Powered By Blogger

Monday 14 July 2014

రుధిర సౌధం 195


నిజమే తల్లీ .. ఇది సంతోష సమయమే . గ్రహణం వీడుతున్న సమయమే ... కానీ .. అని ఆలోచన లో ఉండి

పోయాడు రమణానంద .

సందేహించకు నాయనా . ఇది కలికాలం .. చెడు చెలరేగుతున్న కాలం . మంచి కి పరీక్షా కాలం . కానీ కాలమేదైనా

చెడు మీద మంచి కె విజయం నాయనా .. అన్న దామె చిరు దరహాసం తో  .

సందేహం లేదు తల్లీ .. నిన్ను సందేహించే సాహసం చేయగల వాడిని కాను . నాచే ముహూర్తం నిర్ణయింప

బడాలన్నది నీ తల్లి మనసు లో పెల్లుబుకుతున్న ప్రేమ తల్లీ .. అన్నాడు రమణానంద .

ఆమె చిరునవ్వు తో ... వెళ్ళు నాయనా .. ప్రతి స్త్ర్రీ లోనూ నా అంశే ఉంటుంది .. స్త్రీ కూడా సద్భుద్ది ,దుర్భుద్ధి ల

అధీనం లో ఉండక తప్పదు కదా .. ఇది నాలో నాకే ,నాతోనే జరుగుతున్న యుద్ధం .. కావున ఫలితా న్వేషణ

కోసం  యోచించక మీరందరూ .. మీ మీ కర్తవ్యాలను సక్రమం గా నిర్వర్తించండి . ఆ తదుపరి ఫలితాన్ని నాకు

వదిలిపెట్టండి .. నీకు విజయం సిద్ధించు గాక ... అంది ఆమె దరహాస వదనం తో ..

కృతజ్ఞుడను తల్లీ .. అని ఆర్తి గా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు రామనానంద .

మెల్లిగా కళ్ళు తెరచి చూసేసరికి .. ఆమె లేదు .. అంత వరకు నాసికా పుటలను అలరించిన సుగంధము జాడ లేదు .

అతడు  నెమ్మదిగా లేచి జై వైష్ణవీ మాతా .. అని ముందుకి సాగాడు .

                                          ************************************

యశ్వంత్ మనసంతా ఆందోళన గా ఉంది . అమ్మవారి మెడలో హారం ఎలా ఇస్తానని మాటిచ్చింది రచన . ఇంత

వరకు పూజలేదు . ఆలయం తెరువ గానే ఏళ్ళ తరబడి ఆమె మెడలో ఉన్న హారం ఆమె నుండి దూరం చేయడం

ఎంత వరకు సమంజసం ? అని విసుగ్గా అనుకున్నాడు యశ్వంత్ .

యశ్ .. అన్న రచన పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూశాడు యశ్వంత్ .

నువ్వేంటి ? అలా ఆలోచిస్తూ ఉన్నావు ? గ్రంథం చదవలేదా ? ఏమైంది నీకు ? అంది రచన అతని దగ్గర వచ్చి అతడి

నుదుటి మీద చేయి వేసి .. ఒంట్లో బాగానే ఉందిగా .. అంది రచన .

హా .. రచనా .. పనయ్యిందా ? అన్నాడు యశ్వంత్ .

మహల్ అంటా శుభ్రం చేయడం అంటే మాటలా ? ముందుగా దేవుడి గది నేనే శుభ్రం చేసి వచ్చా .. మిగతా ఓ

మూడు పడక గదులుగా ఉపయోగించు కోవోచ్చు . బోలెడంత దుమ్ము ఉంది .. కానీ తప్పదు ... ఆ ఆడవాళ్ళంతా

ఈరోజంతా ఉండి శుభ్రం చేస్తామంటున్నారు . అంది రచన .

రచనా .. హారం తీసుకుని నువ్వు వీరస్వామి ని ఎక్కడ కలవబోతున్నావు ? అన్నాడు యశ్వంత్ .

ఓహ్ .. అర్థమయింది . నువ్వైతే ఇంకా అదే ఆలోచిస్తున్నావు ? బహుసా నా మీద కోపం వస్తుంది కూడా కదా ..

అని అతని కళ్ళల్లోకి చూసింది రచన .

అతనికి హారం ఇవ్వడం తప్ప వేరే దారేం లేదా ? అన్నాడు యశ్వంత్ ఆమె వైపు దీనంగా చూస్తూ .

యశ్ .. అసలు ఏ పరిస్థితుల్లో నేనా మాట ఇచ్చానో తెలుసా .. అసలు నీకు మొత్తం చెప్పాలి .. నువ్వు ముందు

ఇలా  కూర్చో .. అని అతడిని పట్టుకొని మెట్ల పై కూర్చో బెట్టి తానూ అతడి పక్క కూర్చుంది రచన .

నేను ఇంతకు ముందు నిన్ను అడిగాను . నాకోసం నీకు అక్కడికి రావాలని పించలేదా అని ? అంది రచన .

అవును .. కానీ .. అని అతడు ఏదో చెప్పబోతుంటే .. వారించి

మనిషి తన చావు కళ్ళముందు కనిపిస్తున్నప్పుడు .. అప్పుడు అర్థమవుతుంది .. తామేవర్ని ఎంతగా

ప్రేమిస్తుంది ? నాకూ అదే అనుభవమైంది .. మరణించడానికి సిద్ధ పడిపోయాను .. సత్య కోసం .. ఆ క్షణం నువ్వు

నా పక్కన ఉండుంటే బావుండు నని పించింది .. అంది రచన .. ఆమె కళ్ళలో సన్నటి కన్నీటి పొర తళుక్కు మంది .

రచనా .. అన్నాడు బాధగా   యశ్వంత్ .

యశ్ .. నన్ను చెప్పనీ .. నీకు చెప్పాలి .. నేను .. మురారిని రావొద్దని వారించి వెళ్లాను .. అంతా అటవీ మార్గం ..

అంటూ జరిగినదంతా చెప్పసాగింది రచన .

ఆమె చెబుతుంటే యశ్వంత్ వెంట్రుకలు నిక్కబొడుచు కున్నాయి ..

జరిగినదంతా చెప్పడానికి ఆమె కి గంట సమయం పట్టింది .


ఇంకా ఉంది










మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: