"ఈ సరస్వతి ఎవరు " అని మనసులో అనుకొని .. ఏం జరిగింది ఆమె కి ? అని కూల్ గా అడిగింది సత్య .
ఆరోజు మీరు స్టేషన్ దగ్గర వదిలి పెట్టాక ఆమె ఇంతవరకు ఇంటికి చేరలేదు . ఇప్పుడు వాళ్ళ తాత మనల్ని అడుగు
తున్నాడు .. అన్నాడు యశ్వంత్ కొంచెం స్వరం పెంచి .
ఈ సరస్వతి ఎవరో తెలియకుండా యశ్వంత్ తో ఈ విషయం మాట్లాడటం సరైన పని కాదని మౌనం గా
ఉండిపోయింది సత్య .
యశ్వంత్ మాటలు విని బయటకి వచ్చిన మురారి .. సరస్వతి కనిపించక పోవట మేంటి ? వీళ్ళతో ఆమె నిన్న
రాలేదా ? అని అడిగాడు .
లేదు మురారి .. రాలేదు . వీళ్ళతో బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పింది అబద్ధమని వాళ్ళ తాత మాటల్ని బట్టి
అర్థమైంది .. ఆమె ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థం కావటం లేదు .. అన్నాడు యశ్వంత్ .
ఆలోచన లో పడ్డాడు మురారి .
యశ్ .. నిన్న సాయంత్రమే కదా ఆమెని అక్కడ విడిచి పెట్టి వచ్చింది . నిజంగా ఆమె బంధువుల ఇంటికే వెల్లిందేమో
వెహికేల్స్ కూడా ఉండవు . ఈమాత్రం ఆలస్యానికి అనవసరం గా కంగారు పడుతున్నామేమో .. ఆన్నాడు మురారి .
నిజమే మురారి కానీ .. మనం ఒక విషయం మర్చిపోకూడదు . సరస్వతి పల్లెటూరి పడుచు . భర్త ని కోల్పోయిన
వాళ్ళు ఇలా పది రోజులు పూర్తీ కాకుండా ఎక్కడికి వెళ్ళరు .. వాళ్ళ బంధువులు కూడా లోపలికి రానీయరు ..
అన్నాడు యశ్వంత్ .
మరి తను మన దగ్గరికి వచ్చినదిగా .. అన్నాడు మురారి .
మనం అలాంటి నమ్మకాలు లేనివాళ్ళం . అందుకే తనని రానిచ్చాం . అన్నాడు యశ్వంత్ .
సత్య వీళ్ళ మాటలు వింటూ పరిస్థితి ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది .
మురారి చెప్పినట్లు ఎందుకు కాకూడదు యశ్ . మనలా ఆలోచించే బంధువులు తనకి ఉన్నారేమో .. ఎందుకంటే
సరస్వతి లో చాల ఆధునిక భావాలు ఉన్నాయి . మనం ఓసారి అక్కడకి వెళ్లి ఎంక్వయిరీ చేద్దాం . తను ఏ ఆపదలో
ఉందని నాకు అనిపించడం లేదు అంది రచన
రచన వైపు తిరిగి అదీ చెప్పలేం .. కానీ నా మనసు కెందుకో ఇది కూడా మన చుట్టూ ఎవరో బిగిస్తున్న ఉచ్చులా
అనిపిస్తుంది . నిన్నరాత్రే ఆ ముసలాయన మనదగ్గరకి వచ్చి అడిగుండాలి కదా .. ఎందుకు అడగలేదు ?
అన్నాడు యశ్వంత్ సాలోచన గా .
అవును సాయంత్రం నుంచీ రాత్రి ఊరిలో అంతా నిద్రపోయే వరకూ ఎవరో ఒకరం ఇంట్లోనే ఉన్నాం . ఆ ముసలాయన
మనల్ని వచ్చి అడిగి ఉండొచ్చు .. కానీ అడగలేదు .. అంటే దీని వెనుక ఏదో ఉంది . అన్నాడు మురారి .
భూపతి .. భూపతి ఏమన్నా కుట్ర చేసి ఉంటాడా ? అంది రచన సాలోచన గా ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది



No comments:
Post a Comment