Powered By Blogger

Tuesday 24 December 2013

యమునా తటి లో నల్లనయ్య కై ..

యమునా తటి లో నల్లనయ్య కై ..

వేచిన విరహిణి రాధ ప్రేమ కై ..

వడి వడి అడుగులలో సాగి .. అలక ని తీర్చర దరి చేరి ..

కోపముతోన ఎర్రబారిన కనులలో కన్నీరే ..

ఉప్పొంగి వెల్లువై మరో యమున ఉద్భవమె జరగక మునుపే ..          యమునా


బరువెక్కిన హృదయం వేదన తో తల్లడిల్లుతోందేమో ..

పదునెక్కిన విరహం ఆరాధన లో మమేక మే అయ్యిందో ..

అన్నుల మిన్న తను .. ప్రేమగ బుజ్జగింపు కోరును ..

అడవి లో వెన్నెలలా .. తన మది ఉందేమో అనును ..

కానీ .. నీ కొరకే వేచిన చిన్నదాని మనసే కను ...

ప్రళయం తెచ్చే ఆవేదన లోకాన్నే ముంచక మునుపే                         యమునా


మురళీ గానం తో  సేద తీర్చాలి కన్నయ్యా ..

బాధ ని రేపిన ఎడబాటును తరిమేయాలి క్రిష్ణయ్య ..

రాధిక మానసచోరా..  ఒక పరి బ్రతిమాలిన తప్పేం లేదయ్యా ..

గోపిక లెందరు ఉన్నా ... రాధే ప్రాణం అనవయ్యా ..

కానీ .. నమ్మని మాటలు ఎన్నని చెప్పినా కాదనలేనిది ఆ ప్రేమ ..

ఆ ప్రణయం తీపిని ఎరుగని వాడవు కావుగా నీవు పదవయ్యా ..            యమునా


No comments: