Powered By Blogger

Wednesday 23 July 2014

రుధిర సౌధం 203

మురారీ .. మురారీ .. సరస్వతి ఇంటి ముందు నిలుచుని గట్టిగా అరిచాడు శివ .

తలుపు తెరిచి .. శివ బాబూ లోపల్కి రండి .. అంది సరస్వతి .

లేదు సరస్వతీ .. యశ్వంత్ అర్జెంటు గా రమ్మన్నాడు .. ముందు మురారి ని పిలువు .. అన్నాడు శివ ..

అలాగే బాబూ .. అని లోపలకి వెళ్ళింది సరస్వతి .. సరస్వతి లోపలకి వెళ్ళిన రెండు నిమిషాలకి బయటకి వచ్చాడు

మురారి .

శివా .. ఇప్పుడే వచ్చావా ? నీ పనులన్నీ అయిపోయాయా ? అన్నాడు మురారి చెప్పుల్లోకి కాళ్ళు దూరుస్తూ .

అయిపోయాయి రా .. అది సరే .. సత్య భోజనం అయిందా ? అన్నాడు శివ .

హా .. తనని సరస్వతి  ఎంతో బాగా చూసుకుంటుంది .. నేను తనకి చెప్పోచ్చానులే .. అన్నాడు మురారి .

సరే పద .. ముందు మహల్ కి వెళ్ళాలి . రచన . యశ్ ఎందుకో కంగారుగా కనిపించారు ఇంతకు ముందు ..

అన్నాడు శివ .

ఏం ఏమయింది ? అంటూ నడుస్తూనే అడిగాడు మురారి ..

మురారి తో కబుర్లు చెబుతూనే ఇద్దరూ మహల్ కి చేరుకున్నారు .

మహల్ ని చూడగానే .. అబ్బురంగా .. అరె .. ఇది రాణి మహాలేనా ? కొన్ని గంటల్లో ఇంత మార్పా?అన్ బిలీవబుల్

అన్నాడు మురారి .

చిరునవ్వు నవ్వుతు .. ఇంకేం .. నమ్మకు .. ఇంకో విషయం తెలిస్తే ఇంకా షాక్ అవుతావు .. ఈ మహల్లో ఇప్పుడు

వైజయంతి లేదు .. అన్నాడు శివ .

అర్థం అవుతుందిరా .. ఈ మహల్ చుట్టూ ఈ హడావిడి , ఇంత జనం .. ఈ కోలాహలం .. ఇవ్వన్ని చెబుతున్నాయి

ఇప్పుడిక్కడ వైజయంతి లేనే లేదని .. అన్నాడు మురారి .

హః హ్హ హా ... గట్టిగా నవ్వాడు శివ .

శివా .. ఇంతకీ మనోళ్ళు ఎక్కడున్నారు .. అదే .. మన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ .. అన్నాడు మురారి .

ఇక్కడ .. ఇక్కడకి రండి మీ ఇద్దరూ .. గట్టిగా అరిచాడు యశ్వంత్ కొంత దూరం లో నుండి .

హే .. మనోడు అక్కడున్నాడు పద .. అని యశ్వంత్ వైపు నడిచాడు శివ .. మురారి కూడా శివ ని అనుసరించాడు .

యశ్వంత్ దగ్గరకి చేరుకోగానే .. యశ్ , మురారిని ఆప్యాయం గా హత్తుకున్నాడు . తరువాత అక్కడ ఉన్న చైర్స్

లో ముగ్గురూ ఆసీనులయ్యారు .

వేరి హ్యాపీ యశ్ .. మనం ఈ మహల్ దగ్గరికి చాలా సార్లు వచ్చాం .. బట్ ఈరోజు ఈ మహల్ దగ్గరికి సంతోషాన్ని

తెచ్చాం .. అన్నాడు మురారి .

అవును మురారి .. బట్ వుయ్ ఆర్ నాట్ ఫుల్లీ హ్యాపీ .. సత్య .. సత్య కూడా ఇప్పుడు మనతో ఉంటె బావుంటుంది .

ఇంతకీ తను ఎలా ఉంది ? అని అడిగాడు యశ్వంత్ .

తనకేం అయిందో నాకు అర్థం కావడం లేదు యశ్వంత్ .. తింటుంది .. అన్ని వింటుంది .. బట్ తను మనలో లేదు ..

బై ది వే .. సత్య గురించి రచన ఏమన్నా చెప్పిందా ? తనెలా కోలుకునేది ఏమిటని ? అన్నాడు మురారి ఆత్రుత గా .



ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: