Powered By Blogger

Tuesday 31 December 2013

రుధిర సౌధం 36

పరుగు పరుగున యశ్వంత్ వాళ్ళు ఉన్న ఇంటిని చేరుకుంది రచన .. కంగారు గా తలుపులు దబదబా బాదింది ..

లోపల అశాంతి గా ఉన్న సత్య వెంటనే వచ్చి తలుపులు తీసి రచన ని చూసి విస్తు పోయింది ..

రచనా .. నువ్వా ? నువ్వు మహల్ కి వెళ్ళలేదా ? అంది ఆశ్చర్యం గా సత్య ..

మహల్ ? నేను వెల్లడమేంటి ? అంటే వీళ్ళు వెళ్ళారా ? ఎందుకు ? అంది అంతే కంగారుగా రచన ..

రచనా .. నువ్వు గదిలో లేవని .. మహల్ కి వెళ్లి ఉంటావని .. వీళ్ళు ముగ్గురూ వెళ్ళారు .. నువ్వేమో వెళ్ళ లేదని

అంటావు... అసలేం జరుగుతుందో .. నాకర్థం కావటం లేదు .. కంగారు గా అంది సత్య ..

ఓ క్షణం .. బసవరాజు అన్న మాటలు గుర్తుకొచ్చాయి రచన కి ..

అయ్యో .. నాకే అర్ధం కాలేదు .. నీ స్నేహితులు ఆపద లో ఉన్నారని బసవ రాజు మహల్ తాళం చెవి ఇచ్చినప్పుడే

అర్థం  చేసుకుని ఉండాల్సింది .. ఆలస్యం చేసి లాభం లేదు .. త్వరగా వెళ్ళాలి .. అంది రచన కంగారుగా ..

రచనా .. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు .. బసవరాజు నీకు చెప్పాడా ? మనవాళ్ళు ఆపద లో

ఉన్నారా? కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే .. గద్గద స్వరం తో అంది సత్య ..

సత్య .. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ .. అంటూ ఆమె ని హత్తుకొంది రచన .
 రచనా .. వాళ్ళకేం కాదని చెప్పు .. అంది సత్య ఏడుస్తూ ..

ఏం కాదు .. నువ్వు ధైర్యం గా ఉండు .. నేనోసారి వేల్లోస్తాను .. అంది రచన ..

ఒక్కసారిగా .. ఆమెని వదలి .. నో రచనా .. నేను వస్తాను .. నేను ఒంటరిగా ఇక్కడ ఉండలేను .. అంది సత్య ..

సరే పద .. అంది రచన ..

ఇద్దరూ పరుగు లాంటి నడక తో మహల్ వైపు సాగి పోయారు ..
                                                              ******************

యష్ .. లే .. యష్ .. మెల్లిగా .. అతన్ని లేపటానికి ప్రయత్నిస్తూ విఫల మవుతున్నాడు శివ .

లేవలేక అవస్థ పడుతున్నాడు యశ్వంత్ ..

ఇంతలో ఎత్తుగా దుమ్ము ధూళి తో సుడిగాలి రేగింది .. అది శివ వైపే రాసాగింది ..

శివా .. అటు చూడు .. దూరం గా వెళ్ళు .. ఆ సుడిగాలి నీ వైపే వస్తుంది .. బాధ అణచి పెడుతూనే అన్నాడు

యశ్వంత్..

ఏమనుకున్నాడో శివ యశ్వంత్ చేతిని విడిచిపెట్టలేదు .. చిన్నప్పుడు బామ్మ నేర్పించిన ఆంజనేయ దండకం

పఠి0చటం  మొదలుపెట్టాడు ..

ఆశ్చర్యం గా ఆ సుడిగాలి మాయమయింది ..

శివ మనసులోనే భగవంతునికి కృతజ్ణతలు చెప్పుకున్నాడు ..

యశ్వంత్ .. నాకు నమ్మకం వచ్చింది .. నువ్వు లేవగలవు .. ఆ భగవంతుని స్మరించుకొని .. లేవటానికి

ప్రయత్నించు ... అన్నాడు శివ ..

శివా .. రచన కనబడలేదు .. మురారి ఏమైయాడో తెలీదు .. నన్ను వదిలేయ్ .. నువ్వు వెళ్ళిపో శివా .. బాధ గా

అన్నాడు యశ్వంత్ ..

కంటికి కనిపించకుండా మనల్ని భయపెట్టే ఒక దుష్ట శక్తి .. మనల్ని విడదీయలేదు యష్ .. అని జై వీరాంజనేయ ..

అని లేవలేక పోతున్న యశ్వంత్ ని ఒక్కసారిగా పైకి లేపాడు శివ ..

 మానసిక స్థైర్యం తో అడుగు ముందుకు వేసాడు యశ్వంత్ ..

అదే సమయం లో మహల్ కి చేరుకున్నారు సత్య,రచన ..

రచనా .. ఎవ్వరూ కనబడటం లేదు .. నాకెందుకో భయం గా ఉంది .. అంది సత్య ..

భయపడకు సత్యా .. భయమే మనకి శత్రువు .. నువ్వు నా వెంట ఉండు .. అస్సలు విడిచి పెట్టి ఎక్కడకి వేళ్ళకు ..

ముందు మహాల్లోకి వెళ్దాం .. అని గబగబా అడుగులు ముందుకి వేసి సింహద్వారం వైపు చేరుకుంది ..

సత్య నువ్వు టార్చ్ పట్టుకో .. నేను తాళం తీస్తాను .. అని టార్చ్ సత్య చేతికిచ్చింది ..

టార్చ్ లైట్ వెలుగులో తాళం తీసింది రచన ..

తలుపులు ముందుకి తోసింది కిర్రుమంటూ శబ్దం చేస్తూ అవి తెరచుకున్నాయి ..

తలుపులు తీయగానే హాల్లో కనిపించిన దృశ్యం చూసి హతాసులు అయ్యారా ఇద్దరూ ...

రక్తపు మడుగు లో పడిఉన్నాడు మురారి ..

మురారీ .. గట్టిగా అరచి మురారి దగ్గరకి పరుగున చేరుకుంది సత్య ..

సత్య వెనకాలే అక్కడకి వెళ్లి .. మురారీ .. మురారీ .. అని పిలిచింది రచన ..

మురారీ .. లే మురారీ .. కన్నీళ్ళతో అతన్ని తడిపేస్తుంది సత్య ..

రచన కి కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు .. మురారి ఇలా ఉన్నాడంటే .. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు ?

వారెలాంటి స్థితి లో ఉన్నారో .. ఆందోళన గా అనుకుంది రచన ..

(ఇంకా ఉంది )

No comments: