Powered By Blogger

Friday 26 September 2014

రుధిర సౌధం 253




యశ్వంత్ .. అసలు వైజయంతి ఎత్తుగడ ఏమయి ఉంటుందో అర్థం కావడం లేదు .. అసహనం గా అన్నాడు శివ .

శివా .. మనం అప్రమత్తం గానే ఉంటాం కదా .. ఏం ఫర్వాలేదు .. అని గేటు వైపు చూసి .. శివా .. ఆ వస్తున్న వాళ్ళు

ఆరోజు మనం అడవిలో చూసిన ఫామిలీ కదా .. అన్నాడు యశ్వంత్ .

అవును యశ్ .. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వస్తామన్నారు .. ఆరోజు అడవిలో అమ్మవారిని అర్చిస్తూ కనిపించారు

కదూ.. అన్నాడు శివ .

అవును .. శివా .. వాళ్ళని రచనకి , ఆంటీ కి పరిచయం చేసి విషయం చెప్పు .. వాళ్లకి ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు

చేయమని సరస్వతి కి చెప్పు .. అని వాళ్లకి ఎదురెళ్ళి .. రండి .. మనం మళ్ళి కలసుకోవడం ఆనందంగా ఉంది ..

అన్నాడు యశ్వంత్ .

ఆ కుటుంబ పెద్ద (ముసలాయన ) .. అవును నాయనా .. అమ్మవారు ఇక్కడికి తరలి వచ్చేసి నపుడు మేము

రాకుండా ఎలా ఉండగలం ? అన్నాడు .

సరే .. మీరు మా శివ తో పాటుగా వెళ్ళండి .. రాజ వంశీకులు కూడా ఇక్కడే ఉన్నారు .. అని శివ వైపు తిరిగి

తీసుకు వెళ్ళు శివా .. అన్నాడు యశ్వంత్ . శివ వాళ్ళని పట్టుకుని లోపలికి వెళ్ళాక బాలయ్య లోపలికి వస్తూ

కనిపించడం తో అటుగా నడిచాడు యశ్వంత్ .

అయ్యా .. ఇప్పుడే వచ్చామయ్యా .. అన్నాడు బాలయ్య .

రత్నం బాడీ ని పోస్టుమార్టం కి అప్పగించారా ? అని అడిగాడు మెల్లిగా యశ్వంత్ .

అవునయ్యా .. రేపు ఉదయానికి తెస్తారయ్యా మళ్ళి .. శంకరం , భూపతి అక్కడ్నే ఉన్నారయ్యా .. భూపతి బుర్ర

ఇంకా కొడుకు చావు ని అంగీకరించడం లేదయ్యా .. అన్నాడు బాధగా .

ఏం చేస్తాం బాలయ్యా .. సరే .. ముందు నువ్వు స్నానం చేసే వచ్చావా ? అన్నాడు యశ్వంత్ .

ఇక్కడ దైవ కార్యం కదయ్యా .. చేసే వచ్చినా .. అన్నాడు బాలయ్య .

ఈరోజు గడిచేదాకా రత్నం విషయం ఎవరితో చెప్పకుండా ఉండటం మంచిది బాలయ్యా .. అన్నాడు యశ్వంత్ .

తెలుసయ్యా .. పనే ముందయ్యా ? అన్నాడు బాలయ్య .

అక్కడ వంటలు జరుగుతున్నాయి .. వెళ్లి చూసుకో .. మధ్యాహ్నం ఊరి వాళ్ళంతా భోజనాలు ఇక్కడే చేస్తారు కదా

అన్నాడు యశ్వంత్ .

అలగేనయ్య .. అని వంటలు జరిగే జరిగే వైపు కి పరుగు తీసాడు బాలయ్య .

మెల్లిగా జనం పెరుగుతున్నారు మహల్ ప్రాంగణం లో .. అప్రయత్నం గా గేటు వైపు చూశాడు యశ్వంత్ ..

గేటు కి కొంచెం దూరం లో .. ఓ పండు ముదుసలి వణుకుతూ కూర్చుంది .. వచ్చే పోయే వాళ్ళని దానం చేయమని

అడుగుతోంది .

బావుంది .. నిన్నటి వరకు జనం ఇటు వైపు రావటానికి భయపడే వారు .. ఇప్పుడు మహల్ ముందు బిచ్చం

అడిగేవాళ్ళు కూడా రెడీ అయ్యారు .. అనుకున్నాడు యశ్వంత్ మనసులో ..

యశ్వంత్ .. యశ్వంత్ .. మహల్ లోంచి గట్టిగా రచన గొంతు వినబడే సరికి .. మహల్ వైపు నడిచాడు యశ్వంత్ .

అంత వరకు యశ్వంత్ దృష్టి ని ఆకట్టుకున్న ఆ ముసలి అవ్వ .. వికృతంగా చూసింది మహల్ వైపు .

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: