Powered By Blogger

Saturday 31 May 2014

రుధిర సౌధం 160

ఓ ముసలాయన .. ఓ నడివయస్సు దంపతులు .. ఓ చిన్న పిల్లవాడు ఉన్నారక్కడ .

యశ్వంత్ ముందుగా వారిదగ్గరకి నడిచి .. కిందన కూర్చుని విగ్రహం వైపు ఆరాధన గా చూస్తున్న ముసలాయన్ని

ఉద్దేశించి ... తాతా .. అని పిలిచాడు .

ఆ పిలుపు కి ఆశ్చర్యంగా వెనుదిరిగి  చూశాడు ఆ ముసలి వాడు .

ఆ నడి వయస్సు దంపతులు కూడా వీరివంక ఆశ్చర్యం గా చూశారు .


మీరు .. ఇంత రాత్రి వేళలో .. ఈ విగ్రహానికి పూజ చేస్తున్నారు .. ఎవరు మీరు ? అని అడిగాడు యశ్వంత్ .

నాకు ఆశ్చర్యంగా నే ఉంది నాయనా .. మీరెవరు ? ఇంత రాత్రి వేళ ఈ అడవిలో మీకు పనేంటి ? అన్నాడు అతడు ..

యశ్వంత్ చిన్నగా నవ్వి .. మేము .. రావణ పురం నుంచి వచ్చాం .. ఇక్కడి ప్రాచీన భవనము లమీద పరిశోధన లు

జరిపేందుకు .. అన్నాడు .

ఆ నడి వయస్సు వ్యక్తి వీరిదగ్గరకి వచ్చి .. అంటే మీరు పట్నం వాళ్ళు .. మీకు తెలియదేమో .. ఆ భవనాలు అంత

మంచివి కావు మీ పనులు చేసుకునేందుకు అయినా .. అన్నాడు .

యశ్వంత్ చిన్నగా నవ్వి .. ఇంతకీ మీరెవరు అన్నది చెప్పనే లేదు .. అన్నాడు ..

దానికి ఆ ముసలాయన .. నా పేరు పరంధాముడు .. వీడు నా కొడుకు చిన్నారావు .. ఆమె నా కోడలు సీతమ్మ ..

ఈ చిన్నోడు నా మనవడు .. పేరు దినేష్ .. మేమిక్కడ కి అమ్మవారి పూజ చేసుకునేందుకు వచ్చాం .. అన్నాడు .

అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంత రాత్రి వేళ పూజలేంటి ? అన్నాడు యశ్వంత్ వెనకాల నుండి శివ ..

ఆ ముసలాయన .. శివ .. మురారిల వైపు చూసి .. మళ్ళి యశ్వంత్ వైపు చూసి .. నీ స్నేహితులా .. అన్నాడు .

యశ్వంత్ చిరునవ్వుతో తల ఊపాడు ..

అతడు శివ వైపు చూసి .. ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారు వైష్ణవీ మాత .. ఈమె ఒకప్పుడు ఆ రావణ పురం

మహల్ లో ఉండే ఓ ఆలయం లో ఉండేది .. ఆ కోటలో యువరాణి అమ్మవారిని ప్రతినిత్యం కొలిచేది .. ప్రతి

పౌర్ణమి కి ముందు 3 వ  రోజు నుండి పౌర్ణమి వరకు ప్రత్యెక పూజలు జరపటం ఆనవాయితీ .. ఆ తల్లి అలా

అమ్మవార్ని కొలిచేది .. ఆ అమ్మవారు ఆ తల్లి పిలిస్తే పలికేది .. కానీ కాలం ఎప్పుడు ఒక్కలా ఉండదు కదా ..

ఆ యువరాణి అనుకోకుండా ఒకరోజు ప్రాణత్యాగం చేసుకుంది .. ఆమె మరణం తరువాత మహల్లో తాంత్రిక శక్తులు

తిరుగాడుతుండేవి .. తరువాత మరో యువరాణి వైజయంతి ని మహారాజే స్వయంగా హత్య చేశారని ఒక పుకారు .

ఆమె .. ఆ మహల్లో దుష్ట శక్తిగా తిరుగుతుందని కూడా అంటారు .. ఆ లక్షణాలతో ఆలయం దైవత్వాన్ని కోల్పోయి

పవిత్రత ని త్యజించింది . అమ్మవారు ఆలయాన్ని వదిలి ఇలా ఈ అడవి లోకి వచ్చి చేరిందని మా నమ్మకం .

ప్రతి పౌర్ణమి కి ముందు 3 రోజుల నుండి ఇలా వెన్నెల వెలుగులో ఈ తల్లి ని కొలవటం మా అలవాటు .. అన్నాడు .

అమ్మవారు ఇక్కడికి వచ్చేసిందని మీకెవరు చెప్పారు ? అన్నాడు మురారి .

మా నాన్న .. మా నాన్న కి కలలో అమ్మ చెప్పిందట .. ఇక్కడున్నానని .. వచ్చి చూసేసరికి ఈ విగ్రహం ఉంది ..

అప్పటి నుండి అమ్మవార్ని ఆయన కంటికి రెప్పలా చూసుకున్నాడు .. ఇప్పుడు మేము .. కానీ మా నాన్న

చెప్పినట్టు మళ్ళి ఈ అమ్మవారు మహల్ ఆలయానికి వేల్లిపోతుందట .. ఆ రోజు త్వరలోనే రాబోతుంది .. అన్నాడు

ఆ ముసలాయన .


ఇంకా ఉంది 

మీ అభిప్రాయం మాకు అతి విలువైనది