరూ లేరు . ఎందుకో ఓ క్షణం ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది . భయం తో వెంట్రుకలు నిక్క
బొడుచుకున్నాయి . నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ అనవసరం గా భయపడుతున్ననేమో .. ధైర్యం
గా ఉండాలి .. ఈరోజు సంతోషం గా గడపాలి .. లేనిపోని భయాలని మనసులోంచి తుడిచేయాలి .. అనుకుందామే .
ఇంతలో ఆమె భుజం పై ఓ చేయి పడింది . ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లైంది ..
గుండె ధైర్యాన్ని కూడగట్టుకొని మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది .
నిండు చంద్రుడిలా మురారి చిరునవ్వుతో చూస్తున్నాడు ..
ఆమె నిశ్చింతగా ఊపిరి పీల్చుకొని నువ్వా ? అంది .
ఏం ? ఇంకెవర్నైనా పిలిచావా ? అని అంటూనే పూలతో అలంకరించిన మండపాన్ని చూసి వావ్ .. అన్నాడు మురారి
ఆమె అతడి కళ్ళలోని సంతోషాన్ని గుర్తించి అతని చేయి అందుకొని రా మురారీ .. అని ముందుకి నడిచింది ..
అతడు ఆమె వంక సమ్మోహనం గా చూస్తూ మండపం లోకి నడిచాడు .
ఈ ఏర్పాటు అంతా నీకోసమే .. ఎలా ఉంది ? అని అడిగింది సత్య .
నీ మనసులో నిండిన నాపై ప్రేమంత అందం గా ఉంది .. అన్నాడు మురారి .
ఆమె తన చేతిలోని వాచ్ వైపు చూసింది .. 12గం అవుతోంది ..
జన్మదిన శుభాకాంక్షలు మురారీ .. అని అతడి చేతిని ఆర్తిగా చుంబించింది సత్య .
థాంక్స్ సత్యా .. అని ఆమె వైపు ఆరాధన గా చూశాడు మురారి .
ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది .. ఈలోపు మురారి వెనుకగా ఒక అస్పష్ట రూపం ఆమె వంక తీక్షణం గా
చుస్తున్నట్లని పించి ఆమె కళ్ళు భయం తో పెద్దవయ్యాయి .
ఆమె కళ్ళలో మార్పు చూసి .. ఏమైంది సత్యా ? అని వెనక్కి తిరిగి చూసాడు మురారి .
అతనికెవరు కనబడలేదు .. మల్లి సత్య వంక చూసి ఏదో అనబోతుండగా .. ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మారాయి ..
ఆమె మొహం అరునవర్ణం లోకి మారింది .
సత్యా .. ఏమైంది నీకు ఆశ్చర్యంగా అడుగుతాడు మురారి .
ఆమె .. ఏ హ్.. అని వింతగా అరుస్తూ ఆమె రెండు చేతులతో మొహాన్ని గోళ్ళతో గీరుకోసాగింది .
సత్యా .. అని గట్టిగా అరచి ఆమె ని పట్టుకొనే లోపు ఆమె పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ మహల్ వైపు పరుగుతీసింది .
ఆ హటాత్ పరిణామానికి విస్తుపోయి సత్యా .. అంటూ ఆమె వైపు పరుగు తీస్తాడు మురారి .
(ఇంకా ఉంది )



No comments:
Post a Comment