Powered By Blogger

Thursday 24 April 2014

ప్రేమ వానా ...





కన్నుల్లో కలగా కనిపించావని  

గుండెల్లో గుబులే సృష్టించావని ..

మరవనంది మనసే .. నిను మరవనంది మనసే ..

వెన్నెల్లో అలగా నను తాకావని ..

ఎండల్లో మంచే కురిపించావని ..

మరవనంది మనసే .. నిను మరవనంది మనసే ..

అలవోక గా చూసే వాలు కళ్ళల్లోనా ..

నా రూపం కనిపించిందే ఓ నెరజాణా ..

నీ హంస నడకల్లోనా ఓ చినదానా ..

తోడై నే నడవాలని నిన్ను అడిగేసేయనా ..

సంపంగె ముక్కు మీద కోపం ఉన్నా ..

నునుపైనా చెక్కిలి పైనా సిగ్గే దాగున్నా ..

ముద్దొచ్చే నీ మోము చూడాలే నా మైనా ..

మురిపెంగా నీ పైన కురిపించన ప్రేమ వానా ...

















మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

gajula sridevi said...

మొత్తానికి మీ బ్లాగు ప్రేమ వానతో తడిసింది రాధికా.

రాధిక said...

ఈ మండే ఎండల్లో ఆ ప్రేమ వాన హాయే కదా శ్రీదేవిగారు ..