Powered By Blogger

Tuesday 24 December 2013

మధురమే మధురమే .. నీ పెదవి పలికిన రాగమే ..

మధురమే మధురమే .. మనసు దోచే గానమే ..

మధురమే మధురమే .. నీ పెదవి పలికిన  రాగమే ..

మధుర లోనా రాజ్య మేలినా కంసునీ వధ తధ్యమే ..

మధుర మైన బాధ రేగినా రాధ మది ఆరాధ్యమే ..

మధురమే మధురమే .. నంద సుత సుమధురమే

బృందావని లో ఆమని కోయిల నీ కొరకే పాడేనులే ..

ఆ నింగిన సౌదామిని లా ఆనందం మెరిసేనులే ..

హృదయపు పరవళ్ళు .. ఆ యమునా గలగలలు ..

గోపీ కృష్ణా నీ రస లీల న మురిసిన గోపిక లా ముని పుంగవులు ..

నీ  జ్యేష్టునిగా అవతారం .. ఆది శేషునిది ఆ భాగ్యం ..

 కాళేయ మర్ధనం .. అంతర్మధనం .. సోచించినచో అవునవగతం ..

మధురం మధురం నీ నామం ..

మధురం మధురం నీ చరితా శ్రవణం ..

రేపల్లె మురిసినదయ్యా ... నీ పాదం మోసిన దయ్యా ..

శ్యామ సుందరా .. నీ మధురం కాదా .. మైమరపించే నీ బాల్యం ..

తలచిన వారి జన్మే ధన్యం .. యశోదా తనయుని గా నీ స్మరణం ..

భవ బంధాలను దాటించే వని .. నిన్నే కొలిచిన భక్తులను ..

రాక్షస సంహారం చిరునవ్వులతో ఒసగిన పసివాడి లీలలను ..

మనసున తలచిన మధురం కాదా ..

లీలా కృష్ణా నీ సన్నిధిలో ..

వెలిగే దివ్వె గా జన్మను ఈయరా .. లేకుంటే మురళి గ నను మలచర ..

హోరువాన లో యమునా నదిలో వసుదేవుని తల పై నిదురించిన ..

చక్కనయ్య నీ చత్రము నాగము .. దారి చూపెను ఆ నది తానె ..

మురళీ కృష్ణా పరమావధి గా ..

నను కరుణించు .. నా పెన్నిధి గా .. మధురం కాదా నీ గానం ..

వెదురు లో ఒదిగిన తీయని రాగం ..





No comments: