తీయని పిలుపై నిత్యం మాతో నిలిచేవా అమ్మా ..
మాయని ప్రేమని అనునిత్యం పంచే దేవత నీవమ్మా ..
త్యాగానికి మరు రూపం నీవు .. అనురాగానికి అసలు రూపువు .
ఎల్లలు ఎరుగని మమకారం .. గుండెల నిండుగా అభిమానం ..
అల్లరి భరియించె నేస్తం .. మా ఆశల వెనుక నీ హస్తం ..
సరిలేని అనుబంధం తీగల్లె అల్లిన నీ ప్రేమ సుగంధం ..
మాటలు చాలవు నిను వర్ణించాలంటే ..
అమృత మయినా దిగదుడుపు నీ ముందే ..
భగవంతుడు కూడా బిడ్డగా వచ్చే .. అమ్మ ప్రేమ ని ఆస్వాదించే ..
నీ ఒడిని మించిన హాయి వేరే చోట లేదమ్మా ..
తోలి బడి వి నువ్వై లోకాన్ని నేర్పావమ్మ ..


No comments:
Post a Comment