చిక్కటి వెన్నెల వెలుగులో దారిని వెతుక్కుంటోంది యశ్వంత్ నడుపుతున్న వెహికల్
ఇక్కడి నుండి నడవ వలసిందే బాబూ .. ఈ బండి వెళ్ళదు .. అన్నాడు బాలయ్య ..
వెహికల్ ని ఓ పక్కగా ఆపి , దిగి .. జేబు లో చెయ్యి పెట్టి ఓ సారి గన్ బయటికి తీసి మళ్ళి లోపల పెట్టి ... బాలయ్య
వైపు చూసి .. ఇప్పుడెటు ? అని అడిగాడు యశ్వంత్ .
అటువైపు పోవాలయ్యా .. అలా వెళ్తే దగ్గర .. 10 నిమిషాల్ల చేరుకోవోచ్చు .. అన్నాడు బాలయ్య ..
బాలయ్య చూపిన వైపు చూసాడు యశ్వంత్ .. గుబురుగా పొదలు .. దట్టమైన అడవి ... అటువైపు నడక
సాగించారు .
బాలయ్య చెప్పింది నిజమే కొంత దూరం వెళ్లేసరికి శంకరం గొంతు వినిపిస్తుంది ..
అయ్యా ... అయ్యా .. చూడ 0డ య్యా .. ఎంత ఘోరం జరిగిందో ... ఆ బాబు కి ఇంత కష్టం ఏందయ్యా .. అని
ఏడుస్తున్నాడు శంకరం .
యశ్వంత్ బాబూ .. భూపతి వాళ్ళు కూడా చేరుకున్నట్టున్నారు .. అన్నాడు బాలయ్య ..
హా .. అని ముందుకి నడిచే సరికి కొంత దూరం లో భూపతి ,శంకరం , వెంగమ్మ ,మరో ముగ్గురు మగవాళ్ళు కన
బడ్డారు .. యశ్వంత్ రెండు అంగల్లో అక్కడికి చేరుకున్నాడు ..
కానీ అతనికి శవం కనబడ లేదు .. మొహం ప్రశ్నార్థకం గా పెట్టి చూస్తున్న యశ్వంత్ కి .. బాలయ్య .. అయ్యా ..
అటు చూడండి .. పైకి చూపించాడు .. అంతే ఒక్కసారిగా అదిరి పడ్డాడు యశ్వంత్ .
అక్కడ ఎత్తైన చెట్టు కొమ్మ పై రక్తం ఓడుతూ కనిపించాడు రత్నం రాజు .. అతడి కుడి చేయి శరీరం నుండి వేరు
కావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు .. కొమ్మ మీద అతడి పొట్ట ఆనించి ఉంది .. కళ్ళు తెరచే ఉన్నాయి ..
ఆ కళ్ళలో భయం .. అలానే .. ఉంది .. చెట్టు కొమ్మ మీద నుంచి రక్తం బొట్లు గా కారుతూనే ఉంది .. అతడి స్థితి
యశ్వంత్ కళ్ళలో కన్నీటిని నింపింది ..
చూడండి బాబూ .. చూడండి .. మా రత్నం బాబు పరిస్థితి .. అని గట్టిగా అరిచాడు శంకరం .
భూపతి మాత్రం మౌనం గా ఉన్నాడు .. అతని కళ్ళలో అంతులేని శూన్యం కనబడుతుంది .. వెంగమ్మ మొహం లో
మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేదు ..
బాలయ్యా .. శవాన్ని కిందికి దించలేదేమి .. ? అని అడిగాడు గొంతు బొంగురు పోతుంటే యశ్వంత్ .
అక్కడున్న వారిలో ఒకడు .. ఏ దెయ్యమో ఇతడిని చంపిందయ్యా .. శవాన్ని ముట్టుకుంటే ఏం జరుగుతుందో
అని భయం కలిగి ఆగిపోయాం .. అన్నారు .
అదేం లేదు .. బాలయ్యా .. ముందు శవాన్ని దించండి .. ఏం కాదు .. వెళ్ళండి .. అన్నాడు యశ్వంత్ ... పైకి అలా
అన్నా .. యశ్వంత్ కి రత్నం ఎలా మరణించాడో అర్థం కాలేదు .. ఇంత దారుణం గా .. ఇంత కర్కశం గా .. అతని
చావుకి కారణ మైన వాళ్ళు ఎవ్వరు ? అని ఆలోచించ సాగాడు .. బాలయ్య యశ్వంత్ ఇచ్చిన ధైర్యం తో చెట్టు
ఎక్కసాగాడు .
యశ్వంత్ సాలోచన గా నే భూపతి వైపు చూశాడు ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది


.jpg)

No comments:
Post a Comment