మనసు కిది తెలియని రుచిలా .... వయసుకిది తీయని స్మృతి లా ..
సాగుతుంటే ఈ ప్రయాణం ....ఆగనందా ... కాలగమనమ్.. మనసు
కొత్తగా లోకం కనబడుతుంటే .. వింతగా ఆశ లు వికసిస్తుంటే ..
మత్తుగా హృదయం ఊగుతూ ఉంటె ... గమ్మత్తు గా నిన్నే గమనిస్తుంటే ...
దీనికే పేరే ఉంటె ... అది కాస్త ప్రేమే ఐతే ... ఆ ప్రేమ నీమీదేనంటా ...
దీనికే రూపం ఉంటె ... ఆ రూపు నీదే ఐతే ... నా కళ్ళలోనే నింపేస్తా ....
మనసంతా నీకే అర్పిస్తా ......................... మనసు
ఎందుకో నిన్నే చూస్తూ ఉంటే ....నీలోన నేనే కనబడుతుంటే ...
తుంటరి గా అల్లరి చేస్తూ ఉంటె .... నీ చిలిపితనమే కవ్విస్తుంటే ...
నన్నెలా ఆపటం మరి ... నీ దరి చేరదా మది ... ఆ కాస్త చనువే కోరదా అది ....
నిన్నెలా అడగటం అని.. సందేహం మొదలయిందని ... దూరంగా ఉండలేని గొడవా .....
నను చేరవే త్వరగా ..... మనసు

No comments:
Post a Comment