Powered By Blogger

Thursday 29 May 2014

రుధిర సౌధం 158

అంత జరిగినా ఏమాత్రం భయం లేకుండా ముందుకి నడుస్తున్న ఆమె వైపు  ఆశ్చర్యం గానే చూస్తూ

అనుసరించారు .. మిగిలిన వాళ్ళు .

సత్య పడున్న చోటికి సరాసరి నడిచింది .. రచన .

అతి దీన పరిస్థితి లో పడున్న సత్య ని చూడగానే .. వీరాస్వామి పాదాల కింద భూకంపం వచ్చినట్టయింది .. ఈమె ..

ఈమె .. ఇక్కడ .. అన్నాడు తడబడుతూ ..

అవును .. తనని కూడా మీరు  రక్షించ వలసిందే .. మొండిగా అంది రచన .


చూసావా ? ఈ పిల్ల ఆ పట్నామోల్ల పిల్ల .. ఈ పిల్ల తనని కాపాడ మంటోంది . వీళ్ళిద్దరూ ఇక్కడ నుండి క్షేమం గా

వెళ్తే మన సామి కష్టాల్లో పడతాడు .. ఈ సరస్వతి గురించిన నిజం ఊరంతా తెలుస్తుంది .. అన్నాడు బాలయ్య .

అవును .. నేనీ పిల్ల ని రక్షించ బోను .. అన్నాడు వీరస్వామి .

లేదు రక్షించాలి .. లేదంటే ఇక్కడ నుండి మీరెవ్వరు కదలలేరు .. మొండిగా అంది రచన .

ఈ పట్నమోల్లు ఇంతే .. కష్టం నుండి కాపాడాం అన్న బుద్ధి లేదాయే .. మాకు కట్టమొచ్చే పని మేము  చేస్తామా ?

చెయ్యం .. అన్నాడు బాలయ్య .

కష్టం లో ఉన్న ఈ ఆడపిల్ల ని రక్షించ నంటున్నారు .. మరో ఆడపిల్ల ని కష్టం లోకి నెట్టేస్తున్నారు .. మీరు

మనుషులనుకోవటం నా తప్పు కదూ .. అంటూ .. పాకెట్ లోని గన్ తీసి వారికి గురి పెట్టింది రచన ..

ఆ హటాత్ పరిణామానికి విస్తుపోయి చూశారు వాళ్ళు ..

ఏంటి అలా చూస్తున్నారు ? కళ్ళ ముందు అన్యాయం జరగబోతుంటే చూస్తూ ఊరుకోను .. ముందు సరస్వతి ని

వదలండి అంది రచన .

వాళ్ళు విడిచి పెట్టకుండా అలానే చూడసాగారు ...

రచన కోపం గా వాళ్ళ కాళ్ళ కింద గన్ గురిపెట్టి కాల్చింది .. వాళ్ళు సరస్వతి ని వదిలేసి ఆ ఇద్దరూ పరుగు తీసారు .

వీరస్వామి , బాలయ్య అయోమయంగా ,భయం గా చూశారు .. అంతలోనే తేరుకొని వీరస్వామి మంత్రం ఉచ్చరించ

బోతుండగా ..

కమాన్ .. వీరస్వామి .. నువ్వు మంత్రం పూర్తీ చేసేలోపు నా గన్ లోని బుల్లెట్ నీ తలలో ఉంటుంది .. అతిగా కష్ట

పడకు .. ముందు సత్య ని కాపాడు లేదంటే నేను చెప్పిందే చేస్తాను అంది రచన .

వీరస్వామి కంగారుగా సత్య వైపు చూశాడు .. అతనికేం అర్థమైందో .. కానీ కళ్ళల్లో భయం కనబడింది ..

ఈమె భూతావరణం లో ఉంది .. ఒక పూజ చేస్తే గానీ ఈమె ని ప్రాణాలతో కాపాడలెం .. అన్నాడు వీరస్వామి ..

కబుర్లు చెప్పకు .. వీరాస్వామీ .. నన్ను విడిపించావు .. ఈమె ని కాపాడ లేవా ? నువ్వు కాపాడక పొతే

చచ్చిపోతావు .. అంది రచన .

చూడు పిల్లా .. నిన్ను మామూలు కట్టు వేశాడు .. ఆ బసవన్న .. కానీ ఈ పిల్ల ని భూతావరణం లో బంధించింది

క్షుద్ర శక్తి .. నా శక్తి చాలదు .. దీని నుండి కాపాడడానికి .. కానీ దీనికి ఓ పూజ చేయాల్సి ఉంటుంది .. ఆ పూజ

పరమ పవిత్రుడైన వ్యక్తీ చేయాల్సి ఉంటుంది .. అన్నాడు వీరస్వామి .

ఇంకా ఉంది 













మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: