Powered By Blogger

Saturday 26 April 2014

రుధిరసౌధం130


అవును .. అసలే మన తింగరి రచన ఉందిగా .. ఏం చేసిందో ఏమో .. పద శివా .. అని లేచాడు యశ్వంత్ .

యశ్ .. ఆ భూపతి మనల్ని ఇల్లు ఖాళీ చేయించ టానికి తొందర పడిపోతున్నాడు .. నువ్వు వెళ్ళు .. అందరి లగేజ్

ప్యాక్ చేసి అక్కడకి వస్తాను .. అన్నాడు శివ .

సరే .. అనబోతు .. శివా .. నా నిర్ణయం ఏమీ నిన్ను ,మన వాళ్ళని ఇబ్బంది పెట్టదుగా .. అన్నాడు యశ్వంత్ .

యష్ .. మనం ముందు నుంచీ మహల్ దగ్గర ఉందామనే వచ్చాం .. అయినా మనం మన లక్ష్యానికి దగ్గరగా

ఉండటమే మంచిది . నీ నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనరు .. నువ్వు సైకిల్ తీసుకెళ్ళు నేను లగేజ్ ప్యాక్ చేస్తాను

అన్నాడు శివ .

సరే శివా .. నేనే మహల్ వరకూ వెళ్లి చూస్తాను .. అన్నాడు యశ్వంత్ .

అలాగే అని తల ఊపాడు శివ .

యశ్వంత్ .. ఇంట్లోంచి సైకిల్ తీసుకొని  మహల్ వైపు సాగి పోయాడు .. కాసేపట్లో మహల్ చేరుకొని చుట్టూ

గమనించాడు .. యశ్వంత్ కి అక్కడ ఎవ్వరూ ఉన్నట్టు అనిపించలేదు . లోపల ఏమన్నా ఉన్నారా ? అనుకొని

అప్రయత్నం గా మహల్ కి పశ్చిమ దిశ గా ఉన్న మట్టి బాట వైపు దృష్టి సారించాడు .

ఆ మసక చీకట్లో అక్కడ ఎవరో దారికి ఓ పక్క గా కూర్చున్నట్టు కనిపించింది ..

నొసలు చిట్లించి చూసిన యశ్వంత్ కి అది మురారి అని అర్థమైంది .  మురారి అక్కడ కూర్చున్నాడెం ..

అనుకుంటూ సైకిల్ ని అటు పోనిచ్చాడు ..

చాలా సేపట్నుంచి అలానే బాధగా కూర్చుండి పోయిన మురారి హటాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన యశ్ ని

చూసి ప్రాణం లేచోచ్చిన వాడిలా యశ్ .. అంటూ వచ్చి ఒక్కసారిగా హత్తుకున్నాడు ..

మురారీ .. ఏం జరిగింది ? ఇక్కడెందుకు ఉన్నావ్ ?అని అడిగాడు కంగారుగా యశ్వంత్ .

యశ్ .. సత్య .. సత్య ని .. వైజయంతి .. పాపం రచన .. నేను రచన కోసం చూస్తున్నాను అన్నాడు తడబడుతూ

మురారి ఎగదన్నుకొస్తున్న దుః ఖాన్ని అదిమిపెడుతూ ..

నాకేం అర్థం కావటం లేదు మురారీ అసలేం జరిగింది ? నిదానం గా చెప్పు అన్నాడు యశ్వంత్ .

యష్ .. ఏం చెప్పన్రా ? ఇది భయమో .. బాధో తెలీదు .. మనసుని అదుపులో పెట్టుకోలేక పోతున్న .. మీతో చెప్పని

నిజమేంటంటే నా పుట్టిన రోజున సత్య ని వైజయంతి ఆవహించింది . అప్పటినుండీ తనలో వైజయంతి ఉంది ..

మీతో చెబితే సత్య ప్రాణాలకి ముప్పు .. మౌనం గా ఉండలేక .. ఆ విషయం నాలో దాచలేక నరక యాతన పడ్డాను .

అన్నాడు మురారి .

మురారీ నువ్వు చెప్పేది నిజమా ? అంటే వైజయంతి మనతోనే ఉన్నదన్నమాట . సత్య ప్రవర్తన లో ఏదో మార్పు

కనబడుతుంది అని రచన చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు .. ఇప్పుడెం చేయాలి .. తల పట్టుకుంటూ అన్నాడు

యశ్వంత్ .

ఇంకా ఉంది 





No comments: