Powered By Blogger

Thursday 3 November 2016

దూరమయిన బంధం



మిణుగురుల వెలుతురులా .. గోదారి ఒడ్డున మసక వెన్నెల .. 

నునువెచ్చ్చని గ్రీష్మపు తాకిడి .. నుదుట పట్టిన చెమట తడి . 

నడి మధ్య అలల తో తెరచాప .. చిరుగాలికి నా పైట రెపరెపా . 

వెచ్చ్చని ఇసుక తిన్నెల పై నా బొటన వేలు సంభాషణ .. 

మబ్బుల్లోకి చంద్రుడు .. మరి రా డే  నా ఇంద్రుడు .. ?

మౌనం గా గోదారి తో మాట్లాడుతున్నా .. కళ్ళ వెంబడి వరదలైన గోదారిని 

ఏ దారిన పంపాలని అడుగుతున్నా .. 

ప్రతి ఏడు ఇదే చోటు .. ప్రతి సారి ఇదే నేను .. మరి ఈసారి ఆ ప్రతి సారి కాలేదే . 

ముక్కలైన హృదయాన్ని ఏరుకునే మనసు లేదు .. 

సెలవిచ్చ్చిన సంతోషాన్ని కోరుకునే వయసు కాదు . 

జ్ఞాపకాలే ఆలంబన గా సాగుతున్న జీవితాన్ని .. మాయమైన నీ చిరునవ్వుని 

గోదావరి గల గల ల  సవ్వడి లో వెతుకు తున్నా .. 

పిల్ల గాలుల పల్లకి లో నీ ఊసుల దొంతరలు నాదాకా వస్తాయేమో అనుకున్నా .. 

మరి రావని జత కావని ఇక లేవని ఆలోచనే తనువెల్లా  తాకుతుంటే 

నిస్పృహలే తోడుగా నిస్తేజపు అడుగులతో ఈసారికి వెళుతున్నా .. 

మనసు నిక్కడ ఉంచి నేను జీవచఛవ మై  నడిచా .. 

ఈనాడల్లే ప్రతి ఏడు నీ కొరకే మరలి వస్తా ... 

నిను కడుపున దాచుకున్న గోదారిని నిలదీస్తా .. 

ఎందుకు దూరం చేసిందని ...

 తన ఒడ్డున పుట్టిన ప్రేమ కి తానె అసూయ ఎందుకు పడిందని ... ????


















మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: