Powered By Blogger

Thursday 26 December 2013

రుదిరసౌధం 34

రచన వెంగమ్మ వెనకాలే నడవ సాగింది .. చలి గాలి ఝుమ్మని తాకుతుంది .. మంత్రం వేసినట్టు నడుస్తుంది

వెంగమ్మ.. ఆమె వెనకాలే నడుస్తున్న రచన చుట్టూ పరికించి చూసింది .. ఆ ప్రాంతం ఆమె కి కొత్త  గా అనిపించింది ..
చీకట్లో సరిగా చూడలేక పోతున్నా వెంగమ్మ చేతిలో ఉన్న లాంతరు వెలుగు లో పరిసరాలను గుర్తు పెట్టుకుంటూ

వెంగమ్మ కి తెలియ కుండా అనుసరిస్తుంది .

ఓ చోట హటాత్తు గా ఆగింది వెంగమ్మ ..

ఆమె వెనక్కి తిరుగు తుందేమోనని గభాలున అక్కడున్న చెట్టు వెనక్కి వెళ్ళింది రచన ..

మెల్లిగా తొంగి చూసింది రచన ..

వెంగమ్మ వెనక్కి చూడలేదు .. లాంతరు ఒక చెట్టు కొమ్మ కి తగిలించింది .. నెత్తి మీద ఉన్న నీళ్ళ కుండ కిందకి

దించింది ... భుజానికి తగిలించి ఉన్న సంచి లోంచి ఒక పూల దండ .. తీసి రెండు అడుగులు ముందుకు వేసి

 ముందర ఉన్న ముళ్ళ కంపలని తొలగించినది...

రచన ఆమె ప్రతి చర్య ని ఆశ్చర్యం గా చూస్తుంది ..

ఆశ్చర్య పడాల్సింది ఏమిటంటే ఆమె ముళ్ళ కంపలను తొలగించగానే .. రాతి తో కట్ట బడిన సమాధి ఒకటి

బయట పడింది ..

ఆమె పూల దండను పక్కన పెట్టి వెనక్కి వచ్చి తాను తీసుకు వచ్చిన నీళ్ళ కుండ ను తీసుకు వెళ్లి ఆ సమాధి ని

నీటి తో శుభ్రం చేసింది .. తాను తెచ్చిన పూల దండ ని సమాధి పై వేసి కళ్ళు మూసుకొని నమస్కరించింది ..

తరువాత ఒక ఆ కు లో కారియర్ లో తెచ్చిన భోజనాన్ని వడ్డించి మళ్ళి నమస్కరించింది ..

 తరువాత .. అరచింది  గట్టిగా ..  రా .. త్వరగా .. వచ్చి ఆరగించు .. ఈ అమవాస ఎవరి ప్రాణం తీస్తుందో

త్వరగా రా .. అని పిలిచింది ..

రచన అయోమయం గా చూస్తుంది .. ఎప్పుడు మాట్లాడని వెంగమ్మ .. ఇప్పుడిలా అరుస్తోంది ఏంటి ? ఆమె

మనసులో సంశయం ..

ఇంతలో హటాత్తుగా పెనుగాలి రేగింది .. చెట్లు పిచ్చి పట్టినట్లు ఊగిపొతున్నాయి ..

వెంగమ్మ మొహం లో చిరు దరహాసం .. మళ్ళి చేతిలోకి లాంతరు తీసుకొని .. ఖాలీ ఐన కారియర్ ని తీసుకుని

వెనకకి  నడిచింది .. రచన అయోమయం గా తనని దాటి వెళ్ళిపోతున్న వెంగమ్మ ని చూసింది ..

అసలేమిటిది ? అసలు ఈ సమాధి ఎవరిదీ ? అని వెనక్కి తిరిగి సమాధి ని చూసిన రచన ఒక్కసారిగా అదిరి పడింది ..
అక్కడ సమాధి పై కూర్చొని బసవ రాజు వెంగమ్మ వడ్డించిన పదార్ధాలను ఆబగా తింటున్నాడు ..

ఆమె ఆ హటాత్పరిణామానికి విస్తు పోయింది .. ఇప్పటి వరకు లేని వ్యక్తీ ఇప్పుడెలా ఇక్కడికి వచ్చాడు ... ?

ఆమె ఆవేశం గా ముందుకి నడచి .. బసవ రాజూ .. ఎలా వచ్చావు ఇంత హటాత్తు గా .. ? అంది రచన .

తింటున్న వాడల్లా ఒక్కసారి మొహం ఎత్తి ఆమె ని చూసి వికటాట్ట హాసం చేసాడు ..

ఎందుకు నవ్వుతున్నావు ? నేనడిగిన ఏ ప్రశ్న కి సరిగ్గా సమాధానం చెప్పవా ?? అసలేంటి ఇదంతా ? ఆ వెంగమ్మ

ఇక్కడకి భోజనం ఎందుకు తెచ్చింది ? నువ్వెందుకు దాన్ని తింటున్నావు ? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉంది

రచన ..

అతడు చిన్నగా నవ్వి .. ముందుగా నువ్వడిగిన ప్రశ్న .. నేనిక్కడికి ఎలా వచ్చానని ? నేనిక్కడకి రాలేదు .. ఇక్కడే

ఉన్నాను..  ఇదే నా స్థానం .. అదుగో చూడు ... అని సమాధి వంక చేయి చూపించాడు ..

ఆమె ఆశ్చర్యం అతడు చూపిన వైపు దృష్టి ని నిలిపింది .. అక్కడ సమాధి పై ఓ వ్యక్తి  వదనాన్ని రాతిపై చిత్రించి

ఉంది... అది బసవ రాజు వదనం ..

ఆమె చిగురుటాకు లా వణికి పోయింది .. భయం తో మాట పెగల్లేదు ఆమె కి ..

అంటే .. అంటే .. నువ్వు .. ఆమె భయం గా అంది ..

హా .. నేను మరణించి 80 ఏళ్ళు అయింది .. అన్నాడు బసవరాజు ..

ఆమె కళ్ళు భయం తో రెపరెప లాడాయి ..

ఎందుకు   భయ పడుతున్నావు ? నువ్వు మాట్లాడుతున్నది .. ఓ ఆత్మ తోనే .. ఆరోజే చెప్పాను కదా .. ఈ వూరి

వాళ్ళు చెప్పే కథల్లో నేను ఒకడి నని .. కాని ఈరోజు నువ్వు చూస్తున్నది నిజం .. కథా కాదూ .. కలా కాదు ..

అతడు గఉ ట్టిగా అరిచాడు ..

మరి .. నేను  నిన్నెలా చూడగలుగుతున్నాను .. పెదవులు వనుకుతుండగా గద్గద స్వరం తో అడిగింది రచన ..

చిన్నగా నవ్వి .. ఆ వైష్ణవీ దేవి వల్ల .. విశిష్ట జననం నీది .. కారణ జన్మురాలివి కనుక... అన్నాడు ..

నాకర్ధం కావడం లేదు .. అంతులేనన్ని సందేహాలు కలుగు తున్నాయి .. ఈ సందేహాలతోనే నా తల వేయి

చెక్కలయ్యేలా ఉంది .. అంది రచన ..

నీ సందేహాలతో కాలయాపన చేయకు .. నువ్విక్కడకి ఎందుకు వచ్చావో .. నాకయితే పూర్తిగా తెలుసు .. నీ లక్ష్యం

నెరవేర టానికి ఒకే ఒక్క మార్గం ఉంది .. ఆ మహల్ లో ఉన్న వైష్ణవీ దేవి ఆలయం .. తిరిగి దీప కాంతులతో

వెలుగొందాలి ... కానీ అదంత తేలికయిన పని కాదు .. అన్నాడు బసవ రాజు ..

మహల్లో ఆలయమా .. ఎక్కడ ఉంది ? అంది రచన ఆశ్చర్య చాకితురాలై ..

అవును .. ఉంది .. భూగర్భం లో .. ఆలయాన్ని నువ్వే కనుగొనాలి తప్పదు .. అన్నాడు బసవ రాజు ..

అసలు నువ్వెవరు బసవరాజు ? అని అడిగింది రచన దీనం గా ..

జవాబు చెప్పే సమయం వచ్చేదాకా వేచి ఉండు .. ఇక ఆలస్యం చేయక తిరిగి వెళ్ళు .. నీ మిత్ర బృందం కష్టాల్లో

ఉంది .. అన్నాడు బసవరాజు.

ఏమంటున్నావు ? అంది ఆందోళన గా ..

ఇదుగో మహల్ తాళం చెవులు .. వెళ్లి రక్షించుకో .. నీకా

సామర్థ్యం ఉందన్న సంగతి మర్చి పోకు .. అన్నాడు

బసవరాజు .

అతడి చేతిలో తాళం చెవి ని తీసుకుని పరుగు న ఇంటి దారి

పట్టింది రచన .

(ఇంకా ఉంది )

















1 comment:

Sravan Nallana said...

Hi Radhika,

I found interesting from this part... I really liked this...

Sravan