Powered By Blogger

Sunday 29 December 2013

రుధిర సౌధం 35

యష్ .. అటు చూడు .. ఊరంతా ఎంత చీకటిగా ఉంది ? కానీ ఇక్కడ ఏదో కాంతి ఉంది చుట్టూరా ... మహల్ ని

చేరుకుంటూ నే అన్నాడు శివ .

యశ్వంత్ మహల్ వైపు పరీక్ష గా చూసాడు .. ఆకాశం అంతా  మేఘావృతమై ఉంది .. కానీ ఆ ఆకాశం లో ఏదో

కాంతి మహల్ పై పడి వింతగా మెరుస్తుంది ..

యష్ .. ఈ గేటు తెరవనా ? లోపల రచన ఉందంటావ ... అన్నాడు కాస్త సంశయం గా మురారి ..

చిన్నగా తల పంకించి .. గేటు ని గట్టిగా ముందుకు తోసాడు యశ్వంత్ ..

అది కిర్రుమంటూ తెరచుకొంది .. గేటు ఆ శబ్దం చేయగానే .. ఏ మూల ఉన్నాయో గానీ గబ్బిలాలన్ని ఒక్కసారి గా

ఎగిరాయి  .... గుడ్లగూబలు భయంకరం గా కూస్తున్నాయి ..

దూరం గా కుక్కల అరుపులు హృదయ విదారకం గా ...

మెల్లిగా మహల్ ప్రాంగణం లోకి అడుగుపెట్టారు ముగ్గురూ .. ఎందుకో వారందరి గుండె సడి వారికే భయానకం గా

విని పిస్తుంది ..

శివా ... మహల్ ముందు ద్వారం తాళం వేసి ఉంది .. మనం ముందు నుండి వెళ్ళ లేం .. కానీ ఆ సి .బి .ఐ ఆఫీసర్

తన డైరీ లో రాసిన దాన్ని బట్టి వెనక నుండి భవనం పై అంతస్తు కి వెళ్ళొచ్చు .. రోప్ ఉంది కదా .. అన్నాడు యష్ ..

ఉంది .. వెనక వైపు నుండి అంటే అలా వెల్లొచ్చు .. అని శివ అనడం తో భవనానికి కుడి వైపు నుండి భవనం

వెనుకకి చేరుకున్నారు ముగ్గురూ ..

ఆ విశాల మైన కారిడార్ లో మెల్లిగా అడుగు లో అడుగు వేసుకుంటూ .. భవనం పైకి వెళ్ళే మార్గాన్ని

అ న్వేషిస్తున్నారు ..

యష్ .. భవనం బయట గానీ భవనం లోపల గానీ ఎటువంటి శబ్దాలు వినబడటం లేదు .. అసలు రచన లోపలి కి

వెళ్ళే ఉంటుందా ? అనుమానం గా అడిగాడు మురారి .

నాకు అదే అనుమానం గా ఉంది .. జరగారానిదేదన్న రచన కి జరగలేదు కదా ..  అన్నాడు శివ

 ఏమి కాదు .. ఈరోజు మన చుట్టూ ఉన్న ఏ పరిస్థితి ని నమ్మకూడదు మనం .. జాగ్రత్త .. అన్నాడు యశ్వంత్ ..

యష్ .. ఆ పైన కిటికీ విరిగి పోయి ఉంది .. బహుశా అదే పైకి వెళ్ళే మార్గం  కావొచ్చు .. అన్నాడు మురారి ..

ఎస్ .. శివా .. రోప్ తీసి పైకి విసురు .. ముడి పడేలా ... అన్నాడు యశ్వంత్ ..

శివ అలాగే చేసాడు .. తాడు కిటికీ రెక్క కి చిక్కుకుంది ...

ఓకే .. ఇక పైకి ఎక్కొచ్చు .. అన్నాడు శివ ..

సరే అని ముందు గా మురారి తాడు పట్టుకున్నాడు ... మెల్లిగా పైకి ఎగబాకడం మొదలు పెట్టాడు ...

అతడు పైకి మెల్లిగా చేరుకున్నాడు ఆసరా కోసం కిటికీ రెక్క పట్టుకున్నాడు ..

అతడు పైకి చేరాడు కదా అని యశ్వంత్ కూడా సన్నద్ధం మవుతుండగా ... ఆ .. అని గట్టిగా అరిచాడు మురారి ..

అతని అరుపు విని పైకి చూసిన యశ్వంత్ శివలకు గుండె

ఒక్కసారి అదిరింది ..

కిటికీ లోంచి మురారి ని ఎవరో లోపలికి లాగేసి నట్లని పించింది ..

మురారి కనబడలేదు మరి ..

అతని కేక తర్వాత  భయంకర నిశ్శబ్దం ...

శివ నుదుటి మీద నుండి స్వేదం కింద పడి టప్ .. మన్న శబ్దం

కూడా వినిపిస్తుంది ..

షాక్ నుండి ముందు తేరుకుని .. మురారీ ... గట్టిగా అరిచాడు యశ్వంత్ ..

మురారీ .. ఎక్కడున్నావ్ ? మురారీ .. మురారీ .. గట్టిగా  అరుస్తున్నాడు యష్ ..

యష్ .. ఎవరో లోపలనుండి మురారి ని లోపలికి లాగేయడం కళ్ళారా చూసాను రా ... మెల్లిగా వణుకు తున్న

స్వరం  తో అన్నాడు శివ ..

శివా .. అని అమాంతం గా హత్తుకున్నాడు యశ్వంత్ శివ ని ..

రేయ్ .. వాడిక మనకి లేనట్టేనా ? అన్నాడు మెల్లిగా శివ ..



ఒక్కసారిగా శివ ని వదిలి .. రేయ్ .. ఈ లోకం లో మంచి ఎలా ఉందో .. చెడు అలానే ఉంది .. కానీ మంచి మీద చెడు

విజయం ఎప్పుడు అశాశ్వతం  ..  మనసులో ధైర్యం కోల్పోకు .. మురారి చాలా ధైర్యం ఉన్నవాడు ..

మొండివాడు ..

పోరాడతాడు .. ఇక మన వంతు .. జై ఆంజనేయా ..

అని తాడు పట్టుకొని ఎగబాకడం మొదలు పెట్టాడు

యశ్వంత్ ..

కానీ ఎవరో అతన్ని విసిరేసి నట్టు .. తాడు తో సహా ..

అక్కడ ఉన్న ఎండిపోయిన మడుగు లో పడ్డాడు

యశ్వంత్ ..

కళ్ళ ముందు జరుగుతున్నది నిజమా అబద్ధమా నిశ్చయించుకోలేక మ్రాన్పడి పోయి చూసాడు శివ ..

ఇక్కడ నుంచి యశ్వంత్ అంత దూరం ఎలా వెళ్ళాడు ? యశ్వంత్ ... అని పిలుస్తూ పరుగున యశ్వంత్  దగ్గరికి

వెళ్ళాడు ..

లేవలేక ఇబ్బంది పడుతున్నాడు .. అబ్బా .. గట్టిగా అరిచాడు యశ్వంత్ ..

లే యష్ .. లే .. యశ్వంత్ లేవదీయ దానికి శాయశక్తులా కష్ట పడుతున్నాడు శివ ..


(ఇంకా ఉంది )

No comments: