Powered By Blogger

Thursday 12 June 2014

నివాళి ..


విహారమంటూ  సుదూర మేగిన పసి హృదయాలకి నివాళి ..

కలలను కంటూ కథలను చెబుతూ సాగిన యాత్ర ది ఏ దారి

కన్నవారి కి కడుపు కోత ని కలిగించిన రాక్షస ప్రవాహి ..

కిలకిల నవ్వులనే తనలో  కలిపేసిన వికృత  బియాస్ నది ..

వినోదమంతా విషాదమై శాసించిన కాల విశూచి ...

భవిత కి వేసిన బంగరు బాటని కాల రాసిన దే విధి ..

కట్టలు తెగిన నదీమ తల్లి కర్కశ మారణ కేళి ...

స్నేహం లో నే చివరి ఘడియలు  ముగిసిన లేత  ప్రాయాలకి

కలత చెందిన మనసు తో పలుకు తున్న తుది నివాళి ..







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

స్వర్ణమల్లిక said...

Enta chitramo kadaa vidhi.. Inko padi nimishallo mugusipotunna jeevitalu vaallavani evaru uhinchi untaru. Vallu bhavishyat kosam enni kalalu kani untaru, vaaru, varini kanna varu.. Anni chidimesadu paivadu.. Taanu andarikanna paivadu ani nirupinchukunnadu.

రాధిక said...

అవును ... అప్పుడే వెలిగించిన దీపం ఎవరో బలవంతం గా ఆర్పేసినట్టు భగవంతుడు వాళ్ళ జీవితాలని ఆ మురికి నీటిలో ,రాళ్ళ గుట్టల్ల్లో కలిపేసాడు .. ఆ తల్లితండ్రుల గుండెల్ని నిలువునా చీల్చేసాడు ...