అవును యశ్వంత్ . ఇప్పుడు మనల్ని నమ్మి ఇంత జనం ఇక్కడికి వచ్చారు . వీళ్ళకి ఎటువంటి అపాయం
ఎదురవకూడదు కదా ... అదుగో రచన వాళ్ళందర్నీ మహాల్లోకి తీసుకు వెళ్తోంది .. మనం వెళ్దాం యశ్ .. రచన
కిప్పుడే ఈ విషయం కోసం అడుగుదాం .. అన్నాడు శివ .
ఇద్దరూ .. కంగారుగా మహల్ ద్వారం వైపు పరుగుతీసారు .
రచన .. అందరికీ తలో పనీ ఒప్పజేబుతుంది ..
వీళ్ళిద్దర్నీ చూసి .. అప్పుడే చదవడం పూర్తయిందా ? అలా జరిగే వీల్లేదే .. అంది రచన .
అసలు మొదలు పెట్టలేదు .. ఒక్కసారి నువ్విలా రా .. నీతో మాట్లాడాలి .. అన్నాడు యశ్వంత్ .
యశ్ .. ఇక్కడ పని పూర్తి కావాలి .. సరే .. అని వీరి వద్దకి వచ్చి చెప్పు .. ఏం చెప్పాలి మీకు ? అంది రచన .
వైజయంతి కోసం చెప్పు ? అన్నాడు యశ్వంత్ సీరియస్ గా .
ఆ మాట వినగానే ఆమె మొహం లో రంగులు మారాయి ...
చెప్పు రచనా ? కోటలో ఏం జరిగింది ? వైజయంతి పీడ పూర్తిగా పోయిందా ? నువ్వా మాట చెబితే మేము
ప్రశాంతంగా ఉంటాం కదా .. అన్నాడు యశ్వంత్ .
యశ్ .. వైజయంతి ని , బసవరాజు ని ఇద్దర్నీ వీరస్వామి బంధించి ఉంచాడు .. అంది రచన .
వీరాస్వామా ? ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యం గా అన్నారు ... యశ్వంత్ ,శివ
చిన్నగా తల ఊపి అవును ... తనే .. మనకి సహాయం చేసాడు . ఒక చిన్న డీల్ .. తనతో అంతే .. అంది రచన .
రచనా .. మనం భూపతిని దోషిగా నిలబెట్టాం .. వీరస్వామి భూపతి మనిషి .. తన పాపాలలో అధిక శాతం
వీరస్వామి కి వాటా ఉంది .. అన్నాడు శివ .
అవును నిజమే .. కానీ వీరా స్వామి స్వార్థ పరుడు . ఇప్పుడు భూపతి వెంట ఉండటం కంటే మనల్ని
నమ్మటమే మంచిదని అతడు భావించాడు . ఎవ్వరూ మునిగి పోతున్న పడవ ఎక్కాలనుకోరు కదా ... అంది
రచన .
డీల్ ఏంటి రచనా ? వాడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ? అన్నాడు సీరియస్ గా యశ్వంత్ .
వాడు చేసిన తప్పులకి శిక్ష పడకుండా చేయమని అడిగి ఉంటాడు .. అన్నాడు శివ .
లేదు శివా ... వాడు అమ్మవారి మెడలో ఉన్న హారం అడిగాడు . గుడి నాచే తప్పక తెరవబడుతుందని అతడు
నమ్మాడు . అమ్మవారి మెడలో పురాతన హారం ఏదో ఉందట . అదిస్తే .. వైజయంతి పీడ పూర్తిగా తొలగిస్తానని
చెప్పాడు . ఈ ఊరి క్షేమం కంటే , ఈ మహల్ పునరుద్ధరణ కంటే ఆ హారం ఏ మాత్రం గొప్ప . అందుకే మాటిచ్చాను
గుడి తెరవగానే ఆ హారాన్ని అతడికి ఇస్తానని . వైజయంతి నాశనం పూర్తిగా జరిగిపోవాలి .. అంది సాలోచన
గా రచన .
అతడు ఆ హారం అడిగాడంటే .. ఈ భూపతి కూడా ఆ హారం కోసం ప్రయత్నించాడు అంటే .. ఆ హారం వెనుక
ఏదో ఉంది .. అన్నాడు యశ్వంత్ .
అదేమైనా యశ్ .. నాకు వైజయంతి నాశనమే ముఖ్యం అంది రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment