స్వామీ ... నది ఒడ్డు కి చేరుతోంది పడవ .. అన్నాడు పడవవాడు .
కళ్ళు మూసుకొని ధ్యానం లో ఉన్న రమనానంద మహర్షి కళ్ళు తెరచి .. ఆ .. అని తన వంకే ఆసక్తిగా చూస్తున్న
గోపాల స్వామి వైపు చూసి .. నీవు ఒడ్డు రాగానే దక్షిణ దిశ గా పయనమై ఆ అడవి లో నేను చెప్పిన వస్తువులని
సేకరించు ... సేకరించిన పిమ్మట తూర్పు దిశగా పయనం సాగించు .. ఒక కుగ్రామం కనబడుతుంది .. ఆ కుగ్రామం
లో నేను నిన్ను కలవగలను . స్నానం ఆచరించి వస్తువులని సేకరించు గోపాలా .. అన్నాడు రమనానంద మహర్షి .
ఏదో మహత్కార్యం లో పాలు పంచుకో బోతున్నానని ఉత్సాహం తో ఉన్న గోపాల స్వామి సంతోషo గా తల
ఊపాడు .
పడవ ఒడ్డు కి చేరింది ...
స్వామీ ... మరల మీ దర్శనం ఎప్పుడు స్వామీ అన్నాడు పడవవాడు వినయంగా ...
ముర్రయ్యా ... నా దర్శనం కొరకు కాదు .. ఆ జగదాంబ దర్శనం కొరకు రేపు పౌర్ణమి నాడు రావణ పురం చేరుకో ...
ఇన్నేళ్ళ నీ నిరీక్షణ ఫలిస్తుంది .. అన్నాడు రమనానంద .
మహద్భాగ్యం స్వామీ .. అని మళ్ళి పడవని వెనక్కి మళ్ళించాడు పడవవాడు ..
స్వామీజీ .. ఈ పడవ వాడు మీకు ముందరే తెలుసునా ? మీరు పిలిచి నట్టే మీకొరకు ఆవలి ఒడ్డున ఆహార
పదార్థాల సహితం గా ఎదురు చూస్తూ ఉన్నాడు .. అన్నాడు గోపాల స్వామి .
గోపాలా .. మనసులు సాన్నిహిత్యం గా ఉన్నప్పుడు దూరం మాత్రం ఏం చేయగలదు . చిరుగాలితో సందేశం
పంపినా చాలునని నీవు ఎరుగవా ? దీనికే ఆశ్చర్యపడి సమయాన్ని వృధా చేయకు .. తక్షణమే దక్షిణ దిశ గా
బయలుదేరి రేపు ఉదయాని కల్లా ఆ గ్రామాన్ని చేరుకో నువ్వు .. అన్నాడు రమణానంద .
అలాగే స్వామీ ... అని గురువు పాదాలకి నమస్కరించి దక్షిణానికి పయన మయ్యాడు గోపాల స్వామి .
గోపాలస్వామి అటు అలా వెళ్ళగానే .. నది చుట్టూరా ఉన్న అటవీ మార్గం గుండా నడక సాగించాడు రమణానంద .
*************************
విక్కీ ఇక్కడ నుండి మనం రోడ్ మార్గం లోనే వెళ్ళాలి అంది గిరిజ .
అవునా అమ్మా ? నేను కాబ్ బుక్ చేసి వస్తాను ... నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అమ్మా ... అన్నాడు విక్కీ .
అలాగే .. మనం ముప్పావు వంతు ప్రయాణం సులువుగా చేసేసాం నాన్నా .. కానీ ఇక్కడి నుండి వెళ్ళటానికే
ఆలస్య మవుతుంది .. అంది గిరిజ .
ఎంత సమయం పట్టొచ్చు అమ్మా ? అని అడిగాడు విక్కీ .
మనం ఇప్పుడు బయల్దేరితే .. రేపు ఉదయం కల్లా రావణ పురం లో ఉంటాము .. వెంటనే కాబ్ తీసుకొని రా
నాన్న ... అని పక్కనే ఉన్న బెంచ్ లో కూలబడింది .. గిరిజాదేవి .
కాబ్ కోసం వెళ్తున్న విక్కీ ని చూస్తూ అనుకొంది .. సుమారు 20 ఏళ్ళ తరువాత మళ్ళి రావణ పురం వెళ్తున్నాం ..
ఈ ప్రయాణం మన జీవితాలని ఏ మలుపు తిప్పబోతుందో .. అనుకొంది మనసులో గిరిజ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a Comment