Powered By Blogger

Monday 3 November 2014

రుధిర సౌధం 273



బాధ పడకండి .. ఆ దెయ్యం పీడ శాశ్వతం గా వదిలి పోతుంది . మీరలా చూస్తూ ఉండండి అంతే .. అన్నాడు

గోపాల స్వామీ .

నిస్సహాయం గా తల లూపారు శివ , మురారి , విక్కీ .

స్వామీజీ ఏవేవో మంత్రాలు చదువుతున్నారు .. యశ్వంత్ అతడి కనుసైగల్ని అర్థం చేసుకుని మెలగుతున్నాడు .

తల్లీ .. ముందు నువ్వు లేచి అగ్ని దేవునికి ప్రదక్షిణ నమస్కారాలు ఒనర్చు .. అన్నారు స్వామీజీ .

వైజయంతి లేచి అలానే చేసింది .. స్వామీజీ పెదవులపై చిరునవ్వు విరిసింది ..

కలశం మీద ఉన్న మాంగల్యాన్ని పూజించు తల్లీ .. అన్నారు స్వామీజీ .. ఆమె తన ముందర ఉన్న అక్షితలని

చేతిలోకి తీసుకోబోయింది .. కానీ ఆమె చేత వాటిని ధరించలేక పోయింది ..

స్వామీజీ .. నేను వీటిని తాక లేక పోతున్నాను .. అన్నదామె ఆవేదనగా .

చింతించకు తల్లీ .. మీ కులదైవమైన అమ్మవారిని తలచుకొని అక్షితలు తాకే భాగ్యం కల్పించ మని అడుగు ..

అన్నారు స్వామీజీ .

అమ్మవారినా ? నేనే ఆమెని బయటకి వెళ్ళ గొట్టాను .. ఆమె నా ప్రార్థన మన్నిస్తుందా ? అని అడిగింది వైజయంతి .

తప్పక మన్నిస్తుంది . ఎందువల్లనంటే ఆమె తల్లి . తల్లి కి బిడ్డలందరూ సమానమే .. అన్నారు స్వామీజీ .

అలాగే అని .. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్ధించ సాగింది వైజయంతి .

ఆమె కళ్ళు మూసుకోగానే .. గోపాల స్వామి ఒక దారపు పోగుని యశ్వంత్ కి అందించాడు .

అది అందుకొని స్వామీజీ వైపు చూశాడు యశ్వంత్ .

ఆ దారాన్ని ఆమె చుట్టూరా గుండ్రం గా చుట్టమని సైగలతో చెప్పారు స్వామీజీ .

యశ్వంత్ లేచి కళ్ళు మూసుకుని ప్రార్ధిస్తున్న ఆమె ని చూసి దారం చివరికొన  ని పట్టుకుని క్షణం లో ఆమె ని

చుట్టి చివరి కొనని హోమ గుండం లోకి వేశాడు .. శివ , మురారి , విక్కీ ఉత్కంట గా చూశారు . విధాత్రి ఆశ్చర్యం

గా చూసింది . హోమాగ్ని క్షణాలలో దారపు కొనని తాకి ఓ వెలుగులా ఎగబాకి వైజయంతి ని గుండ్రం గా చుట్టబడిన

దారాన్ని తాకుతూ ఒక్కసారిగా ఆమెని హోమగుండం లోకి లాగింది . అందరూ చూస్తుండగానే వైజయంతి

హోమ గుండం లో ఆవిరై పోయింది .

ఏమిటి స్వామీజీ ఇది ? నా సోదరి కోరిక ని తీర్చ కుండా ఆమెని మోసం చేశారా ? బాధగా అడిగింది విధాత్రి .

ఈ పసుపు కలిపిన బియ్యాన్ని తాకలేని ఆమె మాంగల్యం మెడన ఎలా ధరించగలదు విధాత్రీ ? ఆమె కి ముక్తి

లభించింది .. పరలోకానికి సాగే ఆఖరి నిమిషం లో ఆమె తన తప్పుని మన్నించి శుభాన్ని కలగ జేయమని

అమ్మవారిని ప్రార్థించింది . ఆమె ప్రార్థన ని అమ్మవారు మన్నించింది . ఒక ప్రేతం గా ఈ వివాహం జరగరానిది ..

అందుకే ఆమెకి మరుజన్మ ప్రసాదిస్తుంది .. మాంగల్య భాగ్యాన్ని కలగజేస్తుంది .. నీ సోదరి ముక్తి ని పొందింది

ఇక నీ వంతు .. సమయం ఆసన్న మయింది .. ఆత్మ నైవేద్యం అమ్మవారికి నివేదించి శంఖం పూరించు ..

సహస్ర యాగానికి సమయమయింది .. అన్నారు స్వామీజీ .

చిత్తం మహర్షి .. అని యశ్వంత్ దరిచేరి .. ఇక సెలవు .. రచన ని మనువాడి ఆనందం గా ఉండండి .. అంది విధాత్రి .

విధాత్రీ .. మీరిక మళ్ళి కనబడరు కదా .. బాధగా ఉంది .. అన్నాడు యశ్వంత్ .. అతడి కనుకోసల్లో తలుక్కుమన్న

కన్నీటి పొర .

ఎందుకు కనబడను ? రచన రూపం నాదేగా .. కానీ మీ ప్రేమ పొందాలని ఉంది .. అందుకై మీకు , రచన కి బిడ్డగా

జన్మించే అదృష్టం ఇమ్మని అమ్మని ప్రార్థిస్తాను .. అంది విధాత్రి .

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: