యశ్వంత్ , మురారీ ఇద్దరూ మహల్ పైభాగానికి చేరుకున్నారు . ఆకాశ దీపాన్ని వెలిగించి వేలాడ దీసేందుకు తగిన
బురుజు ని ఎంచుకుంటూ అనుకోకుండా యశ్వంత్ గేటు బయట కూర్చున్న ముసలి అవ్వ ని చూశాడు .
అరే .. ఇంకా ఈమె ఇక్కడే ఉందే .. అనుకున్నాడు యశ్వంత్ .
ఇంతలో శివ తాడు పట్టుకుని పైకి వచ్చాడు ..
యశ్వంత్ .. ఇదిగో తాడు .. ఎక్కడ కడదాం ? అని చుట్టూ చూస్తుంటే ..
శివా.. ఈ బురుజు పై శిఖరానికి తాడు కడదాం .. అన్నాడు మురారి .
సరే .. అని తాడు ని గిరా గిరా తిప్పి శిఖరం వైపు విసిరాడు శివ . తాడు శిఖరానికి చిక్కుకుంది ..
పర్ఫెక్ట్ .. అన్నాడు యశ్వంత్ .
అయితే ఇంకా దీపాన్ని కింది నుంచి పైకి తీసుకు రావటమే తరువాయి .. అన్నాడు మురారి .
సరే .. కిందికి పదండి .. అని ముగ్గురూ కిందికి నడిచారు ..
వారు మహాల్లోకి నడుస్తుంటే రచన పూల మాలలతో ఎదురు వచ్చింది .
హే .. ఏంటి ? బయటెం పని నీకు ? అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ .. అస్తమానూ నాకు అడ్డు పడకు . నేను పెళ్లి పందిరి సిద్ధం చేస్తున్నాను .. పూలు అవసరమే కదా ..
పూలతో అలంకరించాలి .. అంది చిరుకోపంగా రచన .
పెళ్లి పందిరా ? దేనికి ? ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు ? అని కంగారుగా అడిగాడు యశ్వంత్ .
కొంపదీసి మీ ఇద్దరూ .. చేసుకుంటున్నారా ? అని అడిగాడు శివ , ఫక్కున నవ్వాడు మురారి .
అదేంటి ? మీకు తెలీదా ? అలా అడుగుతున్నారు ? అని అడిగింది రచన ఆశ్చర్యంగా ..
హే .. జొకులెయ్యకు .. చెప్పు .. నిజంగా మాకు తెలీదు .. అన్నాడు యశ్వంత్ .
మరి .. మరి .. స్వామీజీ .. మీతో ఈ విషయం .. చెప్పలేదా ? మరేం చెప్పారు మీతో ? నాతో పెళ్లి ఏర్పాట్లు చేయాల్సి
ఉంటుందని చెప్పారు .. ఆశ్చర్యంగా అడిగింది రచన .
అవునా ? అన్నాడు ఆశ్చర్యం గా యశ్వంత్ .
ఇందులో అంత ఆశ్చర్యం కలిగే విషయం ఏముంది యశ్ .. బహుశా అమ్మవారి కల్యాణం నిర్ణయించారేమో ...
గుళ్ళలో స్వామి వారి , అమ్మవారి కల్యాణం చేస్తూ ఉంటారుగా .. అన్నాడు మురారి .
నిజమే .. మనం ఆ కోణం లో ఆలోచించనే లేదు .. అన్నాడు శివ .
సరే .. అలా అయితే .. రచనా .. ఆ పూలు ఇలా ఇవ్వు .. మేమే డెకరేట్ చేస్తాం .. అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ .. నీకేం పని లేదా ? అదుగో .. భోజనాలు పూర్తి అయ్యాయి కదా .. బోలెడన్ని పాత్రలు పడున్నాయి
అక్కడ .. తోమడానికి .. అంది కోపంగా రచన .
హే .. అలాంటి పని మాకు చెప్తావా ? టూ మచ్ .. అన్నాడు యశ్వంత్ .
సో .. మీ పన్లు మీరు చూసుకోండి .. నా పని నేను చూసుకుంటా .. అంది రచన చిరుకోపంగా ..
సరే సరే .. రచనా .. నువ్వే చూసుకో .. పోనీ నేను నీకు సాయం గా రానా అన్నాడు శివ .
ఓకే శివా .. బట్ .. నేను అడుగుతాను సాయం కావాల్సి వస్తే .. ముందు .. మీకోసం స్వామీజీ మీకోసం ఎదురు
చూస్తున్నారు వెళ్ళండి ... అంది రచన .
పూలబుట్ట పట్టుకుని రచన బయటికి రాగానే .. బాలయ్య .. ఆమె చేతిలో పూల బుట్ట అందుకుని పదండి
అమ్మాయి గారు .. అని పందిరి వేస్తున్న వైపు కదిలాడు . రచన అతడి వెనుకాలే వెళ్తుంటే .. చూసి .. చిన్నగా
నిట్టూర్చి .. యశ్ .. పెళ్ళయ్యాక నీ పరిస్థితి తలచుకుంటుంటే జాలి వేస్తోంది .. అన్నాడు శివ నవ్వుతూ ..
యశ్ .. శివ , మురారిల వైపు చూసి హాయిగా నవ్వేశాడు .
స్వామీజీ ఆకాశ దీపం సిద్దం చేసుంటారు .. పద .. అన్నాడు మురారి .
ముగ్గురూ లోపలికి నడిచారు
ఇంకా ఉంది ********************************
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

.jpg)

No comments:
Post a Comment